దుమ్ముగూడెం, న్యూస్‌లైన్ : డెంగీ లక్షణాలతో మండలంలోని బట్టిగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ గిరిజనుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బట్టిగూడేనికి చెందిన మడకం శంకర్(30) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతనిని డెంగీ జ్వరం రావడంతో చికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి యధావిథిగా పొలం పనులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్తున్నాడు.
పది రోజుల క్రితం తిరిగి జ్వరం రావడంతో స్థానిక ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు. కానీ రోజురోజుకు జ్వరం పెరుగుతూ నీరసిస్తుండడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు లక్ష్మీనగరం తరలించి వైద్యం చేయిస్తుండగా పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతనిని భద్రాచలం తరలించగా అక్కడ మృతి చెందాడు. శంకర్‌కు భార్య సమ్మక్కతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం సమ్మక్క ఆరు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు.
శంకర్ బాబాయికీ బ్రెయిన్ మలేరియా..
డెంగీ లక్షణాలతో మృతి చెందిన శంకర్ బాబాయి పూ నెం కృష్ణకు బ్రెయిన్ మలేరియా జ్వరంతో బాధపడుతున్నాడు. మూడు రోజులలుగా జ్వరం వస్తుండడంతో స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. అదే గ్రామంలో జలకం భద్రయ్య అనే గిరిజనుడు కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు.
డెంగీ లక్షణాలతో గిరిజనుడి మృతి
Published Sun, Jan 12 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement