తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పవిత్రతను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అపవిత్రం చేస్తోందంటూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన... టీడీపీ నాయకులు, అధికారులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ రమణ దీక్షితులును విమర్శిస్తున్నారంటే ఏదో తప్పు జరిగేవుంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
అనేక ఆరోపణలు కలిగిన వ్యక్తులను టీటీడీ చైర్మన్‌గా నియమించారన్న మాధవ్.. టీటీడీ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ హయాంలో ధార్మిక మండలిని ఏర్పాటు చేశారని.. అయితే ప్రస్తుతం ధార్మిక మండలిని లేకుండా చేసి బాబు సర్కారు అవినీతికి పాల్పడుతోందంటూ ఆయన ఆరోపించారు.