kissan
-
సింగిల్ బ్రాండ్ భారత్‌తో అన్ని సబ్సిడి ఎరువులు: మోదీ కొత్త స్కీం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన కింద 'వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్' అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అన్ని సబ్సిడీ ఎరువులను ఒకే బ్రాండ్ కింద మార్కెట్ చేయడం తప్పనసరి చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మేళన్ 2022 సందర్భంగా జరుగుతున్న రెండు రోజుల కార్యక్రమంలో సింగిల్ బ్రాండ్ భారత్ పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. సబ్సడి ఎరువుల అక్రమ మార్గంలో తరలింపుకు చెక్‌పెట్టేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం కింద యూరియా, డి అమ్మెనియా ఫాస్ఫేట్(డీఏపీ), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ), ఎన్పీకే వంటివి ఒకే బ్రాంక్ కింద విక్రయాలు జరుగుతాయి. అంతేగాక సుమారు 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను(పీఎంకేఎస్కే) కూడా ప్రారంభించారు. ఇవి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు అందిచడమే కాకుండా బహుళ సేవలను అందించే ఒక షాపుగా పనిచేస్తుంది. దేశంలో దాదాపు 3.5 లక్షలకు పైగా ఉన్న రిటైల్ దుకాణాలను పీఎంకేఎస్‌కేగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ఈ కేంద్రల్లో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు వంటివి అందించడమే కాకుండా, మట్టి, విత్తనాలు, ఎరువులకు సంబంధించిన పరీక్ష సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తుంది. మోదీ ఈ రెండు రోజుల కిసాన్ సమ్మేళన్ కార్యక్రమంలో "ఇండియన్ ఎడ్జ్" అనే ఈ మ్యాగజైన్ కూడా ప్రారంభించారు. దీనిలో దేశీయ, అంతర్జాతీయ ఎరువుల సమాచారం, ఇటీవల ఉన్న ధరలు, అభివృద్ధి, వినియోగాలు తదితర అంశాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆ రైతు పక్కా ప్రణాళిక.. రోజూ ఆదాయం, లాభాలే లాభాలు!) -
రుణ సాయం... బీమా సౌకర్యం
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)ల ద్వారా ఆక్వా రైతులు, మత్స్యకారులకు మరింత మేలు చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడేళ్లలో 19,059 కేసీసీ కార్డుదారులకు రూ.2,673 కోట్ల రుణ పరపతిని ప్రభుత్వం కల్పించింది. మరింత ఎక్కువ మందికి కేసీసీలను జారీ చేయడం ద్వారా వారికి రుణ సాయం, బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేసీసీల జారీ, రుణపరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత కేసీసీ అప్లికేషన్(ఆటోమేషన్)ను రూపొందించింది. జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు కేసీసీల జారీ, రుణాల మంజూరు వివరాలను ఆర్బీకేల్లోని మత్స్య సహాయకుల ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. కేసీసీ పొందాలంటే... కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం మత్స్యకారులు, ఆక్వా రైతులు స్థానిక ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగతంగానే కాకుండా జేఎల్‌జీ, మహిళా, స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడినా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీచేస్తారు. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వారి సామర్థ్యాన్ని బట్టి రుణపరపతి కోసం బ్యాంకులకు సిఫార్సు చేస్తారు. అర్హులైన కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు పాండ్స్, ట్యాంక్స్, ఓపెన్ వాటర్ బాడీస్, హేచరీలు, రేరీంగ్, ప్రొసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రుణాలు ఇస్తారు. మత్స్యకారులకు వెస్సెల్స్, బోట్స్ నిర్మాణానికి ఆర్థిక చేయూతనిస్తారు. వర్కింగ్ క్యాపిటల్ కింద మత్స్యకారులకు సీడ్, ఫీడ్, ఎరువులు, ఫ్యూయల్, విద్యుత్, కూలీ, మార్కెటింగ్ చార్జీలు, లీజ్ రెంట్ల చెల్లింపుల కోసం రుణాలు పొందవచ్చు. మత్స్య ఉత్పత్తులు విక్రయించేవారు కూడా తమ వ్యాపార విస్తరణకు కోసం రుణ పరపతిని పొందవచ్చు. మత్స్యకారులకు భరోసా ప్రతి సీజన్లో ఆక్వా రైతులకు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణంలో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తారు. ఆ రూ.2లక్షలపై 2%, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే మరో 3% వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించారు. కేసీసీ పొందిన వారికి బీమా కూడా వర్తిస్తుంది. కార్డు పొందిన ప్రతీ మత్స్యకారునికి నెలకు రూ.12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారికి ప్రధానమంత్రి సురక్ష యోజన, 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి రూ.330ల ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన బీమా వర్తింపజేస్తారు. పెరుగుతున్న కార్డుదారులు.. రుణాలు రాష్ట్రంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో 2,865 కేసీసీ కార్డుదారులకు రూ.688.85కోట్లు, 2020–21లో 5,114 కార్డుదారులకు రూ.711.20కోట్లు, 2021–22లో 9,112 కార్డుదారులకు రికార్డు స్థాయిలో రూ.1,205.89 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ నాటికి 1,968 కార్డుదారులకు రూ.67.26కోట్ల రుణాలు మంజూరు చేశారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద రుణాల కోసం 46,383 కేసీసీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. -
రైతుల ఫేస్బుక్, ఇన్‌స్టా బ్లాక్ : ఫేస్బుక్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులనిరసనోద్యమం నిరాఘాటంగా కొనసాగుతోంది. ఈ ఆందోళనలను ఎప్పటికపుడు షేర్ చేస్తున్న ‘కిసాన్ ఏక్తా మోర్చా’ సోషల్ మీడియా ఖాతాను ఫేస్బుక్ బ్లాక్ చేయడం ఆందోళనకు దారితీసింది. ఉద్యమ వార్తలను ప్రజలకు అందిస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఆదివారం బ్లాక్ చేయడం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆన్లైన్ సెన్సార్‌షిప్‌పై వివాదం రాజుకుంది. ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై తాజాగా మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మూడు గంటల తరువాత ఆయా పేజీలు పునరుద్ధరించడటం గమనార్హం. 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న తమ అధికారిక ఫేస్బుక్ పేజ్‌ను ఫేస్బుక్ సంస్థ తొలగించిందని కిసాన్ ఏక్తా మోర్చా ఆరోపించింది. సోషల్ మీడియా పేజీలను బ్లాక్ చేశారని రైతు నేతలు తెలిపారు. ఆదివారం రైతు నేతల విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారం సాగుతుండగానే పేజ్‌ను బ్లాక్ చేశారని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్, క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ దర్శన్ పాల్ ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోషల్ మీడియాలను బ్లాక్ చేయడం వింతగా ఉందని , దీని వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని ఈ ఖాతాల వ్యవహారాలను చూస్తున్న బల్జిత్ సింగ్ మండిపడ్డారు. అయితే దీనిపై స్పందించిన ఫేస్బుక్ విచారం వ్యక్తం చేసింది. కిసాన్ ఏక్తా మోర్చా ఎఫ్బీ పేజీని పునరుద్ధరించాం, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఫేస్బుక్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే పేజీని ఎందుకు బ్లాక్ చేసిందీ పేర్కొనలేదు. మరోవైపు రైతులు (నేడు)సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీ, సీఎం జగన్‌లకు కృతజ్ఞతలు
సాక్షి, అనంతపురం: కిసాన్ రైలు ద్వారా రైతులు తరలించే పంట ఉత్పత్తులకు రవాణా చార్జీలను 50 శాతం తగ్గించటం హిందూపూరం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు మంగళవారం వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లే కిసాన్ రైల్లో రవాణా ఛార్జీలను సగానికి సంగం తగ్గించటం వల్ల అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అనంతలో పండే పంటలు ఢిల్లీలో అధిక ధరలకు విక్రయించి రైతులు లాభం పొందవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు -
లెక్క తేలింది..
ఆదిలాబాద్‌టౌన్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సర్వే పూర్తయ్యింది.. దీంతో ఈ పథకానికి అర్హుల లెక్క తేలింది. జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన 45,042 కుటుంబాలు ఉండగా, ఇందులో 41,439 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. సర్వే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. కాగా మొదటి విడతగా అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున ఈ నెల 24న డబ్బులు జమ కానున్నాయి. జిల్లాలో మొత్తం 1,33,447 మంది రైతులు ఉండగా, కిసాన్ సమ్మాన్ పథకానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి నిబంధన ఉండడంతో సగానికంటే ఎక్కువ మంది రైతులు పథకానికి దూరమయ్యారు. ఈ నెల 14న ప్రారంభమైన సర్వే 20వ తేదీ వరకు నిర్వహించారు. ఏఈఓలు సేకరించిన వివరాలను ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు. ఇప్పటివరకు 32,763 మంది రైతుల వివరాలను అప్లోడ్ చేశారు. మిగతా వారి వివరాలు సైతం మరో రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు రైతుల ఖాతాల్లో డబ్బులు.. సమ్మాన్ పథకంలో భాగంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈనెల 24 నుంచి డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.6వేలు ఇవ్వనున్న విషయం తెలిసిందే. మూడు విడతలుగా అకౌంట్లలో వేయనున్నారు. మూడు విడతల్లో రూ.2వేల చొప్పున అందించనున్నారు. అయితే జిల్లాలోని 18 మండలాల్లో 5 ఎకరాలు కలిగి ఉన్న రైతులు 45,042 రైతు కుటుంబాలు ఉండగా, ఇందులో 194 మంది రైతులు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, లాయర్లు, డాక్టర్లు, ఐటీ చెల్లించేవారు, తదితరులు ఉండడంతో అనర్హులుగా గుర్తించారు. ఈ పథకానికి సంబంధించి 41,439 మంది రైతులను అధికారులు అర్హులుగా గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు 32,763 మంది రైతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. 3,374 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు సేకరించాల్సి ఉందని, 676 మంది రైతుల పూర్తి వివరాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. రైతుల వివరాలు అప్లోడ్ చేస్తున్నాం జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన రైతు కుటుంబాలు 45,042 ఉండగా, ఇప్పటివరకు 41,414 మంది రైతులను అర్హులుగా గుర్తించాం. 194 మంది రైతులను ఈ పథకానికి అనర్హులుగా గుర్తించాం. 676 మంది రైతుల వివరాలు పూర్తిగా లేవు. 3,374 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 33,763 రైతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాం. ఇంకా 95 గ్రామాల రైతుల వివరాలు సేకరించాల్సి ఉంది. – ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆదిలాబాద్ -
‘కిసాన్’ లెక్క తేలింది
కరీంనగర్: ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్)’కి అర్హులైన రైతుల లెక్క తేలింది. ఐదు ఎకరాల లోపు భూమి, ఒక కుటుంబంలో ఒక పాస్‌బుక్ ఉన్న రైతులకే కేంద్రసాయం అందనుంది. ఈ లెక్కన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో జిల్లావ్యాప్తంగా 60,268 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. సదరు రైతు ఖాతాల్లో ఈనెల 24వ తేదీ నుంచి తొలి విడత రూ. 2వేల సాయం జమ కానుంది. ఈ మేరకు వ్య వసాయ శాఖ అధికారులు సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో 1.40 లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. వీరిలో 72,924 మంది పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక రూపొందించారు. మొదటి విడత సర్వేలో ఒకే కుటుంబంలో ఒక్క రైతుకు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం వల్ల 60,268 మంది రైతులు అర్హులుగా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. గ్రామాల్లో ఆదాయ పన్ను కట్టేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థల పేరుతో భూములు కలిగి ఉన్నవారు, పది వేలకు మించి పింఛన్ పొందుతున్నవారు, ఒకే కుటుంబానికి ఐదు ఎకరాలకు మించి భూములు ఉన్నవారు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, కార్పొరేషన్ మేయర్లు, ఉద్యోగ విరమణ పొందినవారు, వృత్తినిపుణలైన డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెట్ అకౌంటెంట్లను మినహాయించి సమగ్ర సర్వే నిర్వహించిన అనంతరం మొదటి విడత లబ్ధిదారులను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. రెండవ విడత సర్వేలో మిగిలిన రైతు కుటుంబాల నుంచి వివరాలు సేకరించి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులను ప్రభుత్వానికి నివేదించనున్నారు. కొందరికే లబ్ధి.. రైతుల అసంతృప్తి చిగురుమామిడి: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి’ పథకంపై రైతులు సంతృప్తికరంగా లేరు. ఈ పథకం కింద ప్రభుత్వం విధించిన నిబంధనలపై రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చిగురుమామిడి మండలంలోని దాదాపు 70శాతం మంది రైతులకు అన్యాయం జరుగుతోంది. ఎందుకనగా ఒకే రేషన్‌కార్డులో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్న రైతు కుటుంబీకులకు ఈ పథకం వర్తించదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు, ఉద్యోగ విరమణ పొందని వారికి కూడా వర్తించడంలేదు. ఐదు ఎకరాలు, ఆపైన భూమి కలిగి ఉన్నా ఈ స్కీమ్‌కు రైతు అర్హుడుకాడు. ఇచ్చే రూ.6వేలకు పలు నిబంధనలు విధించడం వల్ల రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐదు ఎకరాల భూమి కంటే లోపు ఉన్న రైతులే అర్హులని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ లెక్కన చిగురుమామిడి మండలంలో మొదటి విడతగా 4194 మంది రైతులు మాత్రమే అర్హత పొందారు. ఈ మండలంలో దాదాపు 11వేల మంది రైతులకు గాను 4194 మందికే రూ.6వేల పెట్టుబడి సాయం అందనుదని వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో అర్హుల జాబితాలను ప్రచురించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వేసిన జాబితాలను చూసిన రైతులు తమ పేర్లు రాలేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని అధికారుల ముందు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతలో ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండి ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం అందనుందని మండల వ్యవసాయాధికారి కె.రంజిత్‌రెడ్డి తెలిపారు. -
రైతుకు ‘కేంద్ర’ సాయం
మెదక్‌జోన్: దేశానికి అన్నంపెట్టే రైతన్నను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వరస కరువుకాటకాలతో సాగు ముందుకు సాగక ఆందోళన చెందుతున్న సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 6 వేల చొప్పున అందించేందుకు సన్నాహలు చేపట్టింది. జిల్లాలో మొత్తం రైతులు 2.20 లక్షల మంది ఉన్నారు. కాగా అందులో 29 వేల మంది రైతులకు సంబంధించిన భూములు పలు కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం పార్ట్‌బీ లో పెట్టింది. దీంతో వారికి రైతులబంధు అందడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సమ్మాన్నిధి అనే ప్రత్యేక పథకం ద్వారా ఐదెకరాల లోపు భూములు ఉన్న రైతులకు మాత్రమే సాయం అందజేయడానికి నిబంధనలు రూపొందించారు. జిలాల్లో 5 ఎకరాల లోపుగల ఉన్న రైతులు 1.7 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రూ. 6 వేల సాయంను మూడు విడతల్లో ఒక్కోవిడతకు రూ. 2 వేల చొప్పున అందించేందుకు ఏర్పాట్ల చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో రూ. 64.20 కోట్లు పంపిణీ చేయనున్నారు. మొదటి విడతగా రూ 21.40 కోట్లు ఇవ్వనున్నారు. ఈ మొదటి విడతకు సంబంధించిన రూ. 2 వేలను మార్చి 31 వరకు ఇవ్వనున్నారు. రెండో విడతకు సంబంధించిన రూ. 2 వేలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు, మూడో విడత ఆగస్టు నుంచి నవంబర్ 30వ, తేదీ వరకు నేరుగా రైతుల అకౌంట్లో వేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఈ పంపిణీ పక్రియను వ్యవసాయశాఖకు అప్పగించింది. రైతులు ఊరూర సమావేశాలు నిర్వహించి బ్యాంకు అకౌంట్లు, పట్టాపాస్‌బుక్కులు, ఆధార్‌కార్డు జిరాక్స్‌కార్డులను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఐదెకరాల లోపు రైతులందరికీ.. కేంద్ర ప్రభుత్వం పీఎం సమ్మాన్నిధి పథకం ద్వారా 5 ఎకరాలలోపు రైతులందరికీ రూ. 6 చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన రైతుల బ్యాంక్ అకౌంట్లు, పట్టాపాస్ పుస్తకాలు, ఆధార్ జిరాక్స్‌లను సేకరిస్తున్నాం. మొదటి విడత సాయం మార్చి చివరికల్లా అందుతుంది. –పరశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
తేలిన.. లెక్క!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: రైతాంగానికి హెక్టార్‌కు రూ.6వేల పెట్టుబడి సాయం అందిస్తామని కేంద్రం చేసిన ప్రకటన జిల్లా రైతాంగంలో ఆనందం నింపుతోంది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం కింద ఈసాయం అందివ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రకటించింది. దీనికి సంబంధించి విధివిధానాలు సిద్ధమవుతున్నాయని అధికార యంత్రాంగం చెబుతోంది. హెక్టారుకు రూ.6వేల ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి పూర్తిస్థాయి విధి విధానాలు తమకు అందలేదని, ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో ఈ మొత్తాన్ని మినహాయిస్తారా..? లేదా అన్న విషయంలో స్పష్టత కానరావడం లేదని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతుబంధు పథకంతో ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయం మొత్తాన్ని జమ చేస్తామని కేంద్రం ప్రకటించిందని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో రాష్ట్రం ప్రభుత్వం అందించే సాయం, కేంద్రం కొత్తగా ప్రకటించిన సాయం వేర్వేరుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని పేర్కొంటున్నారు. కాగా, జిల్లాలో ఐదు ఎకరాలలోపు ఎంతమంది రైతులు (ఖాతాలు) ఉన్నారు..? మొత్తంగా ఐదు ఎకరాలలోపు కమతాల్లో ఎంత విస్తీర్ణంలో సాగుభూమి ఉంది..? అన్న వివరాలను జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసింది. ఆర్థిక సాయంగా రూ.295.60కోట్లు ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాల మేరకు 6,80,915 ఎకరాల భూమి (5ఎకరాల లోపు) ఉంది. ఈ మొత్తం భూమి 3,46,442 రైతుల (ఖాతాలు) చేతుల్లో ఉంది. అయితే.. అధికారులు ఈ ఖాతాలను కూడా రెండు విభాగాలుగా విభజించారు. దీంతో రైతులకు అందనున్న ఆర్థిక సాయం కూడా వేర్వేరుగానే అందనుంది. ఒక ఎకరా నుంచి 2.46 ఎకరాల భూమి ఉన్న రైతులు 2,31,153 మంది ఉన్నారు. వీరి చేతిలో 2,77,947 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రూ.6వేల చొప్పున వీరికి రూ.75,80,38,390 ఆర్థిక సాయం అందనుంది. కాగా, 2.47 ఎకరాల నుంచి 4.93 ఎకరాల మధ్యలో ఉన్న మొత్తం వ్యవసాయ భూమి 4,02,967 ఎకరాలు. ఈ భూమి 1,15,289 మంది రైతుల చేతుల్లో ఉంది. ఈ మొత్తం భూమికి రూ.219,80,07,109 ఆర్థిక సాయం రైతులకు అందనుంది. అంటే.. ఒక ఎకరానుంచి 5 ఎకరాలలోపు ఉన్న 3,46,442 మంది రైతులకు ఏటా 295 కోట్ల 60 లక్షల 45వేల 499 రూపాయల సాయం అందనుందని చెబుతున్నారు. అయితే, పూర్తి లెక్కలు తేలాక అటు వ్యవసాయ భూమి, రైతుల సంఖ్యలో కొద్దిగా తేడాలు ఉండొచ్చని, దీంతో కేంద్రం నుంచి అందే పెట్టుబడి సాయంలో కొంత వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఏటా రూ.295.60కోట్ల దాకా రైతులకు పెట్టుబడి సాయంగా అందనుంది. -
‘సాయానికి’ సమాయత్తం
ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘కిసాన్ సమ్మాన్’ యోజన పథకం అమలు ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు సాగులో రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకాన్ని 2018 ఖరీఫ్ నుంచి అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ పథకం కింద ఖరీఫ్, రబీ సీజన్లో పంట పెట్టుబడిగా రెండు విడతలు రూ.4వేల చొప్పున రైతులకు ఇప్పటికే చెల్లించారు. 2019–20లో రూ.5వేల చొప్పున.. రూ.10వేలను అందిం చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రకటించింది. దీనిని సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదెకరాల భూమి ఉన్న రైతులకు ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6వేలు అందించనున్నారు. దేశవ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులు 12వేల కోట్ల మంది ఉండగా.. ఏడాదికి రూ.75వేల కోట్లను కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతులకు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసి.. ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పథకం అమలులో వ్యవసాయ శాఖ కీలక భూమిక పోషించనుంది. దీనిపై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అందాయి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు.. కలెక్టర్‌తో సమావేశమై పథకం అమలుపై చర్చించే పనిలో నిమగ్నమయ్యారు. ఐదెకరాల్లోపు రైతులు అర్హులు కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి ఐదెకరాల(2 హెక్టార్లు)లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు అర్హులు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు(మైనర్లు) కలిగి ఉన్న కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. ఐదెకరాల్లోపు ఎంత భూమి కలిగి ఉన్నా ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చుతారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అనర్హులు గ్రూప్–4, గ్రూప్–డీ మినహా ఇతర ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ఆదాయ పన్ను కలిగి ఉన్న వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనర్హులు. ఇక ప్రజాప్రతినిధులు వివిధ స్థాయిల్లో ఉన్న వారు కూడా అనర్హులే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కూడా అనర్హులే. ఇంజనీర్లు, డాక్టర్లకు కూడా ఈ పథకం వర్తించదు. రిటైర్డ్ ఉద్యోగుల్లో కూడా రూ.10వేలకు మించి పెన్షన్ పొందే వారికి ఈ పథకం వర్తించదు. మూడు విడతలుగా సాయం కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో అర్హులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6వేల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. 4 నెలలను ఓ విడతగా రూపొందించి.. ఒక్కో విడతలో రూ.2వేలను కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు విడుదల చేస్తుంది. 25 నాటికి వివరాలు అందించాలి.. కిసాన్ సమ్మాన్ పథకంలో అర్హులైన రైతుల జాబితాను ఈనెల 25వ తేదీ నాటికి అందించాలని(ఆన్లైన్) ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల మేరకు అర్హులైన రైతుల వివరాలను సేకరించి పంపించాలని ఆదేశాల్లో పేర్కొంది. రైతు పేరు, వయసు, స్త్రీ, పురుషుల వివరాలు, ఆధార్ నంబర్ లేదా ఏదైనా అర్హత కలిగిన గుర్తింపు కార్డు వివరాలతోపాటు రైతు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, మొబైల్ నంబర్ వివరాలను అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ వ్యవహారాలన్నీ వ్యవసాయ విస్తర్ణాధికారులకు అప్పగించే పనిలో వ్యవసాయ శాఖ ఉంది. మార్చి 31 నాటికి తొలివిడత రూ.2వేలు ఖాతాల్లో జమ కిసాన్ పథకం కింద తొలి విడత నగదును మార్చి 31వ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉందని కూడా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. పోస్టల్, కో–ఆపరేటివ్ బ్యాంకులతోపాటు అన్ని బ్యాంకులకు ఈ పథకం నగదును రైతులకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. జిల్లాలో రూ.2.50లక్షల మంది అర్హులు కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి జిల్లాలో సుమారు 2.50లక్షల మంది అర్హులుగా ఉండే అవకాశం ఉంది. మొత్తం రైతుల వివరాలను సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతోంది. కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఏఈఓలు రంగంలోకి దిగనున్నారు. గ్రామాలవారీగా అర్హులైన రైతులను గుర్తించి.. జాబితాలను రూపొందించి గ్రామంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. -
పీఎం కిసాన్.. అర్హులెవరు.. అనర్హులెవరు?
సాక్షి, హైదరాబాద్: పీఎం–కిసాన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను బుధవారం విడుదల చేసింది. పీఎం–కిసాన్ పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా ప్రదర్శిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒకవేళ అర్హులై ఉండి జాబితాలో పేరు లేకుంటే అధికారులకు విన్నవించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 25వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి పీఎం–కిసాన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. మొదటి విడత సొమ్మును పొందడానికి ఏడాదిపాటు అవకాశం కల్పించారు. అంటే, ఈ నెల 25వ తేదీ నాటికి అర్హులైన రైతుల జాబితాను ఒకవేళ అప్లోడ్ చేయకపోయినా, ఆ తర్వాత పంపించినా రైతులకు ఏడాదికాలంలో ఎప్పుడైనా సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రారంభించి, కోడ్ ఉన్నప్పటికీ తర్వాత కొనసాగించాలన్నదే కేంద్ర సర్కారు వ్యూహంగా ఉంది. ఐదెకరాలలోపు ఉన్న ఒక కుటుంబం మాత్రమే రూ.6 వేలు పొందడానికి అర్హత ఉంటుందని నిర్ధారించారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి సాంకేతికంగా గుర్తింపు పొందిన అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రం ప్రకటించిన తాజా మార్గదర్శకాల్లోని మరికొన్ని ముఖ్యాంశాలు... రాష్ట్రస్థాయిలో నోడల్ వ్యవస్థ... ►పథకం పర్యవేక్షణకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో కమిటీలు వేస్తారు. జాతీయ స్థాయిలో సమీక్ష కమిటీకి కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సమీక్ష కమిటీలు ఏర్పడతాయి. ►జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి. ఏదైనా ఫిర్యాదు వస్తే రెండు వారాల్లోగా పరిష్కరించాలి. ►కేంద్రస్థాయిలో ప్రాజెక్టు మానిటర్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటు చేస్తారు. దానికి ఒక సీఈవో ఉంటారు. ఇది పథకంపై ప్రచారం చేస్తుంది. అవగాహన కల్పిస్తుంది. ►ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో కేంద్రంతో పర్యవేక్షణకు ఒక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఏదో ఒక ప్రభుత్వశాఖకు ఈ బాధ్యత అప్పగించాలి. ►పథకాన్ని అమలు చేసే వారికి ప్రోత్సాహకాలు ఇస్తారు. ► జిల్లా స్థాయిలో పీఎం–కిసాన్ పోర్టల్‌కు సంబంధించిన లాగిన్ అవకాశం కల్పిస్తారు. రైతులందరి వివరాలు అందులో ఉంటాయి. ► ఏ బ్యాంకు ద్వారా డబ్బును అందజేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణ చేయాలి. పోస్టాఫీసు, సహకార బ్యాంకు, లేదా ఇతర వాణిజ్య బ్యాంకుల్లో ఏవైనా వాటిని గుర్తించాలి. ►లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు చేరుతుంది. ► లబ్ధిదారులకు సొమ్ము చేరిన వెంటనే వారి మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. వీరంతా అనర్హులే... ►ఉన్నతాదాయ వర్గాలంతా అనర్హులు ►వివిధ సంస్థల కింద ఐదెకరాలలోపు భూమి ఉన్నవారు ► రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వారికి వర్తించదు ► తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ తాజా,మాజీ చైర్మన్లు ► కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రస్తుత, రిటైరైన ఉద్యోగులు, అధికారులు అనర్హులు ► స్వయంప్రతిపత్తి, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా అనర్హులే. (నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రం అర్హులు) ►రూ.10 వేలకు మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులంతా... ►గతేడాది ఆదాయపు పన్ను చెల్లించిన వారంతా... ►డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్‌లు తదితర వృత్తి నిపుణులు కూడా... సొంత ధ్రువీకరణే కీలకం ►లబ్ధిదారులే సొంతంగా తమ అర్హత ధ్రువీకరణపత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు ధ్రువీకరణపత్రమిస్తే, సొమ్ము వెనక్కి తీసు కుంటారు. చట్టపరమైన చర్యలు చేపడతారు. ► కొన్నిచోట్ల ఎవరైనా నిర్ణీత ఐదెకరాల లోపు భూమిని పలుచోట్ల కలిగి ఉన్నా, ఇద్దరు ముగ్గురు కలసి సాగు చేసుకుంటున్నా వారికీ అందజేస్తారు. ► ఈ నెల ఒకటో తేదీని లబ్ధిదారుల అర్హతకు గడువుగా నిర్ధారించారు. ఏడాది వరకు ఇదే తేదీని ఆధారం చేసుకొని అర్హుల జాబితాను గుర్తిస్తారు. అంటే లబ్ధిదారుల భూమికి సంబంధించి ఎటువంటి మార్పులైనా గతేడాది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు జరిగి ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటారు. లేకుంటే లేదు. ► లబ్ధిదారుల డేటాబేస్‌ను సమగ్రంగా పంపాలి. గ్రామం, పేరు, వయస్సు, సామాజిక వర్గం, బ్యాంకుఖాతా, ఆధార్, ఫోన్ నంబర్ వంటి వివరాలు పంపాలి. -
జై కిసాన్..
ఆదిలాబాద్‌టౌన్: పార్లమెంట్ ఎన్నికల వేళా కేంద్రం రైతన్నకు జై కొట్టింది. బడ్జెట్లో అన్నదాతకు పెట్టపీట వేసింది. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.8వేలు పొందుతున్న కర్షకులకు కేంద్రం సైతం పెట్టుబడి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తామని బడ్జెట్లో ప్రకటించింది. తాత్కాలిక ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతులు, మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులు, మహిళలు, తదితర వర్గాలను ఆకర్షించే పథకాలు ప్రకటించారు. అయితే బడ్జెట్లో ముఖ్యంగా ఉద్యోగుల ఆదాయ పరిమితి పన్ను పెంపు, 60 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో ఏడాదికి రూ.6వేలు జమ చేయడం, గ్రాట్యుటీ పరిమితి రూ.20లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాదాపు 10వేల మంది వరకు ఉన్నారు. ఇది వరకు ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి రూ.2లక్షల 50వేలు ఉండగా, ఈ బడ్జెట్లో వార్షిక ఆదాయ రూ.5లక్షల వరకు ఉన్నవారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.6.5లక్షల వరకు ఉన్న వారికి బీమా, పెన్షన్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ స్టాండర్డ్ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేల పరిమితికి పెంచారు. పోస్టల్, బ్యాంక్ డిపాజిట్లపై టీడీఎస్ పరిమితి పెంచారు. రూ.10వేల నుంచి రూ.40వేల వరకు టీడీఎస్ పెంపు జరిగింది. 60 ఏళ్లు నిండిన వారికి రూ.3వేల పెన్షన్.. జిల్లాలో 60 ఏళ్లు నిండిన వృద్ధులు 63వేల మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు రూ.వెయ్యి పింఛన్ అందిస్తుంది. అయితే ఎన్నికల మెనిఫెస్టోలో హామీలో నెలకు రూ.2వేలు ఇస్తామని ప్రకటించిన విషయం విధితమే. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్, 60 ఏళ్లు నిండిన వారందరికీ ప్రతీనెల రూ.3వేలు ఇచ్చే విధంగా ఈ పథకం ప్రవేశపెడుతోంది. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్ ఇవ్వనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న దాదాపు 50వేల మంది కార్మికులకు ఈ పథకం దోహద పడనుంది. రైతు ఖాతాలోకి ఏడాదికి రూ.6వేలు.. పేద రైతు ఆదాయ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరానికి రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.8వేలు చెల్లిస్తుండగా, ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చిన విధంగా ఇకపై రెండు విడతలకు కలిపి మొత్తం రూ.10వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే బడ్జెట్లో తాత్కాలిక ఆర్థిక శాఖ పీయూష్ గోయల్ రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి మూడు విడతల్లో రూ.6వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండు హెక్టార్లలోపు (5ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. దీనిద్వారా జిల్లాలో దాదాపు 50వేల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది. అంగన్వాడీల జీతాల పెంపు అంగన్వాడీ కార్యకర్తలపై కేంద్రం కరుణించింది. వీరి జీతాలను 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వేతనాల కింద రూ.3వేలు ఇస్తుండగా..రాష్ట్రం మరో రూ.7,500 కలిపి రూ.10,500 ఇస్తోంది. జీతాల పెంపుతో వారికి లబ్ధి చేకూరనుంది. జిల్లాలో మొత్తం 2,248 మంది అంగన్వాడీలు ఉన్నారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్తలు 992 మంది, ఆయాలు 992, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 264 మంది ఉన్నారు. 50 శాతం జీతాల పెంపు ప్రకటనతో వీరికి అదనంగా మరో రూ.1500 జీతం పెరగనుంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అన్నివర్గాలను ఆకర్షించేలా ఉందని పలువురు పేర్కొంటున్నారు. అసంఘటిత కార్మికులకు శ్రమయోగి బంధన్ పేరుతో పెన్షన్, కార్మికుల ప్రమాద బీమా రూ.1లక్ష 50వేల నుంచి రూ.6లక్షలకు పెంపు, ఇంటి కొనుగోలుదారులకు జీఎస్టీ ఆదాయం మినహాయింపు, సినిమా థియేటర్ ధరలపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు, వంట గ్యాస్ కనెక్షన్లు లేనివారికి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, అంగన్వాడీ కార్యకర్తల వేతనం 50శాతం పెంపు, ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయడం, ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం, కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు ఇవ్వడం, ఆయుష్మాన్ భారత్, తదితర పథకాలను ప్రవేశపెట్టారు. రైతులకు ప్రయోజనం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీసుకున్న నిర్ణయంలో రైతులకు మేలు జరుగుతుంది. 5 ఎకరాలు ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6వేలు ఇస్తుందని ప్రకటించడం సంతోషమే. అయితే ఏడాది పాటు కష్టపడి రైతులు పండించిన పంటలకు మద్దతు ధర పెంచాలి. రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి. ఎరువులు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేస్తే బాగుంటుంది. – గంధం నవీన్, రైతు, వడూర్ ఉద్యోగులకు ఊరట.. ఉద్యోగ, ఉపాధ్యాయులు నిజాయతీగా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఆదాయ పన్ను పరిమితి రూ.2లక్షల 50వేలకు ఉండగా, కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే దీని పరిమితిని మరింతగా పెంచితే బాగుండేది. సీనియర్ ఉద్యోగులు 3 నెలల జీతం ఐటీకే సరిపోతుంది. కొంతమేరకైతే బడ్జెట్ నిర్ణయం ఊరటనిచ్చింది. – శ్రీహరిబాబు, ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ -
కిసాన్.. ముస్కాన్!
సాక్షి వనపర్తి : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుర్తుండిపోయేలా వరమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం తరహాలోనే సమ్మాన్ నిధి పేరుతో రెండు హెక్టార్లు (5 ఎకరాలు) ఉన్న రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6వేలు అందిస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఉన్న సన్న, చిన్న కారు రైతులకు ఎంతో మేలు జరగనుంది. రైతులకు మేలుచేసే బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ శుక్రవారం ఉదయం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినవిషయం విధితమే. ఈ బడ్జెట్ ఇన్నాళ్లూ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రైతాంగానికి ఊరటనిచ్చింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.8వేలు అందిస్తోంది. మరో అడుగు ముందుకేస్తూ ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఈ పథకం తరహాలోనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్లో 2 హెక్టార్ల లోపు అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్న కారు రైతులకు మాత్రమే ఏడాదికి మూడు పర్యాయాలు రెండు ఎకరాల చొప్పున మొత్తం రూ.6 వేలు అందిస్తామని ప్రకటించింది. రైతుబంధు స్ఫూర్తితో.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వారివారి రాష్ట్రాల్లో ఈ తరహా పథకాలను ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఇదే అంశంపై మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడంలో రైతుబంధు పథకం కీలకంగా మారింది. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా అధిక శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగం పైనే ఆధారపడ్డారు. కిసాన్‌కు సమ్మాన్ ఎన్నికల ముందు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు రైతులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం సర్వసాధారణం. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం రైతుల మద్దతు పొందడానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఎకరానికి రూ.6 చొప్పున సంవత్సరంలో మూడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఐదు ఎకరాలున్నవారికే.. భూ రికార్డుల ప్రక్షాళన ప్రకారం జిల్లాలో 1,52,621 మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో 1,21,839 మంది రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రూ.125 కోట్ల 16 లక్షలను పంపిణీ చేశారు. అదే రబీ సీజన్లో 1,07,528 మంది రైతులకు రూ.117 కోట్ల 51 లక్షల 66 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇదిలాఉండగా జిల్లాలో ఒక హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 85,944 , రెండు హెక్టార్ల లోపు ఉన్న రైతులు 31,474 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ పథకానికి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులే అర్హులుగా ప్రకటించగా నిజానికి జిల్లాలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారు. 4 హెక్టార్లలోపు భూమి ఉన్న వారు 15,557 మంది, 10 హెక్టార్ల లోపు ఉన్న వారు 4,002 మంది, 10 హెక్టార్ల కంటే అధికంగా ఉన్న వారు 350 మంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో.. జిల్లాలో ఒక హెక్టారు భూమి ఉన్న రైతులు 1,42,416 మంది ఉన్నారు. అలాగే రెండు హెక్టార్ల భూమి ఉన్న రైతులు 67,658 మంది ఉన్నారు. అదేవిధంగా 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతుల 33,672 , 4 నుంచి 10 హెక్టార్లలోపు 8563 మంది, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 841 మంది రైతులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో... ఒక హెక్టారు 1,80,328, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 77,611 మంది, 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులు 38,264, 4 నుంచి 10 హెక్టార్లలోపు 11,618, 10 హెక్టార్లకు పైగా ఉన్న వారు 1263 మంది ఉన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో.. ఈ జిల్లాలో ఒక హెక్టారు ఉన్న రైతులు 76,414 మంది, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 39,038 మంది ఉన్నారు. అలాగే నాలుగు హెక్టార్ల లోపున్నవారు 20,267 మంది, 4 నుంచి 10 హెక్టార్లలోపు 6,026, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 620 మంది రైతులు ఉన్నారు. -
గ్రామాలకు కాలుష్య కారక ఔషధ పరిశ్రమలా..?
సాక్షి, హైదరాబాద్: నగర వాసులకు ఇబ్బందిగా మారిన కాలుష్య కారక ఔషధ పరిశ్రమలను గ్రామాలకు తరలించడం ఎలాంటి పర్యావరణ న్యాయమో చెప్పాలని కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్ కోదండరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ నగర శివారు ముచ్చెర్లలో నిర్మించ తలపెట్టిన ఫార్మా సిటీలోకి కాలుష్య కారక పరిశ్రమలు తరలించడం ద్వారా పరిసర గ్రామాలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. ఫార్మా సిటీ నిర్మాణంతో లభించే ఉద్యోగాల సంఖ్యపై ప్రభుత్వం గందరగోళంగా మాట్లాడుతోందని విమర్శించారు. 15.95లక్షలు, 8.79లక్షలు, 4.60లక్షల ఉద్యోగాలు వస్తాయంటూ వేర్వేరు సందర్భాల్లో ప్రకటించిన ప్రభుత్వం తాజాగా 5.56లక్షల ఉద్యోగాలే వస్తాయని చెబుతుందన్నారు. ఫార్మా సిటీలో 140 భారీ పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశముంటే, ఒక్కో పరిశ్రమ ద్వారా కేవలం 1,000 మందికి మించి ఉద్యోగావకాశాలు లభించవన్నారు. ఈ లెక్కన కేవలం 1.40లక్షల ఉద్యోగాలు మాత్రమే వస్తాయన్నారు. మిగిలిన 4.16లక్షల ఉద్యోగాలను అక్కడ ఏర్పాటు చేసే 616 చిన్న తరహా పరిశ్రమల్లో కల్పిస్తారా? అని ప్రశ్నించారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
కొత్తకోట(రావికమతం), న్యూస్‌లైన్: వరుస తుఫాన్లతో అతలాకుతలమైన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, తక్షణం రైతుల రుణాలన్నీ రద్దుచేసి కొత్త రుణాలివ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రావు వెంకట జగ్గారావు డిమాండ్ చేశారు. మంగళవారం మండల చెరకు రైతుల సంఘం నాయకుడు మడ్డు రాజిబాబు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయీ రైతు సదస్సు కొత్తకోటలో జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ నీలం తుఫాన్ పంట నష్టపరిహారం ఇప్పటికీ రైతులకు అందలేదన్నారు. బ్యాంకు రుణాలు పారిశ్రామికవేత్తలు 82 శాతం అధికంగా పొందుతున్నారని, రైతులకు కేవలం 18 శాతం మాత్రమే అందుతున్నాయని తెలిపారు. రైతు ప్రైవేటు వడ్డీవ్యాపారుల వద్ద రుణాలు చేసి అప్పులపాలై నష్టపోతున్నారన్నారు. ఈ సమస్యలపై 18, 19, 20 తేదీల్లో గుంటూరులో జరిగే కిసాన్ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు గంగా భవానీ, నూకునాయుడు, వారా నూకరాజు, మేకా సత్యనారాయణ, జి. జోగిరాజు తదితరులు పాల్గొన్నారు.