హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీలను సోమవారం ఉదయం 11గంటలకు హన్మకొండ టీటీ డీ కల్యాణ మండపంలో లెక్కించనున్నారు. రెవెన్యూ, దేవాదాయశాఖ ఉద్యోగులు 200మందితోపాటు రాష్ట్రంలోని పలు దేవాలయాల నుంచి వచ్చిన ఉద్యోగులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మేడారం జాతర ఈఓ దూస రాజేశ్వర్ తెలిపారు.
మొత్తం 410 హుండీలకుగాను 397 హుండీలను ఎనిమిది ఆర్టీసీ బస్సుల్లో తరలించామని, వీటిలో 51 క్లాత్ హుండీలు ఉన్నాయని తెలిపారు. మరో 13 హుండీలను తిరుగువారం ముగిసిన తర్వాత తీసుకొస్తామన్నారు. లెక్కింపు పర్యవేక్షణకు ఎనిమిది సీసీ కెమెరాలు, మూడు క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు ఏర్పాటు చేశామన్నారు.
ఆదివారం టీటీడీ కల్యాణ మండపానికి చేరుకున్న హుండీలను దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ తాళ్లూరి రమేష్‌బాబు, డీఆర్‌ఓ సురేంద్రకరణ్‌తో కలిసి ఈఓ రాజేశ్వర్ పర్యవేక్షించారు. హుండీలను భద్రపరిచే కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఒక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు భద్రతలో నిమగ్నమయ్యారు. లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు.
నేడు జాతర హుండీల లెక్కింపు
Published Mon, Feb 17 2014 2:47 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement