ఈసారి..రూ.400 కోట్లు | The Rs 400 crore .. | Sakshi
Sakshi News home page

ఈసారి..రూ.400 కోట్లు

Published Sun, Feb 9 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

ఈసారి..రూ.400 కోట్లు

ఈసారి..రూ.400 కోట్లు

  •     దట్టమైన అడవిలో భారీ వ్యాపారం
  •      4 రోజుల్లో జోరుగా క్రయవిక్రయూలు
  •      2012లో లావాదేవీలు రూ.300 కోట్లు
  •      {పస్తుతం ఏర్పాట్లకు మరో రూ.100 కోట్లు
  •  హన్మకొండ, న్యూస్‌లైన్ : మేడారం... దట్టమైన అటవీ ప్రాంతం... ఇలాంటి చోట సాధారణ సమయూల్లో చిన్న సంత జరిగిన దాఖలాలు ఉండవు. అక్కడి ఆదివాసీ గిరిజనులకు నిత్యావసర సరుకులే దొరకని పరిస్థితి. అలాంటిది మహా జాతర వచ్చిం దంటే చాలు... వ్యాపారం వందల కోట్లకు పరుగెడుతుంది. ప్రతి రెండేళ్ల కాలంలో ఆ నాలుగు రోజులు భారీగా లావాదేవీలు సాగుతాయి. ఊహకందని విధంగా క్రయవిక్రయూలు జరుగుతాయి. భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ రాగా... వ్యాపారం సైతం అదే దారిలో పుంజుకుంటుంది. అందుకే ఆసియూ ఖండంలోనే అత్యంత ఖరీదైన జాతరగా గుర్తింపు పొందింది. గత జాతరలో రూ.300 కోట్ల వ్యాపారం సాగగా... ఈ సారి రూ.400 కోట్లకు చేరుకుం టుందని దేవాదాయ శాఖ అధికారుల అంచనా.

    నాలుగు రోజుల్లోనే రెండేళ్ల సంపాదన

    మేడారంతోపాటు దాని చుట్టు ఉండే సుమారు ఎనిమిది గ్రామాల ప్రజలు రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ మహాజాతర కోసం ఆతృతగా ఎదురుచూస్తారు. గిరిజన సంప్రదాయం ప్రకారం వనదేవతలకు మొ క్కులు సమర్పించడమే కాకుండా... రెండేళ్ల సంపాదనను వారు జాతర జరిగే ఆ నాలుగు రోజుల్లో సమకూర్చుకోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. అమ్మల దర్శనానికి కోట్లాదిగా తరలివచ్చే భక్తులు అక్కడ నిల్చుండే జాగ నుంచి మొదలు తాగు నీరు, తినే తిండి వరకు అన్నింటినీ కొనాల్సిందే. అంతేకాదు... రవాణా, విడిది (అద్దె)తోపాటు తల్లులకు సమర్పించే బంగారం (బెల్లం), కొబ్బరికాయ లు, పసుపు, కుంకుమ, కోళ్లు, గొర్రెలు, మేక లు, మద్యం తదితర వస్తువుల కొనుగోళ్లకు ఖర్చు వెచ్చించాల్సిందే. ఈ మేరకు కేవలం ఆ నాలుగు రోజుల్లో రూ.వందల కోట్లలో వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. ఇందుకు 2012 జాతరలో జరిగిన క్రయవిక్రయూలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
     
    పక్క రాష్ట్రాల నుంచీ...

    మహాజాతర నేపథ్యంలో వ్యాపారం జోరుగా సాగుతుండడంతో పక్కరాష్ట్రాల వారు సైతం మేడారం వైపు దృష్టి సారిస్తున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు ఆధిక సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ మకాం వేస్తున్నారు. మెట్రో నగరాల్లో ఉండే సౌకర్యాలను జాతర పరిసర ప్రాంతాల్లో కల్పించడమే కాకుండా... వ్యాపార మెళకువలు పాటించి భక్తులను ఆకట్టుకుంటున్నారు. జాతర జరిగే నాలుగు రోజులు ధరలు విపరీతంగా పెంచి విక్రయూలు చేస్తుండడంతో లావాదేవీలు వందల కోట్లకు చేరుకున్నాయి.

     సర్కారీ ఖర్చులు అదనం

     తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక మరమ్మతులు, ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గత జాతరలో రూ.60 కోట్లు వెచ్చిం చారు.  ఈ లెక్కన మొత్తం లావాదేవీలు రూ.360 కోట్లు. ఇక ఈ సారి జాతర ఏర్పాట్లకు సర్కారు వెచ్చిస్తున్న నిధులు రూ.100 కోట్లు. దేవాదాయ శాఖ అంచనా ప్రకారం వ్యాపార లావాదేవీలు రూ.400 కోట్లు అనుకుంటే... మొత్తం రూ.500 కోట్లకు చేరుతుందన్న మాట. అధికారులు, సిబ్బంది అలవెన్సులు, భోజనాలు, నిర్వహణ ఖర్చులు వీటికి అదనమే అని చెప్పవచ్చు.

     రాష్ట్రంలోని పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏడాది పొడవునా వ్యాపారం సాగుతున్నా... కోట్లకు చేరలేదు. అలాంటిది నాలుగు రోజుల మేడారం మహాజాతరలో  వందల కోట్ల వ్యాపారం సాగుతుండడం విశేషం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement