చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ తన పదవికి రాజీనామా వేశారు. సంస్థకు ఐదేళ్ల పాటువిజయంతంగా సేవలందించి, ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్‌మీ ప్రముఖ బ్రాండ్‌గా నిలబెట్టిన మాధవ్ సేత్ ఉన్నట్టుండి గుడ్ బై చెప్పడం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.ఆయన నిష్క్రమణ కంపెనీకి గణనీయమైన ఎదురుదెబ్బ అని మార్కెట్ వర్గాల అంచనా. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!)
ఈ సమాచారాన్ని మాధవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సంస్థకు వీడ్కోలు పలకడం కష్టమే కానీ, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయం వచ్చిందంటూ ఒక నోట్‌ను మాధవ్ ట్వీట్ చేశారు. రియల్‌మీకి తన జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉందని ఎన్నో అద్భుతమైన మరపురాని క్షణాలను అందించిందని పేర్కొన్నారు.
అంతేకాదు ఈ సందర్భంగా తన పదవీ కాలంలో కొన్ని ముఖ్యమైన విజయాలను హైలైట్ చేశారు. రియల్‌మీ తన స్మార్ట్‌ఫోన్‌ను తొలిసారిగా యూనివర్సిటీలో విడుదల చేసి చరిత్ర సృష్టించింది. కంపెనీ 50 మిలియన్లకు పైగా ఉత్పత్తులను విక్రయించి, వేగంగా అమ్ముడవుతున్న బ్రాండ్‌గా మారింది. దేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్లేయర్‌గా కూడా నిలిచింది. నాణ్యత, కమిట్‌మెంట్‌కు తోడు "మేక్ ఇన్ ఇండియా" చొరవ ఫలితంగా 5 జీ స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తికి దారితీసింది. గత ఐదేళ్లలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, టీమ్‌లు, పార్టనర్స్, ఇలా ప్రతి ఒక్కరికీ షేత్ తన కృతజ్ఞతలు తెలిపారు. (Adipurush Promotions: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే )
మాధవ్ సేత్ పయనం ఎటు?
రియల్‌మిని వీడిన తరువాత, మాధవ్ ప్రస్థానం ఎటు అనేదే ఇపుడు ప్రధాన ప్రశ్న. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ, ప్రధాన ప్రత్యర్థి హానర్‌లో చేరవచ్చని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాధవ్ అధికారిక ధృవీకరణ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. హానర్ భారత మార్కెట్ నుండి వైదొలగనుందంటూ గతంలో వచ్చిన పుకార్లొచ్చాయి. అయాతే కంపెనీ ప్రతినిధి ఈ వాదనలను ఖండించిన సంగతి తెలిసిందే. <
Goodbye can be disheartening, but world is too small until we meet again.
— Madhav Sheth (@MadhavSheth1) June 14, 2023
Farewell for now, but our paths may cross again soon, and that's something to look forward to building a better and bigger me. #Goodbye #UntilWeMeetAgain pic.twitter.com/sXSG06DFIR
Comments
Please login to add a commentAdd a comment