abid khan
-
‘జేకేహెచ్ అబిద్’పై నేరం నిరూపణ!
♦ హిమాచల్‌ప్రదేశ్ కేసులో ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పు ♦ హైదరాబాద్‌లో అబు అన్స్ అనుచరుడిగా కార్యకలాపాలు ♦ ఇక జేకేహెచ్ కేసులో విచారణ ముందుకు... సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్త పేలుళ్లకు కుట్రపన్ని నగరంలో చిక్కిన ఐసిస్ అనుబంధ సంస్థ జునూద్æ అల్ ఖలీఫా ఫిల్ హింద్ (జేకేహెచ్) ఉగ్రవాద మాడ్యూల్‌కు చెందిన, గత ఏడాది డిసెంబర్లో అరెస్టయిన ఉగ్రవాది అబిద్ ఖాన్‌ను దోషిగా నిర్ణయిస్తూ ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పింది. ఖాన్‌ను హిమాచల్‌ప్రదేశ్‌లో అరెస్టు చేసిన సందర్భంలో కులులోని బంజార్ పోలీసులు నమోదు చేసిన కేసును ఎన్ఐఏ ఈ ఏడాది జనవరిలో రీ–రిజిస్టర్ చేసింది. అబిద్ ఖాన్ గత ఏడాది హైదరాబాద్‌లో చిక్కిన అబు అన్స్‌కు అనుచరుడిగా ఉండటంతో పాటు ఆ మాడ్యూల్లో కలసి టోలిచౌకిలో జరిగిన కీలక సమావే శంలోనూ పాల్గొన్నాడు. గత ఏడాది జనవరిలో ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా 14 మందితో పాటు నగరం లోనూ నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివసించిన అబు అన్స్, టోలిచౌకి వాసి మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్ సైతం ఉన్నారు. బెంగళూరుకు చెందిన అబిద్‌ఖాన్ ఆన్లైన్ ద్వారా ఆకర్షితుడై జేకేహెచ్ మా డ్యూల్లో చేరాడు. ఈ మాడ్యూల్‌కు చీఫ్‌గా వ్యవ హరించిన ముదబ్బీర్, అబు అన్స్లతో సన్నిహితంగా మెలిగాడు. సిటీలోనే రెండు ‘ఉగ్ర’సమావేశాలు... ఈ మాడ్యూల్ బాంబుల తయారీతో పాటు ముష్కరులకు శిక్షణ ఇచ్చేందుకు నగరంలో రెండు సార్లు సమావేశమైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. టోలిచౌకిలోని నిజాం కాలనీలో ఉన్న మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్ ఇంట్లో 2015 జనవరి 15న, డిసెంబర్ 14న ఈ ఉగ్రవాదులు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో అబిద్ ఖాన్ పాల్గొ న్నాడని తేలింది. జేకేహెచ్ ఉగ్రవాదులు గెరిల్లా శిక్షణతో పాటు పేలుడు పదార్థాలు, తుపాకుల్ని ప్రయోగించడం కోసం వికారాబాద్‌లోని అనంతగిరి అడవులకు ఆనుకున్న కొన్ని ప్రదేశాల్లో అనువైన వాటిని, ఓ ఫామ్ హౌస్‌ను గుర్తించారు. ఈ పనిలో అబిద్ ఖాన్ సైతం పాల్గొన్నాడు. అజ్ఞాతంలోకి వెళ్లిన అబిద్ ఖాన్.. జేకేహెచ్ మాడ్యూల్ అరెస్టు కావడంతో అబిద్ ఖాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శ్రీలంకతో పాటు అనేక ప్రాంతాల్లో సంచరించిన ఖాన్ గత ఏడాది జూలైలో హిమాచల్‌ప్రదేశ్‌లో కులు సమీపంలోని బంజార్‌కు చేరుకున్నాడు. అరెస్టును తప్పిం చుకోవడానికి మతాన్ని సైతం మార్చుకున్నాడు. తన పేరును పౌల్‌గా మార్చుకుని, ఓ చర్చ్‌లో పని చేస్తూ తలదా చుకున్నాడు. ఉగాండాలో ఉన్న తన స్నేహితురాలితో నిత్యం సంప్రదింపులు జరిపిన అబిద్.. ఆమెతో కలిసే ఇండోనేíసియా మీదుగా సిరియా వెళ్లి ఐసిస్‌లో పని చేయాలనుకున్నాడు. దీంతో గత ఏడాది నవంబర్‌లో శ్రీలంక సైతం వెళ్లివచ్చాడని తేలింది. దీనిపై డిసెంబర్లో ఇతడిని అరెస్టు చేసిన బంజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను ఎన్ఐఏ అధికారులు విశ్లేషించారు. వీటిలో లభించిన వివరాల ఆధారంగా బంజార్ కేసును రీ–రిజిస్టర్ చేశారు. ఈ కేసులోనే ఢిల్లీ న్యాయస్థానం అబిద్‌ను దోషిగా నిర్ధారించింది. శుక్రవారం ఇతడికి శిక్ష ఖరారు కానుంది. ఈ కేసు విచారణ ముగిసిన నేపథ్యంలో జేకేహెచ్ కేసులో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
‘జునూద్’ కేసులో మరో అరెస్టు
హిమాచల్‌లోని కులులో పట్టుబడిన అబిద్ ఖాన్ టోలిచౌకిలో జరిగిన కీలక సమావేశానికీ హాజరు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్ని సిటీలో చిక్కిన ఐసిస్ అనుబంధ సంస్థ జునూద్ అల్ ఖలీఫా ఫిల్ హింద్ (జేకేహెచ్) ఉగ్రవాద మాడ్యూల్‌కు చెందిన మరో ముష్కరుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు. దాదాపు ఆరు నెలలుగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు సమీపంలోని ఓ చర్చిలో తలదాచుకున్న అబిద్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఇతగాడు హైదరాబాద్‌లో చిక్కిన అబు అన్స్‌కు అనుచరుడిగా ఉండటంతో పాటు టోలిచౌకిలో జరిగిన కీలక సమావేశంలోనూ పాల్గొన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఎన్ఐఏ అధికారులకు దేశవ్యాప్తంగా 14 మందితో పాటు నగరంలోనూ నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివసించిన అబు అన్స్, టోలిచౌకి వాసి మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్ సైతం ఉన్నారు. బెంగళూరుకు చెందిన అబిద్ ఖాన్ ఆన్లైన్ ద్వారానే ఆకర్షితుడై జేకేహెచ్ మాడ్యూల్లో చేరాడు. ఈ మాడ్యూల్‌కు చీఫ్‌గా వ్యవహరించిన ముంబై వాసి ముదబ్బీర్తో పాటు అబు అన్స్తో సన్నిహితంగా మెలిగాడు. సిటీలోనే 2 ‘ఉగ్ర’ సమావేశాలు దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన ఈ మాడ్యూల్ బాంబుల తయారీతో పాటు ముష్కరులకు శిక్షణ ఇవ్వాలని భావించింది. దీనికోసం ఉగ్రవాదులు 2015 జనవరి–డిసెంబర్ మధ్య కర్ణాటకలోని టుమ్కూర్, బెంగళూరు, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, మహారాష్ట్రలోని ముంబైతో పాటు హైదరాబాద్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో నగరంలో జరిగిన రెండు సమావేశాలకు బెంగళూరు నుంచి అబిద్ ఖాన్ వచ్చి వెళ్లాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. టోలిచౌకిలోని నిజాం కాలనీలో ఉన్న మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్ ఇంట్లో 2015 జనవరి 15న, డిసెంబర్ 14న ఈ ఉగ్రవాదుల సమావేశాలకు అబిద్ ఖాన్ హాజరయినట్లు తేలింది. అబిద్ ఖాన్ జేకేహెచ్ మాడ్యూల్లో అబు మహ్మద్ పేరుతో చెలామణీ అయ్యాడు. వికారాబాద్‌తో సహా మూడుచోట్ల ‘పర్యటన’ జేకేహెచ్ ఉగ్రవాదులు నఫీజ్ ఖాన్, అబు అన్స్ గెరిల్లా యుద్ధ తంత్రాల శిక్షణతో పాటు పేలుడు పదార్థాలు, తుపాకుల్ని ప్రయోగించడం కోసం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని కొన్ని ప్రదేశాలకు వెళ్లి అనువైన వాటిని, ఓ ఫామ్‌హౌస్‌ను గుర్తించారు. ఈ ప్రక్రియలో నగరానికి చెందిన నలుగురు ఉగ్రవాదులతో పాటు అబిద్ ఖాన్ సైతం పాల్గొన్నాడు. జేకేహెచ్ మాడ్యూల్ అరెస్టు కావడంతో అబిద్ ఖాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆర్నెల్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్ లో కులు సమీపంలో ఉన్న బంజార్‌కు చేరుకుని అక్కడే ఉంటున్నాడు. -
అన్నీ వాళ్లే..!
మేడారం(తాడ్వాయి), న్యూస్‌లైన్ : మేడారం మహాజాతరను పురస్కరించుకుని గిరిజన సంక్షేమశాఖ అధికారులు కాంట్రా క్టర్ల అవతారమెత్తారు. జాతరలో చేపట్టే వివిధ పనులను నామినేషన్ పద్ధతిన వారే చేస్తుండడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... వచ్చే నెలలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖకు *6కోట్ల నిధులు మం జూరు చేసింది. అయితే ఇందులో *1.42 కోట్లతో తాగునీటి పైపులైన్ల నిర్మాణం, జంపన్నవాగులోని నీటిని నిల్వ చేసేందుకు ఇసుకబస్తాలతో అడ్డుకట్ట, సిస్టర్న్, నల్లాల ప్లాట్‌ఫాంల మరమ్మత్తుతోపాటు మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. అయితే గిరిజన సంక్షేమశాఖ కు చెందిన ఇంజినీరింగ్ అధికారులు పై పనులను అన్నింటిని నామినేషన్ పద్ధతిన ఒకే కాం ట్రాక్టర్‌కు అప్పగించారు. దీంతో స్థానిక గిరి జనులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో జరిగే జాతరలో చేపట్టే పనుల బాధ్యతను మాకే కేటాయించాలని వారితో వాగ్వాదం పెట్టుకున్నారు. మొత్తం పనుల్లో కనీసం ఒకటి, రెం డైన.. వీడీసీ ద్వారా తమకే అప్పగించాలని గిరిజన మహిళలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే జాతర పనులను చేపట్టడంలో తగిన అనుభవం లేదనే సాకుతో ఇంజినీరింగ్ అధికారులు స్థానికులకు పనులు అప్పగించేందుకు ముఖం చాటేశారు. ఇదిలా ఉండగా, స్థానికుల సహకారం లేకుండా మేడారంలో ఎలాంటి పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో గిరిజన సంక్షేమ అధికారులే కాంట్రాక్టర్లుగా మారి కూలీలతో పనులు చేయిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లకు టెం డర్లు అప్పగించి పనుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులే.. స్వయంగా పనుల బాధ్యతను తీసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నామి నేషన్ పద్ధతిన పనులు చేస్తున్న అధికారులే.. బిల్లులు కూ డా చేసుకుంటుండడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పనులను ఏమేరకు నాణ్యతో చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ ఏఈ ఆబిద్‌ఖాన్‘తో మా ట్లాడగా.. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో చేపట్టే పనులు ఇప్పటికే ఆలస్యమయ్యాయన్నారు. వీటిని సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడిప్పుడే మొదలైన పనులు.. మేడారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు ఇప్పుడిప్పుడే మొదల య్యాయి. ఊరట్టం కా జ్వేనుంచి మేడారం దే వతల గద్దెల వరకు అప్డ్రోచ్రోడ్డు, పైప్లైన్లు, ఇన్‌ఫిల్టరేషన్ బావుల నిర్మా ణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యా యి. సరిగ్గా నెలలోపు జాతర జరుగుతున్నప్పటికీ గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారులు ఇంకా పనుల ప్రారంభంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. కాగా, ఈశాఖ పనులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో స్థానిక అధికారులు, సిబ్బంది పనుల్లో పురోగతి చూపించేందుకు హైరానా పడుతున్నారు. భక్తు ల సౌకర్యార్థం చేపడుతున్న పనులు జాతర ప్రారంభంలోగా పూర్తవుతాయా అనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.