తొందరపడి బస్టాండ్‌లవైపు పరుగులు తీయొద్దని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది. వచ్చే నాలుగు రోజులు ఎక్కువ బస్సులు మేడారం వెళ్తాయి కాబట్టి.. సాధారణ రూట్లలో బస్సులు తక్కువ ఉంటాయి. అలాగే కొన్ని రద్దవుతాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు.
"తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం."
రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది.
దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. – వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్‌ఆర్టీసీ.
సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!!
తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ…— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024
Comments
Please login to add a commentAdd a comment