మేడారంలో ఆదివాసీ ఇలవేల్పులు | Huge Crod In Medaram Sammakka Saralamma Jatara | Sakshi
Sakshi News home page

మేడారంలో ఆదివాసీ ఇలవేల్పులు

Published Wed, Dec 25 2019 2:35 AM | Last Updated on Wed, Dec 25 2019 2:35 AM

Huge Crod In Medaram Sammakka Saralamma Jatara - Sakshi

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారంలోని వనదేవతలైన సమ్మక్క – సారలమ్మ చెంత 4 రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు కొలిచే వివిధ ఇలవేల్పులను తీసుకొచ్చి సమ్మేళనం నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 500 మంది ఆదివాసీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మూడ్రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఆదివాసీ తెగలకు సంబంధించి ఇలవేల్పులు, దేవతలను ఒక్కచోట పూజించాలని నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి 4 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు కొలిచే ఇలవేల్పుల పడిగెలు (ఆదివాసీ ప్రతిమలు) ఇక్కడకు తీసుకొచ్చారు.

ఈ తరహా వేడుకలు జరగడం ఇదే తొలిసారని ఆదివాసీలు తెలిపారు. ప్రతిరోజూ సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్దకు తోడ్కొని వచ్చి ఆదివాసీ సంప్రదాయాలను అనుసరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ గీతాలు, సంగీత వాయిద్యాల హోరుతో మేడారం పరిసర ప్రాంతాలు హోరెత్తిపోయాయి. కాగా, ఆదివాసీ ఇలవేల్పుల సమ్మే ళనం ముగింపు కార్యక్రమం మంగళవారం మేడారంలో జరిగింది, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే సీతక్క, ప్రొఫెసర్‌ ఈసం నారాయణ, ఆదివాసీ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement