
సాక్షి, అనంతపురం: కిసాన్ రైలు ద్వారా రైతులు తరలించే పంట ఉత్పత్తులకు రవాణా చార్జీలను 50 శాతం తగ్గించటం హిందూపూరం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలకు మంగళవారం వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లే కిసాన్ రైల్లో రవాణా ఛార్జీలను సగానికి సంగం తగ్గించటం వల్ల అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అనంతలో పండే పంటలు ఢిల్లీలో అధిక ధరలకు విక్రయించి రైతులు లాభం పొందవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు
Comments
Please login to add a commentAdd a comment