మేడారం(తాడ్వాయి), న్యూస్‌లైన్ : మేడారం మహాజాతరను పురస్కరించుకుని గిరిజన సంక్షేమశాఖ అధికారులు కాంట్రా క్టర్ల అవతారమెత్తారు. జాతరలో చేపట్టే వివిధ పనులను నామినేషన్ పద్ధతిన వారే చేస్తుండడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... వచ్చే నెలలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖకు *6కోట్ల నిధులు మం జూరు చేసింది. అయితే ఇందులో *1.42 కోట్లతో తాగునీటి పైపులైన్ల నిర్మాణం, జంపన్నవాగులోని నీటిని నిల్వ చేసేందుకు ఇసుకబస్తాలతో అడ్డుకట్ట, సిస్టర్న్, నల్లాల ప్లాట్‌ఫాంల మరమ్మత్తుతోపాటు మరికొన్ని పనులు చేయాల్సి ఉంది.
అయితే గిరిజన సంక్షేమశాఖ కు చెందిన ఇంజినీరింగ్ అధికారులు పై పనులను అన్నింటిని నామినేషన్ పద్ధతిన ఒకే కాం ట్రాక్టర్‌కు అప్పగించారు. దీంతో స్థానిక గిరి జనులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో జరిగే జాతరలో చేపట్టే పనుల బాధ్యతను మాకే కేటాయించాలని వారితో వాగ్వాదం పెట్టుకున్నారు. మొత్తం పనుల్లో కనీసం ఒకటి, రెం డైన.. వీడీసీ ద్వారా తమకే అప్పగించాలని గిరిజన మహిళలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే జాతర పనులను చేపట్టడంలో తగిన అనుభవం లేదనే సాకుతో ఇంజినీరింగ్ అధికారులు స్థానికులకు పనులు అప్పగించేందుకు ముఖం చాటేశారు. ఇదిలా ఉండగా, స్థానికుల సహకారం లేకుండా మేడారంలో ఎలాంటి పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.
దీంతో గిరిజన సంక్షేమ అధికారులే కాంట్రాక్టర్లుగా మారి కూలీలతో పనులు చేయిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లకు టెం డర్లు అప్పగించి పనుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులే.. స్వయంగా పనుల బాధ్యతను తీసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నామి నేషన్ పద్ధతిన పనులు చేస్తున్న అధికారులే.. బిల్లులు కూ డా చేసుకుంటుండడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పనులను ఏమేరకు నాణ్యతో చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ ఏఈ ఆబిద్‌ఖాన్‘తో మా ట్లాడగా.. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో చేపట్టే పనులు ఇప్పటికే ఆలస్యమయ్యాయన్నారు. వీటిని సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇప్పుడిప్పుడే మొదలైన పనులు..
మేడారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు ఇప్పుడిప్పుడే మొదల య్యాయి. ఊరట్టం కా జ్‌వేనుంచి మేడారం దే వతల గద్దెల వరకు అప్డ్రోచ్‌రోడ్డు, పైప్‌లైన్లు, ఇన్‌ఫిల్టరేషన్ బావుల నిర్మా ణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యా యి. సరిగ్గా నెలలోపు జాతర జరుగుతున్నప్పటికీ గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారులు ఇంకా పనుల ప్రారంభంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. కాగా, ఈశాఖ పనులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో స్థానిక అధికారులు, సిబ్బంది పనుల్లో పురోగతి చూపించేందుకు హైరానా పడుతున్నారు. భక్తు ల సౌకర్యార్థం చేపడుతున్న పనులు జాతర ప్రారంభంలోగా పూర్తవుతాయా అనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ వాళ్లే..!
Published Mon, Jan 13 2014 5:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement