మేడారం.. మెరిసే
సమ్మక్క-సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
నిండిపోయిన క్యూలైన్లు
ఎండ, ఉక్కపోతతో అవస్థలు పడిన వృద్ధులు, చిన్నారులు
తల్లుల చెంతకు ప్రముఖుల తాకిడి
వీఐపీల బంధుగణం, వాహనాలతో సమస్యలు
కొనసాగిన పోలీసుల ‘అత్యుత్సాహం’
పెద్ద సంఖ్యలో బయలుదేరిన భక్తులతో కిక్కిరిసిన బస్‌పాయింట్
నేడు దేవతల వనప్రవేశం
ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం భక్తజనంతో మెరిసిపోరుుంది. ఆదివాసీల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఓకే చోట కొలువుదీరడం తో భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకుని తన్మయత్వానికి లోనయ్యూరు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో రోజంతా రద్దీ కొనసాగింది. సమ్మక్క, సారలమ్మ నినాదాల తో జాతర ప్రాంగణం మార్మోగింది. నలుగురు దేవతలూ కొలువై ఉండడంతో శుక్రవారం క్యూై లెన్లన్నీ నిండిపోరుు భక్తులు రోడ్లపై సైతం నిల్చోవాల్సి వచ్చింది. వారికి ఇబ్బంది కలుగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ భక్తులను వరుసక్రమం లో పంపించారు. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన పైకప్పు ఎత్తు తక్కువ ఉండటం, ఉష్ణోగ్రత పెరగడంతో పగటి వేళ భక్తులు ఇబ్బంది పడ్డారు. తాగునీటి సౌకర్యం సరిపడా లేక దాహంతో అల్లాడిపోయారు. చివరకు ఒకటి రెండు చోట్ల డ్రమ్ములు ఏర్పాటు చేసి తాగునీరు అందించారు. శుక్రవారం రాత్రి వరకు వన దేవతలను దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి దాటినట్లు అధికారులు తెలిపారు.
కొండంత మొక్కులు
వనదేవతలు ఇష్టమైన ప్రసాదంగా భావించే బంగారం (బెల్లం) గద్దెల వద్ద కొండలుగా పేరుకుపోయింది. మొక్కుల చెల్లింపులో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున బంగా రం సమర్పించారు. భక్తుల రద్దీ నిరంతరాయంగా కొనసాగడంతో గద్దెల ప్రాంగణంలో పోగైన బెల్లం తొలగించడం వీలుకాలేదు. దీంతో గద్దెపై నిల్వలు కొండలా పేరుకుపోయూరుు. భక్తుల కానుకలతో నిండిన హుండీలను ఎప్పటికప్పుడు పక్కకు తరలించారు. శుక్రవారం భక్తుల రద్దీ పెరగడంతో ప్రసాదం పంపిణీని దేవాదాయశాఖ అధికారులు నిలిపేశారు.
వస్తున్నారు... పోతున్నారు..
జాతరకు రెండు రోజులు ముందుగానే చేరుకున్న భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని ఉన్నా రు. బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, గురువారం సమ్మ క్క గద్దెలపైకి చేరుకోవడంతో గురువా రం రాత్రి నుంచి మొక్కులు ఊపందుకున్నారుు. అమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్న భక్తులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరుగు ప్రయూణ మవుతున్నారు. దీంతో పొలా లు, అడవులు, వాగుల్లో వెలిసిన గుడారాలు ఖాళీ అవుతున్నారుు. భక్తులను పార్కింగ్ ఏరియాలకు, బస్‌స్టేషన్లకు తరలించే ఆటోలు, ఎడ్లబండ్ల హవా కనిపించింది. ఆర్టీసీ బస్‌స్టేషన్ పా యింట్ వద్ద కోలాహలం నెలకొంది. వరంగల్ బస్‌పాయింట్ వద్ద భక్తులు పెద్దసంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నా రు. జాతరకు భక్తులను తరలించేందు కు చిట్యాల, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బస్సులు నడిపించిన ఆర్టీసీ, తిరుగు ప్రయాణంలో ఆయా పాయింట్లకు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆర్టీస్ బస్‌స్టేషన్ తిరుగు ప్రయాణ భక్తులతో కిక్కిరిపోయింది. కాగా, జాతరలో వీఐపీల వాహనాలు, దర్శనాలకిచ్చిన ప్రాధాన్యత సామాన్య భక్తులకు ఇవ్వని పోలీసులు, ప్రభుత్వ అధికారుల తీరు పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, దేవతలు నలుగురూ శనివారం వనంలోకి వెళ్లిపోనుం డడంతో జాతర ముగుస్తుందని అధికారులు ప్రకటించారు.