రవితేజ వారసుడి చిత్రం.. ఆ సాంగ్ వచ్చేసింది! | Maadhav Starrer Mr. Idiot Movie Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Mr. Idiot Movie: మిస్టర్‌ ఇడియట్ మూవీ.. సాంగ్ రిలీజ్‌ చేసిన తమన్!

Published Mon, Nov 4 2024 6:04 PM | Last Updated on Mon, Nov 4 2024 6:21 PM

Maadhav Starrer Mr. Idiot Movie Lyrical Song Out Now

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ  మూవీలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాను జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎల్ఎల్‌పీ బ్యానర్లపై  యలమంచి రాణి సమర్పణలో జె జే ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ అందుకున్న గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ఈ మూవీ నుంచి 'కావాలయ్యా..'అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా ద్వారా పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.  ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతమందించగా.. భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను సింగర్ మంగ్లీ ఆలపించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement