Nomination method
-
మమత నామినేషన్ తిరస్కరించాలంటూ బీజేపీ ఫిర్యాదు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించాలని ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికల సంఘాన్ని కోరారు. మమతా బెనర్జీపై ఉన్న ఆరు క్రిమినల్ కేసులను ఆమె నామినేషన్లో ప్రస్తావించలేదని చెప్పారు. ఇందులో ఐదు కేసులు అస్సాంలో, ఒక కేసు బెంగాల్లో సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. ఆమె వాటిని నామినేషన్ పత్రాల్లో పేర్కొనకుండా తొక్కిపెట్టారని విమర్శించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేసు నంబర్లను కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించానని సువేందు అధికారి చెప్పారు. ప్రస్తుతం ఆయా కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. చట్ట ప్రకారం మమతా బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. సువేందు అధికారి ఫిర్యాదుపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు. అది ఓటర్ల ప్రాథమిక హక్కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, తమపై ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నామినేషన్ పత్రాల్లో పేర్కొనకపోతే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్‌ను తిరస్కరించవచ్చని 2018 మార్చి నెలలో సుప్రీంకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది. అభ్యర్థుల గురించి పూర్తిగా తెలుసుకోవడం ఓటర్ల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. నామినేషన్ పత్రాల్లో కొన్ని కాలమ్స్‌ను ఖాళీగా ఉంచడం ఆ హక్కుకు భంగం కలిగించినట్లే అవుతుందని తేల్చిచెప్పింది. -
నామినేషన్ వేస్తున్నారా..!
సాక్షి, మహబూబాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్ వేస్తున్నారా... అయితే ఈ నిబంధనలు తప్పక పాటించాల్సిందే. ఎలక్షన్ కమిషన్ సూచించిన నిబంధనల ప్రకారం ప్రతిఒక్కరూ నడుచుకోవాల్సిందే. లేదంటే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు ఈనెల 18నుంచి 25 స్వీకరిస్తారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నామినేషన్ల స్వీకరణకు కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరణ జరుగుతుంది. ప్రతి అభ్యర్థి నాలుగు నామినేషన సెట్లు దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు రెండు నియోజకవర్గాలకు మాత్రమే నామినేషన్లు వేయవచ్చు. అంతకంటే ఎక్కువ నియోజకవర్గాలకు నామినేషన్లు వేస్తే తిరస్కరించబడతాయి. జనరల్ స్థానాలకు అయితే డిపాజిట్ 25వేలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే రూ 12,500 డిపాజిట్ చేయాల్సి ఉంది. నామినేషన్‌కు అఫిడవిట్ ఫారం 26 దాఖలు చేయాల్సి ఉంటుంది. వేరే నియోజకవర్గం అభ్యర్థి అయితే సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఓటర్ లిష్టు జిరాక్స్ సమర్పించాలి. నామినేషన్ హాల్‌కు కేవలం అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే అవకా«శం ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థి నామినేషన్ కేంద్రం వద్దకు మూడు వాహనాలను ఉపయోగించవచ్చు. 100 మీటర్లదూరంలోనే వాహనాలు నిలుపాలి. డిఎస్పీ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించి అన్ని విషయాలను అబ్జర్వేషన్ చేస్తారు. రికగ్నేషన్ పార్టీలకు అయితే ఫారం బీ సమర్పించాల్సి ఉంటుంది. అన్‌రికగ్నేషన్ పార్టీ అభ్యర్థి అయితే స్వతంత్ర అభ్యర్థులు అయినా 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. -
ఎస్డీఎఫ్ పనులకు ఎసరు
- ఎన్నికల్లో లబ్ధికి గతంలో కిరణ్ సర్కారు ఆరాటం - ఎమ్మెల్యేలకు పుష్కలంగా పత్యేక నిధులు - నామినేషన్ పద్ధతిపై అనుచరులకు పనులు - నిలిపివేయమన్న చంద్రబాబు ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, కాకినాడ : పాలకపక్షాలు మారిన ప్రతి సందర్భంలో గత ఏలికల ఆదేశాలను నిలిపివేయడం లేదా వాటిని తిరగ తోడటం పరిపాటిగా వస్తున్నదే. ఇప్పుడు చంద్రబాబు సర్కారూ అదే పంథాను అనుసరిస్తోంది. దాంతో.. ఎన్నికల్లో లబ్ధి కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు గత ఫిబ్రవరిలో మంజూరు చేసిన నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్డీఎఫ్)తో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పనులను నిలిపివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ మేరకు సర్కారు నుంచి జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అప్పటి ఎమ్మెల్యేలకు ఎస్డీఎఫ్ పేరుతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వారికి.. రూ.5 లక్షల వరకూ వ్యయమయ్యే పనుల్ని టెండర్లతో నిమిత్తం లేకుండా నామినేషన్ ప్రాతిపదికన కట్టబెట్టే వెసులుబాటు కల్పించి అవినీతికి తలుపులు బార్లా తెరిచారు. సీసీ రోడ్లు, మంచినీటి సరఫరా, కమ్యూనిటీహాళ్లు, డ్రైన్లతో కూడిన రోడ్ల పనులను ఎస్‌డీఎఫ్‌తో చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. ఎమ్మెల్యేలే రూపొం దించిన ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరు చేయించుకుని తమ అనుచరగణానికి పనులు అప్పగించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉదారంగా నిధు లిచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇతర ఎమ్మెల్యేలకు మొ క్కుబడిగా మంజూరు చేశారు. ఎస్డీఎఫ్ నిధులు గ త ఫిబ్రవరిలోనే మంజూరు చేసినా..2011-12, 20 12-13, 2013-14 సంవత్సరాల కోసమూ అప్పటి ఎమ్మెల్యేలు పనుల్ని ప్రతిపాదించారు. జిల్లాలో 2,216 పనులకు కిరణ్ సర్కార్ రూ.98,27, 66,000లకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. 25 శాతం కూడా పూర్తికాని పనులు జిల్లాకు మంజూరైన పనుల్లో 513 పూర్తి కాగా, 1011 వివిధ దశల్లో ఉన్నట్టు సమాచారం. ఈ పనులకు సుమారు రూ.88 కోట్లు రాగా, ఇప్పటికే రూ.48 కోట్లు నామినేషన్‌పై పనులు చేస్తున్న వారికి విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చేసరికే పనులన్నీ పూర్తి చేయాలని అప్పటి ఎమ్మెల్యేలు తొందరపడ్డా 25 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ తరుణంలో ఎస్డీఎఫ్ పనులు ఎక్కడివక్కడే నిలిపివేయాలని ఆదేశాలు రావ డంతో ఇప్పటికే పనులు ప్రారంభించి, లక్షలు పెట్టుబడి పెట్టామని, వివిధ దశల్లో ఉన్న పనులు నిలి చిపోతే తమ గతి ఏమిటని మాజీ ఎమ్మెల్యేల అనుచరులు లబోదిబోమంటున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండి ప్రస్తుతం టీడీపీలోకి వచ్చి ఎంపీ, ఎమ్మెల్యేలైన తోట నరసింహం, తోట త్రిమూర్తులు, టీడీపీ తరఫున తిరిగి ఎమ్మెల్యేలైన పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావులతో పాటు ఎన్నికలకు టీడీపీ తరఫున ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు తమ, తమ నియోజకవర్గాల్లో అనుచరులు చేపట్టిన పనులకు నిధులు ఎలాగోలా విడుదల చేయించగలమన్న భరోసాతో ఉన్నారు. కాగా మిగిలిన వారి పరిస్థితే సందిగ్ధంలో చిక్కుకుంది. వివాదాలకు ఆస్కారం ప్రత్యేక నిధులతో చేపట్టే పనులు కొన్ని నియోజకవర్గాల్లో వివాదాలకు దారి తీయనున్నాయి. జగ్గంపేట లో అప్పటి ఎమ్మెల్యే తోట నరసింహం అత్యధికం గా నిధులు మంజూరు చేయించుకుని అనుచరుల కు పనులు అప్పగించారు. ఆయన ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఎన్నికవడం, అక్కడ వైఎస్సార్ కాం గ్రెస్ తరఫున జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే కావడంతో ఆ పనుల విషయంలో వివాదం తలెత్తే పరిస్థితి కని పిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో గత ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులను ఇప్పటి ఎమ్మెల్యేలు వ్యతిరేకించి తమకు నచ్చిన ప్రాంతాల్లో పనులు చేయించాలనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్డీఎఫ్ వ్యవహారాన్ని ఎలా చక్కబెడుతుంతో వేచి చూడాల్సిందే. -
అన్నీ వాళ్లే..!
మేడారం(తాడ్వాయి), న్యూస్‌లైన్ : మేడారం మహాజాతరను పురస్కరించుకుని గిరిజన సంక్షేమశాఖ అధికారులు కాంట్రా క్టర్ల అవతారమెత్తారు. జాతరలో చేపట్టే వివిధ పనులను నామినేషన్ పద్ధతిన వారే చేస్తుండడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... వచ్చే నెలలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖకు *6కోట్ల నిధులు మం జూరు చేసింది. అయితే ఇందులో *1.42 కోట్లతో తాగునీటి పైపులైన్ల నిర్మాణం, జంపన్నవాగులోని నీటిని నిల్వ చేసేందుకు ఇసుకబస్తాలతో అడ్డుకట్ట, సిస్టర్న్, నల్లాల ప్లాట్‌ఫాంల మరమ్మత్తుతోపాటు మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. అయితే గిరిజన సంక్షేమశాఖ కు చెందిన ఇంజినీరింగ్ అధికారులు పై పనులను అన్నింటిని నామినేషన్ పద్ధతిన ఒకే కాం ట్రాక్టర్‌కు అప్పగించారు. దీంతో స్థానిక గిరి జనులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో జరిగే జాతరలో చేపట్టే పనుల బాధ్యతను మాకే కేటాయించాలని వారితో వాగ్వాదం పెట్టుకున్నారు. మొత్తం పనుల్లో కనీసం ఒకటి, రెం డైన.. వీడీసీ ద్వారా తమకే అప్పగించాలని గిరిజన మహిళలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే జాతర పనులను చేపట్టడంలో తగిన అనుభవం లేదనే సాకుతో ఇంజినీరింగ్ అధికారులు స్థానికులకు పనులు అప్పగించేందుకు ముఖం చాటేశారు. ఇదిలా ఉండగా, స్థానికుల సహకారం లేకుండా మేడారంలో ఎలాంటి పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో గిరిజన సంక్షేమ అధికారులే కాంట్రాక్టర్లుగా మారి కూలీలతో పనులు చేయిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లకు టెం డర్లు అప్పగించి పనుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులే.. స్వయంగా పనుల బాధ్యతను తీసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నామి నేషన్ పద్ధతిన పనులు చేస్తున్న అధికారులే.. బిల్లులు కూ డా చేసుకుంటుండడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పనులను ఏమేరకు నాణ్యతో చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ ఏఈ ఆబిద్‌ఖాన్‘తో మా ట్లాడగా.. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో చేపట్టే పనులు ఇప్పటికే ఆలస్యమయ్యాయన్నారు. వీటిని సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడిప్పుడే మొదలైన పనులు.. మేడారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు ఇప్పుడిప్పుడే మొదల య్యాయి. ఊరట్టం కా జ్వేనుంచి మేడారం దే వతల గద్దెల వరకు అప్డ్రోచ్రోడ్డు, పైప్లైన్లు, ఇన్‌ఫిల్టరేషన్ బావుల నిర్మా ణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యా యి. సరిగ్గా నెలలోపు జాతర జరుగుతున్నప్పటికీ గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారులు ఇంకా పనుల ప్రారంభంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. కాగా, ఈశాఖ పనులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో స్థానిక అధికారులు, సిబ్బంది పనుల్లో పురోగతి చూపించేందుకు హైరానా పడుతున్నారు. భక్తు ల సౌకర్యార్థం చేపడుతున్న పనులు జాతర ప్రారంభంలోగా పూర్తవుతాయా అనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.