Mani
-
Umamani: సముద్రం ఘోషిస్తోంది..
సముద్రం నిత్యం ఘోషిస్తూ ఉంటుంది. ఆ ఘోషకు భావకవులు రకరకాల అర్థాలు చెప్తుంటారు. కానీ సముద్రం లోపల ఏముంది? సముద్రం లోపల మరో ప్రపంచం ఉంది. పగడపు దీవులమయమైన ఆ అందమైన ప్రపంచాన్ని చందమామ కథల్లో చదివాం. మన ఊహల్లో అద్భుతమైన దృ«శ్యాన్ని ఊహించుకున్నాం. ఇప్పటికీ అదే ఊహలో ఉన్నాం. కానీ ఆ ఊహలో నుంచి వాస్తవంలోకి రమ్మని చెబుతున్నారు ఉమామణి. ఒకప్పుడు అందమైన పగడపు దీవులను చిత్రించిన ఆమె కుంచె ఇప్పుడు అంతరించిపోయిన పగడపు దీవులకు అద్దం పడుతోంది. బొమ్మలేయని బాల్యం..‘‘మాది తమిళనాడులోని దిండిగల్. నాకు బొమ్మలేయడం చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడు చూసినా రంగు పెన్సిళ్లతో బొమ్మలు గీస్తూ కనిపించేదాన్ని. అది చూసి నానమ్మ ‘పిచ్చి బొమ్మల కోసం కాగితాలన్నీ వృథా చేస్తున్నావు. చక్కగా చదువుకోవచ్చు కదా’ అనేది. అలా ఆగిపోయిన నా చిత్రలేఖనం తిరిగి నలభై దాటిన తర్వాత మొదలైంది. ఈ మధ్యలో నాకు ఓ డాక్టర్‌తో పెళ్లి, వారి ఉద్యోగరీత్యా మాల్దీవులకు వెళ్లడం, ఓ కొడుకు పుట్టడం, ఆ కొడుకుకి కాలేజ్ వయసు రావడం జరిగిపోయాయి.ఇంతకాలం గృహిణిగా ఉన్న నాకు కొడుకు కాలేజ్కెళ్లిపోయిన తర్వాత ఆ ఖాళీ సమయాన్ని చిన్నప్పుడు తీరని కోరిక కోసం కేటాయించాను. గులాబీల నుంచి టులిప్స్ వరకు రకరకాల పూలబొమ్మలు వేసిన తర్వాత నా చుట్టూ ఉన్న సముద్రం మీదకు దృష్టి మళ్లింది. పగడపు దీవులు నా చిత్రాల్లో ప్రధాన భూమిక అయ్యాయి. తొలి చిత్ర ప్రదర్శన మాల్దీవులలోని మెరైన్ సెంటర్లో పెట్టాను. ఆ తర్వాత అనేక ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. వివాంత మాల్దీవ్స్ ప్రదర్శన సమయంలో ఒక భారతీయ మహిళ వేసిన ప్రశ్న నా దిశను మార్చింది.‘సముద్ర గర్భం ఎలా ఉంటుందో ఏమేమి ఉంటాయో స్వయంగా చూడకుండా బొమ్మలేయడం ఏమిటి’ అన్నదామె. ఆమె వ్యాఖ్య నాకు మొదట్లో అసమంజసంగా అనిపించింది. అనేక పరిశోధకుల డాక్యుమెంటరీలను చూసిన అనుభవంతోనే కదా చిత్రించాను. నేను స్వయంగా చూస్తే కొత్తగా కనిపించేది ఏముంటుంది... అని కూడా అనుకున్నాను. ఇంత సందిగ్ధం ఎందుకు... ఒకసారి సముద్రగర్భంలోకి వెళ్లి చూద్దాం అని కూడా అనుకున్నాను. అప్పుడు మా అబ్బాయి మా ΄ాతికేళ్ల వివాహ వార్షికోత్సవం బహుమతిగా నన్ను స్కూబా డైవింగ్ కోర్సులో చేర్చాడు.డైవింగ్కంటే ముందు ఈత రావాలి కదా అని చెన్నైకి వచ్చి రెండు వారాల స్విమ్మింగ్ కోర్సులో చేరాను. తిరిగి మాల్దీవులకెళ్లి స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. తొలి రోజు అంతా అగమ్యంగా అనిపించింది. రెండవ రోజు కూడా అదే పరిస్థితి. మానేద్దామనే నిర్ణయానికి వచ్చేశాను. కోచ్ నా మాటలు పట్టించుకోలేదు. ప్రయత్నాన్ని కొనసాగించమని మాత్రం చె΄్పారు. నాకు నేను నెల రోజుల గడువు పెట్టుకున్నాను. ఆ నెలలో నావల్ల కాకపోతే మానేద్దామని నా ఆలోచన. ఆ నెల రోజుల్లో డైవింగ్‌కి అనుగుణంగా మానసికంగా ట్యూన్ అయిపోయాను.సముద్రగర్భాన్ని చిత్రించాను.. సముద్రం అడుగున దృశ్యాలు నన్ను వేరేలోకంలోకి తీసుకెళ్లిపోయాయి. పగడపు చెట్లు నిండిన దిబ్బలు, రకరకాల చేపలు, ΄ాములు ఒక మాయా ప్రపంచాన్ని చూశాను. ఆ ప్రపంచాన్ని కాన్వాస్ మీద చిత్రించడం మొదలుపెట్టాను. ఒక చిత్రానికి మరో చిత్రానికి మధ్య మాటల్లో వర్ణించలేనంత వైవిధ్యత వచ్చేసింది. ఆ చిత్రాలన్నింటినీ మాల్దీవుల మెరైన్ సింపోజియమ్ 2016లో ప్రదర్శించాను. ఆ చిత్రాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లా ఓషన్ రీసెర్చర్లు, అంతరించిపోతున్న పగడపు దిబ్బల పరిశోధకులకు ఉపయోగపడ్డాయి. కొంతకాలం తర్వాత సముద్రగర్భంలోని సన్నివేశాలను కెమెరాలో బంధించాలనుకున్నాను. ఫొటోగ్రఫీలో అనుభవం లేకపోవడంతో శబ్దరహితంగా పేలవంగా వచ్చింది ఫిల్మ్. అప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్, డాక్యుమెంటరీలు తీసే వారి దగ్గర మెళకువలు నేర్చుకునే ప్రయత్నం చేశాను. చాలామంది స్పందించలేదు. ఫిల్మ్ మేకర్ ప్రియా తువాస్సెరీ మాత్రం నాతో కలిసి ఫిల్మ్ తీయడానికి సిద్ధమయ్యారు.చిత్రీకరణ కోసం 2018లో మనదేశంలోని రామేశ్వరం, రామనాథపురం, టూటికోరన్ తీరాల్లో డైవ్ చేశాను. ఆశ్చర్యంగా సముద్రం అడుగుకి వెళ్లే కొద్దీ పగడపు దిబ్బలు కాదు కదా జలచరాలు కూడా కనిపించలేదు. ΄్లాస్టిక్ వ్యర్థాలు దిబ్బలుగా పేరుకుపోయి ఉన్నాయి. రసాయనాలు, పురుగుమందులు, ఎరువుల వ్యర్థాలను సముద్రపు నీటిలోకి వదలడంతో జలచరాలు అంతరించిపోయాయి. సునామీ విలయంలో పగడపు దీవులు అతలాకుతలం అయిపోయాయి. శిథిలమైన ఆనవాళ్లు తప్ప పగడపు చెట్ల సమూహాలు లేవు. చెట్లు చనిపోయిన దిబ్బలనే వీడియో, ఫొటోలు తీశాను.మనిషి తన సౌకర్యం కోసం చేసే అరాచకానికి సముద్రం ఎలా తల్లడిల్లిపోతోందో తెలియచేస్తూ ఆ ఫొటోలతో ప్రదర్శన పెట్టాను. మా సొంతూరు తమిళనాడులోని దిండిగల్‌తో మొదలు పెట్టి అనేక స్కూళ్లు, కాలేజ్‌లకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నాను. సముద్రం ఘోషిస్తోంది. ఆ ఘోషను విందాం. ప్రకృతి సమతుల్యతను కా΄ాడుకుందాం. ఓషన్ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మీద పరిశోధన చేసే వాళ్లకు నేను తీసిన ఫొటోలు, చిత్రలేఖనాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లా ఉపయోగపడుతున్నాయి.ఒక సాధారణ గృహిణిగా నేను 43 ఏళ్ల వయసులో కుంచె పట్టి పెయింటింగ్స్ మొదలుపెట్టాను. 49 ఏళ్లకు స్కూబా డైవింగ్ నేర్చుకుని సాగర సత్యాలను అన్వేషించాను. సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని సేకరించగలిగాననే సంతృప్తి కలుగుతోంది. మొత్తంగా నేను చెప్పేదేమిటంటే ‘వయసు ఒక అంకె మాత్రమే. మన ఆసక్తి మనల్ని చోదకశక్తిగా నడిపిస్తుంది’. అంటారు ఉమామణి.ఇవి చదవండి: Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది -
వివాహేతర సంబంధం కారణంగా మహిళపై యాసిడ్ దాడి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో వితంతు మహిళపై ఓ ఆటోడ్రైవర్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలుడు, యువతి సహా ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకోగా.. కొద్దిగంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపిన వివరాల ప్రకారం.. ఐతవరం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆమెకు ఓ కుమారుడున్నాడు. భర్త మరణించడంతో ఆ మహిళ ఐతవరం వచ్చేసి తల్లిదండ్రుల వద్ద ఆశ్రయం పొందుతోంది. సుమారు 8 నెలల క్రితం నెల్లూరుకు చెందిన రాణింగారం మణిసింగ్ (32)తో ఆ మహిళకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. నెల్లూరులోనే ఆటో నడుపుతూ జీవనం సాగించే మణిసింగ్‌కు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఆ మహిళ ఐతవరంలోనే వేరే ఇంటికి మారింది. ఆమె వద్దకు మణిసింగ్ తరుచూ వస్తుండేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోగా.. మణిసింగ్‌కు క్షయ వ్యాధి సోకినట్టు తెలుసుకున్న సదరు మహిళ అతన్ని దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న మణిసింగ్ ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. నెల్లూరు నుంచే యాసిడ్ తెచ్చుకుని.. ఈ నెల 8వ తేదీ శనివారం నెల్లూరులో 100 మిల్లీలీటర్ల యాసిడ్ బాటిల్ కొనుగోలు చేసిన మణిసింగ్ మహిళ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఆ ఇంట్లో ఆమె కుమారుడితో పాటు ఆమె సోదరి కుమార్తె ఉన్నారు. వారితో కలిసి మణిసింగ్ భోజనం చేసి అక్కడే నిద్రించాడు. ఆదివారం వేకువజామున 4 గంటలకు అందరూ నిద్రమత్తులో ఉండగా మణిసింగ్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను మహిళ ముఖంపై పోసి పరారయ్యాడు. ఈ ఘటనతో మహిళ శరీరం 20 శాతం గాయపడగా, ఆమె కుమారుడుకి, ఆమె సోదరి కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో చుట్టుపక్కల వారు లేచి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందిగామ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నందిగామ శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న మణిసింగ్ను ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేశారు. అతడిపై నాన్‌బెయిలబుల్ కేసులు కట్టారు. బాధితులకు అండగా ప్రభుత్వం యాసిడ్ దాడిలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు బాధితుల్ని పరామర్శించారు. -
డైరెక్టరుగా సైన్ చేసి హీరోగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే...
-
30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం.. మిన్ను మణి విజయగాథ ఇదే!
‘మా అమ్మా నాన్నలు ఇకపై నన్ను టీవీలో చూస్తారు’అని సంతోష పడింది మిన్ను మణి. దేశీయంగా ఆమె ఆడిన క్రికెట్ మేచ్లుటీవీలో టెలికాస్ట్ కాలేదు. ‘విమెన్స్ ప్రీమియర్ లీగ్’ కోసం 30 లక్షలకు మిన్ను మణిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతంచేసుకున్నాక ఆమె ఆట తప్పక టెలికాస్ట్ కానుంది. రోజుకు నాలుగు బస్సులు మారి 52 కిలోమీటర్ల దూరంలోని క్రికెట్ స్టేడియంకు వెళ్లిప్రాక్టీస్ చేసిన మణి కేరళలో ఈస్థాయికి ఎదిగిన తొలి గిరిజన మహిళా క్రికెటర్. మహిళా క్రికెట్ ఇప్పుడు విజయ పరంపరలో ఉంది. నిర్లక్ష్య వర్గాల నుంచి కూడా ఈ ఆటకు చేరొచ్చు అని చెబుతున్న మిన్ను మణిది కూడా ఒక విజయగాధ. ‘ముప్పై లక్షల రూపాయలు. నా జీవితంలో చూస్తానని అనుకోలేదు. మొదట నేనొక స్కూటీ కొనుక్కోవాలి. బస్సుల్లో తిరుగుతూప్రాక్టీసుకు ఇకపై వెళ్లను. ఆ తర్వాతే ఆ డబ్బుతో ఏం చేయాలో ఆలోచిస్తాను’ అంది మిన్ను మణి. ఫిబ్రవరి 13న ముంబైలో ‘విమెన్స్ ప్రీమియర్ లీగ్’ కోసం మహిళా క్రికెటర్ల వేలం జరుగుతున్నప్పుడు మిన్ను మణి హైదరాబాద్‌లో సౌత్ జోన్ తరపున ఇంటర్ జోన్ టోర్నమెంట్ ఆడుతోంది. ఆ రోజున 91 బాల్స్‌కు 74 కొట్టి నాటౌట్‌గా నిలిచింది. ఆట ఒకవైపు సాగుతూ ఉన్నా మనసంతా ముంబై ఆక్షన్ మీదే ఉంది. ‘పెద్ద పెద్ద మహిళా క్రికెటర్లకు కూడా వేలంలో ధర పలకకపోతుండే సరికి నిరాశ కలిగింది. నా బేస్ ప్రైస్ 10 లక్షలు పెట్టారు. ఎవరూ తీసుకోరేమో అనుకున్నాను. కానీ ఢిల్లీ, బెంగళూరు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 30 లక్షలకు ఢిల్లీ కేపిటల్స్ నన్ను సొంతం చేసుకుంది. అప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను’ అంది మిన్ను మణి. ‘ఆ విషయం ఫోన్లో చెప్తే మా అమ్మా నాన్నలు డబ్బు గురించి కాక నా ఆట గురించి అడిగారు. టీవీలో వస్తుందా అన్నారు. వస్తుంది అని చె΄్పాను’ అంది సంతోషంగా. కరూచియ 23 ఏళ్ల మిన్ను మణిది కేరళలోని వయనాడ్ జిల్లాలోని గిరిజన గూడెం. ఇది బ్రహ్మగిరి కొండల అంచున ఉంటుంది. మణిది ‘కరూచియ’ గిరిజన తెగ. వీళ్లు తమను తాము కొండ బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు. తమ ఆచారాలు స్ట్రిక్ట్‌గా పాటిస్తారు. గురి చూసి బాణం వేయడంలో మేటిగా పేరు గడించారు. కాని ఇప్పుడు వారంతా చిన్న చిన్న పనులు చేసుకు బతుకుతున్నారు. మిన్ను మణి తండ్రి మణి రోజు కూలి. తల్లి వసంత గృహిణి. చిన్నప్పటి నుంచి మిన్ను మగపిల్లలతో కలిసి పొలాల్లో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడేది. ఎలిమెంటరీ స్కూల్లో రన్నర్‌గా ప్రతిభ చూపేది. 8 వ తరగతిలో హైస్కూల్లో చేరాక ఆమె ప్రతిభను ఆ స్కూల్లో ఎల్సమ్మ బేబీ అనే పీయీటీ టీచరు గుర్తించింది. ‘మిన్ను రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. రైట్ హ్యాండ్ బ్యాట్స్ఉమన్. బౌలింగ్‌లో బ్యాటింగ్‌లో ఆ అమ్మాయి టాలెంట్ చూసి చాలా దూరం వెళుతుందని అనుకున్నాను’ అంటుంది ఆ పీయీటీ టీచర్. ఆ పీయీటీ టీచరే పూనుకుని తిరువనంతపురంలోని కేరళ క్రికెట్ అసొసియేషన్ దగ్గరకు తీసుకువెళితే వారు పరీక్షించి ట్రయినింగ్ ఇచ్చారు. దాంతో మిన్ను మణి ముందు వయనాడ్ జిల్లా జట్టుతో అటు పిమ్మట అండర్ 16 జట్టుతో ఆ తర్వాత కేరళ రాష్ట్ర మహిళా జట్టుతో ఆడటం మొదలుపెట్టింది. కష్టే ఫలి అయితే మిన్ను మణి క్రికెట్ ఆడటానికి మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ‘కేరళలో అమ్మాయిలు అథ్లెట్లుగా రాణిస్తారు. నన్ను కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా చూడాలని మా అమ్మానాన్నలు అనుకున్నారు. క్రికెట్ మగవాళ్ల ఆట అని వారి అభి్రపాయం. కాని మా పీయీటీ టీచరు వారిని ఒప్పించి నన్ను క్రికెట్లోకి తీసుకెళ్లింది. నేను క్రికెట్ బాగా ఆడుతున్నానని తెలిశాక వారు మనస్ఫూర్తిగా ్రపోత్సహించసాగారు’ అంది మిన్ను. కానీ క్రికెట్‌లాంటి ఖరీదైన ఆటకు కావలసిన మంచి కిట్ కూడా మిన్ను దగ్గర లేదు. వాళ్ల నాన్న అప్పులు చేసి మిన్ను ఆట కొనసాగేలా చూశాడు. మిన్నుప్రాక్టీసు చేయాలంటే వారి గూడేనికి 52 కిలోమీటర్ల దూరంలోని కృష్ణగిరి క్రికెట్ స్టేడియమే గతి. అంత దూరం వెళ్లడానికి మిన్ను తెల్లవారు జామునే లేచి ఇంటి పనుల్లో తల్లికి సాయం చేసి నాలుగు బస్సులు మారి స్టేడియంకు చేరుకునేది. తిరిగి ఇల్లు చేరే సరికి సాయంత్రం 7 అయ్యేది. ‘అలిసిపోయేదాన్ని. కాని పట్టుదలగా ఆట కొనసాగించాను’ అంటుంది మిన్ను. ఆటలో విజయాలు మిన్ను మణి కేరళ అండర్ 23లో ఆ తర్వాత భారత్ అండర్ 23 జట్టులో ప్రతిభ చూపింది. ఇండియా ఏ జట్టుకు ఎంపికై ఆడింది. విమెన్స్ ఆల్ ఇండియా ఒన్ డే టోర్నమెంట్లో 8 మేచ్‌లు ఆడి 246 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. దాంతో అందరి దృష్టి మిన్ను మీద పడింది. క్రికెట్ ఆడటం మొదలెట్టాక వచ్చిన కొద్ది పాటి డబ్బులో ప్రతి పైసా తన కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉపయోగించింది. మిగిలిన డబ్బుతో చిన్న ఇల్లు కడితే 2018 వరదల్లో ఆ ఇల్లు దెబ్బతింది. క్రికెట్ అభిమానులు ఆదుకుని రిపేర్లు చేయించారు. ఇప్పుడు 30 లక్షల సంపాదన స్థాయికి మిన్ను చేరింది. ‘దీని కంటే జాతీయ జట్టులో స్థానంపొందడమే నాకు ఎక్కువ ఆనందం. అదే నా లక్ష్యం’ అంటోంది మిన్ను మణి. -
రిలయన్స్ చేతికి జస్ట్ డయల్!
ముంబై: దేశీయ ఆన్లైన్ కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్ఆర్వీఎల్) అడుగులు వేస్తుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ పై నియంత్రణ తీసుకున్నట్లు తెలిపింది. లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. ఇంతకు ముందు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్ట్‌డయల్ వ్యవస్థాపకుడు వీఎస్ఎస్ మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని ఆర్ఆర్వీఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపిన ఒక ప్రకటనలో.. ఆర్ఆర్వీఎల్, జస్ట్‌డయల్, వీఎస్ఎస్ మణి, ఇతరుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.1,022.25 రేటు చొప్పున ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఆర్‌ఆర్‌వీఎల్‌కు కేటాయించినట్లు తెలిపింది. అలాగే వీఎస్ఎస్ మణి నుంచి షేరు ఒక్కింటికి రూ.1,020 రేటు చొప్పున ఆర్ఆర్వీఎల్ 1.31 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. జస్ట్ డయల్ అనేది భారతదేశంలోని ప్రముఖ లోకల్ సెర్చి ఇంజిన్ ఫ్లాట్ ఫారం. ఇది టెలిఫోన్ మరియు టెక్ట్స్ ద్వారా వెబ్ సైట్లు, యాప్ లు వంటి బహుళ ఫ్లాట్ ఫారాల ద్వారా దేశవ్యాప్తంగా యూజర్లకు సెర్చ్ సంబంధిత సేవలను అందిస్తుంది.(చదవండి: వాట్సాప్‌కు ఐర్లాండ్ భారీ షాక్...!) -
గురి
సర్కస్ జనాలతో కిక్కిరిసిపోయింది. ఆ ఊళ్ళో అదే మొదటి ఆట.నింగిలో వేలాడే ఉయ్యాలల మీద నాజూకైన అమ్మాయిలు చేస్తున్న విన్యాసాలు, వారిని అనుకరించబోయి విఫలమై అంత ఎత్తునుంచీ కిందకి వలలో పడిపోతున్న మరగుజ్జు హాస్యగాళ్ళు, వారిని చూస్తూ కేరింతలు కొడుతున్న జనం. ఏమీ మారలేదు. జనాల కేరింతలు తనకి ఇప్పటికీ అదే ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆ కేరింతలు విని ఎంతకాలం అయ్యిందో! జైల్లో, ఆ నాలుగు గోడల మధ్యన, కేవలం తన ఉఛ్వాసనిశ్వాసలే తప్ప ఈ సందడేది?పరదా పక్కకి జరిపి ఆ జనాలకేసి చూశాడు మణి, అలియాస్ తల్వార్ మణి. అప్పట్లో తన ప్రదర్శన చూడటానికి జనాలు ఎగబడేవాళ్ళు. కేవలం తనవల్లే ఆ సర్కస్ నడిచిందన్నా అతిశయోక్తి కాదేమో! కానీ మునుపటి ఓపిక ఇప్పుడు లేదు. చూపు కూడా మందగించింది. కేవలం చినబాబు అడిగాడనే కాదు, తనMీ ఈ సర్కస్‌తో విడదీయలేని అనుంబంధం ఉంది. తను రూబీని కలిసింది కూడా ఇక్కడే. ఒకటా రెండా పద్నాలుగు సంవత్సరాల అనుబంధం, మరో పద్నాలుగు సంవత్సరాల ఎడబాటు! తన బలమైన కోరికో, లేక దైవేచ్చో మళ్ళీ ఇన్నేళ్ళకి ఇక్కడ అడుగుపెట్టాడు. తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం అయిన పెద్దయ్య ఇప్పుడు పక్షవాతం వచ్చి కేవలం కుర్చీకే పరిమితం అయ్యాడని తెలిసినా, చినబాబుని బ్రతిమిలాడి ఆయనముందే మళ్ళీ తన పునరాగమనం జరగాలని, మొదటివరుసలోనే కూర్చొని దగ్గరగా పెద్దయ్య తనని చూడాలని పట్టుబట్టాడు మణి. సరే అనక తప్పలేదు చినబాబుకి. దూరంగా అచేతన స్థితిలో ఉన్న పెద్దయ్య మణిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. తరువాతి ప్రదర్శన తనదే. సిద్ధమవుతున్నాడు మణి. విసరవలసిన కత్తులు, కంటికి కట్టుకొనే ఆ నల్లగుడ్డ, అన్నింటినీ ఒకసారి తడిమి చూసుకున్నాడు. ఆ కత్తులంటే అతనికి ఎంతో ప్రేమ. వెలుపల నుంచి తన పేరు పిలుస్తున్నారు. ఆ క్షణం రానే వచ్చింది. నోటితో గట్టిగా గాలి తీసి వదిలాడు. పరదా తొలగించుకుంటూ జనాల మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు తల్వార్ మణి. చెయ్యెత్తి అందరికీ అభివాదం చేశాడు. జనాలు లేచి మరీ చప్పట్లు కొట్టారు. అదీ అతని స్థాయి. దేశంలోనే అతనిలా కళ్ళకు గంతలు కట్టుకొని మనిషికి తగలకుండా కత్తులు విసరగలిగేవాడు మరొకడు లేడని అప్పట్లో అన్ని వార్తా పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చాయి. జనాలు స్థిమితపడ్డారు. ఎదురుగా సుమారు ఒక యిరవై అడుగుల దూరంలో గుండ్రపు చెక్కకి ఒక అమ్మాయిని తెచ్చి కట్టేశారు. ఎదురుగా అమ్మాయి. ఆమెకి కొంచెం పక్కగా పెద్దయ్య. అదీ మణికి కనిపిస్తున్న దృశ్యం. ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయాడు మణి. రూబీ గుర్తొచ్చింది. ఇంతలో పక్కన ఉన్న వ్యక్తి, మణి దగ్గరున్న నల్లటి గుడ్డని తీసి అతని కళ్ళకు గట్టిగా బిగించాడు. నిశ్శబ్దం. అందరూ ఊపిరి బిగపట్టి మరీ చూస్తున్నారు, ఏం జరబోతోందో! ఆ ఆసక్తి వారి ముఖాల్లో స్పష్టంగా కనపడుతోంది. ఆ ఆమ్మాయిని కట్టేసిన గుండ్రపు చెక్కని తిప్పాడు పక్కనున్న వ్యక్తి. మణి కత్తి తీశాడు. తిరుగుతున్న ఆ చట్రంతో పాటు అతని బుర్రలో పాత జ్ఞాపకాలు కూడా గిర్రున తిరుగుతున్నాయి. ఎన్నడూ లేనిది తల్వార్ మణì æచెయ్యి మొదటిసారిగా వణికింది. రూబీ. పేరుకి తగ్గ రూపం. మొదటిసారి తనని చూసినప్పుడే తాను విసిరే కత్తిలా అనిపించింది మణికి. ప్రేమలో పడిపోయాడు. అది ప్రేమో, ఆరాధనో లేక మైకమో తేల్చుకోలేని స్థితి అతనిది. ఆమె కళ్ళను చూస్తూ జీవితాంతం గడిపేయగలననుకున్నాడు. అంతటి కట్టిపడేసే సౌందర్యం ఆమెది. ఇంతలోనే నిరాశ! తాను ప్రేమిస్తే సరిపోతుందా? ఆమె కూడా తిరిగి తనని ప్రేమించద్దూ! ఆశ పడటానికైనా హద్దుండాలని సరిపెట్టుకున్నాడు. తనని ఆమెకి తగ్గ అందగాడిగా ఎందుకు పుట్టించలేదని దేవుణ్ణి నిందించేశాడు కూడా! ‘‘ఇదిగో మణీ! ఈ అమ్మాయి నీతో పనిచేస్తుంది. పేరు రూబీ. నువ్వు రేపటి నుంచి ఈమెతోనే నీ ప్రదర్శనలు చేయాలి’’. ఒక్కసారి సర్కస్ ఫోకస్ లైట్లలాగా వెలిగిపోయింది మణి ముఖం. ఇంకా తాను వరమే కోరలేదు, అప్పుడే దేవత వరమిచ్చేసింది కాబోలు అనుకున్నాడు. చెంపలు వేసుకున్నాడు. తొందరపడి దేవుణ్ణి నిందించేశానే అని బాధపడ్డాడు. ‘‘ఆ అమ్మాయికి ఇదంతా కొత్త. నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి’’ అంటున్న సర్కస్ ఇంచార్జ్, మణి కంటికి అప్పగింతలు చేస్తున్న మామగారిలాగా కనబడ్డాడు. బయటపడలేని సంబరంతో లోపల ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు మణి. కాలం గడుస్తోంది. రూబీపైన విపరీతమైన ప్రేమని పెంచేసుకున్నాడు మణి. ఎంతగా అంటే, తాను రోజూ విసిరేవి కత్తులు కాదు, తన ప్రేమ రాయబారాన్ని మోసుకు వెళ్ళే బాణాలు అనుకునే వరకూ చేరింది అతని వైఖరి. కానీ అతను విసిరే కత్తుల్లాగే ఆ బాణాలు కూడా ఆమెకి అస్సలు తగల్లేదు. చాలాసార్లు రూబీ మణికి నచ్చజెప్పింది. ఒకరోజు కుండ బద్దలు కొట్టేసింది, తనకి అలాంటి ఉద్దేశం ఏమీ లేదని, లేనిపోని ఆశలు పెట్టుకోవద్దని. మణి ముఖం మీదే చెప్పేసింది. తన ప్రపంచం ఒక్కసారి తల్లకిందులైపోయినట్టు అనిపించింది మణికి. తట్టుకోలేకపోయాడు. అర్ధరాత్రి గడిచింది. రూబీ ఉండే గదివైపు తడబడుతూ అడుగులు వేస్తున్నాడు మణి. చేతిలో కల్లుసీసా. తనని తాను నిగ్రహించుకునే స్థితిలో లేడు. పెద్దగా అరుస్తూ రూబీని నిద్రలేపాడు. ఆ గొడవకి మిగతావాళ్ళు కూడా నిద్రలేచారు. పెద్ద రభసే అయ్యింది. తనని పెళ్ళి చేసుకోకుంటే æచంపేస్తా అంటూ ఊగిపోతూ చేతిలో సీసాని పగలగొట్టి రూబీ మీదకి వెళ్ళబోయాడు మణి. చుట్టూ ఉన్నవాళ్ళు వచ్చి ఆపారు. రూబీ, మణికి దగ్గరగా వెళ్ళి గట్టిగా అతని చెంప పగలగొట్టింది. ఆ ఊపుకి వెళ్ళి పక్కన పడిపోయాడు. అందరూ అక్కడనుంచి వెళ్ళిపోయారు. రూబీ మాత్రం మళ్ళీ మణికి దగ్గరగా వెళ్ళింది. అతడి తల నిమిరింది. ఏదో గిలిగింత కలిగినట్టు ఆ మత్తులోనే నవ్వేసాడు మణి. ఆ స్పర్శ బహుశా అతని మనసుని తాకింది కాబోలు! రూబీ... రూబీ... అంటూ కలవరిస్తున్నాడు. రూబీకి కూడా మణి అంటే ఇష్టమే. కాకపోతే ఈ జీవితం రూబీకి నచ్చలేదు. ఏవో కుటుంబ పరిస్థితుల వల్ల ఇక్కడకి రావల్సి వచ్చిందేకానీ మనస్ఫూర్తిగా ఇష్టపడి మాత్రం కాదు. కానీ మణి పరిస్థితి అది కాదు. ఈ సర్కస్ అతని జీవితం. అతనికి ఇక్కడ మంచి భవిషత్తు కూడా ఉంది. తనవల్ల మణి జీవితం మారిపోవటం, అతను ఇష్టపడ్డ ప్రపంచాన్ని తనకోసం మార్చుకోవటం రెండూ రూబీకి ఇష్టంలేదు. అందుకే అతని ప్రేమకి దూరం అవ్వాలని అనుకుంది. అర్ధరాత్రి దాటింతర్వాత. ఏదో పెనుగులాట. ఏదోఅలజడి. బలవంతంగా మత్తునుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు మణి. తన వల్ల కావటం లేదు. ఐనా ప్రయత్నిస్తున్నాడు. మసకమసగ్గా కళ్ళముందు ఆడుతున్న ఆ దృశ్యాల్లో ఎవరో ఒక అమ్మాయి. ఒక మగమనిషి. ఆ అమ్మాయి అరవటానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆ మగ మృగం కిరాతకంగా ఆమెని లోబరచుకోవాలని ప్రయత్నం చేస్తోంది.బలం మొత్తం కూడగట్టుకొని లేచి నిలబడ్డాడు.‘‘ఎవరదీ! ఏయ్ వదులు’’ అంటూ ఆ మనిషి చొక్కా పట్టుకున్నాడు. అంత దగ్గరగా ఆ ముఖాన్ని చూసి ఖంగుతిన్నాడు. ఎదురుగా ఉన్న ఆ మనిషి టపీమని తలపై గట్టిగా రాయితో మోదడంతో అక్కడే స్పృహ కోల్పోయాడు మణి.పొద్దున్నే ఎవరో బూటుకాలితో గట్టిగా తంతుంటే మెలకువ వచ్చింది మణికి. ఎదురుగా ఉన్న రక్తపు మడుగులోంచి సూర్యోదయమయ్యింది అతనికి. ఒక్కసారి మబ్బులు విడిపోయాయి. అది రూబీ శవం. పొత్తికడుపులో పగలగొట్టిన గాజు సీసా గుచ్చుకొని ఉంది.‘‘ఏరా, అమ్మాయి ప్రేమించకపోతే పాడుచేసి ప్రాణాలు తీసేస్తార్రా మీరు...’’ అంటూ తంతున్నాడు కానిస్టేబుల్. మణికి ఏమీ అర్థంకాలేదు. ‘‘వీడిని ఇక్కడనుంచి తీసుకుపోండి సార్! వీడిలాంటి వాళ్ళుంటే మా సర్కస్కే చెడ్డపేరు’’ అంటున్న పెద్దయ్య వైపు కోపంగా చూశాడు మణి. కానీ పెద్దయ్య మాత్రం మణి కళ్ళలోకి చూడలేకపోయాడు. అది ఎందుకో మణికి మాత్రమే తెలుసు. ‘‘నడవరా స్టేషన్‌కి’’ అంటూ మెడ పట్టుకొని తీసుకెళ్ళారు పోలీసులు. అలా వెళుతూ కూడా వెనక్కి తిరిగి మరీ పెద్దయ్యవైపే చూశాడు మణి. ‘‘వెళ్ళొస్తా పెద్దయ్యా’’ అన్నాడు. పెద్దయ్యకి మణి కళ్ళలోకి చూసే ధైర్యం రాలేదు. బహుశా ఇంకెప్పటికీ రాదేమో!జైల్లో ఎవ్వరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు మణి. ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడేవాడు. మధ్యమధ్యలో వెక్కివెక్కి ఏడుస్తూ ఉండేవాడు. ఆ జైల్లో కూడా మణికి అభిమానులు లేకపోలేదు. వారి సహాయంతో ఒక చిన్న గడ్డి బొమ్మని, కొన్ని డమ్మీ చాకులని సమకూర్చుకొని గంటలు తరబడి సాధన చేసేవాడు. ఇదీ క్లుప్తంగా మణి జైలు జీవితం. మణి జైలునుంచి విడుదలయ్యాక ఆ గడ్డిబొమ్మని బయటపారేస్తూ కానిస్టేబుల్ గమనించిన ఒక వింత విషయం ఏంటంటే ఇన్నాళ్ళూ మనిషికి తగలకుండా కత్తులు వేయటంలో నేర్పరి అయిన మణి, ఇప్పుడు మాత్రం ఒకేచోట గురి తప్పకుండా ఆ గడ్డిబొమ్మ గుండెల్లోకే చాకుని విసరగలగటం. చిద్రమైపోయిన హృదయంతో ఉన్న ఆ బొమ్మ, బహుశా రూబీని మరిచిపోలేని మణికి ప్రతిరూపమేమో అనుకున్నాడు.‘మణి... మణి...మణి...’ అంటూ ప్రేక్షకులు కొడుతున్న కేరింతలతో మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చాడు. వణుకుతున్న చేతినుంచి బాణంలాగా దూసుకువెళ్ళింది కత్తి. ఎప్పటిలాగే ఈసారి కూడా అది గురి తప్పలేదు. జైల్లో రూబీనే తలచుకుంటూ, ఆ గడ్డిబొమ్మలో పెద్దయ్యనే చూస్తూ మణి చేసిన సాధన మొత్తానికి ఫలించింది. ప్రేక్షకుల దృష్టిలో అతని గురి తప్పినప్పటికీ, మణì æలక్ష్యం మాత్రం నెరవేరింది. - యేటూరి రోహణ్ -
మట్టిలో ‘మణి’క్యం
కడు పేద కుటుంబంలో పుట్టింది. చదువును మధ్యలోనే ఆపేసినా యాంకర్‌గా ఎదిగింది. స్టేజి షోలు ఇస్తూ సొంతంగా ఓ ఆర్కెస్ట్రాను ఆర్గనైజ్ చేస్తోంది. ఇలా పదిమందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు యాంకర్ మణి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. వీరవాసరం: ‘మా స్వగ్రామం తణుకు. భాష్యం స్కూల్ పక్కన చిన్న ఇంట్లో పుట్టాను. అమ్మ ఇండ్ల తులసి, నాన్న సత్యనారాయణ, అక్క శివ. చిన్నచిన్న పనులు చేస్తూ అమ్మానాన్న కుటుంబ పోషణ చేసేవారు. నేను మూడో తరగతి చదువుకునే సమయంలో అమ్మానాన్నల మధ్య కొద్దిపాటి వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అమ్మ వేరు పడింది. అప్పటి నుంచి అమ్మ దగ్గరే పెరుగుతూ డ్యాన్స్‌పై ఇష్టం ఏర్పరచుకున్నాను. నా 12వ ఏటనే స్టేజీలపై స్టెప్పులేశాను. డ్యాన్స్ ట్రూపులతోనూ, సినీ సంగీత విభావరిలోనూ యాంకర్‌గా చేయడం ప్రారంభించాను. టీవీల్లో వస్తున్న పాటలను చూసి.. ఎవరి దగ్గర శిష్యరికం చేయకుండానే టీవీల్లో వస్తున్న పాటలను చూసి ఇంట్లోనే రిహార్సల్ చేసుకునేదాన్ని. ఏ స్టెప్పు చూసినా వెంటనే స్టేజిపై చేయడం నాకు ఛాలెంజింగ్‌గా ఉండేది. మావయ్య మూర్తి, అత్తయ్య ఆదిలక్ష్మి ప్రోత్సాహంతో డ్యాన్సర్‌తో పాటు యాంకర్‌గాను ప్రావీణ్యం సంపాదించాను. పదేళ్ల క్రితం భీమవరానికి చెందిన మధును వివాహం చేసుకున్నాను. సరిగమ ఆర్కెస్ట్రా ప్రారంభించాం సరిగమ ఆర్కెస్ట్రాను ప్రారంభించి డ్యాన్సర్గాను, యాంకర్‌గాను, డ్యాన్స్ బేబి డ్యాన్స్‌ల ప్రదర్శనలు ప్రారంభించాం. మా ఆయన మధు సహకారంతో భీమవరం, తణుకు, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం, విజయవాడ, హైదరాబాద్‌లతో పాటు బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాం. మా సరిగమ ఆర్కెస్ట్రాలోకి జబర్దస్త్ టీం ఆది, భాస్కర్, సుధాకర్, రాజు, నరేష్ తదితరులతో పాటు సినీ సింగర్లు సునీత, గీతామాధురి, మాళవిక, ఝాన్సీలతోను ప్రదర్శనలు ఇప్పించడం విశేషం. టీవీల్లో జరిగే సూపర్ డూప్స్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాను. నాతో పాటు మరో 10 మందికి అవకాశాలు చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. డ్యాన్సర్‌గా, యాంకర్‌గా రాణిస్తుండడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. -
బీజేపీ నేతకు భారీ షాక్
కేవలం 52 ఓట్లతో సరిపెట్టుకున్న రాజా ఉత్కంఠగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్నికలు అధ్యక్షుడిగా మణి బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజాకు శనివారం పెద్ద షాక్ తగిలింది. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తమిళనాడు విభాగం ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. కేవలం 52 ఓట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో విద్యా శాఖ మాజీ డైరెక్టర్ మణి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాక్షి, చెన్నై : భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తమిళనాడు విభాగానికి 12 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. అయితే, ఈసారి ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో జాతీయస్థాయి నుంచి మంతనాలు సాగాయి. ఇందుకు కారణం ఆ సంఘానికి అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా రేసులో నిలబడడమే. ఎన్నికల బరిలో నిలబడే సమయంలో ఆయన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తమిళనాడు నిర్వాహకుల మీద విరుచుకుపడ్డారు. విద్యార్థులకు చేరాల్సిన నిధుల్ని దుర్వినియోగం చేశారని, అవినీతి తాండవం చేసినట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో ఆ ఎన్నికల్లో ఆయన పోటీకి దిగడం తమిళనాట రాజకీయ పక్షాల్లో వ్యతిరేకత బయలుదేరింది. అధికారపక్షం పరోక్షంగా మద్దతిచ్చినా, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విద్యార్థుల మీద కాషాయం రంగు రుద్దే ప్రయత్నంలో భాగం గానే అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు రాజా తీవ్ర కుస్తీలు పడుతున్నారన్న ఆరోపణలు గుప్పిం చాయి. ఇందుకు రాజా ఎదురుదాడి సాగిం చినా, గెలుపు తనదేనన్న ధీమాతో ముందుకు సాగారని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో రాజా గెలిస్తే తమిళనాట కమలం పాగే వేసినట్టే అన్నట్టుగా ఆయన మద్దతుదారులు వ్యవహరించా రన్న ప్రచారం ఉంది. అయితే, తమిళనాట కమలం పాదం మోపేందుకు ఆస్కారం లేదన్నట్టుగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్నికల్లో తీర్పు రావడం గమనార్హం. కేవలం 52 ఓట్లతో రాజా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఏమేరకు తమిళుల్లో కాషాయం మీద వ్యతిరేకత ఉందో అనే చర్చ ఊపందుకుంది. రాజా ఓటమి స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఐదు వందల మంది సభ్యులున్నారు. చెన్నై వేదికగా ఓటింగ్‌కు తగ్గ ఏర్పాట్లుచేశారు. ఎన్నికల అధికారిగా కళావతి వ్యవహరించారు. రాజాకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ మాజీ ఉపాధ్యక్షుడు, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ మణి బరిలో దిగారు. దీంతో పోరు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ తప్పలేదు. ఈ పదవికి ప్రప్రథమంగా ఓ రాజకీయ నేత పోటీకి దిగడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి మూడు గంటల వరకు సాగిన ఎన్నికల్లో 286 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజా గెలుపు మీద మద్దతుదారుల్లో ధీమా ఉన్నా, చివరకు ఆయనకు షాక్ తప్పలేదు. ఆయన ప్రత్యర్థి మణి భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. మణికి 232 ఓట్లు, రాజాకు 52 ఓట్లు రాగా, రెం డు ఓట్లు చెల్లనివిగా తేల్చారు. తనను గెలిపించిన వారందరికీ మణి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కోటి 32 లక్షల మంది మనవళ్లు, మనవరాళ్లు స్కూళ్లల్లో తనకు ఉన్నారని, వీళ్లందరి సంక్షేమం లక్ష్యంగా, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లోని ప్రతి సభ్యుడికి సహకారంగా ముందుకు సాగుతానని ప్రకటించారు. అయితే, ఈ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, ఈ గెలుపు చెల్లదంటూ జాతీయస్థాయిలో రాజా ఫిర్యాదు చేసే పనిలో పడ్డారు. అవినీతి చోటుచేసుకుందని, అందుకే ఏకపక్షంగా ఎన్నిక సాగిందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికను రద్దుచేయిస్తానని ఆయన ముం దుకు సాగినా, అందుకు ఆస్కారం లేదని, అన్నీ సక్రమంగానే జరిగినట్టు ఎన్నికల అధికారి కళావతి పేర్కొన్నారు. -
అమ్మాయిప్రేమలో పడితే...?
యువత ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ప్రేమలో లేనప్పుడు ఎలా ఉంటారు? అనే కథతో దర్శకుడు మణి రూపొందించనున్న సినిమా ‘అమ్మాయి ప్రేమలో పడితే’. మణి, షాను జంటగా బి. రమేశ్, హర్షవర్థన్ నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ కెమేరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. మే నెలలో అరకు లోయలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ‘‘స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుంది? అనేది చిత్రకథ. సంగీత ప్రధానమైన చిత్రమిది. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి’’ అన్నారు మణి. చిత్ర సంగీత దర్శకుడు భానుప్రసాద్, కథానాయిక షాను, రచయిత బండోజి, కెమేరామెన్ ఫణి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ విజయా హాస్పిటల్ వద్ద ఆందోళన
హైదరాబాద్: ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీ విజయా ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మణి(22) అనే యువకుడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. గుడిమల్కాపూర్‌కు చెందిన మణి(22) నాలుగు రోజుల క్రితం జ్వరంతో విజయా ఆసుపత్రిలో చేరాడు. అకస్మాత్తుగా జ్వరం ఎక్కువై పరిస్థితి విషమించడంతో మహవీర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. రోగిని మహవీర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే మణి మృతి చెందాడని మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. -
పసికందుకు ఉరి వేసిన తల్లి..
గాజువాక(విశాఖపట్టణం): తనకు ఏం కష్టమొచ్చిందో.. కుటుంబంలో ఎలాంటి పరిస్థితి చోటు చేసుకుందో.. లేదా ఏ కలత ఆమెను పురి గొల్పిందో... వందేళ్లు వర్థిల్లాల్సిన తన 11 నెలల కుమారుడికి ఉరి వేసి తానూ తనువు చాలించిందొక తల్లి. కొత్త నక్కవానిపాలెం చెక్‌పోస్టు ప్రాంతంలో శనివారం చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనమైంది. ప్రత్యక్ష సాక్షులు, గాజువాక పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన మణి (26)కి స్థానిక నక్కవానిపాలెం చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ ఉరుకూటి శ్రీనివాస్‌తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి వినయ్(11 నెలలు) బాబు ఉన్నాడు. ఈనెల 29న మొదటి పుట్టినరోజు జరిపేందుకు ఏర్పాటు కూడా చేసుకొంటున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీనివాస్ టాటా మ్యాక్సి తీసుకొని శనివారం మధ్యాహ్నం బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత కొంతసేపటికి మేడపై ఉన్న గదిలోకి తన కొడుకుతో కలిసి మణి వెళ్లింది. రోజు మాదిరిగానే తన కుమారుడికి సాయంత్రం 4.30 గంటల సమయంలో స్నానం చేయించి కిందకు రావాల్సిన మణి రాకపోవడంతో ఆమె మామ బంగార్రాజు మేడపైకి వెళ్లి తలుపు తట్టారు. అయినప్పటికీ తెరవకపోవడంతో కిటికీలోంచి చూసి ఉరి వేసుకున్నట్టు గమనించి కేకలు వేశారు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకొని తలుపులు పెకలించి మృత దేహాలను కిందకు దించారు. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించారు. తన భర్త బయటకు వెళ్లగానే తొలుత తన కుమారుడికి ఉరి వేసి, ఆ తరువాత తాను కూడా ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి సంఘటనకు కారణాలేవీ తెలియడంలేదని పోలీసులు పేర్కొన్నారు. -
మంత్రి రాజీనామా.. అంతలోనే తూచ్!
తిరువనంతపురం: కేరళను కుదిపేస్తున్న బార్ స్కాం, సోలార్ స్కాం పలు మలుపులు తిరుగుతున్నాయి. బార్లకు అనుమతి ఇచ్చేందుకు రూ. 50 లక్షల లంచం తీసుకున్నారన్న కేసులో కోర్టు విచారణకు ఆదేశించడంతో ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె. బాబు రాజీనామా చేశారు. అయితే.. కాంగ్రెస్ నేతృత్వంతోని యూడీఎఫ్ నేతల నుంచి ఒత్తిడి రావడంతో రాజీనామాను అంతలోనే ఉపసంహరించుకున్నారు. అయితే ఇదంతా సీఎం ఊమెన్ చాందీ పక్కాగా రచించిన స్క్రిప్టు ప్రకారమే జరిగిందని విపక్ష సీపీఐ-ఎం ఆరోపించింది. బార్ ఓనర్ల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో గతంలో ఆర్థికమంత్రి కేఎం మణి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయనకు కూడా కోర్టులో ఊరట లభించడంతో తిరిగి పదవి చేపట్టాలని యూడీఎఫ్ వర్గాలు అంటున్నా, తాను మళ్లీ వచ్చేందుకు తొందరేమీ లేదని మణి అంటున్నారు. మంత్రి పదవి చేపట్టాలని కోరిన యూడీఎఫ్‌కు కృతఙ్ఞతలు తెలిపిన ఆయన ఈ అంశంపై పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని శనివారం తెలిపారు. అయితే ఈ ఇద్దరు నేతలకు హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వలేదని, కేవలం కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు నెలలు స్టే మాత్రమే విధించిందని సీపీఐ-ఎం నేత కొడియేరి బాలకృష్ణన్ తెలిపారు. హైకోర్టు ఈ కుంభకోణంలో వాదనలు కూడా వినబోతున్న నేపథ్యంలో అప్పుడే క్లీన్చిట్ దొరికిందని నేతలు చెప్పడం ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పక్కాగా నడిపిస్తున్న డ్రామాగా అభివర్ణించారు. -
లారీ, బైక్ ఢీ.. ఇద్దరి మృతి
సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణ శివారులోని రాయన్‌గూడెం వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై నలుగురు వ్యక్తులు టేకుమట్ల నుంచి సూర్యాపేట వైపు వెళుతుండగా ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న కల్యాణ్, మణి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఉమేష్, ఉపేందర్లను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతులు, క్షతగాత్రులు సూర్యాపేట పట్టణంలోని బర్లపెంటబజార్‌కు చెందినవారు. -
మృత్యుశకటం..
-
మృత్యుశకటం..
- బాలికలపైకి దూసుకెళ్లిన లారీ - ముగ్గురు చిన్నారులు మృతి కొలిమిగుండ్ల కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం పాలు కొనుగోలు చేసి ఇంటికి వెళుతున్న ముగ్గురు బాలికలపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో మణి (12), రాజేశ్వరి (16), తిరుపతమ్మ (14 ) తీవ్ర గాయాలతో మృతి చెందారు. బాలికలను ఢీకొట్టిన లారీ అదే వేగంతో 100 అడుగుల దూరం వెళ్లి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. దీంతో ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కొలిమిగుండ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
అల ఎగసిపడుతోంది!
సినిమా వెనుక స్టోరీ - 15 ప్రేమ అంటే పచ్చదనం. ప్రేమ ఎప్పుడూ పచ్చగానే ఉండాలి. పెళ్లయిన తర్వాత కూడా..! ‘దిల్ సే’ పోస్ట్ ప్రొడక్షన్. మణిరత్నం ఫుల్ బిజీ. చిన్న టీ బ్రేక్‌లో బాల్కనీలో కూర్చుని రోడ్డు వంక చూస్తుంటే బైక్ మీద ఓ ప్రేమజంట రివ్వున దూసుకుపోతోంది. ప్రేమ ఎవ్వరికీ అంతుబట్టని ఓ మ్యాజిక్. ప్రేమలో అన్నీ ప్లస్సులే ఉంటాయా? లేదు... మైనస్సులూ ఉంటాయ్. అయితే అదేంటో... అవి పెళ్లయ్యేవరకూ కనబడవు. అప్పుడే గ్యాప్ మొదలవుతుంది. మణిరత్నం మనసు ఇలా రక రకాలుగా ఆలోచిస్తోంది. అందరూ పెళ్లితో ఎండ్ అయ్యే ప్రేమకథలే చేస్తున్నారు. ఆ తర్వాతి జీవితాన్ని ఎందుకు వదిలేయాలి? కోపాలూ తాపాలూ, ప్లస్సులూ మైనస్సులూ, వసంతాలూ శిశిరాలూ - ఇవన్నీ చూపించే కథ. ఆత్మ, హృదయం రెండూ ఉండే కథ. రైటర్ సుజాతకు ఫోన్ చేశాడు మణి. సుజాత తమిళంలో ఫేమస్ రైటర్. రిటైర్డ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్. ‘సుజాత’ అనేది ఆయన కలంపేరు. మణిరత్నానికి బాగా నమ్మక మైన మనిషి. ‘‘భార్య కనిపించకపోవడం, భర్త వెతు క్కుంటూ వెళ్లడం, ఈ అన్వేషణలో భార్య లేని లోటు, ఆమెతో జ్ఞాపకాలు గుర్తుకు రావడం... వీటన్నిటితో కథ చేద్దామను కుంటున్నా...’’ చెప్పాడు మణిరత్నం. ‘‘గో ఎ హెడ్’’ అని ఉత్సాహపరిచాడు సుజాత. మనసుపడి తీసిన తమిళ ‘ఇరువర్’ (తెలుగులో ‘ఇద్దరు’) అట్టర్ ఫ్లాప్. ఎంతో కష్టపడి చేసిన హిందీ ‘దిల్ సే’కి ఎదురు దెబ్బ. మణిరత్నం కదిలిపోయాడు. ఎక్కడో తేడా జరుగుతోంది. కొన్నాళ్లు సినిమాకు దూరంగా ఉండాల్సిందే! తప్పటడుగులు పడినప్పుడో, లక్ష్యం నుంచి దారి మళ్లినప్పుడో... బ్యాక్ టూ బేసిక్స్‌కి రావాలి. గొప్ప మేనేజ్మెంట్ సూత్రం. ఇండియాలోని టాప్ బిజినెస్ స్కూల్ జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టి ట్యూట్లో ఎంబీఏ చేసిన మణిరత్నానికి ఈ సూత్రమే గుర్తొచ్చింది. ఇప్పుడు తను కూడా బ్యాక్ టూ బేసిక్స్. నో ఎక్స్పెరి మెంట్స్. రొమాన్స్ అంటే మణిరత్నంలా ఎవ్వరూ తీయలేరు. ఇది ఆయనకున్న బ్రాండ్. ఇప్పుడదే మళ్లీ వాడాలి. సుజాతకు చెప్పిన స్టోరీలైనే తనకు శ్రీరామ రక్ష. ఆర్.సెల్వరాజ్‌ను పిలిచాడు. సూపర్ స్టోరీ, స్క్రీన్‌ప్లే రైటర్. ఇద్దరూ కూర్చుని స్క్రిప్ట్ చేస్తున్నారు. మధ్య మధ్యలో సుహాసిని జాయినవుతున్నారు. మామూలుగా అయితే స్క్రిప్ట్ వర్కులో ఎవ్వర్నీ ఎంటర్ కానివ్వడు మణిరత్నం. రిలేషన్ రిలేషనే. స్క్రిప్టు స్క్రిప్టే. కానీ సుహాసినికి మాత్రం ఎగ్జెంప్షన్. ఎందు కంటే సుహాసిని చాలా షార్ప్. నటిగా బోలెడంత అనుభవం, సమాజాన్ని చదివిన అనుభవం... దానికి తోడు భర్తకేం కావాలో ఆమెకు బాగా తెలుసు. ‘రోజా’, ‘దళపతి’, ‘బొంబాయి’, ‘ఇద్దరు’, ‘దిల్ సే’... ఇలా మణిరత్నం ప్రతి సినిమాలోనూ సుహాసిని కంట్రి బ్యూషన్ కంపల్సరీ. ఈ స్క్రిప్టులో అయితే సుహాసిని ఐడియాలు చాలా ఎక్కువే. హీరో అమ్మానాన్నలు, హీరోయిన్ అమ్మానాన్నలు కలుసుకునే సీన్ ఐడియా సుహాసినిదే. ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీకెళ్లే సీన్, తండ్రి చనిపోయాక హీరోయిన్ తల్లిని చూడ్డానికి వెళ్లిన సీన్, ‘అలై పొంగెరా’ పాట సన్నివేశం... ఇదంతా సుహాసిని క్రెడిట్టే. తమిళంలో ‘అలై పాయుదే’ (అంటే ‘అల ఎగిసిపడుతోంది’ అని అర్థం) అనే టైటిల్ పెట్టారు. తెలుగు వెర్షన్ టైటిల్ ‘సఖి’. షారుక్ ఖాన్‌తో చేస్తే బాగుంటుంది... మణిరత్నానికి ఎవరో సలహా ఇచ్చారు. కానీ మణిరత్నం ఆల్రెడీ ఫిక్సయిపోయారు... న్యూ ఫేస్‌తో ఈ సినిమా చేయాలి. ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అయితే నేచురాల్టీ మిస్సవుతుంది. ఎవరా అదృష్టవంతులైన హీరో, హీరోయిన్లు? ‘శాండల్‌వుడ్’ సోప్ యాడ్ షూట్ చేస్తున్నారు. తీసేది ఫేమస్ కెమేరామన్ కమ్ డెరైక్టర్ సంతోష్ శివన్. చేసేది నటుడు ఆర్.మాధవన్. మణిరత్నానికి సంతోష్ శివన్ బాగా క్లోజ్. ఆ విషయం మాధవన్‌కు తెలుసు. అందుకే అడిగాడు... ‘‘సార్... నన్ను మణిగారికి ఇంట్రడ్యూస్ చేయండి.’’ సంతోష్ శివన్ ‘ఎస్’ అనలేదు, ‘నో’ అనలేదు. కానీ మాధవన్కి చెప్పకుండానే మణికి ఫొటోలు పంపించాడు. అప్పుడు మణిరత్నం ‘ఇరువర్’ తీసే పనిలో ఉన్నాడు. మాధవన్‌ని పిలిపించారు. ‘ఇరువర్’కి పనికొస్తాడేమోనని మేకప్ టెస్ట్ చేయించారు. నో యూజ్. మాధవన్ నిరాశగా వెళ్లిపోయాడు. తను మళ్లీ ‘జీ’ టీవీ సీరియల్స్‌లో బిజీ. ‘ఇస్ రాత్‌కీ సుబహ్ నహీ’ (హిందీ), ‘ఇన్ఫెర్నో’ (ఇంగ్లిషు) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు. ఓ రోజు అనుకోని విధంగా మాధవన్కి మణిరత్నం నుంచి పిలుపు. ‘‘నా ‘సఖి’కి నువ్వే హీరో’’ - చెప్పాడు మణి. మాధవన్ కడలి అల కన్నా ఎక్కువ ఎగిరాడు సంబరంతో. వసుంధరాదాస్‌ను పిలిచారు.. హీరోయిన్ క్యారెక్టర్ కోసం! ఆమె సింగర్. కమల్‌తో ‘హే రామ్’లో చేస్తోంది. మణిరత్నం స్క్రీన్ టెస్ట్ చేయిం చాడు. ప్చ్! ఇంకా క్యూట్‌గా కావాలి. చైల్డ్ ఆర్టిస్టుగా టాప్ రేంజ్‌కెళ్లిన బేబీ షాలిని ఇప్పుడు హీరోయిన్గా అజిత్ పక్కన ‘అమర్కళమ్’ (తెలుగులో ‘అద్భుతం’గా అనువాదమైంది) చేస్తోంది. మణికి షాలిని నచ్చేసింది. ఆమెకూ ఈ ఆఫర్ నచ్చింది. కథ నచ్చింది. కానీ రొమాంటిక్ సీన్స్‌కీ, గ్లామర్ డ్రెస్‌లు వేయడానికీ అబ్జక్షన్ చెప్పింది. ఎందుకంటే ఆమె అప్పటికే అజిత్‌తో లవ్‌లో ఉంది. మణిరత్నం ‘డోంట్ వర్రీ’ అన్నాడు. ఇక షాలినికి వర్రీ ఏముంటుంది! షాలిని అక్క పాత్రకు స్వర్ణమాల్య సెలెక్టెడ్. ఆమెను పెళ్లిచూపులు చూడడాని కొచ్చే పాత్రను ఎవరైనా హీరోతో గెస్ట్‌గా చేయిస్తే? హీరో విక్రమ్‌ను అడిగారు. మరీ ఇంత చిన్న వేషమా? పెద్దదైతే చేస్తా అన్నాడు విక్రమ్. దాంతో ఆ పాత్రకు నార్మల్ యాక్టర్‌ను తీసేసుకున్నారు. ఈ సినిమాలో మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పాపులర్ సీనియర్ యాక్ట్రెస్ కావాలి. వాళ్లకు దొరికిన బెస్ట్ చాయిస్ జయసుధ. ఇంకో ఇంపార్టెంట్ రోల్. కుష్బూ ఓకే. ఆమె పక్కన ఎవరు బాగుంటారు? షారుక్‌ఖాన్... మమ్ముట్టి... మోహన్‌లాల్. ఫైనల్‌గా అరవింద్‌స్వామి ఓకే. ‘రోజా’తో తనను హీరోను చేసిన మణి అడిగితే, అరవింద్‌స్వామి కాదన గలడా? సినిమాలు వదిలేసి బిజినెస్‌లో బిజీ అయినవాడు కూడా గురువు కోసం వచ్చేశాడు. అప్పటి వరకూ మణిరత్నం సినిమాలకు లెనిన్ లాంటివాళ్లు ఎడిటింగ్ చేశారు. ఎందుకో మణి మార్పు కోరుకు న్నాడు. ఈ విషయం శ్రీకర్ ప్రసాద్‌కి తెలిసింది. అప్పటికే ఆయన నేషనల్ అవార్డు సినిమాలకు వర్క్ చేశాడు. మణిరత్నం, శ్రీకర్ ప్రసాద్ ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. తన మనసుకు నచ్చే టెక్నీషియన్ అనిపించింది మణిరత్నానికి. పీసీ శ్రీరామ్ టాప్ కెమేరామన్. మణిరత్నంతో కలిశాడంటే మ్యాజిక్కులే మ్యాజిక్కులు. ‘రోజా’ నుంచి రెహమాన్ చేయి వదలడం లేదు మణి. దీనికి మాత్రం వదులుతాడా? చడీచప్పుడు లేకుండా షూటింగ్ స్టార్ట్ చేసేశాడు మణిరత్నం. పూజలు, ముహూర్తపు షాట్లు కూడా లేవు. జయసుధ మీద ఫస్ట్ షాట్. నాలుగు నెలల్లో సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేసేయాలి. మణిరత్నం టార్గెట్. చెన్నై, కననూర్, ముంబై, శ్రీనగర్, పోర్ట్‌బ్లెయిర్, మహేశ్వర్, ఆగ్రా, ధోల్పూర్... ఇలా అన్నీ బ్యూటిఫుల్ లొకేషన్స్. పీసీ తన షాట్స్‌తో మేజిక్ చేయడం మొదలుపెట్టాడు. టైటిల్సాంగ్ ‘అలై పొంగెరా...’ పాట తీస్తున్నారు. అంతా పెళ్లి సందడి. పేరంటాళ్ల హడావిడి కావాలి. సుహాసిని తన బంధువులందర్నీ పిలిచారు. వాళ్ల అమ్మను కూడా! వాళ్లపై మణి ఈ పాట తీయాలి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సిగ్గుపడుతూనే ఈ పాట పూర్తి చేశాడు. మాధవన్, షాలిని పెళ్లయ్యాక కాపురం పెట్టడానికి ఓ ఇల్లు కావాలి. అది కూడా ఫినిష్ కానిది. చెన్నైలో ఓ పది బిల్డింగ్లు చూసి, ఒకటి సెలెక్ట్ చేశారు. కావాలనే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఇలాంటి అన్ఫినిష్డ్ బిల్డింగ్ ఎంచుకున్నారు. వీళ్ల మధ్య బంధం కూడా ఇలా అన్ఫినిష్డ్గానే ఉందని రిప్రజెంటేషన్ అన్నమాట. ‘పచ్చదనమే...’ పాటను రకరకాల రంగులతో కలర్ఫుల్గా ప్లాన్ చేసి తీశారు. ‘దిల్ సే’లోని ‘సత్ రంగీరే’ పాటకు ఓ రకంగా ఇది కొనసాగింపు. ‘కాయ్ లవ్ చెడుగుడు...’ పాటను రివర్స్ టెక్నిక్ యూజ్ చేసి తీశారు. కొంత వెర్షన్ తీశాక యావిడ్లో చెక్ చేసి చూస్తే లిప్ సింక్ కావడం లేదు. దాంతో మాధవన్‌ను ఆ పాటను రివర్స్‌లో పాడమన్నారు. మాధవన్ కష్టపడి బట్టీపట్టి మరీ నేర్చుకున్నాడు. తెలుగు వెర్షన్ హక్కులు ఫేమస్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎన్.వి. ప్రసాద్ తీసుకున్నాడు. తెలుగులో తన కెంత క్రేజుందో మణికి బాగా తెలుసు. ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వాళ్లకు కలగకూడదు. అందుకే ప్రతి సినిమాకీ స్పెషల్ కేర్ తీసుకుంటాడు. పాటలన్నీ వేటూరితో రాయించుకున్నాడు. వేటూరి అంటే మణికి చాలా ఇష్టం. గీతాంజలి, బొంబాయి సినిమాలకు వేటూరే పాటలు రాశారు. తెలుగు డైలాగ్స బాధ్యత అంతా శ్రీరామకృష్ణకే అప్ప గించారు. ‘బొంబాయి’ సినిమా నుంచి మణి టీమ్‌లో ఆయన పర్మినెంట్ మెంబర్. ‘సఖి’కి అందరూ గులామ్. ప్రేమజంట పెళ్లయ్యాక ఎలా బిహేవ్ చేస్తారనే కాన్సెప్ట్‌కి ఆడియన్స్ ఫిదా. అసలు మణిరత్నం టేకింగ్ ఎక్స్ట్రార్డినరీ. క్లైమాక్స్‌లో హాస్పిటల్ బెడ్ మీద మాధవన్, షాలిని మళ్లీ ‘ఐ లవ్యూ’ చెప్పుకోవడం, వాళ్ల ఎక్స్ప్రెషన్స్, చిన్న చిన్న డైలాగులు... ఇలాంటివన్నీ మణి మాత్రమే తీయగలడనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ సాంగ్స్‌తోనూ, రీరికార్డింగ్ తోనూ చెలరేగిపోయాడు. చాలా గ్యాప్ తర్వాత జానకమ్మ పాడిన ‘సెప్టెంబర్ మాసం అక్టోబర్ మాసం’ పాటను వింటుంటే పాత బాధలన్నీ మర్చిపోతాం. చాలా రోజుల గ్యాప్ తర్వాత జానకమ్మ ఆలపించిన పాట ఇది. పీసీ శ్రీరామ్ అయితే ఈ సినిమాకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్. కెమెరాను కలంగా మార్చి సెల్యులాయిడ్‌పై రొమాంటిక్ పొయిట్రీ రాసేశాడాయన. సినిమాలో ప్రతి ఫ్రేమూ ఐ ఫీస్టే. అందుకే ‘బెస్ట్ సినిమాటోగ్రాఫర్’గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. డీటీఎస్ మిక్సింగ్ చేసిన హెచ్.శ్రీధర్‌కూ బెస్ట్ ఆడియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డు. మణిరత్నం అంటేనే బాక్సాఫీస్‌కి పచ్చదనం. అందుకే మణిరత్నం ఎప్పుడూ పచ్చగానే ఉండాలి! ఆయన తీసిన ప్రేమకథల్లో ‘సఖి’ కూడా అప్పటికీ, ఇప్పటికీ ఒక ఆకుపచ్చని జ్ఞాపకం! వెరీ ఇంట్రస్టింగ్... * సాఫ్ట్వేర్ బూమ్ గురించి తొలిసారిగా సెల్యులాయిడ్ మీద చర్చించిన సినిమా ఇదే. * మాధవన్కి శ్రీనివాసమూర్తి, షాలినికి సరిత డబ్బింగ్ చెప్పారు. ‘పిరమిడ్’ నటరాజన్‌కు సీనియర్ నటుడు నర్రా వెంకటేశ్వరరావు గాత్రదానం చేశారు. - పులగం చిన్నారాయణ -
కత్తులతో బెదిరించి... రూ.26 లక్షలు ఎత్తుకెళ్లారు
నెల్లూరు(తడ): ఓ వ్యాపారిని కత్తులతో బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కారులో తడకు వెళుత్ను మణి అనే సిగిరెట్ల వ్యాపారిని మండలంలోని చేని గుంట వద్ద అడ్డగించారు. మూడు బైకులపై వచ్చిన దుండగులు వ్యాపారిని కత్తులతో బెదిరించి రూ. 26 లక్షలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
నెల్లూరు జిల్లాలో ఐఏఎఫ్ కేంద్రం
పొదలకూరు : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరుపూరు వద్ద తమకు కేటాయించిన ప్రభుత్వ భూమిలో భారత వైమానిక దళ(ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెన్నై వింగ్ కమాండర్ మణి పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్, రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ వి.కృష్ణారావు బుధవారం 63.6 ఎకరాల భూమిని ఐఏఎఫ్‌కు అప్పగిస్తూ కమాండర్ మణికి స్వాధీనపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ శత్రుదేశాల నుంచి ముప్పును పసిగట్టేందుకు మరుపూరు వద్ద రాడార్‌కు సిగ్నల్స్ బాగా అందుతుండటంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో ఇక్కడ 100 నివాసాలతో కూడిన మంచి టౌన్షిప్ ఏర్పడుతుందన్నారు. కొంతభూమి కోర్టు పెండింగ్‌లో ఉన్నందున మలి విడతలో కేటాయిస్తామని తహశీల్దార్ తెలిపారు. అనంతరం వింగ్ కమాండర్ మణి, వాలెంట్ అధికారి రాజేష్‌తో కలసి తహశీల్దార్ భూములను పరిశీలించారు. -
సస్పెన్స్‌తో రొమాన్స్
‘‘ఇప్పటివరకూ చాలా ప్రేమకథలు వచ్చాయి. ఆ చిత్రాలకు భిన్నంగా సస్పెన్స్, రొమాన్స్, కామెడీలతో విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని సత్యశ్రీ అన్నారు. ఆయన దర్శకత్వంలో ఎం. వెంకటస్వామి నిర్మిస్తున్న చిత్రం ‘రొమాంటిక్ లవర్స్’. మణి, నిఖిల్, జెన్నీషా, ఉషాంజలి, సంతోషిశర్మలు హీరోహీరోయిన్లు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: రాజా, ఎడిటింగ్: శివకోమరి, మాటలు: జానకిరామ్. -
ఓ ప్రియుడి దారుణం
సామర్లకోట : స్థానిక ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి ఓ వ్యక్తి ఏడాది బాలుడు, ఓ వివాహితను చెరువులోకి తోసేసిన సంఘటన ఇది. సామర్లకోట పోలీసుల కథనం ప్రకారం... కిర్లంపూడి మండలం వేలంకి గ్రామానికి చెందిన మణి ఏడాదిగా భర్త బాలరాజు నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. మూడు నెలలుగా అదే గ్రామానికి చెందిన లారీ క్లీనర్ శేషుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మణి, ప్రియుడు శేషు స్థానిక ఓవర్‌బ్రిడ్జిపై ఘర్షణ పడ్డారు. దీంతో శేషు ఆగ్రహించి, బ్రిడ్జిపై నుంచి తల్లి, బిడ్డను సుమారు 25 అడుగుల దిగువలోనున్న చెరువులోకి నెట్టేశాడు. దీంతో మణి తన ప్రాణాలను రక్షించుకొనే ప్రయత్నంలో ఈదుకుంటూ చెరువు నుంచి బయటపడింది. విషయం తెలుసుకున్న ఫ్యాక్టరీ సిబ్బంది ఆమెను ఫ్యాక్టరీ ఆవరణలో ఉంచి, సామర్లకోట పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే చెరువులో మునిగిపోయిన ఏడాది బాలుడు చనిపోయి చెరువులో తేలుతూ కనిపించాడు. పోలీసులు మణి నుంచి సమాచారం సేకరించారు. మణి ప్రియుడు పరారయ్యాడు. మణి ఫిర్యాదు మేరకు సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సైలు ఎండీ అలీఖాన్, నాగార్జున పరిశీలించారు. -
వివాదమే ఆ సినిమాల కథావస్తువు!!
-
నేడు జాతర హుండీల లెక్కింపు
హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీలను సోమవారం ఉదయం 11గంటలకు హన్మకొండ టీటీ డీ కల్యాణ మండపంలో లెక్కించనున్నారు. రెవెన్యూ, దేవాదాయశాఖ ఉద్యోగులు 200మందితోపాటు రాష్ట్రంలోని పలు దేవాలయాల నుంచి వచ్చిన ఉద్యోగులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మేడారం జాతర ఈఓ దూస రాజేశ్వర్ తెలిపారు. మొత్తం 410 హుండీలకుగాను 397 హుండీలను ఎనిమిది ఆర్టీసీ బస్సుల్లో తరలించామని, వీటిలో 51 క్లాత్ హుండీలు ఉన్నాయని తెలిపారు. మరో 13 హుండీలను తిరుగువారం ముగిసిన తర్వాత తీసుకొస్తామన్నారు. లెక్కింపు పర్యవేక్షణకు ఎనిమిది సీసీ కెమెరాలు, మూడు క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం టీటీడీ కల్యాణ మండపానికి చేరుకున్న హుండీలను దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ తాళ్లూరి రమేష్‌బాబు, డీఆర్ఓ సురేంద్రకరణ్తో కలిసి ఈఓ రాజేశ్వర్ పర్యవేక్షించారు. హుండీలను భద్రపరిచే కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఒక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు భద్రతలో నిమగ్నమయ్యారు. లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు.