
జోహో సీఈవో మణి వెంబు
బెంగళూరు: గతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియాతో కొత్త కెరియర్లు వచ్చినట్లే కృత్రిమ మేథతో (ఏఐ) కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయని జోహో సీఈవో మణి వెంబు తెలిపారు. ఏఐ సొల్యూషన్స్‌కి సంబంధించి పాశ్చాత్య దేశాలకు భారత్ గట్టి పోటీదారుగా ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు. పుష్కలంగా నిపుణుల లభిస్తుండటం, దేశీయంగా సొల్యూషన్స్ రూపొందించుకోవాలన్న ఆకాంక్షలు పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలవని వెంబు చెప్పారు.
ఏఐ కల్పించగలిగే అవకాశాలను విశాల దృక్పథంతో పరిశీలించి, తగు దిశలో ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఏఐ, కొత్త సాంకేతికతలను ఉపయోగించి తమ ప్రస్తుత సిబ్బంది ఉత్పాదకతను పెంచుకునే మార్గాలపై జోహో ప్రధానంగా దృష్టి పెడుతోందని వెంబు వివరించారు. మరోవైపు, అమెరికాలో విధానాలు, టారిఫ్‌లపరంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావాలను దేశీ ఐటీ పరిశ్రమ ఇప్పుడే అంచనా వేయలేదని, వేచి చూసే ధోరణిని పాటించాల్సి ఉంటుందని వెంబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment