sammakka - saralamma
-
వచ్చే 4 రోజులు తెలంగాణ బస్సులు బిజీ బిజీ
తొందరపడి బస్టాండ్లవైపు పరుగులు తీయొద్దని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది. వచ్చే నాలుగు రోజులు ఎక్కువ బస్సులు మేడారం వెళ్తాయి కాబట్టి.. సాధారణ రూట్లలో బస్సులు తక్కువ ఉంటాయి. అలాగే కొన్ని రద్దవుతాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. "తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం." రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. – వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ఆర్టీసీ. సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!! తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024 -
మేడారం బయల్దేరిన పగిడిద్దరాజు
గుండాల: వన దేవత సమ్మక్క భర్త, యాపలగడ్డ గ్రామం అర్రెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు సోమవారం మేడారం బయల్దేరాడు. గుండాల మండలంలోని యాపలగడ్డలో సోమవారం పగిడిద్దరాజు గర్భగుడి వద్ద పడగలకు( జెండాలకు), శివసత్తులకు, ఆభరణాలకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజును గద్దెల వద్దకు తీసుకెళ్లి పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు, హిజ్రాలు నృత్యాలు చేశారు. పడగలను, నగలు, గజ్జెలు ధరంచిన వడ్డెలు ఊరేగింపుతో కాలిడనకన మేడారం బయల్దేరారు. ఆదివాసీ నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించుకుంటూ తీసుకెళ్లారు. మేడారం వెళ్లే భక్తులు సైతం యాపలగడ్డ వద్ద పగిడిద్దరాజును దర్శించుకుని వెళ్లారు. కాగా బుధవారం పగిడిద్దరాజును మేడారంలోని గద్దెలకు వద్దకు చేర్చుతామని, దీంతో సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభమవుతుందని అర్రెం వంశీయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెలు, పూజారులు అర్రెం అప్పయ్య, బుచ్చయ్య, లక్ష్మినర్సు, చిన్న కాంతారావు, సత్యం, జోగయ్య, ఇద్దయ్య, పెద్ద కాంతారావు, నాగేశ్వరావు, సమ్మయ్య, ముత్తయ్య, భిక్షం రమేష్, నాగేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్: 'మేడారం జాతర'కు ఆరు నెలలే గడువు.. అయినా ఇలా..??
వరంగల్: 2024 ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారలమ్మల మహాజాతరకు ఇంకా ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం 18 శాఖల ద్వారా ఏర్పాట్ల కోసం రూ.75కోట్ల నిధులు అవసరమని అప్పటి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే జాతర సమీపిస్తున్నా.. నిధుల కేటాయింపుల్లో జాప్యం చేయడంతో ఈ జాతరలో కూడా హడావుడి పనులతోనే నిర్వహించేలా కనిపిస్తోందని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలోనే నిమగ్నం కావడంతో జాతర పనుల్లో జాప్యం తప్పేలా లేదు. నిధులు సరిపోయేనా..? మేడారం జాతరలో భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వానికి రూ.75కోట్ల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే జూలై చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు మేడారంలో శాశ్వతంగా నిర్మించిన కల్యాణ కట్ట షెడ్లు, రోడ్లు, విద్యుత్, గెస్ట్‌హౌజ్‌లు దెబ్బతిన్నాయి. జాతరకు రోడ్డు మార్గాలే చాలా అవసరం కానీ, వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో పాటు గుండ్లవాగు బ్రిడ్జి దెబ్బతినడంతో నెలరోజుల పాటు తాడ్వాయి నుంచి మేడారం మీదుగా ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు మళ్లించడంతో ఈ మార్గాన రోడ్లు మరింతగా ధ్వంసమయ్యాయి. అధికారులు మాత్రం రూ.75కోట్ల ప్రతిపాదనలు మాత్రమే ప్రభుత్వానికి పంపించారు. కానీ, జాతర ఏర్పాట్లు, ఇప్పుడు అత్యవసరంగా కావాల్సిన మరమ్మతుల పనులకు ఈ నిధులు ఏ మూలన సరిపోతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటు అసెంబ్లీ ఎన్నికలు, అటు జాతర సమీపిస్తుండంతో అధికా రులు, ప్రజాప్రతినిధులు ముందుగా ఎన్నికల ఏర్పాట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. జాతరకు ఆరు నెలలే గడువు.. మేడారం మహాజాతరకు ఇంకా ఆరునెలల సమయమే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు. నిధులు మంజూరు చేయడం, టెండర్ల ప్రక్రియ, టెక్నికల్ ఆర్డర్లు పొందడం లాంటి వాటికే నెలకు పైగా సమయం పడుతుంది. ముందస్తుగా నిధులు మంజూరైతేనే పనులు నాణ్యతగా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు జాతర నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో జాతర వరకు కూడా పనులు పూర్తయ్యే అవకాశాలు లేవని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే జాతరకు నిధులు అసలు మంజూరవుతాయా.. లేదా.. అనే అనుమానం కలుగకమానదు. జాతర నిధుల మంజూరు విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలో నిమగ్నమయ్యారు. నిధులు మంజూరు చేయాలి.. మేడారం జాతర నిధులను ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలి. జాతరలో భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించి, సరిపడా నిధులు కేటాయించాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు చొరవచూపి జాతరకు ముందే పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. – సిద్దబోయిన జగ్గారావు, పూజారుల సంఘం అధ్యక్షుడు -
దుమ్ములేస్తోంది.. సమ్మక్క వస్తోంది..
మేడారంలో ఇప్పుడు కొత్త రోడ్లు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి వందల కెమెరాలతో ఎప్పటికప్పుడు తాజా సమాచారం చేరుతోంది. కానీ మూడు దశాబ్దాల క్రితం ఇదో దట్టమైన అడవి. కనీసం కరెంటు కూడా లేదు, ఫోన్ అంటే ఏంటో కూడా సరిగా తెలియని పరిస్థితి. ఆ రోజుల్లో సమ్మక్క రాక భక్తులకు తెలిసేందుకు ఒకే ఒక కొండ గుర్తు ఉండేది. ఇప్పుడు మేడారం జాతరకు ఆర్టీసీ 3500ల బస్సులు నడిపిస్తోంది. లక్షల సంఖ్యలో ఆటోలు, జీపులు, ట్రాక్టర్లలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు మేడారం వచ్చే భక్తులు ఎడ్లబండ్లలోనే ఎక్కువ వచ్చేవారు. ఆది, సోమవారాల్లో బయల్దేరి మంగళవారానికి మేడారం చేరుకునేవారు. ఇలా వచ్చే భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో అడవుల్లో బస చేసేవారు. జంపన్నవాగులో చెలమల్లో నీళ్లు తాగేవారు. అడవుల్లో కంకవనం నరికి పందిల్లు వేసుకునేవారు. వాటి కిందే బస చేసేవారు. కరెంటు వెలుగులు లేవు. సాయంత్రం ఆరు గంటల కల్లా వంటలు పూర్తి చేసి వెన్నెల వెలుగుల్లో సమ్మక్క, సారలమ్మల కోసం వేయి కళ్లతో ఎదురు చూసేవారు. బుధవారం సాయంత్రం సారలమ్మ, గురువారం సాయంత్రం సమ్మక్క వస్తుదన్న విషయం తెలిసి పొద్దుగూకే సమయంలో మొక్కులు చెల్లించేందుకు అనువుగా సిద్దమయ్యేవారు. ముఖ్యంగా జాతరలో కీలకమైన సమ్మక్క రాక ఎప్పుడెప్పుడా అని ఒకరినొకరు ఆరా తీసేవారు. గురువారం సాయంత్రం అయ్యిందంటే భక్తులందరూ చిలకలగుట్టవైపుకు చూసేవారు. రహస్య పూజల అనంతరం సమ్మక్కను తీసుకుని వడ్డేలు చిలకలగుట్ట దిగేవారు. అంతే ఒక్కసారిగా అక్కడున్న భక్తులు సమ్మక్కను అనుసరించేవారు. ఆ కోలాహాలానికి మట్టిరోడ్డుపై దుమ్ము ఆకాశాన్ని తాకేలా పైకి లేచేది. ఈ దుమ్ము మేఘాలు కదలాడుతున్న దిశగా భక్తులు సమ్మక్కకు ఎదురెళ్లి స్వాగతం పలికేవారు. నలువైపుల నుంచి భక్తులు దుమ్ము మేఘాలను అనుసరిస్తూ కదిలేవారు. పసుపు కుంకుమ కలిపిన ఒడిబియ్యం సమ్మక్కపైకి జల్లుతూ,, మేకలు కోళ్లు బలిస్తూ తమ మొక్కులు చెల్లించడం చేసేవారు. ఒక్కసారిగా భక్తుల ఒత్తిడి పెరిగిపోవడంతో తొక్కిసలాట కూడా చోటుచే సుకునేది. తర్వాత కాలంలో సమ్మక్క రాకను సూచిస్తూ గాల్లోకి కాల్పులు జరిపే సంప్రదాయాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది‡. కాల్పుల శబ్దాన్ని బట్టి సమ్మక్క వస్తున్న సమాచారం జాతర ప్రాంగణంలో తెలిసేది. ఆ తర్వాత కాలంలో మేడారం చుట్ట పక్కల రోడ్లు, హోటళ్లు, సెల్‌ఫోన్ టవర్లు వచ్చి ప్రతీ సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. -
సమ్మక్క-సారాలమ్మను దర్శించిన కేసీఆర్
-
వన దేవతలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు
సాక్షి, మేడారం : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సారలమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా గంటపాటు దర్శనాలు నిలిపివేయడంతో క్యూ లైన్లలో నిలబడ్డ భక్తులు నిరసనకు దిగారు. ఇక మేడారం సమ్మక్క-సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్కను చిలకల గుట్ట నుంచి మేడారానికి తీసుకురాగా భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క గద్దెపై ఆసీనురాలైంది. ఈ జాతరలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.మరోవైపు మేడారం జాతరలో ప్రజలకు తమ వంతు సహాయం అందిస్తున్నాయి ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఎల్జీ, కార్టేవాలు. కాగ్నిసెన్స్ మీడియా ద్వారా జాతరకు వచ్చే భక్తులకు మాస్కులు, తాగునీరు, ఉచితంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషిన్లు ఏర్పాటు చేశాయి. (వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు) -
‘మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ కోరారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. మేడారాన్ని అతిపెద్ద గిరిజన జాతరగా అభివర్ణించారు. సంప్రదాయ బద్ధంగా జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. -
మేడారంలో ఆదివాసీ ఇలవేల్పులు
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారంలోని వనదేవతలైన సమ్మక్క – సారలమ్మ చెంత 4 రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు కొలిచే వివిధ ఇలవేల్పులను తీసుకొచ్చి సమ్మేళనం నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 500 మంది ఆదివాసీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మూడ్రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఆదివాసీ తెగలకు సంబంధించి ఇలవేల్పులు, దేవతలను ఒక్కచోట పూజించాలని నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి 4 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు కొలిచే ఇలవేల్పుల పడిగెలు (ఆదివాసీ ప్రతిమలు) ఇక్కడకు తీసుకొచ్చారు. ఈ తరహా వేడుకలు జరగడం ఇదే తొలిసారని ఆదివాసీలు తెలిపారు. ప్రతిరోజూ సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్దకు తోడ్కొని వచ్చి ఆదివాసీ సంప్రదాయాలను అనుసరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ గీతాలు, సంగీత వాయిద్యాల హోరుతో మేడారం పరిసర ప్రాంతాలు హోరెత్తిపోయాయి. కాగా, ఆదివాసీ ఇలవేల్పుల సమ్మే ళనం ముగింపు కార్యక్రమం మంగళవారం మేడారంలో జరిగింది, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే సీతక్క, ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఆదివాసీ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. -
మండ మెలిగె.. మేడారం వెలిగె
కోరిన వారికి కొంగు బంగారమైన వనదేవతలు శ్రీసమ్మక్క, సారలమ్మ మహాజాతరకు మరో అడుగు పడింది. గత బుధవారం గుడి మెలిగెతో జాతర ఘట్టం ప్రారంభంకాగా, తాజాగా మండ మెలిగెతో ఉత్సవాలు ఊపందుకున్నాయి. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో బుధవారం వడ్డెలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కొండాయిలో గోవిందరాజులు, పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడుల్లో కూడా సంప్రదాయబద్ధంగా మండ మెలిగెను నిర్వహించారు. దుష్టశక్తులు రాకుండా గ్రామ పొలిమేరల్లో నీళ్లు ఆరబోశారు. మేడారానికి రక్షాబంధం కట్టారు. సమ్మక్క– సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని మండమెలిగె పండుగను బుధవారం మేడారంలో ఘనంగా నిర్వహించారు. ఈ పండుగతో జాతర వేడుకలు ఊపందుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం, ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో కొలువున్న సమ్మక్క మరిది గోవిందరాజులు ఆలయం, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఆలయాలను వడ్డెలు శుద్ధిచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. – ఎస్‌ఎస్‌తాడ్వాయి మామిడాకు తోరణాలు.. సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు ఇంటి వద్ద నుంచి మామిడి తోరణాలు తీసుకువచ్చారు. తూర్పు, పడమర వైపు ఉన్న ప్రధానదారుల్లో కొత్త బురుక కర్రలను తీసుకొచ్చారు. సంప్రదాయబద్ధంగా ఐదుగురు పూజారులు గడ్డపారను పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా గుంతలు తవ్వారు. దిష్టి తగులకుండా మామిడి తోరణ ం, కోడిపిల్ల, సోరకాయ కట్టి ధ్వజ స్తంభాలు నిలిపారు. బుధవారం రాత్రి సమ్మక్క గుడి పూజారి కొక్కెర కృష్ణయ్య కంకణాలు, పసుపు, కుంకుమ రూపంలో అమ్మవారిని గద్దె మీదకు తీసుకెళ్లారు. కంకణాలు కట్టి పూజలు చేశారు. కన్నెపల్లి సారలమ్మ గుడిలో.. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో కాక వంశస్తులు మండమెలిగె నిర్వహించారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఉదయం అమ్మవారి గుడిని శుభ్రపరిచారు. మహిళలు ఆలయాన్ని అలికి ముగ్గులతో అలంకరించారు. అమ్మవారి పూజ సామగ్రి, వస్త్రాలను శుద్ధి చేశారు. సాయంత్రం వడ్డె కాక సారయ్య సారలమ్మకు పూజలు నిర్వహించారు. రాత్రి మేడారంలోని దేవతల గద్దెల వద్దకు సాకహనం(సారా)ను తీసుకుని వెళ్లారు. కొండాయి గోవిందరాజులు గుడిలో.. ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో కొలువై ఉన్న సమ్మక్క మరిది గోవిందరాజులు ఆలయంలో మండ మెలిగె పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి దబ్బకట్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో గుడిని శుద్ధి చేశారు. పసుపు, కుంకుమతో ఆలయాన్ని అలంకరించారు. కొబ్బరి, బెల్లంతో గోవిందరాజులుకు నైవేద్యం సమర్పించారు. ఆలయం పక్కనే ఉన్న నాగులమ్మ ఆలయాన్ని పుట్టమన్నుతో అలికారు. ముగ్గులు వేసి పుసుపు, కుంకుమ చల్లి పూజలు నిర్వహించారు. సమ్మక్క ఆలయంలో.. సిద్ధబోయిన వంశస్తులు మేడారంలోని సమ్మక్క ఆలయంలో మండమెలిగె పండుగ జరిపారు. సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, నాగేశ్వర్రావు సమ్మక్క ఆలయానికి చేరుకున్నారు. కృష్ణయ్య అమ్మవారి శక్తిపీఠం, గద్దెలను పవిత్రమైన పుట్టమట్టితో అలికారు. నాగేశ్వర్రావు అమ్మవారి ధూపాదీపాలను కడిగి, మండ మెలిగె పూజలు నిర్వహించారు. అనంతరం సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి ఆచార ప్రకారం ఆడపడుచులు పసుపు, కుంకుమ, కంకణాలు, పవిత్ర జలాన్ని తీసుకుని డోలువాయిద్యాలతో సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. అమ్మవారి గద్దెపై పసుపు, కుంకుమలు వేశారు. శక్తి పీఠాన్ని కూడా పసుపు, కుంకుమలతో అలంకరించారు. ముగ్గుల అలంకరణ పూర్తయిన అనంతరం పూజారులు ఆలయం నుంచి ధూపం, పసుపు, కుంకుమతో మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ మైసమ్మతోపాటు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. జాతర ట్రస్టుబోర్డు కమిటీ చైర్మన్ కాక లింగయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు. ఘనంగా ఎదురుపిల్ల పండుగ ములుగు రూరల్: మేడారం మహా జాతరకు వారం రోజుల ముందు గట్టమ్మ ఆలయం వద్ద ఎదురుపిల్ల పండుగను ఆదివాసీ నాయకపోడ్లు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ములుగులోని నాయకపోడ్ కాలనీ నుంచి లక్ష్మీదేవరను సిద్ధం చేసి ఊరేగింపుగా బయలు దేరారు. దీంతోపాటు వాజేడు మండలం కడెకల్, ములుగు మండలం పత్తిపల్లి నుంచి వచ్చిన లక్ష్మీదేవరలను కలుపుకుని డీఎల్ఆర్ ఫంక్షన్‌హాల్ నుంచి గట్టమ్మ ఆలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యలో నాయకపోడ్ యువకుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి గట్టమ్మ వద్దకు చేరుకున్నారు. ఆలయ పూజారులు లక్ష్మీదేవరగను సాదరంగా ఆహ్వానించి ఎదురుకోళ్లు తీశారు. మహిళలు బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి యాటపోతులతో మొక్కులు చెల్లించారు. పగిడిద్దరాజుకు పానుపు తయారీ గంగారం(ములుగు): మండ మెలిగెను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజును పెన్క వంశీయులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ముందుగా పానుపు(పగిడిద్ద రాజును పెళ్లి కుమారుడిని చేసేందుకు ఉపయోగించే పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, ధూపదీప నైవేద్యం)ను సిద్ధం చేసి తళపతి ఇంట్లోని ప్రత్యేక పూజ గదిలో ఉంచారు. తళపతి ఇంటి నుంచి పూజాసామగ్రిని పగిడిద్ద రాజు ఆలయానికి తీసుకొచ్చారు. గుడిని శుభ్రపరిచిన అనంతరం పెన్క వంశీయుల ఆడబిడ్డలు ఆలయం ఎదుట లఘ్నపు ముగ్గు వేశారు. 30న మేడారానికి పయనం పగిడిద్దరాజును ఈనెల 30న మేడారానికి తీసుకెళ్లాలని పూజారులు ముహూర్తాన్ని నిర్ణయించారు. పగిడిద్దరాజు పడిగెతో సహా పూజారులు, పెనక వంశీయులు కాలి నడకన మేడారం బయలుదేరుతారు. ఆరోజు రాత్రి లక్ష్మీపురంలోని పెనక వంశీయుల ఇంట్లో బస చేస్తారు. అక్కడి నుంచి తెల్లవారుజామున పస్రా చేరుకుంటారు. పస్రా నుంచి పోలీసు బలగాలతో మేడారం చిలుకలగుట్టకు చేరుకుంటారు. -
మేడారం జాతరకు ‘గ్రహణం’
సాక్షి ప్రతినిధి, వరంగల్: రానున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం రోజున గద్దెలపైకి సారలమ్మ చేరుకునే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో గ్రహణం వీడిన తర్వాత సారలమ్మను గద్దెలపైకి తీసుకు రానున్నారు. ఈ మేరకు సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం, దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మేడారం జాతర జరుగుతుంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతరను ఈసారి 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో నిర్వహిస్తామని సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం 2017 ఏప్రిల్‌లో తేదీలు ప్రకటించింది. 2018 జనవరి 31 జాతర తొలిరోజున కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించి, సాయంత్రం వేళ కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకువస్తారు. ఇదే సమయంలో సాయంత్రం 6:04 నుంచి రాత్రి 8:40 వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో గ్రహణ సమయంలో ఏం చేయాలనే అంశంపై సందిగ్ధం ఏర్పడింది. గ్రహణం తర్వాత: చంద్రగ్రహణం వీడిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో సారలమ్మను మేడారం గద్దెలపైకి తీసుకురావాలని సమ్మక్క–సారలమ్మ పూజా రుల సంఘం నిర్ణయించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గ్రహ ణం విడిచిన తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తీసుకొ స్తామని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు చెప్పారు. పూజారుల సంఘం నిర్ణయం ప్రకారమే మేడారం జాతర విషయంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం నిర్ణయం ప్రకారం ఏర్పాట్లు చేస్తాం. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గ్రహణం విషయంలో పట్టింపులు లేవని పూజారులు చెప్పారు. కాబట్టి ముందుగా నిర్ణయించినట్లుగానే 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జాతర జరుగుతుంది. –రమేశ్‌బాబు, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, వరంగల్ -
సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలి
కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ సంఘాల ధర్నా హన్మకొండ అర్బన్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదో షెడ్యూల్లోని భూభాగాన్ని విడదీయకుండా ములుగు కేంద్రంగా సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదివాసీ సంఘాలు, కాంగ్రెస్, ప్రజాసంఘాలు, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐదో షెడ్యూల్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం విభజన ప్రక్రియ చేపట్టిందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 13 గిరిజన మండలాలు సబ్‌ప్లాన్ పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. ఐదో షెడ్యూల్ భూభాగం ముక్కలు చేసి ఒక్కో జిల్లాకు చేర్చడం వల్ల రానున్న రోజుల్లో పీసాచట్టం, 1/70 చట్టం వర్తింపకుండా చేసే కుట్ర జరగుతోందన్నారు. దీనివల్ల వెనుకబడ్డ ఆదివాసీ జాతులు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అశాస్త్రీయంగా చేస్తున్న విభజన ఆపాలని, ఆదివాసీల ప్రాంతం మొత్తం ఉండేలా సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. ఆందోళన అనంతరం డీఆర్వో శోభకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు బొల్లు దేవేందర్, పొదెం కృష్ణప్రసాద్, పిన్నింటి యాదిరెడ్డి, పాక సాంబయ్య, మండల వెంకన్న, కొమురం ప్రభాకర్, కబ్బాక శ్రావణ్, చిన్న వెంకటయ్య, రత్నం, అర్రెం నారాయణ, అశోక్, సమ్మక్క, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు ఉన్నారు. -
సారీ... సమ్మక్క
వనదేవతను మరిచిన ఉన్నతాధికారులు పునర్విభజన నోటిఫికేషన్లో పొరపాటు తాడ్వాయి మండలంగా ప్రకటన ఆదివాసీ సంఘాల అసంతృప్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్లో తప్పులు పెరుగుతూనే ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండలాల విషయంలో అయోమయానికి గురి చేసి సవరణ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు... ప్రతిష్టాత్మక విషయాలను మరిచిపోయారు. వరంగల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాముఖ్యతను జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న మేడారం జాతర జరిగే తాడ్వాయి మండలాన్ని సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలంగా మార్చారు. 2014 జాతర సమయంలో ఈ మేరకు రాష్ట్ర పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. సమ్మక్క–సారలమ్మ తాడ్వాయి మండలాన్ని భూపాలపల్లి జిల్లాలో కలిపారు. అయితే రెవెన్యూ శాఖ మాత్రం తాడ్వాయి మండలంగానే ముసాయిదాలో పేర్కొంది. ప్రతిష్టాత్మక సమ్మక్క–సారలమ్మ ప్రాశస్త్యాన్ని తెలిపేలా ప్రభుత్వం మార్చిన పేరును కాకుండా కేవలం తాడ్వాయిగా పేర్కొనడంపై ఆదివాసీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాల పునర్విభజన విషయంలో అంతా రహస్యం అన్నట్లుగా వ్యవహరించిన రెవెన్యూ ఉన్నతాధికారులు ముసాయిదాను తప్పుల తడకగా రూపొందించారు. వరంగల్ జిల్లాలో 51 మండలాలు ఉన్నాయనే విషయాన్ని మరిచిపోయినట్లుగా వ్యవహరించారు. జిల్లా కేంద్రంగా మార్చాలని నెలలుగా ఉద్యమం చేస్తున్న జనగామ మండలాన్ని కనీసం ముసాయిదాలో చేర్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాల పునర్విభజనలో మొత్తం ముసాయిదాపైనే న్యాయపరమైన సమస్యలు వచ్చేలా దేవరుప్పుల మండలాన్ని హన్మకొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో కలిపేలా ముసాయిదాలో పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఈ పొరపాటును గుర్తించి సవరణ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. కొత్త మండలాల ఏర్పాటు విషయంలోనూ జిల్లా అధికారుల తీరు ఇలాగే ఉంటోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మండలాల మ్యాపులను తయారు చేయడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ గ్రామాలు ఎక్కడ ఉంటాయి, చెరువుల పరిస్థితి, వాటి ఆయకట్టు ఏమిటనేది తెలియక ఆయా మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముసాయిదా వెల్లడించి వారం రోజులు దాటినా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టనట్లుగానే ఉంటున్నారు. -
గజం రూ.7వేలు
సాక్షి, హన్మకొండ:జాతర సమీస్తుండడంతో మేడారం పరిసర ప్రాంతాల్లో భూముల ధరకు డిమాండ్ పెరిగిపోతోంది. వ్యాపారం, భక్తుల విడిది, వినోద కార్యక్రమాలు.. ఇలా వివిధ పనులతో జాతరకు వచ్చే భక్తులు ఇక్కడ ఇళ్లు, వ్యవసాయ భూములను అద్దెకు తీసుకుంటారు. ఒకేసారి లక్షల మంది భక్తులు వస్తుండటంతో అద్దె ధరలు హైదరాబాద్, వరంగల్‌ను తలదన్నే రీతిలో ఉన్నాయి. మేడారంలో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరగనుం ది. భక్తులు పిల్లాపాపలతో సకుటుంబ సమేతంగా ఈ జాతరకు వస్తారు. వీరంతా మేడారంతో పాటు ఊరట్టం, రెడ్డిగూడెం, నార్లపల్లి, కన్నెపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో విడిది చేస్తారు. చాలా మంది భక్తులు జాతర జరిగే మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి తమ మొక్కులు చెల్లిస్తారు. జాతరకు వచ్చే భక్తుల బస అవసరాలు తీర్చేందుకు జాతర పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లు, పెరటి జాగలతో పాటు తమ పొలాలను సైతం అద్దెకు ఇస్తారు. భక్తుల బస కాకుండా వ్యాపార సముదాయాలకు కూడా జాగా కావాల్సి వస్తుండడంతో అ క్కడి స్థలాలకు క్రేజ్ పెరిగింది. జాతరకు పది హేనురోజుల ముందుగానే జాగల బుకింగ్‌లు పూర్తి కావచ్చాయి. బుక్కయిన దుకాణాల జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తుండటంతో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. దుకాణాలు, బొమ్మల షాపులు, కోళ్ల అమ్మకాలు చేపట్టేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారులు వస్తారు. వాణి జ్య అవసరాలకు సంబంధించి గజం స్థలానికి అద్దె వేల రూపాల్లో పలుకుతోంది. గద్దెల పరిసర ప్రాంతాల నుంచి జంపన్నవాగు వరకు ఉన్న రెండు కిలోమీటర్ల దారికి ఇరువైపులా ఇప్పటికే దుకాణాలు వెలిశాయి. ఇక గద్దెల చుట్టూ వం ద మీటర్ల వరకు అన్నివైపులా గజం స్థలం విలువ రూ.7వేలు ఉంది. జంపన్నవాగు దగ్గర గజం స్థలం విలువ రూ.4వేలు ఉండగా ఇప్పటికే అన్ని బుక్ అవడమే కాకుండా వ్యాపారా లు కూడా ప్రారంభమయ్యాయి. ఊరట్టం వైపు స్నానఘట్టాలు కొత్తగా నిర్మించడంతో ఇక్కడ భూముల అద్దెకు మంచి రేటు వచ్చిం ది. ఈసారి గజం 2,500కు చేరుకుంది.ఇళ్లు.... పదివేలుభక్తులు బస చేస ఇళ్లను, పందిళ్లను ముందుగా నే కిరాయికి బుక్ చేసుకుంటున్నారు. జాతర కేంద్రమైన మేడారం దాని పరిసర గ్రామాలైన రెడ్డిగూడెంలలో ఇళ్ల కిరాయికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీని తర్వాత స్థానంలో కన్నెపల్లి, ఆ తర్వాత నార్లాపూర్, ఊరట్టం గ్రామాలు ఉన్నాయి. జాతర జరిగే మూడు రోజుల పాటు ఒక గదికి అద్దె కనిష్టంగా రూ 3,000 నుంచి 5,000 వరకు పలుకుతున్నాయి. ముఖ్యంగా మేడారం గ్రామంలో ఉన్న ఇళ్ల వరండా అద్దె సగటున ఐదువేల రూపాయలుగా పలుకుతోంది. గదుల అద్దె విషయంలో మేడారంతో రెడ్డిగూడెం పోటీపడుతోంది. ఇక ఊరట్టం, కన్నెపల్లి, నార్లపూర్‌లో ఇందులో సగం ధరలకు గదులు, వరండాలు అందుబాటులో ఉన్నాయి. పందిళ్లకూ డిమాండ్ గతంలో వచ్చే భక్తులు అడవుల్లో ఉండే కంకవనాలను నరికి పందిళ్లు వేసుకుని జాతర జరిగే రోజుల్లో ఇక్కడ బస చేసేవారు. నేటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్థానికులకు చెందిన పెర డు, పొలాల్లో బస ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ మేరకు భక్తులు బసకు సంబంధించి ఒక పందిరికి అద్దె వెరుు్య రూపాయల నుంచి మూ డు వేల రూపాయల వరకు అద్దె పలుకుతోం ది. ముఖ్యంగా జంపన్నవాగు-గద్దెల మధ్య ఉన్న రెడ్డిగూడెం పరిసరాల్లో ఉండే పొలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
మేడారం జాతరకు శాశ్వత స్నాన ఘట్టాలు
చెక్‌డ్యామ్‌ల తరహా నిర్మాణం ఆయకట్టుకు నీరు, లీకేజీల నియంత్రణ లక్ష్యంగా నిర్మాణం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న స్నాన ఘట్టాలకు తుది రూపకల్పన జరిగింది. గతంలో మాదిరి ఇసుక బస్తాలను అడ్డంగా వేసి నీటిని నిల్వ చేసేలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చెక్‌డ్యామ్‌లను నిర్మించేలా ప్రణాళిక తయారైంది. జంపన్నవాగుపై నాలుగు చోట్ల చెక్‌డ్యామ్‌లను నిర్మించి స్నానాలతోపాటు ఇరిగేషన్ అవసరాలకు ఉపయోగపడేలా వీటిని డిజైన్ చేశారు. రూ.20 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ పనులను పదిహేను రోజుల్లో ఆరంభించే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తగిన స్నాన ఘట్టాలను డిజైన్ చేసే బాధ్యతను ప్రభుత్వం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు అప్పగించింది. దీనిపై అధ్యయనం చేసిన సీడీఓ జంపన్నవాగుపై నాలుగు చోట్ల చెక్‌డ్యామ్‌లను ప్రతిపాదించింది. పడిగాపూర్ వద్ద 110 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తుతో తొలి చెక్‌డ్యామ్‌ను ప్రతిపాదించారు. దీనికి 1.5 కిలోమీటర్ల దూరంలో రెడ్డిగూడెం వద్ద 110 మీటర్ల పొడవుతో 2 మీటర్ల ఎత్తుతో రెండో చెక్‌డ్యామ్‌ను ప్రతిపాదించారు. దీనికి 700 మీటర్ల దూరంలో మేడారం వద్ద మరో చెక్‌డ్యామ్, దీనికి 380 మీటర్ల దూరంలో ఊరట్టం వద్ద మరో చెక్‌డ్యామ్‌ను ప్రతిపాదించారు. ఇసుక బస్తాలకు బదులు చెక్‌డ్యామ్‌ల తరహా నిర్మాణం చేయడం వల్ల స్నాన ఘట్టాలకు తోడు 1,200 ఎకరాల అదనపు ఆయకట్టుకు నీటిని అందించే వెసలుబాటు ఉంటుంది. దీనికి తోడు స్నానఘట్టాలకు ప్రతిసారి వదిలే 250 ఎంసీఎఫ్‌టీ నీటిలో లీకేజీ నష్టాలు ఉండేవి. ప్రస్తుతం చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో 150 ఎంసీఎఫ్‌టీల నీరు సరిపోతుంది. -
గణతంత్ర వేడుకల్లో సమ్మక్క, సారలమ్మ శకటం
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మ ఉత్సవానికి జాతీయస్థాయి గుర్తింపు రానుంది. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) నాడు దేశ రాజధానిలో జరిగే పరేడ్‌లో తెలంగాణ తరఫున సమ్మక్క - సారలమ్మ శకటం ప్రదర్శించనున్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు సంబంధించి రక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర సమాచార- పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ వి.సుభాష్, ఆర్టిస్టు రమణారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సమ్మక్క- సారలమ్మ జాతర వరంగల్ జిల్లా లో జరుగుతుందని, ఆ ఉత్సవాల ఔన్నత్యం తెలిపే శకటం ప్రదర్శనలో ఉంచితే బాగుంటుందని ఈ సమావేశంలో వీరు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులకు విన్నవించినట్లు సమాచారం. దీనికి రక్షణ శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. -
ఓ మహిళా.. ఏలుకో...
రాణిరుద్రమ పౌరుషం, సమ్మక్క-సారలమ్మ ధీరత్వానికి వారసత్వంగా నిలిచిన ఓరుగల్లులో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. చట్టసభలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1984లో కల్పనాదేవి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1967లో జిల్లా నుంచి మొదటిసారిగా మహిళా ఎమ్మెల్యే ఎన్నికయ్యూరు. ఆ తర్వాత 2004 నుంచి మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే ఉన్నారు. 2009లో ఒకేసారి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలు గెలుపొంది రికార్డు సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. 1995లో 225 ఎంపీటీసీ, 17 మంది మహిళా జెడ్పీటీసీ సభ్యులు ఉంటే.. ఇప్పుడు 369 ఎంపీటీసీ, 25 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించనున్నారు. -
అందరి సహకారంతోనే మేడారం జాతర సక్సెస్
రూ.100 కోట్లు ఖర్చు చేశాం.. భవిష్యత్‌లో శాశ్వత పనులు చేపడతాం కలెక్టర్ కిషన్ హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేయడం వల్ల మేడారం జాతర సక్సెస్ అయిందని జిల్లా కలెక్టర్ కిషన్ అన్నారు. నగర పరిధిలోని చింతగట్టు అతిథి గృహంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర సక్సెస్‌పై శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతర పనుల కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతరలో ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ పనితీరును అభినందించారు. కోట్లాది మంది హాజరైన ఈ వేడుకల్లో అందరికీ తాగునీరు. బూత్రూంలను ఏర్పాటు చేసి... ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. మేడారంలో భవిష్యత్‌లో జాతరలో శాశ్వత పనులు చేపడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉండేలా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం భారత్ అభియాన్ పథకం కింద రెండు లక్షల ఐఎస్ఎల్లు మార్చి నెలాఖరు వరకు పూర్తి చేయాలని చెప్పారు. వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి ఏర్పడకుండా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిలా పరిషత్ సీఇ వో ఆంజనేయులు మాట్లాడుతూ మేడారం జాతరను పురస్కరించుకుని ఆరునెలల ముందు నుంచే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ...అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయడం వల్లే సక్సెస్ అయ్యామని వివరించారు. ఈ సందర్భంగా జాతరలో విధులు నిర్వహించిన ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ సురేష్‌కుమార్, ఈఈ శ్రీనివాస్‌రావు, రిటైర్డ్ జేడీ విద్యాసాగర్, లింగారవు, మహిపాల్, పులి ప్రభాకర్, శ్రీనివాస్‌రావు, రామ్మోహన్, గంగాధర్, తహసిల్దార్ ఎల్.కిశోర్‌కుమార్, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పొన్నాల...పువ్వులు
మాటల మంత్రి లక్ష్మయ్య వెక్కిరిస్తున్న సమ్మక్క వెబ్సైట్ ఆవిష్కరించినా ఓపెన్ కాని పోర్టల్ అదే తీరుగా మడికొండ ఐటీ పార్కు చెప్పుడెక్కువ... చేసుడు తక్కువ... నానుడి రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు చక్కగా సరిపోతుంది. ఏదో చేసినట్లుగా ప్రకటించుకోవడం... తీరా అది తుస్సుమనడం ఆయన విషయంలో తరచుగా జరగడమే ఇందుకు నిదర్శనం. మేడారం మహా జాతరపై మంత్రి పొన్నాల ఆవిష్కరించిన వెబ్సైట్ ఒక్కరోజు కూడా పనిచేయకపోవడం.. ఆయన శైలిని మరోసారి తేటతెల్లం చేసింది. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరొందిన మేడారం జాతరకు ముందు రోజున (ఫిబ్రవరి 11) రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లో సమ్మక్క-సారలమ్మ వెబ్‌సైట్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. www.sammakkasarakka.co.in పేరు తో రూపొందించిన ఈ వెబ్సైట్ (పోర్టల్) ను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటిం చారు. సమ్మక్క-సారలమ్మ తల్లుల విశిష్టతను తెలిపే అంశాలు, ప్రభుత్వపరంగా జాతర నిర్వహణ ఏర్పాట్లు, వనదేవతలను దర్శనార్థం వచ్చే వారికి అవసరమైన సమాచారం, గూగుల్ రూట్ మ్యాప్‌లు, అత్యవసర ఫోన్ నంబర్లను ఈ పోర్టల్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ, విదేశాల నుంచి జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన సమస్త సమాచారాం ఇందులో ఉందని ఢంకా భజాయించారు. కానీ... అది అందుబాటులోకి రాకుండానే తుస్సుమంది. అవాక్కైన భక్తులు మేడారం జాతర విశేషాలు, జాతర విధుల్లో ఉన్న అధికారులు, రూట్‌మ్యాప్ తదితర అంశాలతో ప్రభుత్వ వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చిందనే వార్త విని భక్తులు సంతోషించారు. ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరిగిన మేడారం జాతరకు కోటి మంది భక్తులు వచ్చారని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఇంత మంది వచ్చిన జాతరపై ఏర్పాటు చేసిన వెబ్సైట్ కావడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడం, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో లక్షలాది మంది దీన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. మేడారం జాతరపై కొత్త అంశాలు ఉండవచ్చని ఆశించారు. కానీ.. వారి ఆశలు అడియూసలయ్యూరుు. మంత్రి పొన్నాల వెబ్సైట్ తుస్సుమంది. అసలు విషయం ఏమీ కనిపించలేదు. ఒకరోజు కాకపోతే మరుసటి రోజైనా పోర్టల్ అందుబాటులోకి రాకపోతుందా అని వేచి చూశారు. జాతర జరిగిన నాలుగు రోజులతోపాటు ఇప్పటివరకూ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. పైగా పొన్నాల ఇచ్చిన అడ్రస్‌తో ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఈ సైట్ అసలు ప్రారంభం కాలేదని, పైగా ఇది అమ్మకానికి ఉందని అందులో పేర్కొన్నారు. మంత్రి ఆవిష్కరించిన వెబ్సైట్ కావడంతో మేడారం జాతర సమాచారం తెలుస్తుందనుకుంటే... అసలు ఓపెన్ కూడా కాకపోవడం చాలా మందిని నిరుత్సాహ పరిచింది ఎవరో రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించడం... అది బాగుంటందని చెప్పుకోవడం... తీరా అందులో విషయం లేకపోవడంతో ఐటీ మంత్రిగా పొన్నాల లక్ష్మయ్యకు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఆది నుంచి అంతే... తెలంగాణలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌లో ఐటీ రంగం పురోగతికి పొన్నాల లక్ష్మయ్య ఏమీ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మడికొండలో 33 ఎకరాల్లో ఆయన ఆర్భాటంగా ఐటీ పార్కును ప్రారంభించారు. మార్కెట్ పరంగా సామర్థ్యం ఉన్నా...ఈ ప్రాజెక్ట్ వైపు కంపెనీలు కనీసం కన్నెత్తి కూడా చూడ లేదు. ఐటీ కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండే ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు ఇంకా మూలుగుతూనే ఉంది. -
నేడు జాతర హుండీల లెక్కింపు
హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీలను సోమవారం ఉదయం 11గంటలకు హన్మకొండ టీటీ డీ కల్యాణ మండపంలో లెక్కించనున్నారు. రెవెన్యూ, దేవాదాయశాఖ ఉద్యోగులు 200మందితోపాటు రాష్ట్రంలోని పలు దేవాలయాల నుంచి వచ్చిన ఉద్యోగులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మేడారం జాతర ఈఓ దూస రాజేశ్వర్ తెలిపారు. మొత్తం 410 హుండీలకుగాను 397 హుండీలను ఎనిమిది ఆర్టీసీ బస్సుల్లో తరలించామని, వీటిలో 51 క్లాత్ హుండీలు ఉన్నాయని తెలిపారు. మరో 13 హుండీలను తిరుగువారం ముగిసిన తర్వాత తీసుకొస్తామన్నారు. లెక్కింపు పర్యవేక్షణకు ఎనిమిది సీసీ కెమెరాలు, మూడు క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం టీటీడీ కల్యాణ మండపానికి చేరుకున్న హుండీలను దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ తాళ్లూరి రమేష్‌బాబు, డీఆర్ఓ సురేంద్రకరణ్తో కలిసి ఈఓ రాజేశ్వర్ పర్యవేక్షించారు. హుండీలను భద్రపరిచే కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఒక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు భద్రతలో నిమగ్నమయ్యారు. లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు. -
ముగిసిన మేడారం జాతర
వరంగల్: గిరిజన సంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా మేడారం జాతర ముగిసింది. ప్రధాన పూజారుల సమక్షంలో సమ్మక్క-సారలమ్మలు వనప్రవేశం చేశారు. మూడు రోజులుగా మొక్కులు అందుకున్న వనదేవతలు ఈ రోజు వనప్రవేశం చేయడంతో జాతరలో చివరి ఘట్టం ముగిసింది. నలుగురు దేవతల పూజారులు గద్దెల వద్ద పూజలు చేశారు. అనంతరం సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం సమీపంలోని చిలకలగుట్టపైకి తీసుకువెళ్లారు. మేడారం జాతరకు కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరైనట్లు కలెక్టర్ జి.కిషన్ చెప్పారు. 19న తిరుగువారం సమ్మక్క-సారలమ్మ తిరుగువారం పండగను ఈ నెల 19న గిరిజన పూజారులు ఘనంగా నిర్వహిస్తారు. జాతర సందర్భంగా దేవతలను దుమ్ముకాళ్లతో తీసుకువచ్చినందుకు, పూజల్లో తప్పిదాలు జరిగితే మన్నించాలని వేడుకుంటూ ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. తిరుగువారం రోజున సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గుళ్లను, గద్దెలను శుభ్రం చేస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మేకలను దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో మేడారం మహా వన జాతర ముగిసినట్లువుతుంది. -
గద్దెకు చేరిన సమ్మక్క తల్లి
-
ఉద్విగ్న భరిణెం
జనం చేరిన అమ్మ ప్రతిరూపం పులకించిన మేడారం.. ఉప్పొంగిన భక్తిభావం ఉదయం నుంచే.. సమ్మక్క రాక సందర్భంగా సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, పూజారులు దోబె పగడయ్య, సిద్దబోయిన సమ్మయ్య(తండ్రి పొట్టయ్య), సిద్దబోయిన సమ్మయ్య (తండ్రి దానయ్య), మాదిరి పుల్లయ్య, మాదిరి నారాయణ గురువారం మేడారంలోని సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే అడవికి వెళ్లి వనం(వెదురు) తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం 3.50 గంటలకు చిలకలగుట్టపైకి వెళ్లి పూజలు చేసి తల్లిని గద్దెలపైకి చేర్చారు. అడుగడుగునా నీరాజనాలు తల్లి సమ్మక్క గద్దెకు చేరుతుండగా భక్తులు అడుగడుగునా ఎదురుకోళ్లతో ఘనస్వాగతం పలికారు. గాలిలోకి కోళ్లు ఎగురవేస్తూ ఆహ్వానించారు. తల్లిపై ఒడి బియ్యం చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. దారిపొడవునా బారులుదీరి న భక్తులు తల్లిని ప్రత్యక్షంగా చూసేందుకు ఆ రాటపడ్డారు. అమ్మను కళ్లారా చూసి తరించా రు. యాటపోతులు, కోళ్లతో ఎదురెళ్లి బలిచ్చా రు. భక్తులు, శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. తల్లి నామస్మరణతో మేడారం హోరెత్తింది. థింసా నృత్యాలు అలరించాయి. పోలీసుల భారీ బందోబస్తు పోలీసుల భారీ బందోబస్తు మధ్య సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెకు చేర్చారు. సమ్మక్కను పూజారులు తీసుకుని వస్తుండగా రెండు రోప్‌పార్టీలు రక్షణ ఇచ్చాయి. రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు ఆధ్వర్యంలో డీఎస్పీ దక్షిణామూర్తి, సీఐలు దేవేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, ఇతర బలగాలు భద్రత చేపట్టాయి. అధికారుల ఘనస్వాగతం కలెక్టర్ కిషన్, రూరల్ ఎస్పీ కాళిదాసు, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క, ఊరట్టం సర్పంచ్ గడ్డం సంధ్యారాణి, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈఓ దూస రాజేశ్వర్‌రావు తల్లికి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.39కు ఏకే-47తో రూరల్ ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. గుట్ట దిగగానే 5.42 గంటలకు, గద్దెల ప్రాంగణానికి వస్తుండగా చిలకలగుట్ట రోడ్డుకు చేరిన సమయంలో, సాయంత్రం 5.55 గంటలకు మరోసారి కాల్పులు జరిపారు. గుట్టెక్కిన భక్తులు చిలకలగుట్ట నుంచి తల్లిని గద్దెలకు తీసుకెళ్లిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు చిలకలగుట్ట ఎక్కారు. పూజారుల పూజా విధానంపై ఆసక్తితో వారు గుట్ట ఎక్కినా అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో కిందికి దిగారు. ఇక తల్లిపై వేసిన బియ్యాన్ని ఆమె వెళ్లిపోయిన తర్వాత భక్తులు సేకరించారు. అలాగే గుట్ట సమీపంలోని చెట్ల బెరడును కూడా తీసుకెళ్లారు. దేవతలను దర్శించుకున్న 30 లక్షల మంది తల్లీబిడ్డలు గద్దెలపై కొలువుదీరగానే సుమారు 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు గద్దెల వద్ద భక్తజన ప్రవాహం కొనసాగింది. అమ్మలకు ఇష్టమైన నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు కిక్కిరిసింది. మొత్తంగా ఇప్పటివరకు సుమారు 70లక్షలమంది అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఒకే ఒక్కడు..
కోటికొక్కడు కొక్కెర కృష్ణయ్య సమ్మక్కను తీసుకొచ్చేది తనే మేడారం జాతరలో ప్రధాన ఘట్టం చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడం. జాతరలో అత్యంత ఉద్విగ్న భరిత క్షణాలు చిలకలగుట్ట కిందికి సమ్మక్క దిగిరావడం. ఆ సమయంలో కలెక్టర్, ఎస్పీలు ఎదురేగి తుపాకులతో గాలిలోకి కాల్పులు జరుపుతారు. ఆ క్షణాల్లో అందరి కళ్లు భరిణె రూపంలో ఉన్న సమ్మక్కపైనే. ఆ తర్వాత వారి దృష్టి దానిని తీసుకొచ్చే ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్యపై పడుతుంది. వేలాదిమంది ప్రత్యక్షంగా, లక్షలాదిమంది పరోక్షంగా ఈ ఘట్టాన్ని ఉత్కంఠగా వీక్షిస్తారు. అంతటి ఉత్కంఠ, ఉద్విగ్నభరిత క్షణాలను తన భుజాలపై మోసే కొక్కెర కృష్ణయ్య మనోగతం ఆయన మాటల్లోనే.. గుడిమెలిగె పండుగతో సమ్మక్క-సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. అయితే జాతర మొదలయ్యేది మండమెలిగె పండుగతోనే. ఈ పండుగ నాడు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనున్న సమ్మక్కతల్లిని గద్దెల పైకి చేర్చే వరకు నియమనిష్ఠలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపండ్లు ఆహా రంగా తీసుకుంటాం. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటాం. నేనొక్కడినే వెళ్తా.. దేవాదాయశాఖ ఇచ్చిన కొత్త బట్టలు ధరిస్తాం. మేడారం సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ తర్వాత రహస్యమైన పూజా సామగ్రిని తీసుకుని నాతో పాటు వడ్డెల బృందం చిలకలగుట్టకు బయల్దేరుతుంది. సమ్మక్క వడ్డెలైన దోబే పగడయ్య ధూపం, మల్యాల ముత్తయ్య జలకంపట్టి వేస్తుండగా ముందుకు కదులుతాం. జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). బాజాభజంత్రీల నడుమ మాదిరి పుల్లయ్య, మాదిరి నారాయణ మమ్మల్ని అనుసరిస్తారు. చిలకలగుట్ట సగం వరకే వీరికి ప్రవేశం. ఆ తర్వాత సమ్మక్క తల్లి కొలువై ఉండే రహస్య ప్రదేశానికి నేనొక్కడినే వెళ్తా. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్క తల్లిని భరిణె రూపంలో కిందకు తీసుకువస్తా. నేను రావడం కనిపించగానే జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రి పేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య), భజంత్రీలతో మాదిరి పుల్లయ్యలు శబ్దం చేస్తారు. అలా గుట్టమధ్య నుంచి సమ్మక్క తల్లి చిలకలగుట్ట పాదాల వద్దకు చేరుకోగానే ప్రభుత్వం తరపున కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి కాల్పులు జరిపి ఆ తల్లికి ఘనస్వాగతం పలుకుతారు. అది వ్యక్తిగత విషయం సమ్మక్క- సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహ అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. జాతర సంబరాల్లో భాగంగా మద్యం తీసుకునే అలవాటు ఉన్న వడ్డెలు మాత్రం తాగేవారు. మద్యం సేవించడం పూజా విధానంలో భాగం కాదు. నా వరకు నేను మండమెలిగె పండుగ నుంచే నిష్ఠతో ఒక్క పొద్దు ఉంటాను. నాతో పాటు ఉండే వడ్డెలు వారి వ్యక్తిగత అలవాట్లను బట్టి మద్యం తీసుకుంటారు. అలా మద్యం సేవించడం తప్పు కాదు. అలాగని తీసుకోవడం తప్పనిసరి కాదు. గతంలో సాయంత్రం నాలుగు గంటలకల్లా గద్దెల మీదికి సమ్మక్క తల్లిని తీసుకువచ్చేవాళ్లం. ఇప్పుడు జాతరకు జనం పెరగడం వల్ల ఐదు గంటలవుతోంది. అయితే ఏడుగంటల్లోపు ఎప్పుడు వచ్చినా మంచిదే. అందరిలానే నేను ఎంతో మంది భక్తులు తమ కోర్కెలు తీరాలని, కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పని తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే నాకు మరింత మేలు జరుగుతుందని అనుకుంటారు. అందరిలానే నేను. తీసుకురావడం అనేది బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికీ మేలు చేస్తుంది. -
ఒక దేవత వెలిసింది..
రాత్రి 9.40కి జనప్రవేశం పరవశించిన భక్తజనం తెల్లవార్లూ మొక్కుల చెల్లింపు మేడారం, న్యూస్‌లైన్ : దండాలు సారక్క తల్లే.. అంటూ జాతర ప్రాంగణం తల్లి నామస్మరణలో మునిగితేలింది. నాలుగు రోజులపాటు జరిగే మహా జాతరలో బుధవారం సారలమ్మ మేడారంలోని గద్దెకు చేరడంతో మహాఘట్టానికి తెరలేచింది. కుంకుమ భరణె రూపంలో ఉన్న తల్లి దర్శనం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న భక్తుల్లో ఆ తల్లి గద్దెపైకి చేరగానే భక్తి భావం ఉప్పొంగింది. బుధవారం సాయంత్రం 6.18 నిమిషాలకు కన్నెపల్లిలో బయలుదేరిన సారలమ్మ 7.20 గంటలకు జంపన్నవాగు వద్దకు, అక్కడి నుంచి సమ్మక్క గుడికి చేరుకుంది. అప్పటికే అక్కడికి ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి వచ్చిన గోవిందరాజులు, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి వచ్చిన పగిడిద్దరాజులున్నారు. ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 9.40గంటలకు మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠించారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడన సారక్కను ఆద్యంతం భక్తి పారవశ్యంలో ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు పూజారులు గద్దెకు చేర్చారు. సారలమ్మ గద్దెను చేరనున్న క్రమంలో బుధవారం ఉదయం నుం చే సాలరమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో గిరిజన పూజారులు కన్నెపల్లిలోని సారక్క ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు ఆరంభించారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పూజలు జోరందుకున్నాయి. సాయంత్రం అక్కడి నుంచి బయలు దేరిన సారలమ్మ భారీ పోలీస్ బందోబస్తు మధ్య భక్తుల జయజయధ్వానాల నడుమ మేడారంలోని గద్దెలను చేరింది. ఉదయం నుంచే.. కన్నెపల్లి వెన్నెలమ్మ మేడారం గద్దెలను చేరనుండడంతో బుధవారం ఉదయం నుంచే కన్నెపల్లి సారక్క ఆలయంలో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. ప్రధాన వడ్డె కాక సారయ్యతో పాటు కోరె ముత్యంబాయి, కాక లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకన్న, కాక భుజంగరావు, కాక కనకమ్మ అత్యంత భక్తి శ్రద్ధలతో తల్లికి పూజలు చేశారు. ఈ క్రమంలో కన్నెపల్లిలోని సారలమ్మ గుడికి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమ ఆడపడుచును తల్లి ఒడికి చేర్చేందుకు గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు. దారిపొడవునా దండాలు సారలమ్మను గద్దెకు చేర్చే క్రమంలో దారి పొడవునా భక్తుల దండాలు పెడుతూ భక్తి ప్రపత్తులు చాటారు. సారక్క జై.. అంటూ నినాదాలు చేశారు. కన్నెపల్లి వాసులందరూ మంగళహారతులతో స్వాగతం పలికారు. దారి పొడవునా నీళ్లు పోస్తూ కొబ్బరికాయలు కొట్టి తమ బిడ్డను మేడారానికి సాగనంపారు. కన్నెపల్లి నుంచి మేడారం చేరే ముందు సారలమ్మ తమ్ముడు జంపన్నను ముద్దాడుకుంటూ వెళ్లింది. సంపెంగవాగులో కొలువైన జంపన్న క్షేమ సమాచారం తెలుసుకుని తల్లి ఒడికి చేరింది. తమ్ముడు జంపన్నను పలకరిస్తుండగా శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. గుడారాల్లో ఉన్న భక్తులు కూడా ఒక్కసారిగా సారక్కను చూసేందుకు రోడ్డు పైకి చేరడంతో పరిసరాలు కిటకిటలాడాయి. సారక్క మహిమలతో శివసత్తులు శివాలూగారు. పోలీసుల అత్యుత్సాహం కన్నెపల్లి వెన్నెలమ్మను మేడారం గద్దెకు చేర్చేక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బందోబస్తు పేరుతో గిరిజనులను ఇబ్బందులు పెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వెన్నెలమ్మను వడివడిగా సమ్మక్క గుడికి చేర్చారు. అయితే సారలమ్మకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు.. అధికారుల సేవలో తరించారు. జేసీ పౌసుమిబసు, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా, కరీంనగర్ జేసీ సర్ఫరాజ్ అహ్మద్‌లకు ఏకంగా రోప్ సౌకర్యం కల్పించి ఔరా అన్పించుకున్నారు. దాదాపుగా సారలమ్మకు రోప్ ఇచ్చినట్టుగా హడావుడి చేస్తూ దారిపొడవునా భక్తులను ఇక్కట్లకు గురిచేశారు. వారి తీరుపై భక్తులు మండిపడ్డారు. వరం పట్టిన మహిళలు సంతానం కోసం పలువురు మహిళలు కన్నెపల్లి ఆయలం వద్ద వరం ప ట్టారు. అంతకుముందు జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేశారు. తడిబట్టలతోనే సారలమ్మ గుడికి చేరుకు ని పొర్లుదండాలు పెట్టారు. సారక్క ను గద్దెలపైకి చేర్చే క్రమంలో పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సారలమ్మ రాకను సూచిస్తూ పూజారులు కొమ్ము బూరలు పూరించారు. స్వాగతం పలికిన అధికారులు సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెపైకి తీసుకువచ్చేందుకు జిల్లా అధికారులు, ప్రముఖులు తరలివచ్చి స్వాగతం పలికా రు. క లెక్టర్ కిషన్, స్థానిక ఎమ్మెల్యే ధనసరి సీతక్క, జేసీ పౌసుమిబసు, ఏజేసీ, ఐటీడీఏ పీఓ సంజీవయ్య, కరీంనగర్ జేసీ సర్ఫరాజ్ అహ్మద్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మి శ్రా, ములుగు ఆర్డీఓ సభావట్ మోతీలాల్, డీఎస్పీ కటకం మురళీధర్, సీఆర్పీఎఫ్ ఐజీ అశ్వనీ వర్మ, డీఎస్పీ అరవింద్ కుమార్ అమ్మవారికి స్వాగతం పలికారు. -
రేపటి నుంచే మహా సంబరం
సాక్షి, హన్మకొండ: మహా జాతరకు ఘడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అంటూ భక్త కోటి ఎదురుచూసే అమ్మల జాతరకు ఇంకా మిగిలింది ఇరవై నాలుగు గంటలే.. సారలమ్మ రాకతో ప్రారంభమయ్యే మహాఘట్టానికి మేడారం ముస్తాబైంది. కన్నెపల్లి వెన్నెలమ్మ రాక కోసం భక్త జనం ఆరాటపడుతోంది. 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెలపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు మేడారం బాటపడుతున్నారు. కన్నెపల్లి, మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు గుడారాలతో నిండిపోయూయి. కన్నెపల్లిలో సందడి సారలమ్మ ఆలయం ఉన్న కన్నెపల్లిలో ఊరంతా తమ ఇళ్లను అలికి పండుగకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఇళ్లకు సున్నాలు వేసుకుని సుందరంగా అలంకరించుకున్నారు. పండ క్కి వచ్చిన బంధువులతో వారిళ్లన్నీ కళకళలాడుతున్నాయి. కాగా, సారలమ్మ పూజారులు గత బుధవారం నుంచే సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో నిమగ్నమయ్యారు. బుధవారం జరిగే మహాఘట్టానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు దేవాదాయశాఖ సైతం అమ్మల జాతరను విజయవంతం చేసేందుకు శాఖాపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యం కోసం రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన స్నానఘట్టాలు, నూతన వంతెన, కొత్త రోడ్లు తదితర పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. జాతర ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతల్లో సోమవారం నుంచి 14వేల మంది వివిధ శాఖల సిబ్బంది తలమునకలైపోయూరు. వాహనాల రద్దీ, వాణిజ్య సముదాయాలు, విద్యుత్ దీప కాంతులతో మేడారం పరిసర ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది.