dengue symptoms
-
కోవిడ్ మూడో వేవ్ ముంగిట.. పులి మీద పుట్ర! జర జాగ్రత్త
కరోనా అన్నది సీవోవీ–2 వైరస్‌తో వచ్చినట్టే డెంగీ కూడా డెంగీ వైరస్ వల్ల వ్యాపించే ఒక రకం వైరల్ జ్వరం. ఏడిస్ ఈజిపై్ట అనే టైగర్ మస్కిటో ఈ వైరల్ జ్వరాన్ని వ్యాప్తి చేస్తుంది. చాలా వైరల్ జ్వరాల్లాగే ఇది తనంతట తానే తగ్గిపోయే జ్వరం. కాకపోతే ప్లేట్లెట్స్ విపరీతంగా తగ్గిపోవడం వల్ల కొందరిలో ఇది ప్రమాదకరంగా మారవచ్చు. అలాంటివారిలో మినహా మిగతావారిలో ఇది అంత ప్రమాదం కాదు. అయితే డెంగీ కారణంగా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్న వారు, బీపీ పడిపోతున్నవారు, చిగుళ్లలోగానీ లేదా అంతర్గతంగాగాని రక్తస్రావం అవుతున్నవారు (ఇలా జరిగినప్పుడు మలం నల్లగా వస్తుంది), లేదా స్పృహతప్పిపోయినా... వారు హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోవాల్సిందే. అందుబాటులో వ్యాక్సిన్ ఉన్నప్పటికీ: డెంగీకి టీకా (వ్యాక్సినేషన్) ఉంది. అయితే ఈ టీకాను గతంలో డెంగీ వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే మొదటిసారి కంటే రెండోసారి డెంగీ (సెకండరీ డెంగీ ఇన్ఫెక్షన్) రావడం చాలా ప్రమాదకరం కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిబంధనను విధించింది. డెంగీలో జ్వరం వచ్చి తగ్గాక వ్యాధి పూర్తిగా తగ్గిందని అనుకోకూడదు. నిజానికి ప్లేట్లెట్స్ తగ్గడం అన్నది జ్వరం తగ్గాకే మొదలవుతుంది. అందుకే ప్లేట్లెట్స్ తగ్గి, మళ్లీ నార్మల్కు వచ్చాక మాత్రమే డెంగీ తగ్గిందని అనుకోవాలి. డెంగీలో కనిపించే లక్షణాలేమిటి? ప్లేట్ లెట్స్ తక్కువైన కారణాన అంతర్గత అవయవాల్లో ఆగకుండా రక్తస్రావం కారడమనే ప్రమాదకరమైన లక్షణమే కాకుండా కొందరిలో ఒంట్లోని నీరు, లవణాల మోతాదు బాగా తగ్గిపోవడం (సివియర్ డీహైడ్రేషన్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఎర్రరక్తకణాల సాంద్రత (హీమోగ్లోబిన్ కాన్సంట్రేషన్) పెరుగుతుంది. హెమటోక్రిట్ పెరుగుతుంది. కొంతమందిలో కడుపులో, ఊపిరితిత్తుల పొరల్లో నీరుచేరుతుంది. దీన్ని క్యాపిల్లరీ లీక్ అంటారు. ఇది మరింత వేగంగా, తీవ్రంగా (అగ్రెసివ్‌గా) చికిత్స అవసరమైన కండిషన్. బీపీ తగ్గడం వల్ల రక్తపోటు పడిపోతుంది. జబ్బు తీవ్రంగా ఉంటే కొందరిలో లివర్, మూత్రపిండాలూ దెబ్బతినవచ్చు. ఆగకుండా రక్తస్రావం కావడం, ఫిట్స్ రావడం సంభవించి మెదడు కూడా దెబ్బతినవచ్చు. కొందరిలో గుండె స్పందనలు (హార్ట్‌బీట్) 60 కంటే తక్కువకు పడిపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి బాధితులకు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాలి. నిర్ధారణ పరీక్షలు : ప్లేట్లెట్స్ తగ్గిన సందర్భాల్లో ప్రతి 24 గంటలకు ఒకసారి రక్తపరీక్ష (సీబీపీ) చేయాలి. డెంగీ ఎన్ఎస్1 (స్క్రీనింగ్), ఐజీఎమ్, ఐజీజీ పరీక్షలు (నిర్ధారణ కోసం) అవసరం కావచ్చు. ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనేది డెంగీ నిర్ధారణకు పెద్ద పెద్ద మెడికల్ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉండే అత్యాధునికమైన నిర్ధారణ పరీక్ష. అయితే ఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో రిపోర్టులు వచ్చేసరికి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున, వాటికోసం వేచిచూడకుండా లక్షణాల ఆధారంగానే చికిత్స కొనసాగించాలి. చికిత్స: డెంగీ అన్నది వైరస్‌తో వచ్చేది కాబట్టి దానికంటూ మందులు లేవు. లక్షణాల ఆధారంగా చికిత్స అందించాలి. అంటే డీ హైడ్రేషన్‌కు నోటి ద్వారా ఓఆర్ఎస్ వంటివి ఇస్తూ ఉండాలి. పరిస్థితి మరీ విషమిస్తే రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ అందించాలి. రక్తస్రావం జరుగుతుంటే అవసరాన్ని బట్టి రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) ఇవ్వాలి. ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేలు – 15 వేలకు పడిపోతే ప్లేట్లెట్స్ ఇవ్వడం తప్పనిసరి. డెంగీ జ్వరానికి సాధారణ జ్వరం వచ్చిన వారికిలా ఆస్పిరిన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబరుస్తుంది కాబట్టి రక్తస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. నివారణ ఎంతో మేలు... ఎందుకంటే? అన్ని వ్యాధుల లాగే డెంగీకి కూడా చికిత్స కంటే నివారణ మేలు. డెంగీని కలిగించే టైగర్ దోమ సాధారణంగా పట్టపగలే కుడుతుంటుంది. నిల్వ ఉండే మంచి నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఇంట్లోని మూలల్లోని చీకటి / చల్లని ప్రదేశాల్లో ఆవాసం ఏర్పరచుకుంటుంది. అందుకే పగలు అవి కుట్టకుండా ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. నీళ్లు ఎక్కడా నిల్వ కాకుండా చూసుకోవాలి. ఇల్లంతా గాలి వెలుతురు వచ్చేలా జాగ్రత్తపడాలి. - డాక్టర్ కె. శివ రాజు, సీనియర్ ఫిజీషియన్ -
అనంతపురం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ
అనంతపురం : అనంతపురం జిల్లాలో 144 డెంగీ, 506 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నతాధికారులు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. గత ఎనిమిది మాసాలుగా విషజ్వరాలతో 15 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలో రెండు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్ఎంపీ క్లీనిక్‌లు మూసివేశారు. మురికివాడల్లో శుభ్రతపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. -
‘డెంగీ’ పరీక్షే..! .
విజయనగరంఫోర్ట్ : ఎస్.కోట మండలానికి చెందిన ఎం.సతీష్ అనే 14 ఏళ్ల బాలుడికి డెంగీ లక్షణాలు కనిపించాయి. ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబొరేటరీకి వెళ్లడంతో డెంగీ టెస్టింగ్ కిట్లు లేవని చెప్పారు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ల్యాబొరేటరీలో పరీక్ష చేయించారు. పరీక్షల్లో డెంగీ వ్యాధి ప్రాథమిక దశలో ఉందని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆ బాలుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పరిస్థితి ఈ ఒక్క బాలుడికే మాత్రమే ఎదురైంది కాదు. డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్ష కోసం వచ్చే రోగులందరిదీ. డెంగీ వ్యాధిని నిర్ధారించే ఎలిసా టెస్ట్‌ను కేంద్రాస్పత్రిలో ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో ఎక్కడ డెంగీ అనుమానిత లక్షణాలు గల రోగులున్నా నిర్ధారణ కోసం ఇక్కడికే పంపిస్తారు. అయితే ప్రస్తుతం కిట్లు లేకపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబొరేటరీలను ఆశ్రయించాల్సిన దుస్థితి. ఇండెంట్ పెట్టి 15 రోజులయినా.. డెంగీ వ్యాధి నిర్ధారణ కిట్లు కావాలని కేంద్రాస్పత్రి ల్యాబొరేటరీ సిబ్బంది ఇండెంట్ పెట్టి 15 రోజులైనా కిట్లు ఇంతవరకు సరఫరా చేయని దుస్థితి. దీనిని బట్టి ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ప్రైవేటు ల్యాబొరేటరీలో రూ.800 వరకు వసూలుడెంగీ పరీక్షలకు ప్రైవేటు ల్యాబొరేటరీలో రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో నిరుపేదలకు ఇది తలకు మించిన భారమైనప్పటికీ గత్యంతరం లేక పరీక్ష చేయించాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని డీసీహెచ్ఎస్ కె. సీతారామరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా డెంగీ నిర్ధారణ కిట్ల కొరత ఉన్నట్టు తనకు ఇప్పుడే తెలిసిందని, త్వరగా వచ్చేటట్టు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
డెంగీ లక్షణాలతో విద్యార్థిని మృతి
తంబళ్లపల్లి (చిత్తూరు): డెంగీ వ్యాధి లక్షణాలతో తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న ఏడవ తరగతి విద్యార్థిని బుధవారం మృతి చెందింది. తంబళ్లపల్లికి చెందిన డి.సాంబచారి కుమార్తె పూజిత స్థానిక మోడల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతోంది. జ్వరంతోపాటు ప్లేట్లెట్ పడిపోవడం, తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో ఆమెను మూడు రోజుల క్రితం తిరుపతిలోని స్విమ్స్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది. -
వణికిస్తున్నడెంగీ
నవీపేట్/ మాక్లూర్/ భిక్కనూరు: జిల్లాను డెంగీ వణికిస్తోంది. రోజూ ఎక్కడో ఓ చోట డెంగీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామం లో లావణ్య (19) అనే యువతి తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు రెండ్రోజుల క్రితం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు డెం గీ సోకినట్లు నిర్ధారించారు. మాక్లూర్ గ్రామానికి చెందిన లతీఫ్ (42)కు డెంగీ సోకిందని మోడల్ ఆస్పత్రి వైద్యాధికారి సంజీవ్‌రెడ్డి తెలిపా రు. ఈనెల ఒకటో తేదీ నుంచి తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న లతీఫ్‌ను కుటుంబ సభ్యులు నాల్గవ తేదీన జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం మాక్లూర్ వైద్యాధికారి రవీందర్‌రెడ్డి, ఎస్‌యూఓ కృష్ణమూర్తి, సూపర్వైజర్ ప్రవీణ్‌రెడ్డి, సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఓ యువతికి కూడా డెంగీ లక్షణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. పసుల సౌంద ర్య వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైంది. రామాయంపేట ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆమెకు రెండు రోజుల పాటు చికిత్స చేసి ఇంటికి పంపించారు. మ రుసటి రోజు సౌందర్య తిరిగి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కామారెడ్డిలోని ప్రైవే ట్ అసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు డెంగీ సోకినట్టు నిర్ధారించారు. -
జ్వర విలయం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. భద్రాచలం మండలం గుండాల కాలనీ... బూర్గంపాడు మండలం అంజనాపురం...కొత్తగూడెం మండలం రాఘవాపురం ... రఘునాథపాలెం మండలం చిమ్మపూడి, తిరుమలాయపాలెం మండలం పాపాయిగూడెం...సత్తుపల్లి మండలం రామానగరం... ఇలా జిల్లా వ్యాప్తంగా రోజూ ఏదో ఒక మూల విషజ్వరాల బారిన పడి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. గత నెలరోజులుగా జిల్లాలో ఏదో చోట డెంగ్యూ లేదా విషజ్వరాలకు సంబంధించిన కేసులు నమోదు కాని రోజు లేదు. విషజ్వరాలతో నెలరోజుల్లో దాదాపు 50 మంది చనిపోయారంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరే కాక అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లో వందల మంది విషజ్వరాల లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. జిల్లా నలుమూలలా గ్రామాలకు గ్రామాలే విషజ్వరాలతో అల్లాడుతున్నాయి. ఇంతకాలం ఏజెన్సీకే పరిమితమైన ఈ జ్వరాలు ఈ ఏడాది మైదాన ప్రాంతాన్ని కూడా హడలెత్తిస్తున్నాయి. భద్రాచలం ఏజెన్సీ పరిధిలో చేపట్టిన అధ్యయనాన్ని పరిశీలిస్తే ‘ఆర్బో’ అనే కొత్తరకం వైరస్ కారణంగా ఈ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్యశాఖ వర్గాలంటున్నాయి. జ్వరాలు ఇంత తీవ్రంగా ఉన్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ఫలానా గ్రామంలో జ్వరం వచ్చిందని పత్రికల్లో వచ్చిన మరుసటి రోజు అక్కడికి వెళ్లి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకోవడం మినహా, జిల్లాలో విషజ్వరాలను నియంత్రించేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఇలంబరితి ప్రత్యేక చొరవ తీసుకుని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా జిల్లాను జ్వరగండం నుంచి బయటపడేయాలని ప్రజానీకం కోరుతోంది. ఇంత జరుగుతున్నా... జిల్లాలో పెద్ద ఎత్తున విషజ్వరాలు, మలేరియా, డెంగీ కేసులు నమోదయి ప్రజలు మృత్యువాత పడుతున్నా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో ఎప్పుడూ ఉండే ఈ జ్వరాల అదుపునకు శాశ్వత ప్రణాళికలు రూపొందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఏయేటికాయేడు అయినా చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది. జిల్లాలోని 69 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో 45 కేంద్రాలను ఇప్పటికే డేంజర్‌జోన్‌గా గుర్తించారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలోని 1000కిపైగా గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మలేరియా కేసులు నమోదయ్యే చింతూరు మండలం తులసిపాక పీహెచ్సీ పరిధిలో కూడా పారిశుధ్య కార్యక్రమాలు, డ్రైనేజీల నిర్వహణ, దోమతెరల పంపిణీలాంటి కార్యక్రమాలు మొక్కుబడిగానే సాగా యి. జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ రక్షిత మంచినీరు అందడం లేదు. నీటి కాలుష్యం వల్లనే విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్య వర్గాలు చెపుతున్నా.. ముందస్తు ప్రణాళిక లేక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఈ విషయంలో విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు దోమల నివారణ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండడమే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు దోమతెరలు పంపిణీ కాలేదు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. డ్రైనేజీలను శుభ్రపరిచేందుకు గ్రామీణ ప్రాంతాలకు నిధులు వెచ్చించడం లేదు. జ్వరం బారిన ఓ గ్రామం పడి అల్లాడుతోందని పత్రికల్లో వస్తున్న వార్త చూసి అధికారులు అక్కడికి వెళ్లి ఆదరాబాదరాగా ఏవో చర్యలు తీసుకుంటున్నారే తప్ప జ్వరాలను అదుపుచేసేలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇదే విషయమై జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుతీరిన రోజే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. కాగా, జ్వరాలతో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతోంది. అయితే ఏజెన్సీలో అత్యధికంగా విషజ్వరాలు నమోదవుతున్నా.. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో కనీసం ప్లేట్‌లెట్స్‌ను నిర్ధారించే పరీక్ష జరిపే పరికరాల్లేవు. జ్వరం రాగానే రక్తనమూనాలను ఖమ్మం తీసుకొచ్చి పరీక్ష చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ ప్లేట్‌లెట్స్‌ను నిర్ధారించే పరీక్ష నిర్వహించే పరికరాలను జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఏజెన్సీ గిరిజనులు, జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు. జ్వరంకాటుకు బలైన వారి వివరాలు నియోజకవర్గాల వారీగా... పినపాక నియోజకవర్గంలోని గత నెల రోజులుగా డెంగ్యూ, విషజ్వరా బారిన పడి సుమారు 8మందిమృతి చెందినారు. బూర్గంపాడు మండలం అంజనాపురంలో తేజావత్ సక్కుబాయి(52), పల్లపు నర్సింహా(55), అశ్వాపురం మండలం గొల్లగూడెంలో విష్ణువర్దన్(8), మణుగూరు మండలం చిక్కుడుగుంటలో మైపా స్పందన(19), తంతరపల్లి లక్ష్మి(32), పినపాక మండలం గోపాలరావుపేటలో అంతటి రాము(22), కరకగూడెంలో మౌనిక(15), గుండాల మండలం రామానుజగూడెంలో వానపాకుల అఖిల్(9)తో పాటు మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం పాపాయిగూడేనికి చెందిన రేపాకుల రంజిత్‌కుమార్(5) అనే బాలుడు సెప్టెంబర్ 30న మృతి చెందాడు. సత్తుపల్లి మండలం రామానగరం గ్రామంలో యలమర్తి భారతమ్మ(45), రుద్రాక్షపల్లి గ్రామం లో ఇస్లావత్ నీలమ్మ(40), పెనుబల్లి మండలం రామచంద్రారావు బం జరులో తుంగా సంధ్య(21)లు విషజ్వరాలతో మృతి చెందారు. భద్రాచలం నియోజకవర్గంలో.. భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ బొబ్బళ్లపాటి రవిరత్న ప్రసాద్(43), కాసర్ల వెంకటాచారి(26), చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామానికి చెందిన బందా బిందు(11) చర్లకు చెందిన పులగడప నవీన్ కుమార్(19), విజయకాలనీకి చెందిన సౌదుల ఇందులేఖ(3), చింతూరు మండలం సుకుమామామిడికి చెందిన తోయ లింగారెడ్డి(45), పీర్ల మాలాశ్రీ(6) వాజేడు మండలం కోయవీరాపురానికి చెందిన వర్సా విజయ(16) దుమ్ముగూడెంలోని సుంకరకాలనీకి చెందిన నాగేందర్, రుంజా జయ్‌కుమార్(43) తదితరులున్నారు. ఇక, కొత్తగూడెం నియోజకవర్గంలో విషజ్వరాల బారినపడి 25 రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. వీరిలో కొత్తగూడెం మండలం పెనగడపకు చెందిన షెక్ కమాలుద్దీన్, సాజీదా బేగం, సావిత్రమ్మ ఉన్నారు. కట్ట సతీష్ అనే వ్యక్తి డెంగీ లక్షణాలతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 17న మృతిచెందాడు. దమ్మపేట ఎపీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న కారుకొండ రామవరం హోళితండాకు చెందిన మాళోతు నరేందర్ (10), రాఘవాపురం పంచాయతీ పరిధిలో మొరిపేటి చందర్రావు, మొరిపేటి సరస్వతి విషజ్వరం బారినపడి మృతిచెందారు. అశ్వారావుపేట మండలంలో నలుగురు, చండ్రుగొండలో ముగ్గురు, కుక్కునూరులో నలుగురు, ములకలపల్లి మండలంలో ఇద్దరు జ్వరం బారిన పడి గత నెల రోజుల్లో మృతి చెందారని రికార్డులు చెబుతున్నాయి. -
డెంగీ లక్షణాలతో గిరిజనుడి మృతి
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్ : డెంగీ లక్షణాలతో మండలంలోని బట్టిగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ గిరిజనుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బట్టిగూడేనికి చెందిన మడకం శంకర్(30) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతనిని డెంగీ జ్వరం రావడంతో చికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి యధావిథిగా పొలం పనులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్తున్నాడు. పది రోజుల క్రితం తిరిగి జ్వరం రావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు. కానీ రోజురోజుకు జ్వరం పెరుగుతూ నీరసిస్తుండడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు లక్ష్మీనగరం తరలించి వైద్యం చేయిస్తుండగా పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతనిని భద్రాచలం తరలించగా అక్కడ మృతి చెందాడు. శంకర్‌కు భార్య సమ్మక్కతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం సమ్మక్క ఆరు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ బాబాయికీ బ్రెయిన్ మలేరియా.. డెంగీ లక్షణాలతో మృతి చెందిన శంకర్ బాబాయి పూ నెం కృష్ణకు బ్రెయిన్ మలేరియా జ్వరంతో బాధపడుతున్నాడు. మూడు రోజులలుగా జ్వరం వస్తుండడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. అదే గ్రామంలో జలకం భద్రయ్య అనే గిరిజనుడు కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు.