ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీకి మరో షాక్ తగలింది. కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా డజను మందికిపైగా ఉద్యోగులు రియల్‌మీ ఇండియా (Realme India) సంస్థకు రాజీనామా చేసినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం రాజీనామా చేసిన మాజీ సీఈఓ మాధవ్ సేత్ (Madhav Sheth) పెట్టిన కొత్త సంస్థ హానర్ టెక్‌లో చేరేందుకే ఆ ఉద్యోగులు రియల్‌మీని వీడినట్లు సమాచారం.
రియల్‌మీ ఇండియా సంస్థకు చెందిన అత్యున్నత డైరెక్టర్లతో సహా పలువురు ఉద్యోగులు మాధవ్ సేత్ కొత్త కంపెనీ హానర్ టెక్‌లో చేరిన నేపథ్యంలో రియల్‌మీ ఇండియా సంస్థలో మరిన్ని సామూహిక రాజీనామా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజీనామా చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో మాజీ సేల్స్ డైరెక్టర్ దీపేష్ పునమియా కూడా ఉన్నారు. ఇటీవల ఆయన హానర్ టెక్ కంపెనీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. కాగా ఉద్యోగుల రాజీనామాల విషయంపై రియల్‌మీ సంస్థ నుంచి ఎంటువంటి స్పందనా లేదు.
ఇదీ చదవండి ➤ Best Light Weight Smart phones: బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి..
ఎగుమతులకు సంబంధించిన కొత్త వెంచర్‌ను ప్రారంభించడం కోసమని మాధవ్ సేత్ జూన్ నెలలో రాజీనామా చేశారు. అప్పటి వరకు కంపెనీలో ఆయన ఐదేళ్లు పనిచేశారు. రియల్‌మీ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా, రియల్‌మీ ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్‌నకు ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. రియల్‌మీ ఫౌండర్ స్కైలీతో కలిసి మాధవ్ సేత్ 2018 మేలో అధికారికంగా బ్రాండ్‌ను స్థాపించారు.
Comments
Please login to add a commentAdd a comment