నవీపేట్/ మాక్లూర్/ భిక్కనూరు: జిల్లాను డెంగీ వణికిస్తోంది. రోజూ ఎక్కడో ఓ చోట డెంగీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామం లో లావణ్య (19) అనే యువతి తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు రెండ్రోజుల క్రితం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు డెం గీ సోకినట్లు నిర్ధారించారు. మాక్లూర్ గ్రామానికి చెందిన లతీఫ్ (42)కు డెంగీ సోకిందని మోడల్ ఆస్పత్రి వైద్యాధికారి సంజీవ్‌రెడ్డి తెలిపా రు.
ఈనెల ఒకటో తేదీ నుంచి తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న లతీఫ్‌ను కుటుంబ సభ్యులు నాల్గవ తేదీన జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం మాక్లూర్ వైద్యాధికారి రవీందర్‌రెడ్డి, ఎస్‌యూఓ కృష్ణమూర్తి, సూపర్‌వైజర్ ప్రవీణ్‌రెడ్డి, సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఓ యువతికి కూడా డెంగీ లక్షణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. పసుల సౌంద ర్య వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైంది. రామాయంపేట ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆమెకు రెండు రోజుల పాటు చికిత్స చేసి ఇంటికి పంపించారు. మ రుసటి రోజు సౌందర్య తిరిగి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కామారెడ్డిలోని ప్రైవే ట్ అసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు డెంగీ సోకినట్టు నిర్ధారించారు.
వణికిస్తున్నడెంగీ
Published Wed, Oct 8 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
Advertisement
Advertisement