
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న మూవీ "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్, ఎల్ఎల్ పీ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ కొట్టిన దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
తాజాగా ఈ మూవీ నుంచి వస్సాహి వస్సాహి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. యాక్టర్ శివాజీ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు. సాంగ్ అద్భుతంగా ఉందని.. ఇంతవరకు సంస్కృత భాషలో ఏ పాట రాలేదని శివాజీ అన్నారు. హీరో మాధవ్‌తో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కాగా.. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా.. లిరిక్ రైటర్ శివశక్తి దత్తా సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీరామచంద్ర పాడారు. 'సౌందర్య సార, మకరంద దార, శృంగార పారవరా, సౌవర్ణ ప్రతిమ, లావణ్య గరిమ,చతురస్య చాతుర్య మహిమ కింతు పరంతు విరంచ్య విరచితం కిమిదం, ఇదంకిం తమాషా...వస్సాహి వస్సాహి' అంటూ సంస్కృత సాహిత్యంతో ఆకట్టుకునేలా ఉంది ఈ సాంగ్. ఈ చిత్రంలో జయప్రకాష్, ఆచంట మహేశ్, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, కాశీ విశ్వనాథ్, హిమజ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment