sammakka
-
సమ్మక్క నుంచే అనుసంధానం!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలకు బదులుగా ఇప్పటికే నిర్మించిన సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే నీళ్లను తరలించాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిపై సోమవారం జరగనున్న నేషనల్‌వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని సైతం చేర్చినట్టు ఎన్‌డబ్ల్యూడీఏ రాష్ట్రానికి సమాచారం ఇచి్చంది. అలాగైతే అన్నీ సమస్యలే: తెలంగాణ ఆరు నెలల కిందట గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్‌ను తెలంగాణకు అందించిన ఎన్‌డబ్ల్యూడీఏ దానిపై అభిప్రాయాన్ని కోరింది. ఇచ్చంపల్లి వద్దే బరాజ్ నిర్మిస్తామని ఇందులో ప్రతిపాదించింది. అయితే ఇచ్చంపల్లి బరాజ్ నిర్మిస్తే నదుల అనుసంధానం ప్రాజెక్టుకి, ఇచ్చంపల్లి దిగువన ఉన్న తమ ప్రాజెక్టుల అవసరాలకు ఏకకాలంలో నీళ్లను తరలించడం సాధ్యం కాదంటూ తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సమ్మక్క సాగర్ బరాజ్‌కి బ్యాక్‌వాటర్ సమస్య ఏర్పడుతుందని, వరదల నిర్వహణ ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ కడితే, దానికి దిగువన తమ రాష్ట్రానికి ఉన్న 158 టీఎంసీల నీటి అవసరాలకు సైతం నష్టం కలుగుతుందని పేర్కొంది. ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టులైన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీలు తమకు అవసరమని తెలంగాణ పేర్కొంటుండగా, ఈ నీటి వినియోగం లెక్కలను సమరి్పంచాలని గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ కోరింది.దీంతో సమ్మక్కసాగర్ బరాజ్‌కి ఎగువన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ బరాజ్ నుంచి ఏ మేరకు నీటిని పంపింగ్ చేయనున్నారు? సమ్మక్క సాగర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి, శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తరలించనున్న నీటి లెక్కలతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించనున్న 70 టీఎంసీల నీటి వినియోగం లెక్కలను తెలంగాణ అందించింది.ఈ లెక్కల ఆధారంగా సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ తెలియజేసింది. మరోవైపు ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి తెలంగాణ అంగీకారం లభించే పరిస్థితి లేకపోవడంతో సమక్కసాగర్ నుంచే నీటిని తరలించే అంశాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ సోమవారం నిర్వహించే సమావేశంలో పరిశీలించే అవకాశం ఉంది. సిమ్యులేషన్ స్టడీకి కేంద్రం ఓకే గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఇచ్చంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించడానికి 1980లోనే బచావత్ ట్రిబ్యునల్ అనుమతినిచి్చంది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో దీని ఎత్తును తొలుత 112 మీటర్లకు, మళ్లీ 1986–88లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు. తాజాగా నదుల అనుసంధానంలో భాగంగా 87 మీటర్ల ఎత్తుకు కుదించారు.అయినా ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఇక ఇచ్చంపల్లికి 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బరాజ్ ఉంది. ఇచ్చంపల్లి నుంచి అకస్మికంగా వరదను విడుదల చేస్తే సమ్మక్క బరాజ్ వద్ద వరదలు పోటెత్తి నిర్వహణ కష్టంగా మారుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరదల తీవ్రతపై సిమ్యులేషన్ స్టడీ చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించడంతో సమ్మక్క సాగర్ బరాజ్ నుంచే గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీళ్లను తరలించే అవకాశాలు మెరుగయ్యాయి. -
వనం చేరిన సమ్మక్క..
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర ముగిసింది. నాలుగు రోజులుగా కోటిన్నర మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను శనివారం సాయంత్రం వడ్డెలు (గిరిజన పూజారులు) ప్రత్యేక పూజల మధ్య వనప్రవేశం చేయించారు. ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరిరోజు కూడా భక్తులు పోటెత్తారు. వనదేవతలు అడవికి చేరే వేడుక సమయంలో వాన జల్లులు కురవడం గమనార్హం. చివరిరోజు కార్యక్రమం ఇలా.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వన ప్రవేశం ప్రక్రియ శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలై సుమారు రాత్రి ఏడున్నర వరకు సాగింది. తల్లులను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి అడవిలోకి చేర్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర గిరిజన ఆచారాలతో ప్రత్యేక పూజలు జరిగాయి. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని వడ్డెల బృందం గద్దెలపైకి చేరుకుంది. పూజల తర్వాత సమ్మక్క తల్లిని గద్దెల ప్రాంగణం నుంచి భక్తులను దాటుకుంటూ బయటికి తీసుకెళ్లి రాత్రి 7.27 గంటల సమయంలో చిలకలగుట్టకు చేర్చారు. ఇలా ఓవైపు వనప్రవేశ పూజలు జరుగుతుండగానే గిరిజన సంప్రదాయం ప్రకారం.. సమ్మక్క గద్దెలపై భక్తులు సమర్పించిన చీరసారెలు, బంగారం, పసుపు కుంకుమలను స్థానికులు తీసుకునే కార్యక్రమం జరిగింది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు పోటీపడ్డారు. దీనితో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. కన్నెపల్లికి సారలమ్మ.. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు సారలమ్మ గద్దె వద్ద గిరిజన సంప్రదాయం ప్రకారం రహస్య పూజలు నిర్వహించారు. గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కాక సారయ్య నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మొంటె (వెదురుబుట్ట)ను తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. ఈ సమయంలో భక్తులు పూజారులను తాకడానికి ప్రయత్నించారు. మరోవైపు గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద కూడా చివరిరోజు పూజలు జరిగాయి. ఊరేగింపుగా పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు.. గోవిందరాజులును ఏటూరునాగారం మండలం కొండాయికి తీసుకెళ్లారు. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి దేవతల వనప్రవేశ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహా జాతర ముగిసిందని ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రకటించారు. ప్రస్తుత మేడారం జాతరకు మొత్తంగా 1.45 కోట్ల మంది భక్తులు వచ్చారని.. వారు ఇక్కడికి చేరుకునేందుకు లక్షన్నర వాహనాలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. బుధవారం తిరుగువారం పండుగ.. సమ్మక్క–సారలమ్మలకు ఈనెల 28న పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన తర్వాత ఇలా తిరుగువారం పండుగ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని.. జాతరకు వచ్చిన భక్తులు చల్లంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటామని పూజారులు తెలిపారు. తిరుగువారం పండుగ సందర్భంగా బుధవారం మేడారం గ్రామస్తులు, ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు ఇళ్లను అలికి శుద్ధి చేస్తారు. సమ్మక్కకు ప్రత్యేక పూజలు చేస్తారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. పూజారులు జాతర సమయంలో తమకు ఇళ్లకు ఆహా్వనించిన బంధువులకు కొత్త వస్త్రాలు పెట్టి సాగనంపుతారు. మేడారం మహాజాతర తిరిగి 2026 మాఘమాసంలో జరగనుంది. గద్దెను వీడి వనప్రవేశం చేసినదిలా.. 5.10 గంటలకు గోవిందరాజులు 5.30 గంటలకు పగిడిద్దరాజు 7.27 గంటలకు సమ్మక్క వనప్రవేశం 7.40 గంటలకు సారలమ్మ వనప్రవేశం ఆనవాయితీ ప్రకారం తొలుతగా గోవిందరాజులు, పగిడిద్దరాజులను గద్దెల మీది నుంచి సాగనంపుతారు. వారు వెళ్లగానే సమ్మక్క వన ప్రవేశ కార్యక్రమం ఉంటుంది. చివరిగా సారలమ్మను తీసుకెళతారు. -
లొంగుబాటలో అన్నలు
సాక్షి, హైదరాబాద్: తుపాకీ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం సాధ్యం కాదని మావోయిస్టులు గ్రహించారని, దీంతో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆజాద్, రాజిరెడ్డిలాంటి అగ్రనేతలు సైతం జన జీవన స్రవంతిలో కలవాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన మావోయిస్టు కీలక నేత హరిభూషణ్ సతీమణి సమ్మక్క అలియాస్ శారద పోలీసులకు లొంగిపోయారు. శుక్రవారం ఆమెకు రూ.5 లక్షల చెక్కును డీజీపీ అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అనారోగ్యం, కోవిడ్ సహా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టడంతో లొంగుబాటుకు మావో యిస్టుల నుంచి పెద్ద ఎత్తున సంకేతాలు వస్తున్నాయని వివరించారు. మహబూబ్‌బాద్ జిల్లా గంగారం గ్రామానికి చెందిన సమ్మక్క మైనర్‌గా ఉన్నప్పుడే హరిభూషణ్ ప్రోద్బలంతో పార్టీలో చేరింది. ఆ తర్వాత అతన్నే వివాహం చేసుకుంది. పార్టీ సిద్ధాంతాలతో విభేదించి 2008లో లొంగిపోయింది. అయితే, మరో పెళ్లి చేసుకుంటా నని హరిభూషణ్ బెదిరించడంతో 2011లో మళ్లీ పార్టీలోకి వెళ్ళింది. హరిభూషణ్ ఇటీవల చనిపోవడంతో తిరిగి లొంగిపోయింది. రాజు మృతిపై సందేహాలకు తావులేదు బాలికపై హత్యాచారానికి పాల్పడిన రాజు మృతిపై సందేహాలకు ఏమాత్రం తావు లేదని డీజీపీ స్పష్టం చేశారు. ‘మత్తుమం దుల వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’అని తెలిపారు. -
బావ కోసం దళంలో చేరి...
సాక్షి, హైదరాబాద్/గంగారం: మన్యంలో పుట్టిన ప్రేమకథ.. దండకారణ్యంలో సమాప్తమైంది. కష్టాలు, కన్నీళ్లు, తూటాలు, చట్టాలు, అనారోగ్యం, బంధాలు, బంధువులు ఏవీ వారిని ఆపలేకపోయాయి. చనిపోతావని బంధువులు బెదిరించినా.. ఆమె లెక్కచేయలేదు. బంధాలను తెంచుకుంది. అడవిలో ఉన్న బావను వెతుక్కుంటూ వెళ్లింది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలను వద్దనుకుని మాతృత్వాన్ని త్యాగం చేసింది. చివరికి అతనితోపాటే కరోనా వైరస్‌కు బలైపోయింది. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్–జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారదలు సొంత బావా మరదళ్లు. ఈనెల 21న హరిభూషణ్ కరోనాతో మరణించాడు. 24న సమ్మక్క కూడా వైరస్‌తో పోరాడుతూ చనిపోయింది. 25న దండకారణ్యంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 30ఏళ్ల ప్రేమ ప్రయాణం ముగిసి పోయింది. సమ్మక్క మరణవార్తను ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధ్రువీకరించారు. కానీ, మావోయిస్టు పార్టీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. బావ వెంటే బతుకు అంటూ... వీరిద్దరి మరణంతో మహబూబాబాద్ జిల్లా సొంతూరు గంగారం మండలం మడగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణ– సమ్మక్కలు చిన్ననాటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో యాప నారాయణ డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థిగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)తో ప్రభావితమై 1991 తరువాత దళంలో చేరాడు. బావ చదువు పూర్తయ్యాక.. పెళ్లి చేసుకుందామనుకుని ఎన్నో కలలు గన్న సమ్మక్కకు ఈ పరిణామం మింగుడుపడలేదు. పెద్దలు వారించినా వినకుండా అడవిలో ఉన్న నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అక్కడే వివాహం చేసుకుంది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలు వద్దనుకుంది. ఈ దేశంలోని అభాగ్యులంతా తన పిల్లలే అనుకునే ఆదర్శ మనస్తత్వం సమ్మక్కదని బంధువులు ‘సాక్షి’కి చెప్పారు. భర్త వెంటే అనేకసార్లు ఎన్కౌంటర్లలో తూటాల నుంచి త్రుటిలో తప్పించుకుంది. 2012లో తిరిగి అడవిలోకి.. సమ్మక్క 2008లో అనారోగ్య కారణాలతో వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. అప్పటికి ఆమె పేరు మీద ఉన్న రూ.5 లక్షల రివార్డు తనకే ఇచ్చారు పోలీసులు. శస్త్రచికిత్స అనంతరం 2012 వరకు బంధువులతోనే కలిసి ఉంది. అడవిని వదిలివచ్చినా.. సమ్మక్క బావను మరువలేదు. అతన్ని వదిలి ఉండలేక.. నాలుగేళ్ల అనంతరం 2012లో ఎవరికీ చెప్పకుండా తిరిగి నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి వదినను తాము చూడలేదని ఆమె మరిది, హరిభూషణ్ తమ్ముడు అశోక్ చెప్పాడు. ఆదర్శ భావాలున్న అన్నావదినలను స్వల్ప వ్యవధిలో కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందని, కడచూపునకు నోచుకోకపోవడం వేదనకు గురిచేస్తోందని వాపోయాడు. ఒకవేళ తన వదిన మరణ వార్త వాస్తవమే అయితే, కనీసం ఆమె మృతదేహాన్నైనా అప్పగించాలని ఆయన మావోయిస్టు పార్టీకి విజ్ఞప్తి చేశాడు. -
సమ్మక్క బ్యారేజీ సిద్ధమవుతోంది!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నది జలాల సమర్థ వినియోగం, దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో చేపట్టిన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీ శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ ఖరీఫ్ సీజన్లోనే గోదావరి నీటిని నిలిపేలా పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ పనుల పూర్తిపై మార్గదర్శనం చేస్తున్నారు. గేట్లు అమర్చే ప్రక్రియ ఆరంభం.. గోదావరిలో 100 టీఎంసీల మేర నీటి వాటా హక్కుగా ఉన్న కంతనపల్లి ప్రాజెక్టుతో వరంగల్, కరీంగనర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయించారు. అయితే కంతనపల్లితో 8 గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండటంతో ప్రాజెక్టు ప్రతిపాదనను తుపాకులగూడెం ప్రాంతానికి మార్చారు. ఇక్కడ నీటి లభ్యత గరిష్టంగా 470 టీఎంసీలకు పైగా ఉంటుందని, ఇక్కడ 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1,132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజీ పనులు చేపట్టారు. రూ.2,121 కోట్లతో పరిపాలనా అనుమతులివ్వగా, రూ.1,700 కోట్లతో ఏజెన్సీలతో ఒప్పందం కుదిరింది. ఈ పనుల్లో ఇప్పటికే రూ.1,100 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మట్టి, కాంక్రీట్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. 59 గేట్లలో 58 గేట్ల తయారీ పూర్తయింది. ఆదివారం నుంచి వాటిని అమర్చే ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ చివరి నాటికి ఈ గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్ బ్రిడ్జి స్లాబ్‌లు సైతం 40 వరకు పూర్తయ్యాయి. 30 పియర్ నిర్మాణాలు పూర్తవ్వగా, వాటి మధ్యలోంచే ప్రస్తుతం గోదావరి నీటి ప్రవాహాలు దిగువకు వెళ్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇక్కడ నీటి నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఇంజనీర్లను ఆదేశించారు. దీని ఎగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీ నీటి నిల్వలను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ చేసి పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ మరమ్మతులపై బ్యారేజీ గేట్లు ఎత్తిన పక్షంలో నీరు దిగువన తుపాకులగూడెం చేరుతుంది. మేడిగడ్డ నుంచి వచ్చే నీరంతా తుపాకులగూడెంలో నిల్వ ఉండేలా బ్యారేజీ స్లూయిస్ నిర్మాణం 70 నుంచి 71 మీటర్ల లెవల్ వరకు పూర్తి చేయాలని, ఈ లెవల్లో 2.90 టీఎంసీ నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని సీఎం గతంలోనే సూచించగా, ఈ పనులను ఇటీవలే ముగించారు. వరద మొదలయ్యే నాటికి ఒక్క టీఎంసీ నీటిని కూడా దిగువకు వదలొద్దన్న ఉద్దేశంతో జూలై, ఆగస్టు నాటికి బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్ల మేర నీటిని 6.94 టీఎంసీల నిల్వ చేసేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించగా, ఆ పనులు వేగిరమయ్యాయి. ఈ పనులు పూర్తయితే దేవాదుల ఎత్తిపోతలకు నీటి లభ్యత పెరగనుంది. దీనికింద నిర్ణయించి 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించడం సులభతరం కానుంది. అయితే దేవాదులలోని మూడో దశ పనులు పూర్తయితేనే పూర్తి ఆయకట్టుకు నీరందించే అవకాశాలుండటంతో ఆ పనులను వేగిరం చేశారు. -
సమ్మక్క బ్యారేజీ.. సీఎం కేసీఆర్ నామకరణం
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీర వనిత, వన దేవత.. ‘సమ్మక్క’పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు బ్యారేజీకి ‘సమ్మక్క బ్యారేజీ’గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని ఇంజనీర్–ఇన్–చీఫ్ మురళీధర్‌రావును ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉండటంతోనే రాష్ట్రంలో అభివృద్ధి అనుకున్న రీతిలో సాగుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తై బీడు భూముల్లోకి కాళేశ్వరం నీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు. కాగా, సీఎం కేసీఆర్ గురువారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. బుధవారం రాత్రి ఆయన కరీంనగర్ జిల్లా తీగలగట్టుపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడే బస చేసి గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తా రు. తర్వాత లక్ష్మీ బ్యారేజీని సందర్శించి, అక్కడే మధ్యాహ్న భోజనం చేసి తిరిగి తీగలగట్టుపల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. నీటి విడుదలపై సమీక్ష... సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ఈఎన్సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండేతో సమీక్ష నిర్వహించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుతోంది. బ్యారేజీలు నిండుకుండలా మారినయ్. రానున్న వానా కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసే దిశగా.. అటు నుంచి కాలువలకు మళ్లించేలా.. ఇరిగేషన్ శాఖ అప్రమత్తం కావాలి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు కమలాకర్, అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి బ్యారేజీలో ప్రస్తుతం 16.12 టీఎంసీ నిల్వలకు గాను 14 టీఎంసీల మేర నిల్వలు ఉన్నాయి. దీంతో లక్ష్మి పంప్‌హౌజ్ పరిధిలో 11 పంప్‌లను రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా సిద్ధం చేశారు. ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరు రిజర్వాయర్ ద్వారా ఎల్ఎండీకి తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మి బ్యారేజీలో ఉన్న నీటిని ఎల్లంపల్లికి తరలించడంపై కేసీఆర్ గురువారం నాటి పర్యటన సందర్భంగా అధికారులకు ఆదేశాలిచ్చే అవకాలున్నాయి. ఇదిలా ఉండగా, తుపాకులగూడెం బ్యారేజీకి వనదేవత శ్రీసమ్మక్క పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. -
చిలకలగుట్టపై సమ్మక్క శక్తి
ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క. కోట్లాది మంది భక్తులు భక్తితో కొలిచే దేవత. చిలకలగుట్టపై కొలువైన సమ్మక్కను జాతర సందర్భంగా గద్దెల మీదకు తీసుకురావడం ఉద్విగ్న ఘట్టం. రెండేళ్లకోసారి సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి కిందకు తీసుకురావడం వెనుక ఉన్న కారణాలు.. గురువారం సమ్మక్క రాకను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -సాక్షి ప్రతినిధి, వరంగల్ మేడారంలో ఆలయంలో సమ్మక్క తల్లి వడేరా కుండ రూపంలో కొలువై ఉంటుంది. సమ్మక్క పూజారులు, గ్రామస్తులకు ఈ దేవత దర్శనం ఉంటుంది. అదే.. సమ్మక్క తల్లి గద్దెలపై సకల జనులకు వెదురు రూపంలో దర్శనమిస్తుంది. పూజారులకు సైతం ఎల్లవేళలా అందుబాటులో ఉండని సమ్మక్క రూపం అత్యంత శక్తిభరితం. ఈ శక్తిని అన్ని వేళలా భరించడం సామాన్యులకు కష్టం. అందువల్లే పూజారులు అత్యంత రహస్య పద్ధ్దతుల్లో సమ్మక్కను చిలకలగుట్టపై ఉంచుతారు. ప్రతీ రెండేళ్లకోసారి సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం సందర్భంగా సమ్మక్క శక్తి స్వరూపాన్ని చిలకలగుట్ట నుంచి కిందకు తీసుకొస్తారు. ఇందుకోసం మొత్తం 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రెండు వారాల ముందుగా.. సమ్మక్క శక్తిని మేలుకొలిపే ప్రక్రియ జాతరకు రెండు వారాల ముందుగా మొదలవుతుంది. గుడిమెలిగె పండగ రోజు సమ్మక్క వడ్డెలు(పూజారులు), ఇంటి ఆడపడుచులు మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఒక్కడే చిలకలగుట్టకు చేరుకుని సమ్మక్కకు ఆదివాసీ పద్ధతుల ప్రకారం శక్తిని మేల్కొలిపే ప్రక్రియ చేపడతారు. అనంతరం మండె మెలిగే రోజు మరోసారి చిలకలగుట్టకు చేరుకుని రహస్య పూజలు నిర్వహిస్తారు. చిలకలగుట్టపై సమ్మక్క ఎక్కడ ఉంటుందనేది ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్‌కు సైతం తెలియదు. చిలకలగుట్ట సగం వరకు ఎక్కిన తర్వాత సమ్మక్క పూనుతుంది. ఆ తర్వాత సమ్మక్క ఆదేశాల ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దీంతో సమ్మక్క.. గుట్ట దిగేందుకు సిద్ధమవుతుంది. శాంతి ప్రక్రియ గద్దెలపైకి గురువారం సాయంత్రం చేరిన సమ్మక్క శుక్రవారం అక్కడే ఉండి జాతర నాలుగో రోజు శనివారం తిరిగి చిలకలగుట్టకు చేరుకుంటుంది. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్, వడ్డె కొక్కెర కృష్ణయ్య ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జాతర అనంతరం వచ్చే బుధవారం రోజున తిరుగు వారం పండగ జరుపుతారు. ఈ రోజు గద్దెల ప్రాంగణం శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారు. సిద్ధబోయిన మునీందర్ మూడోసారి చిలకలగుట్టకు చేరుకుని శక్తి రూపం ధరించిన సమ్మక్క తల్లిని శాంతపరుస్తారు. మళ్లీ రెండేళ్లకు సమ్మక్కను మేలుకొలుపుతామని మాట ఇచ్చి తిరుగుపయనమవుతారు. సమ్మక్క గుడి, గద్దెపై ప్రత్యేక పూజలు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలకలగుట్ట నుంచి గురువారం సమ్మక్క తల్లిని గద్దెల మీదికి తీసుకురానున్న నేపథ్యంలో సమ్మక్క పూజారులు, వడ్డెలు సంప్రదాయ బద్దంగా సిద్దబోయిన మునేందర్ ఇంటి నుంచి ఆడపడుచులు పసుపు, కుంకుమ వడేరాల కుండల్లో గద్దె మీ దకు తీసుకు వచ్చారు. అక్కడ గద్దెపైన అలికి సమ్మక్క ముగ్గులను వేసి పూజ నిర్వహించారు. సమ్మక్క బిడ్డ సారక్క గద్దెపై న కూడా ముగ్గులతో అలంకరించారు. అనంతరం నాగుల వి డిది వద్ద వెళ్లి అక్కడ పూజలు చేసి విశ్రాంతి తీసుకున్నారు. శక్తి మేలుకోవడం.. సారలమ్మ గద్దెలపైకి చేరిన(బుధవారం) మరుసటి రోజు(గురువారం) సమ్మక్క పూజారులు, వడ్డెలు సిద్ధబోయిన మునీందర్, సమ్మయ్య, మహేశ్(బాల పూజారి), దోబె పగడయ్య కుమారుడు నాగేశ్వర్రావు, కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్యతోపాటు మేడారం గ్రామానికి చెందిన ఆదివాసీలు చిలకలగుట్టకు బయల్దేరుతారు. చిలకలగుట్టపైకి ఎక్కి దారిలో అందరూ ఆగిపోతారు. అక్కడి నుంచి సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, సమ్మయ్య, మహేష్(బాల పూజారి), దోబె నాగేశ్వరరావు.. చిలకలగుట్టపై ఉన్న రహస్య ప్రాంతానికి చేరుకుంటారు. దోబె నాగేశ్వరావు ధూపం పడతారు. మిగిలినవారు అక్కడ రహస్య క్రతువులు నిర్వహించి సమ్మక్కను కిందకు తీసుకొస్తారు. సమ్మక్క రాక కోసం గుట్టపై ఎదురుచూస్తున్న కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్యతో పాటు మిగిలిన వడ్డేలు, పూజారులు సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. జనసంచారం లేని వనంలో కొలువై ఉండే సమ్మక్క, కాళ్ల తొక్కుళ్లు ఉండే జనంలోకి వస్తుండడంతో.. దీనికి నివారణగా అక్కడ ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మరోసారి రహస్య పద్ధతిలో పూజలు చేస్తారు. తుపాకులగూడెం సమీపంలో ఉన్న ఇప్పచెట్ల నుంచి సేకరించిన ఇప్ప పువ్వుతో చేసిన సారాను సమ్మక్కకు ఆరగింపు చేస్తారు. ఆ తర్వాత ఆదివాసీ పద్ధతిలో పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెలపైకి చేర్చే బాధ్యతను కొక్కెర కృష్ణయ్యకు సిద్ధబోయిన మునీందర్ అప్పగిస్తారు. అప్పటికే పూజా క్రతువు నిర్వహిస్తుండగానే కొక్కెర కృష్ణయ్యను దేవత ఆవహించగా... అచేతన స్థితిలోకి వెళ్తాడు. కొక్కెర కృష్ణయ్యను ఇద్దరు వడ్డెలు పట్టుకుని ముందుకు నడిపిస్తారు. మల్లెల ముత్తయ్య జలకం పట్టితో కృష్ణయ్య పక్కనే ఉంటూ ముందుకు సాగుతారు. దారి మధ్యలో ఎలాంటి దుష్టశక్తుల దృష్టి పడకుండా జలకంలోని నీళ్లు చల్లుతాడు. వసంతరావు, స్వామి, జనార్దన్ కొమ్ముబూరలు ఊదుతూ వేగంగా సమ్మక్కను చిలకలగుట్ట నుంచి కింది వైపుకు తీసుకువస్తారు. కొమ్మబూరల శబ్దం వినగానే చిలకలగుట్ట పొదల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమవుతారు. సమ్మక్క రాకను సూచిస్తూ గాలిలోకి కాల్పులు జరుపుతారు. చిలకలగుట్ట కిందకు చేరిన సమ్మక్కకు ఎదుర్కోళ్ల పూజా మందిరం వద్ద మరోసారి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ పూజలు నిర్వహించకుంటే సమ్మక్క అస్సలు ముందుకు కదలదని చెప్తారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్కను మేడారం గ్రామం వైపునకు వడివడిగా తీసుకొస్తారు. గ్రామ పొలిమేరలో మేడారానికి చెందిన 11 మంది మహిళలు బిందెలు, కుండల్లో నీళ్లు పట్టుకుని ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. బొడ్రాయికి కోడిపిల్లను తిప్పేస్తారు. -
నేడు సమ్మక్క కల్యాణం
సాక్షి ప్రతినిధి, వరంగల్: లక్షలాది మంది భక్తుల సాక్షిగా వనదేవత సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం బుధవారం వైభవంగా జరగనుంది. మాఘమాసంలో మేడారం గ్రామం ఈ వేడుకకు వేదికగా నిలవనుంది. ఆదివాసీల విశ్వాసం ప్రకారం.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాగా.. వారి సంతానం సారలమ్మ. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు విభిన్న ప్రాంతాల్లో కొలువై ఉంటారు. పూర్వం ప్రతి రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపించడం ఆదీవాసీ సంప్రదాయం. ఇందుకోసం సమ్మక్క పూజారులు గ్రామాల్లో తిరిగేవారు. వారికి ఇచ్చేందుకు అప్పటి ఆదివాసీలు తమ పంటలో కొంత భాగాన్ని పక్కకు పెట్టేవారు. పంట లేని వారు కోళ్లు, మేకల వంటివాటిని సమర్పించుకునేవారు. ఇలా సేకరించిన వస్తువులతో మాఘశుద్ధ పౌర్ణమి లేదా ఆ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపిస్తారు. ఆ వివాహ వేడుక కాలక్రమేణా మేడారం జాతరగా మారింది. సమ్మక్క ఆలయమే వేదిక.. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు లేదా తర్వాత వచ్చే బుధవారం రోజున వివాహం జరిపించడం ఆనవాయితీ. ఈ సారి బుధవారం, పౌర్ణమి ఒకేరోజున(జనవరి 31) రావడం విశేషం. పెళ్లి తంతులో భాగంగా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉన్న పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో çపడిగెను పగిడిద్దరాజుగా భావిస్తూ పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. నలుగు పెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి బయల్దేరారు. ప్రధాన పూజారి పెనక బుచ్చిరాములుతోపాటు ఇతర పూజారులు సురేందర్, మురళీధర్ పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును తీసుకుని 65 కిలోమీటర్లు కాలినడకన మేడారానికి తీసుకొస్తున్నారు. మార్గమధ్యంలో తాడ్వాయి మండలం లక్ష్మీపురంలో పెనక వంశీయుల ఇంట్లో మంగళవారం రాత్రి బస చేస్తారు. తిరిగి బుధవారం ఉదయం కాలినడకన మేడారం బయల్దేరుతారు. ఇక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటారు. ఇదే రోజు సాయంత్రం తాడ్వాయి మండలం కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారి కాక సారయ్య, కాక కిరణ్ ఇతర పూజారులు తీసుకొస్తారు. సమ్మక్కకు కల్యాణం.. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. గద్దెల ప్రాంగణం పక్కన ఉన్న విడిది గృçహానికి వస్తారు. సమ్మక్క నుంచి ఆహ్వానం రాగానే వీరు మేడారంలోని ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత పెళ్లికొడుకు పగిడిద్దరాజు వచ్చాడంటూ సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. ఈ కబురు అందుకున్న సమ్మక్క పూజారులు పసుపు, కుంకుమలతో ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. సంప్రదాయబద్ధంగా సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును సమ్మక్క గుడిలోనికి ఆహ్వానిస్తారు. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన అతిథులకు నైవేద్యం సమర్పించి ఆకలి తీరుస్తారు. అనంతరం సమ్మ క్క గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం గోవిందరాజు, సారలమ్మతో కలిసి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతాడు. (ఎడ్లబండ్లపై మేడారానికి తరలివస్తున్న భక్తులు) లక్షలాది మంది రాక సమ్మక్క–పగిడిద్దరాజు వివాహం అనంతరం గద్దెలపై కొలువైన సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. అమ్మలను దర్శించుకుని కోరుకున్న కోరికలన్నీ తీరుతాయనేది వారి నమ్మకం. మరుసటిరోజు(గురువారం) శక్తి రూపంలో చిలకలగుట్టపై కొలువైన సమ్మక్క తల్లి.. మేడారం గద్దెల మీదకు చేరుకుంటుంది. దీంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. సారలమ్మ ఆగమనం నేడే.. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యా ణం జరిగిన తర్వాత సారలమ్మతోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతారు. -
సమ్మక్క వంశీయుల పూజలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క గద్దె వద్ద బయ్యక్కపేటకు చెందిన చందా వంశస్తులు గురువారం మొక్కులు చెల్లించారు. సమ్మక్క పుట్టినిల్లు బయ్యక్కపేట అనే చరిత్ర ఉంది. అయితే ప్రతి ఏటా జాతర సందర్భంగా సమ్మక్కకు తొలి మొక్కులు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు చందా వంశస్తులు బయ్యక్కపేట నుంచి పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, చీరసారె, గాజులు, పూలు తీసుకువచ్చి సమ్మక్క గద్దె వద్ద పూజలు నిర్వహించారు. జాతర సమయంలోనే సమ్మక్కకు ఆనవాయితీగా పూజలు నిర్వహించాల్సిన ఉన్నప్పటికీ రద్దీ కారణంగా ముందుగానే తల్లికి మొక్కు చెల్లించినట్లు చందా వంశీయులు తెలిపారు. డోలు వాయిద్యాలతో సమ్మక్క గద్దెపైకి వెళ్లి మొక్కులు సమర్పించారు. సమ్మక్కకు తొలి పూజల సందర్భంగా చందా వంశస్తులు, వడ్డెల ఇళ్లలో ప్రత్యేక పూజలు చేశారు. -
సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలి
హన్మకొండ అర్బన్ : ఆదివాసీ ప్రాంతాల తో ములుగు జిల్లా కేంద్రంగా సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ కాకతీయ కళాపీఠం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో డీఆర్వోకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు, వనరుల విభజనకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ప్రజా సంఘాలు మే«ధావులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో పీఠం వ్యవస్థాపక అ««దl్యక్షులు శ్రీధర్‌రాజు, కొమురం ప్రభాకర్, చందా మహేష్, తదితరులు ఉన్నారు. -
ములుగును జిల్లా చేయాలని రాస్తారోకో
ములుగు : ములుగును సమ్మక్క–సారల మ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి, అనుబంధ యువజన సంఘం ఆధ్వర్యంలో జా తీయ రహదారిపై సోమవారం ధర్నా, రా స్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా జి ల్లా సాధన సమితి అధ్యక్షుడు బిక్షఫతిగౌడ్ మాట్లాడారు. జిల్లా ఏర్పాటుlకోసం నేడు చే పట్టనున్న బంద్‌లో అన్ని వర్గాల వారు స్వ చ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా ఏర్పాటు విషయంలో మంత్రి చందూలాల్ చేస్తున్న కృషికి ఆయన కృతజ్ఞతలు తె లిపారు. సమితి ప్రధాన కార్యదర్శి శ్రీనివా స్, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు శివ, ప్రధాన కార్యదర్శి సతీశ్, యువజన సంఘం అధ్యక్షుడు దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. -
మేడారానికి భక్తుల తాకిడి
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకునేందు కు ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు వచ్చారు. ఏటూరునాగారంలోని రామన్నగూడెం, మంగపేట గోదావరిలో అంత్య పుష్కరాలకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో మేడారంలోని వనదేవతల సన్నిధికి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఈసందర్భంగా భక్తులు వన దేవతలకు పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం సమర్పించి పూజలు నిర్వహించారు. గద్దెలకు మరమ్మతులు కాగా, మేడారంలోని అమ్మవార్ల గద్దెలకు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. గాయత్రి గ్రానైట్స్ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరిలో జాతర సందర్భంగా అమ్మవార్ల గద్దెలకు గ్రానైట్ వేశారు. జాతరకు వచ్చిన భక్తులు గద్దెలపైకి కొబ్బరి, బెల్లం విసరడంతో గ్రానైట్ రాళ్లు పగిలాయి. పగిలిన రాళ్లను తొలగించి కొత్త వాటిని గద్దెలపై అమర్చే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. -
మేడారం.. మెరిసే
-
మేడారం.. మెరిసే
సమ్మక్క-సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు నిండిపోయిన క్యూలైన్లు ఎండ, ఉక్కపోతతో అవస్థలు పడిన వృద్ధులు, చిన్నారులు తల్లుల చెంతకు ప్రముఖుల తాకిడి వీఐపీల బంధుగణం, వాహనాలతో సమస్యలు కొనసాగిన పోలీసుల ‘అత్యుత్సాహం’ పెద్ద సంఖ్యలో బయలుదేరిన భక్తులతో కిక్కిరిసిన బస్‌పాయింట్ నేడు దేవతల వనప్రవేశం ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం భక్తజనంతో మెరిసిపోరుుంది. ఆదివాసీల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఓకే చోట కొలువుదీరడం తో భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకుని తన్మయత్వానికి లోనయ్యూరు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో రోజంతా రద్దీ కొనసాగింది. సమ్మక్క, సారలమ్మ నినాదాల తో జాతర ప్రాంగణం మార్మోగింది. నలుగురు దేవతలూ కొలువై ఉండడంతో శుక్రవారం క్యూై లెన్లన్నీ నిండిపోరుు భక్తులు రోడ్లపై సైతం నిల్చోవాల్సి వచ్చింది. వారికి ఇబ్బంది కలుగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ భక్తులను వరుసక్రమం లో పంపించారు. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన పైకప్పు ఎత్తు తక్కువ ఉండటం, ఉష్ణోగ్రత పెరగడంతో పగటి వేళ భక్తులు ఇబ్బంది పడ్డారు. తాగునీటి సౌకర్యం సరిపడా లేక దాహంతో అల్లాడిపోయారు. చివరకు ఒకటి రెండు చోట్ల డ్రమ్ములు ఏర్పాటు చేసి తాగునీరు అందించారు. శుక్రవారం రాత్రి వరకు వన దేవతలను దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి దాటినట్లు అధికారులు తెలిపారు. కొండంత మొక్కులు వనదేవతలు ఇష్టమైన ప్రసాదంగా భావించే బంగారం (బెల్లం) గద్దెల వద్ద కొండలుగా పేరుకుపోయింది. మొక్కుల చెల్లింపులో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున బంగా రం సమర్పించారు. భక్తుల రద్దీ నిరంతరాయంగా కొనసాగడంతో గద్దెల ప్రాంగణంలో పోగైన బెల్లం తొలగించడం వీలుకాలేదు. దీంతో గద్దెపై నిల్వలు కొండలా పేరుకుపోయూరుు. భక్తుల కానుకలతో నిండిన హుండీలను ఎప్పటికప్పుడు పక్కకు తరలించారు. శుక్రవారం భక్తుల రద్దీ పెరగడంతో ప్రసాదం పంపిణీని దేవాదాయశాఖ అధికారులు నిలిపేశారు. వస్తున్నారు... పోతున్నారు.. జాతరకు రెండు రోజులు ముందుగానే చేరుకున్న భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని ఉన్నా రు. బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, గురువారం సమ్మ క్క గద్దెలపైకి చేరుకోవడంతో గురువా రం రాత్రి నుంచి మొక్కులు ఊపందుకున్నారుు. అమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్న భక్తులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరుగు ప్రయూణ మవుతున్నారు. దీంతో పొలా లు, అడవులు, వాగుల్లో వెలిసిన గుడారాలు ఖాళీ అవుతున్నారుు. భక్తులను పార్కింగ్ ఏరియాలకు, బస్స్టేషన్లకు తరలించే ఆటోలు, ఎడ్లబండ్ల హవా కనిపించింది. ఆర్టీసీ బస్‌స్టేషన్ పా యింట్ వద్ద కోలాహలం నెలకొంది. వరంగల్ బస్‌పాయింట్ వద్ద భక్తులు పెద్దసంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నా రు. జాతరకు భక్తులను తరలించేందు కు చిట్యాల, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బస్సులు నడిపించిన ఆర్టీసీ, తిరుగు ప్రయాణంలో ఆయా పాయింట్లకు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆర్టీస్ బస్‌స్టేషన్ తిరుగు ప్రయాణ భక్తులతో కిక్కిరిపోయింది. కాగా, జాతరలో వీఐపీల వాహనాలు, దర్శనాలకిచ్చిన ప్రాధాన్యత సామాన్య భక్తులకు ఇవ్వని పోలీసులు, ప్రభుత్వ అధికారుల తీరు పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, దేవతలు నలుగురూ శనివారం వనంలోకి వెళ్లిపోనుం డడంతో జాతర ముగుస్తుందని అధికారులు ప్రకటించారు. -
జనంతో నిండిన మేడారం..
-
గద్దెనెక్కిన సమ్మక్క
* చిలుకలగుట్ట నుంచి మేడారానికి వచ్చిన వనదేవత * జనంతో నిండిన మేడారం.. దారి పొడవునా భక్తి పారవశ్యం * ఎదురుకోళ్లు, యాట బలులు, ఒడి బియ్యంతో భక్తుల మొక్కులు * గాల్లోకి కాల్పులతో అమ్మవారికి అధికారిక స్వాగతం * గురువారం ఒక్కరోజే 20 లక్షల మంది భక్తుల రాక * నేడు భారీగా మొక్కులు చెల్లించుకోనున్న భక్తులు సాక్షి ప్రతినిధి, వరంగల్: వనాలన్నీ జనాలతో నిండిపోయాయి.. సమ్మక్క నామస్మరణతో మార్మోగాయి.. మేడారం జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది! లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, అధికారుల లాంఛనాల మధ్య ఆదివాసీల వడ్డెలు(పూజారులు) వన దేవత సమ్మక్కను గురువారం చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి చేర్చారు. నమో సమ్మక్క... జై సమ్మక్క... అంటూ భక్తులు మొక్కులు సమర్పించారు. గిరిజన జాతరలో ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సమ్మక్క ఉండే చిలుకల గుట్ట జనంతో కిటకిటలాడింది. అక్కడ్నుంచి మేడారం వరకు 1.5 కిలోమీటర్ల దారి జనంతో నిండిపోయింది. చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే గిరిజన జాతర ప్రధాన ఘట్టం సాయంత్రం 5.58 నుంచి రాత్రి 8.04 గంటల వరకు వైభవంగా సాగింది. సమ్మక్క వచ్చిందిలా.. సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయమే మొదలైంది. సమ్మక్క వడ్డెలు ఉదయం 5.30 గంటలకు మేడారం సమీపంలోని చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు (కొత్త కుండలు) తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు వడ్డెల బృందం సాయంత్రం 4 గంటలకు చిలుకలగుట్టపైకి బయల్దేరింది. అప్పటికే గుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. కుంకుమ భరణి రూపంలో ఉన్న అడవి తల్లిని చేతబట్టుకొని సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య చిలుకలగుట్ట దిగారు. మిగిలిన వడ్డెలు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా ఆ దేవతను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాల ప్రకారం వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా ఏకే-47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఏకే-47 తుపాకీ ట్రిగ్గర్ను నొక్కారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలుకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగి పోయింది. సమ్మక్క నామస్మరణతో మార్మోగింది. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల నడుమ వడ్డెల బృందం సమ్మక్క రూపంతో మేడారం వైపు బయలుదేరారు. వంద మీటర్లు దాటగానే ఒకసారి, చిలుకలగుట్ట దాటే సమయంలో మరోసారి వరంగల్ రూరల్ ఎస్పీ తుపాకీ కాల్పులు జరిపి సమ్మక్కను ఆహ్వానించారు. అక్కడి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివాసీ పూజారులు సమ్మక్కను మేడారం గద్దెలపైకి తరలించడం మొదలుపెట్టారు. లక్షల మంది భక్తుల తన్మయత్వం చిలుకలగుట్ట నుంచి మేడారం వరకు ఒకటిన్నర కిలోమీటరు పొడవునా లక్షల మంది భక్తులు సమ్మక్క రాకను చూసి తన్మయత్వం చెందారు. సమ్మక్కకు ఎదురుగా కోళ్లను, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని దారిలో సమ్మక్కపై చల్లారు. కొందరు భక్తులు ఆ బియ్యాన్ని ఏరుకుని దాచుకున్నారు. సమ్మక్కను తీసుకొస్తున్న బృందం అక్కడ్నుంచి సెలపెయ్య గుడికి చేరుకుంది. వనదేవత రావడంతో అక్కడి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం గద్దెలకు బయలుదేరారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడపడుచులు సమ్మక్కను తీసుకు వస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. అనంతరం పూజారులు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. సమ్మక్క గద్దెలపైకి వచ్చే సమయంలో ఆవరణలో కరెంటు సరఫరాను నిలిపివేశారు. సమ్మక్క గద్దెలపైకి చేరిన తర్వాత కరెంటు సరఫరా కొనసాగించారు. మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు. నలుగురు వన దేవతలు... సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. గురువారం అర్ధరాత్రి వరకు మేడారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. సమ్మక్కను గద్దెలపైకి తీసుకు వచ్చే కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, మహబూబాబాద్ ఎంపీ ఎ.సీతారాంనాయక్, ఐటీడీఏ పీవో డి.అమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను కిందికి తీసుకువచ్చిన తర్వాత తుడుందెబ్బ యువకులు, పోలీసులు... భక్తులను దూరంగా నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. ఒక్కరోజే 20 లక్షల మంది సమ్మక్క గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒక్క రోజే 20 లక్షల మంది మేడారానికి తరలివచ్చారు. శుక్రవారం సైతం భారీ సంఖ్యలో భక్తులు రానున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో నార్లాపూర్-ఊరట్టం క్రాస్ రోడ్డు ప్రాంతంలోని 5 కిలోమీటర్ల మేర వాహనాల ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతోంది. గద్దెలపై వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులకు సగటున గంటన్నర సమయం పడుతోంది. నేడు మేడారానికి సీఎం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం వరంగల్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు నేరుగా మేడారం చేరుకొని సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు. అనంతరం మడికొండలోని ఇన్క్యుబేషన్ టవర్‌ను ప్రారంభించి సియంట్ ఐటీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తర్వాత సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. -
అపురూప ఘడియలు
రాత్రి 8.04 గంటలకు గద్దెకు చేరిన సమ్మక్క చిలకలగుట్ట వద్ద అధికారిక స్వాగతం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు అపురూప ఘడియల్లో మొక్కులు చెల్లించుకునేందుకు పోటీ పడిన భక్తులు {పారంభమైన తిరుగు ప్రయాణాలు హన్మకొండ : మేడారం అడవుల్లో రెండేళ్లకోసారి చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి సమ్మక్క చేరుకునే ఉద్విగ్న, అద్భుత క్షణాలు గురువారం సాయంత్రం ఆవిష్కృతమయ్యాయి. సమ్మక్క పూజారులు చిలకలగుట్ట నుంచి కిందకు దిగగానే మేడారం అడవులు భక్తిభావంతో పులకించిపోయాయి. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరుకుంది. అంతకు ముందే అంటే బుధవారం రాత్రే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు సైతం గద్దెల పైకి వచ్చారు. దీంతో భక్తులు ఒకేచోట నలుగురిని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యూరు. ఉత్కంఠ.. ఉద్విగ్నం.. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చేందుకు పూజారులు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరారు. సమ్మక్కకు భక్తులు వివిధ పద్ధతుల్లో స్వాగతం పలికారు. మేడారం నుంచి చిలకలగుట్ట వరకు ఉన్న కిలోమీటరున్నర మార్గాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు రోడ్డు శోభాయమానంగా మారింది. సమ్మక్క వచ్చే వరకు తమ ముగ్గులు చెడిపోకుండా చూసేందుకు అక్కడే ఉండిపోయూ రు. తమ ఇంటి ఇలవేలుపు సమ్మక్కకు ఎదుర్కోళ్లు పలుకుతూ భక్తులు కోళ్లు, మేకలు బలి ఇచ్చారు. మార్గానికి ఇరువైపులా వేలా ది మంది భక్తులు సమ్మక్క రాకకోసం గంటల తరబడి ఎదురుచూశారు. చిలకలగుట్ట దారిలో అడుగడుగునా భక్తులకు దేవుడు పూనాడు. వారు చేసే నాట్యాలతో మేడారం ప్రాంగణం హోరెత్తిపోయింది. చిలకలగుట్ట దారికి ఇరువైపులా ఉన్న చెట్టుపుట్టలపైకి ఎక్కి సమ్మక్కను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. 5:58 గంటలకు... క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా గడుస్తున్నా భక్తుల్లో ఒకటే కోరిక.. చిలకలగుట్ట నుంచి గద్దెలను చేరే సమ్మక్కను కనులారా చూడాలని. సాయంత్రం 5:58 గంటలకు సమ్మక్కను తీసుకుని పూజారులు సిద్ధబోయిన మునీందర్, కొక్కెర కృష్ణయ్య, మహేశ్ తదితరులు చిలకలగుట్ట దిగారు. సమ్మక్క రాకను సూచి స్తూ బూర శబ్ధం వినగానే అప్పటికే ఎదురు చూస్తున్న కలెక్టర్ కరుణ, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ఎదురెళ్లి స్వాగ తం పలికారు. సమ్మక్క రాకను సూచిస్తూ గాలిలోకి కాల్పులు జరి పారు. అనంతరం చిలకలగుట్ట నుంచి మేడారం వైపుగా సమ్మక్కను తీసుకుని వడ్డెలు బయలుదేరారు. మరోసారి సాయంత్రం 6:08 గంటలకు ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపారు. చివరగా చిల కలగుట్ట ముఖద్వారం వద్ద మూడోసారి 6:11 గంటలకు కాల్పులు జరిపి చిలకలగుట్ట రోడ్డుపైకి సమ్మక్క చేరుకుంది. అప్పటి వరకు ఆర్తిగా ఎదురు చూసిన భక్తులు సమ్మక్కపై పసుపు బియ్యం చల్లారు. దారిపొడవునా ఈ బియ్యపు జల్లులు కురిసాయి. సమ్మ క్క వచ్చిందన్న వార్త తెలియగానే ఒక్కసారిగా శివసత్తులు పూనకంతో ఊగిపోయారు. గద్దెలపైకి చేరిన సమ్మక్క.. చిలకలగుట్ట దిగిన తర్వాత ఎదురెళ్లుకాడ అరగంట పాటు వడ్డెలు పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం వైపు వడివడిగా సాగారు. మధ్యలో చెలపెయ దగ్గర మరోసారి పూజలు నిర్వహిం చారు. అనంతరం మేడారం ఆడపడుచులు నీరు ఆరబోసి స్వాగ తం పలికారు. సమ్మక్కను గద్దెలపైకి చేర్చే వరకు భక్తుల దర్శనాలు ఆపేశారు. మేడారం గ్రామం చేరుకున్న సమ్మక్కను తొలుత గుడికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. వెంటనే ప్రాంగణంలో విద్యుత్ దీపాలను ఆర్పేశా రు. గద్దెలపైకి చేరుకున్న వడ్డెలు అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి 8:04 గంటలకు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. అంతకు ముందు సమ్మక్క గద్దెపైకి వనం తెచ్చే కార్యక్రమాన్ని బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మక్క పూజారులు నిర్వహించారు. గురువారం ఉదయం కంకవనాన్ని గద్దెలపైకి తీసుకొచ్చారు. అధికారుల ఘన స్వాగతం ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమ్మక్కకు స్వాగతం పలి కారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, ప్రభుత్వ సలహాదారు బీ.వీ. పాపారావుతో పాటు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా, జాతర ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, ములుగు మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య సమ్మక్కకు స్వాగతం పలికారు. మేడారం జాతరలో కీలక ఘట్టాలైన సారల మ్మ, సమ్మక్కలకు స్వాగతం పలికే కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ గైర్హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్ గద్దెల వద్ద పరిస్థితి పర్యవేక్షించారు. -
పోదాం పద... వన జాతరకు
♦ నేటి నుంచి మేడారం జాతర ♦ సాయంత్రం గద్దెలపైకి రానున్న సారలమ్మ ♦ గోవిందరాజులు, పగిడిద్దరాజులు సైతం... ♦ ఇప్పటికే 32 లక్షల మంది మొక్కులు గత జాతరలో కోటి మంది 2014 జాతరకు కోటి మంది భక్తులు వచ్చారు. ప్రస్తుత జాతరలో ఇప్పటికే 32 లక్షల మంది భక్తులు మేడారంలో మొక్కులు సమర్పించుకున్నారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భారీగా భక్తులు రానున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: వనం జనంతో నిండుతోంది. మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారం చేరుకుంటున్నారు. సారలమ్మ మేడారంలోని గద్దెపై కొలువుదీరే గడియలు దగ్గరపడుతున్నాయి. వన దేవతల వడ్డెలు(పూజారులు) దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలవుతుంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఆదివాసీ పూజారులు, వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్, ములుగు ఏఎస్పీలు కలసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపే... పూజారులు, అధికారులు కలిసి ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల పడిగిద్దరాజును మేడారం గద్దెల వద్దకు చేరుస్తారు. వరాల తల్లిగా కొలిచే సమ్మక్క గురువారం మేడారం గద్దెలపై చేరనుంది. ఇద్దరు వన దేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. వన దేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో శనివారం జాతర ముగుస్తుంది. భారీ ఏర్పాట్లు... మేడారం జాతరకు ఈసారి కోటీ పది లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థరాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 3,605 బస్సులను నడుపుతోంది. జాతర నిర్వహణ కోసం 10 వేల మంది పోలీసులు విధులు నిర్వహస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు సాంకేతికంగా ఉపయోగపడేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. జంపన్న వాగుకు ఇరు వైపులా 3.6 కిలో మీటర్ల పొడవున స్నానఘట్టాలను నిర్మించారు. వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్య సేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధం చేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో.. దేవాదాయ శాఖ పలు కొత్త నిర్ణయాలను తీసుకుంది. దర్శనం, ఎత్తు బంగారం, క్యూలైను ఏర్పాటు చేసింది. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు వచ్చే అన్ని వర్గాల భక్తులకు పూర్తి ఉచితంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. రూ.100 ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేసింది. మొత్తం ఐదు క్యూలైన్లు ఉచిత దర్శనం కోసమే ఉండనున్నాయి. వికలాంగుల కోసం, వీవీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. భక్తులు మొక్కుల రూపంలో వనదేవతలకు బెల్లం(బంగారం) సమర్పించే ప్రక్రియను ఈసారి పూర్తిగా ఉచితం చేసింది. గతంలో దేవతలకు బెల్లం మొక్కు సమర్పించేందుకు రూ.1,116 రుసుముతో టికెట్ ఉండేది. ప్రస్తుత జాతరలో ఈ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా మార్చారు. -
ఇప్పటినుంచే భక్తులు పోటెత్తుతున్నారు!
వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకోవడానికి ఇప్పటినుంచే భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క, సారక్క అమ్మవార్లను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. మరో నెలరోజుల్లో ప్రధాన జతర జరగనున్న నేపథ్యంలో మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రధాన జాతర సమయంలో మొక్కులు తీర్చుకోవడం కష్టతరంగా మారడంతో భక్తులు ఇప్పుటినుంచే పెద్ద ఎత్తున వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆదివారం వాహనాల రద్దీ వల్ల కన్నెపల్లి-కొత్తూరు మధ్య భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయి.. భక్తులు అవస్థలు పడుతున్నారు. -
మేడారం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
మేడారం జాతర కోసం వస్తున్న భక్తుల ఏర్పాట్లపై ఆర్టీసీ ఆధికారులతో మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర కోసం 51 ప్రాంతాల నుంచి 3,700 బస్సులను నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఏడు కోట్ల రూపాయల వ్యయంతో మేడారం వెళ్లే బస్సులకు సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. తెలంగాణలో బస్సురూట్ లేని 1300 గ్రామాలను గుర్తించామని.. త్వరలోనే ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
మేడారంలో భక్తుల సందడి
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో అటవీ ప్రాంతంలో కొలువైన సమ్మక్మ, సారక్క ఆలయం వద్ద ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుమారు 4 వేల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల వద్ద కుంకుమ పూజలు చేసి మేకలు, కోళ్లను బలి ఇచ్చారు. -
విద్యార్థిని చితకబాదిన ప్రధానోపాధ్యాయురాలు
మహాముత్తారం (కరీంనగర్): హోం వర్క్ చేయలేదనే నెపంతో పదో తరగతి విద్యార్థినిని ప్రధానోపాధ్యాయురాలు చితకబాదింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో శనివారం జరిగింది. వివరాలు.. పదోతరగతి చదువుతున్న సమ్మక్క (15) హోం వర్క్ చేయలేదని ప్రధానోపాధ్యాయురాలు తీవ్రంగా కొట్టింది. దీంతో విద్యార్థిని రెండు రోజుల నుంచి హాస్టల్ గదికే పరిమితమైంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంటికి వచ్చిన బాలిక కుంటుంతుండటం గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. విద్యార్థిని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయురాలని వివరన కోరారు. -
గద్దెనెక్కిన వనదేవతలు
పినపాక, న్యూస్‌లైన్: గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క - సారలమ్మ జాతర గురువారం మండలంలోని కుర్నవల్లిలో ఘనంగా జరిగింది. మూడో రోజు వనంతో పాటు సమ్మక్క ఆలయ ప్రాంగణంలోని గద్దెనెక్కడంతో భక్తులు భారీసంఖ్యలో దర్శించుకున్నారు. తొలుత వనంతోపాటు సమ్మక్క కుంకుమ భరిణ తో కలిసి గిరిజన పూజారుల ఆధ్వర్యంలో నంది గామ గుట్టల నుంచి బురదారం మీదుగా ఊరేగింపుగా కుర్నవల్లికి చేరుకుంది. అనంతరం బుధవారమే ఆలయానికి చేరుకున్న సారలమ్మ, పగిడిద్దరాజులు గ్రామ శివారులోకి మేళతాళాలు, భక్తుల కోలాహలంతో వెళ్లి ఎదుర్కోలు పలికారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పూనకాలతో ఊగుతూ అమ్మవారి వెంట ఆలయం వద్దకు వచ్చారు. ఆలయం ఎదుట వడి బియ్యంతో దీక్ష గా ఉన్న మహిళల మీదుగా ఆలయంలోకి వచ్చిన సమ్మక్కకు గిరిజన సంప్రదాయం ప్రకారం పగిడిద్దరాజుతో ఆలయ పూజారి(దేవరబాల) పోలెబోయిన సుందరయ్య ఘనంగా వివాహం జరిపిం చారు. అనంతరం భక్తులు వన దేవతలకు అమితంగా ఇష్టమైన బంగారం(బెల్లం), బోనాలను గద్దెల వద్ద ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు. పోటెత్తిన భక్తజనం : సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా గురువారం కుర్నవల్లి గ్రామం భక్తజనంతో నిండిపోయింది. పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, గుండాల, చర్ల వాజేడు, వెంకటాపురం, వరంగల్ జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వనదేవతలకు పూజలు నిర్వహించారు. సమ్మక్క ఎదుర్కోలు ఉత్సవం, సమ్మక్క - పగిడిద్దరాజుల వివాహ ఉత్సవాలను భక్తులు వీక్షించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధక్ష్యలు పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, స్థానిక సర్పంచ్ పోలెబోయిన తిరుపతయ్యలు కుటుంబ సమేతంగా వనదేవతలకు పూజలు నిర్వహించారు. -
ముగిసిన మేడారం జాతర
-
మేడారానికి పూనకం
*గద్దెపైకి చేరిన సమ్మక్క తల్లి *దారిపొడవునా వనదేవతకు మొక్కులు *శివసత్తుల పూనకాలు.. గిరిజనుల నృత్యాలు *మేడారంలో ఉప్పొంగిన భక్తిభావం మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: మేడారం పులకించింది. గిరిజన జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల ఎదురుచూపులు ఫలించాయి. కోటొక్క భక్తుల కొంగుబంగారం, వనదేవత సమ్మక్క చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి చేరింది. నమో సమ్మక్క... జై సమ్మక్క... అంటూ లక్షలాది మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, అధికారుల లాంఛనాలు, పోలీసు అధికారి తుపాకీ కాల్పుల మధ్య... తల్లి సమ్మక్కను గిరిజన సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) మేడారం గద్దెలపైకి చేర్చారు. సమ్మక్కను తీసుకువచ్చే ప్రధాన ఘట్టం గురువారం సాయంత్రం 5.39 నుంచి రాత్రి 7.52 గంటల వరకు ఉద్విఘ్నంగా సాగింది. ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయం 5.30 గంటలకే ప్రారంభమైంది. మేడారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు(పసిడి కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు వడ్డెల బృందం మధ్యాహ్నం 3.50 గంటలకు చిలకలగుట్టపైకి బయలుదేరింది. అప్పటికే ఆ ప్రాంతమంతా భక్తులతో నిండిపోయింది. కలెక్టర్ జి.కిషన్, ఇతర ఉన్నతాధికారులు అక్కడ పర్యవేక్షించారు.కుంకుమ భరిణె రూపంలో ఉన్న అడవి తల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె, సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక్క ఉదుటున గుట్ట దిగారు. మిగిలిన వడ్డెలు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా అధికారిక లాంఛనాల ప్రకారం వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు నాలుగు విడతలుగా గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల నడుమ వడ్డెల బృందం సమ్మక్క తల్లితో మేడారంవైపు బయలుదేరింది. సమ్మక్కకు ఎదురుగా కోళ్లు, గొర్రెలు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలతో శివాలూగారు. మొక్కులతో తమతో తెచ్చుకున్న ఒడిబాల బియ్యాన్ని సమ్మక్క దారిలో వెదజల్లారు. మరికొందరు భక్తులు ఆ బియ్యాన్ని అపురూపంగా ఏరుకుని దాచుకున్నారు. సమ్మక్క రాకతో తారాస్థాయికి చేరుకున్న భక్తి ప్రవాహం సెలపయ్య గుడికి చేరుకుంది. తల్లి రావడంతో అక్కడి వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం గద్దెలకు బయలుదేరారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ గ్రామ ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకువస్తున్న పూజారుల కాళ్లు కడిగి భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. మిగిలిన భక్తులు ఆ ఆనంద క్షణాలను తమ కన్నుల్లో దాచుకున్నారు. ఆపై వడ్డెలు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. కాగా, జాతరకు ముందే 30లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకోగా బుధ, గురువారాల్లో మరో 60లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతరలో అపశృతులు.. ఐదుగురు మృతి మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో గురువారం వివిధ సంఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం చెట్టుపల్లికి చెందిన అసంపల్లి పర్వతాలు(55)కు మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందాడు. వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన బొమ్మెర వెంకన్న(35), సాతుపెల్లి యాకయ్య(70) అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నెల్లికుదురు మండలం జైరాం గ్రామానికి చెందిన బాలుడు సంజయ్(6) ఫిట్స్‌తో చనిపోయాడు. తొక్కిసలాటలో కరీంనగర్ వాసి మృతి కోహెడ: కరీంనగర్ జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన ఒరుగల కనకయ్య(58) బుధవారం కుటుంబసభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకొనేందుకు కోహెడ నుంచి మేడారం వెళ్లాడు. గురువారం క్యూలో తొక్కిసలాట జరిగిందని, ఈ సంఘటనలో కనుకయ్య అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.