saralamma
-
వనం చేరిన సమ్మక్క..
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర ముగిసింది. నాలుగు రోజులుగా కోటిన్నర మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను శనివారం సాయంత్రం వడ్డెలు (గిరిజన పూజారులు) ప్రత్యేక పూజల మధ్య వనప్రవేశం చేయించారు. ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరిరోజు కూడా భక్తులు పోటెత్తారు. వనదేవతలు అడవికి చేరే వేడుక సమయంలో వాన జల్లులు కురవడం గమనార్హం. చివరిరోజు కార్యక్రమం ఇలా.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వన ప్రవేశం ప్రక్రియ శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలై సుమారు రాత్రి ఏడున్నర వరకు సాగింది. తల్లులను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి అడవిలోకి చేర్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర గిరిజన ఆచారాలతో ప్రత్యేక పూజలు జరిగాయి. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని వడ్డెల బృందం గద్దెలపైకి చేరుకుంది. పూజల తర్వాత సమ్మక్క తల్లిని గద్దెల ప్రాంగణం నుంచి భక్తులను దాటుకుంటూ బయటికి తీసుకెళ్లి రాత్రి 7.27 గంటల సమయంలో చిలకలగుట్టకు చేర్చారు. ఇలా ఓవైపు వనప్రవేశ పూజలు జరుగుతుండగానే గిరిజన సంప్రదాయం ప్రకారం.. సమ్మక్క గద్దెలపై భక్తులు సమర్పించిన చీరసారెలు, బంగారం, పసుపు కుంకుమలను స్థానికులు తీసుకునే కార్యక్రమం జరిగింది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు పోటీపడ్డారు. దీనితో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. కన్నెపల్లికి సారలమ్మ.. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు సారలమ్మ గద్దె వద్ద గిరిజన సంప్రదాయం ప్రకారం రహస్య పూజలు నిర్వహించారు. గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కాక సారయ్య నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మొంటె (వెదురుబుట్ట)ను తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. ఈ సమయంలో భక్తులు పూజారులను తాకడానికి ప్రయత్నించారు. మరోవైపు గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద కూడా చివరిరోజు పూజలు జరిగాయి. ఊరేగింపుగా పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు.. గోవిందరాజులును ఏటూరునాగారం మండలం కొండాయికి తీసుకెళ్లారు. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి దేవతల వనప్రవేశ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహా జాతర ముగిసిందని ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రకటించారు. ప్రస్తుత మేడారం జాతరకు మొత్తంగా 1.45 కోట్ల మంది భక్తులు వచ్చారని.. వారు ఇక్కడికి చేరుకునేందుకు లక్షన్నర వాహనాలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. బుధవారం తిరుగువారం పండుగ.. సమ్మక్క–సారలమ్మలకు ఈనెల 28న పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన తర్వాత ఇలా తిరుగువారం పండుగ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని.. జాతరకు వచ్చిన భక్తులు చల్లంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటామని పూజారులు తెలిపారు. తిరుగువారం పండుగ సందర్భంగా బుధవారం మేడారం గ్రామస్తులు, ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు ఇళ్లను అలికి శుద్ధి చేస్తారు. సమ్మక్కకు ప్రత్యేక పూజలు చేస్తారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. పూజారులు జాతర సమయంలో తమకు ఇళ్లకు ఆహా్వనించిన బంధువులకు కొత్త వస్త్రాలు పెట్టి సాగనంపుతారు. మేడారం మహాజాతర తిరిగి 2026 మాఘమాసంలో జరగనుంది. గద్దెను వీడి వనప్రవేశం చేసినదిలా.. 5.10 గంటలకు గోవిందరాజులు 5.30 గంటలకు పగిడిద్దరాజు 7.27 గంటలకు సమ్మక్క వనప్రవేశం 7.40 గంటలకు సారలమ్మ వనప్రవేశం ఆనవాయితీ ప్రకారం తొలుతగా గోవిందరాజులు, పగిడిద్దరాజులను గద్దెల మీది నుంచి సాగనంపుతారు. వారు వెళ్లగానే సమ్మక్క వన ప్రవేశ కార్యక్రమం ఉంటుంది. చివరిగా సారలమ్మను తీసుకెళతారు. -
గద్దెనెక్కిన సారలమ్మ
అడవి బిడ్డల మహా జాతర జిల్లాలో వైభవంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కోయపూజారుల మంత్రోచ్చరణలు.. డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాల నడుమ సారలమ్మ గద్దెకు చేరుకుంది. దీంతో జాతరలో మొదటిఘట్టం కన్నుల విందుగా సాగింది. బుధవారం సాయంత్రం నుంచే జిల్లాలోని సమ్మక్క గద్దెల వద్దకు భక్తులు తరలివస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్ నగరపాలక పరిధిలోని రేకుర్తి, శంకరపట్నం, వేగురుపల్లి– నీరుకుల్ల, వీణవంక, హుజూరాబాద్, కొత్తపల్లి మండలం చింతకుంట(శాంతినగర్), చొప్పదండి మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సమ్మక్క– సారలమ్మ జాతరకు వేలాది మంది పయనమవుతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నేడు సమ్మక్కతల్లి గద్దెకు చేరుకోనుంది. శుక్రవారం అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. సాక్షి, కరీంనగర్: జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తిలో జరుగుతున్న సమ్మక్క– సారలమ్మ జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు బుధవారం వరకే లక్షమందికి పైగా భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. రేకుర్తి కరీంనగర్లో విలీనమైన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న జాతర సందర్భంగా బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. సారలమ్మకు ఘనస్వాగతం.. రేకుర్తి శ్రీ సమ్మక్క– సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కోయ పూజారులు, ఆలయ ఈవో రత్నాకర్‌రెడ్డి, వ్యవస్థాపక చైర్మన్ పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో పక్కనే ఉన్న కొండపైకి వెళ్లారు. అక్కడ సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా ఊరేగింపు మధ్య గద్దెవద్దకు తీసుకొచ్చారు. అమ్మవారు వచ్చే సమయంలో భక్తులు ఘనస్వాగతం పలికారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సాయంత్రం 5.10 గంటలకు సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెలకు చేరనుంది. అప్పటి నుంచి ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనం ఇస్తారు. శుక్రవారం అమ్మవార్లకు మొక్కులు ఉంటాయి. శనివారం సాయంత్రం వనప్రవేశం చేస్తారు. ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు.. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం సాయంత్రానికే లక్షమందికి పైగా భక్తులు వచ్చారు. గురువారం, శుక్రవారం మరో ఐదు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. తాగునీరు, సానిటేషన్, బందోబస్తు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఏర్పాట్లను కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జాతర నోడల్ అధికారి క్రాంతి బుధవారం పరిశీలించారు. భక్తులకు శానిటేషన్, మంచినీరు, స్నానపుగదులు, దుస్తులు మార్చుకునే గదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన సమయంలో తీసుకునే చర్యలను అధికారులతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా సందడి.. సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సందడి నెలకొంది. జిల్లాలో రేకుర్తితో పాటు శంకరపట్నం, హుజూరాబాద్, వీణవంక, వేగురుపల్లి– నీరుకుల్ల, చింతకుంట(శాంతినగర్), చొప్పదండి మండలంలోని ఆర్నకొండ తదితర ప్రాంతాల్లో జాతర ఘనంగా ప్రారంభమైంది. సారలమ్మ తల్లి ఆగమనంతో అన్ని ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. అందుకు అనుగుణంగా అధికారులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. -
ములుగును జిల్లా చేయాలని రాస్తారోకో
ములుగు : ములుగును సమ్మక్క–సారల మ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి, అనుబంధ యువజన సంఘం ఆధ్వర్యంలో జా తీయ రహదారిపై సోమవారం ధర్నా, రా స్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా జి ల్లా సాధన సమితి అధ్యక్షుడు బిక్షఫతిగౌడ్ మాట్లాడారు. జిల్లా ఏర్పాటుlకోసం నేడు చే పట్టనున్న బంద్‌లో అన్ని వర్గాల వారు స్వ చ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా ఏర్పాటు విషయంలో మంత్రి చందూలాల్ చేస్తున్న కృషికి ఆయన కృతజ్ఞతలు తె లిపారు. సమితి ప్రధాన కార్యదర్శి శ్రీనివా స్, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు శివ, ప్రధాన కార్యదర్శి సతీశ్, యువజన సంఘం అధ్యక్షుడు దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. -
మేడారానికి భక్తుల తాకిడి
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకునేందు కు ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు వచ్చారు. ఏటూరునాగారంలోని రామన్నగూడెం, మంగపేట గోదావరిలో అంత్య పుష్కరాలకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో మేడారంలోని వనదేవతల సన్నిధికి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఈసందర్భంగా భక్తులు వన దేవతలకు పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం సమర్పించి పూజలు నిర్వహించారు. గద్దెలకు మరమ్మతులు కాగా, మేడారంలోని అమ్మవార్ల గద్దెలకు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. గాయత్రి గ్రానైట్స్ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరిలో జాతర సందర్భంగా అమ్మవార్ల గద్దెలకు గ్రానైట్ వేశారు. జాతరకు వచ్చిన భక్తులు గద్దెలపైకి కొబ్బరి, బెల్లం విసరడంతో గ్రానైట్ రాళ్లు పగిలాయి. పగిలిన రాళ్లను తొలగించి కొత్త వాటిని గద్దెలపై అమర్చే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. -
మేడారం.. మెరిసే
-
మేడారం.. మెరిసే
సమ్మక్క-సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు నిండిపోయిన క్యూలైన్లు ఎండ, ఉక్కపోతతో అవస్థలు పడిన వృద్ధులు, చిన్నారులు తల్లుల చెంతకు ప్రముఖుల తాకిడి వీఐపీల బంధుగణం, వాహనాలతో సమస్యలు కొనసాగిన పోలీసుల ‘అత్యుత్సాహం’ పెద్ద సంఖ్యలో బయలుదేరిన భక్తులతో కిక్కిరిసిన బస్‌పాయింట్ నేడు దేవతల వనప్రవేశం ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం భక్తజనంతో మెరిసిపోరుుంది. ఆదివాసీల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఓకే చోట కొలువుదీరడం తో భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకుని తన్మయత్వానికి లోనయ్యూరు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో రోజంతా రద్దీ కొనసాగింది. సమ్మక్క, సారలమ్మ నినాదాల తో జాతర ప్రాంగణం మార్మోగింది. నలుగురు దేవతలూ కొలువై ఉండడంతో శుక్రవారం క్యూై లెన్లన్నీ నిండిపోరుు భక్తులు రోడ్లపై సైతం నిల్చోవాల్సి వచ్చింది. వారికి ఇబ్బంది కలుగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ భక్తులను వరుసక్రమం లో పంపించారు. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన పైకప్పు ఎత్తు తక్కువ ఉండటం, ఉష్ణోగ్రత పెరగడంతో పగటి వేళ భక్తులు ఇబ్బంది పడ్డారు. తాగునీటి సౌకర్యం సరిపడా లేక దాహంతో అల్లాడిపోయారు. చివరకు ఒకటి రెండు చోట్ల డ్రమ్ములు ఏర్పాటు చేసి తాగునీరు అందించారు. శుక్రవారం రాత్రి వరకు వన దేవతలను దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి దాటినట్లు అధికారులు తెలిపారు. కొండంత మొక్కులు వనదేవతలు ఇష్టమైన ప్రసాదంగా భావించే బంగారం (బెల్లం) గద్దెల వద్ద కొండలుగా పేరుకుపోయింది. మొక్కుల చెల్లింపులో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున బంగా రం సమర్పించారు. భక్తుల రద్దీ నిరంతరాయంగా కొనసాగడంతో గద్దెల ప్రాంగణంలో పోగైన బెల్లం తొలగించడం వీలుకాలేదు. దీంతో గద్దెపై నిల్వలు కొండలా పేరుకుపోయూరుు. భక్తుల కానుకలతో నిండిన హుండీలను ఎప్పటికప్పుడు పక్కకు తరలించారు. శుక్రవారం భక్తుల రద్దీ పెరగడంతో ప్రసాదం పంపిణీని దేవాదాయశాఖ అధికారులు నిలిపేశారు. వస్తున్నారు... పోతున్నారు.. జాతరకు రెండు రోజులు ముందుగానే చేరుకున్న భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని ఉన్నా రు. బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, గురువారం సమ్మ క్క గద్దెలపైకి చేరుకోవడంతో గురువా రం రాత్రి నుంచి మొక్కులు ఊపందుకున్నారుు. అమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్న భక్తులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరుగు ప్రయూణ మవుతున్నారు. దీంతో పొలా లు, అడవులు, వాగుల్లో వెలిసిన గుడారాలు ఖాళీ అవుతున్నారుు. భక్తులను పార్కింగ్ ఏరియాలకు, బస్స్టేషన్లకు తరలించే ఆటోలు, ఎడ్లబండ్ల హవా కనిపించింది. ఆర్టీసీ బస్‌స్టేషన్ పా యింట్ వద్ద కోలాహలం నెలకొంది. వరంగల్ బస్‌పాయింట్ వద్ద భక్తులు పెద్దసంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నా రు. జాతరకు భక్తులను తరలించేందు కు చిట్యాల, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బస్సులు నడిపించిన ఆర్టీసీ, తిరుగు ప్రయాణంలో ఆయా పాయింట్లకు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆర్టీస్ బస్‌స్టేషన్ తిరుగు ప్రయాణ భక్తులతో కిక్కిరిపోయింది. కాగా, జాతరలో వీఐపీల వాహనాలు, దర్శనాలకిచ్చిన ప్రాధాన్యత సామాన్య భక్తులకు ఇవ్వని పోలీసులు, ప్రభుత్వ అధికారుల తీరు పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, దేవతలు నలుగురూ శనివారం వనంలోకి వెళ్లిపోనుం డడంతో జాతర ముగుస్తుందని అధికారులు ప్రకటించారు. -
పోదాం పద... వన జాతరకు
♦ నేటి నుంచి మేడారం జాతర ♦ సాయంత్రం గద్దెలపైకి రానున్న సారలమ్మ ♦ గోవిందరాజులు, పగిడిద్దరాజులు సైతం... ♦ ఇప్పటికే 32 లక్షల మంది మొక్కులు గత జాతరలో కోటి మంది 2014 జాతరకు కోటి మంది భక్తులు వచ్చారు. ప్రస్తుత జాతరలో ఇప్పటికే 32 లక్షల మంది భక్తులు మేడారంలో మొక్కులు సమర్పించుకున్నారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భారీగా భక్తులు రానున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: వనం జనంతో నిండుతోంది. మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారం చేరుకుంటున్నారు. సారలమ్మ మేడారంలోని గద్దెపై కొలువుదీరే గడియలు దగ్గరపడుతున్నాయి. వన దేవతల వడ్డెలు(పూజారులు) దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలవుతుంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఆదివాసీ పూజారులు, వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్, ములుగు ఏఎస్పీలు కలసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపే... పూజారులు, అధికారులు కలిసి ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల పడిగిద్దరాజును మేడారం గద్దెల వద్దకు చేరుస్తారు. వరాల తల్లిగా కొలిచే సమ్మక్క గురువారం మేడారం గద్దెలపై చేరనుంది. ఇద్దరు వన దేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. వన దేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో శనివారం జాతర ముగుస్తుంది. భారీ ఏర్పాట్లు... మేడారం జాతరకు ఈసారి కోటీ పది లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థరాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 3,605 బస్సులను నడుపుతోంది. జాతర నిర్వహణ కోసం 10 వేల మంది పోలీసులు విధులు నిర్వహస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు సాంకేతికంగా ఉపయోగపడేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. జంపన్న వాగుకు ఇరు వైపులా 3.6 కిలో మీటర్ల పొడవున స్నానఘట్టాలను నిర్మించారు. వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్య సేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధం చేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో.. దేవాదాయ శాఖ పలు కొత్త నిర్ణయాలను తీసుకుంది. దర్శనం, ఎత్తు బంగారం, క్యూలైను ఏర్పాటు చేసింది. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు వచ్చే అన్ని వర్గాల భక్తులకు పూర్తి ఉచితంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. రూ.100 ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేసింది. మొత్తం ఐదు క్యూలైన్లు ఉచిత దర్శనం కోసమే ఉండనున్నాయి. వికలాంగుల కోసం, వీవీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. భక్తులు మొక్కుల రూపంలో వనదేవతలకు బెల్లం(బంగారం) సమర్పించే ప్రక్రియను ఈసారి పూర్తిగా ఉచితం చేసింది. గతంలో దేవతలకు బెల్లం మొక్కు సమర్పించేందుకు రూ.1,116 రుసుముతో టికెట్ ఉండేది. ప్రస్తుత జాతరలో ఈ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా మార్చారు. -
నేడు మేడారంలో మంత్రుల పర్యటన
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారక్క జాతర ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా.. ప్రభుత్వం ఏర్పాట్లపై దృష్టి సారించింది. తెలంగాణ వచ్చాక జరుగుతున్న తొలి జాతర కావడంతో అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. -
మేడారంలో భక్తుల రద్దీ
ములుగు మండలం మేడారం సమ్మక్క సారలమ్మ క్షేత్రంలో శనివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో జనం తరలిరావటంతో నిర్వాహకులు ప్రధాన గేట్‌ను మూసేసి క్యూలో భక్తులను గద్దెల వద్దకు అనుమతిస్తున్నారు. అమ్మలను దర్శించుకున్న వారిలో ఎంపీ సీతారాంనాయక్ తదితరులు ఉన్నారు. -
మేడారం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
మేడారం జాతర కోసం వస్తున్న భక్తుల ఏర్పాట్లపై ఆర్టీసీ ఆధికారులతో మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర కోసం 51 ప్రాంతాల నుంచి 3,700 బస్సులను నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఏడు కోట్ల రూపాయల వ్యయంతో మేడారం వెళ్లే బస్సులకు సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. తెలంగాణలో బస్సురూట్ లేని 1300 గ్రామాలను గుర్తించామని.. త్వరలోనే ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
బెట్టను తరిమేద్దామిలా..
ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాధారం కింద నాలుగు లక్షలకు పైగా హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో ప్రధానమైనవి పత్తి, వేరుశనగ, కంది, ఆముదం, ఉల్లి, మొక్కజొన్న. జూన్, జూలై నెలల్లో అప్పుడప్పుడు వర్షాలు కురిసినా ఆగస్టు నెలలో మొండికేశాయి. గత 20 రోజులగా చినుకుజాడ కరువైంది. దీంతో పైర్లన్నీ ఎండిపోతున్నాయి. అయితే కొద్దిపాటి శ్రమ తీసుకుంటే బెట్ట నుంచి వీటిని వారం నుంచి పది రోజుల వరకు కాపాడుకోవచ్చని డాట్ సెంటర్ ముఖ్యశాస్త్రవేత్త డాక్టర్ సరళమ్మ తెలిపారు. ఆలోపు వర్షాలు పడితే తిరిగి కోలుకుంటాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో బెట్ట నుంచి పైర్లకు ఉప శమనం కలిగించవచ్చని వివరించారు. నెర్రెలను పూడ్చాలి.. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో సాగు భూముల్లో నెర్రెలు(పగుళ్లు) వస్తున్నాయి. ఇవి వస్తే భూమిలోని తేమ ఆవిరి రూపంలో బయటికి వెళుతుంది. ఉన్న తేమ కూడా బయటికి పోతే పంటలకు మరింత ప్రమాదకరం. నెర్రెలు వచ్చినప్పుడు రైతులు అంతర కృషి చేయాలి. దీంతో తేమ బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. అంతర కృషి అంటే సాళ్ల మధ్య గొర్రుతో దున్నాలి. లేదా నాగలితో దున్నవచ్చు. ఇలా చేయడం వల్ల నైలను పూడ్చినట్లు అవుతుంది. ఆవిరి రూపంలో తేమ బయటికి వెళ్లదు. దీంతో పంటలను కొద్ది రోజుల పాటు బెట్ట నుంచి కాపాడుకోవచ్చు. పై పాటుగా రసాయన ఎరువులు పిచికారీ చేయాలి.. ఖరీఫ్‌లో వర్షాధారం కింద వేసిన పంటలన్నీ ప్రస్తుతం 30 నుంచి 60 రోజుల దశలో ఉన్నాయి. ఇప్పటికే మొక్కజొన్న పూర్తిగా ఎండిపోయింది. కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ రైతులు ప్రయత్నించాలి. రసాయన ఎరువులైన 19:19:19 లేదా 17:17:17 లేదా డీఏపీ పది గ్రాములు లీటరు నీటికి కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వర్షాలు పడేంత వరకు వారం నుంచి పది రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. బెట్ట నుంచి పంటలకు ఉపశమనం కల్పించుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. పిచికారీ కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకోవడం మంచిది. చీడ, పీడలను ఇలా నివారించుకోవాలి... బెట్ట పరిస్థితుల కారణంగా పంటలకు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంది. వీటిని కూడా నివారించుకోవాలి. డోన్, పత్తికొండ, దేవనకొండ తదితర ప్రాంతాల్లో వేరుశనగ పంటల్లో బెట్ట కారణంగా ఆకుముడుత తెగులు ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని నివారణకు క్లోరో ఫైరిపాస్ 2 ఎంఎల్, నువాన్ ఒక ఎంఎల్, లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు, నువాన్ 1 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రత్తి, ఆముదం పంటల్లో ఆకు తొలిచే పురుగు కనిపిస్తోంది. దీని నివారణకు క్వినాల్ పాస్ లేదా మోనోక్రోటోఫాస్ 2 ఎంఎల్ లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు, వేపనూనె 5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి ఎకరాకు 200 ద్రావణాన్ని పిచికారీ చేయాలి బెట్టకారణంగా టమాటలో పూత, పిందె రాలుతోంది. దీని నివారణకు ఫ్లోనోఫిక్స్ 1ఎంఎల్ 4ః5 లీటర్ల నీటికి కలిపి ఐదు రోజులకోసారి పిచికారీ చేయాలి పత్తిలో పిండినల్లి అనే తెగులు కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో ఇది వస్తోంది. దీని నివారణకు 2 ఎంఎల్ ప్రొఫినోపాస్, 5 ఎంఎల్ వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
ఆస్పత్రిలో ఆకలిమంటలు
జబ్బు నయంచేసుకోవాలని రోగులు సర్కార్ ఆస్పత్రికెళితే అక్కడ కొత్తరోగం వచ్చేట్టుంది. ఏది పెట్టినా తింటారులే అనే నిర్లక్ష్యంతో నాణ్యతలేని టిఫిన్, భోజనం వడ్డిస్తూ రోగుల కడుపు మాడ్చుతున్నారు. నాణ్యతను పరిశీలించాల్సినఆస్పత్రి వర్గాలు పట్టించుకోవడంలేదు. సర్కార్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చేదంతా నిరుపేదలే. బయట ఆహారం కొని తినలేని పరిస్థితి. ఆస్పత్రిలో ఇచ్చే నాసిరకం తిండి తినలేక ఆకలితో కడుపుమాడ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న దీనావస్థలివీ. చిత్తూరు (క్రైమ్),న్యూస్‌లైన్: చిత్తూరులోని 300 పడకల ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల నుంచి సీరియస్ కేసులను ఇక్కడికి రెఫర్ చేస్తుం టారు. వీరుగాక ఆస్పత్రికి రోజూ 1000 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఆపరేషన్లు, ప్రాణాంతక జబ్బులతో పాటు డెలివరీ కేసులవారు 3 నుంచి 15 రోజుల పాటు ఆరోగ్యం కుదుటపడేవరకు ఆస్పత్రిలోనే చికిత్సపొందుతారు. వీరు ఆస్పత్రిలో అడ్మిట్టయినప్పటినుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు పౌష్టికాహారం అందివ్వాలి. ఈ క్రమంలో టిఫిన్, భోజనం, పండ్లు, పాలు, కోడిగుడ్డు సరఫరా చేసే బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఉదయం నీళ్లపాలు, రాళ్లులాంటి గట్టి ఇడ్లీలు, నీళ్ల సాంబారు, ఉడికీ ఉడకని అన్నం మెతుకులను వడ్డిస్తున్నారు. ఈ ఆహారం తింటున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారు. నాణ్యతలేని ఆహారం గురించి నిర్వాహకులను ప్రశ్నిస్తే రోగులపై తిరగబడుతున్నారు. పెట్టేది ఇంతే ... ఎవరికైనా చెప్పుకోండి... ఏం భయం లేదు అంటున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ సరఫరాచేసే భోజనాన్ని ఆస్పత్రి అధికారి పరీక్షించి నాణ్యతను నిర్ధారించిన తరువాతే రోగులకు వడ్డించాలి. నాణ్యతలో తేడా వస్తే కాంట్రాక్టర్‌ను హెచ్చరించాలి. లేదా ఆ కాంట్రాక్టును రద్దుచేయడానికి ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలి. అయితే ఫుడ్ క్వాలిటీని పరీక్షించాల్సిన ఆస్పత్రి అధికారి ఇవన్నీ పట్టించుకున్న పాపానపోలేదు. దాంతో కాంట్రాక్టర్ ఏది వడ్డిస్తే అది తినాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతిరోజూ రోగులకు అరటిపండు, ఆరంజ్, ఆపిల్ తదితర పండ్లలో ఏదో ఒకటి అందించాల్సివున్నా రోగులకు పంపిణీ చేయడంలేదు. భోజనం అధ్వానం ఆపరేషన్ చేసుకుని వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నా. ప్రతిరోజూ 6 నుంచి 10 మాత్రలు మింగుతుండటంతో కడుపులో చాలా మంటగా ఉంది. ఇక్కడ వడ్డిస్తున్న భోజనం తింటే కడుపుమంటతో పాటు భరించలేని కడుపునొప్పి వస్తోంది. నాసిరకం భోజనం ఇస్తుండడంతో త్వరగా కోలుకోలేకపోతున్నాం. -అర్జునయ్య, నలగాంపల్లె, బంగారుపాళెం మండలం దిక్కున్న చోట చెప్పుకో అంటున్నారు ఇడ్లీ గట్టిగా ఉందని, పాలు నీళ్లుగా ఉన్నాయని అడిగితే దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరించారు. వారం రోజుల నుంచి ఫుడ్ కాంట్రాక్టర్ ఇచ్చే పాలు, టిఫిన్, భోజనం కిందపడేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పండ్లు ఇవ్వలేదు. కాంట్రాక్టర్ తీరుపై విచారణ చేసి రోగులకు న్యాయం చేసేలా అధికారులు చొరవచూపాలి. -శ్రీనివాసులు, దిగువ కామినేపల్లె, ఐరాల మండలం రోగులపై తిరగబడితే చర్యలు తీసుకుంటాం రోగులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కచ్చితంగా మెనూ ప్రకారం అందించాలి. నాణ్యత లేదని ప్రశ్నించిన రోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఫుడ్ కాంట్రాక్టర్‌పై ఉంది. అలాకాకుండా రోగులపైనే విరుచుకుపడటం.. ఎవరికైనా చెప్పుకో అనడం సరికాదు. ఈ విషయంపై విచారణ జరిపి తగుచర్యలు తీసుకుంటాం. -సరళమ్మ, డీసీహెచ్ఎస్. -
గద్దెనెక్కిన వనదేవతలు
పినపాక, న్యూస్‌లైన్: గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క - సారలమ్మ జాతర గురువారం మండలంలోని కుర్నవల్లిలో ఘనంగా జరిగింది. మూడో రోజు వనంతో పాటు సమ్మక్క ఆలయ ప్రాంగణంలోని గద్దెనెక్కడంతో భక్తులు భారీసంఖ్యలో దర్శించుకున్నారు. తొలుత వనంతోపాటు సమ్మక్క కుంకుమ భరిణ తో కలిసి గిరిజన పూజారుల ఆధ్వర్యంలో నంది గామ గుట్టల నుంచి బురదారం మీదుగా ఊరేగింపుగా కుర్నవల్లికి చేరుకుంది. అనంతరం బుధవారమే ఆలయానికి చేరుకున్న సారలమ్మ, పగిడిద్దరాజులు గ్రామ శివారులోకి మేళతాళాలు, భక్తుల కోలాహలంతో వెళ్లి ఎదుర్కోలు పలికారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పూనకాలతో ఊగుతూ అమ్మవారి వెంట ఆలయం వద్దకు వచ్చారు. ఆలయం ఎదుట వడి బియ్యంతో దీక్ష గా ఉన్న మహిళల మీదుగా ఆలయంలోకి వచ్చిన సమ్మక్కకు గిరిజన సంప్రదాయం ప్రకారం పగిడిద్దరాజుతో ఆలయ పూజారి(దేవరబాల) పోలెబోయిన సుందరయ్య ఘనంగా వివాహం జరిపిం చారు. అనంతరం భక్తులు వన దేవతలకు అమితంగా ఇష్టమైన బంగారం(బెల్లం), బోనాలను గద్దెల వద్ద ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు. పోటెత్తిన భక్తజనం : సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా గురువారం కుర్నవల్లి గ్రామం భక్తజనంతో నిండిపోయింది. పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, గుండాల, చర్ల వాజేడు, వెంకటాపురం, వరంగల్ జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వనదేవతలకు పూజలు నిర్వహించారు. సమ్మక్క ఎదుర్కోలు ఉత్సవం, సమ్మక్క - పగిడిద్దరాజుల వివాహ ఉత్సవాలను భక్తులు వీక్షించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధక్ష్యలు పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, స్థానిక సర్పంచ్ పోలెబోయిన తిరుపతయ్యలు కుటుంబ సమేతంగా వనదేవతలకు పూజలు నిర్వహించారు. -
ముగిసిన మేడారం జాతర
-
తెలంగాణ కుంభమేళా
మేడారం.. వరంగల్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలం ఊరట్టం పంచాయతీ పరిధిలో మేడారం ఉంటుంది. మారేడు చెట్లు ఎక్కువగా ఉన్నందున ఈ ఊరికి మేడారం అని పేరు వచ్చినట్లు చెబుతుంటారు. 80 కుటుంబాలున్న చిన్న పల్లె ఇది. సమ్మక్క-సారలమ్మ జాతర ప్రధాన కేంద్రమైన గద్దెలు ఈ గ్రామంలోనే ఉన్నాయి. ఇక్కడ సమ్మక్కకు ఆలయం ఉంది. జాతరలో కీలక ప్రాంతాలైన చిలకలగుట్ట, జంపన్నవాగులు సైతం ఈ గ్రామం సమీపంలోనే ఉన్నాయి. మేడారంలో కోయ వర్గానికి చెందిన గిరిజన కుటుంబాలే ఎక్కువ. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ. సమ్మక్క.. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని ‘పొలవాస’ను 12వ శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేట కోసం అడవికి వెళ్లిన ఆయనకు పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఉన్న బాలిక కనిపించగా తెచ్చి సమ్మక్క అని పేరు పెట్టారు. ఆ పసిపాప రాగానే అన్నీ శుభాలే జరిగాయి. సమ్మక్క.. మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహమాడింది. వీరికి సారలమ్మ, నాగులమ్మ కుమార్తెలు, జంపన్న కుమారుడు. సారలమ్మకు గోవిందరాజులుతో పెళ్లి జరిగింది. కాకతీయ రాజు రుద్రదేవుడు రాజ్య కాంక్షతో మేడారంపై దండెత్తగా పోరులో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు లు వీరమరణం పొందారు. జంపన్న సంపెంగ వాగులో దూకి చనిపోయాడు. సమ్మక్క వీరోచిత పోరాట ధాటికి తట్టుకోలేని శత్రువులు వెనుకనుంచి బల్లెంతో పొడిచారు. శత్రువును హతమార్చుతూ మేడారానికి తూర్పు దిశగా చిలకలగుట్ట వైపు సాగుతూ సమ్మక్క అదృశ్యమైంది. గిరిజనులు అరణ్యమంతా గాలించినా ప్రయోజనం లేకపోయింది. నాగవక్షపు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమలున్న భరిణె కనిపించింది. ఈ భరిణే సమ్మక్కగా గిరిజనులు జాతర చేసుకుంటున్నారు. సారలమ్మ.. సమ్మక్క కూతురు సారలమ్మ. తల్లికి తగ్గ తనయ. కాకతీయులతో జరిగిన యుద్ధం లో మేడారం నుంచి కన్నెపల్లి వైపు వెళ్ల్లిన సారలమ్మ ఆ ప్రాంతంలోనే వీరమరణం పొందారు. దీంతో అక్కడివారు ఇలవేల్పు గా కొలుస్తున్నారు. సమ్మక్క ఆగమనానికి ముందురోజు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాక వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. కాలినకడన సారలమ్మను మేడారానికి తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించడంతో జాతర మొదలవుతుంది. జంపన్న .. సమ్మక్క కుమారుడు జంపన్న. కాకతీయులతో జరిగిన యుద్ధం లో శుత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టంలేని జంపన్న పక్కనే సంపెంగవాగులో దూకి చని పోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ వాగులో స్నానాలు చేసిన తర్వాతే వన దేవతలకు మొక్కులు సమర్పిస్తారు. పగిడిద్దరాజు.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు. పెనక వంశానికి చెందిన పగిడిద్దరాజు కాకతీయులతో జరిగిన యుద్ధంలో పోరాడి వీర శత్రువుల చేతిలో చనిపోయాడు. మేడారం జాతర జరిగే మాఘశుద్ధ పౌర్ణమి నాడే పగిడిద్దరాజు చనిపోయారు. చందా వంశీయులు.. మేడారం జాతరను మొదట బయ్యక్కపేటలో జరిపేవారు. ఇది మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చందా వంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డగా సమ్మక్క బయ్యక్కపేట లోనే జన్మించినట్లు చెప్తారు. కాకతీయులతో జరిగిన యు ద్ధం అనంతరం అదృశ్యమైన సమ్మక్కను, ఆమె బిడ్డ సారలమ్మ ను బయ్యక్కపేట గ్రామస్తులు దేవతలుగా ప్రతిష్ఠించుకుని కొ లిచారు. ఊళ్లో కరువుకాటకాలతో జాతర చేయలేక పోయారు. అప్పటికే ఆదివాసీ సిద్దబోయిన వంశస్తులు బయ్యక్కపేటలో జాతర నిర్వహించేవారు. కరువుతో తాము జాతర చేయలేమని, మేడారంలోనే జరుపుకోండని బయ్యక్కపేట వాసులు చెప్పారు. దీంతో ఆ జాతరను మేడారంలో జరుపుతున్నారు. సంపెంగ వాగులో స్నానాలు జంపన్నవాగుకు సర్వపాప హరిణిగా పేరుంది. నాటి సంపెంగ వాగే నేటి జంపన్నవాగు. కాకతీయ సైనికులతో పోరాడి న సమ్మక్క కొడుకు జంపన్న ఈ వాగులో వీరమరణం పొందడంతో దానికా పేరు వచ్చింది. జంపన్న నెత్తుటితో తడిసిన ఈ వాగులో స్నానం ఆచరిస్తే చేసిన పాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. గద్దెల చుట్టుపక్కల ఎంత రద్దీ ఉం టుందో.. జంపన్నవాగు పరిసరాలు కూడా అంతే కిటకిటలాడుతాయి. వాగులో స్నానాలు చేసేందుకు భక్తులు ఆరాటపడతారు.. పూ నకాలతో ఊగిపోతూ.. ఇక్కడా పూజలు చేస్తారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తుడు ఈ వాగులో స్నానం చేసిన త ర్వాతే తల్లుల దర్శనానికి వెళ్తారు. తలనీలాలను సమర్పిస్తారు. చిలకలగుట్ట మేడారానికి ఈశాన్యంలో జంపన్నవాగు ఒడ్డున చిలకలగుట్ట ఉంటుంది. ఈ గుట్టపైనే ఓ రహస్య స్థలంలో సమ్మక్క తల్లి ఉంటుందంటారు. జాతర జరిగే మూడు రోజులు మినహా మిగిలిన రోజుల్లో సమ్మక్క ఈ గుట్టపైనే ఉంటుంది. దానితో గిరిజనులు ఈగుట్టను పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ గుట్టపైకి గిరిజన పూజారులు (వడ్డెలు) తప్ప ఎవరికీ ప్రవేశం లేదు. ఈ గుట్ట పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం రూ కోటి వ్యయంతో రక్షణ గోడను నిర్మిస్తోంది. పూనుగొండ్ల.. కొత్తగూడ మండలంలో పూనుగొండ్ల గ్రామం ఉంది. ఇక్కడ సమ్మక్క భర్త పగిడిద్దరాజు గుడి ఉంది. పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి మేడారానికి తీసుకువస్తారు. పెనక వంశ పగిడిద్దరాజును అదే వంశానికి చెందిన పెనక బుచ్చిరామయ్య అనే వడ్డె(పూజారి) పూనుగొండ్ల గ్రామం నుంచి కాలినడకన తీసుకువస్తారు. పూనుగొండ్ల నుంచి మేడారం వరకు నలభై కిలోమీటర్లు పగిడిద్దరాజును కాలినడకన వడ్డెలు తీసుకొస్తారు. కన్నెపల్లి.. తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో కన్నెపల్లి గ్రామం ఉంది. సారలమ్మ ఆలయం ఈ గ్రామంలోనే ఉంది. మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర సమయంలో ఇక్కడి నుంచి జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వరకు సారలమ్మను వడ్డెలు(ఆదివాసీ పూజారులు) తీసుకు వస్తారు. మొత్తం ఈ ఊరి జనాభా 242 మాత్రమే ఉంది. ఈ గ్రామం ప్రజలు ఏం చేయాలన్నా సారలమ్మ ఆశీర్వాదం తప్పనిసరి తీసుకుంటుంటారు. ‘మా వెన్నెలక్కకు సెప్పకుంటే ఇగ అంతే.. అమ్మో.. మేం ఏం సేయాలన్నా.. మా సారక్కకు సెప్పి సేత్తం’ అంటారు ఇక్కడి ఆదివాసీలు. లక్ష్మీదేవర మొక్కులు.. లక్ష్మీ దేవర గుర్రపు ముఖం ఆకృతిలో ఉంటుంది. ఈ ప్రతిమను ధరించి నాయకపోడులు జాతరలో సందడి చేస్తారు. నాయకపోడులకు ఇది ఆరాధ్య దైవం. నాయకపోడు పూజారి లక్ష్మీదేవరను ధరించి దారిపొడవునా నృత్యాలు చేస్తూ గద్దెలకు వస్తారు. ఈక్రమంలో వారికి గద్దెల వద్ద డోలు చప్పుళ్లు గజ్జెల మోతతో సందడి చేస్తారు. ఆ తదుపరి ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తల్లులకు పూజలు జరుపుతారు. ఇలా చేస్తేనే తమను ఆ తల్లి సల్లంగ చూస్తదని నాయకపోడుల విశ్వాసం. మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరలో లక్ష్మీదేవర మొక్కులు సందడి సందడిగా ఉంటాయి. కొండాయి.. ఏటూరునాగారం మండలం కొండాయిలో సారలమ్మ భర్త గోవిందరాజులు ఆలయం ఉంది. జాతర సందర్భంగా వడ్డెలు, తలపతి, వర్తోళ్లు కలసి డోలు చప్పుళ్లతో కాలినడకన పన్నెండు కిలోమీటర్లు నడిచి మేడారం చేరుకుంటారు. గోవిందరాజులు.. సారలమ్మ భర్త గోవిందరాజులు. దబ్బగట్ల వంశానికి చెందిన గోవిందరాజులు... మేడారానికి వచ్చిన సమయంలోనే కాకతీయులతో యుద్ధం జరిగింది. విలువిద్యలో ఆరితేరిన గోవిందరాజులు యుద్ధంలోనే వీరమరణం పొందారు. ట్రాఫికర్.. ములుగు దాటిన తర్వాత పస్రా, తాడ్వాయి, మేడారంలో ఆర్టీసీ బస్‌స్టేషన్, నార్లాపూర్‌లలో ట్రాఫిక్ జాం అయ్యే ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ జాం అయితే క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఇక్కడ క్రేన్లను ఏర్పాటు చేయనున్నారు. 23 పార్కింగ్ ప్లేస్‌లను సిద్ధం చేశారు. జాతరలో జర పైలం హా జాతరకు వస్తున్న భక్తులు తమ పిల్లలను, విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. అపరి చితుల మాటలను నమ్మరాదు. హా కొత్త వ్యక్తులను నమ్మి.. వారికి వస్తువులను అప్పగించరాదు. వారు మోసం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా వారు ఇచ్చే తినుబండారాలను స్వీకరించవద్దు. హా మేడారం జాతరకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారి సమస్యలను పరిష్కరించడానికిగాను మేడారంలో ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బం దులు ఎదురైనప్పటికీ వెంటనే పోలీసులకు తెలియజేయాలి. అన్ని ప్రాంతాల్లో 24 గంటలపాటు పోలీసుల గస్తీ, నిఘా ఉంటుంది. హా పోలీసుల సూచనలను పాటిస్తూ భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, సంతోషంగా తిరుగు ప్రయాణం చేయాలి. హా జాతర పరిసర ప్రాంతాల్లో, జంపన్నవాగులో ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు, ప్లేట్ల వాడకం నిషేధించడమైంది. హా భక్తులు, వివిధ శాఖల సిబ్బంది, దుకాణాదారులు మేడారం, దాని పరిసర గ్రామాల్లో మాత్రమే విడిది చేయాలి. అడవిలో విడిది కాని, రోడ్ల వెంబడి విడిది చేయడం మంచిదికాదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దట్టమైన అటవీ ప్రాంతంతో కూడిన మేడారంలో ఉండరాదు. అడవికి నిప్పు పెట్టరాదు. హా వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరం. వాటిని వేధించడం చేయరాదు. ఎక్కడైనా అటవీ జంతువులు దొరికితే సంబంధితశాఖ వారికి అప్పగించాలి. హా చెట్లు, మొక్కలు, వెదురు నరికిన పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. హా పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకుని విధిగా వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలి. హా జాతర సమయంలో యాత్రికులు ఆరుబయట మల విసర్జన చేయరాదు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లనే వినియోగించుకోండి. హా కలుషితమైన నీటిని సేవించరాదు. మంచినీటిని సేవించే సమయంలో ఆరోగ్య కార్యకర్తలు పంపిణీ చేసే క్లోరిన్ బిళ్లలను నీటిలో వేసుకోవాలి. హా నల్లాల వద్ద, చేతిపంపుల వద్ద, నీళ్లట్యాంకుల వద్ద స్నానాలు, మల, మూత్ర విసర్జనలు చేయరాదు. వేడి ఆహారాన్ని తీసుకోండి. హా మత్తు పానీయాలు, గుట్కాలు తీసుకోకండి. నోస్ ప్యాడ్లను వాడండి. హా భక్తులకు వాంతులు, విరేచనాలు, జ్వరం వస్తే వెంటనే జాతరలో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలను సంప్రదించండి. సకాలంలో వైద్యచికిత్సలను పొందండి. హా కేశఖండన కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే తలనీలాలను సమర్పించాలి. ఈ సందర్భంగా భక్తులు కొత్త బ్లేడ్లనే వాడకం చేయాలి. హా వాహనాలను విధిగా పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలి. గట్టమ్మ.. ములుగు సమీపంలో ఎతై ్తన గుట్ట కలిగి రహదారి ప్రమాదకరంగా ఉండడంతో తరచు ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. వాటిని నిరోధించేందుకోసం గుట్టపైన గట్టమ్మను నెలకొల్పినట్లు చెప్పుకుంటున్నారు. సమ్మక్క జాతర జరుగుతున్నప్పటి నుంచి ఇక్కడ గట్టమ్మకు మొక్కులను అప్పజెప్పుతూనే ఉన్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు గట్టమ్మను దర్శించుకొని వెళితే క్షేమంగా తిరిగి వస్తామని నమ్మకం.గట్టమ్మను నెలకొల్పి దశాబ్ధాలు గడిచిపోయిందని ఇ క్కడి పూజారులు చెప్పుకుంటారు. తమ తాతముత్తాల నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నామని ఈప్రాంత ప్రజలను తన చల్లని చూపులతో రక్షిస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం. పొరుగు రాష్ట్రాల భక్తులు.. చుట్టాలు మేడారం జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఆదివాసీలు, గిరిజనులు వివిధ మార్గాల్లో వస్తారు. గోదావరి మీదుగా వేకువజామునే తెప్పలపై, మరబోట్లు, నాటపడవల మీదుగా పిల్లాజెల్లలతో, జాతర సంరంజామాతో ఏటూరునాగారం మండలంలోని తాళ్లగూడెం రేవుకు జట్లు జట్లుగా వస్తారు. ఎన్నోఏళ్లుగా వీరు ఊరట్టం, కన్నెపల్లి పరిసర ప్రాంతాల్లోనే తమ బసను ఏర్పాటు చేసుకుని జాతర సంబురాల్లో పాల్గొంటారు. ఇక్కడి స్థానిక గిరిజనులను పేర్లు పెట్టి పిలిచేంత చనువు ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలకు ఉంది. జువ్విచెట్టు.. మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్విచెట్టును ఎంతో మహిమ గలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమీయడమే కాకుండా సమ్మక్కను మొత్తం ఎంతమంది వచ్చారో వీక్షిస్తుంటాడని ప్రతీతి. అయితే పగిడిద్దరాజు తన వద్దకు వచ్చే భక్తులపై మనసు పారేసుకుంటాడనే ఉద్దేశంతో సమ్మక్కతల్లి భర్తకు కళ్లు లేకుండా చేసి గుడ్డి నాగుపాము రూపంలో చెట్టు పైన ఉంచిందంటారు. ఎదురుకోళ్లు.. సమ్మక్క- సారలమ్మల వీరత్వానికి ఎదురుకోళ్లు ప్రతీకగా నిలుస్తాయి. తల్లులను గద్దెలకు తీ సుకువచ్చే క్రమంలో భక్తులు ఎదురుకోళ్లతో ఆహ్వా నం పలుకుతారు.. తమ చేతుల్లో ఉన్న కోడిని తల్లులకు ఎదురుగా వేస్తూ మనసారా మొక్కుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చాలని వేడుకుంటారు. జాతర సమయంలో ఎటు చూసినా ఈ ఎదురుకోళ్ల సందడే కన్పిస్తుంది. గద్దెల వద్ద ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.. ఎదురుకోడి వేసిన అనంతరం దాన్ని వండుకుని ఆరగిస్తారు. నిలువెత్తు బంగారం ఎక్కడా లేని బెల్లం మొక్కు ఆనవాయితీ మేడారంలో కన్పిస్తుంది.. తమ వద్దకు వచ్చే భక్తులు మనసారా మొక్కుకుంటే చాలని..కానుకలు వేయాల్సిన అవసరంలేదని ఆ తలు ్లలే చౌక గాఉండే బెల్లం మొక్కులను ఇష్టపడతారని ఆదివాసీలంటా రు. సమ్మక్క తల్లికి బెల్లం ఎక్కువ ఇష్టమని దేవుడి వరంతో పుట్టిన తల్లి ఎక్కువగా బెల్లాన్నే తినేదని చెప్తారు. అందుకే ఆమెకిష్టమైన బెల్లాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చుకుంటారు. తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకుని తప్పనిసరిగా చెల్లిస్తారు. దీంతో మే డారం జాతర సమయంలో బెల్లం గిరాకీ భలేగా ఉంటుంది. గద్దెల వద్ద టన్నుల కొద్దీ బంగారం పేరుకుపోతుంది. శివసత్తులు.. జంపన్నవాగుల్లో అబ్బియా.. నా తల్లీ సమ్మక్కా అబ్బియా అంటూ శివసత్తుల పూనకాలు..పూజలు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి. జాతరలో శివసత్తుల విన్యాసాలు ఓ విశేషం. ఎక్కడ చూసినా వీరకోలా పట్టుకుని చేసే హంగామా భక్తులను సంబరానికి గురిచేస్తుంది. ఆడవారే కాదు..మగవారు కూడా శివాలు ఊగుతూ జాతరకు వస్తారు. తల్లుల సేవకు అంకితమైన వారు మేడారం ప్రతీ జాతరకు వస్తారు. వీరంతా జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించిన తదుపరి పసుపుతో అలంకరించుకుంటారు. వీరకోలాను చేతబట్టి పూనకాలతో ఊగిపోతూ గద్దెల వద్దకు వస్తారు.. భక్తి భావంతో వీరు చేసే తల్లుల స్మరణలు అందరినీ ఆకర్షిస్తాయి. ఒడిబియ్యం.. భక్తులు సమ్మక్క-సారలమ్మ తల్లులను ఆడపడుచులుగా భావించి ఒడి బియ్యం మొక్కులు చెల్లిస్తారు. 5 సోళ్ల బియ్యంలో పసుపుకుంకుమ, రవిక ముక్కలు, కుడుకలు, చీరలు ఉంచుతారు. దర్శనమయ్యాక తల్లులకు ఈ బియ్యం సమర్పిస్తారు. వరం పట్టడం.. సంతానం లేని భక్తులు జంపన్నవాగులో స్నానమాడి కన్నెపల్లి సారలమ్మ గుడి వద్ద వరం పట్టి, ముడుపులు కడతారు. వచ్చే జాతర నాటికి సంతానం కలగాలని నిష్టతో మొక్కుకుంటారు. పూజారులు వీరిపై నుంచి దాటుతూ వెళతారు. వరంగల్‌లో బస్ పాయింట్లు మేడారం జాతరకు తరలివెళ్లే భక్తుల సౌకర్యార్థం వరంగల్ నగరంలోని హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానం, వరంగల్‌లో పాత గ్రెయిన్ మార్కెట్, కాజీపేట్‌లోని ైరె ల్వే స్టేషన్ సమీపంలో బస్సు పాయింట్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. బస్సు, రైల్వే రూట్లు రైలు మార్గాల ద్వారా వచ్చే భక్తులు వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో దిగాలి. ఈ రెండు స్టేషన్ల దగ్గర నుంచి ఆర్టీసీ మేడారం వరకు బస్సులను నడిపిస్తోంది. మేడారం జాతరకు వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా వివిధ రూట్లలో వచ్చే ఆర్టీసీ బస్సులు తాడ్వాయి మీదుగా మేడారం వెళ్తాయి. ప్రైవేటు వాహనాలు పస్రా మీదుగా మళ్లిస్తారు. వరంగల్ మీదుగా ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులు ములుగు, పస్రా మీదుగా తాడ్వాయి చేరుకుని అక్కడి నుంచి మేడారం వస్తారు. మేడారంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల దగ్గర ఆర్టీసీ బస్ స్టేషన్ ఉంది. ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు ఇల్లందు, నర్సంపేటల మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులు మల్లంపల్లి, ములుగు, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకోవచ్చు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే భక్తులు పెద్దపల్లి, మంథని, కాటారం, బోర్లగూడెం, బయ్యక్కపేటల మీదుగా మేడారం చేరుకుంటారు. కోస్తాంధ్ర, భద్రాచలం, కొత్తగూడెంల మీదుగా వచ్చే భక్తులు మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయిల మీదుగా మేడారం చేరుకోవాలి హుజురాబాద్, పరకాల మీదుగా వచ్చే బస్సులు గణపురం, జంగాలపల్లి మీదుగా తాడ్వాయి చేరుకుని మేడారం వస్తాయి. హైదరాబాద్ మీదుగా వచ్చే అన్ని బస్సులు, ప్రైవేటు వాహనాలు వరంగల్ చేరుకుని ములుగు మీదుగా మేడారం వస్తాయి. సిద్దిపేట నుంచి వచ్చే వారు జనగామ, హన్మకొండ మీదుగా మేడారం చేరాలి. పెట్రోలు బంకుల వివరాలు ప్రధానమైన వరంగల్-మేడారం దారిలో వరంగల్ నగరం దాటిన తర్వాత వచ్చే ముఖ్యమైన పెట్రోలు బంకుల వివరాలు... ఆరేపల్లి వద్ద రెండు, ఓగ్లాపూర్ వద్ద ఒకటి, గూడెప్పాడ్ వద్ద 2 , మల్లంపల్లి వద్ద 1, ములుగు వద్ద 1, జంగాలపల్లి -1, పస్రా వద్ద ఒకటి ఉన్నారుు. వివిధ కంపెనీల పెట్రోలు బంకులు అందుబాటులో ఉన్నాయి. వైద్య సేవలు వరంగల్-మేడారం రోడ్డులో వైద్యసేవలకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దామెర, ఆత్మకూరు, ప్రసా, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేటలలో ఉన్నాయి. ములుగు, ఏటూరునాగారంలలో 30 పడకల ఆస్పత్రులు ఉన్నాయి. మేడారంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ప్రత్యేక వైద్య నిపుణులు 18, వైద్యులు 300, పారామెడికల్ సిబ్బంది 600 మంది జాతర విధుల్లో పాల్గొంటున్నారు. గద్దెల సమీపంలో ఉన్న టీటీడీ కళ్యాణమంటపంలో 60 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐదుగురు గైనకాలజిస్టులు, ఐదుగురు మత్తు డాక్టర్లు, ఎనిమిది మంది మెడికల్ ఆఫీసర్లు, ఆరుగురు పిల్లల వైద్యులు, ఇద్దరు ఆర్థోపెడిక్ నిపుణులు, ఇద్దరు జనరల్ మెడిసిన్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వీరితో పాటు 20 మంది స్టాఫ్‌నర్సులు, 20 మంది ఫార్మసిస్టులు సేవలందిస్తారు. జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, నార్లాపూర్‌లో 12 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పస్రా, తాడ్వాయి, మేడారంలలో పది పడకలతో ఎమర్జెన్సీ సెంటర్లున్నాయి. 108, 104లతో ఇతర ప్రైవేటు అంబులెన్సులు కలిపి 30 అంబులెన్సులు వరంగల్ నగరం నుంచి మేడారం వరకు ప్రతీ పది కిలోమీటర్లకు ఒకటి 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఎవరెక్కడ? మేడారం జాతరలో విధులు నిర్వహించే సెక్టోరల్ అధికారులకు బీఎస్ఎన్ఎల్ నంబర్లు కేటాయించారు. జాతరలో ఏర్పాటు చేసిన ప్రతి సెక్టారుకు అవసరాన్ని బట్టి ఒకటినుంచి మూడు సిమ్‌కార్డుల వరకు ఒక్కో సెక్టారుకు కేటాయించారు. జాతర సమయంలో సమస్యలు తలెత్తితే వీరికి ఫోన్ చేయొచ్చు. కంట్రోల్ రూం: ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు-9491816299, 8332975513, ఎస్ఎస్ఏ పీవో రాజమౌళి-8332975512, డీఆర్డీఏ ఏపీడీ రాము-8332975510. ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్(మేడారం): డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్-8332975509, ఎస్డీసీ నూతి మధుసూదన్- 83329755, డీఎస్వో ఉషారాణి 8332975507, గెస్ట్‌హౌజ్: నల్లగొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.ప్రసాద రావు-8332975506 చిలకల గుట్ట వైపు టెంపుల్ ఎంట్రీ: జనగామ ఆర్డీవో వెంకటరెడ్డి 8332975505 , పోలీస్‌క్యాంప్(టెంపుల్ ఎంట్రీ): సమాచార శాఖ ఏడీ డీఎస్ జగన్ -8332975504, డీఎం మార్కెటింగ్-8332975503. దేవతల గద్దె: జడ్పీసీఈవో ఆంజనేయులు-8332975502, మహబూబాబాద్ ఆర్డీవో మధుసూదన్‌నాయక్-8332975501, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ -8332975499. గుడి నుంచి బయటకు వచ్చే దారి-1: ఎఫ్ఎస్వో నాగరాజు-8332975498 గుడి నుంచి బయటకు వచ్చే దారి-2: డీఎఫ్‌వో వెంకటేశ్వర్రావు-8332975498. ఆర్టీసీ పాయింట్: హౌసింగ్ పీడీ లక్ష్మణ్-8332975496. డీసీవో సంజీవరెడ్డి. 8332975495. బస్టాండ్ రోడ్(స్కూల్ ఎదురుగా): డీఎఫ్‌వో గంగారెడ్డి-8332975494, మార్కెటింగ్ ఈఈ బి.నాగేశ్వర్-8332975493 జంపన్న వాగు(గద్దెలవైపు): డ్వామా పీడీ హైమావతి-8332975492, బీసీ వెల్ఫేర్ అధికారి అశోక్, -8332975491, గ్రౌండ్వాటర్డీడీ ఎం.శ్రీనివాస్-8332975389, ఆర్అండ్బీ ఎస్ఈ-8332975445. జంపన్న వాగు(నార్లాపూర్ వైపు): సీపీవో బి.రాంచందర్ రావు, -8332975490 జంపన్న వాగు(పగిడిద్ద రాజు క్రాస్‌రోడ్): టెక్స్టైల్స్ ఆర్డీడీ పూర్ణచందర్రావు-8332975489, టెక్స్టైల్స్ ఏడీ రమణమూర్తి--8332975474 కన్నెపల్లి: ఎస్వో యూఎల్సీ జాన్ వెస్లీ-8332975488. ఊరట్టం: పశుసంవర్ధక శాఖ జేడీ శంకర్‌రెడ్డి.-8332975487. అతిథి గృహాలు: జిల్లా టూరిజం అధికారి శివాజి-8332975486 ఇంగ్లిష్ మీడియం స్కూల్: సోషల్ వెల్ఫేర్ డీడీ రోశన్న-8332975485, ట్రై బల్ వెల్ఫేర్ డీడీ నవీన్ నికోలస్-8332975484, జంపన్న వాగు(తప్పిపోయిన వారి కేంద్రం): ఐసీడీఎస్‌పీడీ కృష్ణజ్యోతి -8332975483 వీఐపీ, వీవీఐపీ పార్కింగ్: కురవి ఎంపిడీవో మోసెస్-8332975482, ఎన్‌వైకే అధికారి మనోరంజన్-8332975405 ఫారెస్ట్ అతిథి గృహం(పస్రా): గోవిందరావుపేట తహసీల్దార్ నాగేశ్వర్రావు-8332975481 {పాజెక్ట్ నగర్ నుంచి నార్లాపూర్: డీసీఏవో కరుణాకర్-8332975480, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ సప్తగిరి-8332975479. నార్లాపూర్-కొత్తూర్: సెట్వార్ సీఈవో పురుషోత్తం-8332975478 కొత్తూరు-జంపన్న వాగు: జిల్లా ఉపాధి అధికారి ఎం.మల్లయ్య.-8332975477 చింతల్జంక్షన్: నెడ్‌క్యాప్ ఈఈ యం. చంద్రశేఖర్‌రెడ్డి.-8332975476 ఆర్టీసీ పాయింట్ (తాడ్వాయి): ఏటూర్‌నాగారం సబ్ డీఎఫ్‌వో-8332975475 గట్టమ్మ టెంపుల్(ములుగు): వి.మోహన్‌కుమార్-8332975407, నర్సయ్య ములుగు ఎఫ్‌వో -8332975406 నార్లాపూర్-బయ్యక్కపేట: డీఎల్సీవో పూల్‌సింగ్-8332975473 ఐటీడీఏ క్యాంప్‌ఆఫీస్: ఏడీ.వెంకట్రావ్-8332975410, వి.సదానందం-8332975472 జంగాలపల్లి క్రాస్: కొత్తగూడ తహసీల్దార్ జి.రాములు.-8332975471 ఆశ్రమ పాఠశాల(తాడ్వాయి): బచ్చన్నపేట తహసీల్దార్ డీఎస్ వెంకన్న-8332975471 ఆశ్రమ పాఠశాల(ప్రాజెక్ట్ నగర్): మొగుళ్లపల్లి, డీటీ సూర్యనారాయణ-8332975469. రెడ్డిగూడెం-జంపన్నవాగు: కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్-8332975468 మీడియా సెంటర్: డీపీఆర్వో వెంకటరమణ-8332975467. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం: ములుగు ఆర్డీవో మోతీలాల్, 8332975465 మొబైల్ టీం(పస్రా-లవ్వాల): డ్వామా ఏపీడీ శామ్యేల్-8332975464. లవ్వాల-తాడ్వాయి: ఏడీఎంఏ అక్బర్- 8332975463 ఆర్టీసీ కంట్రోల్‌రూం: మొగిలయ్య-8332975462 మేడారం చెరువు: శాయంపేట ఎంపీడీవో భద్రు-8332975460 లక్నవరం చెరువు: ములుగు ఐబీ ఈఈ -8332975459 రామప్ప చెరువు: వెంకటాపూర్ తహసీల్దార్-8332975458 శివరాం సాగర్: మరిపెడ తహసీల్దార్ షఫియొద్దీన్-8332975457. ఆచార వ్యవహారాల్లో ప్రత్యేకం సమ్మక్క తల్లిని నిష్టగా కొలిచే మగ భక్తుల్లో కొందరు శివసత్తులుగా మారుతారు. వీరి జీవితం తల్లులకే అంకితం. వీరు జాతర సమయంలో ముఖానికి, కాళ్లకు పసుపు రాసుకుంటారు. చీరసారె కట్టుకుని వచ్చి తల్లులను దర్శించుకుంటారు. వీరికి అమ్మవారు పూనినప్పుడు శివాలెత్తుతారు. కోళ్లు.. మేకల బలి మేడారం జాతరలో కోళ్లు.. మేకలను తల్లులకు బలిస్తారు. అమ్మల దర్శనం అనంతరం వీటిని బలిచ్చి విందు చేసుకుంటారు. తల్లుల ప్రసాదంగా దీనిని భావిస్తారు.. మాంసానికి మద్యం, కల్లు కూడా తోడు చేసుకుంటారు. జాతరంటేనే..మందు మజా అంటారు. ఇంటిల్లిపాదీ గుడారాల వద్ద మందు చుక్క మాంసం ముక్కతో ఆనందంగా గడుపుతారు. కొబ్బరికాయలు వనదేవతలను దర్శించుకునే ముందు భక్తులు సమ్మక్క, సారలమ్మ తల్లులకు రెండు కొబ్బరికాయలు కొడతారు. ఈ సమయంలో పసుపు, కుంకుమలతో పాటు అగరొత్తులు చెల్లించి దేవతలకు మొక్కుకుంటారు. ఊయలలు అమ్మలను మొక్కుకుంటే సంతానం కలిగిన దంపతులు తమ మొక్కులను తీర్చుకునే క్రమంలో భాగంగా గద్దెల సమీపంలో ఊయలతొట్టెలను కడతారు. తమ పిల్లలు చల్లగా ఉండేలా దీవించమని మొక్కుకుంటారు. సమ్మక్క-సారలమ్మ మండలంగా తాడ్వాయి మేడారం గ్రామం తాడ్వాయి మండల పరిధిలో ఉంది. గిరిజనులు ఎప్పటి నుంచో మండలం పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 2013 డిసెంబర్లో తాడ్వాయి మండలం పేరును సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలంగా మార్చుతూ గెజిట్ విడుదలైంది. రోప్ పార్టీ పోలీసులు.. మేడారం జాతరలోనే అత్యంత కీలకఘట్టం.. చిలకలగుట్ట దిగిన సమ్మక్క తల్లిని కిలోమీటరు దూరంలో ఉన్న గద్దెల వద్దకు చేర్చడం. రోడ్డుకు ఇరువైపులా వేలసంఖ్యలో భక్తులు నిలబడి అమ్మను చూసేందుకు పోటీపడతారు. ఎదుర్కోళ్లతో మొక్కులు చెల్లించేందుకు దూసుకొస్తారు. వీరిని అదుపులో ఉంచుతూ తల్లి దారికి అడ్డం రాకుండా చూసేందుకు ప్రత్యేక రోప్ పార్టీని ఏర్పాటు చేస్తారు. సీఎం సెక్యూరిటీ స్థాయిలో ఈ రోప్ పార్టీ పని చేస్తుంది. ఆర్టీసీ సేవలు మేడారం జాతరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 1966లో మొదటిసారిగా బస్సును నడిపించింది. మొదటిసారి వంద సర్వీసులను వరంగల్-మేడారంల మధ్య తిప్పారు. ఈసారి బస్సుల సంఖ్యను 3,525కు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా 45కు పైగా పాయింట్ల నుంచి బస్సులను నడిపిస్తోంది. ఊరు రాగానే సిగమొస్తుంది మహాజాతరకు భక్తులు దూరప్రాంతాల నుంచి వివిధ మార్గాల ద్వారా మేడారం వస్తుంటారు. అయితే ములుగు దగ్గరలోని గట్టమ్మ ఆలయం నుంచే జాతర కళ కనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి మేడారం చేరుకునే లోపు భక్తులకు దేవత పూనడం ఇక్కడ చాలా సహజంగా కనిపించే దృశ్యాలు. ఆ నెలంతా పండుగే స్థానిక ఎమ్మెల్యే సీతక్క మేడారం జాతర ... ప్రతీ రెండేళ్లకు ఓసారి వచ్చే జాతర. మేడారం జాతర అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సంబురం. మిగిలిన ప్రజలకు అది నాలుగు రోజుల జాతరే కావచ్చు. కానీ ఆదివాసీలుగా మాకు అది ఎంత లేదన్నా నెలరోజుల పండుగ. మా సొంతూరు ములుగు మండలంలోని జగ్గన్నపేట. నెల రోజుల ముందు నుంచే జాతర సన్నాహాలు మొదలయ్యేవి. అప్పుడు బస్సులు ఉండేవి కావు. ఎడ్లబండ్లు లేదా కాలినడకన జాతరకు వెళ్లేవాళ్లం. జగ్గన్నపేట నుంచి బస్సాపూర్ గుట్టెక్కి, చల్వాయి, రంగాపురం, ఇప్పలగడ్డ, నార్లాపూర్ మీదుగా మేడారం వచ్చేవాళ్లం. మా ఊరి నుంచి మేడారానికి ఎంత లేదన్నా యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది. పైగా అటవీమార్గం గుండా వెళ్లాలి,క్రూర జంతువుల భయం ఉండేది. అంతా గుంపులుగుంపులుగా వెళ్లేవాళ్లం. పొద్దంతా నడక వాగుల వెంట తిండి, రాత్రి అడవుల్లోనే పడక. నిజంగా ఇరవై ముప్పైఏళ్లలోనే ఊహించనంత మార్పు చోటు చేసుకుంది. ఒక్కరోజుల్నే హన్మకొండ నుంచి మేడారం వచ్చి పోతున్న. అయితే ఆ రోజుల్లో ఇప్పటిలా సౌకర్యాలు లేకున్నా సంతృప్తి ఉండేది. ఇప్పుడు బాగా అభివృద్ధి జరిగింది. దాంతో పాటే జాతరలో పరాయీకరణ పెరిగిపోతుంది. కంకవనాల పందిళ్లు పోయి టార్పాలిన్లు, టెంట్లు వచ్చినై. పచ్చదనం కనుమరుగై పోతాంది. దారికి అడ్డంగా జాతరలో వివిధ రకాల మొక్కులు ఉన్నా అందర్నీ విశేషంగా ఆకర్షించేది అమ్మల దారికి అడ్డంగా భక్తులు పడుకోవడం. కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెలకు తీసుకురావడం, గద్దెలపై నుంచి సమ్మక్కను చిలకలగుట్టకు చేర్చే క్రమంలో దారికి అడ్డంగా భక్తులు పడుకుంటారు. ఆ తల్లులు తమ మీదుగా వెళితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా పూర్తిగా ఎప్పుడూ సఫలం కాలేకపోవడం భక్తుల శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. జెండాలే జనం గుర్తులు సారలమ్మ వచ్చే రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు జాతర ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంతగా జనం ఉంటారు. ఆ సమయంలో తమ కుటుంబ సభ్యులు ఎవరూ తప్పిపోకుండా అందరికీ దిక్సూచిలా ఉండేలా ఓ జెండాను ఏర్పాటు చేసుకుంటారు భక్తులు. కుటుంబంలో ఎత్తుగా ఉండే వ్యక్తి జెండా పట్టుకుని నడుస్తుంటే మిగిలిన సభ్యులు ఆ జెండాను అనుసరిస్తారు. జెండా కూల్డ్రింక్సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, టవళ్లు, కర్చీఫ్, సబ్బు రేపర్లు ఇలా రకరకాల వస్తువులను ఉపయోగిస్తారు. తుపాకులు పేలుస్తూ.. చిలకలగుట్ట నుంచి సమ్మక్క కిందికి దిగిరావడం అనేది జాతరలో అత్యం త ఉద్విగ్నభరిత క్షణం. కొన్ని లక్షల కళ్లు ఈ అపురూప దృశ్యాన్ని కళ్లారా చూసేందుకు ఎదురు చూస్తారు. ఆ సెంటిమెంట్ ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల ఆరాధ్యదైవమైన సమ్మక్కకు ప్రభుత్వం గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలుకుతారు. 1996 నుంచి ఇది కొనసాగుతోంది. -
మహా సంబురం
వనమెల్లా జనం..నిలువెల్లా బంగారం గిరి‘జన’జాతరకు వందనం సల్లంగ సూడు తల్లీ.. మేడారం.... గిరిజన సంప్ర దాయానికి నిలువెత్తు ప్రతిరూపం. ఆ అడవి ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యం. రాజరికపు పాలనపై దండెత్తిన చారిత్రక నేపథ్యం. పన్నులు కట్టబోమని తెగేసి చెప్పిన ధీరత్వం ఆ నేల సొంతం. కాకతీయుల పాలనపై కత్తిదూసిన సమ్మక్క, సారలమ్మలు అడవి బిడ్డల ఆరాధ్య దైవాలు. రెండేళ్ల కోసారి ఈ ఇలవేల్పులను కొలిచే జాతరే మేడారం ప్రత్యేకం. అరవై గుడిసెల సమాహారం ఆ నాలుగురోజుల్లో మహానగరమవుతుంది. కోటి అడుగుల చప్పుడవుతుంది. కోయగూడెం ఎర్రరేగడి మట్టితో సింగారించుకుంటుంది. ఒక్కో రోజు ఒక్కో సన్నివేశానికి సంతకమవుతుంది. ఊరేగింపుగా వచ్చే జనంతో అక్కడ ఓ ఉద్వేగం. ఆరాధ్య దైవాలను మొక్కుకునే తీరు ఓ మహా సన్నివేశం. సబ్బండ వర్ణాలు ఒక్కచోట చేరే క్షణం అనిర్వచనీయం. కనిపించని దైవాల కోసం కదిలివచ్చే జనంతో జంపన్న వాగు జనసంద్రమవుతుంది. అమ్మల కోసం ఊరూ వాడా కదిలొస్తుంది. చిలకల గుట్టవైపు పరుగులు తీసే జనంతో కిక్కిరిసి పోతుంది. శివ్వాలెత్తే శివసత్తుల పూనకాలతో చెట్టూ పుట్టా ఊగిపోతాయి. అడవిని ముద్దాడుతూ లక్షలాది అడుగులు వెంట నడుస్తాయి. సామూహికత సాక్షాత్కరిస్తుంది. దుబ్బ కొట్లాడుతుంది... సంప్రదాయం తిరుగాడుతుంది. నెత్తుటి జ్ఞాపకాలు కళ్లెదుటే కనబడుతాయి... పురా ఆత్మలు సంభాషిస్తాయి. నెమలినార చెట్టు నేనున్నానంటూ పలకరిస్తుంది. కొంగు బంగారం కొలువుదీరుతుంది. కుంకుమ భరిణె ఇంటింటి చుట్టమై వస్తుంది. దండ కారణ్యం దండం పెడుతుంది. పసుపు వర్ణ శోభితమై పీతాంబ రమవుతుంది. బెల్లం నైవేద్యమ వుతుంది. అమ్మల రాక చీకటిని చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్ముతుంది. భావోద్వేగం కట్టలు తెంచుకుంటుంది. జయజయ ధ్వానాలు మార్మోగుతాయి. సల్లంగా సూడు తల్లీ అంటూ శరణు ఘోషలతో దిక్కులు పిక్కటిల్లుతాయి. - మేడారం నుంచి పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్ మొదటి రోజు సారలమ్మ ఆగమనం... కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. సమ్మక్క కూతురైన సారమ్మ నివాసం కన్నెపల్లి. సారలమ్మ ఫిబ్రవరి 12న బుధవారం సాయంత్రం గద్దె వద్దకు చేరుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే కన్నెపల్లి నుంచి సారలమ్మ వడ్డెలు(పూజారులు) మేడారంలోని గద్దెల వద్దకు వచ్చి, ముగ్గులు వేసి మళ్లీ కన్నెపల్లిలోని పూజా మందిరానికి వెళ్తారు. అక్కడ రెండుగంటలపాటు గోప్యంగా పూజలు నిర్వహిస్తారు. కడుపు పండాలని కోరుకునేవారు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వేలమంది భక్తులు తడి బట్టలతో గుడి ఎదుట సాష్టాంగ ప్రణామాలతో వరం పడతారు. దేవత రూపాన్ని చేతపట్టుకుని గుడి బయటకు వచ్చిన పూజారులు వరం పడుతున్న వారి పైనుంచి నడిచి వెళతారు. ఆ సారలమ్మే తమపై నుంచి వెళుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని తీసుకొస్తున్న వడ్డెను దేవదూతగా భావిస్తారు. గ్రామ మహిళలు మంగళహారతులు ఇచ్చి, నీళ్లారబోసి కొబ్బరికాయలు కొడుతూ మేడారానికి సారలమ్మను సాగనంపుతారు. అక్కడినుంచి సారలమ్మ జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు చేరుకుంటారు. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. సారలమ్మ సహా వీరి ముగ్గురికి అక్కడ వడ్డెలు ప్రతిష్టిస్తారు. రెండో రోజు సమ్మక్క ఆగమనం... జాతరలో రెండో రోజైన గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది. ఉదయం ఆరు గంటల నుంచే కార్యక్రమం మొదలవుతుంది. మొదట వడ్డెలు చిలకలగుట్టకు వెళ్లి వనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేస్తారు. సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు(పసిడి కుండలు)ను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. మళ్లీ చిలకలగుట్టకు వెళతారు. మధ్యాహ్నం మూడు గంటలకు సమ్మక్కను గద్దెలపైకి తీసుకు వచ్చే ప్రక్రియ మొదలవుతుంది. చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. జాతర మొత్తానికి ప్రధాన ఘట్టం ఇదే. సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తల్లికి ఆహ్వానం పలుకుతూ చిలకలగుట్ట వద్దకు వెళతారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె తన్మయత్వంతో ఒక్క ఉదుటున పరుగులు తీస్తాడు. వందల మంది పోలీసులు అతడికి రక్షణగా ఉంటారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్చి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్కకు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకుతారు. ప్రత్యేక పూజల అనంతరం కుంకుమ భరిణెను గద్దెలపైకి చేర్చుతారు. మూడో రోజు గద్దెలపై తల్లులు... గద్దెలపై ఆసీనులైన సమ్మక్క-సారలమ్మలు మూడోరోజు శుక్రవారం అశేష భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. కోర్కెలు తీరినవారు కానుకలు చెల్లిస్తారు. నిలువుదోపిడీ ఇస్తారు. వన దేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపుకుంకుమలు, చీరెసారెలు పెడతారు. ఒడి బియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. ఎత్తు బంగారం(బెల్లం) నైవేద్యంగా పెడతారు. కట్టలు తెంచుకున్న భక్తితో ఉరకలెత్తుతున్న జనంతో మేడారం పరిసరాలు సందడిగా మారుతాయి. ఈ రోజంతా లక్షలాది మంది గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుంటారు. వీరితో గద్దెల ప్రాంగణాలు జనసంద్రమవుతాయి. జాతరలో మేడారానికి ఇదే రోజు ఎక్కువ మంది వస్తారు. నాలుగో రోజు దేవతల వన ప్రవేశం... నాలుగో రోజు సమ్మక్కను చిలకల గుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. మొక్కులు తీర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అశేష భక్తజనానికి దర్శనం ఇచ్చిన సమ్మక్క-సారలమ్మలు నాలుగో రోజు శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తారు. దేవతలను గద్దెలపైకి చేర్చేక్రమంలో రక్షణ కల్పించిన విధంగానే పోలీసులు వన ప్రవేశం సమయంలోనూ కట్టుదిట్టమైన రక్షణతో వనాలకు సాగనంపుతారు. సమ్మక్కతల్లి చిలకలగుట్టపైకి, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లిన అనంతరం భక్తులు ఇళ్లకు తిరుగు పయనమవుతారు. దైవాన్ని తెచ్చే చేతులు ..ఆ ఇద్దరు వీరే! నిష్ఠతో ఒక్కపొద్దు ఉంట... గుడిమెలిగె పండుగతో సమ్మక్క-సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. జాతర మొదలయ్యేది మండెమెలిగె పండుగతోనే. ఈ పండుగ రోజు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లిని గద్దెలపైకి చేర్చే వరకు నియమనిష్ఠలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపళ్లు తీసుకుంటాం. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటాం. సమ్మక్క, సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహ అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. మండెమెలిగె పండుగ నాటి నుంచే నిష్ఠతో ఒక్క పొద్దు ఉంటా ను. ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని, తమ కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పనిని తల్లి చేసిపెడుతుంది. - కొక్కెర కృష్ణయ్య, సమ్మక్క ప్రధాన వడ్డె ఏం జరుగుతుందో తెలియదు... సారలమ్మను గద్దెకు తీసుకురావడానికి రెండు రోజుల ముందు నుంచే అదోలా ఉంటుంది. సరిగ్గా వారం రోజుల ముందు.. మండమెలిగె పండుగ నుంచి సారలమ్మ పూనినట్లుగా అనిపిస్తుంటుంది. సారలమ్మను తీసుకెళ్లేరోజు ప్రత్యేక పూజలు చేస్తున్న సమయంలోనే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. సమ్మక్క ఆలయంలో సారలమ్మను చేర్చి పూజలు చేస్తున్న సమయంలో కొంత తెలివి వస్తుంది. మళ్లీ అక్కడి నుంచి గద్దెపైకి చేర్చే సమయానికి తన్మయత్వంలో ఉంటాను. గద్దెలపై ప్రతిష్టించిన తర్వాత నెమ్మదినెమ్మదిగా మైకం వీడుతుంది. - కాక సారయ్య, సారలమ్మ ప్రధాన వడ్డె -
అడవిలో అమ్మలు మేడారం
సుమారు 80 గడపలు ఉంటారుు. ఇక్కడి ఆదివాసీ గిరిజనులు అటవీ ఉత్పత్తుల సేకరణ, సంప్రదాయ వ్యవసాయం చేస్తూ పొట్టపోసుకుంటారు. 400లోపు జనాభా ఉంటుంది. సాధారణ సమయాల్లో ఏమీ దొరకని ఇక్కడ.... జాతర సమయంలో దొరకని వస్తువు అనేది ఉండదు. జాతర జాతరకూ వృద్ధి చెందుతూ వస్తున్న భక్తలోకమే ఇందుకు కారణం. ఇక మేడారం గద్దెలది అత్యంత ప్రత్యేకం. గ్రామం మధ్యలో అన్నట్లు ఉండే ఈ గద్దెలపైకి అమ్మలు చేరడంతో జాతర ఆవిష్కృతమవుతుంది. గ్రామానికి ఈశాన్యం దిక్కున ఉన్న చిలకలగుట్టపై సమ్మక్క కొలువై ఉంది. దీన్ని అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. జాతర సమయంలో ఇక్కడ విడిది చేసేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. వారం ముందు నుంచే ఈ పరిసరాలు రద్దీగా మారుతాయి. కన్నెపల్లి సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో సుమారు 50 కుటుంబాలు.. 200 మంది జనాభా ఉంటుంది. పడమరన ఉన్న ఆలయంలో సారలమ్మ కొలువై ఉంది. ఇక్కడి ఆదివాసీలకు ఏం చేయాలన్నా.. సారలమ్మ ఆశీర్వాదం తప్పనిసరి. మా వెన్నెలక్కకు సెప్పకుంటే ఇగ అంతే. అమ్మో.. సారక్కకు చెప్పి సేత్తమంటారు ఆదివాసీలు. జాతర ఆరంభ ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. కన్నెపల్లి ఆలయం నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెకు చేర్చడంతో తొలిఘట్టం ఆవిష్కరించబడుతుంది. ఈ దారిలో తల్లిని మనసారా చూసేందుకు భక్తలోకం ఇక్కడ విడిది చేసేందుకు ఆరాటపడతారు. వడ్డెలు తల్లిని తీసుకొచ్చే ఘట్టాన్ని కనులారా చూసేందుకు ఆసక్తి చూపుతారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టంతో జాతర పతాకస్థాయికి చేరుతుంది. మేం పందిట్లో ఉంటాం జాతరకొచ్చే భక్తులను మంచిగ చూసుకుంటం. మా ఇల్లు వారికే ఇస్తం. మా ఇంటికీ సుట్టాలొస్తరు. తల్లుల దర్శనానికి వచ్చేటోళ్లకు ఇస్తమని వాళ్లకూ తెలుసు. మా దగ్గరకొచ్చేటోళ్లకు కాసింత చోటిస్తే మంచిగన్పిస్తది. - జయపాల్‌రెడ్డి, మేడారం వాళ్లూ సుట్టాలే... జాతరకు మా సుట్టాలను పిలుసుకుంటం. వారినెట్ల సూసుకుంటామో... తల్లుల దర్శనానికి వచ్చే భక్తులను అట్లనే సూసుకుంటం. మా ఇంటి కాడి జాగిస్తం. వాళ్లు కూడా ఎంతో కొంత ఇస్తరు. - కాక సాయమ్మ, కన్నెపల్లి ఆ మూడ్రోజులు భక్తులే చుట్టాలు జాతరకు వచ్చే మూడు రోజులు భక్తులే మాకు చుట్టాలవుతారు. భక్తులు విడిది చేసేందుకు మా ఇళ్లను అద్దెకిచ్చి కుటుంబ సభ్యులమంతా వాకిట్లోనే సేదదీరడం సంతోషంగా ఉంటుంది. రెండేళ్లకోసారి జరిగే జాతరకు వచ్చిన భక్తులతో ఆ మూడు రోజులు కలసిమెలసి ఉండడం మాకు ఎంతో ఆనందం. - నాలి సావిత్రి, రెడ్డిగూడెం