
మినీ మేడారం జాతర (Mini Medaram) షురూ అయ్యింది. మేడారం, కన్నెపల్లిలో బుధవారం మండమెలిగె పండుగ ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది.

సమ్మక్క–సారలమ్మ (Sammakka Saralamma Jatara) పూజారులు అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు

అమ్మవార్లను దర్శించుకునేందుకు బుధవారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు

ఉదయం నుంచే మొదలైన భక్తుల తాకిడి మధ్యాహ్నం వరకు కొనసాగింది

జంపన్నవాగు వద్ద షవర్ల కింద స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు









