Madhav
-
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: గోరంట్ల
-
స్టీల్స్టాంట్ కార్మిక సంఘాలను అవమానించిన బీజేపీ నేత మాధవ్
-
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను అవమానించిన బీజేపీ నేత మాధవ్
సాక్షి, విశాఖపట్నం: కుర్మాన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ శిబిరం వద్ద బీజేపీ సంబరాలు జరుపుకుంది. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతలను బీజేపీ నేత మాధవ్ అవమానించారు. పోరాటాన్ని శంకించే విధంగా మాట్లాడారు. లెఫ్ట్ పార్టీ యూనియన్ నేతలు నిరంతరం విషం చిమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు.‘‘సమస్య పరిష్కారం కావాలని కార్మిక సంఘాలకు లేదు. సమస్య పరిష్కారం కాకుండా ఉంటే వారికి కూడు దొరుకుతుందని వారి భావన.. కార్మిక సంఘాలే కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న యూనియన్లు అన్ని కుహనా యూనియన్లు. ప్రైవేటికరణ ఆపేస్తామని ఏమి చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ జరుగుంది’’ అంటూ నోరు పారేసుకున్నారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది -
రవితేజ వారసుడి మూవీ.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న మూవీ "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్, ఎల్ఎల్ పీ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ కొట్టిన దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి వస్సాహి వస్సాహి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. యాక్టర్ శివాజీ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు. సాంగ్ అద్భుతంగా ఉందని.. ఇంతవరకు సంస్కృత భాషలో ఏ పాట రాలేదని శివాజీ అన్నారు. హీరో మాధవ్‌తో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.కాగా.. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా.. లిరిక్ రైటర్ శివశక్తి దత్తా సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీరామచంద్ర పాడారు. 'సౌందర్య సార, మకరంద దార, శృంగార పారవరా, సౌవర్ణ ప్రతిమ, లావణ్య గరిమ,చతురస్య చాతుర్య మహిమ కింతు పరంతు విరంచ్య విరచితం కిమిదం, ఇదంకిం తమాషా...వస్సాహి వస్సాహి' అంటూ సంస్కృత సాహిత్యంతో ఆకట్టుకునేలా ఉంది ఈ సాంగ్. ఈ చిత్రంలో జయప్రకాష్, ఆచంట మహేశ్, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, కాశీ విశ్వనాథ్, హిమజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రవితేజ వారసుడి చిత్రం.. ఆ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "మిస్టర్ ఇడియట్". ఈ మూవీలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను జేజేఆర్ ఎంటర్టైన్మెంట్, ఎల్ఎల్పీ బ్యానర్లపై యలమంచి రాణి సమర్పణలో జె జే ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ అందుకున్న గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ నుంచి 'కావాలయ్యా..'అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా ద్వారా పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతమందించగా.. భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను సింగర్ మంగ్లీ ఆలపించారు. -
'మిస్టర్ ఇడియట్గా' రవితేజ వారసుడు.. సాంగ్ రిలీజ్ చేసిన హీరో!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఎల్ఎల్పీ పతాకంపై జెజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారుతాజాగా ఈ మూవీ నుంచి కాంతార అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సాంగ్‌ను రాహుల్ సిప్లిగంజ్ పాడగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇప్పటికే మిస్టర్ ఇడియట్ ట్రైలర్ విడుదల కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
హీరోగా రవితేజ వారసుడి ఎంట్రీ.. ట్రైలర్ వచ్చేసింది!
మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన తమ్ముడు రఘు తనయుడు మాధవ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం 'మిస్టర్ ఇడియట్'. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. గౌరీ రోణంకి డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై రవిచంద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాల్గొన్నారు.డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..' రవితేజ ఇండస్ట్రీలో నాలాంటి వారిని ఎంతోమందిని సపోర్ట్ చేశారు. ఈ ఫంక్షన్‌కు పిలిచినప్పుడు మాధవ్‌కు సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి వచ్చా. టైటిల్ మిస్టర్ ఇడియట్ అని చెప్పగానే నాకు ఇడియట్ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చాయి. నేను కూడా చంటిగాడిలా ఫీలయ్యేవాడిని. ఆ సినిమాలో హీరోయిజం కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. రవితేజ స్థాయికి మాధవ్ చేరుకోవాలని కోరుకుంటున్నా. మిస్టర్ ఇడియట్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా' అని అన్నారు. -
కేరళ విలయానికి క్వారీలే కారణం
మూడేళ్ల క్రితం కొంకణ్ ప్రాంతంలోనే ప్రస్తుతం వయనాడ్‌లో చోటు చేసుకున్నట్లు కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాయగఢ్ జిల్లా తాలియే ప్రాంతంలో ఏకంగా 124 మంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రాంతంలోనూ రాతి తవ్వకాల కోసం పెద్ద ఎత్తున పేలుళ్లు కొనసాగుతున్న విషయాన్ని గమనించాలి. కాగా భారీ వర్షాల కారణంగానే తాజాగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయనీ, ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయి 350కి పైగా ప్రాణాలు పోయాయనీ ప్రభుత్వం నమ్మబలకవచ్చు; కానీ టూరిస్టు రిసార్టుల కోసం నేలను చదును చేయడం, లాటరైట్ రాయి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టడం ఈ విధ్వంసానికి దారి తీసిన అసలు కారణాలు అనడంలో సందేహం లేదు.పశ్చిమ కనుమల్లో రాతి తవ్వకాలు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ క్వారీయింగ్కూ,కొండచరియలు విరిగిపడేందుకూ మధ్య దగ్గరి సంబంధాలున్నాయని తెలిసినా... పట్టించుకోకపోవడమే జూలై 30న కేరళలోని వయనాడ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి కారణమైంది. భారీ వర్షాల కారణంగానే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయనీ, ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయి 350కి పైగా ప్రాణాలు పోయాయనీ ప్రభుత్వం నమ్మబలకవచ్చు; కానీ టూరిస్టు రిసార్టుల కోసం నేలను చదును చేయడం, సరస్సులను నేలమట్టం చేస్తూ లాటరైట్ రాయి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టడం ఈ విధ్వంసానికి దారితీసిన అసలు కారణాలు అనడంలో సందేహం అవసరం లేదు. ఆరు గంటల వాన అరగంటలోనే!అయితే ఒక్క విషయం. భారీ వర్షాలకు కూడా లాటరైట్ రాయి తవ్వకాలే కారణమయ్యాయా? అవుననే చెప్పాలి. ఎందుకంటే భారత్‌లో భవన నిర్మాణం, గనులు, రాతి తవ్వకాలు, రోబో శాండ్ కోసం రాయిని పొడిలా మార్చడం వంటి అన్నింటి కారణంగా ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఏరోసాల్స్ (దుమ్ము, ధూళిల కారణంగా గాల్లోకి చేరే అతి సూక్ష్మ కణాలు) గాల్లోకి చేరుతున్నాయి. వాహన కాలుష్యం, థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు వాడకం కూడా ఈ ఏరోసాల్ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. గాల్లోని నీటి ఆవిరికి ఈ ఏరోసాల్స్ తోడైనప్పుడు ఆవిరి ఘనీభవించడం మొదలవుతుంది. అది కాస్తా ముందు చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఒకదానితో ఒకటి చేరడం ద్వారా నీటి బిందువుల పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా అతితక్కువ సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయి. అందుకే ఆరు గంటల సమయం జల్లుగా కురవాల్సిన వాన కాస్తా అరగంటలో కుమ్మరించిపోతోంది. పశ్చిమ కనుమలకు సంబంధించిననంతవరకూ కొంకణ్ ప్రాంతం చాలా కీలకమైంది. మహారాష్ట్రలోని ఈ ప్రాంతంతోపాటు పక్కనే ఉండే దక్కన్ పీఠభూమి ప్రాంతంలోనూ 2021 జూన్ 22న అతి తక్కువ కాలంలోనే అతిభారీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలోని ఎత్తయిన ప్రాంతాల్లో నివసించే వారు కూడా అంత తక్కువ కాలంలో అంత ఎక్కువ వాన కురవడం గతంలో ఎప్పుడూ లేదని చెబుతారు. అదే ఏడాది అక్టోబరులో కేరళ ప్రాంతంలో విలయం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళలో 2018 ఆగస్టులో కురిసిన అతిభారీ వర్షాలు, తద్వారా ఏర్పడ్డ వరద పరిస్థితి వందేళ్ల రికార్డుగా నమోదైన విషయం తెలిసిందే. ఈ వరదల్లో దాదాపు 483 మంది ప్రాణాలు కోల్పోగా, 140 మంది కనిపించకుండా పోయారు. కేరళలోని చాలక్కుడిలోని ప్రఖ్యాత రివర్ రీసెర్చ్ సెంటర్ 2018 నాటి వరదలపై పూర్తిస్థాయిలో అధ్య యనం చేసింది. చాలక్కుడి నదీ బేసిన్ లో చాలా రిజర్వాయర్లు ఉండగా... 2018లో మే నెలలోనే క్యాచ్మెంట్ ఏరియాలో మంచి వర్షాలు కురిశాయి. జూన్ , జూలైలలో ఒకట్రెండు భారీ వర్షాలూ నమో దయ్యాయి. రుతుపవనాలు ఇంకా చురుకుగా ఉండగానే డ్యామ్‌లన్నీ వేగంగా నిండిపోవడం మొదలైంది. ఈ తరుణంలో మరిన్ని వర్షాలు కురిస్తే వరదలు తప్పవన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018లో జూలై 17 నుంచే రివర్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు, చాల క్కుడి రివర్ ప్రొటెక్షన్ ఫోరమ్ వాళ్లు వరదల నుంచి ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు విఫలయత్నం చేశారు. డ్యామ్‌లలోని నీరు దశల వారీగా నిదానంగా వదలాలనీ, తద్వారా వరద ముప్పును కొంత వరకూ తగ్గించవచ్చుననీ వీరు సూచించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఒకవేళ ఈ సూచనలు పాటించి ఉంటే డ్యామ్ గరిష్ఠ మట్టాన్ని చేరకుండా రెండు మీటర్ల మేర తక్కువ స్థాయిలోనే నీటిని నిలుపుకునే వారు. తద్వారా ప్రమాద తీవ్రత తగ్గేది. భారీ వర్షాల్లోనూ క్వారీ తవ్వకాలు!మూడేళ్ల క్రితం కొంకణ్ ప్రాంతంలోనే ప్రస్తుతం వయనాడ్‌లో చోటు చేసుకున్నట్లు కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాయగఢ్ జిల్లా తాలియే ప్రాంతంలో ఏకంగా 124 మంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రాంతంలోనూ రాతి తవ్వకాల కోసం పెద్ద ఎత్తున పేలుళ్లు, రహదారి నిర్మాణం కోసం అడవుల నరికి వేత విచ్చలవిడిగా కొనసాగుతున్న విషయం ప్రస్తావనార్హం. 2021 జూన్ – జూలైలో మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదు కాగా అక్టోబరు 16న కేరళలోని కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో అదే తరహా విపత్తు సంభవించింది. మహారాష్ట్ర మాదిరిగానే కేరళలోనూ రాతి క్వారీల తవ్వకం వంటివే విపత్తులకు కారణమయ్యాయి. కేరళలోని ప్లాప్పల్లీ, కొట్టా యంలోని కూటిక్కల్లు బాగా దెబ్బతిన్నాయి. ఇక్కడ దాదాపు పదేళ్లుగా రాతి క్వారీలు జోరుగా సాగుతున్నాయి. వీటి నిలిపివేతకు పెద్ద ఎత్తున ఉద్యమమూ నడుస్తోంది. అయినా క్వారీ నిర్వాహకులు పట్టించుకోలేదు. అక్టోబరు 16న కూటిక్కల్‌లో కొండచెరియలు విరిగి పడే సమయంలోనూ రాతి క్వారీలు పని చేస్తూనే ఉన్నాయి. విపత్తు సంభవించినప్పుడు క్వారీలు ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారిక సమాచా రంలో కేవలం మూడు రాతి క్వారీల పేర్లు ఉన్నప్పటికీ ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా కనీసం 17 క్వారీలను గుర్తించారు. కేరళ మొత్తమ్మీద ప్రస్తుతం దాదాపు ఆరు వేల వరకూ క్వారీలు నడుస్తు న్నట్లు తెలుస్తోంది. 2018 వరదల తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 223 రాతి క్వారీలకు అనుమతివ్వడం గమనార్హం.నిలిపివేత నిర్ణయంపై రాజకీయాలుకూటిక్కల్ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోని కడ నాడ్‌లో రాతి క్వారీల సమస్యను అధిగమించేందుకు ఒక ప్రయత్నం జరిగింది. 2008లో కడనాడ్ పంచాయతీ అధ్యక్షుడు మజు పుతెని కందం బయో డైవర్సిటీ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. పంచా యతీలోని పదమూడు వార్డులకు చెందిన నిపుణులు, కార్యకర్తలు ఈ కమిటీ కార్యకలాపాలను నిర్వహించేవారు. రైతులు, సభ్యులందరి నుంచి సమాచారం సేకరించిన మజు పుతెనికందం బృందం పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ ఒకదాన్ని సిద్ధం చేసింది. జీవ వైవిధ్యభరిత మైన పెరుమ్ కన్ను ప్రాంతంలో రాతి క్వారీయింగ్ సరికాదని గుర్తించిన ఈ కమిటీ క్వారీయింగ్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. కేరళ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. 2012లో కేరళ హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి క్వారీ నిలిపివేత నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఈ విషయంలో కొన్ని దుష్టశక్తుల ప్రవేశం వెంటనే జరిగి పోయింది. కడనాడ్ ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించిందని... దాంతో రైతులు, ప్రజలు అటవీ అధికారుల పెత్తనంలో బతకాల్సి వస్తుందని తప్పుడు ఆరోపణలు వ్యాప్తిలోకి తెచ్చింది. దురదృష్టకరమైన అంశం ఏమిటంటే, అటవీ శాఖ కూడా ఈ దుష్ట శక్తులతో కుమ్మక్కైపోవడం. పర్యావరణ పరిరక్షణ పేరు చెప్పి వీరు ప్రజలను వేధించడం కూడా వాస్తవమే. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో కడనాడ్ పంచాయతీ రాతి క్వారీల తవ్వకాలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం కాస్తా నిర్వీర్యమై పోయింది. పంచాయతీ తన తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. అయితే సరైన దిశలో వేసిన ఈ తొలి అడుగు మరిన్ని ముందడుగులకు ప్రారంభం కావాలని ఆశిద్దాం!మాధవ్ గాడ్గిల్ వ్యాసకర్త పర్యావరణవేత్త, ‘సెంటర్ ఫర్ ఎకలాజికల్ స్టడీస్’ వ్యవస్థాపకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
చంపుతామని టీడీపీ.. ఊరొదిలి పెట్టమని పోలీసులు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : రేయ్.. మాధవ్.. నిన్ను చంపుతాం అంటూ టీడీపీ నాయకులు, ఊరొదిలి వెళ్లిపోవాలంటూ పోలీసు అధికారులు నిన్నటి వరకు ఎంపీ అయిన గోరంట్ల మాధవ్‌పై అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున అనంతపురం నగరంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ‘రేయ్ మాధవ్ నిన్ను చంపుతాం’ అంటూ కేకలు వేస్తూ రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికి వారం అవుతున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులపై అధికార పార్టీ నుంచి పెద్దఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా, నిన్నటి వరకు ఎంపీ అయిన మాధవ్‌నే ఊరొదిలి వెళ్లిపోవాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేయడం గమనార్హం. అయితే, ఇందుకు మాధవ్ ససేమిరా అంటున్నారు. కార్యకర్తలకు అండగా ఇక్కడే ఉంటానని కరాఖండిగా చెబుతున్నారు.ఆరోజు ఏమి జరిగిందంటే..ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్ జరిగింది. మధ్యాహ్నానికి రాష్ట్రంలో కూటమి మెజార్టీ సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నగర శివారులోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద కొందరు టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. ఇంటి మీద రాళ్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో మాధవ్ దంపతులు ఇంట్లోనే ఉన్నారు. ఇంటిపై భాగంలోని అద్దాలు పగిలిపోయాయి.ఒక రాయి మాధవ్ కుడికాలి పాదం వద్ద బలంగా తాకడంతో గాయమైంది. చుట్టుపక్కల వాళ్లు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లకు తలుపులు వేసుకున్నారు. మాధవ్ గన్మెన్లు నిలువరించే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ‘రేయ్.. మా ప్రభుత్వం వస్తోంది. మాధవ్గాడిని చంపుతాం. నీకు ఎవరు దిక్కు వస్తారురా’ అంటూ కేకలు వేశారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ‘నిన్ను ఎప్పటికైనా హతమారుస్తాం’ అంటూ వెళ్లిపోయారు. ఎస్పీ గౌతమిశాలి స్వయంగా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అల్లరిమూకలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కానీ కేసులో ఇప్పటిదాకా ఎలాంటి పురోగతీ లేదు.ఊరొదిలి పోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు : మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తనను ఊరు వదిలి పోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. మంగళవారం సాయంత్రం ఇద్దరు సీఐలు తన నివాసానికి వచ్చి ఈ విషయం చెప్పారని తెలిపారు. అనంతపురం డీఎస్పీ కూడా ఇదే రకమైన ఒత్తిడి చేస్తున్నారన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలిపెట్టి వెళ్లబోనని, తమ పార్టీ కార్యకర్తల కోసం అండగా ఉంటానని స్పష్టంచేశారు. అవసరమైతే తనను అరెస్టు చేసుకోవాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని టీడీపీ సద్వినియోగం చేసుకుని వారికి మంచి చేయాలి కానీ ఇలా ఇళ్లపై దాడులు చేయడం హేయమని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా కౌంటింగ్ రోజు నుంచే గ్రామాల్లో దాడులకు తెగబడుతున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులకు తట్టుకోలేక చాలా మంది ఊళ్లు వదిలారని, కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని చెప్పారు. పార్టీ అధినేత సూచనలతో త్వరలోనే బాధితులను కలిసి భరోసా ఇస్తామన్నారు. -
హీరోగా రవితేజ వారసుడు.. టీజర్ రిలీజ్
మాస్ మహరాజ్ రవితేజ వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మాధవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "మిస్టర్ ఇడియట్". పెళ్లి సందడి ఫేమ్ డైరెక్టర్ గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా కనిపించనుంది.. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవిచంద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రవితేజ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అల్ ది బెస్ట్ చెప్పారు.టీజర్ చూస్తే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్లో కనిపిస్తోంది. టీజర్ కాలేజీ సీన్స్, కామెడీ చూస్తే ఫుల్ లవ్ అండ్ కామెడీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
ఓ పండుగలా ‘రాధా మాధవం’: హీరో వినాయక్ దేశాయ్
అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా ‘రాధా మాధవం’ రాబోతోంది. ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని గోనాల్ వెంకటేష్ నిర్మించగా.. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో వినాయక్ దేశాయ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. 'మాతృభాష కన్నడ అయినా.. పెరిగింది ముంబైలోనే. అక్కడే సినిమా ప్రయత్నాలు చేశాను. కన్నడలో చిన్న చిన్న పాత్రల్లో నటించాను. బాహుబలి సినిమా చూసి తెలుగు చిత్ర సీమకు రావాలని నిశ్చయించుకున్నాను. చేస్తున్న బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు వచ్చి సినిమా ప్రయత్నాలు చేశాను. అలా 2019 నుంచి ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. కరోనా టైంలో ఆన్ లైన్ డ్యాన్స్ క్లాసులు కూడా చెప్పేవాడిని. ‘శ్రీరంగపురం’ అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాను. ‘లవర్స్ లవ్ స్టోరీ’ అనే మూవీ చేయగా.. అది ఓటీటీలోకి వచ్చింది. నా మూడో చిత్రమే రాధా మాధవం. రాధా మాధవం దర్శకుడు ఇస్సాకు నాకు మంచి ఫ్రెండ్. హైదరాబాద్ వచ్చిన కొత్తలో పరిచయం అయ్యాడు. అతను చాలా టాలెంటెడ్ పర్సన్. తనకు దర్శకుడిగా అవకాశం వస్తే.. నాకు ఈ సినిమాను ఇచ్చారు. దర్శక నిర్మాతలు నాకు ముందు నుంచీ పరిచయం ఉండటంతో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. నిర్మాత గోనాల్ వెంకటేష్ గారు కొత్త వారిని ఎంకరేజ్ చేస్తుంటారు. మేం అంతా కొత్త వాళ్లమే అయినా మా మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రాధా మాధవం సినిమాను నిర్మించారు. చైతన్య కొల్లి ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయి. థాజ్ విజువల్స్ ఎంతో సహజంగా ఉంటాయి. సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్‌తో చాలా మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాం. మా చిత్రం అందరికీ ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా రాధా మాధవం రాబోతోంది. గ్రామీణ ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ పండుగలా ఉంటుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. మా లాంటి కొత్త వాళ్లని, కొత్త టీం చేసిన ప్రయత్నాన్ని ఆడియెన్స్ ఆదరిస్తే.. మున్ముందు మరిన్ని ప్రయోగాలు చేస్తాం. మార్చి 1న రాబోతోన్న ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరిస్తారు.' అని కోరుకుంటున్నాను. -
లోక్ సభ దాడిలో మొత్తం నలుగురు నిందితులు
-
నీచమైన చరిత్ర చంద్రబాబుది: గోరంట్ల మాధవ్
-
బాబు షూరిటీ..జైలు గ్యారెంటీ..చంద్రబాబు కొత్త ప్రోగ్రాం: గోరంట్ల మాధవ్
-
బాలకృష్ణ పరువుతీసిన ఎంపీ గోరంట్ల మాధవ్
-
అన్ని వర్గాలకు న్యాయం చేసిన సిఎం జగన్ - ఎంపీ గోరంట్ల మాధవ్
-
మిస్టర్ ఇడియట్ వస్తున్నాడు
హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్ శర్మ హీరోయిన్. గౌరీ రోణంకి దర్శకత్వంలో జేజేఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం మాధవ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘మిస్టర్ ఇడియట్’లోని మాధవ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ‘‘మిస్టర్ ఇడియట్’ ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గౌరీ రోణంకి. ‘‘నవంబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత జేజేఆర్ రవిచంద్. -
రియల్‌మీకి మరో షాక్: రాజీనామా చేసిన 12 మంది ఉన్నతోద్యోగులు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీకి మరో షాక్ తగలింది. కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా డజను మందికిపైగా ఉద్యోగులు రియల్మీ ఇండియా (Realme India) సంస్థకు రాజీనామా చేసినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం రాజీనామా చేసిన మాజీ సీఈఓ మాధవ్ సేత్ (Madhav Sheth) పెట్టిన కొత్త సంస్థ హానర్ టెక్‌లో చేరేందుకే ఆ ఉద్యోగులు రియల్‌మీని వీడినట్లు సమాచారం. రియల్మీ ఇండియా సంస్థకు చెందిన అత్యున్నత డైరెక్టర్లతో సహా పలువురు ఉద్యోగులు మాధవ్ సేత్ కొత్త కంపెనీ హానర్ టెక్‌లో చేరిన నేపథ్యంలో రియల్మీ ఇండియా సంస్థలో మరిన్ని సామూహిక రాజీనామా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో మాజీ సేల్స్ డైరెక్టర్ దీపేష్ పునమియా కూడా ఉన్నారు. ఇటీవల ఆయన హానర్ టెక్ కంపెనీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. కాగా ఉద్యోగుల రాజీనామాల విషయంపై రియల్మీ సంస్థ నుంచి ఎంటువంటి స్పందనా లేదు. ఇదీ చదవండి ➤ Best Light Weight Smart phones: బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి.. ఎగుమతులకు సంబంధించిన కొత్త వెంచర్‌ను ప్రారంభించడం కోసమని మాధవ్ సేత్ జూన్ నెలలో రాజీనామా చేశారు. అప్పటి వరకు కంపెనీలో ఆయన ఐదేళ్లు పనిచేశారు. రియల్మీ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా, రియల్మీ ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్‌నకు ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. రియల్మీ ఫౌండర్ స్కైలీతో కలిసి మాధవ్ సేత్ 2018 మేలో అధికారికంగా బ్రాండ్‌ను స్థాపించారు. -
రవితేజని ఫాలో అయిపోతున్న తమ్ముడి కొడుకు
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి 'Mr.ఇడియట్' టైటిల్ ఖరారు చేశారు. సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'పెళ్లి సందD' చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్, ప్రీ లుక్‌ని మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించారు. నా కెరీర్లో 'ఇడియట్' సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా రఘు కొడుకు మాధవ్ 'Mr ఇడియట్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాలాగే తనకు కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవాలని కోరుకుంటున్నాను' అని చిత్రబృందానికి రవితేజ విషెస్ చెప్పారు. ట్వీట్ కూడా చేశారు. Happy to unveil the Title Poster of #MrIdiot & Introduce my boy @maadhav_9999 🤗 Wishing your first step bring you success and love & May you have a amazing journey with cinema. Wishing the Entire team All the best 👍#JJREntertainments #GowriRonanki #simransharma @raamdop… pic.twitter.com/DL40FoeXbL — Ravi Teja (@RaviTeja_offl) July 9, 2023 (ఇదీ చదవండి: తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. హీరోయిన్ ఇలియానా ఇబ్బందులు!) -
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్‌కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్‌బై, ప్రత్యర్థికి సై!?
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ తన పదవికి రాజీనామా వేశారు. సంస్థకు ఐదేళ్ల పాటువిజయంతంగా సేవలందించి, ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్మీ ప్రముఖ బ్రాండ్‌గా నిలబెట్టిన మాధవ్ సేత్ ఉన్నట్టుండి గుడ్ బై చెప్పడం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.ఆయన నిష్క్రమణ కంపెనీకి గణనీయమైన ఎదురుదెబ్బ అని మార్కెట్ వర్గాల అంచనా. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) ఈ సమాచారాన్ని మాధవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సంస్థకు వీడ్కోలు పలకడం కష్టమే కానీ, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయం వచ్చిందంటూ ఒక నోట్‌ను మాధవ్ ట్వీట్ చేశారు. రియల్‌మీకి తన జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉందని ఎన్నో అద్భుతమైన మరపురాని క్షణాలను అందించిందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా తన పదవీ కాలంలో కొన్ని ముఖ్యమైన విజయాలను హైలైట్ చేశారు. రియల్మీ తన స్మార్ట్‌ఫోన్‌ను తొలిసారిగా యూనివర్సిటీలో విడుదల చేసి చరిత్ర సృష్టించింది. కంపెనీ 50 మిలియన్లకు పైగా ఉత్పత్తులను విక్రయించి, వేగంగా అమ్ముడవుతున్న బ్రాండ్‌గా మారింది. దేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్లేయర్‌గా కూడా నిలిచింది. నాణ్యత, కమిట్మెంట్కు తోడు "మేక్ ఇన్ ఇండియా" చొరవ ఫలితంగా 5 జీ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తికి దారితీసింది. గత ఐదేళ్లలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, టీమ్‌లు, పార్టనర్స్, ఇలా ప్రతి ఒక్కరికీ షేత్ తన కృతజ్ఞతలు తెలిపారు. (Adipurush Promotions: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే ) మాధవ్ సేత్ పయనం ఎటు? రియల్‌మిని వీడిన తరువాత, మాధవ్ ప్రస్థానం ఎటు అనేదే ఇపుడు ప్రధాన ప్రశ్న. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ, ప్రధాన ప్రత్యర్థి హానర్‌లో చేరవచ్చని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాధవ్ అధికారిక ధృవీకరణ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. హానర్ భారత మార్కెట్ నుండి వైదొలగనుందంటూ గతంలో వచ్చిన పుకార్లొచ్చాయి. అయాతే కంపెనీ ప్రతినిధి ఈ వాదనలను ఖండించిన సంగతి తెలిసిందే. -
జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లే
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న తనకు మద్దతుగా బహిరంగ ప్రకటన చేయాలని స్వయంగా మిత్రపక్ష జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను కోరినా ఆయన స్పందించలేదని.. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసే పరిస్థితి లేనప్పుడు బీజేపీ–జనసేన కలిసి ఉన్నా లేనట్లే అని శాసనమండలిలో బీజేపీ పక్ష నాయకుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ ఘాటుగా స్పందించారు. పొత్తులో కొనసాగుతున్నప్పటికీ జనసేన ఎక్కడా బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపని అంశంపై మంగళవారం విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జిల సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో కేంద్ర పార్టీ నుంచి జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను మాధవ్‌తో పాటు మరో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, పార్టీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు జనసేనతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం ఉంది. ఇటీవల పవన్ కూడా జనసేన–బీజేపీ పొత్తు ఉంది అన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదన్నది వాస్తవం. నిజంగా పొత్తులో ఉంటే క్షేత్రస్థాయిలో కూడా కలిసి పనిచేయాలని కోరుతున్నాం. ఆ విధంగా వెళ్తేనే ప్రజలలో మనం కలిసి వెళ్తుతున్నామన్న మాటకు అర్థం ఉంటుంది. నామ్‌కే వాస్త్‌గా పొత్తుతో ఉపయోగం లేదని మా అందరి అభిప్రాయం’.. అని మాధవ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ పొత్తు కొనసాగాలనే కోరుకుంటున్నాం.. ‘బీజేపీ–జనసేన కలిసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ ఇప్పటికీ కోరుకుంటోంది. కలిసి పనిచేస్తే ప్రజా మద్దతు రెండు పార్టీలకు ఉంటుంది. ఆయనా (పవన్) నమ్మాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రకటన చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. పోటీలో ఉన్న అభ్యర్థిగా నేనూ అడిగాను. చాలాసార్లు కోరాం. కానీ, ప్రకటన రాలేదు. మరోవైపు.. ఉత్తరాంధ్రలో పీడీఎఫ్ అభ్యర్థి తమకు జనసేన మద్దతు ఉందని ప్రచారం చేసుకున్నారని, దానిని ఖండించమని కోరినా ఖండించలేదు’.. అని మాధవ్ చెప్పారు. కలిసి పనిచేసే విషయంలో బీజేపీ నుంచే స్పందనలేదని పవన్‌కళ్యాణ్ అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆయన వైపు నుంచే స్పందనలేదు’ అని బదులిచ్చారు. అందుకే సొంతంగా ఎదగాలనినిర్ణయించుకున్నాం.. ‘జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం నేపథ్యంలో పార్టీ తనంతట తాను ఎదిగేలా అన్ని ఏర్పాట్లుచేసుకోవాలని అనుకున్నాం. ఇందులో భాగంగా ఏప్రిల్ 1–14 వరకు బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమం చేస్తున్నాం. మే ఒకటి తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు వేసే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. ఏదైనా పొత్తు నిర్ణయం ఉంటే కేంద్ర పార్టీ ఆలోచిస్తుంది’ అని మాధవ్ చెప్పారు. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌కు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. ‘సుదీర్ఘ కాలం రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ తుది శ్వాస విడిచిన నా తండ్రి పీవీ చలపతిరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ధన్యవాదాలు’ అని పీవీఎన్ మాధవ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: (విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో సమావేశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు) -
మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు ఉంటాయ్: సజ్జల
తాడేపల్లి: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై స్పందించారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అది వాస్తవం కాదని, పోలీసు కేసు కూడా పెట్టానని గోరంట్ల తనతో చెప్పారన్నారు. ఆ విషయంలో నిజంగా ఆయన తప్పు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘మా పార్టీ మహిళల పక్షపాత పార్టీ. నిజంగా తప్పు ఉంటే మా నాయకుడు ఊరుకోరు. టీడీపీ రాద్దాంతం చేస్తోంది. మా నాయకుడు చేతల్లో చూపిస్తారు. గోరంట్ల మాధవ్ పోలీస్ కేసు పెట్టారు. వాస్తవాలు తెలియాల్సి ఉంది. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదీ చదవండి: నకిలీ వీడియోపై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్ -
వరద సాయం తక్షణమే విడుదల చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల అకాల వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో తీవ్రనష్టం వాటిల్లిందని, కేంద్రం తక్షణ సాయం వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి భంగం కలిగించేలా ప్రతిపక్షాలు వ్యవహరించరాదని హితవు పలికారు. ప్రత్యేక హోదా, పోలవరం డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగానే అమరావతి ఉద్యమం సాగుతోందని ప్రజలందరికీ తెలుసన్నారు. అమరావతి రైతులకు ఎవరూ వ్యతిరేకం కాదని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, ఎన్.రెడ్డెప్ప, వంగా గీతావిశ్వనాథ్లు మీడియాతో మాట్లాడారు. విపరీతమైన వర్షాలు, వరదలు నాలుగు జిల్లాల్లోని రెండు లక్షలమంది ప్రజలపై ప్రభావం చూపాయని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డి కోరారని చెప్పారు. రాష్ట్ర అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.6వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, కమిటీ నివేదిక రాగానే సాయంచేస్తామని చెప్పారని తెలిపారు. జస్టిస్ చంద్రుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ జస్టిస్ చంద్రుపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజలకు మేలుచేసే కార్యక్రమాలు చేపడితే చంద్రబాబు వాటిని ప్రజలకు అందనీయకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడు తూ కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో ఏపీని మభ్యపెడుతూనే పాండిచ్చేరికి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం దారుణమని విమర్శించారు. 20 ఏళ్లలో ఎన్డీయే, యూపీఏ సంయుక్తంగా కలిసి చేసిన పని రాష్ట్ర విభజన ఒక్కటేనన్నారు. హోదా మరుగునపడిన అంశం కాదని, నిరంతరం పోరాడతామని చెప్పారు. ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ రెవె న్యూ లోటు కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను, ఇతరత్రా పెండింగ్ సొమ్మును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పార్లమెంటులో పోరాడుతున్నామన్నారు. ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం జగన్మోహన్రెడ్డి చూపిన చొరవకు గిరిజనుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఇది గిరిజనుల అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకోరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కేంద్రానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారన్నారు. త్వరలో కేబినెట్ సమావేశం పెట్టి రాష్ట్రానికి హోదా మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు అధికారంలో లేకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. చంద్రబాబు వల్లే అమరావతి ఉద్యమం జరుగుతోందని పేర్కొన్నారు. ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు కలసిరావాలని కోరారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మొక్కను సరిగా నాటకపోవడం వల్లనే ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వృక్షంగా మార్చడానికి ఎన్నో ఇబ్బందులు పడుతోందన్నారు. కరోనా వల్ల ఇబ్బందులు ఎదురైనా ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నామని, ప్రజలతో ఉండి సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన ఎఫ్‌సీఐ, ఉపాధి నిధులు కూడా ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా, విశాఖ జోన్, పోలవరం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాల్లో ప్రజల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు ఎవరూ చేయనట్లుగా పారదర్శక పాలన అందిస్తున్న సీఎం జగన్ పేదల గౌరవాన్ని పెంచారని చెప్పారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని బీజేపీ అజెండాలో కూడా ఉందని గుర్తుచేశారు. అమరావతి రైతుల పట్ల అందరికీ సానుభూతి ఉందన్నారు. జమ్మూకశ్మీర్, అయోధ్య రామాలయం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుని పూర్తిచేసినట్లే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. -
బయటపడ్డ మరొక టీడీపీ నేత ప్రలోభాలు
-
'టీడీపీ నేతలు పడగొట్టి బీజేపీపై నెడుతున్నారు'
సాక్షి, విశాఖపట్నం: దేవాలయాలను కూలదోచిన చంద్రబాబుకు రామతీర్థం వచ్చే అర్హత లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ మేరకు బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'అధికారంలో ఉండగా చంద్రబాబు 30 దేవాలయాలను పడగొట్టారు. టీడీపీ నేతలు దేవాలయాలు పడగొట్టి బీజేపీపై నెడుతున్నారు. నితిన్ గడ్కరీ చెబితే విజయవాడలో దేవాలయాలు పడగొట్టామంటున్న అచ్చెన్నాయుడు ఆధారాలు చూపించాలి. లేదంటే తన పదవికి రాజీనామా చేయాలి. టీడీపీ పడగొట్టిన దేవాలయాలు పునర్నిర్మించాలని గతంలో బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. దేవాలయాలపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రామతీర్థంలో శ్రీరామనవమి చేయాలంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు' అంటూ ఫైర్ అయ్యారు. చదవండి: (దేవాలయాలు కూల్చి.. శౌచాలయాలు) బీజీపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా దేవాలయాలను కూల్చిన చంద్రబాబు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలో కూలదోసిన దేవాలయాలను చంద్రబాబు ఎందుకు పునర్నిర్మాణం చేయలేదు. ఓట్ల కోసం చంద్రబాబు మత రాజీకీయాలు చేస్తున్నారు' అంటూ విష్ణువర్దన్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: ('పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద చర్యకైనా సిద్ధమే') -
గతంలోనే నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేశాం
-
పోలవరంపై వస్తున్న వాదనలన్నీ ఊహాగానాలే...
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మరోసారి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టెక్నాలజీ పేరుతో పోలవరం అంచనాలు పెంచారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ అంచనాల పెంపుపై విచారణ జరగాలని ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. ‘2013లో ఎంత రీహాబిలిటేషన్ అవుతుందని చెప్పారో.. 2015కల్లా దాని అంచనా పెరిగిపోయింది. దానిపై విచారణ జరగాలి. గతంలోనే నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేశాం’ అని అన్నారు. ‘పోలవరం ప్రాజెక్ట్ డీపీఆర్ 1,2 లకు సంబంధించి ఎంత అంచనాలు ఇస్తారో అవి వందకు వంద శాతం చేస్తామని గతంలో ఉమా భారతి, నితిన్ గడ్కరీ, నేటి జల వనరుల శాఖ మంత్రి వరకు హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రం భరిస్తుంది. పోలవరంపై వస్తున్న వాదనలన్ని ఊహాగానాలే. కేంద్రం పూర్తి వంద శాతం నిధులతో పోలవరాన్ని పూర్తి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై గత ప్రభుత్వ అంశాలపై కూడా శ్వేత పత్రం విడుదల చేయాలి. పారదర్శకంగా పోలవరం పనులు జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’ అని ఎమ్మెల్సీ మాధవ్ కోరారు. -
ప్రధాని మోదీ, సీఎం జగన్‌లకు కృతజ్ఞతలు
సాక్షి, అనంతపురం: కిసాన్ రైలు ద్వారా రైతులు తరలించే పంట ఉత్పత్తులకు రవాణా చార్జీలను 50 శాతం తగ్గించటం హిందూపూరం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు మంగళవారం వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లే కిసాన్ రైల్లో రవాణా ఛార్జీలను సగానికి సంగం తగ్గించటం వల్ల అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అనంతలో పండే పంటలు ఢిల్లీలో అధిక ధరలకు విక్రయించి రైతులు లాభం పొందవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు -
జేసీకి ఈ గతి వస్తుందనుకోలేదు
అనంతపురం సెంట్రల్: ‘రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి పేరు చెబితే ఒకప్పుడు ప్రజలందరూ భయపడేటోళ్లు. అలాంటి వ్యక్తికి నారా లోకేష్ వచ్చి ధైర్యం చెబుతుంటే జేసీ దివాకర్‌రెడ్డి ఎంత గతి వచ్చిందని అనుకుంటున్నారు’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. మంగళవారం నగరంలోని మాధవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కొడుకుగా, స్వర్గీయ ఎన్టీఆర్ మనవుడిగా, అభిమాన నటుడు బాలకృష్ణ సొంత అల్లుడి హోదాల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తే ప్రజలు చీత్కరించారన్నారు. ఓటర్లను అనేక ప్రలోభాలకు గురి చేసినా ఓటెయ్యని పరిస్థితి నెలకొందన్నారు. అలాంటి వ్యక్తి వచ్చి సుదీర్ఘ అనుభవం ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి ధైర్యం చెబుతుండం చూస్తే నవ్వు వస్తోందన్నారు. లోకేష్ ఉపన్యాసాలు వింటూ చిన్న పిల్లలు జోక్‌గా నవ్వుకుంటారని... అలాంటి వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శలు చేయడం, అభ్యంతకర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. రూ. 50 కోట్లు ఎర చూపి అచ్చెన్నాయుడు వైఎస్సార్సీపీలోకి రావాల్సిందిగా ప్రలోభపెట్టారని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల తరహాలో కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాల్సిన గత్యంతరం లేదన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి తనకున్న ఆస్తులతో 20 సంవత్సరాలు జిల్లాను పోషించవచ్చని, అలాంటి వ్యక్తులు నేరాలకు పాల్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. 6 వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్ చేయించి 151 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌లు, నకిలీ పోలీసు క్లియరెన్స్‌లతో వాహనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలీడం లేదన్నారు. ఇక్కడ నేరం చేస్తే పట్టుబడతామని నాగలాండ్ రాష్ట్రానికి వెళ్ళారని, స్క్రాప్ కింద వాహనాలను అమ్మినట్లు అశోక్‌లైలాండ్ కంపెనీ రాతపూర్వకంగా తెలియజేసిందన్నారు. జేసీ సోదరులు చేసిన నేరాలు ఆధారాలతో సహా బయటపడటంతోనే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జేసీ సోదరుల చేతిలో మోసపోయి లారీలు కొనుగోలు చేసిన నాగరాజు, జయరంగారెడ్డి తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వివరించారు. లోకేష్ రాజకీయాలకు పనికి రాడు గుత్తి: ‘మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ బాబు అసమర్థుడు , రాజకీయాలకు ఏ మాత్రం పనికి రాడు’ అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. గుత్తి పట్టణంలోని ఆర్అండ్బీ బంగ్లాలో మంగళవారం ఆయన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నారా లోకేష్ , బాలకృష్ణలపై విరుచుకుపడ్డారు. మామ అల్లుళ్లు నారా లోకేష్, బాలకృçష్ణ మాటలు విని జనాలు నవ్వుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ అరెస్టు చేస్తే చంద్రబాబు వెళ్లి పరామర్శించడం, నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో బస్సులు, లారీలు కొని తిప్పినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు పంపితే నారా లోకేష్ తాడిపత్రికి వచ్చి జేసీ కుటుంబాన్ని పరామర్శించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. పక్కా ఆధారాలతో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి, అచ్చెన్నాయుడులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తే టీడీపీ నేతలు నానా యాగీ చేస్తుండటం సిగ్గు చేటన్నారు. నారా లోకేష్ తాడిపత్రిలో ప్రెస్‌మీట్ పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఏదేదో మాట్లాడుతున్నాడన్నారు. అసలు లోకేష్ రాజకీయాలకు పనికి రాడనీ, హెరిటేజ్‌లో పాలు, కూరగాయలు అమ్ముకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. వరుస అరెస్టులతో టీడీపీ నేతల్లో గుబులు పట్టుకుందని, జేసీ, అచ్చెన్నాయుడుతో అరెస్టులు ఆగవన్నారు. అవినీతిపరులు, అక్రమార్కులు జైలుకు వెళుతూనే ఉంటారన్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దూసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలన్నింటికీ ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. మరో 30 సంవత్సరాలు సీఎంగా వైఎస్ జగన్ కొనసాగుతారని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ పీరా, బీసీ సెల్ జిల్లా నాయకులు శివయ్య, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, ప్రముఖ న్యాయవాది బుసా సుధీర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గురు ప్రసాద్ యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు భీమలింగ, శామ్యూల్, మైనార్టీ జిల్లా నాయకులు జీఎం బాషా, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల జోలికి వెళ్లే పతనమయ్యావ్!
అనంతపురం: ‘ఒకసారి పోలీసుల జోలికి వెళ్లి రాజకీయంగా పతనమయ్యావు. అయినా నీలో మార్పు రాలేదంటే ఇక శాశ్వతంగా రాజకీయ సమాధి కడతారు’ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామంటూ జేసీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మాధవ్ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడే క్రమంలో అమరులైన పోలీసువీరులకు గౌరవ సూచికంగా తన బూట్లను ముద్దాడుతున్నానని చెబుతూ బూటును ముద్దు పెట్టుకున్నారు. విచక్షణ లేకుండా పోలీసులతో బూట్లు నాకించుకుంటామని జేసీ దివాకర్‌రెడ్డి అంటే పక్కనే ఉన్న మాజీ సీఎం చంద్రబాబు దుర్యోధనుడిలా నవ్వారని మండిపడ్డారు. చంద్రబాబు తలలో వెంట్రుకలు, గడ్డం నెరిసినా ఆయన వైఖరిలో మార్పు రాలేదన్నారు. దివాకర్‌రెడ్డిని మందలించి ఉంటే ప్రజలు హర్షించేవారన్నారు. -
పోలీసు బూట్లను ముద్దాడిన మాధవ్
-
వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
-
బ్లాక్‌లిస్ట్‌లోని వేమూరికి కాంట్రాక్టా?
సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్ గ్రిడ్ ఒక మాయ అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో సోమవారం ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రూ.149 రూపాయలకే కనెక్షన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఎక్కువ వసూలు చేసిందని ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్‌పై అనేక ఆరోపణలున్నాయని, విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫైబర్ గ్రిడ్‌ను చేపట్టిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌పై ఈవీఏం ట్యాంపరింగ్ కేసు ఉందని, అతను బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్‌ను అతనికి ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఈ పథకం కింద నాసిరకం సెటప్ బాక్స్‌లు సరఫరా చేశారన్న ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలన్నింటిపైనా ఎంక్వైరీ చేసి విచారణ జరపాలని కోరారు. దీనికి ఐటీ మంత్రి గౌతంరెడ్డి సమాధానమిస్తూ.. ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై అనేక ఆరోపణలున్నాయని,బెంగుళూరులో రూ.1200కు ఇస్తున్న సెటప్ బాక్స్‌లను ఏపీలో రూ. నాలుగువేలకు ఇస్తున్నారని పేర్కొన్నారు. టెండర్ సమయంలో సెంటర్ విజిలెన్స్ గైడ్‌లైన్స్ కూడా పాటించలేదని తెలిపారు. ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై జరిగిన అవకతవకలపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరుపుతోందని, ఈవిచారణలో అన్ని నిజాలు బయటపడతాయన్నారు. పోలవరం అంచనాలపై చర్చ రూ. 16వేల కోట్ల నుంచి 55 వేల కోట్లకు పోలవరం ప్రాజెక్టు అంచనాలను ఎలా పెంచారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ శాసనమండలిలో ప్రశ్నించారు. ఈ అంశంపై జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పోలవరంలో ఈపీసీ నుంచి 60సీకి ఇచ్చే అవకాశం లేదన్నారు.చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్వాసితులపట్ల కనీసం దృష్టి పెట్టలేదని విమర్శించారు. డ్యాం కడితే సరిపోదని, నిర్వాసితులను ఆదుకోవాలని, అది తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. పోలవరం కాపర్ డ్యాం పూర్తయితే.. 18వేల కుటుంబాలు ఇబ్బంది పడతాయని, కనీసం ఆ కుటుంబాలకు గత ప్రభుత్వం నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనులు మొదలుపెడుతుందని వెల్లడించారు. పోలవరం కోసం తెచ్చిన ఏ మెటీరియల్ విషయంలోనూ ఆడిట్ చేయలేదని, పోలవరంలో జరిగిన అవకతవకలపై వారం రోజుల్లో సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుందన్నారు. పోలవరాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని, దానిని సీఎం వైఎస్ జగన్ పూర్తి చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని జన్మలెత్తినా తెలుగుదేశం పార్టీ మాత్రం మరోసారి అధికారంలోకి రాదని అన్నారు. -
ఏయే శాఖల్లో ఎన్ని అప్పులు తీసుకున్నారు?
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ..అత్యంత జాగరూకతతో కొత్త ప్రభుత్వం అడుగులు వేయాలని సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 86 వేల కోట్ల నుంచి 2 లక్షల 14 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లోకి నెట్టిందని పేర్కొన్నారు. అదే విధంగా ఏయే శాఖల్లో అప్పులు ఎందుకు తీసుకున్నారోనన్న అంశంపై కొత్త ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఫైబర్‌గ్రిడ్ సహా అన్ని శాఖల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై కూడా విచారణకు ఆదేశించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించి రాష్ట్రాన్ని ఆదర్శ ఆంధ్రప్రదేశ్‌గా మలిచే విధంగా పని చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ ప్రకటించిన నవరత్నాలకు విశేష ప్రజాదరణ లభించిందని, వాటితో పాటు విభజన హామీల అమలు సాధించుకునేలా కృషి చేయాలన్నారు. అవినీత పాలన వల్లే చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశారని పేర్కొన్నారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించేలా వ్యవహరించి అధికారానికి దూరమయ్యారని విమర్శించారు. -
కత్తుల చంద్రయ్య
పార్టీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నాడు చంద్రబాబు. చంద్రబాబు నవ్వితే నవ్వుదాం అని చూస్తున్నారు కార్యకర్తలు. కానీ ఆయన నవ్వడం లేదు. ‘‘మిమ్మల్ని మీరు మోసం చేసుకుని, పార్టీని, నన్ను మోసం చేయకండి’’ అన్నాడు చంద్రబాబు కోపాన్ని ఆపుకుంటూ! ‘నువ్వు చేశావా, నువ్వు చేశావా.. బాబు గారిని నువ్వు చేశావా మోసం..’ అని కార్యకర్తలు ముఖాలు చూసుకున్నారు. వాళ్ల ముఖాల్ని చూసిన చంద్రబాబు.. ‘‘అమాయకత్వం నటించకండి. నాకు అన్నీ తెలుసు. ఎవరికి ఎవర్నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయో, ఎవరు వెళ్లి ఎవర్ని కలుస్తున్నారో, ఎవరు దేనికి ఆశపడుతున్నారో.. అన్నీ తెలుసు. ఆ పనులన్నీ మానండి. ఎవరి మాటలూ వినకండి. మనమే గెలుస్తాం. మన తరఫున ప్రచారానికి ఉత్తరాది నుంచి స్టార్ లీడర్లని రప్పిస్తున్నాం. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా కూడా రాబోతున్నారు. పవన్ ఆల్రెడీ మనకు ప్రచారం చేస్తున్నాడు. కేఏ పాల్నీ ప్రచారానికి ఒప్పిస్తున్నాం’’ అన్నాడు. ‘వపన్ ఉన్నాడు కదా, మళ్లీ పాల్ ఎందుకు, ఒక ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా?’’ అన్నాడో కార్యకర్త. ‘‘రెండు కాదు, మూడు కత్తులు..’’ అన్నారెవరో. ‘‘ఎవరు ఆ మూడో కత్తి?!’’ ఈ ప్రశ్న వేసిన కార్యకర్త నెత్తిపైన టప్ మని మొట్టిక్కాయ కొట్టాడు పక్కనున్న కార్యకర్త. ‘‘లోకేశ్‌బాబు కత్తి కాదనుకున్నావురా. బాలయ్యబాబు కంటిచూపుతో చంపేస్తే, లోకేశ్‌బాబు సింగిల్ వర్డ్‌తో చంపేస్తాడు’’ అన్నాడు. చంద్రబాబు కల్పించుకున్నాడు. ‘‘అదే నేను చెప్పేది. మనం ఇక్కడ కొట్లాడుకుంటూ ఉంటే అక్కడ జగన్‌కు ఓట్లు పడతాయి. మన ఒర చిన్నదేం కాదు. ఎన్ని కత్తులైనా పడతాయి. పవను, పాల్, లోకేశే కాదు.. ఇంకో ముప్పై కత్తుల్ని రెడీ చేశా. జగన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ కత్తులు ఏసేస్తాయి. నా కత్తి, లోకేశ్ కత్తి ఒకవేళ ఒరలో ఇరుక్కుపోయినా వంగవీటి రాధా కత్తి, యమనల కత్తి, మురళీమోహన్ కత్తి, బాలకృష్ణ కత్తి, జూపూడి కత్తి.. జగన్ జనంలోకి వెళ్తున్నప్పుడు ఏసేస్తాయి! అక్కడ తప్పించుకున్నాడనుకో.. రాజేంద్రప్రసాద్ కత్తి, బుద్ధా వెంకన్న కత్తి, కాకి గోవిందరెడ్డి కత్తి, వర్ల రామయ్య కత్తి, దివ్యవాణి కత్తి.. జగన్ సరిగ్గా జనం మధ్యలో ఉన్నప్పుడు ఏసేస్తాయి! అక్కడా తప్పించుకున్నాడనుకో.. మిగతా ఇరవై కత్తులు జగన్ జనం కన్నీళ్లు తుడుస్తున్నప్పుడో, జనం తల నిమురుతున్నప్పుడో వెనగ్గా వెళ్లి ఏసేస్తాయి..’’ అని చెప్పాడు చంద్రబాబు. అప్పుడు కనిపించింది కార్యకర్తలకు చంద్రబాబు కళ్లల్లో నవ్వు! ‘‘మరి ఆ ముప్పై మందిలో మా ఫేవరేట్ కత్తి లేదా?’’ అని పెద్దగా అరిచారు యువ కార్యకర్తలు కొందరు. ‘‘నాకు అర్థమైంది తమ్ముళ్లూ.. యామిని కత్తి గురించే కదా మీరు అడుగుతున్నదీ. రెండో లిస్టు కత్తుల్లో ఆమె పేరూ ఉంటుంది. అన్నీ నేను చూసుకుంటా’’ అని హామీ ఇచ్చాడు. యువ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ‘‘తమ్ముళ్లూ.. మీ పక్కన పెద్దవాళ్లు కూడా కూర్చొని ఉన్నారు. కాస్త చూసుకుని ఉత్సాహం ప్రదర్శించండి’’ అన్నాడు చంద్రబాబు. యువ కార్యకర్తలు పక్కకు చూసి, నాలుక కరుచుకున్నారు. ‘ఈ’పేపర్ ఓనరు, ‘ఆ’పేపర్ ఓనరు కూర్చొని ఉన్నారు! ‘‘వీళ్లెందుకు వచ్చార్రా’’ అని గొణుక్కున్నాడు ఓ యువ కార్యకర్త. ‘‘పార్టీ కార్యకర్తల టెలికాన్ఫరెన్స్‌కి వీళ్లు రాకపోతే ఎవరొస్త్రారా.. నోర్మూసుకుని కూర్చో’’.. అని యువ కార్యకర్త డొక్కలో పొడిచాడు పక్కనున్న కార్యకర్త. – మాధవ్ -
ఇంటర్వ్యూ రచన
‘‘నమస్కారం సార్.. పాత్రికేయ భీష్ముడు, పద్మశ్రీ అవార్డు గ్రహీతగారి ఇల్లు ఇదేనా?’’ ‘‘ఎవరయ్యా నువ్వు? పిల్లకాకిలా ఉన్నావ్. పితృకాకిలా మా ఇంటికే వచ్చి ‘కావ్’ మంటున్నావ్?’’ ‘‘అంటే.. పాత్రికేయ భీష్ముడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మీరేనా సార్?!’’ ‘‘ఆంధ్రాకి వచ్చావ్. విజయవాడ వచ్చావ్. మా ఇంటికి వచ్చావ్. నన్నే ‘మీ ఇల్లు ఇదేనా? అని అడుగుతున్నావ్! నువ్వెవరు, ఎందుకొచ్చావ్, ఎక్కడి నుంచి వచ్చావ్?’’ ‘‘జర్నలిస్టుని సార్. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను’’ ‘‘ముందు ఆ లాగూ పైకి లాక్కో. జారిపోతోంది. నువ్వు జర్నలిస్టు ఏంటి, నన్ను ఇంటర్వ్యూ చెయ్యడం ఏంటి? పిల్లబిత్తిరిలా ఉన్నావ్! నా వయసెంతో తెలుసా? దగ్గరదగ్గర నైన్టీ. నిన్ను చూస్తే నైంటీ నైన్లో పుట్టినట్టున్నావ్. జర్నలిజం ఎప్పుడు చేశావ్, జర్నలిస్టుగా ఎక్కడ చేస్తున్నావ్?’’ ‘‘మీరు ఏమీ అనుకోకపోతే ముందు నా లాగూ సంగతి చెప్తా సార్. అది లాగూ కాదు. షార్ట్. అది జారిపోవడం లేదు. లో వెయిస్ట్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యడానికి కంఫర్ట్‌గా ఉంటుందని వేసుకొచ్చా’’ ‘‘సర్లే, ఏ పేపర్లో చేస్తున్నావ్?’’ ‘‘ఎక్కడా చెయ్యట్లేదు. పౌర పాత్రికేయుడిని. సిటిజన్ రిపోర్టర్ సార్ నేను. ప్రజల్లోకి వెళ్తాను. ప్రజల్లోకి వెళ్లేవాళ్లతో వెళ్తాను. ప్రజా సమస్యల గురించి రాస్తాను’’ ‘‘మరి నా దగ్గరికి ఎందుకొచ్చావ్? నేనూ ఒక ప్రజా సమస్యనేనని చెప్పారా నీ ప్రజలెవరైనా?’’ ‘‘కోప్పడకండి సార్. మీ రచనలంటే నాకు ఇష్టం. ఈమధ్య ‘ఆ’ పేపర్లో మీ రచనలు రెండు చదివాను. నిన్న వచ్చిన పెద్ద రచన ఒకటి, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన వెంటనే మీరు చేసిన రచనొకటి. చాలా రోజుల తర్వాత రచించినట్లున్నారు’’ ‘‘నీ బొంద. అవి రచనలు కాదు. ఇంటర్వ్యూలు. నేను సీనియర్ జర్నలిస్టుని. సీనియర్ జర్నలిస్టు ఇంటర్వ్యూలు ఇస్తాడు. రచనలు చెయ్యడు.’’ ‘‘కానీ ఇంటర్వ్యూలనే మీరు భలే రచించారు సార్.’’ భీష్మ పాత్రికేయుడికి ఆ పౌర పాత్రికేయుడి మీద డౌట్ కొట్టింది. ‘‘భలే రచించానా? అందులో నీకేం భలేగా అనిపించిందో చెప్పు’’ అన్నాడు. ‘‘ఇప్పటివరకు 18 మంది సీఎంలతో సన్నిహితంగా మెలిగారు సార్ మీరు. అది నచ్చింది. సన్నిహితంగా మెలిగారూ అంటే.. ఆంధ్రరాష్ట్ర తొలి సీఎం నుంచి నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు వరకు.. మీరు వాళ్లందరితో కలిసి డిన్నర్ కూడా చేసి ఉంటారు. అది నచ్చింది. ఈ తొంభై ఏళ్ల వయసులో నాకు ఆశలేమీ లేవు అన్నారు. అది నచ్చింది’’ ‘‘ఇంకా..’’ ‘‘ఆ.. ఇంకా ఏంటంటే.. కారు నడపడంలో అనుభవం లేనివాడిని తీసుకొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడితే ఏం జరుగుతుందో.. పాలనలో కూడా అదే జరుగుతుంది అన్నారు. అది కూడా నచ్చినట్లే ఉంది.’’ ‘‘నచ్చినట్లే ఏంటి.. నచ్చలేదా?’’ ‘‘అంటే నచ్చలేదనే చెప్పాలి సార్’’ పాత్రికేయ భీష్ముడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భ్రుకుటి ముడివేశాడు. ‘‘సీఎం కావాలంటే సీఎం అయి ఉండాలి అన్నట్లుంది సార్ మీ రచన. ప్రకాశం పంతులు, చంద్రబాబు, మధ్యలో పదహారు సీఎంలు.. వీళ్లంతా సీఎం అయ్యాకే సీఎం అయ్యారా సార్! 18 మంది సీఎంలతో క్లోజ్‌గా తిరిగిన మీకు ఇంత చిన్న విషయం తెలీ లేదా సార్. ఎమ్మెల్యే అవాలంటే ఎమ్మెల్యే అయి ఉండాలని, ఎంపీ అవ్వాలంటే ఎంపీ అయి ఉండాలని, మంత్రి అవ్వాలంటే మంత్రి అయి ఉండాలి అన్నట్లే ఉంది సార్ మీ రచనంతా. డ్రైవింగ్ రాకుండానే లోకేశ్‌బాబు ఎమ్మెల్సీ అవలేదా! డ్రైవింగ్ రాకుండానే లోకేశ్‌బాబు మంత్రి అవలేదా! డ్రైవింగ్ రాకుండానే ఇప్పుడు లోకేశ్‌బాబు ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదా? డ్రైవింగే రాని లోకేశ్‌బాబు ఇన్ని చేస్తున్నప్పుడు.. ఎంపీగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గాల ప్రజల్ని డ్రైవ్ చేసిన యువకుడు, ప్రతిపక్ష నేతగా రాష్ట్రాన్ని డ్రైవ్ చేసిన నాయకుడు సీఎం కాకూడదని మీరెందుకు సార్ రచనలు చేస్తున్నారు!!’’ అన్నాడు పౌరపాత్రికేయుడు. పాత్రికేయ భీష్ముడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బిత్తరపోయాడు. ‘‘వాళ్లందరూ కాదు సారు. మీరు చెప్పండి. జర్నలిస్టు అయి ఉండబట్టే మీరు జర్నలిస్టు అయ్యారా’’.. అడిగాడు పౌరపాత్రికేయుడు. పాత్రికేయ భీష్ముడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత తత్తరపడ్డాడు. – మాధవ్ -
టీవీ పౌరులు
పట్టపగలు టీవీలో ఒకాయన రాష్ట్ర పౌరులకు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు! ఆయన ముఖంలో ఎమోషన్ ఉంది. మాటల్లో స్లో మోషన్ ఉంది. మాట్లాడినంతసేపు మాట్లాడి.. ‘‘ఇక ఈ రాష్ట్రాన్ని చంద్రబాబే కాపాడాలి’’ అన్నాడు! ‘ఎవరాయన మాట్లాడుతున్నది..’ అని టీవీ చూస్తున్న పౌరులకు సందేహం కలిగింది. అప్పటి వరకు టీవీ దగ్గర లేని ఒక పౌరుడు టీవీ దగ్గరకు వచ్చి, ‘‘అరె! మాట్లాడుతున్నది చంద్రబాబు కాదా! చంద్రబాబు అనుకున్నానే..’’ అన్నాడు. అక్కడితో ఊరుకోలేదు.. ‘‘ఈ రాష్ట్రాన్ని చంద్రబాబే కాపాడాలి’ అని చంద్రబాబే ఎందుకంటున్నాడబ్బా అనుకుని వచ్చాను’’ అన్నాడు. అక్కడితోనూ ఊరుకోలేదు. ‘‘ఎవరీయన.. మాట్లాడుతున్నదీ’’ అన్నాడు. పక్కనే ఉన్న పౌరుడు స్పందించాడు. ‘‘టీవీ చూస్తున్న మేమే ఈయనెవరో తెలియక చానళ్లు మారుస్తున్నాం. టీవీ చూడకుండా ఈయన చంద్రబాబు అయి ఉంటాడని ఎందుకనుకున్నావ్?’’ అన్నాడు.. గొప్ప అప్రీసియేషన్తో. ‘‘అప్పుడా మధ్య టీవీలో చంద్రబాబు వరుసగా రోజుకొక్క శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఇలాగే.. స్లో మోషన్లో గంటలు గంటలు మాట్లాడారు. ఆ వాయిస్ గుర్తొచ్చి, మళ్లీ ఇంకో స్లో మోషనేమోనని బయటికి వచ్చా..’’ అన్నాడు ఆ పౌరుడు. టీవీలో ఆ ఆకస్మిక అపరిచితుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ‘నిజమే. చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఆ నాలుగు రోజులూ మాట్లాడిన టోన్‌లోనే ఈయనా స్లోగా మాట్లాడుతున్నాడు..’ అనుకున్నారు అక్కడున్న టీవీ పౌరులు. ‘‘గురూ గారూ.. చేశానని చెప్పుకునేటప్పుడు స్లో మోషన్లో, చేస్తానని చెప్పుకునేటప్పుడు రైజింగ్ మోషన్లో చంద్రబాబు ఎందుకు మాట్లాడతారంటారూ.. పాలిటిక్స్‌లో అదేమైనా టాక్టికా..’’ అని పౌరుల్లో ఒకరు డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశారు. ‘‘చేయంది చేశానని చెప్పడానికి మనస్సాక్షి ఒప్పుకోదు. అందుకే స్లో మోషన్. చేయలేనిది చేస్తానని చెప్పకపోతే ఎలక్షన్లు ఊరుకోవు. అందుకే రైజింగ్ మోషన్’’ అన్నాడు చంద్రబాబును రెగ్యులర్‌గా ఫాలో అవుతుండే పౌరుడొకడు. టీవీలో ఆ మనిషింకా మాట్లాడుతూనే ఉన్నాడు. ‘‘చంద్రబాబే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి’’ అంటున్నాడు. ‘‘దేని గురించి మాట్లాడుతున్నాడు’’ అని టీవీకి దగ్గరగా జరిగారు పౌరులు. ‘‘చంద్రబాబు తప్ప, ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు’’ అంటున్నాడు అపరిచితుడు. పౌరులు డిస్కషన్లో పడ్డారు. చంద్రబాబు తిరుపతి నుంచి వచ్చేవరకు టెంపో పడిపోకుండా ఉండడానికి అతడు మాట్లాడుతున్నాడని వాళ్లకు అర్థమైంది. -మాధవ్ -
‘కేంబ్రిడ్జ్ అనలిటికా కంటే పెద్ద స్కాం’
సాక్షి విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు రుణమాఫీ మాత్రం జరగలేదుగానీ ఓట్లమాఫీ మాత్రం జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీకి కేవలం ఐదులక్షల ఓట్లు మాత్రం తేడా ఉన్నాయని, వాటిని తొలగించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐటీగ్రిడ్స్ స్కాం కేంబ్రిడ్జ్ అనలిటికా కంటే పెద్ద కుంభకోణమని విమర్శించారు. ఏమీ తప్పుచేయని చంద్రబాబు గుమ్మడికాయ దొంగాల భుజాలెందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఐటీగ్రిడ్స్ సీఈవోను తెలంగాణ పోలీసులకు అప్పగించాలని మాధవ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు వివేకం కోల్పోయి.. దిగజారుడు తనానికి పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందని, ప్రజల వ్యక్తిగత జీవితాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని హితవుపలికారు. ఐటీగ్రిడ్స్ సంస్థ ప్రజల డేటాను ఎవరికిచ్చిందో విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు. -
‘మోదీ కల ఉచిత ఇల్లు.. చంద్రబాబు కల అద్దె ఇల్లు’
సాక్షి, అమరావతి : ఏపీకి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది లక్షలకు పైగా ఇళ్లను కేటాయిస్తే.. టెక్నాలజీ పేరుతో చంద్రబాబు నాయుడు వాటిలో కూడా అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. పేదలకు ఉచిత ఇల్లే నా కల అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్తుంటే.. పేదలకు అద్దె ఇల్లే నా కల అని చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కట్టే ఇళ్లల్లో గాలి, వెలుతురు సరిగా రావడం లేదన్నారు. బుధవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో మాధవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ చేత కూడా అబద్దాలు చెప్పించిందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీసీలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ విషయం గురించే మరిచిపోయారని విమర్శించారు. రుణమాఫి చేయకుండా ఎన్నికల వేళ డ్వాక్రా మహిళలకు రూ. 10వేలు ఇస్తూ మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వృద్ధుల పెన్షన్లు రూ.1000 నుంచి రూ.2000 పెంచాలని ఎన్నికల రోజుల్లో గుర్తొంచిందా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి సింహభాగం నిధులు కేంద్రం కేటాయించిదని చెప్పారు. ఐదేళ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం చేయని చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
అమరావతి: శాసనమండలిలో గందరగోళం
-
ప్రధాన దోషి చంద్రబాబే
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి హోదా రాకపోవడానికి ప్రధాన దోషి ముఖ్యమంత్రి చంద్రబాబేనని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తప్పుబట్టారు. ప్రత్యేక హోదా వద్దంటూ.. ప్యాకేజీ అడిగింది చంద్రబాబు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుపై మండలిలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో బీజేపీ, టీడీపీ సభ్యులు పోటాపోటీ విమర్శలు చేసుకోవడంతో ఘర్షణ పూరిత వాతావరణం కొనసాగింది. రాష్ట్రానికి హోదా, నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు చర్చను ప్రారంభించారు. చర్చలో మాధవ్ మాట్లాడుతూ.. హోదా పదిహేనేళ్లు కావాలని అడిగిన చంద్రబాబు మరి ప్యాకేజీ ఎందుకు అడిగారని ప్రశ్నించారు. అదే సమయంలో టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి మాధవ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్సీలు మాధవ్, వీర్రాజులు కూడా వెల్‌లోకి దూసుకెళ్లారు. ఒక దశలో టీడీపీ ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణరాజు(పాందువ్వ శ్రీను), బీదా రవిచంద్రలు వీర్రాజు, మాధవ్‌లపై కలబడే ప్రయత్నం చేశారు. దీంతో రాము సూర్యారావు, పయ్యావుల కేశవ్, బుద్దా వెంకన్నలు జోక్యం చేసుకుని సర్ధిచెప్పారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఇన్చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం స్పందిస్తూ సభ్యులు సభా సంప్రదాయాలు పాటించాలని సూచించారు. అనంతరం మాధవ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. లోటు బడ్జెట్ భర్తీకి కేంద్రం నిధులు ఇచ్చిందని, రాజధాని చుట్టూ జరిగిన అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలతో సహా బయటపెడతామన్నారు. మాధవ్ ప్రసంగిస్తుండగా.. మంత్రులు యనమల రామకృష్ణుడు, ఎన్ఎండీ ఫరూక్, సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్, పయ్యావుల కేశవ్ తదితరులు అడ్డుతగలడంతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ తీరు వల్లే ప్రధాన ప్రతిపక్షాన్ని సభలో లేకుండా చేశారని, మా ఇద్దర్ని కూడా ఉండనివ్వరా? అని ప్రశ్నించారు. చంద్రబాబును మట్టి పిసుక్కోమని ప్రధాని మోదీ కుండలో మట్టి, నీళ్లు తెచ్చి ఇచ్చారని, పాపులు తిరిగే పార్లమెంటులో మట్టి, కలుషితమైన గంగానది నీళ్లు తెచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాకౌట్.. తీర్మాన ప్రతుల చించివేత ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని ఆరోపిస్తూ శాసనమండలిలో ప్రభుత్వం చేసిన తీర్మానం ప్రతులను బీజేపీ ఎమ్మెల్సీలు చించి సభ నుంచి వాకౌట్ చేశారు. పోలవరం వైఎస్ ప్రారంభించారు.. బాబుకు మాట్లాడే హక్కులేదు పోలవరం ప్రాజెక్టు పనుల్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించి కాల్వలు తవ్విస్తే, దానికి నాలుగు గొట్టాలు పెట్టి ఆ ప్రాజెక్టును తానే చేపట్టానని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్‌లు ఎద్దేవా చేశారు. గతంలో అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో ఎప్పుడూ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రస్తావించలేదని శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు విమర్శించారు. కేంద్రం నిధులు విడుదల చేస్తుంటే వాటితో లోపభూయిష్టంగా పనులు చేయిస్తూ రూ.కోట్ల నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రూ.1100 కోట్ల విలువైన స్పిల్ వే పనుల విలువను రూ.1400 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారని ఆరోపించారు. రైతులకు ఎకరాకు రూ.29 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటే రూ.59 లక్షలు చెల్లించారన్నారు. ఈ ప్రాజెక్టు ప్రతీ టెండరులో నిర్మాణ సంస్థలతో చంద్రబాబు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని చెప్పారు. ప్రాజెక్టుపై అవసరమైన వివరాలు ఇచ్చేందుకు తాము సిద్ధమని, ముఖ్యమంత్రి సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఉపాధి హామీ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, రూ.16 వేల కోట్ల మట్టి పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు. -
‘జై తెలుగుదేశం వెబ్ పేజీపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీకి చెందిన జై తెలుగుదేశం వెబ్ పేజీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సోషల్ మీడియా ద్వారా బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డీజీపీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జై తెలుగుదేశం వెబ్ పేజీలో బీజేపీ జాతీయ యువ మోర్చా అధ్యక్షురాలు పూనమ్ మహాజన్‌పై కథనాలు వస్తున్నాయని, పూనమ్ మహాజన్ వాట్సాప్ చాటింగ్ పేరుతో పోస్టింగులు.. వైఎస్సార్ సీపీ నేతల నుంచి పూనమ్ మహాజన్ డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు విస్తృతంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. బీజేపీ-వైఎస్సార్ సీపీలు కలిసి పని చేస్తున్నాయంటూ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు పర్యటనలో నిరసనలకు సీఎం పిలుపునిచ్చారని అన్నారు. సీఎం పిలుపు నేపథ్యంలో ఏపీ పోలీసులు ప్రధానికి ఏ మేరకు భద్రత కల్పిస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు. అమిత్ షాపై తిరుపతి వద్ద జరిగిన దాడి ఘటనలో పోలీసుల పాత్ర ఏమిటో అందరికీ తెలుసునన్నారు. -
అగ్రిగోల్డ్ ఆస్తుల విలువపై అనుమానాలు: బీజేపీ
విశాఖపట్నం: అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ లెక్కింపులో అనుమానాలున్నాయని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో విష్ణుకుమార్ రాజు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య నాలుగేళ్లుగా నలుగుతోందని అన్నారు. బాధితులకు ఉపశమనం లేకపోగా..రాను రానూ మనోధైర్యం కోల్పోతున్నారని బాధ వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు బయటకు రాక ముందు కొంతమంది రాజకీయ నేతలు, వారి బినామీలపైన కొనుగోలు చేసిన మాట వాస్తవమని చెప్పారు. అందుకే అగ్రిగోల్డ్ ఆస్తుల అసలు విలువ ఎంతో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మన ముఖ్యమంత్రి హైటెక్ ముఖ్యమంత్రని, ఫిన్‌టెక్ కోసం వచ్చారు కానీ అగ్రిగోల్డ్ బాధితుల గోడు వినడానికి మాత్రం రాలేదని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ కేసుకు మూడున్నరేళ్లు: ఎమ్మెల్సీ మాధవ్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేటికి మూడున్నర ఏళ్లు అయినా అతీగతీ లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. రిలయన్స్, ఎస్ఎల్ గ్రూప్ కంపెనీలు వారి వద్ద అతిచౌకగా కమిషన్లను కొట్టే కుట్ర జరగడం వల్ల వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. ప్రభుత్వ కుట్రను బయట పెట్టడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు నిరసన దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానం ద్వారా సీబీఐ విచారణ కోరతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ప్రధాని మోదీపై బాబు వ్యాఖ్యలు అత్యంత హేయం!
సాక్షి, విశాఖపట్నం : తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలను కూడా అట్టహాసంగా ప్రచార ఆర్భాటంలా చేస్తూ.. ప్రధాని మోదీను దోషిగా నిలబెట్టేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ ఏపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ప్రధాని మోదీపై చంద్రబాబు వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయిని దిగజార్చి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వెంటనే సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ పర్యటించలేదని, తుఫాను సాయాన్ని కేంద్రం అడ్డుకుంటోందన్న సీఎం వ్యాఖ్యలు వాస్తవం కాదన్నారు. తుఫాను వచ్చిన వెంటనే బీజేపీ ఏపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామని, ఆ నివేదిక ప్రధానికి కూడా అందజేశామని చెప్పారు. తుఫాను బాధితులకు అందించిన సాయాన్ని పెద్ద పెద్ద హోర్డింగ్స్ రూపంలో బాబు ప్రచారం చేసుకోవటాన్ని ప్రజలు తిట్టుకుంటున్నారని విమర్శించారు. తుఫాను సాయం పచ్చజెండా పట్టుకొని.. పచ్చ కండువాను కప్పుకున్నవారికే అందుతోందని విమర్శించారు. పార్టీలకతీతంగా తుఫాను బాధితులకు సహాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలాస వంటి ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి టాంకర్లు మాత్రమే తిరగాలని నిబంధన విధించడం నీచమైన ఆలోచన మండిపడ్డారు. తిత్లీ తుఫాను బాధితులను కేంద్రం ఉదారంగా ఆదుకుంటోందని, తల్చేర్-కోలార్ విద్యుత్ లైన్ పునరుద్ధరించి 24 గంటల్లో విద్యుత్‌ను కేంద్రం అందించిందన్నారు. రాజాం-పలాస 400 కేవీహెచ్‌వీ లైన్‌ను రేపటికల్లా పునరుద్ధరిస్తామన్నారు. రేపు కేంద్ర హార్టికల్చర్ బోర్డ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని, జీడీ, కొబ్బరి, వంటి పంట నష్టాలను పరిశీలిస్తుందని తెలిపారు. -
ఖాకీ డ్రస్ తీసేసి రా..!
అనంతపురం టౌన్: ‘రేయ్.. సీఐ మాధవ్! కొజ్జాలు అన్నందుకు నా నాలుక కోస్తానంటావా? సినిమాల్లో సాయికుమార్‌లా మీసాలు తిప్పుతావా? నన్ను బెదిరించేంత మగాడివా? రేయ్.. ఖాకీ డ్రస్ విప్పేసిరా! నేను వస్తా. నీది నిజమైన మీసం అయితే చెప్పురా! ఆడ, మగ కానివాళ్లకు కూడా మీసాలున్నాయమ్మా. ఈ మహానుభావుడు (మాధవ్) జైల్లో చిప్పకూడు తిని వచ్చాడు. నా చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో గుర్తు తెచ్చుకో! నాకైతే గుర్తులేదు. పారిపోతే.. కొజ్జానే! ఏయ్ మాధవ్.. ఈ నెల 25 వరకూ అనంతపురంలోనే ఉంటా. ఎక్కడికి రావాలో చెప్పు. మీ ఊరికి రావాలా? అనంతపురం టవర్‌క్లాక్ వద్దకు రావాలా? ఏ ప్లేస్ చెబితే అక్కడికి వస్తా. వచ్చి నా నాలుక కోయి.. అవసరమైతే అప్పటి వరకూ కత్తికి పదును పెట్టుకో. పారిపోయే వారిని రాయలసీమతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా కొజ్జాలనే అంటారు. కాబట్టి పోలీసులు కొజ్జాలే! వారితో పాటూ నేనూ కొజ్జానే! దివాకర్‌రెడ్డి అంటే ఇప్పటి వరకూ సింహమనో, నెత్తిన కొమ్ములు వచ్చాయనో అంతా అనుకునేవారు. ఆర్నెల్లలో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా. ఈ సమయంలో కొజ్జా జాతిలో చేరిపోయానని బాధపడుతున్నా...!’ శుక్రవారం అనంతపురంలోని తన నివాసంలో విలేకరులతో సమావేశం సందర్భంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలివీ. కోర్టునూ ఆశ్రయిస్తా... కొజ్జా అనేది అన్‌పార్లమెంటరీ పదమైతే పాదాలపై పడి క్షమాపణ చెబుతానని జేసీ పేర్కొన్నారు. అయినా పోలీసు అధికారుల సంఘమనేది లేదన్నారు. వారు ఆ పేరు పెట్టుకోవడంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. ‘ప్రబోధానంద స్వామి ఆశ్రమానికి చెందిన భక్తులు ప్రజలపై విచక్షణా రహితంగా దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు పారిపోయారు. వారితో పాటు నేనూ పారిపోయా. గొడవ జరిగితే ఎదుటి వారు రాయివేస్తే మనం అడ్డుగానైనా నిలబడాలి. అలా కాకుండా పారిపోయే వారిని ఎక్కడైనా కొజ్జాలనే అంటారు’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరికీ సంఘాలున్నాయి, మాకు మాత్రం (ఎంపీ, ఎమ్మెల్యే) సంఘాలు లేవు అని జేసీ వ్యాఖ్యానించారు. ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు ప్రబోధానంద ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని జేసీ ఆరోపించారు. ‘మహిళలు పడక పంచుకోవాలనే రీతిలో వాడు (ప్రబోధానంద) వ్యవహరిస్తున్నాడు. రావణబ్రహ్మ అంట! హిందూ దేవుళ్లను అసభ్యంగా దూషిస్తున్నారు. అక్కడున్న వారికి నకిలీ ఆధార్‌కార్డులు, ఓటర్, రేషన్‌కార్డులు సృష్టించారు. అక్కడున్న అత్యాధునిక ప్రింటింగ్ మిషన్‌లో ఇవన్నీ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశా. వీడు డేరాబాబా కంటే దారుణమైన బాబా’ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీఐ మాధవ్‌పై తాడిపత్రి స్టేషన్లో జేసీ ఫిర్యాదు తాడిపత్రి: సీఐ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ పోలీస్ అధికారిలా కాకుండా వీధి రౌడీలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపులకు దిగిన సీఐపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. -
నాలుగో సింహం జోలికొస్తే నాలుక కోస్తాం
అనంతపురం సెంట్రల్: శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలూ పనిచేసే పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే నాలుక కోస్తామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి పోలీసు అధికారుల సంఘం నాయకులు హెచ్చరించారు. గురువారం అనంతపురంలోని పోలీసు అధికారుల సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్ విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాజకీయ నాయకులు అదుపుతప్పి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతుండడం బాధాకరమన్నారు. కొంతమంది రాజకీయ నేతలు పోలీసు వ్యవస్థను డిఫెన్స్‌లో పడేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇంత వరకూ సంయమనం పాటించామని.. ఇకనుంచి ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పోలీసులపై మాట్లాడితే కొమ్ములొస్తాయని భావిస్తే సహించబోమన్నారు. నాయకుల మాటలతో ఇళ్లలో భార్య, పిల్లలకు మొహాలు చూపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఉద్దేశించి కొజ్జాలు అని వ్యాఖ్యానించారని, మొగోళ్లమైనందునే పోలీసు వ్యవస్థలోకి వచ్చామని స్పష్టం చేశారు. ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర మీ ఇంటికొచ్చి తరిమిన చరిత్ర మర్చిపోయారా? జిల్లా ఎస్పీగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర మీ ఇంటికి వచ్చి తరిమిన చరిత్ర మరిచిపోయారా అని ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డిని ప్రశ్నించారు. సామాన్య ప్రజలకు భద్రత కల్పిస్తామని వ్యవస్థలోకి వచ్చామని, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే కాదన్నారు. ఒకరిద్దరు నాయకులు మాట్లాడినంత మాత్రాన పోలీసు వ్యవస్థ డిఫెన్స్‌లోకి పడిపోదని, తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. నాగరికమైన వ్యవస్థలో ఉన్నామనే భావనతోనే ఐపీఎస్ అధికారులు ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ తీసుకొచ్చారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ జేసీపై ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. పోలీసు అధికారుల సంఘం సంయుక్త కార్యదర్శి సూర్యకుమార్, ఈసీ మెంబర్లు హరినాథ్, మసూద్, బాలాజీ నాయక్ పాల్గొన్నారు. -
మంత్రి గంటా ఐఐఎంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి
-
‘టీడీపీలో తిరుగుబాటు’
సాక్షి, తిరుపతి: లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాసం విగిపోవడం ద్వారా టీడీపీకి గట్టి దెబ్బ తగిలిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరువును టీడీపీ నాయకులు బజారుకు ఈడ్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ మైత్రీ బంధానికి లోకసభ వేదికగా నిలిచిందన్నారు. త్వరలో టీడీపీలో తిరుగుబాటు మొదలవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌తో తమ పార్టీ కలిసి పనిచేయడం టీడీపీలోని సీనియర్ నాయకులకు ఇష్టం లేదని, అలాంటి వారందరూ తిరుగుబాటు చేయాడానికి సిద్ధమౌతున్నారని వెల్లడించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో గల్లా జయదేవ్ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేంద్ర ఆర్థికమంత్రికి సన్మానం, అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మోదీని నిందించాలనే టీడీపీ కుట్ర బెడిసికోట్టిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ వలలో చిక్కుకున్న పక్షి టీడీపీ అని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకను కప్పిపుచ్చుకోవడానికి తమపై బురదచల్లాలని చూశారని మాధవ్ ఆరోపించారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీ రాజీపడదని, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. తెలుగుజాతికి తలవంపులు తెచ్చేలా టీడీపీ ఎంపీలు లోక్‌సభలో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్ వల్లే పోలవరం పనులు: బీజేపీ ఎమ్మెల్సీ
సాక్షి, విశాఖ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏమైనా పనులు జరిగాయంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లనే అని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం పోలవరం నిర్మిస్తామంటే.. కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రాజెక్టు పనులు చేపట్టారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం పోలవరంలో ఏ పనులు పూర్తి చేయలేదన్నారు. అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దోపిడీతో పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇసుక దొరకని దుస్థితి ఏర్పడిందన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారని తెలిపారు. అమిత్ షా, గడ్కరీలు త్వరలో ఏపీలో పర్యటిస్తారని, అందుకు సంబంధించిన తేదీలు ఖరారు కానున్నాయన్నారు. ఆపరేషన్ గరుడా వంటివి భూటకమని, మిషన్ సౌత్ పేరుతో పార్టీ విస్తరించటానికి ఏడాది క్రితమే ప్రారంభమైంది. అయితే అక్రమ మార్గంలో కాదని, సంపర్క అభియాన్ కార్యక్రమం ద్వారా రెండు రోజుల పాటు ప్రముఖులు పర్యటన చేస్తూ ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది ప్రజలనే అడిగి తెలుసుకుంటామన్నారు. కేంద్రం గృహాల నిర్మాణానికి నిధులిస్తుంటే బ్యాంకుల నుంచి రుణాలు ఎందుకు తీసుకోవాలన్నారు. గృహనిర్మాణ దారుడిని రుణగ్రస్తులను చేసింది రాష్ట్ర ప్రభుత్వమేనని విమర్శించారు. 2003లోనే రైల్వే జోన్ రావల్సిందని, ఎర్రన్నాయుడు రైల్వే బోర్డు చైర్మన్‌గా ఉన్నప్పుడే చంద్రబాబు రైల్వే జోన్ తెస్తామన్నారని గుర్తు చేశారు. బీజేపీ రైల్వే జోన్ తీసుకొస్తున్న తరుణంలో టీడీపీ నాయకులు దొంగ దీక్షలు ఎందుకు చేస్తున్నారన్నారు. 33 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని, అందులో 10 ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులున్నాయన్నారు. జూలైలో బీజేపీ ప్రముఖుల పర్యటన ఉంటుందని వెల్లడించారు. -
’పక్కా గృహాల నిర్మాణంలో భారీ అవినీతి’
-
‘ఆపరేషన్ గరుడ’ అంటూ దిగజారొద్దు..
సాక్షి, విశాఖపట్టణం : చమురు సంబంధ ఉత్పత్తులు పెట్రోల్, డీజిల్ తదితరాలను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కిందకు తేవాలని అధిష్టానాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు కోరినట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘ఆపరేషన్ గరుడ’ అంటూ హీరో శివాజీ చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. చంద్రబాబు ఇలాంటి ఆరోపణలతో తన స్థాయిని మరింత దిగజార్చుకుంటున్నరాని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు ఒక్కసారి కూడా పోలవరం ప్రాజెక్టు ఊసెత్తని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఆ ప్రాజెక్టును గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టు ముందుకు కదిలిందని చెప్పారు. పోలవరం జాప్యానికి టీడీపి వ్యవహార ధోరణియే కారణమని పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్షను ప్రభుత్వ ఖర్చుతో చేస్తూ పార్టీ ప్రచారం కార్యక్రమంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు. విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ ఏపీకి ఏం కావాలో అడగని టీడీపీ నాయకులు ఇప్పుడు దీక్షలు ఎలా చేస్తారు? అంటూ నిలదీశారు. నిరుద్యోగులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఎన్నికల భృతి అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. త్రిపుల్ తలాక్‌పై టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమో? చెప్పాలంటూ డిమాండ్ చేశారు. -
చంద్రబాబును సీఎం చేసి తప్పు చేశాం..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి తప్పు చేశామన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లేనని చెప్పారు. ‘రాష్ట్రంలో టీడీపీ బీజేపీని ప్రధాన శత్రువుగా ఎంచుకుంది. తిట్ల దండకంతో మహానాడులో బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారు. చంద్రబాబు ఖబడ్దార్.. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామస్మరణతో మహానాడు జరిగింది. టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీజేపీ నేతలపై పగ, ప్రతీకారంతో మాట్లాడుతున్నారని’ మాధవ్ మండిపడ్డారు. ‘బీజేపీని తిట్టినవారికి బహుమతి అనేలా మహానాడులో ప్రసంగాలు చేశారు. ట్యాక్సులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. దొలేరా నగరంలో కేంద్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. అక్కడ పీపీపీ విధానం ద్వారా నిర్మాణాలు జరుగుతున్నాయి. దొలేరాలో ప్రపంచంలోని పెద్ద నగరం నిర్మిస్తున్నారు. రూ. 2500 కోట్లు అమరావతి నగర నిర్మాణానికి ఇచ్చారు. రాజధానిలోని 4600 స్క్వేర్ మీటర్స్‌కు కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పామన్నారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది. డిజైన్లు మార్చి లేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏ రాష్ట్రానికి రాని విధంగా ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్‌కి విడుదల చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం. ప్లేస్, ఏ స్థాయి వ్యక్తులు రావాలో కూడా మీరే చెప్పండి. మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాల్లో ఒక్కటి కూడా రాష్ట్రాభివృద్ధికి ఉపయోడపడేవి లేవు. కచ్చితంగా సవాలు స్వీకరించి మమ్మల్నీ ఢీ కొట్టే దమ్ముంటే చర్చకు రండి. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు. కేంద్రం పన్నులు కొట్టొద్దు అంటూ బాబు పిలుపునివ్వడం దారుణం. ప్రపంచ దేశాలకు బాబాను ఇంచార్జ్‌గా పంపాలి. దేశం ఒక్కటే కాదు.. ప్రపంచ దేశాల సమస్యలన్నీ తీర్చే ఏకైక వ్యక్తి చంద్రబాబే. కేంద్ర పథకాలన్నీ చంద్రబాబు రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలో బీజేపీకి ధీటైన ప్రతిపక్షం లేదు. రాజకీయాల్లో శత్రువుల ఉండరు. ప్రత్యర్థులు మాత్రమే వుంటారు. ఈ విషయం లోకేష్‌కు తెలియక శత్రువులు అంటూ అజ్ఞానిలా మాట్లాడారు.. లోకేష్‌కు రాజకీయ అనుభవం లేదని’ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. -
నారా లోకేష్ అలా అనడం దుర్మార్గం..
విశాఖపట్నం : బీజేపీ నేతలు తమ శత్రువులని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ అనడం దుర్మార్గమని బీజేపీ ఏపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. ఆయన మంగళవారం విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ..మహానాడుపై ఎవరైనా విమర్శలు చేస్తే తెలుగుదేశం నాయకులు సహించలేకపోతున్నారని అన్నారు. రమణ దీక్షితులు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారని వ్యాఖ్యానించారు. గుజరాత్ పారిశ్రామిక ప్రాంతంలో దలైలా నగరం అభివృద్ధి చేస్తుంటే.. కేంద్ర నిధులు మళ్లించారని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. దీనిపై అసత్యపు ప్రచారం చేస్తున్నారని, అది ప్రజల భాగస్వామ్యంతోనే నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. కేంద్ర నిధుల నుంచి ఒక్క పైసా కూడా ఈ నగరంలో పెట్టడం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు తాను సీనియర్ అని చెప్పుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గించాలని అధికారులకు సూచించడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలలో చంద్రబాబుకి ఓటేస్తే తెలుగు జాతిని అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. విశాఖ భూ కుంభకోణాలపై చంద్రబాబు, లోకేష్‌ల పేర్లు వినిపిస్తున్నాయని, సిట్ దర్యాప్తు పూర్తిచేసి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినా ఇంత వరకు ఎందుకు బహిర్గతం చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఇందులో మంత్రి గంటా శ్రీనివాస్ అనుచరుల పేర్లు ఉన్నాయనే భయపడుతున్నారని, వెంటనే నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. -
బాబుకు పుట్టగతులు ఉండవు..
-
బెల్జియంలో వేలం వేసిన వజ్రం ఎక్కడిది..?
సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పవిత్రతను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అపవిత్రం చేస్తోందంటూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన... టీడీపీ నాయకులు, అధికారులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ రమణ దీక్షితులును విమర్శిస్తున్నారంటే ఏదో తప్పు జరిగేవుంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అనేక ఆరోపణలు కలిగిన వ్యక్తులను టీటీడీ చైర్మన్‌గా నియమించారన్న మాధవ్.. టీటీడీ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ హయాంలో ధార్మిక మండలిని ఏర్పాటు చేశారని.. అయితే ప్రస్తుతం ధార్మిక మండలిని లేకుండా చేసి బాబు సర్కారు అవినీతికి పాల్పడుతోందంటూ ఆయన ఆరోపించారు. బాబుకు పుట్టగతులు ఉండవు.. కోట్లాది మంది భక్తుల ఇష్టదైవమైన వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే చంద్రబాబుకు పుట్టగతులు ఉండవని మాధవ్ మండిపడ్డారు. స్వామి వారి ఆభరణాలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆభరణాలన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. స్వామి వారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని ఈవో చెబుతున్నారని.. అయితే ఆయనే స్వయంగా వాటిని చూశారా? లేదా ఇలా చెప్పడంలో ఆయనపై ఎవరి ప్రభావమైనా ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. బెల్జియంలో వేలం వేసిన వజ్రం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై ఆ దేశం వివరణ కోరాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. తాంత్రిక పూజలపై కూడా.. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తూ.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ మాధవ్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు టీటీడీని టీడీపీ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. 65 సంవత్సరాల వయసు బూచిని చూపుతూ ప్రభుత్వం అర్చకులపై కక్ష సాధిస్తోందన్నారు. టీటీడీ వ్యవహారంతో పాటు.. దుర్గ గుడిలో జరిగిన తాంత్రిక పూజలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్
సాక్షి, విశాఖ: ప్రధాని నరేంద్రమోదీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. మోదీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో శనివారం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్‌తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ధర్మ పోరాట దీక్షలో మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే విష్టుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదని పేర్కొన్నారు. -
‘ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం’
-
‘ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం’
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా అంశం దేశంలో ముగిసిన అధ్యాయమని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఉన్నట్లు ఆయా రాష్ట్రాల వెబ్సైట్లలో చూపిస్తే బీజేపీ వెంటనే తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో దేనికీ ప్రత్యేక హోదా లేదని చెప్పారు. వెనుకబడిన రాష్ట్రాలకు కేవలం సహాయం మాత్రమే కేంద్రం చేస్తోందని వివరించారు. ఈశాన్య రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌ను పోల్చడం నక్కకు నాకలోకానికి ముడిపెట్టడమే అని అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ప్రభుత్వం తీరును ఆయన ఎండగట్టారు. శాసనసభలో ప్రధానమంత్రి క్లిప్పింగ్స్‌ను ప్రతిపక్ష బీజేపీ లేకుండా చూపించడం సభ మర్యాదలు ఉల్లంఘించడమేనని అన్నారు. శాసనసభను టీడీపీ స్వప్రయోజనాల కోసం, స్వార్ధ రాజకీయాలు కోసం వాడుకుంటోందని ఆరోపించారు. ‘మీ ప్రధానమంత్రి’ అంటూ సీఎం చంద్రబాబు శాసనసభలో వాడిన పదజాలాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. సభలో లేని వారి గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై అనేక సందర్భంల్లో ప్రధాని మాట మార్చిన విధానాన్ని వీడియో క్లిప్పింగ్స్ రూపంలో ప్రదర్శించారని, అలనే చంద్రబాబు కూడా ప్రత్యేక హోదాపై మాటమార్చిన విధానాన్ని వీడియో క్లిప్పింగ్స్ అసెంబ్లీలో బీజేపీ ప్రదర్శించడానికి అనుమతిస్తారా? అంటూ మండిపడ్డారు. రుణమాఫీ, పార్టీ ఫిరాయింపులపై గతంలో ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ మీడియాకు చూపించిన మాధవ్.. ఈ మేరకు గవర్నర్‌కు పిర్యాదు చేస్తామని తెలిపారు. రాజకీయ అవసరాలకు తగ్గట్లు సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని.. అందుకు హోదా కన్నా ప్యాకేజినే బెటర్ అన్న ఆయన ఇప్పుడు బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని అన్నారు. బీజేపీ వల్ల 15 సీట్లు కోల్పోయామని అంటున్న చంద్రబాబుకు పొత్తు లేకుండా గెలిచిన చరిత్ర ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖకు శాసనసభలో సమాధానం ఎలా చెప్తారని అన్నారు. ఒకవేళ లేఖపై స్పందించాలంటే ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని.. అలా కాకుండా అమూల్యమైన శాసనసభ సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. లేఖలో అమిత్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వాటిని తెలుగు ప్రజలపై దాడిగా అభివర్ణించడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ నేతలందరూ అమరావతి రాజధాని ప్రాంతం అంతా తిరిగారని చెప్పారు. ఎమ్మెల్యేలు, అధికారుల నివాస భవన నిర్మాణాలు చేపట్టకుండానే నిర్మించినట్లు రూ.774 కోట్లకు ఏపీ ప్రభుత్వం యూసీజీ ఇచ్చిందని చెప్పారు. కట్టిన బిల్టింగ్‌లు భూ గర్భంలో దాక్కున్నాయా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. కట్టకుండా కట్టినట్లు చూపిన ఆ భవనాలు ఎక్కడున్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
అప్పుడు ఎందుకు తీసుకెళ్లలేదు?
సాక్షి, అమరావతి : అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 2014 నుంచి ఒక్క అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని బీజేపీ నాయకులు విమర్శించారు. అమరావతిలోని బీజేపీ కార్యాలయంలో రాజమండ్రి అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, పార్టీ నాయకుడు మాధవ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అడిగిన వారిపై ఎందుకు దాడులు చేయించారని చంద్రబాబును ప్రశ్నించారు. బాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే ఇప్పుడు హడావిడిగా అఖిలపక్షం ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. అఖిలపక్షాన్ని రాత్రికి రాత్రికి ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. సీఎం 29సార్లు ఢిల్లీకి తీసుకెళ్లినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదని సూటిగా అడిగారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. కులాల మధ్య సీఎం చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ ప్రభుత్వం భయపడటం లేదని తెలిపారు. -
టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారు
-
టీడీపీ నేతలవి నీచ రాజకీయాలు: బీజేపీ
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాము తలుచుకుంటే చంద్రబాబు వెన్నుపోటు గురించి చాలానే మాట్లాడగలమన్నారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడు ఎవరైనా పీఎంవోకు వెళ్లొచ్చని తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు గమనించాలన్నారు. అభివృద్ధి ధ్యేయంగా కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకుందని, ఏపీకి ఏం చేశామె అమిత్ షా సవివరంగా చెప్పారని మాధవ్ గుర్తుచేశారు. తామెప్పుడు రాజకీయ లబ్ధి చూసుకోలేదన్నారు. ఇంతవరకు నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు ఇవ్వలేదని, స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు రాష్ట్రం ఎందుకు ఒప్పుకోలేదని ప్రశ్నించారు. -
పోలవరంపై చంద్రబాబు వర్సెస్ బీజేపీ ఎమ్మెల్సీ
-
చంద్రబాబు వర్సెస్ బీజేపీ ఎమ్మెల్సీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు, పీఎంవో వ్యవహారాలపై ఏపీ శాసనమండలిలో సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ప్రాజెక్టు పునరావాస బాధ్యతలు ఏపీ తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎలా అన్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలవరంపై కుట్ర జరుగుతందని, తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే కొందరు తనపై యుద్ధం చేస్తామంటున్నారని తెలిపారు. కొందరు తనను బోనులో నిలబెడతామంటున్నారని, కానీ తాను ఎక్కడా టెక్నికల్‌గా.. లీగల్‌గా తప్పు చేయలేదనని చంద్రబాబు చెప్పారు. తాను అవినీతి చేయలేదని, తన కుమారుడు మంత్రి నారా లోకేశ్ విషయంలో కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పానన్నారు. హోదా ఎవరికీ ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ అబద్ధం చెప్పడం వల్లే ప్యాకేజీకి ఒప్పుకున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని పీఎంవోలో ఎందుకు అనుమతిస్తారని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇచ్చేవాడికి తీసుకునేవాడు లోకువ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రసంగానికి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అడ్డుతగులుతూ.. ఎంపీలు ఎవరైనా ప్రధానిని కలవొచ్చునన్నారు. సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్న ఎమ్మెల్సీ మాధవ్ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలవరం పునరావాస బాధ్యత కేంద్రానిదేని గుర్తించాలన్న మాధవ్.. పోలవరం విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని చంద్రబాబుకు స్పష్టతనిచ్చారు. బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక లేదని తెలిపారు. దీనిపై చర్చకు సిద్ధమన్న ఎమ్మెల్సీ మాధవ్.. సీఎం అంగీకరించిన ప్యాకేజీ నిధులు ఏపీకి ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కేంద్రం నుంచి మాధవ్ నిధులు (90:10 నిష్పత్తిలో) తెస్తామంటే అన్ని పార్టీలను తాను ఒప్పిస్తానని, పారిశ్రామిక రాయితీలు కూడా తీసుకురావాలని చంద్రబాబు అడిగారు. 90:10 నిష్పత్తిలో నిధులు ఇచ్చి తీరుతామని అందుకే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమని కేంద్రం చెప్పిందని మాధవ్ గుర్తుచేశారు. ఎఫ్ఆర్బీఎం లిమిట్ పెంచుతామంటే ఏపీ ప్రభుత్వమే వద్దన్న విషయాన్ని వెల్లడించారు. -
బీజేపీ నుంచి టీడీపీ విడిపోవడం సంతోషం..
సాక్షి, అమరావతి : ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. బీజేపీ నుంచి టీడీపీ విడిపోవడం సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గెలవడం కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, గతంలో వాజ్‌పేయి చరిస్మాతో గెలుపొందారని ఎమ్మెల్సీ మాధవ్ గుర్తు చేశారు. గతంలో తన ప్రాణం ఉన్నంత వరకూ బీజేపీతో పొత్తుపెట్టుకోనని చెప్పిన చంద్రబాబు మళ్లీ దేశంలో నరేంద్ర మోదీ హవా ఉండటంతో పొత్తు పెట్టుకున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం విఫలమయ్యారని దుయ్యబట్టారు. పైపెచ్చు నాలుగున్నరేళ్లలో ఏపీకి బీజేపీ ఎంతో చేసినా.. ఏమీ చేయలేదని కేంద్రంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ తో తాము కుమ్మక్కు కాలేదని...టీడీపియే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో కుమ్మకై వారికి మంత్రి పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే పార్లమెంట్లో కాంగ్రెస్‌కు ఎక్కువ మాట్లాడే అవకాశం వస్తుందని, కాంగ్రెస్ ద్వారా బీజేపీపై అవాకులు చవాకులు చెప్పించాలని చూస్తున్నారన్నారు. టీడీపీ తమతో విడిపోయి బీజేపీ నెత్తిన పాలు పోసిందన్నారు. టీడిపీ తమపై కుట్రలు చేస్తుందని ఎమ్మెల్సీ మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
‘వలలో చిక్కుకున్న పక్షిలా చంద్రబాబు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి అనేక విషయాల్లో కేంద్రంను ఎద్దేవా చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. బీజేపీపై సీఎం విమర్శలు సరికాదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణంగా బయటకు వచ్చామని చెప్పడం దారుణం అని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదా నెపంను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. మంచి అంతా తన వల్ల జరిగింది... చెడు అంతా కేంద్రందే అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది.. దక్షిణాది అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, కేంద్ర సహకారం లేకుండానే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయా? అని ప్రశ్నించారు. 'కియో మోటార్స్ కేవలం చంద్రబాబు వల్లే వచ్చిందా? కేంద్ర సహకారం లేకుండానే కియో మోటార్స్ వచ్చిందా? పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఏఆర్జి ఫండ్స్, గృహనిర్మాణం, విద్యుత్ కోతలు లేని పరిస్థితి, రహదారుల అభివృద్ధి, ఇవన్నీ కేంద్ర సహకారం లేకుండానే జరిగాయా? పీఎం దేశానికి ప్రధాన సేవకుడుగా పని చేస్తున్నారు. ప్రత్యేక హోదా పై 14వ ఆర్ధిక సంఘం చెప్పిన దానిని తప్పుగా చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇచ్చిందని టీడీపీ నిరూపిస్తే దాని కోసం బీజేపీ కూడా కట్టుబడి వుంటుంది' అని మాధవ్ అన్నారు. ఆ విషయాన్ని పక్కకు పెట్టి ప్రత్యేక హోదా పేరుతో అన్ని వర్గాలను కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కిందటే హోదా రాదని ముఖ్యమంత్రికి తెలుసన్న ఆయన ప్రతి పక్షాల వలలో చిక్కుకున్న పక్షిలా సీఎం వైఖరి వుందన్నారు. స్పెషల్ పర్పస్ విషయంలో నిధులు ఇస్తామని అరుణ్ జెట్లీ చెప్పారని, దీనిపై రాష్ట్రానికి ఏమైనా ఆలోచన వుందా? లేదా అని ప్రశ్నించారు. రైల్వే జోన్ పై ఫీజుబిలిటీ లేదని ఆనాడే రైల్వే మంత్రి చెప్పారని, రాజకీయ నిర్ణయం ద్వారానే అది సాధ్యం అవుతుందని బీజేపీ భావిస్తోందని చెప్పారు. బీజేపీ ద్వారా రైల్వే జోన్ వస్తుందని, కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలోనూ కేంద్రం చిత్తశుద్ధి తో వుందని గుర్తు చేశారు. హైదరాబాద్ నిర్మాణం క్రెడిట్ చంద్రబాబుదేనని అంగీకరిస్తున్నామని, ఇదే సందర్భంలో తొమ్మిదేళ్ళ పాలనలో ఏపీలోని 13 జిల్లాలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు జరిగిన కేంద్రీకృత అభివృద్ధి వల్లే నేడు ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాలు వెనుక బడి వున్నాయని, కేంద్ర నిధులు రాకపోవడం వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులు ఏమైనా వున్నాయా? అని ప్రశ్నించారున. కేంద్రం ద్వారా జరుగుతున్న ప్రాజెక్ట్ లను ప్రజల్లోకి తీసుకువెళతామని చెప్పారు. తాడేపల్లి ఎన్ఐఐటి నిర్మాణంలో కాంపౌండ్ వాల్ ను మధ్యలో నిలిపేసిన కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏడాది సమయం పట్టిందని, ఎయిమ్స్‌తోపాటు అన్ని కేంద్ర సంస్థలకు నిధులు మంజూరు చేశామన్నారు. -
దర్శి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ జగన్
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రకటించారు. దర్శి అభ్యర్థిగా మాధవ్ పేరును ఆయన ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాళ్లూరు బహిరంగ సభలో వైఎస్ జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. మాధవ్ అందరూ ఆదరించాలని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. ప్రజాసంకల్పయాత్ర 102వ రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొనసాగింది. తాళ్లూరు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. -
దర్శి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ జగన్
-
రైల్వేజోన్ రాకపోవడానికి టీడీపీనే కారణం
సాక్షి, విజయవాడ : వాస్తవాలు అంగీకరించలేని తెలుగుదేశం ప్రభుత్వం, నేతలు బీజేపీపై మూకుమ్మడి దాడి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎస్ మాధవ్ మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం నేతలపై నిప్పులు చెరిగారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి చూస్తే ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ఏమిచ్చిందో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. నిధుల విషయంలో నిగ్గు తేలాల్సిన నిజాలు చాలా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి బీజేపీనే కారణం అని, ఏపీకి 11శాతం నిధులు వచ్చాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కేంద్రం ఇచ్చిన నిధులపై నోరు విప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు. మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం వాస్తవాలను దాచి, అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేయడం తాము జీర్ణించుకోలేక పోతున్నామని మాధవ్ అన్నారు. రాష్ట్రం ఇచ్చిన రుణమాఫీ హామీని కేంద్రం ఎందుకు భరిస్తుందని ప్రశ్నించారు. అలా చేస్తే ఇతర రాష్ట్రాలు కూడా రుణమాఫీ కోసం నిధులను అడుగుతాయిని అన్నారు. రాజధాని డీపీఆర్ లేకుండా ఎవరైనా నిధులు ఇస్తారా అని తెలుగుదేశం నేతలను ప్రశ్నించారు. అయినా రూ.2500 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. తన ప్రశ్నలకు తెలుగుదేశం ప్రభుత్వం, టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని, సెక్షన్ 93 ప్రకారం 10 ఏళ్ల గడువు ఉన్నా కేవలం మూడున్నర ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేశామని అన్నారు. రైల్వేజోన్ గురించి టీడీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాధవ్ విమర్శించారు. రాష్ట్రానికి రైల్వేజోన్ రాకపోవడానికి టీడీపీనే ముఖ్య కారణం అని ఆరోపించారు. గతంలో ఎర్రన్నాయుడు రైల్వేబోర్డు ఛైర్మెన్‌గా ఉన్నప్పుడు ఎందుకు రైల్వేజోన్ తెచ్చుకోలేక పోయారంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమి ఇచ్చామో అనే దానిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దమేనని మాధవ్ అన్నారు. -
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
♦ కెయిన్ (జోసే సారమాగో) పోర్చుగీస్ రచయిత సారమాగో రాసిన చివరి నవల. ఈయన రాసిన ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నవలకు కొనసాగింపులా ఉంటుంది. ఆడమ్, ఈవ్‌లకు పుట్టిన ఇద్దరు బిడ్డలు– కెయిన్, ఎబెల్ – వ్యవసాయం, పశుపాలన చేసి తమ ఉత్పత్తులను దేవుడికి త్యాగం చేస్తారు. కాని, దేవుడు ఎబెల్ త్యాగాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. అసూయతో కెయిన్ ఎబెల్ను చంపేస్తాడు. దేవుడు కెయిన్‌ను దేశదిమ్మరి కమ్మని శపిస్తాడు. సారమాగో నవల ఇక్కడ మొదలవుతుంది. బైబిల్ పాతనిబంధనలో ‘ఐదు పుస్తకాలు’గా ప్రసిద్ధి చెందిన వాటిలోని సంఘటనలలో కెయిన్‌ను పాత్రధారిని చేసి నడిపిస్తూ ఒక కొత్త చరిత్ర రాస్తాడు సారమాగో. ఆ నిబంధనలను చర్చిస్తూనే దేవుడిని మరింతగా ఎందుకు ద్వేషించాలో కెయిన్ ద్వారా చెప్పిస్తాడు. ఆ రకంగా మంచి, చెడు, నైతికత వంటి వాటిపై మతం ఇచ్చిన నిర్వచనాలను నిశితంగా విమర్శిస్తాడు. ♦ ద ఫాల్ (ఆల్బేర్ కామూ) ఇదీ కామూ చివరి నవలే. నవల అంతానూ క్లమెన్స్ ఒక బార్లో కలిసిన ఒక అపరిచితుడితో మాట్లాడ్డం – ఒక సంజాయిషీ చెప్పుకుంటున్నట్టు – గానే ఉంటుంది. కథనం ద్వితీయ పురుషలో సాగుతుంది. ఆ అపరిచితు డు ఒక్క మాట కూడా మాట్లాడడు. తనను తాను పరిచయం చేసుకుంటూ, ఆ అపరిచితునితో పోల్చుకుంటూ క్లమెన్స్ మాటలు మొదలు పెడతాడు మొదట కొన్ని నిజాలు దాస్తూ. ఒక గొప్ప న్యాయవాదిగా ఉండటం నుంచి ప్రస్తుతం అమ్‌స్టర్‌డామ్ బారులో ఇలా ఉండటానికి మధ్య కథంతా చెప్తాడు. నిదానంగా ఒక్కొక్క పొర తొలిగిపోతుంటుంది. క్లమెన్స్ అసలు స్వభావం, స్వరూపం బయటకొస్తుంటాయి. నవల పూర్తయ్యేసరికి కథనంతో పాటూ తత్వవేత్త కామూ అస్తిత్వం గురించీ, జీవితం అర్థం గురించీ ఆలోచించక తప్పని ప్రశ్నలు మనముందుంచుతాడు. ♦ ఇన్ ఈవిల్ అవర్ (గాబ్రియేల్ గార్సియా మార్కేజ్) ఈ నవలను మార్కేజ్ మొదటిదిగా పరిగణిస్తారు (కాకున్నా). కొలంబియా చరిత్రలో ‘ల వయొలెన్చియా’గా పేరు తెచ్చుకున్న కల్లోలిత దశకం 1950లలోని కథాకాలం. జడివానలో తెరపిలా శాంతి సమయం. అస్థిమితపరిచే ఒక తాత్కాలిక సంధికాలం. కొండలలో నది కానుకుని ఉన్న ఒక ఊరు. వానలు, వరదలు, శవాలు. ఊరిలో ప్రతీరాత్రి ఆ ఊరి ప్రజల చీకటి బ్రతుకుల గురించి చాటిస్తూ వెలువడే పోస్టర్లు. అవి కేవలం పుకార్లనే అనుకుంటారు అవి ఒక హత్యకు దారి తీసేదాకా. వెంటనే ఆ ఊరి మేయర్ మార్షల్ లా ప్రకటిస్తాడు. రాజ్యశత్రువులతోపాటు తన శత్రువులనూ మాయం చేయడం కోసం. మేయర్, బార్బర్, డెంటిస్ట్, ప్రీస్ట్ – నియంతృత్వం, తిరుగుబాటు, మతం నవలంతా వానముసురులా పరుచుకునుంటాయి. ♦ ద కాసిల్ ఆఫ్ క్రాస్డ్ డెస్టినీస్ (ఇటాలో కాల్వీనో) కథాంశాల్లో, కథనరీతుల్లో కాల్వీనో చూపించిన ప్రతిభ అనితరసాధ్యం. ఒక అడవిలో ప్రమాదాలు నిండిన సుదీర్ఘ ప్రయాణం తర్వాత డస్సిపోయిన యాత్రికులు కొందరు ఒక చోట కలుసుకుంటారు. తింటూ తాగుతూ తమ తమ అనుభవాలు కథలుగా చెప్పుకోబోతారు. కాని ఆశ్చర్యంగా ఎవరికీ నోట మాట రాదు. చివరికి జోస్యం చెప్పేవారు వాడే బొమ్మల చీట్లపేక ముక్కల సహాయంతో అడవిలో తమకు ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఆ ముక్కల్లోని బొమ్మలు చెప్పే అర్థాలలో వారి జీవితాలన్నీ ఒకరితోవొకరివి పెనవేసుకున్నాయని తెలుస్తుంది. వారు టేబుల్ మీద పరుస్తున్న ఆ పేకముక్క బొమ్మల నుంచి వారి కథను నరేటర్ జ్యోతిష్యుడిలానే మనకు అల్లుతుంటాడు. ♦ ఏన్ ఇమాజినరీ లైఫ్ (డేవిడ్ మలూఫ్) మహాకవి ఓవిడ్ రోమన్ మహాసామ్రాజ్యపు సాంస్కృతిక చిహ్నంగా నిలిచి పోవలసినవాడు, చివరి దశలో రోమునుంచి వెళ్ళగొట్టబడతాడు అగస్టస్ చక్రవర్తి చేత, ప్రపంచపు ఒక మారుమూలకు. అక్కడ ఈ మహాకవి భాష లాటిన్ ఎవరికీ రాదు. ఆ ప్రాంతం మొరటు, ఆ ఆటవికుల భాష మొరటు. ఓవిడ్ ఎవరూ లేక తనతో తనే మాట్లాడుకుంటాడు. నిదానంగా తోడేళ్ళతో పెంచబడిన ఒక పిల్లవాడితో స్నేహం పెంచుకుంటాడు. ఆ భాష నేర్చుకోడానికి కూడా ప్రయత్నిస్తాడు. లాటిన్‌లా పరిష్కరించబడినది కాని ఆ భాషలో స్వేచ్ఛకు పదం ఉండదు. ఎందుకంటే ఏదీ సర్వస్వతంత్రం కాదు కాబట్టి. అలానే విడదీయడానికి పదాలు లేవనీ, బంధాలు కలిపే పదాలు మాత్రమే ఉన్నాయనీ గ్రహిస్తాడు. మెటమార్ఫసిస్ రాసిన ఓవిడ్ మలూఫ్ చేతిలో తనే మెటామార్ఫోజ్ అవుతాడు. చివరికి ఆ పిల్లవాడి చేతుల్లోనే మరణిస్తాడు ఒక కొత్త దృక్పథంతో. వ్యాసకర్త... -మాధవ్ మాచవరపు -
నెట్టికంటుడి సేవలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ
గుంతకల్లు రూరల్ : బీజేపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. బీజేపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంతకల్లుకు విచ్చేసిన ఆయన గురువారం నేరుగా కసాపురం చేరుకున్నారు. ఆలయ అధికారులు, ఇతర అర్చక బృందం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను, స్వామివారి పట్టువస్త్రాలను అందజేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి, కసాపురం ఆలయ ట్రస్టు బోర్డు సభ్యురాలు వనగొంది విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. -
జూలో మాధవ్ జన్మదిన వేడుకలు
- ఆఫ్రికా సింహం పుట్టిన రోజు నిర్వహించిన అధికారులు బహదూర్‌పురా నెహ్రూ జూలాజికల్ పార్కులో ఆఫ్రికా సింహం మాధవ్ 4వ జన్మదినోత్సవ వేడుకలను జూపార్కులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సౌదీ నుంచి మూడేళ్ల క్రితం హైదారబాద్ కి వచ్చిన ఈ సింహానికి పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంది. సాక్షాత్తు సౌది యువరాజు మాధవ్ ను నెహ్రూ జూపార్క్ కు బహుమానంగా ఇచ్చారు. 2012 అక్టోబర్ లో నగరంలో జరిగిన కాప్ - 11 సందర్భంగా యువరాజు బందర్ బిన్ సౌద్ బిన్ మహ్మద్ అల్ సౌద్ జూపార్క్ సందర్శించారు. సహజ వాతావరణంలో.. విశాలంగా ఉన్న జంతుప్రదర్శన శాలను చూసి... ఆనందం వ్యక్తం చేసిన యువరాజు.. తన వద్ద ఉన్న ఆఫ్రికా సింహాలు, చీతాలకు ఇది అనువైన ప్రదేశం అని నిర్ణయించి.. వాటిని బహుమతిగా అందించారు. అలా మాధవ్ 2013లో అరబ్ నుంచి హైదరాబాద్ చేరుకుంది. నాలుగేళ్ల వయస్సున్న ఈ సింహం పుట్టిన రోజు సందర్భంగా జూ అసిస్టెంట్ క్యూరేటర్లు సరస్వతీ శ్రీదేవి, మురళీధర్, లక్ష్మణ్, బయోలజిస్ట్ సందీప్, జూపార్కు పీఆర్ఓ హనీఫ్, యానిమల్ కీపర్లు ఘనంగా వేడుకలు నిర్వహించారు. -
చట్టం దూరంగా ఉంచింది... బంధం దగ్గర చేసింది!
కేస్ స్టడీ రజనీ, మాధవ్లది అన్యోన్య దాంపత్యం. వివాహమై ఎనిమిదేళ్లైనా ఏమాత్రం వారి మధ్య అపోహలు అపార్థాలు లేవు. ఉద్యోగంలో, ఇంటిపనిలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు. ఒక పూట వంట రజని చేస్తే, మరో పూట మాధవ్ చేస్తాడు. ఇరువురు ఒకే సంస్థలో ఉద్యోగం చేసుకుంటారు. కానీ కడివెడు పాలల్లో ఒక విషం బొట్టులా ఆర్నెల్ల క్రితం రజనీ మేనత్త పల్లెటూరి నుండి వచ్చింది. తనకు ఏ దిక్కూ లేదని, మేనకోడలింట్లో పెద్ద దిక్కుగా ఉంటానని తిష్ట వేసింది. ఇకనేం రజనీ మనస్సులో రోజూ విషం చిమ్మే కబుర్లు మొదలెట్టి, భార్యాభర్తల మధ్య చిచ్చు రగిల్చింది. చినికి చినికి గాలివానై విడాకుల వరకు వెళ్లింది. కేసు విచారణ ముగిసింది. జడ్జిగారికి విడాకులకు కారణాలు కన్పించలేదు. కేస్ కొట్టివేస్తే అప్పీల్‌కు వెళ్తారు. ఈ లోగా ఇరువురి మధ్య ద్వేషం పెరుగుతుంది. అందుకే ప్రత్యామ్నాయ ఉపశమనంగా సెక్షన్ 13-ఎ ప్రకారం అంటే ఆల్టర్నేటివ్ రిలీఫ్‌గా వారికి ‘జుడీషియల్ సపరేషన్’ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది భార్యాభర్తల మధ్య వివాహం రద్దు పరచదు. కేవలం ఒక కప్పు కింద సంసారం చేసే బాధ్యతను రద్దు పరచి, పరస్పరం ఆలోచించుకొని సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కోర్టు ఆర్డర్స్ ప్రకారం రజనీ, మాధవ్‌లు వేరువేరుగా కొంతకాలం ఉన్నారు. తమ లోపాలను, ఆలోచనా విధానాలను సరిదిద్దుకున్నారు. అపోహలు తొలిగాక హాయిగా కలిసి కాపురం చేస్తున్నారు. రజనీ మేనత్తను సాగనంపారు. న్యాయమూర్తిగారు సెక్షన్ 13ఎ హిందూ వివాహచట్టం ప్రకారం ఆల్టర్నేటివ్గా జుడీషియల్ సపరేషన్ ఆర్డర్స్ ఇచ్చి వారికి కాపురం నిలబెట్టుకునే అవకాశం ఇచ్చారు. -
సాగు కలసి రాక..
గుడిహత్నూరు: ఆదిలాబాద్ జిల్లా ఓ యువరైతు సాగు కలసిరాక ఆత్మహత్య చేసుకున్నాడు. కలహారి గ్రామానికి చెందిన ఎస్.మాధవ్ (32) పత్తి, టమాటా సాగు చేశాడు. నీరు లేక పోవడంతో మూడు బోర్లు వేయించాడు. అయినా చుక్కనీరు పడలేదు. పంటల దిగుబడి తగినంత రాకపోవడంతో మనస్తాపం చెందిన మాధవ్ గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. అతడ్ని కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కన్నబిడ్డతో సహా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది
గోపవరం (నిడదవోలు రూరల్), న్యూస్‌లైన్ : నవమాసాలు మోసి కన్న బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లికి జ్యోతిష్యుడు చెప్పిన మాటలు తల్లడిల్లేలా చేశాయి. బిడ్డ నష్టజాతకుడని, కుటుంబ సభ్యులకు అనర్థాలు తప్పవని చెప్పిన మాటలకు తోడు ఆ కుటుంబంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఆ మాతృమూర్తి హృదయాన్ని కృంగదీశాయి. నష్ట జాతకుడిగా పేరుపడిన బిడ్డతో పాటు తాను కూడా తనువుచాలించాలని నిర్ణయించుకున్న ఆ తల్లి నాలుగేళ్ల కన్నబిడ్డతో సహా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కాలువలో కొట్టుకుపోతున్న ఆమెను చూసి స్థానికులు రక్షించగా ఆ బాలుడు గల్లంతయ్యాడు. మానవుడు భూమి నుంచి గ్రహాంతరయానం చేస్తున్న నేటి ఆధునిక యుగంలో జ్యోతిష్యుడి మాటలు విని బిడ్డతో సహా తల్లి ఆత్మహత్యకు యత్నించిన ఈ ఘటన నిడదవోలు మండలం గోపవరం సమీపంలోని మద్దూరు వంతెన వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి ఇన్నీస్‌పేటకు చెందిన దుర్గ (22) అనే మహిళ నాలుగేళ్ల కుమారుడు వర్థన్‌తో కలిసి సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో మద్దూరు వంతెన వద్దకు వచ్చింది. ముందుగా రాసుకున్న సూసైడ్ నోట్‌ను, భర్త మాధవ్, వర్ధన్ కలిసి ఉన్న ఫొటోను, హ్యాండ్ బ్యాగ్‌ను వంతెన మధ్యలో ఉన్న ఖానా వద్ద ఉంచి కుమారుడితో సహా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి దుర్గ ఒడ్డుకు కొట్టుకురాగా అటువైపు వెళుతున్న ఆటో డ్రైవర్ ప్రసాద్, స్థానికుడు కె.బుజ్జి చూసి ఆమెను రక్షించారు. బాలుడు కాలువలో గల్లంతయ్యాడు. ఘటనాస్థలంలో ఆమె ఉంచిన సూసైడ్‌నోట్‌లోని కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్‌కు స్థానికులు సమాచారం అందించారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న దుర్గ బంధువులు బాలుడి కోసం కాలువలో వెతకకుండానే ఆమెను హడావుడిగా ఆటోలో అక్కడి నుంచి తీసుకువెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు తొలుత 108 వాహనానికి సమాచారం అందించగా వాహనం వచ్చే సరికి ఆమెను బంధువులు తీసుకువెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నష్ట జాతకమేనా.. ఇంకేమైనా ఉందా? కుమారుడు నష్టజాతకుడని జ్యోతిష్యుడు చెప్పడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె చెప్పిందని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడిన అనంతరం ప్రశ్నించగా బిడ్డ పెరిగేకొద్దీ మరిన్ని అరిష్టాలు జరుగుతాయని జ్యోతిష్కుడు చెప్పాడని, ఆ ప్రకారమే కుటుంబంలో ఇటీవల రెండు, మూడు ఘటనలు జరగడంతో ఆందోళనకు గురయ్యానని, దీంతో బిడ్డతో సహా చనిపోవాలనుకున్నట్టు చెప్పిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకేమైనా కారణాలు కూడా ఉండివచ్చని స్థానికులు, పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి ఇన్నీస్‌పేటకు సిబ్బందిని పంపినట్టు సమిశ్రగూడెం పోలీసులు చెప్పారు. -
మావో నేత మాధవ్ ఎన్కౌంటర్
మల్కనగిరి (ఒడిశా)/సీలేరు (విశాఖ): మావోయిస్టు పార్టీ కీలక నేత మాధవ్ అలియాస్ గొల్ల రాములు శుక్రవారం ఉదయం ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. మల్కనగిరి జిల్లా లమతాపుట్ సమితి ప్రాంతంలో వారం రోజులుగా మాధవ్ సంచరిస్తున్నట్లు రహస్య సమాచారం అందడంతో మల్కనగిరి, కొరాపుట్ జిల్లాల ఎస్ఓజీ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. లమతాపుట్ సమితి చిలిబా గ్రామ సమీపంలోని కొండలపై శుక్రవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మాధవ్ మృతి చెందినట్లు మల్కనగిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ వెల్లడించారు. అతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా అని తెలిపారు. మరో నలుగురు మావోయిస్టులు తప్పించుకుని పరారైనట్లు ఆయన చెప్పారు. సంఘటనా స్థలం నుంచి మృతదేహంతో పాటు ఒక హ్యాండ్ గ్రెనేడ్‌ను, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కొరాపుట్ తరలించినట్లు చెప్పారు. మల్కనగిరి జిల్లా కలెక్టర్ వినీల్‌కృష్ణ కిడ్నాప్, అల్లంపాక వద్ద జరిగిన దాడిలో 38 మంది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మృతి, మల్కనగిరి నుంచి చిత్రకొండ తరలిస్తున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కోటి రూపాయల నగదు దోపిడీ, చిత్రకొండ వద్ద బీఎస్ఎఫ్ కమాండెంట్లపై దాడి తదితర భారీ సంఘటనలతో మాధవ్ ప్రమేయం ఉందని ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ చెప్పారు. మాధవ్‌పై పది హత్య కేసులతో పాటు కాంట్రాక్టర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడినందుకు కూడా పలు కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ మల్కనగిరి డివిజన్ కమిటీలో చిత్రకొండ ఏరియా కమాండెంట్‌గా కీలక సభ్యుడైన మాధవ్ తలపై ఆంధ్రప్రదేశ్‌లో రూ.4 లక్షల రివార్డు ఉందని చెప్పారు. చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న మాధవ్ ఎన్‌కౌంటర్‌ను పోలీసులు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. గత ఏడాది మల్కనగిరి జిల్లాలోనే మావోయిస్టు మిలీషియా కమాండెంట్ వంతల రాజారావు పోలీసులకు లొంగిపోగా, తాజా సంఘటనలో మాధవ్ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు. కీలకమైన నేతను కోల్పోవడంతో మావోయిస్టు పార్టీ ప్రతీకార చర్యలకు తెగబడే ప్రమాదం ఉండటంతో ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పాలమూరు నుంచి మాధవ్ ప్రస్థానం... సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్: ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో శుక్రవారం ఎన్‌కౌంటర్‌కు గురైన మాధవ్ అలియాస్ గొల్ల రాములు (35) మహబూబ్‌నగర్ జిల్లా వాసి. మహబూబ్‌నగర్ జిల్లా గోప్లాపూర్ గ్రామానికి చెందిన గొల్ల గౌరమ్మ, పెంటయ్య దంపతుల కుమారుడైన రాములు, ఐదో తరగతి వరకు స్వగ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాన్‌గల్‌లోని ప్రభుత్వ పాఠశాలలోను, తొమ్మిది, పదో తరగతులు వనపర్తిలోను పూర్తి చేశాడు. వనపర్తి ప్రభుత్వ కళాశాలలో 1996-97లో ఇంటర్లో చేరిన రాములు ఎస్ఎఫ్ఐ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అదేకాలంలో జననాట్య మండలిలో చేరి, నక్సల్ ఉద్యమం పట్ల ఆకర్షితుడై, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నల్లమల సరిహద్దు జిల్లాల్లో జననాట్య మండలి నేతగా సుపరిచితుడైన రాములు, మావోయిస్టు పార్టీలో దళ కమాండర్ స్థాయికి ఎదిగాడు. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తిన తర్వాత ఏవోబీకి వెళ్లిన దళాల్లో రాములు కూడా ఉన్నాడు.