
అడవిలో అమ్మలు మేడారం
సుమారు 80 గడపలు ఉంటారుు. ఇక్కడి ఆదివాసీ గిరిజనులు అటవీ ఉత్పత్తుల సేకరణ, సంప్రదాయ వ్యవసాయం చేస్తూ పొట్టపోసుకుంటారు. 400లోపు జనాభా ఉంటుంది. సాధారణ సమయాల్లో ఏమీ దొరకని ఇక్కడ.... జాతర సమయంలో దొరకని వస్తువు అనేది ఉండదు. జాతర జాతరకూ వృద్ధి చెందుతూ వస్తున్న భక్తలోకమే ఇందుకు కారణం. ఇక మేడారం గద్దెలది అత్యంత ప్రత్యేకం. గ్రామం మధ్యలో అన్నట్లు ఉండే ఈ గద్దెలపైకి అమ్మలు చేరడంతో జాతర ఆవిష్కృతమవుతుంది. గ్రామానికి ఈశాన్యం దిక్కున ఉన్న చిలకలగుట్టపై సమ్మక్క కొలువై ఉంది. దీన్ని అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. జాతర సమయంలో ఇక్కడ విడిది చేసేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. వారం ముందు నుంచే ఈ పరిసరాలు రద్దీగా మారుతాయి.
కన్నెపల్లి
సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో సుమారు 50 కుటుంబాలు.. 200 మంది జనాభా ఉంటుంది. పడమరన ఉన్న ఆలయంలో సారలమ్మ కొలువై ఉంది. ఇక్కడి ఆదివాసీలకు ఏం చేయాలన్నా.. సారలమ్మ ఆశీర్వాదం తప్పనిసరి. మా వెన్నెలక్కకు సెప్పకుంటే ఇగ అంతే. అమ్మో.. సారక్కకు చెప్పి సేత్తమంటారు ఆదివాసీలు. జాతర ఆరంభ ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. కన్నెపల్లి ఆలయం నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెకు చేర్చడంతో తొలిఘట్టం ఆవిష్కరించబడుతుంది. ఈ దారిలో తల్లిని మనసారా చూసేందుకు భక్తలోకం ఇక్కడ విడిది చేసేందుకు ఆరాటపడతారు. వడ్డెలు తల్లిని తీసుకొచ్చే ఘట్టాన్ని కనులారా చూసేందుకు ఆసక్తి చూపుతారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టంతో జాతర పతాకస్థాయికి చేరుతుంది.
మేం పందిట్లో ఉంటాం
జాతరకొచ్చే భక్తులను మంచిగ చూసుకుంటం. మా ఇల్లు వారికే ఇస్తం. మా ఇంటికీ సుట్టాలొస్తరు. తల్లుల దర్శనానికి వచ్చేటోళ్లకు ఇస్తమని వాళ్లకూ తెలుసు. మా దగ్గరకొచ్చేటోళ్లకు కాసింత చోటిస్తే మంచిగన్పిస్తది. - జయపాల్‌రెడ్డి, మేడారం
వాళ్లూ సుట్టాలే...
జాతరకు మా సుట్టాలను పిలుసుకుంటం.
వారినెట్ల సూసుకుంటామో... తల్లుల దర్శనానికి వచ్చే భక్తులను అట్లనే సూసుకుంటం. మా ఇంటి కాడి జాగిస్తం. వాళ్లు కూడా ఎంతో కొంత ఇస్తరు.
- కాక సాయమ్మ, కన్నెపల్లి
ఆ మూడ్రోజులు భక్తులే చుట్టాలు
జాతరకు వచ్చే మూడు రోజులు భక్తులే మాకు చుట్టాలవుతారు. భక్తులు విడిది చేసేందుకు మా ఇళ్లను అద్దెకిచ్చి కుటుంబ సభ్యులమంతా వాకిట్లోనే సేదదీరడం సంతోషంగా ఉంటుంది. రెండేళ్లకోసారి జరిగే జాతరకు వచ్చిన భక్తులతో ఆ మూడు రోజులు కలసిమెలసి ఉండడం మాకు ఎంతో ఆనందం.
- నాలి సావిత్రి, రెడ్డిగూడెం