పట్నా: బీహార్‌లో డెంగ్యూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పట్నాలో వరుసగా మూడవ రోజు రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. పాట్నాలో ఒక్కరోజులో అత్యధికంగా 90 మంది డెంగ్యూ బారినపడ్డారు.
పాట్నా జిల్లాలో మొత్తం డెంగ్యూ బాధితుల సంఖ్య 1,147కి చేరింది. కంకర్‌బాగ్ ప్రాంతం డెంగ్యూ కేసులకు హాట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ ప్రతీ ఇంటిలోనూ డెంగ్యూ బాధితులు కనిపిస్తున్నారు. తానాలోని కంకర్‌బాగ్, అజీమాబాద్ తర్వాత బంకీపూర్ ప్రాంతంలో డెంగ్యూ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. 28 మంది కంకర్‌బాగ్‌లో డెంగ్యూతో బాధపడుతున్నారు. బంకీపూర్‌లో 23 మంది, పాటలీపుత్రలో 13 మంది, అజీమాబాద్‌లో ఏడుగురు డెంగ్యూ బారినపడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల నీరు నిలిచిపోతోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. బీహార్‌లో మొత్తం 2,419 మంది డెంగ్యూ బారినపడినట్లు వైద్యాధికారులు గుర్తించారు.
డెంగ్యూతో ఇప్పటివరకు బీహార్‌లో ఎనిమిది మంది మృతిచెందారు. డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీఎంసీహెచ్‌లోని మెడిసిన్ విభాగం సీనియర్ వైద్యుడు డాక్టర్ రాజన్ కుమార్, ఎన్‌ఎంసీహెచ్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ కుమార్ సిన్హా విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ సోకకుండా ఉండాలంటే దోమలను నివారించాలన్నారు.
ఇది కూడా చదవండి: ఏడడుగుల గోడ దూకి మేకను ఎత్తుకెళ్లిన తోడేళ్లు
Comments
Please login to add a commentAdd a comment