Increasing
-
ఎండలు ముదిరే.. గొడుగులు అదిరే..
హైదరాబాద్: రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి వేసవి కాస్త ముందుగానే వచ్చినట్టు ఎండల తీవ్రతను చూస్తే తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం గొడుగుల నీడలో వెళ్తున్న యువతుల చిత్రం ఎన్టీఆర్ మార్గ్‌లో కనిపించింది. -
ఛత్తీస్‌గఢ్‌లో చలి విజృంభణ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌ను చలిపులి చంపేస్తోంది. నవంబర్ రెండో వారం నాటికే ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని సూరజ్‌పూర్, సుర్గుజా, మార్వాహి, కోర్బా, ముంగేలి, బిలాస్పూర్, రాజ్‌నంద్‌గావ్, బలోద్, కంకేర్, నారాయణపూర్, బీజాపూర్, బస్తర్, దంతెవాడ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈ జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంది.రానున్న మూడు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదని వాతావరణ నిపుణుడు హెచ్‌పీ చంద్ర తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.గత 24 గంటల్లో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సూరజ్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలు, బలరామ్‌పూర్ రామానుజ్గంజ్లో 29.4 డిగ్రీలు, సర్గుజాలో 28.9 డిగ్రీలు, జష్పూర్లో 29.9 డిగ్రీలు, కొరియాలో 29.4 డిగ్రీలు, మర్వాహిలో 28.9 డిగ్రీలు, కోర్బాలో 30.3 డిగ్రీలు, ముంగేలిలో 3.4 డిగ్రీలు, 3.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అదే సమయంలో, రాజ్‌నంద్‌గావ్‌లో 30.5 డిగ్రీలు, బలోద్‌లో 31.7 డిగ్రీలు, కంకేర్‌లో 30.7 డిగ్రీలు, నారాయణపూర్‌లో 29.4 డిగ్రీలు, బస్తర్‌లో 30.3 డిగ్రీలు, బీజాపూర్‌లో 30.9 డిగ్రీలు, దంతవాడలో 32 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని రాయ్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.ఇది కూడా చదవండి: National Education Day: ఉన్నత విద్యకు ఊపిరి పోసి.. -
బీహార్‌లో డెంగ్యూ విజృంభణ.. ఒక్కరోజులో 90 కేసులు
పట్నా: బీహార్‌లో డెంగ్యూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పట్నాలో వరుసగా మూడవ రోజు రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. పాట్నాలో ఒక్కరోజులో అత్యధికంగా 90 మంది డెంగ్యూ బారినపడ్డారు.పాట్నా జిల్లాలో మొత్తం డెంగ్యూ బాధితుల సంఖ్య 1,147కి చేరింది. కంకర్‌బాగ్ ప్రాంతం డెంగ్యూ కేసులకు హాట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ ప్రతీ ఇంటిలోనూ డెంగ్యూ బాధితులు కనిపిస్తున్నారు. తానాలోని కంకర్‌బాగ్, అజీమాబాద్ తర్వాత బంకీపూర్ ప్రాంతంలో డెంగ్యూ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. 28 మంది కంకర్‌బాగ్‌లో డెంగ్యూతో బాధపడుతున్నారు. బంకీపూర్‌లో 23 మంది, పాటలీపుత్రలో 13 మంది, అజీమాబాద్‌లో ఏడుగురు డెంగ్యూ బారినపడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల నీరు నిలిచిపోతోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. బీహార్‌లో మొత్తం 2,419 మంది డెంగ్యూ బారినపడినట్లు వైద్యాధికారులు గుర్తించారు.డెంగ్యూతో ఇప్పటివరకు బీహార్‌లో ఎనిమిది మంది మృతిచెందారు. డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీఎంసీహెచ్‌లోని మెడిసిన్ విభాగం సీనియర్ వైద్యుడు డాక్టర్ రాజన్ కుమార్, ఎన్ఎంసీహెచ్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ కుమార్ సిన్హా విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ సోకకుండా ఉండాలంటే దోమలను నివారించాలన్నారు. ఇది కూడా చదవండి: ఏడడుగుల గోడ దూకి మేకను ఎత్తుకెళ్లిన తోడేళ్లు -
కాలేజీలు తగ్గినా.. సీట్లు పైకే
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గుతున్నా, సీట్లు మాత్రం ఏటా పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల సంఖ్యా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో 2020–21లో 186 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 2024–25 విద్యా సంవత్సరానికి అవి 174కు తగ్గాయి. 20–21లో 98,988 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ ఏడాది సీట్లు 1,12,069కు పెరిగాయి. ఇంజనీరింగ్‌లో చేరేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ, ఇది ఈ సంవత్సరం లక్ష దాటింది. చిన్న పట్టణాల్లో కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. ఇక్కడ విద్యార్థులు చేరేందుకు ఇష్టపడటం లేదని ప్రవేశాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థులు ఇంటర్ నుంచే హైదరాబాద్‌లో చదివేందుకు వస్తున్నారు. ఇదే ట్రెండ్ ఇంజనీరింగ్‌లోనూ కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో ఎక్కువగా సీట్లు భర్తీ అవుతున్నాయి.ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపే..రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4.5 లక్షల మంది ఇంటర్మిడియట్ పాసవుతున్నారు. ఇందులో 75 శాతంపైగా ఎంపీసీ గ్రూపు విద్యార్థులే ఉంటున్నారు. వీరిలో లక్ష మంది వరకూ రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్నారు. ఎన్ఐటీలు, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో చేరేవాళ్లు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర సంస్థల్లో చేరేవాళ్లు మరో 10 వేల మంది వరకూ ఉంటారని అంచనా. ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి 2.40 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1.80 లక్షల మంది పాసయ్యారు. కనీ్వనర్ కోటా కింద 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కలిపి మొత్తం 86,943 సీట్లు ఉన్నాయి. వీటిలో 75,107 సీట్లు భర్తీ చేశారు. దాదాపు 31 వేల బీ కేటగిరీ సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇప్పటికే ఉన్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా మంజూరైన మరో ఐదు ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల క్యాంపస్‌లలో కనీసం 10 వేల మంది చేరినట్టు అంచనా. బాసర ఆర్జీయూకేటీ, హెచ్‌సీయూలోని సీఆర్‌రావు విద్యా సంస్థతో పాటు తమిçళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని డీమ్డ్ వర్సిటీల్లో మరో 10 వేల మంది చేరే వీలుంది. ఎందుకీ క్రేజ్ఇంజనీరింగ్ తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని విద్యార్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరే వారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఐటీ కంపెనీల నియామకాలన్నీ కంప్యూటర్ కోర్సులు చేసినవారితోనే జరుగుతున్నాయి. డిగ్రీ, ఇతర కోర్సుల్లోనూ కంప్యూటర్ అనుబంధం ఉంటే తప్ప ఐటీ ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది.దీంతో విద్యార్థుల డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రైవేటు కాలేజీలు కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే మంచి ఫ్యాకల్టీ ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో పాటు అన్ని బ్రాంచీల్లోనూ మార్పు అనివార్యమవుతోంది. ఐటీ ఆధారిత బోధన విధానం తప్పనిసరి అవుతోంది. అందుకే విద్యార్థుల్లో ఇంజనీరింగ్‌పై క్రేజ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ప్రభావమే మార్చేస్తోంది ఇంజనీరింగ్‌లోని అన్ని బ్రాంచీల్లోనూ ఆరి్టఫిíÙయల్ టెక్నా లజీ దూసుకొస్తోంది. కంప్యూటర్ సైన్స్‌లోనే కాదు... సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్‌లోనూ ఏఐ లేకుండా ముందుకెళ్లడం కష్టం. అందుకే బ్రాంచీ ఏదైనా ఏఐ మీద విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఇంజనీరింగ్ చేస్తూనే... ఏఐ నేర్చుకుంటున్నారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. – డాక్టర్ కె.విజయకుమార్‌రెడ్డి రెక్టార్, జేఎన్టీయూహెచ్ -
వివాహ‘బంధం’ తెగతెంపులు!
సాక్షి, హైదరాబాద్: వివాహమైన ఏడాది, రెండేళ్లకే విడాకులకు సిద్ధమౌతున్న విచిత్రపరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది. గతంలో భారత సెలబ్రిటీల్లోనే (సినిమా, క్రీడలు, వ్యాపార, ఇతర రంగాల వారు) ఈ ట్రెండ్ అధికంగా కనిపించగా, రానురాను దాదాపు అన్ని వర్గాల్లో ఈ ధోరణి సాధారణంగా మారుతోంది. గతంతో పోల్చితే... గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో విడాకుల శాతం గణనీయంగా పెరిగినట్టుగా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. విడాకులంటేనే ఏదో చేయరాని నేరం అని ఏళ్లుగా పేరుకుపోయిన భావన నుంచి నేటితరం బయటపడడంతో జీవితంలో నూతన అధ్యాయం కోసం యువతరం మొగ్గుచూపుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి పెరగడానికి వైవాహికపరమైన వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం, ఇతర మార్గాలను అన్వేషించకుండానే కోర్టు మెట్లు ఎక్కడం కూడా ఒక కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలోని వివాహ వ్యవస్థ, కుటుంబ విలువలు ఒత్తిళ్లకు గురికావడం, సామాజిక–సంప్రదాయ విలువలు, పాత–ఆధునిక భావాల మధ్య సంఘర్షణ తదితర కారణాలతో విడాకులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి చూస్తే (2022 సంవత్సరం చివర్లో) దేశంలో విడాకుల శాతంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. విడాకుల కోసం కోర్టులో కేసు ఫైల్ చేశాక వివిధ దశలు దాటి తీర్పు వెలువడే నాటికి పదేళ్లకుపైగా పడుతున్న సందర్భాలు కూడా ఉండటంతో... అనధికారికంగా విడిపోతున్న జంటలు పెద్ద సంఖ్యలో ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అత్యధికంగా ఇండోర్‌లో... 👉 2022 నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 👉 దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 715 ఫ్యామిలీ కోర్టులున్నాయి. 👉 ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 5,500 విడాకుల కోసమే కాగా... వాటిలో పెళ్లయిన ఏడాదిలో పెట్టిన కేసులు 3,000. 2018లో 2,250 కేసులు ఫైల్ కాగా, 2022లో 2,723 కేసులు నమోదయ్యాయి. 👉 గత పదేళ్లలో...అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో 350 శాతం పెరిగిన విడాకులు. ఇదే సమయంలో పంజాబ్, హరియాణాల్లో 150 శాతం ఈ కేసుల వృద్ధి 👉 గత ఐదేళ్లలో ఢిల్లీలో విడాకుల శాతం రెండింతలు పెరిగింది. 👉 ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో విడాకుల కేసులు అధికంగా ఉంటున్నాయి జాగ్రత్తలు తీసుకుంటే... ‘ఈ మధ్య వారానికి ఏడెనిమిది కేసులైనా విడాకుల కోసం మా దగ్గరకు వస్తున్నాయి. వీరిలో 30 శాతం దాకా తమ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేందుకు మొగ్గుచూపుతుంటే, అధికశాతం మొండికేసి విడాకుల కోసం పట్టుపడుతున్నారు. తెగతెంపులకు 40 నుంచి 50 శాతం తల్లితండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటోంది. విడాకులు తీసుకున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడం లేదు. అదేదో డయోబెటిస్, థైరాయిడో వచ్చిందనేంత తేలికగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం దంపతుల మధ్య ఒకరిపట్ల ఒకరికి సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు సర్దుబాటు చేసుకోలేక ఘర్షణ పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరిలోనూ స్వార్థం పెరిగిపోవడం, సహానుభూతి కొరవడడం, అనుమానాలు పెరగడం ప్రభావం చూపుతున్నాయి. తల్లితండ్రులు కూడా సర్దుబాటు అవగాహన కలి్పంచకపోగా, చదువుకున్నారు, సంపాదిస్తున్నారు మీకేమీ తక్కువ అనేలా రెచ్చగొడుతుండటంతో పరిస్థితులు తెగే దాకా వస్తున్నాయి. ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపడం తగ్గిపోయి, పాత విషయాలను పదేపదే ప్రస్తావనకు తేవకపోవడం, గొడవలకు తల్లితండ్రులను మధ్యలోకి తెచ్చి బాధ్యులను చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇద్దరి మధ్య సర్దుబాటుకు అవకాశాలుంటాయి. – అనిత, ఫ్యామిలీ కౌన్సెలర్, భాస్కర మెడికల్ కాలేజీ క్లినికల్ సైకాలజిస్ట్ వివాహబంధం అక్కర్లేదనే అంచనాకు.. ‘మన దగ్గరా విడాకులు అనేవి క్రమంగా పెరుగుతున్నాయి. 2000 సంవత్సరం తర్వాత నుంచి చూస్తే... దేశంలో అమ్మాయిలకు మంచి విద్యతోపాటు ఉద్యోగావకాశాలు పెరగడంతో ఆర్థిక స్వాతంత్య్రం పెరిగింది. యూఎస్, ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వృద్ధికావడంతో గిల్లికజ్జాలు, చికాకులు, సమస్యలతో వివాహబంధాన్ని తప్పక కొనసాగించాల్సిన అవసరం లేదనే అంచనాకు ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు వస్తున్నారు. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో బాధ్యతలు పెరిగిపోవడంతో ఇంటాబయటా మహిళలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. రోజూ సమస్యలు ఎదుర్కొంటూ బతకడం కంటే విడిపోయి సంతోషంగా జీవించవచ్చనే అభిప్రాయానికి అమ్మాయిలు వస్తున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి ఇళ్లలోని పరిస్థితులు మారకుండా సంప్రదాయ పద్ధతుల్లోనే ఆలుమగల సంబంధాలు ఉండాలని పెద్దవాళ్లు కోరుకుంటున్న సందర్భాలున్నాయి. దీంతోపాటు వారిద్దరి మధ్య ప్రతీ చిన్న విషయంలో తల్లితండ్రులు కలగజేసుకోవడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి. సమాజంలో ఇంకా పురుషాధిక్యత అనేది ఏదో ఒక రూపంలో కొనసాగడం, పిల్లలుంటే వారి భారమంతా తమపైనే పడుతుందని సంతానం వద్దనే నిర్ణయానికి 10 నుంచి 15 శాతం యువతులు వస్తున్నారు. ఈ మేరకు పెళ్లికి ముందే ఒప్పందం చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. తాము అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదనే భావన అమ్మాయిల్లో బలపడటం, దానిని అంగీకరించేందుకు అబ్బాయిలు సిద్ధంగా లేకపోవడంతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు అంత్యంత ఆశ్యర్యకర విషయాన్ని వెల్లడించారు. నిజానికి తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగే జంతువులని, బహుశా గతంలో మనుషులు.. తోడేలు పిల్లలకు చేసిన హానికి ప్రతీకారంగా అవి ఇలా దాడులకు దుగుతుండవచ్చని నిపుణులు చెబుతున్నారు.బహ్రయిచ్‌లోని మహసీ తహసీల్ ప్రాంతంలోని ప్రజలు గత మార్చి నుంచి తోడేళ్ల భీభత్సాన్ని ఎదుర్కొంటున్నారు. జూలై నెల నుండి ఇప్పటివరకూ ఈ దాడుల కారణంగా ఏడుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా దాదాపు 36 మంది తోడేలు దాడులలో గాయపడ్డారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి, బహ్రయిచ్ కతర్నియాఘాట్ వన్యప్రాణుల విభాగం అటవీ అధికారి జ్ఞాన్ ప్రకాష్ సింగ్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. తోడేళ్ళు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉంటాయని, గతంలో వాటి పిల్లలను మనుషులు చంపేశారని అన్నారు. వాటికి ఏదో ఒక రకమైన హాని జరిగినందుకే అవి ప్రతీకారంగా దాడులకు దిగుతున్నాయని అన్నారు.పదవీ విరమణ తర్వాత ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’కు సలహాదారుగా పనిచేస్తున్న సింగ్ తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ 20-25 ఏళ్ల క్రితం జౌన్పూర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లోని సాయి నది ఒండ్రుమట్టిలో తోడేళ్ళు కనిపించేవి. ఈ నేపధ్యంలో కొందరు పిల్లలు తోడేళ్ల గుహలోకి ప్రవేశించి అక్కడున్న తోడేలు పిల్లలను చంపినట్లు ఆనాడు ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో ఆ తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగాయి. వాటి దాడుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారన్నారు.బహ్రైచ్‌లోని మహసీ తహసీల్ గ్రామాల్లో జరుగుతున్న తోడేలు దాడులకూ వాటి ప్రతీకారమే కారణం కావచ్చని సింగ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో బహ్రయిచ్‌లో రెండు తోడేళ్ల పిల్లలు ట్రాక్టర్ ఢీకొని మృతిచెందాయి. దీంతో తోడేళ్లు దాడికి దిగడం మొదలుపెట్టాయి. అప్పడు అటవీ అధికారులు దాడి చేసిన తోడేళ్లను పట్టుకుని 40-50 కిలోమీటర్ల దూరంలోని చకియా అడవిలో వదిలిపెట్టారు. అయితే చకియా అడవి తోడేళ్లకు సహజ నివాసం కాదు. ఈ తోడేళ్లు చకియా నుండి ఘఘ్రా నది ఒడ్డున ఉన్న తమ గుహలోకి తిరిగి వచ్చి, ప్రతీకార దాడులకు పాల్పడూ ఉండవచ్చన్నారు. బహ్రయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ “సింహాలు, చిరుతపులులు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉండవు. కానీ తోడేళ్లుకు ఆ స్వభావం ఉంటుంది. తోడేళ్లు వాటి పిల్లలకు మనుషుల నుంచి ఏదైనా హాని జరిగినా, అవి మనుషులను వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాయని అన్నారు. -
హైపర్‌టెన్షన్‌కు కారణమేంటి? జీవనశైలిలో మార్పే పరిష్కారమా?
రక్తపోటు బాధితులు తరచూ తమ బీపీని చెక్ చేసుకుంటుండాలి. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మనం ఏదైనా వ్యాధితో బాధపడుతూ వైద్యుని దగ్గరకు వెళ్లినప్పుడు ఆ వైద్యుడు ముందుగా మన రక్తపోటును పరీక్షిస్తారు. ప్రస్తుతం హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య దాదాపు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తున్నది.చాలా మంది అధిక రక్తపోటును సాధారణమైనదిగా తీసుకుంటారు. బహుశా ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలియకనే ఇలా చేస్తుంటారు. నిజానికి హైపర్‌టెన్షన్ అనేది ఒక ‘సైలెంట్ కిల్లర్’. ఇది అంతర్గతంగా శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది. రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మే 17 నుండి 25 వరకు ‘హైపర్‌టెన్షన్ వీక్’నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ హైపర్‌టెన్షన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపధ్యంలోనే హైపర్‌టెన్షన్ నుంచి బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎయిమ్స్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నదని పేర్కొన్నారు.పలు గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అస్తవ్యస్త జీవనశైలే దీనికి ప్రధాన కారణం. ఎయిమ్స్ సీసీఎం విభాగం హెచ్ఓడీ డాక్టర్ కిరణ్ గోస్వామి మాట్లాడుతూ నేటి కాలంలో యువతలో హైపర్‌టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నదని, 18 ఏళ్లలోపు పిల్లల్లో కూడా హైపర్‌టెన్షన్ సమస్య తలెత్తుతున్నదన్నారు.అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు ధూమపానం, పొగాకు వినియోగం, అధికంగా ఉప్పు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, వేయించిన ఆహారం, ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతోంది. అధిక రక్తపోటు నివారణకు ఆహారంలో పచ్చి కూరగాయలు, శుభ్రమైన పండ్లను చేర్చుకోవాలి. పొగాకు తీసుకోవడం మానివేయాలి. జీవనశైలిలో వ్యాయామం, శారీరక శ్రమలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీంతో అధిక రక్తపోటును నివారించవచ్చు. దీనితో పాటు 30 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ రక్తపోటును తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
మహిళా ఓటర్లు తలచుకుంటే.. గత ఐదేళ్లలో జరిగిందిదే!
దేశంలోని మహిళలు ఓటు వేసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఐదేళ్లలోని గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదికలోని వివరాల ప్రకారం గత ఐదేళ్లలో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లోని 18 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తేలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఈ 18 రాష్ట్రాల్లోని 10 రాష్ట్రాల్లో తిరిగి అదే ప్రభుత్వం ఏర్పడటం విశేషం. దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా మారుతున్న మహిళా ఓటర్లు 2029 ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఉండనున్నారు. 17వ లోక్‌సభలో మొత్తం ఎంపీల్లో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్‌సభలో ఈ సంఖ్య ఐదు శాతంగా ఉంది. నివేదిక ప్రకారం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనే అంచనాలున్నాయి. వీరిలో 33 కోట్ల మంది అంటే 49 శాతం మంది మహిళా ఓటర్లు ఉండనున్నారు. 85.3 లక్షల మంది మహిళలు తొలిసారిగా ఓటు వేయనున్నారు. 2047 నాటికి (2049లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది) మహిళా ఓటర్ల సంఖ్య 55 శాతానికి (50.6 కోట్లు) పెరుగుతుందని, పురుషుల సంఖ్య 45 శాతానికి (41.4 కోట్లు) తగ్గనుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు ఉంటారని, వీరిలో 80 శాతం మంది అంటే 92 కోట్ల మంది ఓటు వేస్తారని నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో మహిళా లబ్ధిదారులు ముందంజలో ఉన్నారు. స్టాండప్ ఇండియాలో వారి వాటా 81 శాతం. ముద్రా లోన్‌లో మహిళలకు 68 శాతం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 37 శాతం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 శాతం వాటా ఉంది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణలలో మహిళా ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక చెబుతోంది. -
ట్రేడింగ్‌లో మహిళల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రంగాలతో పాటు ట్రేడింగ్‌లోనూ మహిళలు దూసుకెడుతున్నారు. బ్రోకరేజీ ఫీజులు తగ్గడం, ట్రేడింగ్ వేళలు కొంత అనువుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ఖాతాలు తెరవడమే కాకుండా మహిళలు ట్రేడింగ్‌లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని యస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మహిళా ఇన్వెస్టర్ల అకౌంట్లు వార్షికంగా 75 శాతం పెరిగినట్లు తెలిపింది. అలాగే, మరో బ్రోకరేజ్ సంస్థ రెలిగేర్ బ్రోకింగ్ ప్లాట్‌ఫాంలోని యాక్టివ్ ట్రేడర్లలో మహిళలు 30 శాతం ఉన్నారు. ఇక ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా చూస్తే గతేడాది తమ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్న కొత్త ఇన్వెస్టర్లలో 41 శాతం మంది మహిళలే ఉన్నారని టెక్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఫిన్‌ఎడ్జ్ తెలిపింది. రియల్ ఎస్టేట్లాగా కాకుండా చాలా తక్కువ మొత్తాన్నైనా షేర్లలో ఇన్వెస్ట్ చేసే వీలుండటం కూడా మహిళలు స్టాక్‌మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటానికి కారణం కావచ్చన్నది విశ్లేషణ. ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన.. కచి్చతంగా నిర్దిష్ట ప్రదేశానికే పరిమితం కాకుండా ఎక్కడి నుంచైనా ట్రేడింగ్ చేసే సౌలభ్యం ఉండటం, వేళలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల మహిళలు కూడా ట్రేడింగ్‌ను ఎంచుకుంటున్నారని ఆర్థిక అక్షరాస్యత కన్సల్టెంట్, ఫుల్–టైమ్ ట్రేడర్ అయిన ప్రీతి చాబ్రా తెలిపారు. మహిళా ట్రేడర్లు పెరగడానికి గల కారణాల్లో ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన మెరుగుపడుతుండటం కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచే ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను కలి్పంచే ట్రేడింగ్ ఆకర్షణీయంగా ఉంటోందని ఉమాదేవి అనే మరో ట్రేడర్ తెలిపారు. ట్రేడింగ్ అంత సులువైనదేమీ కాకపోయినప్పటికీ మార్కెట్ల గురించి అవగాహన పెంచుకుంటూ, రిస్కు మేనేజ్మెంటును అర్థం చేసుకుంటూ మహిళలు ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మహిళా ఖాతాదార్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్లు.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేట్ సంస్థలు పలు కార్యక్రమాలు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్ 30 వరకు మహిళా శక్తి సేవింగ్స్ ఖాతాలు లేదా ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్లు తీసుకున్నా, డిసెంబర్ 31లోగా రుణాలు తీసుకున్న మహిళలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తెలిపింది. రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల వరకు తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ చార్జీలు పూర్తిగా మినహాయింపు, వార్షికంగా సేఫ్ డిపాజిట్ లాకర్ చార్జీలపై 50 శాతం డిస్కౌంటు వంటివి వీటిలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెరియర్లో వివిధ దశల్లో ఉన్న మహిళా ఉద్యోగుల కోసం రీకిండిల్, ర్యాంప్ బ్యాక్, యామ్‌వాయిస్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు అమెజాన్ వెల్లడించింది. మరోవైపు, వేతనాల్లో సమానత, ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యతను ప్రోత్సహించే విధానాలు అమలు చేస్తున్నట్లు ఐకియా తెలిపింది. మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌కు తోడ్పాటు అందించేందుకు హర్స్టోర్ అనే వేదికను ఏర్పాటు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. హెచ్‌సీసీబీ 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ కలి్పంచినట్లు తెలిపింది. -
ఇంట్లోనే థియేటర్!
సాక్షి, హైదరాబాద్: భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టీప్లెక్స్‌లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్‌ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. అడ్డంకులు లేని అనుభూతి.. మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచ్చిన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్‌లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో... దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్‌ను 25 శాతం, వెబ్ సిరీస్‌లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే.. మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యత కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్‌ను మించి హోం థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన వద్దు! ఈ లక్షణాలు కనిపిస్తే..
కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయనే వార్తలు మళ్ళీ భయాన్ని కలిగిస్తున్నాయి. జె.ఎన్ -1 సబ్ వేరియంట్ (ఉపరకం) ప్రస్తుతం దేశంలోని మూడు రాష్ట్రాల్లో వ్యాప్తిలో వుంది. కేరళలో 300 కేసులు,తెలంగాణలో 14 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కేరళలో మూడు మరణాలు సంభవించినట్లు సమాచారం.ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో మొదటి నుంచి కరోనా ఉధృతి ఎక్కువగానే వుంది. దేశంలోనే తొలి కేసు నమోదైంది కూడా అక్కడే. కరోనాను బాగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కావడం విశేషం. చలి కాలం, పండగల సీజన్ కావడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇంతవరకూ కేరళలో తప్ప, ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోగుల వివరాలు మిగిలిన రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఐనప్పటికీ,కేంద్ర ప్రభుత్వం తను అప్రమత్తమవుతూ రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ఇది మంచి పనే. ఇది ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే తప్ప,వేరు కాదు. చలికాలం కాబట్టి ఐన్ ఫ్లూయెంజా వ్యాప్తి కొంత జరుగుతోంది. దాని గురించి పెద్దగా కలవరపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్న మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య కొంత పెరుగుతోంది. కొందరు జ్వరం బారిన కూడా పడుతున్నారు.ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కూడా పెరుగుతోంది. ఇదంతా సీజనల్ పరిణామాలుగానే భావించాలని ఎక్కువమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం!. కరోనా మనల్ని పూర్తిగా వదిలివెళ్లిపోలేదు. వ్యాక్సినేషన్ బాగానే జరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్లతో పాటు అనేక రకాల మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొత్త వేరియంట్ జె.ఎన్-1 సోకినా ఈ మందులు, అందుబాటులో వున్న వైద్యం సరిపోతుందనే నిపుణులు ధైర్యాన్ని కలిగిస్తున్నారు.ఈ కొత్త వేరియంట్ కు మనిషిలోని రోగ నిరోధకశక్తిని అధిగమించే శక్తి వున్నప్పటికీ, ఆందోళన చెందాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే,ప్రభుత్వం,నిపుణులు చేసే హెచ్చరికలను పెడచెవినపెట్టరాదు. ఇతర అంటువ్యాధుల వ్యాప్తితో కూడా కోవిడ్ సోకే ప్రమాదాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఐన్ ఫెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడి చర్యలు వేగవంతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.పరీక్షలు పెంచడం,వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించడం కీలకం. ప్రయాణాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ కూడా బాగా పెరిగింది. కేసుల వ్యాప్తికి ఇదొక కారణంగా గుర్తించిన వేళ పరీక్షలు, జాగ్రత్తలపై దృష్టి సారించాలి. ఇన్ఫ్లుయెంజా ప్రభావంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అప్రమత్తంగా ఉండాలి. తగినంత ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచాలి. డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చూడాలి. యాంటీబయోటిక్స్ వాడకంపై గతంలోనే కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పాటించాలి. యాంటీ బయోటెక్స్ వాడకం బాగా పెరుగుతోంది. కోవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తినే చికిత్సలో యాంటీబయోటెక్స్ ఉపయోగించాలని వైద్యులకు కేంద్ర ఆరోగ్యశాఖ మునుపెన్నడో సూచించింది.అజిత్రోమైసిన్, ఐవర్ మెక్టిన్ వంటి ఔషధాలను కూడా ఉపయోగించవద్దని ఆరోగ్యశాఖ చెప్పింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ఐదు రోజుల పాటు రెమిడెసివర్ ఇవ్వవచ్చని అని గతంలో చెప్పింది. మొత్తంగా చూస్తే కోవిడ్, ఐన్ ఫ్లూయెంజా మళ్ళీ వ్యాప్తి చెందుతున్న వేళ జాగ్రత్తలను పాటించడం ప్రజల బాధ్యత. కట్టడి చర్యలను కట్టుదిట్టం చెయ్యడం ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటించడం వైద్యుల బాధ్యత. చీటికి మాటికీ యాంటీ బయోటెక్స్ వాడవద్దనే మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, గుంపుల్లోకి వెళ్లకుండా వుండడం, శారీరక పరిశుభ్రత పాటించడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకొనే మార్గంలో వ్యాయామం, యోగ, ప్రాణాయామం చేయడం, ఆహారం, నిద్రాది అంశాల్లో క్రమశిక్షణ పాటించడం శ్రేయస్కరం. -మాశర్మ ఇదీ చదవండి: కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు? -
‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది?
దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా గ్రాప్- 3ని కూడా అమలులోకి తీసుకువచ్చారు. దేశ రాజధానిలో కాలుష్య స్థాయి ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్లో పలు నిర్మాణ పనులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు నిలిపివేశారు. డీజిల్‌తో నడిచే ట్రక్కులను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణలో గ్రాప్-3 అనేది మూడవ దశలో భాగం. ఇది చలికాలంలో ఢిల్లీ అంతటా అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించిన వాయు కాలుష్య నిర్వహణ వ్యూహం. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 402గా ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత పరిస్థితిని పరిశీలించడానికి జరిగిన సమావేశంలో ఈ ప్రాంతంలోని కాలుష్యాన్ని పరిష్కరించడానికి చర్యలను రూపొందించే బాధ్యత చేపట్టిన సీఏక్యూఎం ఏజెన్సీ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. గ్రాప్ అనేది నాలుగు దశలుగా విభజించిన విధానం. వీటిని ‘పూర్’ (ఏక్యూఐ 201-300), ‘వెరీ పూర్’ (ఏక్యూఐ 301-400), ‘తీవ్రమైన’ (ఏక్యూఐ 401-450), ‘మరింత తీవ్రమైన’ (ఏక్యూఐ >450)వర్గాలుగా పేర్కొన్నారు. గ్రాప్ స్టేజ్-3లో కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులు, ముఖ్యమైన మైనింగ్, స్టోన్ బ్రేకింగ్ కార్యకలాపాలు మినహా అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తారు. ఢిల్లీకి బయట రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాలతో పాటు డీజిల్‌తో నడిచే ట్రక్కులు, మధ్యస్థ, భారీ కంటెయినర్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధించారు. ఇది కూడా చదవండి: కాలుష్య భూతం: టెక్ కంపెనీల కీలక చర్యలు -
జీవన ప్రయాణంలో అవసరంగా మారిన వాహనం
ఒకప్పుడు ఎవరికైనా బైక్, కారు ఉందంటే వాళ్లు ధనవంతులు అని గుర్తింపు ఉండేది. గ్రామాల్లోకి బైకుల్లో, కార్లలో ఎవరైనా వస్తే ప్రజలు ఆసక్తిగా చూస్తుండేవాళ్లు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైక్ ఉండటం సర్వసాధారణంగా మారిపోయింది. మధ్య తరగతి ప్రజల్లో కార్ల వినియోగం కూడా పెరిగింది. మారిన జీవన శైలి.. ఉద్యోగ, ఉపాధి అవసరాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ మోటారు వాహనం తప్పనిసరి అయ్యింది. నంద్యాల: ఇళ్ల ముందు, దుకాణాలు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, టీకొట్ల ఎదుట.. ఇలా ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్ చేసి కనిపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల వినియోగానికి ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో దాదాపు ప్రతి ఇంటికి ఒక మోటారు వాహనం ఉందంటే అతిశయోక్తి కాదేమే. జిల్లాలో వివిధ రకాల వాహనాలు 3,45,884 ఉండగా.. వీటిలో అత్యధికంగా 3,12,613 ద్విచక్ర వాహనాలు ఉండటం విశేషం. అవసరాల నిమిత్తం ఒక్కొక్కరు ఒక బైక్ ఉపయోగిస్తున్నారు. సాధారణ కూలీ పనులకు వెళ్లే వారితో పాటు వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని రకాల వర్గాల ప్రజలు ద్విచక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో రోజుకు సగటున 45–50 వాహనాల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈకోవలో నెలకు వెయ్యికి పైగానే వాహనాలు రిజి్రస్టేషన్లు అవుతున్నాయి. వాహనాల అమ్మకాలు, విక్రయాలు, రిజి్రస్టేషన్లతో రవాణా శాఖకు ఆదాయం పెరుగుతోంది. ప్రతి రోజూ బైక్‌లు, కార్లు, లారీలు, బస్సులు, ఆటోలు, అంబులెన్స్‌లు, స్కూల్ బస్సులు తదితర వాహనాలు అన్నీ కలిపి భారీ సంఖ్యలో రోడ్డెక్కుతున్నాయి. వ్యక్తిగత వాహనాలతో పాటు ప్రజారవాణా వాహనాలకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి ఆధునిక మోడళ్లు.. వాహన తయారీ కంపెనీలు తరచూ మార్కెట్లోకి కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే వాహనాల మోడళ్లను విడుదల చేస్తున్నారు. దీంతో వినియోగదారులు కొత్త వాటిపై ఆసక్తి చూపుతున్నారు. బీఎస్–4 తర్వాత మార్కెట్లోకి బీఎస్–6 వాహనాలు వచ్చాయి. వీటి కొనుగోలుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. నచ్చిన బైక్, కారు ముందుగానే బుకింగ్ చేసుకొని డెలివరీకి నెలల సమయం పడుతున్నా అంత వరకు వేచి చూస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు సైతం డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతున్నారు. ఫలితంగా స్కూటర్ల విక్రయాలకు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావడంతో ఇటీవల కాలంలో చాలా మంది వాటిపై మొగ్గు చూపుతున్నారు. ఇవి కాలుష్య రహితంగా ఉండటంతోపాటు పెట్రోల్ ఖర్చు లేకపోవడంతో ఈ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న ట్రాక్టర్ల సంఖ్య.. జిల్లాలో వ్యవసాయంపైనే ఎక్కువ భాగం రైతులు ఆధారపడ్డారు. గతంలో ఎద్దులతో వ్యవసాయం, ఇతర పనులు చేసేవాళ్లు. కాలక్రమేణా వ్యవసాయంలో సాంకేతిక విప్లవం రావడంతో రైతులు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్లతో తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే వెసులుబాటు ఉంటుంది. పైగా కూలీల ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ట్రాక్టర్లతోనే సేద్యం, కలుపు మొక్కలు తొలగించడం తదితర పనులు చేస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తోంది. కుటుంబాలతో ప్రయాణించేందుకు.. సాధారణ, మధ్య తరగతి వర్గాల నుంచి మొదలు కొని ప్రతి ఒక్కరికి బైక్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంట్లో బైక్ ఉంటే స్థానికంగా, ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేయడానికి ఉపయోగపడుతుందని కొనుగోలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలు, తీర్థయాత్రలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. లేటెస్ట్ కార్లు మార్కెట్లోకి అడుగుపెట్టడమే ఆలస్యం పట్టణాలతో పాటు పల్లెల్లో సైతం వాలిపోతున్నాయి. వ్యాపారులు, రైతులు ఎక్కువ భాగం కార్లను ఉపయోగిస్తున్నారు. కార్లు కొనుగోలు చేయాలంటే గతంలో మాదిరిగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కారు ధరలో కొంత మేర డౌన్‌పేమెంట్ చెల్లించి మిగిలిన సొమ్మును సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటు ఉంది. బైక్ తప్పనిసరి ప్రస్తుతం బైక్‌లు, కార్లు ప్రతి ఒక్కరికీ అవసరమవుతున్నాయి. ఏచిన్న పనికి వెళ్లాలన్నా బైక్ లేనిదే బయటకు వెళ్లడం లేదు. మాకు గ్రామ సమీపంలో నాపరాతి గని ఉంది. అక్కడికి వెళ్లాలంటే తప్పక బైక్ అవసరం ఉంటుంది. అత్యవసర పనులతో పాటు కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లేందుకు జీపు కొనుగోలు చేశాం. – సుధాకర్, అంకిరెడ్డిపల్లె వాహనాల సంఖ్య పెరుగుతోంది జిల్లాలో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి రోజు వివిధ రకాల కొత్త వాహనాలు 45 నుంచి 50 వరకు రిజి్రస్టేషన్లు జరుగుతుంటాయి. ఈ లెక్కన నెలకు 1200కు పైగానే ఉంటాయి. ఎక్కువ భాగం ద్విచక్రవాహనాలే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. – శివారెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి -
విద్యార్థి హాస్టళ్లు, పీజీలకు పెరుగుతున్న గిరాకీ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల వసతి గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులకు మెట్రో నగరాలకు వలస వస్తుంటారు. ప్రభుత్వ నూతన విద్యా విధానాలు, వినూత్న సాంకేతికత కారణంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల వలసల వృద్ధికి ప్రధాన కారణమని కొలియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నిల్ అనిల్ తెలిపారు. క్యాంపస్‌లు, హాస్టళ్లు, పీజీ గృహాలలో అపరిశుభ్రత, భద్రత కరువు, ఎక్కువ అద్దెలు వంటి రకరకాల కారణాల వల్ల స్టూడెంట్ హౌసింగ్ విభాగం ఇప్పటివరకు ఈ రంగం అసంఘటితంగా, నియంత్రణ లేకుండా ఉంది. ఒకే వయసు వ్యక్తులతో కలిసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ వసతులతో సులువైన రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలలో సహాయం వంటి రకరకాల కారణాలతో యువతరం వసతి గృహాలలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
రావమ్మా మహాలక్ష్మి.. ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అబ్బాయిలే అధికంగా ఉంటున్నారు. కానీ.. 2021 తర్వాత అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తికి సంబంధించి 2021– 22 నివేదిక లో ఈ విషయాలను వెల్లడించింది. గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు 977 మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 1,046కు పెరిగినట్టు నివేదికలో వెల్లడించింది. ఆరోగ్య కార్యక్రమాల అమలు భేష్ రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు బాగా అమలు చేస్తుండటం వల్లే అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. సాధారణంగా ఆరే ళ్లు నిండకముందే బాలికల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తి మృతి చెందేవారు. కానీ.. ఈ పరిస్థితులు తలెత్తకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, క్రమం తప్పకుండా యాంటీనేటల్ చెకప్, వ్యాధి నిరో ధక టీకాల అమలు అద్భుతంగా ఉండటం వంటి పరిస్థితుల వల్ల మంచి ఫలితాలు వస్తున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల స్థాయిలోనే ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థ కూడా సత్ఫలితాలు ఇస్తోంది. అమ్మాయిల సంఖ్య పెరగడానికి ఇవి కూడా కారణాలని నివేదిక వెల్లడించింది. చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం కేరళ తర్వాత ఏపీలోనే అధికం దేశంలో అమ్మాయిలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం. కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,114 మంది అమ్మాయిలు నమోదవుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 1,046 మంది నమోదయ్యారు. అత్యల్పంగా హర్యానాలో 887 మంది అమ్మాయిలు మాత్రమే నమోదయ్యారు. ఏపీలో పట్టణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,063 మంది, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,038 మంది అమ్మాయిలు ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతుండటం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వివరించారు. ఇండియాలో సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 968 మంది అమ్మాయిలు నమోదయ్యారు. -
గ్రేటర్ లో 17రోజుల్లో కోటి బీర్లు సేల్
-
దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
-
రోజురోజుకు పెరుగుతోన్న ఫ్లూ బాధితుల సంఖ్య
-
భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కారణం ఇదే!
ఢిల్లీ: కరోనా మహమ్మారి పీడ ముగిసిపోయిందనుకునేలోపే మరోసారి పంజా విసురుతోందా?. తాజాగా భారత్‌లో మళ్లీ కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో 97 రోజుల తర్వాత 300కి పైగా తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 2,686కిపైగా పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. దేశంలో ఒకే రోజు 334 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ఇద్దరు, కేరళలో ఒకరు వైరస్ బారిన పడి మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 5,30,775కి పెరిగింది. దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 4.46 కోట్లు, కాగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, ఇప్పుడు యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 0.00 శాతం ఉన్నాయి. అయితే జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,54,035కి పెరిగింది, అయితే మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.63 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగింది. కాగా, మళ్లీ కరోనా కేసులు పెరగడానికి నిర్లక్ష్యమే కారణమా?. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరిగ్గా ధరించాలని నిపుణులు చెబుతున్నా కానీ, మాస్క్‌లు పెట్టుకోకుండా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో మార్కెట్లుల్లో కూడా చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. చైనా, అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని, కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసును అర్హులైన అందరూ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. కొవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: జీవితంలో సుడిగుండం.. మానసిక శక్తిని దెబ్బతీసిన కరోనా -
అప్పుడే వద్దు.. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల నష్టాలివే..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలిసీ తెలియని వయసులో కలిగే లైంగిక కోరికలతో పాటు లైంగిక హింస, బాల్య వివాహాలు.. ఆడుకునే అమ్మాయిల్ని అమ్మల్ని చేస్తున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చిన అమ్మాయిల్లో, వారికి పుట్టే పిల్లల్లో కొన్ని దీర్ఘ కాలిక అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఇద్దరూ జీవితాంతం ఇటు శారీరకంగా, అటు మానసికంగా బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు లైంగిక విద్య పట్ల పూర్తి అవగాహన కల్పిస్తేనే ఈ సమస్యను అధిగమించవచ్చని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో మార్పు రాకపోవడం విస్మయపరుస్తోంది. కూతురు రజస్వల కాగానే పెళ్లి చేస్తే సరిపోతుందని చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కాగా కొంతమంది అమ్మాయిలు చదువు, కెరీర్, ఉద్యోగాల్లో స్థిరపడటం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం గురించి ఆలోచిస్తూ 26 ఏళ్ల వరకూ వివాహం చేసుకోవడం లేదు.. కానీ గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూతురికి పెళ్లిచేస్తే తమ బాధ్యత తీరుతుందని, బరువు తగ్గుతుందని పదహారేళ్లకే కానిచ్చేస్తున్నారు. ఈ కారణంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. ఇక్కడే కాదు రాయలసీమ జిల్లాల్లోనే చిన్న వయసులో తల్లులవుతున్న వారు చాలా ఎక్కువగా ఉన్నారంటే ఆశ్చర్యంగా కలుగక మానదు. పదహారేళ్లకే తల్లులుగా.. వివాహ అర్హత వయసే 18 ఏళ్లు ఉండగా పదహారేళ్లకే తల్లులవుతున్న పరిస్థితి చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గడిచిన 11 మాసాల్లో అనంతపురం జిల్లాలో 105 మంది అమ్మాయిలు 16 ఏళ్ల లోపు వయసులోనే గర్భం దాల్చారు. 18 ఏళ్లలోపు వయసున్న అమ్మాయిల్లో మరో 433 మంది గర్భం దాలి్చన వారిలో ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోనూ 16 ఏళ్లలోపు వయసున్న 63 మంది అమ్మాయిలు తల్లులయ్యారు. 18 ఏళ్లలోపు ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వారు మరో 283 మంది ఉన్నారు. వీరిలో 95 శాతం మంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలే. చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రులు వారికి మూడుముళ్ల బంధం వేసి వారి కెరీర్‌కు మధ్యలోనే సమాధి కడుతున్నారు. రాయలసీమ జిల్లాలో కర్నూలు తర్వాత ఎక్కువగా టీనేజీ ప్రెగ్నెన్సీలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు సామాజిక మాధ్యమాలకు ప్రభావితమై అబ్బాయిలతో కలిసి ఇంట్లోనుంచి వెళ్లిపోతున్న పరిస్థితులూ ఉన్నాయి. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల నష్టాలు ►మెటర్నల్ మోర్టాలిటీ అంటే కాన్పు సమయంలో తల్లులు మృతి చెందే అవకాశం ఉంది ►నెలలు నిండక ముందే పుట్టే అవకాశం ►స్టిల్ బర్త్ అంటే కడుపులోనే బిడ్డ చనిపోవడం ►శిశువులు బరువు తక్కువగా పుట్టడం ►తీవ్రస్థాయిలో రక్తపోటు ►శిశువులు సరిగా శ్వాస తీసుకోలేక పోవడం చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో 3 రాష్ట్రాల్లో ప్రకంపనలు.. చర్యలు తీసుకుంటాం 1098.. ఇది చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్. బాల్య వివాహం చేసినట్లు లేదా ఏర్పాట్లు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే సదరు ప్రాంతానికి వెళ్తాం. అమ్మాయిని కేజీబీవీలో చేర్పించి చదివిస్తాం. చట్టపరంగా తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటాం. చాలామంది అమ్మాయిలు మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులై చిన్న వయసులో అబ్బాయిలతో కలిసి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి. – శ్రీదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ -
టర్కీ, సిరియాలో 29,000 దాటిన భూకంప మృతులు..
ఇస్తాన్‌బుల్: తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాలు తవ్వేకొద్ది వేల సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 29,000మందికిపైగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. టర్కీలో 24,617 మంది, సిరియాలో 4,500 మంది మరణించినట్లు తెలిపారు. పరిస్థితి చూస్తుంటే ఈ సంఖ్య 50 వేలకు పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అధికారులు అంచనా వేస్తున్నారు. టర్కీ, సిరియా భూకంపం ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏడో రోజూ కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు సహా అనేక మందిని సహాయక బృందాలు రక్షించాయి. దక్షిణ టర్కీ హతాయ్ ప్రావిన్స్‌లో శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని 149 గంటల తర్వాత బయటకు తీశారు. మరోవైపు టర్కీ దేశస్థులు తమ దేశంలోని బంధువుల ఇంట్లో తాత్కాలికంగా తలదాచుకోవచ్చని జర్మనీ తెలిపింది. ఈ విపత్కర పరిస్థితిలో తమవంతు సాయం అందిస్తామని చెప్పింది. ఇతర దేశాలు కూడా టర్కీకి ఆపన్నహస్తం అందిస్తున్నాయి. చైనా 53 టన్నుల టెంట్లను సాయంగా అందించింది. భారత్ ఇప్పటికే సహాయక బృందాలతో పాటు వైద్య బృందాలు, ఔషధాలు, ఇతర సామగ్రిని టర్కీకి పంపింది. చదవండి: టర్కీ విధ్వంసం.. మూత్రం తాగి బతికిన యువకుడు -
నాగలి పడుతున్న నారీమణులు..దేశంలో పెరుగుతున్న మహిళా రైతులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) వెల్లడించింది. మహిళా రైతుల సంఖ్య పెరుగుతున్నందున వారికి అనువైన వ్యవసాయ యంత్రాలను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2010–11 గణాంకాల ప్రకారం వ్యవసాయం చేసే మహిళలు దేశంలో 12.79 శాతం ఉండగా 2015–16లో 13.87 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇదే సమయంలో మహిళా రైతులు వ్యవసాయ చేసే విస్తీర్ణం కూడా 10.36 శాతం నుంచి 11.57 శాతానికి పెరిగింది. అందువల్లమహిళలకు అనుకూలమైన యంత్ర పరికరాలు అందుబాటులోకి రావాల్సి ఉందని దేశంలో వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణపై నాబార్డు అధ్యయన నివేదికలో తెలిపింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి పలు సూచనలు చేసింది. యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాలి ప్రస్తుతం దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభ దశలోనే ఉందని, యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాల్సి ఉందని స్పష్టంచేసింది. దేశంలో మొత్తం వ్యవసాయ భూకమతాల్లో 85 శాతం చిన్నవేనని, వీటిలో యంత్రాల వాడకం ప్రధాన సవాలుగా ఉందని నివేదిక తెలిపింది. కిరాయి, అద్దె మార్కెట్లు ఉన్నప్పటికీ చిన్న కమతాలకు పరిమితులు, సంక్లిష్టతలున్నాయని తెలిపింది. 2014–15లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ ప్రారంభించినప్పటికీ, చిన్న కమతాలకు ఉపయోగకరంగా లేదని తెలిపింది. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పెద్ద కమతాలకు అనువైనవే ఉన్నాయని తెలిపింది. చిన్న భూకమతాలకు అనువైన యంత్రాలను, పనిముట్లను ప్రోత్సహించాలని పేర్కొంది. యాంత్రీకరణతో రైతులకు లాభం యాంత్రీకరణతో రైతులకు లాభమని నాబార్డు పేర్కొంది. ట్రాక్టర్లు, సీడ్ డ్రిల్స్, హార్వెస్టర్లు, కంబైన్లు వంటి యంత్రాలు కార్మికులకయ్యే ఖర్చును ఆదా చేస్తాయని నివేదిక తెలిపింది. యంత్రాలు, సాంకేతికతతో వ్యవసాయ ఉత్పాదకత సామర్థ్యాన్ని 30 శాతం వరకు పెంచడంతోపాటు సాగు ఖర్చును 20 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగంతో కారి్మకులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేసేందుకు అందుబాటులో ఉంటారని తెలిపింది. కారి్మకులకు వ్యవసాయంలోకంటే వ్యవసాయేతర రంగాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తాయని వెల్లడించింది. నాబార్డు సిఫార్సులు మరికొన్ని.. ► రైతుల సముదాయంతో రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను ఉపయోగించుకొనేలా చేయాలి ► చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితులను సడలించాలి ► అందుబాటులో ఉన్న వ్యవ వినియోగంలో కొండ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న భూభాగం, స్థలాకృతికి సరిపోవు. కొండ ప్రాంతాలలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక పనిముట్లు అవసరం. ఆ భూభాగం, పంట వ్యవస్థలకు సరిపోయే విధంగా పనిముట్లు రూపొందించాలి. ► ప్రస్తుతం ఉన్న యంత్రాలు, పనిముట్లు స్త్రీలకు అనుకూలమైనవి కావు. వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్త్రీలకు అనుకూలమైన కొత్త యంత్రాలు, పనిముట్లను అందుబాటులోకి తేవాలి. ట్రాక్టర్ల కొనుగోలులోనూ వెనుకబాటు దేశంలో 14.6 కోట్ల మంది రైతుల్లో గత 15 సంవత్సరాల్లో ట్రాక్టర్లు కొనగలిగిన వారు అతి తక్కువని పేర్కొంది. 2004–05 ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైతులు 2.48 లక్షల ట్రాక్టర్లు కొనగా, 2019–20లో 8.80 లక్షల ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. ట్రాక్టర్ల కొనుగోలులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయని చెప్పింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో 18,335 ట్రాక్టర్ల కొనుగోళ్లు జరగ్గా 2021–22 లో 33,876 ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. 2021–22లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1,17,563, మహారాష్ట్ర 1,04,301, మధ్యప్రదేశ్‌లో 1,00,551 ట్రాక్టర్లు కొన్నట్లు పేర్కొంది. చదవండి: అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు -
వ్యాధి ముదిరిపోయిన తర్వాత లక్షణాలు, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతే!
కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్‌ను పూర్వకాలంలో రాచపుండుగా పిలిచేవారు. ఈ వ్యాధి ధనికులకే వస్తుందని అప్పట్లో దానికి ఆ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ వ్యాధికి పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరికీ సోకుతోంది. చాలా మంది మహిళలకు ఈ వ్యాధి వచ్చినట్లే తెలియదు. వ్యాధి ముదిరిపోయిన తర్వాత దాని తాలూకు లక్షణాలు ప్రారంభమై అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీంతో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలి్పంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జనవరి నెలను గర్భాశయ ముఖద్వార అవగాహన మాసంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ సంవత్సరం ‘కొన్ని తరాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంతం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెరిగిన వైద్యులు రెండు దశాబ్దాల క్రితం రాయలసీమ కంతటికీ కర్నూలులో ఒక్కరే క్యాన్సర్ వైద్యులుండేవారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పాతికమందికి క్యాన్సర్ డాక్టర్లున్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 60 నుంచి 80 మంది కొత్తగా క్యాన్సర్ బాధితులు వస్తున్నారు. అలాగే ప్రతిరోజూ 10 నుంచి 15 మందికి కీమోథెరపి, 25 మందికి రేడియోథెరపి చేస్తున్నారు. నిత్యం 80 నుంచి 120 మంది ఇన్‌పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 20 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సెరి్వకల్ క్యాన్సర్) బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 40 వేల వరకు ఉంటుందని వైద్యుల అంచనా. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు విశ్వభారతి, ఒమెగా, శాంతిరామ్ హాస్పిటల్లలో క్యాన్సర్ వ్యాధులకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ క్యాన్సర్ కణతులు తొలగించేందుకు నిర్వహించే శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా చేస్తున్నారు. ఈ పథకం లేనప్పుడు రోగులకు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. అన్ని ఆసుపత్రుల్లో క్యాన్సర్‌కు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుని డిశ్చార్జ్ అయిన రోగులకు ఆసరా పథకం కింద రోజుకు రూ.225, నెలకు రూ.5వేలు తక్కువ కాకుండా ప్రభుత్వం అందజేస్తోంది. సెర్వికల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే.. ఈ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది. తక్కువ వయస్సులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ, పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఇది ప్రధానంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సుగల స్త్రీలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు ఇవీ.. ► సాధారణ రుతుక్రమం గాకుండా యోని నుంచి రక్తస్రావం ► లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం ► పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్) ► యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం ► మూత్రం, మలవిసర్జనలో ఆటంకాలు ఇలా చేస్తే నివారణ సాధ్యం 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది. దీనికింద 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు దేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా 1,24,000 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులు నమోదవుతున్నారు. వారిలో సగం మంది ఒక సంవత్సరంలోపు మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ వల్ల ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ మరణిస్తోంది. దీనికి నివారణగా 30 ఏళ్ల వయస్సు నుంచి లైంగికంగా చురుకుగా ఉన్న మహిళలందరూ 5 నుంచి 10 ఏళ్లకు ఒకసారి హెచ్‌పీవీ పరీక్ష చేయించుకోవాలి. 9 నుంచి 26 సంవత్సరాల వయస్సుగల బాలికలందరికీ హెచ్‌పీవీ టీకాలు వేయాలని సూచించాలి. ఈ వ్యాధిని నయం చేయడం కంటే నివారణ ఉత్తమం. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు. –డాక్టర్ శిల్పారెడ్డి, గైనకాలజిస్టు, కర్నూలు ల్యాప్రోస్కోపి ద్వారా శస్త్రచికిత్స నయం కాని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ల్యాప్రోస్కోపి పరికరం ద్వారా ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేయవచ్చు. దీనివల్ల కోత, కుట్టు ఉండదు. త్వరగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హెరి్నయా వచ్చే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. దీనివల్ల వివాహం అయిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకుంటే, క్యాన్సర్‌ను ప్రాథమికంగా గుర్తించగలిగితే నయం చేసుకోవచ్చు. దీనికితోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. –డాక్టర్ సి. వాసురెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్టు, కర్నూలు -
రామ్ గోపాల్ వర్మ 'లడ్కీ'కి హిట్ టాక్.. మరిన్ని థియేటర్లలో..
Ram Gopal Varma Ladki Movie: పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం ‘లడ్కీ’ (తెలుగులో ‘అమ్మాయి‘). ఈ చిత్రం టి అంజయ్య, శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఇండో, చైనీస్ కో ప్రొడక్షన్స్, పారిజాత క్రియేషన్స్, ఆర్ట్సీ మీడియా పతాకాలపై రూపొందింది. ఈ నెల 15న ప్రపంచ వ్యాప్తంగా 47,000 స్క్రీన్ లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, సక్సెస్ అవ్వడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుతున్నారు. ఇక సినిమా విజయవంతంగా ప్రదర్శితం కావడంతో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘రామసత్యనారాయణకు ఈ సినిమాతో ఏ సంబంధం లేకపోయినా కూడా మాకు ఎంతో సహాయం చేశారు. ఆయన మా శ్రేయోభిలాషిగా ఈ సినిమా కోసం ఎంతో పని చేశారు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నోసార్లు చెప్పాను. ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసినప్పటి నుంచి అలాంటిది ఒకటి చేయాలని అనుకున్నాను. పూజా భాలేకర్ లాంటి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి దేశంలోనే లేరు. కొత్త జానర్లో సినిమాను ప్రయత్నించాం. కొత్తదనంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మళ్లీ ‘అమ్మాయి’ సినిమాతో నిరూపించారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రాపర్ సక్సెస్ మీట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తాం’ అని తెలుపారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘అమ్మాయి లాంటి మంచి చిత్రాన్ని నిర్మించినందుకు ఆర్జీవీ గారికి, వెనుకుండి సపోర్ట్ ఇచ్చిన మా అంజన్న గారిని అభినందిస్తున్నాను. మా అంజన్న ఐదు సినిమాలు తీశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాం. ఇక రేపటి నుంచి ఏపీలో మరో వంద థియేటర్లు పెంచుతున్నారని చెప్పడం కోసం మీడియా ముందుకు వచ్చాం. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఆర్జీవీ. చైనాలో 40 శాతం అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. మొదటి రోజే రూ. 150 కోట్లు కలెక్ట్ చేసింది జర్నలిస్ట్ మిత్రుడు చెప్పారు. అన్ని చోట్లా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. పూజా బాగా నటించింది. ఇప్పటికే ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు ఆర్జీవీ గారు, అంజన్న గారికి థ్యాంక్స్’ అని అన్నారు. నిర్మాత టి. అంజయ్య మాట్లాడుతూ.. ‘ఆర్జీవీ గారికి థ్యాంక్స్. ఆయనతో నాది ఐదేళ్ల ప్రయాణం. ఈ చిత్రం ఆయనకు మానసిక పుత్రిక. సినిమాను చూస్తూ అందరూ చొక్కాలు చించుకుంటున్నారు. శివ తర్వాత ఈ సినిమానే అంత పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయమని అంటున్నారు. ఆ చిత్రాన్ని కూడా నేనే నిర్మిస్తాను. ఎంతో పెద్ద సక్సెస్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా కూడా ఆర్జీవీ ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్’ అని పేర్కొన్నారు. -
జూలైలో పుంజుకున్న ఉపాధి కల్పన
కోల్‌కతా: ఈ ఏడాది జూన్ నెలలో నిరుద్యోగ రేటు తగ్గిపోగా.. జూలైలో ఈ ధోరణి తిరిగి సానుకూలంగా మారినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తెలిపింది. జూలై 12 నుంచి చూస్తే మూడు రోజుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చి 7.29 శాతానికి చేరుకుందని పేర్కొంది. ఈ నెల 12న 7.33 శాతంగా ఉండగా, 13న 7.46 శాతం, 14న 7.29 శాతంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జూన్ నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.80 శాతంగా ఉందని సీఎంఐఈ అంతకుముందు నెలవారీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో 7.30 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.03 శాతం ఉన్నట్టు తెలిపింది.1.3 కోట్ల మందికి ఉపాధి కల్పన నష్టం జరిగిందని, సాగు రంగంలో పనులు లేకపోవడం వల్లేనని పేర్కొంది. తాజా గణాంకాలపై ఆర్థికవేత్త అభిరూమ్ సర్కార్ స్పందిస్తూ.. రుతువుల వారీగా ఏజెన్సీ సేకరించే గణాంకాల్లో లోపాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్నారు. -
హైదరాబాద్‌లో ఓజోన్ కమ్మేస్తోంది.. అవస్థలు తప్పవు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కోవిడ్ కలకలంతో వ్యక్తిగత వాహనాల వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. వాహనాలు వదులుతోన్న కాలుష్యంతో గ్రేటర్లో భూస్థాయి ఓజోన్ మోతాదు క్రమంగా అధికమవుతోంది. ఈ విపరిణామంతో నగరవాసులు ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సిటిజన్ల ముక్కుపుటాలను అదరగొడుతున్నాయి. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై వాహనాలు వెదజల్లే పొగలోని ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలవడంతోపాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో తరచూ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులకు ఊపిరిసలపడంలేదని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పరిశీలనలో తేలింది. చదవండి: విజృంభిస్తున్న విష జ్వరాలు.. డెంగీతో యువ డాక్టర్ మృతి ప్రమాణాల మేరకు ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 80–100 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఓజోన్‌తో అవస్థలు ఇవే.. ► అస్తమా, బ్రాంకైటిస్‌తో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ► ట్రాఫిక్ రద్దీలో వేలాది మంది తరచూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ► గొంతునొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ► ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతీలో అసౌకర్యం. చదవండి: ‘వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి’ ధూళి కాలుష్యం సైతం ► ఓజోన్తోపాటు మోటారు వాహనాల పొగలో ఉన్న సూక్ష్మ, స్థూల ధూళికణాలైన పీఎం10, పీఎం 2.5, ఆర్ఎస్పీఎంలు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. ► దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటోంది. ► చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. ► తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతాయి. ► ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం ఉంది. ► ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, వాయు కాలుష్యమేనని నిపుణులు అంటున్నారు. -
థర్డ్‌వేవ్ ప్రమాదం: వచ్చే 2, 3 వారాలు అత్యంత కీలకం
అంతా బాగుందనే భావనతో తప్పటడుగులు వేయొద్దని హెచ్చరికలు దేశంలో కోవిడ్ కేసుల ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. మళ్లీ కరోనా తీవ్రస్థాయికి చేరుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి సీరియస్ కోవిడ్ కేసులు ఇంకా ఇక్కడికి వస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారికి సంబంధించి రాబోయే 2, 3 వారాలు కీలకంగా మారనున్నాయి. దేశంలో మూడోదశ కరోనా ఆగస్ట్‌లో మొదలై అక్టోబర్‌కల్లా ఉచ్ఛస్థాయికి వెళ్లొచ్చని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్ పరిశోధకులు తాజాగా అంచనా వేశారు. ఈ నెలలో దేశంలో రోజుకు లక్షన్నర కేసుల వరకు నమోదు కావొచ్చని హెచ్చరికలు జారీచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోని వైరస్ ఉద్ధృతి థర్డ్‌వేవ్‌కు ఆజ్యం పోయొచ్చని ఐఐటీ–హైదరాబాద్ ప్రొఫెసర్ మతుకుమల్లి విద్యాసాగర్ చెప్పారు. అయితే సెకండ్‌వేవ్‌లో మాదిరిగా రోజుకు నాలుగు లక్షల కేసులు, పెద్ద సంఖ్యలో మరణాలు వంటి అత్యంత తీవ్రస్థాయి ఉండక పోవచ్చన్నారు. – సాక్షి, హైదరాబాద్ పాత జీవన విధానం కోరుకుంటూ.. ఏడాదిన్నరగా రెండు లాక్డౌన్లు, వివిధ రకాల ఆంక్షలతో ప్రజలు విసిగి వేసారి ఉన్నారు. ఇలాంటి దశలో కోవిడ్ జాగ్రత్తలను పట్టించుకోకపోతే మళ్లీ కేసులు పెరిగి థర్డ్‌వేవ్‌కు దారితీసే ప్రమాదముందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ పాత జీవన విధానాన్ని కోరుకుంటూ స్వేచ్ఛగా అన్నిచోట్లకు వెళ్లే ప్రయత్నంలో నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు. ప్రస్తుత దశను వారు పరీక్షా సమయంగా అభివర్ణిస్తున్నారు. చాలామంది అంతా మామూలై పోయినట్టుగా ప్రవర్తించడం, మాస్క్‌లు పెట్టుకోకపోవడం, గుంపులు గుంపులుగా కనిపించడం, రెస్టారెంట్లు, పబ్‌లు, పార్టీలు అంటూ తిరగుతుండటంపై వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. వైరస్ వ్యాప్తికి సానుకూల వాతావరణం ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. డెల్టా ప్లస్ వేరియెంట్‌తో ప్రమాదం ఎక్కువగా ఉంది. లక్షణాలు కనిపించకపోవడంతో కొందరి ఆరోగ్యం విషమిస్తోంది. కేసుల పెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నా ప్రజలు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సులభంగా వ్యాప్తి చెందడానికి అనువుగా ఉన్నాయి. ప్రజలు వీటిని గుర్తెరిగి మసలుకోవాల్సి ఉంది. –డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, కన్సల్టెంట్ ఫిజీషియన్, వృందాశ్రీ జూబ్లీ క్లినిక్ కొత్త స్పైక్స్ రావొచ్చు వివిధ రాష్ట్రాల్లో డెల్టా వేరియెంట్ ఇంకా ప్రబలంగా ఉంది. ప్రస్తుతమున్న డెల్టాతోనే నిబంధనలు పాటించని చోట కొత్త స్పైక్స్ రావొచ్చు. కేసుల సంఖ్య పదిరెట్లు పెరిగితేనే వేవ్‌గా పరిగణించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిసి థర్డ్‌వేవ్‌గా మారడానికి నెలన్నర, రెండు నెలలు పట్టొచ్చు. అప్పుడు చిన్నపిల్లలతోపాటు అందరూ ప్రభావితమయ్యే అవకాశముంది. అయితే సెకండ్‌వేవ్‌లో ఉన్నంత ఉధృతి ఉండకపోవచ్చు. ఇప్పటికైతే థర్డ్‌వేవ్‌కు సంబంధించి ఎలాంటి వేరియెంట్లు ఇక్కడ పుట్టలేదు. తెలంగాణలో 40 శాతం మందిలో (6 ఏళ్లు పైబడిన వారిలో) ఇంకా యాంటీబాడీస్ ఏర్పడలేదు. అంటే మన రాష్ట్రంలో ఒక్క డోస్ టీకా కూడా వేసుకోకపోవడం లేదా ఇంకా వైరస్ బారిన పడని వారు 40 శాతం దాకా ఉన్నారు. ఆస్పత్రుల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి ఆసుపత్రుల్లో మళ్లీ కోవిడ్ కేసుల అడ్మిషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బోనాలు, సీజన్ మార్పు తదితర కారణాలతో వచ్చే 15, 20 రోజుల్లో కేసుల సంఖ్య బాగా పెరిగితే థర్డ్‌వేవ్‌కు దారితీయొచ్చు. థర్డ్‌వేవ్ వస్తే ఆ ప్రభావం అక్టోబర్ వరకు ఉండొచ్చు. కొత్త మ్యుటేషన్లు, స్ట్రెయిన్లు రాకుండా జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. బ్లాక్ ఫంగస్ కేసులు కొంత మేర తగ్గినట్టే కనిపిస్తోంది. అవసరానికి మించి జింక్, ఐరన్ తీసుకుంటున్న వారిలో ఈ సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ఆస్పత్రులు సిద్ధమై ఉండటం సానుకూలాంశం. –డాక్టర్ ఎ. నవీన్‌రెడ్డి, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ నిపుణులు, నవీన్‌రెడ్డి హాస్పిటల్ -
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా విలయతాండవం
-
5 ఏళ్ల బాలుడికి రోజురోజుకూ పెరుగుతున్న 'తల'
ఇందూరు: నిరుపేద కుటుంబంతో విధి ఆటలాడుతోంది. ఐదేళ్ల బాలుడికి ‘తల’కు మించిన భారం తెచ్చి పెట్టింది. అనుకోని వ్యాధి అతడ్ని రాకాసిలా పట్టి పీడిస్తోంది. తమకు కలిగిన సంతాన్ని చూసి ఆనందించాల్సిన తల్లిదండ్రులకు అంతులేని ఆవేదనను కలిగిస్తోంది. పిల్లాడి ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ కుటుంబం పడరాని పాట్లు పడుతోంది. ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బొడ్డు శ్రీకాంత్, హారిక 2016 మార్చి 1న ఇద్దరు కవల పిల్లలు జని్మంచారు. అయితే, నెలలు నిండక ముందే జని్మంచిన ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఆరోగ్య పరిస్థితి బాగోలేక 41 రోజులకు కన్నుమూశాడు. మిగిలిన ఒక్క బాబునైనా ప్రేమగా చూసుకోవాలని తపించిన తల్లిదండ్రులకు అనుకోని ఆపద వచ్చి పడింది. ముద్దుగా శివయ్య (శివ) అని పేరు పెట్టుకున్న బాలుడికి ఐదో నెల నుంచే తల భాగం అనూహ్యంగా పెరగడం మొదలైంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. వైద్యం చేయడానికి ఏ డాక్టరూ ముందుకు రాలేదు. కొన్ని చోట్ల స్కానింగ్‌లు తీయించారు. ఏవో రాసిచ్చిన కొన్ని మందులు కూడా వాడారు. అయినా ఫలితం కనిపించ లేదు. రోజు రోజుకు నీరు చేరి తల భాగం మాత్రం పెరుగుతోంది. తల భారంగా మారడంతో బాలుడికి అవస్థ కూడా ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. చివరికి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. పిల్లాడ్ని కాపాడాలని అక్కడి వైద్యులను ప్రాధేయపడ్డారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేయడం వీలు కాదని, చేసినా ప్రయోజనం ఉండదని, ఉన్నన్ని రోజులు బాగా చూసు కోండని చెప్పి పంపించి వేశారు. ఏం జరిగినా ఫర్వాలేదని, ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులు కాళ్ల మీద పడి వేడుకున్నా వైద్యులు ఒప్పుకోలేదు. శివయ్యకు ఎన్ని సమస్యలో.. ఐదేళ్ల బాలుడు శివయ్యకు తల భారంతో పాటు కళ్లు సరిగ్గా కనిపించవు. కాళ్లు, చేతులు కూడా సక్రమంగా పని చేయవు. నిలబెట్టే అవకాశం లేకపోవడంతో బాబుని ఎత్తుకోవడం, పడుకోబెట్టడం చేస్తున్నారు. ఆహారం కూడా ఏదీ తినడు. ద్రవ రూపంలో ఆహారం అందిస్తేనే జీర్ణం అవుతోంది. ఇందుకు కుటుంబ సభ్యులు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతాన్ని తినిపిస్తున్నారు. ఇదే ప్రతి రోజూ ఆహారంగా మారింది. జ్వరం ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా ఏ డాక్టరు వైద్యం అందించడం లేదని, కనీసం మందులు కూడా రాసివ్వడం లేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటి వరకు రూ.8 లక్షల పైనే ఖర్చు.. బాలుడి పరిస్థితిని చూసి అమ్మమ్మ అతడికి సపర్యలు చేస్తోంది. శ్రీకాంత్, హారిక దంపతులకు మరో సంతానం కలిగింది. మూడేళ్ల ఆ బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే, శివయ్యకు వచ్చిన వ్యాధిని నయం చేయించడానికి అప్పులు చేసి, బంగారం అమ్మి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. రూ.8 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఆదుకోవాలని దాతలను కోరుతున్నారు. సదరం సరి్టఫికెట్ కోసం వచ్చి... శివయ్యకు ప్రభుత్వం అందించే దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని తండ్రి శ్రీకాంత్‌తో పాటు అమ్మమ్మ లక్ష్మి ఇటీవల కలెక్టరేట్‌కు వచ్చారు. వీరిని ‘సాక్షి’ కదిలించగా తమ గోడు వెల్లబోసుకున్నారు. సదరం సరి్టఫికెట్ కోసం గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్న సదరం సెక్షన్ అధికారిని కలిశామని, సరి్టఫికెట్ ఇప్పించి పింఛన్ మంజూరు చేయించాలని కోరినట్లు తెలిపారు. స్పందించిన అధికారులు సదరం సరి్టఫికెట్ ఇప్పించడానికి చర్యలు తీసుకున్నారు. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ : 75691 44233 చదవండి : (ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో కట్టేసి చిత్రహింసలు) (భూకంపం అనుకొని.. రోడ్లపైకి పరుగులు) -
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..
సాక్షి, సిటీబ్యూరో: 2017లో 325.. 2018లో 428.. 2019లో 1393.. ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికే 2456.. ఓ పక్క సైబర్ నేరాలు ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోపక్క సిటీ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలో సిబ్బంది మాత్రం అరకొరగా 58 మందే ఉన్నారు. పదేళ్ల క్రితం నాటి కేటాయింపులతోనే నెట్టుకు వస్తుండటంతో పనిభారం పెరిగిపోతోంది. ఓ పక్క ఈ ఠాణాలో నానాటికీ పెరుగుతున్న ఫిర్యాదులు, కేసుల్ని సమర్థంగా విచారించడం/దర్యాప్తు చేయడం కోసం అదనపు సిబ్బందిని కేటాయిస్తూనే.. పోలీసుస్టేషన్ల స్థాయిలోనూ సైబర్ క్రైమ్ టీమ్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం 2021లో అయినా ఈ దిశగా అడుగులు పడాలని నగరవాసులు కోరుతున్నారు. పదేళ్ల క్రితం నాటి కేటాయింపులే.. నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల దర్యాప్తు చేయడం కోసం తొలినాళ్లలో సీసీఎస్ ఆ«దీనంలో సైబర్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 2010లో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ కేటాయించింది. ప్రాథమికంగా 40 మంది సిబ్బందిని కేటాయించారు. వీరితోనే రెండు సైబర్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్‌కు ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించేలా.. సహకరించడానికి ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్–కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉంటారు. గడిచిన పదేళ్లలో పెరిగిన సిబ్బంది సంఖ్య కేవలం 8 మాత్రమే. సైబర్ నేరాలు నానాటికీ కొత్తపుంతలు తొక్కుతూ ప్రజలనే కాదు దర్యాప్తు చేస్తున్న పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఓ పక్క క్రెడిట్/డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్‌తో పాటు నైజీరియన్ ఫ్రాడ్స్, డేటా థెఫ్ట్ తదితరాలు పెరుగుతూ పోతున్నాయి. వీటికి తోడు హ్యాకింగ్‌తో పాటు ఎస్ఎమ్మెస్, ఈ–మెయిల్ ఫ్రాడ్స్ సంఖ్య పెరిగింది. ఆ సంఖ్యలో సిబ్బంది పెరగకపోవడంతో కేసుల దర్యాప్తులో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో ఫిర్యాదులు.. సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదవుతున్న కేసుల్లో నైజీరియన్ ఫ్రాడ్స్‌తో పాటు ఆర్థిక సంబంధ నేరాలే ఎక్కువగా ఉంటున్నాయి. నమోదయ్యే కేసులకు దాదాపు పది రెట్లు పిటిషన్లు వస్తున్నాయి. గతేడాది 325 కేసులు నమోదు కాగా.. ఆరు వేల పిటిషన్లు వచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్ 20 వరకు 2,456 కేసులు నమోదు కాగా.. ఏడు వేల పిటిషన్లు వచ్చాయి. ఒక్కో పిటిషన్‌ను విచారించిన తర్వాత మాత్రమే కేసుగా నమోదు చేసేలా నిబంధన ఏర్పాటు చేసుకున్నారు. ఇలా వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదుల్ని విచారించడం సైతం ఉన్న సిబ్బందికి తలకు మించిన భారంగా మారిపోయింది. నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో మూడు రకాలైనవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్మీ ఉద్యోగులుగా పేర్కొంటూ తక్కువ ధరకు వాహనాలు, వస్తువుల పేరుతో యాడ్స్ యాప్‌ల్లో, ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లో పోస్టులు పెట్టి మోసం చేసే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేసిన వ్యక్తిగత సమాచారంతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్(ఓటీపీ) కూడా తీసుకోవడం లేదంటే టీమ్ వ్యూవర్ సహా వివిధ రకాలైన యాప్స్‌ను డౌన్లోడ్ చేయించి ఖాతాలు ఖాళీ చేసే ఓటీపీ మోసాలు మొదటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి. ఉద్యోగాలు, విదేశీ వీసా, ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్, గిఫ్టులు, లాటరీల పేరుతో చేసే కాల్ సెంటర్ ఫ్రాడ్స్ కేసులది మూడో స్థానం. పోలీసుస్టేషన్లలో టీమ్స్ అవశ్యం.. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి జోనల్ స్థాయిలో బృందాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే పోలీసుస్టేషన్లలోనే టీమ్స్ ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం సిటీ సైబర్ క్రైమ్ ఠాణా పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాటు. ఈ ఏడాది బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ కంపెనీ అకౌంట్ టేకోవర్ స్కామ్‌లో రూ.2.09 కోట్లు పోగొట్టుంది. అలాగే అంబర్‌పేట్‌కు చెందిన ఓ యువకుడు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్‌లో రూ.6 వేలు కోల్పోయాడు. ఈ రెండు కేసులూ సైబర్ క్రైమ్ పోలీసులే దర్యాప్తు చేయాల్సి వస్తోంది. అలా కాకుండా పోలీసుస్టేషన్లలో ఉండే యూనిట్స్ చిన్నచిన్న కేసుల్ని పర్యవేక్షించేలా రూపొందించాలి. భారీ మొత్తాలు, సంచలనాత్మక కేసుల్ని మాత్రమే ఈ సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ చేయాలి. అన్ని పోలీసుస్టేషన్లలోనూ యూనిట్లనూ సీసీఎస్ ఆధీనంలో ఉంచి, తరచూ శిక్షణ ఇస్తుండాలి. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు అత్యవసరంగా 19 మందిని కేటాయించాల్సిందిగా కోరుతూ అధికారులు దాదాపు రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలతో పాటు 10 మంది కానిస్టేబుళ్లను కోరారు. ఇప్పటి వరకు వీటికి మోక్షం లభించలేదు. పోలీసుస్టేషన్లలో యూనిట్ల ఏర్పాటు అంశమూ ఇలా కాకుండా 2021లో అమలులోకి రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతాలకు చెందిన వారే నిందితులుగా.. నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వారే 95 శాతం వరకు నిందితులుగా ఉంటున్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య, అశ్లీల సందేశాలు, ఫొటోలు పంపడం, కంపెనీల డేటా దురి్వనియోగం వంటి వాటిలో మాత్రమే స్థానికులు నిందితులుగా ఉంటున్నారు. మార్కెట్ ప్లేస్, ఓఎల్ఎక్స్ నేరగాళ్లకు రాజస్థాన్‌లోని మేవాట్ రీజియన్‌లో ఉన్న ఆల్వార్, భరత్పూర్.. ఓటీపీ ఫ్రాడ్‌స్టర్స్‌కు జార్ఖండ్‌లోని జామ్‌తార, దేవ్‌ఘర్, గిరిధ్.. కాల్ సెంటర్ల కేంద్రంగా నడిచే ఇతర నేరాలు చేసే వారికి ఢిల్లీ, కోల్‌కతా అడ్డాలుగా మారాయని ఇప్పటికే గుర్తించారు. ఈ సైబర్ నేరాల్లో నిందితులు బాధితులకు కనిపించరు. కేవలం ఫోన్‌కాల్స్ ఆధారంగానే వీళ్లు తమ పని పూర్తి చేసుకుంటారు. ఒక్కోసారి ‘వినిపించకుండా’నూ అందినకాడికి దండుకుంటారు. ఈ తరహా సైబర్ నేరాలు చేసే వాళ్లు పశి్చమ బెంగాల్లో ఉన్న చిత్తరంజన్, అసన్‌సోల్‌లకు చెందిన వారి బ్యాంకు ఖాతాలు వాడుకుంటున్నారు. ఈ కారణంగానే అనునిత్యం సైబర్ క్రైమ్ పోలీసులకు చెందిన ఓ టీమ్ ఉత్తరాదిలోనే ఉండిపోవాల్సి వస్తోంది. నేరుగా మూసేయడమూ సాధ్యం కాదు.. ఈ సైబర్ నేరగాళ్లు నూటికి నూరు శాతం నకిలీ ‘ఆధారాలతోనే’ నేరాలు చేస్తుంటారు. బాధితుల్ని సంప్రదించడానికి వినియోగించే ఫోన్ నంబర్లు, వీరి నుంచి డబ్బు కాజేయడానికి వాడే బ్యాంకు ఖాతాలు, వాలెట్స్ సహా ఏ ఒక్కటీ వీరి పేరుతో ఉండదు. నకిలీ వివరాలతో లేదా కమీషన్లకు ఆశపడి తమకు సహకరించే మనీమ్యూల్స్‌గా పిలిచే మధ్యవర్తుల సాయంతో తమ ‘పని’ పూర్తి చేసుకుంటారు. ఈ కారణంగానే ఏటా నమోదవుతున్న కేసుల్లో అనేకం ఎలాంటి ఆధారాలు దొరక్క క్లోజ్ అవుతూ ఉంటాయి. ఫిర్యాదులోని అంశాలు, కేసు తీరుతెన్నుల ఆధారంగా ఇలా క్లోజ్ అయ్యే వాటిని సైబర్ క్రైమ్ అధికారులు తేలిగ్గానే గుర్తిస్తారు. అలాగని పెండెన్సీ తగ్గించుకోవడానికి ఇలాంటి కేసుల్ని తక్షణం క్లోజ్ చేయడానికీ ఆస్కారం లేదు. దర్యాప్తు నిమిత్తం ఒకటి రెండుసార్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లి వచ్చి, పక్కాగా ఆధారాలు దొరలేదని నిరూపించిన తర్వాతే ఈ క్లోజర్‌కు ఆస్కారం ఉంటుంది. ఓ పక్క సిబ్బంది కొరత.. మరోపక్క పెరుగుతున్న నేరాలతో ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఠాణాలో కేసుల పెండెన్సీ ఎక్కువవుతోంది. ఇవీ సిటీ సైబర్ ఠాణా సిబ్బంది వివరాలు ఏసీపీ: 1, ఇన్స్పెక్టర్లు: 7, ఎస్సైలు: 13 కానిస్టేబుళ్లు, హెడ్–కానిస్టేబుళ్లు: 33 హోంగార్డులు: 4, మొత్తం: 58 -
గంజాయి గుప్పు... ఎక్స్ట్రా ముప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతోంది. ఈసారి వర్షాలు విస్తారంగా పడటంతో పెద్దెత్తున గంజాయి సాగు చేశారు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు, ఏపీలో గోదావరి ఏజెన్సీ ప్రాంతాలు, విశాఖ, శ్రీకాకుళం ఏజెన్సీలో గంజాయి సాగు విస్తీర్ణం పెరిగినట్లు ఎక్సైజ్, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్), ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అనుమానిస్తోంది. వీటిని ఉత్తర భారతంలోని మహారాష్ట్ర, గుజరాత్‌లకు ఎగుమతి చేసే క్రమంలో హైదరాబాద్‌లో దొరికిపోతున్నారు. కొంతకాలంగా హైదరాబాద్‌లో గంజాయి దొరికిన ప్రతీసారి క్వింటాళ్ల కొద్దీ లభిస్తుండటమే ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మొత్తానికి కరోనా వైరస్‌తో విధించిన లాక్‌డౌన్‌ను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. పోలీసుల నిఘా అంతగా లేకపోవడంతో గంజాయి భారీగా సాగు చేశారు. ఇంతకాలం హైదరాబాద్ దాని పరిసరాలకే పరిమితమైన గంజాయి సరఫరా ఇప్పుడు మెల్లగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకూ పాకుతోంది. లాక్డౌన్ కారణంగా గ్రామాల్లో పెద్దగా పనులు లేకపోవడం, కాలేజీలు లేకపోవడంతో కొందరు యువత మత్తు కోసం గంజాయికి అలవాటు పడుతున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతాలైన కొత్తగూడెం, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖమ్మం, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో గంజాయి వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఎన్టీపీసీ, గోదావరి ఖని, రామగుండం తదితర ప్రాంతాల్లో యువత గంజాయి మత్తులో చిత్తవుతున్నారు. ఈ మత్తులోనే వాళ్లల్లో వాళ్లే తగవులు పెట్టుకోవడం లేదా ఇతరులపై దాడులకు దిగడం చేస్తున్నారు. ఇటీవల రాజధానిలోని అంబర్‌పేట, ఖమ్మం జిల్లాలో యువత గంజాయి మత్తులో దారిన వెళ్లేవారిపై దాడులకు దిగడం కలకలం రేపింది. ఈ విషయంలో జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికడుతూనే సరఫరా చేస్తున్న వారిపై పీడీ కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్సీబీ, డీఆర్ఐ వద్ద క్వింటాళ్లకొద్దీ.. ఈసారి రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తారంగా గంజాయి సాగు చేసినట్లు ఎన్సీబీ, డీఆర్ఐ, ఎక్సైజ్‌శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఆగస్టులో హయత్‌నగర్ వద్ద 995 కేజీల గంజాయిని ఎన్సీబీ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అదే నెలలో డీఆర్ఐ అధికారులు పంతంగి టోల్ గేట్ వద్ద దాదాపు రూ.3.6 కోట్ల విలువైన 1,500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ తర్వాత వివిధ సందర్భాల్లో దాదాపు 4వేల కిలోల గంజాయిని ఒక్క ఎన్సీబీ అధికారులే పట్టుకోవడం గంజాయి అక్రమ రవాణా ఎలా సాగుతోందనడానికి నిదర్శనం. ఎక్స్ట్రా కేబిన్ ఏర్పాటు చేసి.. భద్రాచలం, ములుగు, తూర్పు గోదావరి ఏజెన్సీ నుంచి భద్రాచలం పట్టణానికి గంజాయి తరలిస్తారు. ఆపై సరుకును కొత్త గూడెం, మహబూబాబాద్, నర్సంపేటల మీదుగా వరంగల్ నుంచి హైదరాబాద్ శివార్లకు తీసుకొస్తారు. అక్కడ నుంచి నగర పరిసర జిల్లాలకు రవాణా చేస్తున్నారు. సాధారణంగా పాలు, కూరగాయలు, ఊక లారీల అడుగున గంజాయి రాజధానికి చేర్చేవారు. ఇప్పుడు స్మగ్లర్లు రూటుమార్చారు. భద్రాచలం, ములుగు ఏజెన్సీ ఏరియాలకు వస్తున్న లారీల్లో ఎక్స్ట్రా రహస్య కేబిన్ ఏర్పాటు చేసి అందులో గంజాయిని తరలిస్తున్నారు. ఈ లారీలను తనిఖీ చేసినా ఖాళీగా ఉంటుంది కాబట్టి.. పోలీసులకు కూడా అనుమానం రాదు. సమాచారం ఉంటే తప్ప వాటిని గుర్తించడం కష్టం. గట్టి నిఘా ఏర్పాటు.. ‘రాష్ట్రంలో ఈసారి భద్రాచలం, ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా గంజాయి సాగు చేసినట్లు మా వద్ద సమాచారం ఉంది. గంజాయి రవాణాపై కూడా దృష్టిసారించాం. ఈ క్రమంలోనే తాజా తనిఖీల్లో పెద్దెత్తున సరుకు పట్టుబడింది. గంజాయి రవాణా ఏ మార్గంలో జరిగినా.. పట్టుకునేలా గట్టి నిఘా ఏర్పాటు చేశాం. ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం’అని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
పెరుగుతున్న కరోనా కేసులు..
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రజల నిర్లక్ష్యానికి పండుగలు, చలికాలం తోడవడంతో వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత నెల 25న రాష్ట్రం మొత్తం 582 కేసులు నమోదవగా, 31నాటికి 1,416కు పెరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా పెరిగినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. దీని ప్రకారం గత నెల 25న జీహెచ్ఎంసీలో 174 కేసులుండగా 31న 279కి చేరాయి. ఇదే తేదీల్లో ఆదిలాబాద్‌లో 9 నుంచి 18కి, భద్రాద్రి కొత్తగూడెంలో 22 నుంచి 79కి, ఖమ్మంలో 17 నుంచి 74కు, జనగామలో 2 నుంచి 21కి, మేడ్చల్‌లో 38 నుంచి 112కు, రంగారెడ్డిలో 55 నుంచి 132, వరంగల్ అర్బన్‌లో 7 నుంచి 22కు పెరిగాయి. కామారెడ్డిలో 25న ఒక్క కేసు నమోదు కాకపోగా, 31న 24 నమోదయ్యాయి. ఇలాగే మిగిలిన జిల్లాల్లోనూ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదయ్యింది. దసరా సమయంలో తక్కువ కేసులు నమోదవగా, ఆ తర్వాత క్రమంగా పెరుగుతున్నాయి. చలికాలంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. 2.40 లక్షలకు చేరిన కేసుల సంఖ్య... రాష్ట్రంలో ఇప్పటివరకు 43,23,666 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,40,048 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా మహమ్మారి బారినపడి మరో ఐదుగురు చనిపోగా... మొత్తం మరణాల సంఖ్య 1,341కి చేరింది. శనివారం ఒక్కరోజే 1,579 మంది కోలుకోగా... కోలుకున్నవారి సంఖ్య 2,20,466కు చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.84 శాతానికి పెరిగింది. మరణాల రేటు 0.55 శాతానికి తగ్గింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 18,241. ఇందులో ఇళ్లు, సంస్థల ఐసోలేషన్‌లో 15,388 మంది చికిత్స పొందుతున్నారు. -
ఇంగ్లాండ్‌లో మళ్లీ కరోనా ఉధృతి
లండన్: ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. సెకండ్ వేవ్ మొదలైనట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత వారం 99 మంది, ఈవారంలో 139 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నియంత్రణ చర్యలను ప్రభుత్వం కఠినతరం చేసింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధని 18 ఏళ్లు పైబడిన వారికి 200 పౌండ్ల (రూ.18,950) జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే పునరావృతం అయితే 400 పౌండ్లు చెల్లించాల్సిందే. ఉల్లంఘన మళ్లీ జరిగే రెండింతల జరిమానా విధిస్తారు. పదేపదే తప్పు చేస్తే గరిష్టంగా 6,400 పౌండ్లు (రూ.6.06 లక్షలు) చెల్లించాల్సి రావొచ్చు. దేశంలో ప్రతి 10 వేల మందిలో 100 మంది కరోనా బారినపడ్డారు. -
పక్షం రోజులు.. 127 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సారి భారీ వరద పోటెత్తింది. పక్షం రోజుల్లోనే ఏకంగా 127 టీఎంసీల మిగులు జలాలు వృథాగా గోదావరిలోకి వెళ్లిపోయాయి. ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని సాగునీటి ప్రాజెక్టుల నుంచి 15 రోజులుగా రోజూ లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్కుల వరద జలాలు తరలివస్తున్నాయి. దీంతో ఎస్సీరెస్పీ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్ ప్రారంభమైన జూన్ 1 నుంచి ప్రాజెక్టులోకి సుమారు 234 టీఎంసీల నీరు వచ్చినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు నిండిపోగా, మిగిలిన జలాలను గోదావరిలోకి వదిలి పెడుతున్నారు. వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు జలాశయానికి తరలిస్తున్నారు. అలాగే, కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, అక్టోబర్ 28 వరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తే ఉంచుతారు. దీంతో అక్టోబర్‌లో కూడా ప్రాజెక్టుకు వరద జలాల రాక కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదట 112 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులోకి భారీగా సిల్ట్ చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయింది. ఐదేళ్లలో ఇన్‌ఫ్లో ఇలా.. ఇదిలా ఉండగా గత ఐదేళ్లలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన ప్రవాహాలను పరిశీలిస్తే.. 2014–15లో కేవలం 14.77 టీఎంసీలు మాత్రమే ఇన్‌ఫ్లో వచ్చింది. 2015–16లో మరీ తక్కువగా 4.42 టీఎంసీల ఇన్‌ఫ్లో మాత్రమే వచ్చి చేరింది. ఇక 2016–17లో 254 టీఎంసీలు రాగా, 2017–18లో 85 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20లో 87 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. ఈసారి ఇప్పటికే 234 టీఎంసీల వరద జలాలు వచ్చాయి. రబీ పంటలకు భరోసా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఆయకట్టు ఉంది. స్టేజ్ –1 పరిధిలో 9.68 లక్షల ఆయకట్టు ఉండగా, స్టేజ్–2లో మరో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఖరీఫ్ పంటలతో పాటు రబీ పంటలకు కూడా సాగునీరందనుంది. దీంతో ఆయకట్టు రైతులకు భరోసా ఏర్పడింది. -
హైదరాబాద్‌లో నిలకడగా.. జిల్లాల్లో దూకుడుగా..
సాక్షి, హైదరాబాద్: మొన్నటివరకు హైదరాబాద్‌లో ప్రతాపం చూపించిన వైరస్.. ఇప్పుడు జిల్లాల్లో విజృంభిస్తోంది. పట్టణాలు, పల్లెల్లో పంజా విసురుతోంది. వారం రోజుల్లోనే చాలా జిల్లాల్లో రెట్టింపు కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. కొన్ని జిల్లాల్లో మూడు, నాలుగింతలు కూడా రికార్డయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్ మేరకు.. ఈ నెల 20న జీహెచ్ఎంసీ పరిధిలో 473 కేసులుండగా, 26న 449 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గత వారం రోజులుగా కేసుల సంఖ్య దాదాపు నిలకడగానే కొనసాగుతోంది. కానీ జిల్లాల్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 20న 21 కేసులు నమోదు కాగా, 26న ఏకంగా 72 కేసులు రికార్డయ్యాయి. అంటే మూడింతలకు మించిన కేసులన్న మాట. భూపాలపల్లి జిల్లాలో 20న 12 కేసులు నమోదు కాగా, 26న 26 కేసులు.. అంటే రెట్టింపునకు మించి నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో వారం క్రితం 79 కేసులు నమోదైతే, ఇప్పుడు 152 కేసులు నమోదయ్యాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలోనైతే వారం క్రితం 26 కేసులు నమోదైతే, ఇప్పుడు ఏకంగా 102 కేసులు రికార్డయ్యాయి. మంచిర్యాల జిల్లాలో వారం క్రితం 40 కేసులుంటే, ఇప్పుడు 106 కేసులు రికార్డయ్యాయి. నల్లగొండ జిల్లాలో వారం క్రితం 60 కేసులుంటే, ఇప్పుడు 164 నమోదయ్యాయి. నిజామాబాద్‌లో ముందు 69 కేసులుంటే, ఇప్పుడు 112 నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో వారం క్రితం 35 కేసులుంటే, ఇప్పుడు 77 నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో వారం క్రితం 49 కేసులుంటే, ఇప్పుడు 113 కేసులు వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 20న 18 కేసులుంటే, 26న 39 కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల వరకు కంటైన్మెంట్ జోన్లున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. పల్లెల్లోనూ వైరస్ వ్యాప్తి చెందడంతో గ్రామాల్లో అలజడి నెలకొంది. వచ్చే నెలాఖరుకు దాదాపు 3 వేల గ్రామాల్లోకి వైరస్ ప్రవేశించే అవకాశముందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరో 2,795 కేసులు.. రాష్ట్రంలో బుధవారం (26వ తేదీన) 60,386 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,795 పాజిటివ్ కేసులు వచ్చాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులిటెన్‌లో వెల్లడించారు. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. తాజాగా కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 788కి చేరింది. కరోనా బారి నుంచి తాజాగా 872 మంది కోలుకోగా, ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 86,095కి చేరిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,600 యాక్టివ్ కేసులున్నాయి. అందులో ఇళ్లు, ఇతరత్రా ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నవారు 20,866 మంది ఉన్నారు. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 11,42,480 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. -
ఉరికొస్తూ... ఊపిరిలూదుతూ...
సాక్షి, హైదరాబాద్: విస్తారంగా వర్షాలు.. పరవళ్లు తొక్కుతున్న ప్రవాహాలు.. నిండుకుండల్లా ప్రాజెక్టులు.. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న తాజా దృశ్యం. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు బిరబిరా వస్తూ సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఊపిరిలూదాయి. ఇప్పటికే కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయగా, గోదావరిలో సింగూరు, నిజాంసాగర్ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే లోయర్ మానేరు, మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తేశారు. రెండు, మూడు రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకునే అవకాశాలున్నాయి. నిండేందుకు సిద్ధంగా ఎస్సారెస్పీ... ఎగువ నుంచి స్థిరంగా ప్రవాహాలు వస్తుండటంతో ఎస్సారెస్పీ జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 90.31 టీఎంసీలకుగానూ 78 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆదివారం ఉదయం 52 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగగా, అది మధ్యాహ్నానికి 18 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా, నీటి ప్రవాహాల్లో హెచ్చుతగ్గులున్నాయి. 23 నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ఏర్పడుతున్న నేపథ్యంలో విస్తారంగా వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రవాహాలు పుంజుకుంటే రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్టు నిండొచ్చని భావిస్తున్నారు. 90 టీఎంసీలకు గానూ 85 టీఎంసీల మేర నీరు చేరిన వెంటనే గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. బోసిపోయిన సింగూరు, నిజాంసాగర్... అన్ని ప్రాజెక్టులకు భిన్నంగా సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు దర్శనమిస్తున్నాయి. అవి పూర్తిగా బోసిపోయి కనిపిస్తున్నాయి. సింగూరులో 29.91 టీఎంసీలకు కేవలం 2.81 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. స్థానిక పరీవాహకం నుంచి 1,122 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ సీజన్లో ఇంతవరకు కేవలం 2.80 టీఎంసీల మేర మాత్రమే కొత్తనీరు వచ్చి చేరింది. నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీలకు కేవలం 1.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 2 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ సీజన్లో కొత్తగా వచ్చి చేరిన నీరు కేవలం ఒక టీఎంసీ మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 4.50 టీఎంసీల లభ్యత ఉంటే అందులో కొత్తగా వచ్చింది 3.80 టీఎంసీలు. గత ఏడాదితో పోలిస్తే ప్రాజెక్టులో 4 టీఎంసీల మేర అధికంగా నిల్వ ఉంది. వచ్చే సెప్టెంబర్‌లో భారీ తుఫాన్లు వస్తే ఈ ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహాలు వస్తాయేమోనని ఇంజనీర్లు ఆశాభావంతో ఉన్నారు. -
వాన నీరు లోపలికి.. పాతాళ గంగ పైపైకి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు భూగర్భ జలాలకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. ఓ పక్క ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. మరోపక్క నిండుతున్న చెరువులు, ప్రాజెక్టులతో భూగర్భ జల మట్టం రికార్డు స్థాయిలో పైకి ఉబికి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం ఎక్కువగా నమోదు కావడం కన్నా.. ఎక్కువ కాలం నమోదవుతుండటం భూగర్భ మట్టాల్లో గణనీయ పెరుగుదలకు కారణమవుతోంది. రాష్ట్ర పరీవాహక ప్రాంతం, పెరిగిన నీటి మట్టాల ఆధారంగా జూన్, జూలై రెండు నెలల వ్యవధిలోనే 208 టీఎంసీల నీరు భూమిలో ఇంకిందని అంచనా వేస్తుండగా, ఆగస్టులో కూడా 200 టీఎంసీలు పెరిగే అవకాశముందని అంటున్నారు. వాన నీరు లోపలికి.. పాతాళ గంగ పైపైకి.. రాష్ట్రంలో జూన్ చివరలో, జూలైలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జూలై నెలాఖరుకు సగటున 373.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 439.8 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డయింది. 33 జిల్లాలకు గానూ 16 జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా, 15 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది జూలైలో రాష్ట్ర సగటు భూగర్భ నీటిమట్టం 14.12 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 9.26 మీటర్లకు చేరింది. ఏకంగా 4.86 మీటర్ల మేర భూగర్భం పైకి ఎగిసింది. జూన్, జూలైలో 40 రోజులకు పైగా వర్షాలు స్థిరంగా కురవడంతో భూగర్భ జలాలకు కలిసొచ్చింది. కురిసిన వర్షపాతంలో సగటున 10 శాతం నుంచి 11 శాతం నీరు భూగర్భానికి చేరుతుంది. రాష్ట్ర భూ విస్తీర్ణం, ప్రస్తుతం పెరిగిన భూగర్భ మట్టాల ఆధారంగా రెండు నెలల వ్యవధిలో 208 టీఎంసీల నీరు భూమిలోకి చేరిందని భూగర్భ జల శాఖ అంచనా వేసింది. ఇందులో ఒక్క జూలైలోనే 158 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకిందని తెలిపింది. ఆగస్టులో ఈ 19 రోజులుగా కురిసిన వర్షాలతో మరో 200 టీఎంసీల నీరు భూగర్భంలోకి చేరే అవకాశం ఉందని అంటున్నారు. కలిసొచ్చిన కాళేశ్వర జలాలు, చెరువులు.. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు నిండిన చెరువులు, ప్రాజెక్టులు, కాళేశ్వరం ఎత్తిపోతలు భూగర్భ మట్టాల పెరుగుదలకు కారణమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి బేసిన్లో 13,859 చెరువులు, కృష్ణా బేసిన్లో 5,904 చెరువులు కలిపి 19,763 చెరువులు మత్తడులు దుంకడం, రెండు బేసిన్లలో మరో 6,400 చెరువులు 75 శాతానికి పైగా, 4,800 చెరువులు 50 శాతానికి పైగా నిండటంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఇక కాళేశ్వరం జలాలు భూగర్భ మట్టాల పెరుగుదలకు వరంగా మారిందని భూగర్భ జల శాఖ తన జూలై నివేదికలో వెల్లడించింది. గతేడాది కాళేశ్వరం పరీవాహకంలో 602 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలోనే భూగర్భ జలాలపై ప్రభావం ఉండగా, ఈ ఏడాది జూలైలో 2,419 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరిగిందని తెలిపింది. ఈ ప్రభావంతో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, భువనగిరితో పాటు నిజామాబాద్‌లోని కొంత ప్రాంతం, కామారెడ్డిలోని తూర్పు ప్రాంతాల్లో భూగర్భ మట్టాలు మెరుగయ్యాయని వెల్లడించింది. రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం భూగర్భ మట్టం 5 మీటర్ల లోపలే ఉండగా, ఇందులో ఎక్కువగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, భద్రాద్రి, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని ఎక్కువ ప్రాంతాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. -
వినియోగంలో ల్యాప్‌టాప్
సాక్షి,హైదరాబాద్: కరోనా.. కల్చర్‌ను, వర్క్ కల్చర్‌నూ మార్చేసింది. సంప్రదాయ పనివిధానాలకు ప్రత్యా మ్నాయాలను ముందుకు తెచ్చింది. ప్రజారవాణా వ్యవస్థలు నిలిచిపోవడంతోపాటు ఇంటి నుంచి బయటకు లేదా ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి. ఎలాగోలా వెళ్లితే ఎక్కడ కరోనా బారిన పడతామోనన్న భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం, రిమోట్ డెస్క్ వంటి పని పద్ధతులను వివిధ రంగాల సంస్థలు, ఉద్యోగులు ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ల్యాప్‌ట్యాప్‌లు, నోట్‌బుక్‌ల వినియోగం పెరిగింది. దీంతో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కరోనాకు ముందు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో నోట్బుక్లు, ల్యాప్‌ట్యాప్‌లకు డిమాండ్ నామమాత్రంగా ఉండేది. ఇప్పుడవి హాట్‌కేకుల్లా అమ్ముడుపోతుండటంతో కొన్ని కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయి. అయితే వాటి కూడా స్టాక్ అయిపోవడంతోపాటు దేశంలో ఎక్కడ స్టాక్ ఉందో వెతికి పట్టుకుని వినియోగదారులకు అందించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఏకంగా కొత్త ప్లాంటు ప్రారంభం ఒక కంపెనీ మరో సంస్థ సహకారంతో తమిళనాడులో ఏకంగా ఒక కొత్త ప్లాంటునే ప్రారంభించింది. దీనిని బట్టి ల్యాప్‌ట్యాప్‌లకు డిమాండ్ ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియా ఇటీవల నిర్వహించిన ప్రైమ్‌డే సేల్‌లోనూ ల్యాప్‌ట్యాప్ అమ్మకాలే టాప్‌లో నిలిచాయి. ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో లాక్డౌన్ ఉన్నప్పటికీ దాదాపు 20 శాతం మేర షిప్మెంట్లలో వృద్ధి నమోదైనట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) గణాంకాలను బట్టి వెల్లడైంది. డెస్క్‌టాప్‌లు అమ్మకాలు తగ్గుముఖం నోట్‌బుక్‌ల అమ్మకాల్లో 105.5 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు ల్యాప్‌టాప్‌లు/నోట్‌బుక్‌ల వైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపడంతో డెస్క్‌టాప్‌ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి, దీంతో వీటి షిప్మెంట్ కూడా 46 శాతం తగ్గినట్టు ఐడీసీ సమాచారం బట్టి తెలుస్తోంది. ఐటీ సర్వీసెస్, గ్లోబర్ ఎంటర్ ప్రైజెస్, కన్సల్టింగ్ కంపెనీలు నోట్‌బుక్‌ల కోసం భారీ ఆర్డర్లు ఇవ్వడంతోపాటు డెస్క్‌టాప్‌ల కొనుగోళ్లను గణనీయంగా తగ్గించినట్టు వెల్లడైంది. 91% పెరిగిన ల్యాప్‌టాప్‌ల వినియోగం కోవిడ్ మహమ్మారి సందర్భంగా భారత్‌లో 91 శాతం మేర ల్యాప్‌టాప్‌లు ఉపయోగించేవారు పెరిగినట్టు లెనోవ్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ పరిశీలనలో వెల్లడైంది. కస్టమర్లు తమ పాత ల్యాప్‌టాప్‌లను హై పెర్ఫార్మెన్స్ డివైజెస్‌గా అప్డేట్ చేసుకోవడంతోపాటు వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టుగా స్పష్టమైంది. దీంతో ఈ కేటగిరిలో ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌ల మార్కెట్ వృద్ధి అవకాశాలు మరింత పెరిగాయి. -
కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగు లు పెడుతోంది. ఎగువ నుంచి శనివారం సాయంత్రం 98,975 క్యూసెక్కులు చేరుతుండగా రాత్రి 12 గంటలకు ఇది రెండు లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ దఫా వరదకు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండవచ్చని అంచనా వేస్తున్నాయి. ► పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సగటున 72 మి.మీ.ల వర్షపాతం పడింది. దాంతో కృష్ణా, ఉపనదుల్లో గంట గంటకూ వరద పెరుగుతోంది. ► ఆల్మట్టిలోకి వరద పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) సూచనల మేరకు డ్యామ్ నీటినిల్వలను ఖాళీ చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. దాంతో జూరాలకు భారీగా వరద చేరుతోంది. జూరాల వరదను దిగువకు వదులుతున్నారు. ► శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు జలాలు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం 558.20 అడుగులకు చేరుకుంది. ► అప్పర్ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ నుంచి భారీ వరదను దిగువకు వదులుతుండటంతో తుంగభద్రలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ► పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని నుంచి నీటి ప్రవాహం చేరుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.17 లక్షల క్యూసెక్కులు చేరుతుం డగా 7 వేల క్యూసెక్కులు డెల్టాకు, మిగిలిన 1.11 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
సాగర్ సాగు.. ఆశాజనకం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ పరిధిలో కురుస్తున్న వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడం.. దిగువన రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఉధృతంగా ప్రవాహా లు నమోదవుతుండటంతో నాగార్జునసాగర్ కింది ఆయకట్టు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టులో ఇప్పటికే కనీస నీటి మట్టాలకు ఎగువన అరవై టీఎంసీల నీటి లభ్యత ఉండటం..ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖరీఫ్‌కు సాగునీటి విడుదలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు మొ దలుపెట్టింది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు తొలి వారం నుంచే నీటి విడుదల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. పూర్తి ఆయకట్టుకు..? సాగర్ ఎడమకాల్వ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. గత ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో కేవలం 35 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించారు. యాసంగి సీజన్లో మాత్రం 6.15 లక్షల ఎకరాలకు నీరివ్వగా 55 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ప్రస్తుతం సైతం 6.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, దీనికి 60 టీఎంసీలు అవసరమని లెక్కించారు. దీంతో పాటే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) కింద 2.63 లక్షల ఎకరాలకు మరో 20 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు మరో 10 టీఎంసీలు కలిపి మొత్తంగా 90 టీఎంసీల అవసరాలను గుర్తించారు. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండి ఉండటం, నవంబర్– డిసెంబర్ వరకు సైతం ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో 90 టీఎంసీల మేర నీటిని ఇవ్వడం పెద్ద కష్టం కాదని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న 60 టీఎంసీల లభ్యత నీటిని ఐదారు తడుల ద్వారా ఆయకట్టుకు విడుదల చేయాలని యోచిస్తున్నారు. అయితే ఆయకట్టు ప్రాంత ప్రజా ప్రతినిధులతో ఒకమారు చర్చించిన అనంతరం వారి సూచనల మేరకు నీటి విడుదల చేయాలని భావిస్తున్నారు. గత ఏడాది ఆగ స్టు నుంచి నవంబర్ వరకు నీటి విడుదల కొనసాగింది. ఈ ఏడాది సైతం ఆగస్టు తొలి వారం నుంచి నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంద ని నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎగువ పరవళ్లతో సాగర్ పరవశం... గడిచిన ఇరవై రోజులుగా పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే రెండు ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదల చేస్తుండటంతో ఆ నీరంతా జూరాల మీదుగా శ్రీశైలం చేరుతోంది. ప్రస్తుత సీజన్లో జూరాలకు 80 టీఎంసీల మేర కొత్త నీరురాగా, శ్రీశైలానికి స్థానికంగా వచ్చిన ప్రవాహాలు కలుపుకొని మొత్తంగా 85 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 90 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులోంచే పవర్‌హౌస్‌ల ద్వారా నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌లో ఇప్పటివరకు 30 టీఎంసీల కొత్త నీరు చేరింది. సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు కాగా ప్రస్తుతం 191 టీఎంసీల నీరుంది. 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఇందులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 60 టీఎంసీల మేర ఉంది. ఈ నీటిని సాగర్ కింది ఆయకట్టు అవసరాలకు వినియోగించే అవకాశాలున్నాయి. -
సామాజిక వ్యాప్తి మొదలు?
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం రోజుకు 40 వేల వరకు కరోనా కేసులు నమోదవుతుండటం, బాధితుల సంఖ్య 11 లక్షలు దాటడంతో వ్యాధి విషయంలో భారత్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఒక్క లక్షద్వీప్‌ను మినహాయించి మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కనీసం 27 రాష్ట్రాల్లో రోజుకు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదవుతుండటం, అతితక్కువ కేసులు ఉన్న అండమాన్ నికోబార్లోనూ వాటి సంఖ్య 150కు చేరుకోవడంతో సామాజిక వ్యాప్తి విషయమై సర్వత్రా చర్చ మొదలైంది. వ్యాధుల నిపుణుల అంచనాల మేరకు దేశంలో సామాజిక వ్యాప్తి ఇప్పటికే మొదలైంది. కానీ ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు సరికదా.. సామాజిక వ్యాప్తి అనేది లేనేలేదని అంటోంది. ఇంతకీ ఈ సామాజిక వ్యాప్తి అంటే ఏమిటి? ఉంటే దాని పరిణామాలేమిటి? అంతా అస్పష్టతే.. దేశంలో కరోనా వ్యాధి ఎలా వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకుంటే సామాజిక వ్యాప్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలోని వూహాన్ నుంచి కొంత మంది విద్యార్థులు దేశంలోకి వచ్చిన తరువాత ఇక్కడ వ్యాధి మొదలైంది. ఆ సమయంలో విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించడం, వైరస్ ఉన్న వారిని వేరు చేసి చికిత్స అందించడంతోపాటు ఆయా వ్యక్తులు ఎవరెవరితో సంబం ధాలు పెట్టుకున్నారన్న విషయాన్ని ఆరా తీసి వారందరికీ పరీక్షలు నిర్వహించారు. దీంతో వ్యాధి ఎవరి నుంచి ఎవరికి సోకిందో స్పష్టంగా తెలిసింది. అంతేకాకుం డా వ్యాధిని అక్కడికక్కడే కట్టడి చేసేందుకు అవకాశమేర్పడింది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ వ్యాధిని వ్యాప్తి చేస్తున్న వారు ఎవరు? బాధితులు ఎవరనేది తెలుసుకోవడం కష్టమైంది. ఇలా ఎవరి నుంచి ఎవరికి వ్యాధి సోకిందో కచ్చితంగా నిర్ధారించలేని స్థితిని సామాజిక వ్యాప్తి అని పిలుస్తారు. ఉందా.. లేదా? దేశంలోని 11 లక్షల నిర్ధారిత కోవిడ్ కేసులను నిశితంగా పరిశీలిస్తే సామాజిక వ్యాప్తి ఉందన్నది స్పష్టంగా తెలిసిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు కూడా అనధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కొంతకాలం క్రితం భారత వైద్య పరిశోధన మండలి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిందని, తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై జరిగిన ఈ సర్వేలో 40 శాతం మంది సమస్యకు కారణమేమిటో స్పష్టంగా చెప్పలేకపోయారని, ఇది సామాజిక వ్యాప్తికి సూచికేనని వారు చెబుతున్నారు. ముందుజాగ్రత్తలే మేలు.. ప్రభుత్వం ఇప్పటికైనా సామాజిక వ్యాప్తిని అంగీకరించడం మేలని దేశంలోనే ప్రముఖ వ్యాధుల నిపుణులు జయప్రకాశ్ ములియిల్ అంటున్నారు. వ్యాధిని కట్టడి చేయడంలో విఫలమయ్యాయన్న నిందను భరించాల్సి వస్తుందని ప్రభుత్వాలు సామాజిక వ్యాప్తిని నిరాకరిస్తూ ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం అంగీకరించినా, అంగీకరించకపోయినా వ్యాధి కట్టడి, చికిత్స విషయంలో ఎలాంటి మార్పులూ ఉండబోవన్నారు. పరీక్షలు చేయడం, వ్యాధిగ్రస్తులను గుర్తించి ఇసోలేషన్లో ఉంచడం, చికిత్స కల్పించడమే మన ముందున్న మార్గమన్నారు. ప్రజలు కూడా మునుపటి లాగానే తరచూ చేతులు కడుక్కోవడం, ముఖానికి మాస్క్ వేసుకోవడం, వీలైనంత వరకు జనసమర్ధ ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. -
జిల్లాల్లోనూ ‘వైరస్’ సైరన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ రాష్ట్రమంతటా చుట్టబెట్టేస్తోంది. ఇంతకాలం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొన్ని రోజులుగా జిల్లాల్లో సైతం గణనీయ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఇప్పటి వరకు వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండగా, వరంగల్ అర్బన్, కరీంనగర్, నల్లగొండ, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి–కొత్తగూడెం, నిజామాబాద్,æ మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ క్రమంగా వ్యాప్తి పెరుగుతోంది. రోజూ జీహెచ్ఎంసీ, రంగారెడ్డి/మేడ్చల్ జిల్లాల పరిధిలో మూడంకెల పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, దాదాపు మరో 10 జిల్లాల్లో రెండంకెలు, 15 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా వైరస్ గ్రామీణ జిల్లాలకు సైతం పాకుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి నియంత్రణకు మళ్లీ లాక్డౌన్ విధిస్తారంటూ గత నెలాఖరులో వచ్చిన వార్తలతో చాలామంది నగరం నుంచి సొంతూళ్లకు వలసవెళ్లారు. ఇది కూడా కొంత వరకు జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమైందని జిల్లాల్లోని అధికారులు అంటున్నారు. కొత్తగా 6 జిల్లాల్లో ఉధృతి జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఇప్పటికే హాట్స్పాట్లుగా మారాయి. నల్లగొండ, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో సైతం కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఈ 6 జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్ఎంసీ మినహాయిస్తే మరో 10 జిల్లాల్లో కరోనా వ్యాప్తి విస్తృతం అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మాస్కుల్లేవ్.. భౌతికదూరం నిల్ లాక్డౌన్ సడలింపులు అమల్లోకి రావడంతో బహిరంగ ప్రదేశాల్లో జనసంచారం మునుపటి స్థితికి చేరింది. లాక్డౌన్ సడలించి నెలకుపైగా గడిచి పోవడం తో ప్రజలు మళ్లీ సాధారణ జీవనానికి అలవడుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడమనే నిబంధనలు గాలికొదిలి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఓవైపు కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నా తమకేమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. ఉదాహరణకు గత వారం రోజులుగా నల్లగొండ జిల్లాలో గణనీయ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నా, స్థానిక ప్రకాశంబజార్ మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు, వర్కర్లు మాస్కుల్లేకుండానే పనిచేస్తున్నారు. కొంతమంది ధరించినా.. వాటిని మూతిపై నుంచి కిందకి లాగి మెడకు వేలాడదీస్తున్నారు. కాగా, బయట కనిపించే వారిలో దాదాపు 50 శాతం మంది మాస్కుల్లేకుండానే తిరుగుతున్నారు. మాస్కులు ధరించకపోతే రూ.1,000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా.. కఠినంగా అమలు చేయకపోవడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. జూలై 1 నుంచి జిల్లాల వారీగా నమోదైన కేసులు జిల్లా కేసులు రంగారెడ్డి 1,042 మేడ్చల్ 718 సంగారెడ్డి 203 నల్లగొండ 155 కరీంనగర్ 122 మహబూబ్‌నగర్ 110 వరంగల్ అర్బన్ 109 వరంగల్ రూరల్ 108 నిజామాబాద్ 104 మెదక్ 85 కామారెడ్డి 75 సూర్యాపేట 46 కామారెడ్డి 46 మంచిర్యాల 46 భద్రాద్రి కొత్తగూడెం 37 ఆదిలాబాద్ 22 -
ఆల్మట్టికి పోటెత్తిన కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: కృష్ణాకు ఎగువన వర్షం, దిగువన హర్షం.. చినుకు చినుకుకు ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పరీవాహకం పరవశిస్తోంది. ప్రవాహాలు పెరిగినకొద్దీ దిగువ ప్రాజెక్టుల్లో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా ఎగువన ఉన్న ఆల్మట్టికి రోజురోజుకూ వరద ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి నుంచి విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటి విడుదలను కర్ణాటక మొదలు పెట్టింది. మరో 50 టీఎంసీలు చేరితే దిగువకు... పశ్చిమ కనుమల్లో 3, 4 రోజులుగా 20 సెంటీమీటర్లకుపైగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టిలోకి ప్రవాహాలు పుంజుకుంటున్నా యి. గురువారం ప్రాజెక్టులోకి 49,636 క్యూ సెక్కుల ప్రవాహాలు రాగా, ఇవి సాయం త్రానికి 52 వేల క్యూసెక్కులకు పెరిగినట్లు కేంద్ర జలసంఘం అధికారులు చెబుతున్నా రు. ప్రస్తుతం ఆల్మట్టిలో 129 టీఎంసీలకు 85 టీఎంసీల నిల్వ ఉంది. ఈ సీజన్లో 60 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ఎగువ నుంచి ప్రవాహాలు ఇంకా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఆల్మట్టిలో విద్యుదుత్పత్తిని కర్ణాటక ఆరంభించింది. విద్యుదుత్పత్తి ద్వారా 10,088 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్‌ల ద్వారా విడుదల చేస్తోంది. మరో 45 టీఎంసీలు చేరితే గేట్లెత్తి ప్రాజెక్టు నుంచి దిగువకు ఎక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్మ ట్టి నుంచి నీటి విడుదలతో దిగువన నారాయణపూర్‌లోకి 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇక్కడ ప్రస్తుతం 37 టీఎంసీలకుగానూ 26.50 టీఎంసీల నీరునిల్వ ఉంది. మరో 5 టీఎంసీల నీరు చేరిన వెంటనే దిగువన జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుద ల చేసే అవకాశం ఉంది. ప్రవాహాలు ఇదే రీతిన కొనసాగితే ఈ నెల మూడోవారం నుంచి జూరాలకు నీటిని విడుదల చేయొచ్చని నీటి పారుదల శాఖ అంచనా. ప్రస్తుతం జూరాలలో నీటి నిల్వ 9.66 టీఎంసీలకుగానూ 7.80 టీఎంసీలకు చేరింది. ఫలితంగా నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పంపు ల ద్వారా 1,466 క్యూసెక్కుల నీటిని పం పింగ్ చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి 16,211 క్యూసెక్కుల మేర నీరు వస్తుం డగా, నిల్వ 100 టీఎంసీలకుగానూ 14 టీ ఎంసీలకు చేరింది. ఉజ్జయిని నదిలోకి 4,587 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఇ క్కడ నిల్వ 117 టీఎంసీలకుగానూ 60 టీ ఎంసీలకు చేరింది. ఇక స్థానిక పరీవాహకం నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 669 క్యూసెక్కు ల ప్రవాహం వస్తోంది. అక్కడ నిల్వ 215 టీఎంసీలకుగానూ 36.50 టీఎంసీలు ఉం ది. నాగార్జునసాగర్‌లోకి 1,280 క్యూసెక్కు ల ప్రవాహాలు వస్తుండగా, నిల్వ 312 టీఎంసీలకు 168.54 టీఎంసీలు ఉంది. -
కరోనా కల్లోలం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. కరోనా కేసుల నమోదులోనే కాదు.. వైరస్ బారిన పడ్డ వారి మరణాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. మూడో విడత లాక్డౌన్ ముగిసిన తర్వాత ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడం మొదలైంది. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకుండా, జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వైరస్ వ్యాప్తి విస్తృతమైంది. రెండు వారాల్లో దాదాపు 100 మంది ఈ వైరస్‌కు బలయ్యారు. మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పెరిగిన మరణాల సగటు.. కరోనా వైరస్ బాధితులపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. మూడో విడత లాక్డౌన్ అనంతర పరిస్థితులను పరిశీలిస్తే.. రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులతో పోలిస్తే మరణాల సంఖ్య భారీగా ఉంది. నమోదవుతున్న కేసుల్లో దాదాపు 5 శాతం మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత నెల 21 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,936 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వంద మంది మృత్యువాత పడ్డారు. అంటే ఈ కేసుల్లో సగటున 5 శాతం మరణాలు నమోదయ్యాయి. జూన్ నెల 1 నుంచి 7 వరకు పరిశీలిస్తే.. 950 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 55 మంది చనిపోయారు. ఈ లెక్కన రోజువారీ మరణాల సగటు 5.7 శాతానికి పెరిగింది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వందకు పైగా వస్తున్నాయి. 3 రోజుల్లో పావు వంతు.. కరోనా బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 137 మంది మరణించారు. ఇందులో ఈ నెల 5, 6, 7 తేదీల్లోనే ఎక్కువ మంది చనిపోయారు. ఈ మూడు రోజుల్లో ఏకంగా 32 మంది మృత్యువాత పడినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటివరకు నమోదైన మరణాల్లో పావు వంతు మంది మూడు రోజుల్లోనే చనిపోయారు. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కనీస జాగ్రత్తలు పాటించాలని ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు ఏ మాత్రం పట్టించుకోవట్లేదంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం జరిగిన వైద్య శాఖ అధికారుల సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ఆలయాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో జనసంచారం మరింత పెరుగుతుందని, దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. -
రెండు వారాల్లో రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్డౌన్ సడలింపులతో దాదాపు అన్ని రంగాలపై ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేశారు. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతుండటంతో వైరస్ వ్యాప్తి భారీగా పెరుగుతోంది. గత రెండు వారాల్లో వైరస్ ప్రభావం రెట్టింపు అయ్యింది. లాక్డౌన్ సమయంలో రోజుకు తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం వీటి సంఖ్య భారీగా పెరిగింది. రోజుకు వందకు పైబడి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సర్కారు సైతం ఆందోళన చెందుతోంది. బాధితుల సంఖ్య భారీగా పెరిగితే వారికి చికిత్స ఎలా ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. మే నెల 18 నుంచి లాక్డౌన్ ఆంక్షలు భారీగా సడలించారు. అంతకుముందు నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు, అత్యవసర సేవలందించే సంస్థలకే అవకాశం ఉండగా.. 18 నుంచి సాధారణ వ్యాపారాలు, రవాణా సౌకర్యం, అంతర్రాష్ట్ర రాకపోకలు.. ఇలా మెజారిటీ రంగాలకు సడలింపులు ఇవ్వగా, ప్రజలు బయటకు రావడం ఒక్కసారిగా పెరిగింది. ముందు అదుపులో ఉన్నా.. రాష్ట్రంలో తొలి కరోనా కేసు మార్చి 2న నమోదైంది. మార్చి 16 నుంచి విద్యా సంస్థలు, ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లు, హోటళ్లను ప్రభుత్వం మూసేయగా.. మార్చి 22 నుంచి అత్యవసర సేవలందించే సంస్థలకు మినహా అన్ని రంగాలకు లాక్డౌన్ ప్రకటించింది. మే 18 వరకు లాక్డౌన్ పూర్తిస్థాయిలో కొనసాగడంతో రాష్ట్రంలో 1,592 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా అన్ని రంగాలకు సడలింపులు రావడంతో కేసుల సంఖ్య రెట్టింపయింది. బుధవారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో 3,020 కేసులు నమోదైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రెండున్నర నెలల పాటు నమోదైన కేసులు.. లాక్డౌన్ సడలింపులతో రెండు వారాల్లోనే రెట్టింపయ్యాయి. ముఖ్యంగా మే 21 నుంచి కేసుల సంఖ్య వరుసగా పెరుగుతూ.. ఒక్కో రోజు వందకు పైబడి కేసులు నమోదవుతున్నాయి. వలస కూలీలకు అనుమతివ్వడం, అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతించడంతో రాకపోకలు భారీగా పెరిగాయి. దీంతో గత రెండు వారాల్లోనే రాష్ట్రంలో 1,306 కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు గ్రేటర్ పరిధిలోనే.. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. గత రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,306 కేసులు నమోదు కాగా.. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 315 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారున్నారు. రెండు వారాల్లో నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీవే 62 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2 వారాల్లో నమోదైన కేసుల్లో వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే.. 991 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీలో కేసుల శాతం 81 కావడం గమనార్హం. జనసాంద్రత అధికంగా ఉండటం, భౌతికదూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే కేసులు అధికమవుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనా తీవ్రత తగ్గినట్లు చాలామంది భావిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. -
ఎల్లుండి నుంచి ఎగిరిపోవచ్చు!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ లాక్డౌన్ కారణంగా నిలిచి పోయిన విమానాలు తిరిగి ఎగర డానికి సన్నద్ధమవుతున్నాయి. దేశీయ విమానాలు నడిపేందుకు కేంద్రం అనుమతినివ్వడంతో హైదరాబాద్ అంతర్జా తీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు విమానాలను నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు బుకింగ్‌లు ప్రారంభిం చాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 25న మొదటి విమానం బయల్దేరనుంది. ఆ తర్వాత బెంగళూర్, ముంబై, చెన్నై, కోల్‌కతా తదితర మెట్రో నగరాలకు విమానాలు వెళ్లనున్నాయి. అనంతరం అన్ని ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి విమానాల రాకపోకలు అందుబాటులోకి వస్తాయి. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడప తదితర నగరాలకూ పలు ఎయిర్‌లైన్స్ బుకింగ్‌లు ప్రారంభించాయి. దశల వారీగా దేశంలోని 35 నగరాలకు విమానయాన సేవలు వినియోగంలోకి రానున్నాయి. పెరిగిన చార్జీలు... లాక్డౌన్ అనంతరం ప్రారంభమవుతున్న అన్ని దేశీయ విమాన సర్వీసుల్లో చార్జీలు పెరిగాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఈనెల 25న టికెట్ ధర రూ.8,407 ఉంది. స్పైస్‌జెట్‌లో ఇది రూ.11,220 వరకు ఉంది. హైదరాబాద్–చెన్నై టికెట్ ధర రూ.4,551 ఉండగా.. ముంబైకి రూ.4,603 చార్జీ ఉంది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, తదితర నగరాలకు కూడా చార్జీలు పెరిగాయి. కరోనా కారణంగా విమానంలోని సీట్ల సం ఖ్యను తగ్గిస్తున్నారు. 80 నుంచి 100 సీట్లున్న చిన్న ఫ్లైట్లలో సుమారు 40 నుంచి 50 సీట్లు మాత్రమే వినియోగంలోకి రానున్నాయి. అలాగే 250 నుంచి 300 సీట్లుండే ఫ్లైట్లలోనూ సీట్ల సంఖ్యను భారీగా కుదించనున్నారు. ప్రతి విమానంలో చివరి 3 సీట్లను వదిలేస్తారు. ప్రయాణ సమయంలో అనుకోని విధంగా ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, కరోనా లక్షణాలు కనిపించినా వారిని వెనుక సీట్లలోకి మారుస్తారు. కరోనా నిబంధనల మేరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అన్నివిధాలుగా సిద్ధం చేశారు. ఎయిర్ పోర్టులోకి ప్రవేశించి విమానం ఎక్కే వరకు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. -
ఉద్యోగాలు పోతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతోంది. కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో కూలీలు ఉపాధికి దూరమయ్యారు. వివిధ రంగాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. లాక్డౌన్ ప్రభావం అసంఘటిత రంగంపై తీవ్రంగా పడింది. మార్చి ఒకటో తేదీ నాటికి దేశంలో నిరుద్యోగం 7.91 శాతమే ఉండగా అనేక రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి శనివారం నాటికి అది 23.56 శాతానికి చేరుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 9 శాతం ఉన్న నిరుద్యోగం.. మార్కెట్ పరిస్థితులు దిగజారిపోవడంతో 25 రోజుల్లోనే 14 శాతం నిరుద్యోగం పెరిగింది. ప్రసుత్తం 23.56 శాతం ఉన్న నిరుద్యోగం ఈ నెలాఖరుకు 26 శాతానికి చేరుకుంటుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనా వేసింది. మార్చి ఒకటో తేదీన పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.63 శాతం ఉంటే ఈనెల 25వ తేదీ నాటికి 25.46 శాతానికి చేరుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 7.58 శాతం నుంచి 22.71 శాతానికి పెరిగింది. లాక్డౌన్ నుంచి మొదలుకొని.. మార్చి 22న ప్రకటించిన లాక్డౌన్ ప్రభావం ఆ నెలలో కనిపించకపోయినా వారం రోజుల తర్వాత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన ప్రభావాన్ని భారీగా చూపింది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోవడంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో నిరుద్యోగం పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్ రెండో వారం నుంచి దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఏప్రిల్ మొదటి వారంలో పెరుగుదల సాధారణంగా ఉన్నా.. రెండో వారంలో పెరుగుదల ఎక్కువవుతూ వచ్చింది. మూడో వారం గడిచేసరికి 23.56 శాతానికి చేరింది. పునరుద్ధరణ ప్రభుత్వాలకు సవాలే: ప్రొఫెసర్ కోదండరామ్ సర్వీసు సెక్టార్ నిలిచిపోయింది. ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. హౌస్‌హోల్డ్ సేవలు నిలిచిపోయాయి. భవన నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. అగ్రికల్చర్ కొంత కొనసాగుతున్నా లాక్డౌన్ ప్రభావం తీవ్రంగానే పడింది. రాష్ట్రంలో 50 శాతం కార్మికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారున్నారు. అసంఘటిత రంగంలో దినసరి వేతన కూలీలు, ప్లంబర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్ రంగాల్లోని వారికి పనే లేదు. వాటన్నింటిని ఎలా పునరుద్ధరిస్తారనేదే ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద సవాలే. అన్నింటి కంటే మెజారిటీ కార్మికులు, ఉద్యోగులున్న అసంఘటిత రంగాన్ని ముందుగా రివైవ్ చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో అందుకు ఉపాధి హామీ లాంటి కార్యక్రమం చేపట్టాలి. ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నందునా పని చేసిన వారికి వాటిని పంపిణీ చేయడం తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితి పోతుంది. ఇదీ రాష్ట్ర పరిస్థితి.. ఇక తెలంగాణలో లేబర్ పార్టిసిపేషన్ రేట్ (ఎల్పీఆర్) గతేడాది డిసెంబర్ మధ్యలో 53.44 ఉండగా, నిరుద్యోగం రేట్ 2.30 శాతంగా ఉంది. అది మార్చి చివరి నాటికి 5.8 శాతానికి పెరిగింది. ఈ నెలాఖరుకు నెలవారీ లెక్కలు రానున్నాయి. అయితే దేశంలో నిరుద్యోగం రేటు (అన్ ఎంపాయ్‌మెంట్ రేట్–యూఈఆర్) ఏప్రిల్ 1 నుంచి 25 రోజుల్లోనే అంతకుముందు ఉన్నదానిపై 14 శాతం పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగం రేట్ యావరేజ్‌గా 15 శాతం వరకు వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో గత డిసెంబర్లో ఎల్పీఆర్ 43.13 శాతం ఉండగా, యూఈఆర్ 4.22 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీఆర్ 60.61 శాతం ఉండగా యూఈఆర్ 1.35 శాతంగా ఉంది. తగ్గిపోయిన కార్మిక భాగస్వామ్యం సుదీర్ఘ లాక్‌డౌన్‌తో దేశంలో కార్మిక భాగస్వామ్యం తగ్గిపోయింది. దినసరి వేతన కూలీలు, భవన నిర్మాణ కార్మికుల ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సేవా రంగంలోనూ పనులు లేకుండా పోయాయి. దీంతో కార్మిక భాగస్వామ్యం రేటు 41.96 శాతం నుంచి 35.01 శాతానికి పడిపోయింది. ఉద్యోగ, ఉపాధి రేటు కూడా భారీగా పడిపోయింది. మార్చి ఒకటో తేదీ నాటికి ఉపాధి 39.84 కోట్ల మందికి ఉంటే ఏప్రిల్ 19 నాటికి 27.07 కోట్ల మందికే ఉపాధి ఉన్నట్లుగా తేల్చింది. అంటే దేశంలో కార్మికులు, చిన్న ఉద్యోగులు 12.77 శాతం మంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారు. -
అసలు సమస్య ఆ 6%
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ఉల్లంఘనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జిల్లాల్లో ప్రజలు నూటికి నూరు పాళ్లు సహకరిస్తుంటే.. పట్టణాల్లో మాత్రం లాక్డౌన్ ఆశయాన్ని నీరుగార్చేలా.. పోలీసుల ప్రయత్నాలను అపహాస్యం చేసేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. లాక్డౌన్ ఎంతకాలం కొనసాగించాలి? అన్న అంశంపై ఆన్లైన్లో తెలంగాణ పోలీసులు ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. అందులో లాక్‌డౌన్‌ను సమర్థిస్తూ దాదాపుగా 94 శాతం మంది మద్దతు తెలిపారు. కానీ, కేవలం 6 శాతం మంది మాత్రం లాక్డౌన్ ఎందుకు పెట్టారు? దాని ఉద్దేశం ఏంటి? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? అన్న విషయాలపై అస్సలు తమకు ఐడియానే లేదని సమాధానమిచ్చారు. వీరితోనే అసలు సమస్య అని పోలీసులు పేర్కొంటున్నారు. వీరికి కనీసం లాక్డౌన్ సమయాలపై కూడా అవగాహన లేకపోవడం గమనార్హం. అందుకే, ఇష్టానుసారంగా వేళాపాళా లేకుండా బయటికి వస్తున్నారు. వీరు వైరస్ క్యారియర్లుగా మారితే కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముం దని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. వీరే ప్రమాదం.. లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్న వారిలో జిల్లాల వాసులు, గ్రామీణులు ముందున్నా.. నగరాలు, పట్టణాల్లో కొందరు ఆకతాయిలు మాత్రం వీటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఈ పోకడలు గ్రేటర్ పరిధిలో మరీ అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లమీదకు వచ్చిన లక్షకుపైగా వాహనాలు కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కావడం విశేషం. వీరికి నిబంధనల పట్ల ఏమాత్రం లెక్కలేదన్న విషయం దీనితో తేటతెల్లమవుతోంది. ఉల్లంఘనుల్లో అధికశాతం చదువుకున్న యువతే కావడం గమనార్హం. ఉల్లంఘనల శాతం జిల్లాల్లో 30 శాతంగా ఉండగా, హైదరాబాద్‌లో మాత్రం 50 శాతంగా ఉండటం గమనార్హం. ఇక పాతబస్తీలో లాక్డౌన్ నిబంధనలు సరిగా అమలు కావడం లేదు. లాక్డౌన్ అంటే అస్సలు ఐడియాలేని వారిలో ఇక్కడే అధికంగా ఉన్నారు. ఈ ఆరుశాతం మంది కరోనా వైరస్‌ను మోసుకెళ్లే క్యారియర్లుగా మారే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట సడలింపుతో.. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు కిరాణా, ఇతర నిత్యావసర సరుకుల వ్యాపారాలకు అనుమతి ఉంది. కానీ, ఇదే ఆసరాగా చేసుకుని చాలామంది భౌతికదూరాన్ని పాటించడం లేదు. అసలే కరోనా పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ మొదటిస్థానంలో ఉన్నా, ఇక్కడ కొందరు ప్రజలు ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగిలిన జిల్లాల్లో పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతుంటే.. ఇక్కడ అలాంటి పరిస్థితులు కనిపించకపోవడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అసలు లాక్డౌన్ లక్ష్యం నెరవేరకుండా పోతుందని, ఆయా ఏరియాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ధరలు డబుల్!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్.. నిత్యావసర సరుకులు మినహా మిగతా వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలన్నీ బంద్. కొన్ని రంగాలకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేయడంతో దుకాణాలకు పడిన తాళం తెరవని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒకవైపు మాత్రమే. దీర్ఘకాలంగా వ్యాపారం నడవకుంటే గిట్టుబాటు కాదనుకున్న కొందరు వ్యాపారులు దొడ్డి దారిన అమ్మకాలకు తెరలేపారు. అది కూడా రెట్టింపు ధరలకు.. కొనుగోలుదారు అవసరాన్ని బట్టి విక్రయాలను జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టనప్పటికీ.. ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాల పనులను అంతర్గతంగా సాగిస్తున్నారు. అవసరమైన మెటీరియల్ కొనేందుకు సంబంధిత డీలర్లు, వ్యాపారులను సంప్రదిస్తుండగా ధరలను అమాంతం పెంచేస్తున్నారు. కొందరు రాత్రిపూట దుకాణాలను తెరుస్తుండగా.. మరికొందరు దొడ్డి దారిని ఎంచుకుని కస్టమర్లకు అవసరమైన సామగ్రిని సర్దుతున్నారు. కార్మికులు, కూలీలున్నారని... మార్చి 22న జనతా కర్ఫ్యూ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రం దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 14 వరకు ప్రకటించిన లాక్డౌన్.. అనంతరం మే 3వరకు పొడిగించింది. దీంతో ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు, కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. కొందరు సొంత ప్రాంతాలను కాలిబాటన ప్రయాణం కాగా.. మరికొందరు తమ ఓనర్ల వద్దే తలదాచుకున్నారు. లాక్డౌన్ పొడిగించడంతో అటు పనిలేక, ఇటు పైసలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నిర్మాణదారులు వారికి ఆశ్రయం కల్పిస్తూ వారితో మిగులు పనులను చేయించేందుకు ఉపక్రమించారు. దీంతో వారికి ఉపాధి దొరకడంతో పాటు వీరికి పనులు పెండింగ్‌లో కాకుండా కొనసాగించే వెసులుబాటు వచ్చింది. భగభగలే.. అయినా కొనుగోలే... బడా నిర్మాణ సంస్థలు అవసరమైన సామగ్రిని ముందస్తుగా సిద్ధం చేసుకున్నప్పటికీ.. వ్యక్తిగత నిర్మాణాలు, చిన్నపాటి ఇళ్లను నిర్మిస్తున్న వారు ఎప్పటికప్పుడే తెచ్చుకుంటారు. లాక్డౌన్ రెండోసారి పొడిగించిన తర్వాత అప్పటివరకు నిలిచిపోయిన పనులను మెల్లగా ప్రారంభించారు. ఈనెల 20 నుంచి కేంద్రం ఇచ్చిన సడలింపుల ప్రకారం కొందరు పనులు వేగిరం చేశారు. అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడం కత్తిమీద సాములా మారింది. చాలా చోట్ల డీలర్లు ధరలు పెంచేస్తున్నారు. సిమెంటు, స్టీలు, హార్డ్‌వేర్, సానిటరీ, రంగులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సరుకుల ధరలు 30% నుంచి రెట్టింపు చేసి విక్రయిస్తున్నారు. ఇసుక, ఇటుక, కంకర, గ్రానైట్ (రాళ్లు) ధరలూ భారీగా పెరిగాయి. అయినా కొనుగోలుదారులు వెనక్కు తగ్గడం లేదు. నిర్మాణ పనులను నిలిపేయడం కంటే కాస్త ఎక్కువ పెట్టి సాగించడమే మేలని భావిస్తున్నారు. సమయం కలసిరావడంతో పాటు కూలీలు, కార్మికుల కొరతను సర్దుబాటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత జరిగే పరిణామాలను అంచనా వేస్తూ నిర్మాణ పనులను కానిచ్చేస్తున్నారు. అపోహలు.. వదంతులు.. రాష్ట్రంలో లాక్డౌన్ మే 7 వరకు కొనసాగనుంది. ఇటు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరికొంత పొడిగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరికొన్ని రోజులు నిర్మాణ పనులు నిలిచిపోతాయనే భావన నిర్మాణదారుల్లో ఉంది. మరోవైపు సరుకు రవాణా కష్టమవుతుందని, నిర్మాణ సామగ్రికి తీవ్ర కొరత ఏర్పడుతుందని దుకాణదారులు ప్రచారం చేస్తున్నారు. ఈ అపోహలు, వదంతుల మధ్య వ్యాపారులు ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటుండగా.. నిర్మాణదారులు మాత్రం ముందు జాగ్రత్త కింద స్టాకును తెచ్చిపెట్టుకుంటున్నారు. నగర శివార్లు, పట్టణ ప్రాంతాల్లో.. జోరుమీదున్న రియల్ ఎస్టేట్ రంగం స్పీడు ఈ ఏడాది జనవరిలో కాస్త తగ్గింది. అయితే పట్టణాలు, గ్రేటర్ హైదరాబాద్ శివారుల్లో నిర్మాణ పనులు ఆశాజనకంగానే ఉన్నా యి.చాలాచోట్ల కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదలుపెట్టినవి మెజార్టీ 50 శాతంపైగా పూర్తయ్యాయి. మిగతావి పూర్తి చేసేలోపు కరోనా వ్యాప్తి.. లాక్డౌన్ రావడంతో ఈ ప్రభావం నిర్మాణ పనులపై పడింది. రెండో విడత లాక్డౌన్ వున్నా కొందరు అంతర్గతంగా పనులు చేయిస్తున్నారు. కార్మికులు, కూలీలకు,ఓనరకూ నష్టం లేకుండా ఉంది. కొన్ని రకాల నిర్మాణ సామగ్రి ధరలు ఇలా.. ► భవన నిర్మాణంలో కీలకమైంది సిమెంటు, ఇసుక. ప్రస్తుతం సిమెంటు దుకాణాలు మూతబడటంతో అవసరమున్న వారు రెట్టింపు ధరను చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు సాధారణ రకం, బ్రాండెడ్ రకం ఒక్కో బ్యాగు ధర రూ.240 నుంచి 320 మధ్య ఉండగా.. ప్రస్తుతం రూ.450 నుంచి 520 వరకు విక్రయిస్తున్నారు. ► లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ఇసుక రవాణా నిలిచిపోయింది. అయితే ఈ వ్యాపారం చేసే వాళ్లు ఇసుకను డంప్ చేస్తుంటారు. దీంతో అవసరమున్న నిర్మాణదారులు సమీపంలో ఉన్న సాండ్ డంపింగ్ యార్డు నుంచి కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం టన్ను ఇసుక రూ.2,100 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.3,600 నుంచి రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. ► నెల రోజుల క్రితం ఇటుక సాధారణ రకం, లైట్ వెయిట్ రకం ధరలు రూ. 5.25 నుంచి రూ. 7.50 ఉండగా.. ప్రస్తుతం రూ.10 నుంచి రూ.11.50 చొప్పున అమ్ముతున్నారు. ► రెడీమెడ్ డోర్లు చదరపు అడుగు (స్క్వేర్ ఫీట్) రూ.80 ఉండగా.. ప్రస్తుతం రూ.130 నుంచి రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు. ► ఎలక్ట్రికల్ సామగ్రిపై కనిష్టంగా రూ.40 శాతం అధికంగా విక్రయిస్తున్నారు. హార్డ్‌వేర్, శానిటరీ సరుకు లు కూడా ఇదే తరహాలో ధరలు పెంచేశారు. ► మరోవైపు సరుకు రవాణా చేసే వాహనదారులు సైతం చార్జీలను ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. -
‘ఎల్పీజీ’పై తొందరవద్దు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతుండంతో వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. లభ్యత తగ్గిపోతుందన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి బుకిం గ్లు చేస్తుండటంతో డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆయిల్ కంపెనీలపై ఒత్తి డి పెరుగుతోంది. ఈ క్రమంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఎక్కడా లేదని, విని యోగదారులు ఆందోళనకు గురికావొద్దని ఇండియన్ ఆయిల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కళికృష్ణ ప్రకటించారు. కొరత లేదు.. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి, మా ర్చి నెలల్లో బుకింగ్‌లు పెరి గాయి. దేశవ్యాప్తంగా రోజుకు 15–18 లక్షల బుకింగ్‌లు ఉం టుండగా, మార్చి నాటికి 20 నుంచి 22 లక్షలకు పెరిగాయి. పది రోజులుగా ఏకంగా రోజుకు దేశవ్యాప్తంగా 25లక్షల బు కింగ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో రోజుకు 2లక్షల వరకు బుకింగ్‌లు ఉంటుం డగా, అవిప్పుడు ఏకంగా 3.50లక్షల వరకు పెరిగాయి. రెండ్రోజుల కిందట వరకు తొలి సిలెండర్ బుకింగ్ చేసిన అనంతరం రెండో బుకింగ్ చేసేందుకు కేవలం ఒక్క రోజు వ్యవధి మాత్రమే ఉండటంతో బుకింగ్‌లు పెరగడంతో, ఆయిల్ కంపెనీలు పలు ఆంక్షలు తెచ్చాయి. ఒక్కో సిలిండర్ బుకింగ్‌కు మధ్య గ్యాప్‌ను 14 రోజులకు పెంచాయి. అంటే 14 రోజుల తర్వాతే రెండో సిలిండర్ బుక్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన తగ్గించే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌తో పాటే ఎల్పీజీ నిల్వలు సరిపడేంతగా ఉన్నాయని, సాధారణంగా సరఫరాను సైతం కొనసాగిస్తున్నాయని ప్రకటించింది. అనవసరం బుకింగ్‌లు వద్దని, డిజిటల్ చెల్లింపులకు మొగ్గు చూపాలని సూచనలు చేసింది. ఎల్పీజీ వినియోగదారుల కోసం హెల్ప్‌లైన్ 1906ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. -
తరుముకొస్తున్న కరోనా!
సాక్షి, హైదరాబాద్: సామాజిక దూరం పాటించడం ఒక్కటే ప్రస్తుతానికి కరోనాను నియంత్రించే పద్ధతి గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా జ నం చెవికెక్కటం లేదు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు జోడించి అ ర్థించినా ప్రజల తీరు మారటం లేదు. లాక్‌డౌన్‌కు సంబంధించి కఠిన ఆంక్షలు విధించినా నిత్యావసర వస్తువుల కోసం ఉదయం నుంచి సాయంత్రం వర కు ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నా రు. మార్కెట్లు, మెడికల్స్ ఎదుట గుంపులుగా పోగ వుతూ సాధారణ రోజులను తలపిస్తున్నారు. ఇప్పు డు ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా పరిణ మించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న పాజిటివ్ కేసులు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉంది. సగటున దేశంలో రోజూ 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వచ్చే పక్షం రోజులు మనకు కీలక తరుణం. జాగ్రత్తగా ఉండాలంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జాగ్రత్తపడాల్సిన అతివిలువైన సమయాన్ని దుర్వినియోగం చేసినందున తీవ్ర భయంకర పరిస్థితిని చవిచూస్తున్నామని, మీరైనా జాగ్రత్త పడండంటూ ఇటలీ, స్పెయిన్ దేశాలకు చెందిన పౌరులు మన దేశానికి సూచిస్తున్న వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఉదయం ఆరుకు ముందు, సాయంత్రం ఆరు తర్వాత రోడ్లు ఖాళీగా మారి జనం ఇళ్లకే పరిమితమవుతున్నా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు జన సమూహాలు కనిపిస్తున్నందున లాక్‌డౌ న్ ఉద్దేశం నీరుగారుతోందని నిపుణులు అంటున్నా రు. ప్రస్తుతం రెండో దశలో ఉన్న కరోనా వ్యాప్తి, మూడో దశకు చేరుకుంటే చేతులెత్తేయటం తప్ప చేసేదేమీ ఉండదని గట్టిగానే హెచ్చరిస్తున్నా చాలా మందిలో ఆ భయం ఎక్కడా కనిపించటం లేదు. అవగాహన ఎటు పోతోంది? ఉదయం నుంచి రాత్రి వరకు ఏ టీవీ న్యూస్ చానల్ పెట్టినా కరోనాకు సంబంధించిన వార్తలే ప్రసారమ వుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ చానళ్లలో కూడా ప్రముఖుల సందేశాలు ప్రసారమవుతున్నాయి. వైరస్ వ్యాప్తి అత్యంత ఉధృతంగా ఉండి రోజుకు సగటున 600 మందికి పైగా చనిపోతున్న ఇటలీ, స్పెయిన్ దేశాలకు సంబంధించిన దృశ్యాలు ప్రసారమవుతున్నాయి. వీటన్నింటికి మించి వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో భయం పుట్టించే తరహాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రజల్లో చైతన్యం రాకపోవటం గమ నార్హం. సాధారణంగా ఆంక్షలు విధించినప్పుడు భయంతో అమలు చేయటం కద్దు.. కానీ, కరోనాలాంటి భయంకర వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా.. జాగ్రత్తలు పాటించకపోవటం విచిత్రం. పోలీసులున్నప్పుడు జాగ్రత్తగా.. ప్రజలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రోడ్లపైనే ఉంటున్నారు. వారున్న సమయంలో మాత్రం దుకాణాల ముందు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు మొదలు చిన్నచిన్న కూరగాయల బండ్ల వరకు పోలీసులు కనీసం ఒక మీటర్ దూరం చొప్పున చాక్‌పీసులతో రోడ్లపై వృత్తాకారంలో గీతలు గీయించారు. వాటిల్లో ఒకరి తర్వాత ఒకరు నిలబడాలని ఆదేశించారు. పోలీసులున్న సమయంలో అలాగే ఉంటున్నారు. వారు అక్కడి నుంచి వెళ్లిపోగానే గుంపులుగా పోగవుతు న్నారు. కొన్ని దుకాణాల నిర్వాహకులు మాత్రం తగిన సూచనలు చేస్తుండటంతో వాటి ముందు పోలీసులు చెప్పినట్టుగా ఉంటున్నారు. మిగతావాటి ముందు యజమానులు పట్టించుకోకపోతుండటంతో షరామామూలుగానే ఉంటోంది. కూరగాయల మార్కెట్లలో దారుణం హైదరాబాద్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఎక్కడా ఆంక్షలు అమలు కావటం లేదు. ఒక్కో దుకాణం వద్ద పదుల సంఖ్యలో గుమికూడుతున్నారు. ప్రస్తు తం రాష్ట్రంలో ఎక్కడా కూరగాయలకు కొరత లేదు. అయినా జనం మార్కెట్లకు ఎగబడుతున్నారు. కఠిన ఆంక్షలు అవసరం కూరగాయల మార్కెట్ల వద్ద వలంటీర్లనో, పోలీసు లనో ఉండేలా చేస్తే తప్ప తీరు మారే సూచనలు కనిపించటం లేదు. ఎక్కడైనా జనం గుమికూడితే చర్యలు తీసుకుంటామనో, యజమానులపై కఠినం గా వ్యవహరిస్తామనో... హెచ్చరిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని విభాగాల సిబ్బంది ఇళ్లకే పరిమిత మైనందున అటువంటి వారి సేవలను ఇందుకు వినియోగించాలని, వారికి ఆరోగ్యపరంగా ఇబ్బం ది లేకుండా డ్రెస్సులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్లు ఇచ్చి, ప్రత్యేక గౌరవ వేతనం చెల్లిస్తూ వినియోగించుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. -
ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్లో..
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జన సంచారం లేక బోసిపోతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు స్వీయ నిర్బంధం పేరిట ఇళ్లకే పరిమితం కావడంతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో పెరిగిన ఆన్లైన్ రద్దీని తట్టుకునేందుకు టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ సామర్థ్యం పెంపుదలపై దృష్టి సారించారు. మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోమ్) వెసులుబాటును కల్పించాయి. విద్యాసంస్థల మూసివేత, కార్పొరేట్, ప్రభుత్వ సంస్థలు కూడా ఇళ్ల నుంచే పని చేయాలని తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు ఐదున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, సుమారు 70 శాతం మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి అవసరమైన సాంకేతిక వసతులు సమకూర్చేందుకు ఐటీ సంస్థలు ఇంటర్నెట్ సేవలు అందించే డాంగుల్స్‌ను గంప గుత్తగా కొనుగోలు చేశాయి. గతంలో రూ.999 మేర పలికిన డాంగుల్ ధర ప్రస్తుతం రెండింతలు పలుకుతోంది. మరోవైపు మార్చి రెండో వారం నుంచి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల కోసం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. గతంలో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్యతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో కేవలం పక్షం రోజుల వ్యవధిలో మూడింతలు పెరిగినట్లు సర్వీస్ ప్రొవైడర్లు చెప్తున్నారు. ఆన్లైన్లోనే గడుపుతున్న జనం లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన జనం ఎక్కువ సమయం ఆన్లైన్లోనే గడుపుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడంతో పాటు వినోదం కోసం ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో మొబైల్ ఇంటర్నెట్ వాడకం కూడా గణనీయంగా పెరిగిందని టెలికం సంస్థలు చెప్తున్నాయి. బ్యాం కింగ్ లావాదేవీలు కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతుండటం కూడా ఇంటర్నెట్ వాడకం పెరిగేందుకు దోహదం చేస్తోంది. దేశవ్యాప్తంగా మార్చి రెండో వారంతో పోలిస్తే ప్రస్తుతం 30 శాతం మేర డేటా వినియోగం పెరగ్గా, మెట్రో నగరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆన్లైన్ వినియోగం పెరిగిపోవడంతో రద్దీ పెరిగి ఇంటర్నెట్ వేగం తగ్గినట్లు వినియోగదారులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెరిగిన ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన సేవలు అందించేందుకు టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ) ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాయి. సమాచార, వినోద రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) సర్వీస్ ప్రొవైడర్లు వీడియోల నాణ్యతను తగ్గించాయి. వీడియో నాణ్యతను తగ్గించడం ద్వారా సుమారు 20% మేర డేటాను పొదుపు చేయ డం సాధ్యమవుతుందని ఓటీటీ సర్వీస్ ప్రొవైడర్లు చెప్తున్నారు. మరోవైపు పెరిగిన ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికామ్ సంస్థలు, ఐఎస్పీలు బ్యాండ్‌విడ్త్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రంలో బలమైన ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ వ్యవస్థ, డేటా సెంటర్లు ఉన్నందున బ్యాండ్‌విడ్త్ (సామర్థ్యం) పెంచడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. -
బాబోయ్ ధరలు... ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై పౌర సరఫరాల శాఖకు ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరలు పెంచేస్తున్నారంటూ వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఇలాంటివి నాలుగు వందల వరకు వచ్చాయి. వీటితో పాటే రేషన్ బియ్యం సరఫరా, ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 సాయం ఎప్పటిలోగా వేస్తారన్న అంశాలపైనా అధికంగా ఫోన్లు చేశారు. రేషన్ వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు పౌర సరఫరాలశాఖ 1967, 180042500333 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు 7330774444 వాట్సాప్ నంబర్, 040–23447770 ల్యాండ్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయించారన్న ఫిర్యాదులను వాటికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఈ నంబర్లకు ఉదయం 10 గంటల నుంచే ఫోన్లు మొదలయ్యాయని వినియోగదారుల ఫోరం డైరెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇక ఫిర్యాదులను క్రోడీకరించి జిల్లాల వారీగా విభజించి ఆయా జిల్లా అధికారుల పరిశీలనకు పంపారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. -
మెరిసిన బంగారం..
ముంబై: కోవిడ్–19 ప్రభావ మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం– యల్లో మెటల్‌వైపు ఒక్కసారిగా దృష్టి సారించారు. దీనితో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1 గ్రాములు) మంగళవారం ఒకేరోజు ఏకంగా 130 డాలర్లు పెరిగింది. సోమవారం ఇక్కడ ధర ముగింపు 1568 డాలర్లు. మంగళవారం ట్రేడింగ్ ఒక దశలో 1,698 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయంలో కొంత లాభాల స్వీకరణకులోనై 1,660 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 101కి డాలర్ ఇండెక్స్... ఇదే సమయంలో ఆరు దేశాలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 101.50కి పడిపోయింది. సోమవారం ముగింపు 103.24 కావడం గమనార్హం. అమెరికాలో కోవిడ్–19 మరణాలు పెరుగుతుండడం, ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీల బలహీన ధోరణి నేపథ్యంలో ఇన్వెస్టర్లు డాలర్ల నుంచి కూడా పెట్టుబడులను వెనక్కు తీసుకుని తిరిగి పసిడిలోకి తరలించారని కొన్ని వర్గాల విశ్లేషణ. ఇదే పరిస్థితి కొనసాగితే, రెండు వారాల క్రితం చూసిన తన తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,704 డాలర్ల (52 వారాల గరిష్టం)ని మళ్లీ పసిడి అధిగమించి 1,800 డాలర్ల దిశగా దూసుకుపోయే అవకాశం ఉంది. రూపాయికి 26 పైసలు లాభం... అంతర్జాతీయంగా బలహీనపడిన డాలర్ ఇండెక్స్, ఈక్విటీల రిలీఫ్ ర్యాలీ వంటి అంశాల నేపథ్యంలో మంగళవారం డాలర్ మారకంలో రూపాయి విలువ నాలుగు ట్రేడింగ్ సెషన్ల వరుస చరిత్రాత్మక పతన స్థాయి నుంచి కొంత కోలుకుంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 26పైసలు కోలుకుని 75.94 వద్ద ముగిసింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆర్థిక ప్యాకేజీపై కేంద్రం కసరత్తు చేస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచింది. మంగళవారం ఒక దశలో 76.40ని కూడా రూపాయి చూసింది. ఇది ఇంట్రాడేలో చరిత్రాత్మక కనిష్టం. ప్రత్యామ్నాయం పసిడే: డబ్ల్యూజీసీ ప్రస్తుత తీవ్ర ఆర్థిక అనిశ్చితి, ఒడిదుడుకుల పరిస్థితుల్లో పెట్టుబడులకు ప్రత్నామ్నాయం బంగారమేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. పెట్టుబడుల పోర్టిఫోలియోను మెరుగ్గా ఉంచుకోడానికి పసిడి ఎంతో మెరుగైన సాధనమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్‌లు, బాండ్ల రిస్క్‌లకు అలాగే కరెన్సీ విలువలు పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలకూ పసిడి పటిష్ట ప్రత్యామ్నాయ పెట్టుబడిగా నిలుస్తుందని ‘వ్యూహాత్మక అసెట్‌గా పసిడి’ అన్న నివేదికలో డబ్ల్యూజీసీ విశ్లేషించింది. -
రెచ్చిపోతున్న ఈవ్ టీజర్స్
-
బర్త్ సర్టిఫికెట్ కావాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బర్త్ సర్టిఫికెట్ల కోసం బల్దియాకు దరఖాస్తులు అనూహ్య సంఖ్యలో పెరుగుతున్నాయి. అంటే దీనర్థం నగరంలో జననాల రేటు పెరుగుతోందని కాదు.. తాము నగరంలోనే జన్మించామని నిరూపించుకునేందుకు కొందరికి ఉన్నపణంగా అవసరం ఏర్పడిందని.. ఈ దరఖాస్తుదారుల్లో రోజుల వయసున్న పిల్లలతోపాటు.. కాటికి కాలు చాచిన వృద్ధులున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో గతంతో పోలిస్తే.. జనన ధ్రువీకరణ దరఖాస్తుల సంఖ్యలో ఆకస్మిక పెరుగుదల నమోదవుతోంది. ప్రతిరోజూ బల్దియాకు వివిధ సర్కిళ్లకు వచ్చే దరఖాస్తులు, జారీ చేసే సర్టిఫికెట్లను పరిశీలిస్తే.. ఈ విషయం తేటతెల్లమవుతోంది. ముఖ్యంగా గతేడాది డిసెంబర్, ఈ జనవరి నెలను పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జారీ చేసిన సర్టిఫికెట్ల సంఖ్యలో ఈ తేడా స్పష్టమవుతుంది. ఉదాహరణకు 2020 జనవరి 1వ తేదీన 88 మంది పురుషులకు బర్త్ సర్టిఫికెట్లు మంజూరయ్యాయి. అందులో 38 మంది ఒకే వర్గానికి చెందినవారున్నారు. అదేరోజు 101 మంది మహిళలకు బర్త్ సర్టిఫికెట్లు మంజూరవ్వగా.. అందులో 32 మంది ఒకే వర్గానికి చెందినవారు ఉండటం గమనార్హం. ఇదే గతేడాది జనవరి 1వ తేదీన ఇందులో సగం సంఖ్యలోనే దరఖాస్తులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసిందని ఓ జీహెచ్ఎంసీ అధికారి వెల్లడించారు. దాదాపు రోజువారీ సగటు కంటే 100 శాతం దరఖాస్తులు పెరిగాయని అధికారులు అంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ) అమల్లోకి వచ్చాకే.. ఈ దరఖాస్తులు పెరిగాయని కూడా అధికారులు చెబుతున్నారు. మరీ నిజాం కాలం నాటి సర్టిఫికెట్లా? ‘1936లో జన్మించిన నాకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వండి.. 1945లో పుట్టిన నాకు జనన ధ్రవీకరణ పత్రం ఇవ్వండి..’అంటూ పాతబస్తీలోని వివిధ సర్కిల్ ఆఫీసుల్లో బల్దియా అధికారులకు మునుపెన్నడూ చూడని దరఖాస్తులు వస్తున్నాయి. 86 ఏళ్లు పైబడిన వ్యక్తికి ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్తో ఏం పని? అని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో స్వాతంత్య్రానికి పూర్వం, నిజాం హయాంలో ఉన్న బల్దియా రికార్డులను తిరగేయాల్సి రావడంతో ఇవి సహజంగానే జీహెచ్ఎంసీ అధికారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరి రికార్డుల వెరిఫికేషన్ కోసం అధికారులు నానాతంటాలు పడుతున్నారు. పాత నిజాం కాలం నాటి ఉర్దూలో ఉన్న రికార్డులను తిరగేయాల్సి వస్తోంది. అందులో 99 శాతం దరఖాస్తుల్లో వీరి డేటా దొరకడం లేదు. దీంతో ఆర్డీవో, పోలీసులకు వీరి దరఖాస్తును విచారణ కోసం పంపుతున్నారు. దరఖాస్తుదారుడు విద్యావంతుడైతే.. అందుబాటులో ఉన్న పత్రాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. లేని వారికి దరఖాస్తుదారుడు సమర్పించిన వివరాల ఆధారంగా మంజూరు చేస్తారు. వక్ఫ్బోర్డుకూ అదే రీతిలో దరఖాస్తులు ఇటు వక్ఫ్ బోర్డుకు సైతం వివాహ ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గతంలో రోజుకు 100 నుంచి 150 వరకు దరఖాస్తులు వచ్చేవి. అయితే జనవరి నుంచి రోజుకు 450 నుంచి 500కు పైగా దరఖాస్తులు వస్తున్నాయని సమాచారం. ఈ సర్టిఫికెట్లలో కూడా వివాహం జరిగిన తేదీ, సంవత్సరం, జాతీయత తదితర వివరాలు ఉండటం గమనార్హం. అనూహ్యంగా పెరిగిన ఈ దరఖాస్తులను చూసి వక్ఫ్‌బోర్డు అధికారులే విస్మయం చెందుతున్నారు. ఆ దేశాల వారేనని అనుమానం.. నగరంలోని పాతబస్తీతో పాటు ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దాదాపుగా 10 వేలకు పైగా బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన రొహింగ్యాలు శరణార్థులుగా వచ్చి ఆశ్రయం పొందారు. వీరంతా ఇప్పటికే అక్రమ మార్గంలో ఓటరు, ఆధార్, పాన్, పాస్‌పోర్టులు పొంది భారత పౌరులుగా చలామణి అవుతోన్న విషయం తెలిసిందే. త్వరలో తెలంగాణలోనూ సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) అమలుకానున్న నేపథ్యంలో వీరంతా బర్త్, మ్యారేజ్ సర్టిఫికెట్లకు తప్పుడు దరఖాస్తులు చేసుకుంటున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. 1936 నుంచి 1980 వరకు పలువురు తమకు కొత్తగా జనన ధ్రువీకరణాలు కావాలని అడుగుతుండటంతో, వాటిలో అనుమానాస్పదంగా.. రికార్డుల్లోలేని దరఖాస్తుల విచారణ కోసం పోలీసులకు అప్పగిస్తున్నారు. -
కర్బన ఉద్గారాలు! డొక్కు విమానాలు..
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ఎయిర్ ట్రాఫిక్ ఏటేటా పెరుగుతుండటంతో వాటి నుంచి వెలువడే కర్భన ఉద్గారాలు, ఏరోసాల్స్ కాలుష్యం (విమానాల కాలుష్యం) కూడా పెరుగుతూనే ఉంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గతేడాది 23% ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది. కానీ, గ్రేటర్ నుంచి రాకపోకలు సాగించే పలు దేశీయ, అంతర్జాతీయ విమానాల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండటం, నాణ్యత లేని ఇంధనాల వినియో గం వెరసి కర్బన ఉద్గారాల కాలుష్యం పెరుగుతోంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. దేశంలో ముంబై నుంచి రాకపోకలు సాగిస్తున్న విమానాల నుంచి 24%, హైదరాబాద్ నుంచి బయల్దేరుతున్న విమానాల నుంచి 13%, కోల్‌కతా నుంచి రాకపోకలు సాగిస్తున్న విమానాల నుంచి 6% కర్భన ఉద్గారాలు వెలువడుతున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. నిబంధనల ప్రకారం ఈ పరిమి తి 5% మించకూడదని స్పష్టం చేసింది. కాలుష్యం వెలువడుతోంది ఇలా... విమానాల్లో ఇంధనంగా వినియోగించే గ్యాసోలిన్ నాణ్యత లేకపోవడం, విమానాల నిర్వహణ అంతంతమాత్రం గానే ఉండటం, పలు రసాయన పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, సరిగా మండని పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు, జీవ ఇంధనాలు, బయోమాస్‌ను తగులబెట్టడం వంటి పరిణామాలతో ఏరోసాల్స్ కాలుష్యం ఉత్పన్నమౌతుంది. ఈ ఏరోసాల్స్లో బ్లాక్ కార్బన్‌తోపాటు ఇతర హానికారక వాయువులు, ఆవిరులు, ధూళికణాలు అధిక మోతాదులో ఉంటాయి. వీటి కారణంగా రుతుపవనాలు గతితప్పడం, అకాల వర్షాలు, అధిక వేడిమి వంటి విపరిణామాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇలా లెక్కించాలి... కర్భన ఉద్గారాలు, ఏరోసాల్స్ కాలుష్యాన్ని లెక్కించేందుకు 16 ఏథలోమీటర్స్, 12 స్కై రేడియోమీటర్స్, 12 నెఫిలో మీటర్లను నగరం నలుమూలల ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటి ద్వారా ఏరోసాల్స్ ఉధృతి, అందులో అంతర్భాగంగా ఉన్న బ్లాక్‌కార్బన్ మోతాదును లెక్కించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ ఐఐటీ ఆధ్వర్యంలో చేసిన ఓ అధ్యయనంలో గత దశాబ్దకాలంగా ఏరోసాల్స్ మోతాదు అధికమొత్తంలో పెరిగినట్లు తేలింది. దీంతో పర్యావరణం, వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోవడంతోపాటు మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని తేలింది. పీసీబీ లెక్కిస్తున్న సూచీలో ఏరోసాల్స్ కాలుష్యాన్ని లెక్కించేందుకు అవకాశం లేదని పీసీబీ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. రోజువారీగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల సంఖ్య, కాలుష్యం మోతాదు ఇలా ఉంది.. మెట్రోనగరం విమాన సర్వీసులు కర్బన ఉద్గారాల శాతం ముంబై 778 24 హైదరాబాద్ 400 13 కోల్‌కతా 567 06 ఢిల్లీ 600 5.9 చెన్నై 487 5.8 బెంగళూరు 508 5.2 -
పెరుగుతున్న మాతృత్వ మరణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మాతృత్వ మరణాలు పెరుగుతున్నాయి. 10 జిల్లాల్లో గతేడాది కంటే ఈసారి అధికంగా నమోదయ్యాయి. 15 జిల్లాల్లో 10 కంటే ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నాయి. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితా రాణా సోమవారం సమీక్షించారు. మరణాలకు గల కారణాలు, జిల్లాల వారీగా రూపొందించిన నివేదికపై చర్చించారు. 2018–19లో రాష్ట్ర వ్యాప్తంగా 389 మాతృత్వ మరణాలు నమోదవగా, 2019–2020 (డిసెంబర్ నాటికి) 323 మరణాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, మెదక్, వికారా బాద్, వనపర్తి, సూర్యాపేట్, గద్వాల్, ములుగు, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో గతేడాది కంటే ఎక్కువ మంది చనిపోయారు. -
లోక్‌సభ సీట్లను వెయ్యికి పెంచాలి
న్యూఢిల్లీ: భారత్‌లోని జనాభాను పరిగణనలోకి తీసుకుంటే పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ సీట్లకు ప్రస్తుతమున్న 543 నుంచి 1000కి, అదే శాతంలో రాజ్యసభ సీట్లను పెంచాలని ప్రణబ్ సూచించారు. ఒక్కో సభ్యుడు ప్రాతినిధ్యం వహించే జనాభా సంఖ్యలోనూ ప్రస్తుతం చాలా తేడా ఉందన్నారు. ఒక్కో లోక్‌సభ సభ్యుడు 16 నుంచి 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, వారందరికి ఆయనొక్కడు ఎలా అందుబాటులో ఉండగలడని ప్రశ్నించారు. ‘1971 జనాభా లెక్కల ఆధారంగా చివరగా 1977లో లోక్‌సభ సభ్యుల సంఖ్యను సవరించాం. అప్పటి జనాభా 55 కోట్లు. ప్రస్తుత జనాభా అందుకు రెండింతలు. అందువల్ల లోక్‌సభ సభ్యుల సంఖ్యను కూడా కనీసం 1000 చేయాలి’ అన్నారు. ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ‘భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతమైందా? ముందున్న సవాళ్లేంటి’ అనే అంశంపై సోమవారం అటల్ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ ప్రసంగాన్ని ప్రణబ్ వెలువరించారు. ఈ సందర్భంగా ఓటరు ఇచ్చే తీర్పును పార్టీలు సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. ‘ప్రజలు సంఖ్యారూపంలో ఆధిక్యత ఇచ్చి ఉండొచ్చు. కానీ దేశంలోని మెజారిటీ ఓటర్లు ఒకే పార్టీకి మద్దతివ్వడం ఎప్పుడూ జరగలేదు. అందువల్ల అధికారంలో ఉన్న పార్టీలు ఈ ఆధిక్యతావాదంపై జాగ్రత్త వహించాలి’ అని సూచించారు. ‘భారతీయ ఓటర్లు ఇచ్చే తీర్పును రాజకీయ పార్టీలెప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. అందువల్ల అఖండ మెజారిటీ రాగానే ఏమైనా చేయొచ్చని భావిస్తాం. అలా వ్యవహరించిన పార్టీలకు ఆ తరువాత అదే ఓటర్లు శిక్ష విధించిన సందర్భాలు చాలా ఉన్నాయి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు మీకు సంఖ్యాత్మక మెజారిటీ ఇచ్చారంటే దానర్థం వారు సుస్థిర ప్రభుత్వం కోరుకుంటున్నారు. అలాగే, మెజారిటీ ఓటర్లు మీకు మద్దతివ్వలేదంటే.. వారు ఆధిక్యతావాద ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు అని అర్థం. అదే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇచ్చే సందేశం’ అని ప్రణబ్ విశ్లేషించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ఒకసారి సాధ్యమవుతుందేమో కానీ, ప్రతీసారీ సాధ్యం కాదని ప్రణబ్ పేర్కొన్నారు. -
జీవన దాతలకోసం...ఎదురుచూపులే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అవయవ మార్పిడి అవసరమైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రిజిస్ట్రేషన్ చేయించు కున్న వారితో పోలిస్తే, అవయవాల లభ్యత దాదాపు పావు వంతు వరకే ఉంటుంది. దీంతో అవయవ మార్పిడికి నోచుకోక అనేక మంది దీర్ఘకాలిక చికిత్సతోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొందరైతే చికిత్స మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు మరింత పెరుగుతు న్న సంగతి తెలిసిందే. వారికి అవయవాలను మార్పిడి చేసేందుకు అవకాశాలు దక్కడంలేదు. ఈ పరిస్థితిపై ఇటీవల గవర్నర్‌కు ఇచ్చిన నివేదికలో వైద్య, ఆరోగ్యశాఖ పలు వివరాలు వెల్లడించింది. వెయిటింగ్ లిస్టులో 5,173 మంది.. రాష్ట్రంలో కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అటువంటి వారిని రక్షించుకోవాలం టే సాధారణ చికిత్సలతోపాటు అవయవ మార్పిడి అవసరం. దేశంలో మొన్నటి వరకు అత్యంత ఎక్కువ అవయవ మార్పిడి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్థానా న్ని మహారాష్ట్ర దక్కించుకుంది. దేశంలో ఏటా 5 లక్షల మంది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. 10 లక్షల మందికి 0.8 అవయవ దానం రేటు ఉండగా, తెలంగాణలో ఆ రేటు నాలుగుగా ఉంది. 2013 నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు 7,126 మంది జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోగా,1,953 మందికి మాత్రమే మార్పిడి జరిగింది. 5,173 మంది బాధితు లు వెయిటింగ్ లిస్టులో ఉన్నారని వైద్యారోగ్య శాఖ ఆ నివేదికలో తెలిపింది. ట్రామాకేర్ సెంటర్ల లేమి.. అవయవ మార్పిడి రెండు రకాలుగా జరుగుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు అవయవాలను సేకరిస్తారు. బతికుండగా బంధువుల సమ్మతి మేరకు కిడ్నీ, లివర్ వంటివి సేకరిస్తారు. ఇతర దేశాల్లో గుండెపోటుతో చనిపోయిన వారి నుంచి కూడా అవయవాలను సేకరిస్తారు. మన దేశంలో గుండెపోటుతో చనిపోయిన వారి నుంచి అవయవాలను సేకరిం చట్లేదు. ఎందుకంటే గుండెపోటుతో చనిపోయిన వారి నుంచి 20 నిమిషాల్లోనే అవయవాలను సేకరించాలి. అంత తక్కువ సమయంలో సేకరించే వ్యవస్థ, మౌలిక సదుపాయాలు మన వద్ద లేవని పలువురు అంటున్నారు. అవయవాల సేకరణకు మనకున్న మార్గాలు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి, కుటుంబ సభ్యుల నుంచి లైవ్‌గా సేకరించడమే. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో ఎక్కువ మంది బ్రెయిన్ డెడ్‌కు గురవుతారు. జాతీయ రహదారుల వెంట మనకు ట్రామాకేర్ సెంటర్లు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లేలోగా వారు చనిపోతున్నారు. ట్రామాకేర్ సెంటర్లలో ప్రమాదాలకు గురైన వారికి వైద్యం చేసి బతికించే అవకాశం ఉంటుంది. లేదా బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి అవయవా లు సేకరించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరి నుంచైనా అవయ వాలు సేకరించాలంటే చాలామంది ముందుకు రావడంలేదు. వీటి వల్ల తెలంగాణలో చాలామంది అవయవ మార్పిడి చికిత్స అందక మరణిస్తున్నారు. అవయవ మార్పిడికి డిమాండ్ పెరిగింది అవయవ మార్పిడికి రాష్ట్రం లో డిమాండ్ పెరిగింది. కానీ ఆ మేరకు అం దించలేకపోతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 10 వేల మంది కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నా రు. అయినా అనేక మంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. అవకాశం లేదనో, అవగాహన లేకనో జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. రాష్ట్రంలో లక్ష మంది అవయవదాన ప్రతిజ్ఞ చేశారు. – డాక్టర్ స్వర్ణలత, జీవన్‌దాన్ ఇన్చార్జి, హైదరాబాద్ -
గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజరస్ యాప్స్ హల్చల్
హానికరమైన యాప్స్‌ను తొలగించేందుకు గూగుల్ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ డేంజరస్ యాప్స్ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. తాజా పరిశోధన ప్రకారం గూగుల్ ప్లే స్టోర్‌లో వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటి నిరోధానికి ఎంత కృషి చేస్తున్నప్పటికీ, మరిన్ని యాప్స్ రంగంలోకి దిగుతున్నాయని ఈఎస్ఈటీ భద్రతా పరిశోధకుడు లుకాస్ స్టెఫాంకో విశ్లేషణలో బహిర్గతమైంది. ప్రమాదకరమైన ఈ గూగుల్ ఆండ్రాయిడ్ యాప్స్ ప్లే స్టోర్‌లో వేగంగా పెరుగుతున్నాయని లుకాస్ స్టెఫాంకో నివేదించారు. ఈ యాప్స్‌లోని మాలావేర్ లక్షలాది వినియోగదారులను చేరిందని ఆయన తన పరిశోధనలో తేల్చారు. ఈ క్రమంలో దాదాపు 172 హానికరమైన అనువర్తనాలను గుర్తించినట్టు తెలిపారు. వీటిని 335 మిలియన్లకు పైగా వినియోగదార్లు ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్నట్టు చెప్పారు. అటువంటి అనువర్తనాలు ప్లే స్టోర్‌లో అందుబాటులో లేకుండా ప్లే స్టోర్ చర్యలు తీసుకుంటున్నా ఇవి చెలరేగుతున్నాయని, ఈ నేపథ్యంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అవసరమైన యాప్స్‌ను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవడం, విశ్వసనీయ మూలాల నుండి మాత్రమే వీటిని స్వీకరించడంతోపాటు, వెబ్‌లో బ్రౌజ్ చేసేటప్పుడు ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్టెఫాంకో హెచ్చరిస్తున్నారు. -
అప్ర‘మట్టం’
సాక్షి, నిడదవోలు/పోలవరం రూరల్: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉప నదులు ప్రాణ హిత, ఇంద్రావతి పొంగిపొర్లుతున్నాయి. వీటికి కొండ కోనల్లో కురుస్తున్న వర్షం నీరు తోడవడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద శనివారం అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి ప్రవాహం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతం నుంచి నదిలోకి ప్రస్తుతం సుమారు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం 36 అడుగుల నీటిమట్టం ఉండగా క్రమంగా పెరుగుతూ శనివారం సాయంత్రం 6 గంటలకు 42.20 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద రాత్రి 10 గం టలకు 42.70 అడుగుల నీటి మట్టం చేరింది. 43 అ డుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.60 గోదావరి నీటి మట్టం న మోదయ్యింది. గోదావరి విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న కాటన్ బ్యారేజీల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 175 గేట్లను ఎత్తి 8,84,930 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ధవళేశ్వరం బ్యారేజీలో 70 గేట్లు, ర్యాలీ వద్ద 43 గేట్లు, మద్దూరు వద్ద 23 గేట్లు, విజ్జేశ్వరం వద్ద 39 గేట్లను పూర్తిగా పైకి ఎత్తి వరద నీటికి సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని, రెండు రో జుల్లో సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేసే అవకాశం ఉందని ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఈఈ ఆర్.మోహన్‌రావు తెలిపారు. ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరం వద్ద 10.50 మీటర్లు, పేరూరు వద్ద 13.50 మీటర్లు, దుమ్మగూడెం వద్ద 12.25 మీటర్లు, కుంట వద్ద 10.24 మీటర్లు, కొయిదా వద్ద 21.26 మీటర్లు, కూనవరం వద్ద 16.48 మీటర్లు, పోలవరం వద్ద 12.32 మీటర్లు, రాజమండ్రి బ్రిడ్జి వద్ద 15.82 మీటర్ల నీటి మట్టాలు నమోదయ్యాయి. డెల్టాలకు నీటి విడుదల క్రమబద్ధీకరణ.. ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు రైతుల వ్యవసాయ అవసరాల మేరకు నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తున్నారు. జిల్లాల్లో వర్షాలు కురవడంతో కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. పశ్చిమ డెల్టాకు 6,000, మధ్య డెల్టాకు 1,700, తూర్పు డెల్టాకు 3,000 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలో ఏలూరు కాలువకు 1,447, తణుకు కాలువకు 364, నరసాపురం కాలువకు 1,888, అత్తిలి కాలువకు 299 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయగా ఉండి కాలువకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. జలదిగ్బంధంలో నిర్వాసిత గ్రామాలు పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీలోని 19 గ్రామాల నిర్వాసితులు జలది గ్బంధంలో చిక్కుకున్నారు. వీరు పోలవరం చేరుకునే పరిస్థితి లేదు. లాంచీల సదుపాయం కూడా లేదు. రోడ్డు మార్గం మొత్తం వరద నీరు చేరడంతో రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. వరద పూర్తిగా తగ్గితే తప్ప పోలవరం చేరుకునే అవకాశం కనిపించడం లేదు. పోలవరం వద్ద 12.32 మీటర్ల నీటిమట్టానికి వరద చేరింది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే పై నుంచి కూడా వరద నీరు దిగువకు చేరుతోంది. అన్ని చర్యలు చేపడుతున్నాం.. వరదలు పెరుగుతున్న దృష్ట్యా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నామని పోలవరం తహసీల్దార్ ఎన్.నరసింహమూర్తి తెలిపారు. కొత్తూరు కాజ్వే వద్ద ఇంజిన్ పడవను ఏర్పాటు చేశామన్నారు. వరద తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, వీఆర్వోలు ఆయా గ్రామాల్లో ఉన్నారని, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పారు. పాత పోలవరంలో భయం భయం.. గోదావరి వరద మరోసారి పెరుగుతుండటంతో పాత పోలవరం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలవరం శివారు పాత పోలవరం ప్రాంతంలో నెక్లెస్‌బండ్ లంక గట్టు సుమారు 600 మీటర్ల వరకు కోతకు గురైంది. వరద ఉధృతికి ఇప్పటికే లంక గట్టు మొత్తం అండలు అండలుగా జారిపోయి నదిలో కలిసిపోయింది. 6 మీటర్లు వెడల్పు ఉండాల్సిన గట్టు క్రమేపీ కోతకు గురై మీటరు పరిణామంలోకి చేరింది. గట్టు జారిపోయిన ప్రదేశంలో నది వైపు ప్రాజెక్టు ప్రాంతం నుంచి బండరాళ్లను తెచ్చి వేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు 100 మీటర్లలోపు మాత్రమే ఈ రాయిని వేయడం జరిగింది. అయితే అసలు పూర్తిగా గట్టు కోతకు గురైన ప్రదేశంలో ఏ మాత్రం పట్టిష్ట పనులు జరగలేదు. మరలా వరదలు వస్తే ఆ ప్రాంతంలో గండిపడుతుందేమోననే ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. వరద పెరుగుతున్నందున రాళ్లు వేసే పనులు కూడా నిలిపివేశారు. వరద పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అని భయం పాతపోలవరం వాసులను వెంటాడుతోంది. -
ముమ్మరంగా నీటి నిల్వ గుంతలు
సాక్షి,మల్దకల్: రోజు రోజుకు ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటిపోతున్న తరుణంలో ప్రభుత్వం నీటి నిల్వ గుంతలకు ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ వ్యవసాయ పొలాల్లో నీటి నిల్వ గుంతల తవ్వకాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వ్యవసాయ పొలాల్లో నీటినిల్వ గుంతలను తవ్వుకోవడం ద్వారా భూగర్భజలాలు పెరగడంతో పాటు బోరుబావుల్లో నీటి లభ్యత ఉంటుంది. వీటి నిర్మాణాలపై ఉపాధి హామీ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామసభలు నిర్వహించి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా ఉపాధి హామీ పథకం ద్వారా నీటి నిల్వ గుంతలను నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ వ్యవసాయ పొలాల్లో వాటి నిర్మాణాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో ప్రభుత్వం నీటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ పొలాల్లో వాటిని తవ్వుకునేందుకు ముందుకు వస్తున్నారు. కూలీలకు ఉపాధి పనులు దొరకడంతో పాటు రైతులకు నీటి నిల్వ గుంతలను ఏర్పాటు చేయడంతో రెండు విధాలా లబ్ధిపొందుతున్నారని ఉపాధి హామీ సిబ్బంది తెలియజేశారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి.. ముఖ్యంగా వీటి నిర్మాణాల కోసం అధికారులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రైతులకు వాటి నిర్మాణాలతో కలిగే ఉపయోగాలను వివరిస్తున్నారు. దీంతో రైతులు సైతం ముందుకు వచ్చి తమ పొలాల్లో నీటి నిల్వ గుంతలను తవ్వుకుని భూగర్భ జలాల పెంపునకు తమవంతు కృషి చేస్తున్నారు. మల్దకల్ మండలానికి మొత్తం ప్రభుత్వం 821 నీటి నిల్వ గుంతలు మంజూరు కాగా.. వాటిలో 30కు పైగా నిర్మాణ పనులు పూర్తి కాగా.. మరో 50 నీటి నిల్వ గుంతల పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. నీటి నిల్వ గుంతల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.60 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు వాటి కొలతలను బట్టి ఆర్థిక సాయం అందించడంతో వాటి నిర్మాణాలను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే వ్యవసాయ పొలాల్లో పొలం చదునుచేసేందుకు, పొలం గెట్లపై ముళ్లచెట్ల తొలగింపు వంటి పనులను ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో చేపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు నీటి నిల్వ గుంతలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడంతో వీటి నిర్మాణ పనులపై స్థానిక ఉపాధి హామీ సిబ్బంది సైతం వేగవంతం చేస్తున్నారు. మండలంలో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి నీటి నిల్వ గుంతలను వందశాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉపాధి ఏపీఓ శరత్‌బాబు తెలియజేశారు. -
బతుకు ‘బండి’ డీలా?
సాక్షి, ఆసిఫాబాద్‌అర్బన్: రోజురోజుకు డీజిల్ రేటు పెరుగుతుండడంతో ఆటోవాలాల జీవనం కష్టతరంగా మారుతోంది. ఆటోనే జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న తమ పరిస్థితి దయనీయంగా ఉందని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొని జీవిద్దామనుకుంటే..రోజు కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. అనునిత్యం డీజిల్ ధర పెరుగుతోంది. గతంలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.75కు చేరుకుంది. ఆటోలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆటోవాలాలు బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే అరకొర డబ్బు డీజిల్‌కే పోతోందని, ప్రస్తుతం ఉన్న చార్జీలకు ఆటోలను నడిపి, నెల వచ్చే సరికి తీసుకున్న ఫైనాన్స్ కట్టలేకపోతున్నామని వాపోతున్నారు. ఆసిఫాబాద్ మండల పరిధిలో సుమారు 500 వరకు ఆటోలు ఉన్నాయి. బస్సులు లేనప్పుడు ప్రయాణికులు ఆటోలపైనే ఆధారపడి ఇంటికి చేరుతున్నారు. అయితే ఆటోలు నడిపే వా రి పరిస్థితి మాత్రం అంతా ఆశాజనకంగా లేదు. నిర్వహణ ఖర్చులతో ఉక్కిరిబిక్కిరి.. ఆటోలు నడపడానికి పలు రకాల నిర్వహణ ఖర్చులున్నాయి. అంతంత మాత్రంగా వచ్చే డబ్బుతో ఆటోలకు సర్వీసింగ్ కూడా చేయలేని పరిస్థితి వస్తోందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. దీనికితోడు అమాంతంగా పెరిగిన బీమా ధరలు, ఎఫ్‌సీ కాలం ముగిసిన తరువాత వేసే అపరాధ రుసుం ఆటోడ్రైవర్ల జీవనాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. సీఐ చొరవతో ఆటోస్టాండ్ ఆర్టీసీ అధికారులు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆటో స్టాండ్‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆటో యజమానులు ఇబ్బందులు పడడంతో స్థానిక సీఐ మల్లయ్య ను ఆశ్రయించారు. అందుకు వారు ఆర్టీసీ అధికా రులతో మాట్లాడి ఆటోస్టాండ్‌ను యథావిధిగా ఉన్న స్థలంలోనే ఏర్పాటు చేయించారు. డీజిల్ ధరలు ఇలా... సంవత్సరం డీజిల్ ధర (రూ.లలో) 2014 56 2015 58 2016 60 2017 70 2018 72 2019 75 ఇవీ డిమాండ్లు.. ఆటోడ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఆటో ఫైనాన్సర్ల వడ్డీ దోపిడీ అరికట్టాలి. ఆటోలకు భారీగా పెరిగిన థర్డ్‌పార్టీ బీమా తగ్గించి, 50శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి ఎంవీ, యాక్ట్ సవరణ బిల్లు రద్దు చేయాలి యాక్సిడెంటల్ బీమాను రూ.5 లక్షలను, సాధారణ, మరణాలకు అంగవైకల్యానికి వర్తింప చేయాలి. మండలకేంద్రాల్లో ఆటోలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించాలి ఆటో బీమా ప్రీమియం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న డబుల్‌బెడ్ రూం ఇళ్లను పేదలైన ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. వాయిదాలు కట్టలేకపోతున్నాం అప్పుచేసి ఆటోలు కొనుగోలు చేశాం. ప్రస్తుతం డీజిల్ ధరలు, విడి భాగాల ధరలు భారీగా పెరిగాయి. చార్జీలు మాత్రం పెరగడం లేదు. చార్జీలు పెంచుదామంటే ప్రజలు అంగీకరించరు. ప్రభుత్వం చొరవ చూపి డీజిల్ ధరలు అదుపు చేయాలి. – ఎస్కె.సాజీద్, ఆసిఫాబాద్ -
ఆగండి.. క్షణం ఆలోచించండి..!
ఒక్క క్షణం ఆలోచించగలిగితే ఆత్మహత్య ఆలోచనలను దూరం చేయవచ్చు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కార మార్గం చూపదు. పైగా తమవారిని, తమను నమ్ముకున్న వారిని మరింత కష్టాల్లోకి నెడుతుంది. నేషనల్ క్రైం బ్యూరో సైతం నగర కమిషనరేట్ పరిధిలో ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు పేర్కొనడం గమనార్హం. సెప్టెంబరు 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రేమ విఫలం కావడం, కుటుంబ కలహాలు, విద్యలో రాణించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం తదితర కారణాలతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం చూపక పోగా.. వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రతి ఏటా 3 వేల మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడుతుండగా మరో 8 వేల మందికిపైగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. పెరిగిన యువత ఆత్మహత్యలు ఆధునిక జీవన విధానంలో పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కొరవడటం, వారి కోసం సరైన సమయాన్ని వెచ్చించలేకపోవడం, పిల్లలు ఏమి చేస్తున్నారో పట్టించుకునే సమయం లేకపోవడం వలన పిల్లలు మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో టీనేజ్, 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాల తర్వాత రెండవ స్థానంలో ఆత్మహత్యలు ఉంటున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌కు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు విజయవాడ, గుంటూరు నగరాల్లో నమోదవుతున్నాయి. సంకేతాలు తెలుసుకోవచ్చు ఆత్మహత్యకు పాల్పడాలనుకునే వారిని ముందుగా గుర్తించవచ్చంటున్నారు మానసిన నిపుణులు. డల్‌గా ఉండటం, ఇతరులతో కలవకపోవడం, ఏకాంతంగా ఉండటం, ఆకలి, నిద్ర లేకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం, హాస్టల్లో ఉండేవారు రూంలో ఒంటరిగా గడపడం, విషాదభరితమైన సీరియల్స్ చూడటం, జోక్స్ వచ్చినా స్పందించకపోవడం వంటి లక్షణాలు వుంటాయని చెపుతున్నారు. అలాంటి వారు తమ మనస్సులోని బాధను ఎదుటి వారితో చెప్పుకోవడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెపుతున్నారు. నాకు చనిపోవాలని ఉంది.. ఈ జీవితం ఎందుకు.. ఏమీ సాధించలేక పోతున్నానని సన్నిహితుల వద్ద పదేపదే అనడం. ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చెట్టుకు ఢీకొట్టడం వంటివి చేస్తుంటారని చెపుతున్నారు. యువతలో పెరుగుతున్న సమస్యలు గతంలో 40 సంవత్సరాల వయస్సు పైబడిన వారు ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడే వారు. కానీ నేడు ప్రేమ విఫలమవడం, చదువులో రాణించలేక పోవడం, ఒత్తిడి, నవ దంపతుల్లో సర్ధుబాటు సమస్యలు వంటి కారణాలతో యువత ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో ప్రతి ఆరు గంటలకు ఒక టీనేజ్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో స్త్రీల కంటే పురుషులు రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నారు. – డాక్టర్ టీఎస్ రావు, అధ్యక్షుడు, ఏపీ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆత్మహత్య ఆలోచన మానసిక సమస్యే ఆత్మహత్య ఆలోచన కూడా మానసిక సమస్యే. అలాంటి వారికి జీవితం విలువను తెలియచేయాలి. చనిపోయేందుకు దారికాదు.. బతికేందుకు మార్గాలు చూపించగలగాలి. ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవలకు కౌన్సెలింగ్‌తో చక్కటి పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురవకుండా పాఠశాలలు, కళాశాలల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఆత్మహత్య ఆలోచన చేసే వారిని స్నేహితులు, కుటుంబ సభ్యులు ముందుగా లక్షణాలను గుర్తించి వారికి తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలి. – డాక్టర్ గర్రే శంకర్రావు, మానసిక విశ్లేషకుడు -
మరణ మృదంగం
తూప్రాన్ : శ్రీరామ నవమి రోజున 44వ జాతీయ రహదారిపై నాగులపల్లి చౌరస్తా వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడేదెలా అని పలువురు చర్చించుకున్నారు. నాయకులు, అధికారులు మేల్కోకపోతే ఈ మరణమృదంగం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై ప్రత్యేక కథనం.. మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్లోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న క్రాసింగ్‌లు మృత్యుకుహరాలుగా మారాయి, క్రాసింగ్‌ల వద్ద తరచూ ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయి. మండలంలోని నాగులపల్లి చౌరస్తా, కరీంగూడ చౌరస్తా, దాబా హోటళ్ల వద్ద, మనోహరాబాద్ చౌరస్తా, కూచా రం చౌరస్తా, బంగారమ్మ దేవాలయం వద్ద, జనతా హోటల్ వద్ద ఉన్న క్రాసింగ్‌లు ప్రమాదాలకు నిలయంగా మారి ఎందరినో బలిగొంటున్నాయి. నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నా.. హైవే అథారిటీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రమాదాల వివరాలు మండలంలో తొమ్మిదేళ్ల కాలంలో హైవేపై జరిగిన ప్రమాదాల్లో 287 మంది మృత్యువాత పడినట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. ఇందులో 406 మందికి పైగా గాయపడ్డారు. వికలాంగులుగా మారిన వారి జీవనోపాధి మరీ దయనీయంగా మారింది. పోలీ సుల రికార్డుల్లో నమోదు కాని ప్రమాదాలు మరెన్నో ఉన్నాయి. హైవే అథారిటీ అధికారులు క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల హెచ్చరికల సూచికల బోర్డులు, సిగ్నళ్లు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. నాలుగు లేన్ల దారి అయిందని సం తో ష పడాలో, లేక ప్రమాదాల బారిన పడుతున్నందుకు బాధపడాలో తెలి యని దుస్థితిలో వాహనచోదకులు, బాటసారులు కొట్టుమిట్టాడుతున్నారు. నాగులపల్లి చౌరస్తా క్రాసింగ్ వెరీ డేంజర్: మండలంలోని 44వ జాతీయ రహదారి విస్తరణ పనులు 2006 సెప్టెంబరు 26న ప్రారంభించారు. అంతకు ముందు 7వ నంబరు జాతీయ రహదారిగా తూప్రాన్ పట్టణం మధ్యలోంచి ఈ దారి ఉండేది. తర్వాత ఇదే 44వ నంబరు జాతీయ రహదారిగా మారింది. అయితే విస్తరణంలో భాగంగా నాగులపల్లి చౌరస్తా వద్ద, కరీంగూడ చౌరస్తా వద్ద వంతెనలు ఏర్పాటు చేయలేదు. అప్పట్లో ఎవరూ ప్రతిపాదనలు చేయకపోవడం, హైవే అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వంతెనలు నిర్మించకపోవడంతో ఈ ప్రదేశాలు ప్రయాణికుల పాలిట యమపాశాలుగా మారాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో రోజూ ఏదో ఓ చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే బైపాస్ మార్గంలో ఏర్పాటు చేసిన దాబా హోటళ్ల వద్ద వాహనాలను రాత్రి వేళల్లో రహదారిపై నిలిపి భోజనాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రహదారి దాటేటప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే వాహనాలకు సైడ్ ఇంటికేటర్లు వేయడం లేదు. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. క్రాసింగ్‌ల వద్ద వాహనాల స్పీడ్ తగ్గించేందుకు ఎలాంటి కంట్రోల్ వ్యవస్థ లేదు. స్పీడ్ బ్రేకర్లు లేవు. రేడియం స్టిక్కర్లు లేవు. హెచ్చరిక బోర్టులు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా వాహనాలు అతివేగంగా వచ్చి ఢీకొట్టుకుంటున్నాయి. త్వరలో రూ.34 కోట్లతో వంతెన పనులు గత ఏడాదినాగులపల్లి చౌరస్తా వద్ద వంతెన నిర్మాణం కోసం నేషనల్ హైవే పీడీతో కలిసి ఎంపీలు స్థల పరిశీలన చేశారు. అనంతరం వంతెన నిర్మాణం కోసం రూ.34 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇటీవల తూప్రాన్‌కు చెందిన అధికారు పార్టీ నేతలు వంతెన ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. త్వరలోనే వంతెన పనులు 44వ జాతీయ రహదారిపై నాగులపల్లి చౌరస్తా వద్ద జరుగుతన్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.34కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. –నేషనల్ హైవే పీడీ మీర్ అమీద్ అలీ -
పొగపెడుతున్న బండ్లు..!
-
కోట్లు సంపాధించే వారి సంఖ్య పెరుగుతోంది
-
నా పేరు ముకేశ్.. నాకు బ్రెస్ట్ కేన్సర్!
ముకేశ్ (పేరు మార్చాం). నగరంలోని ఓ బిజినెస్ మ్యాన్.. బిందాస్ లైఫ్.. ఉదయమంతా ఆఫీసులో పని.. సాయంత్రమయ్యేసరికి బార్లో మందు.. ఇంకేం కావాలి.. ముకేశ్కిప్పుడు 43 ఏళ్లు.. కొన్ని నెలల క్రితం అతనో విషయాన్ని గమనించాడు.. తన రొమ్ముల్లో ఒకటి మరోదానితో పోలిస్తే.. పెద్దగా మారింది.. ఆ ప్రదేశంలోని చర్మం నారింజ రంగులోకి మారింది.. ఎందుకైనా మంచిదని డాక్టర్‌ను కలిశాడు.. ‘మీకు బ్రెస్ట్ కేన్సర్’ డాక్టర్ చెప్పాడు.. ముకేశ్‌కు షాక్.. నాకు రొమ్ము కేన్సరా? మగాళ్లకు రొమ్ము కేన్సరా? ► దేశంలోపెరుగుతున్న పురుష రొమ్ము కేన్సర్ కేసులు ► ప్రతి 400 మందిలో ఒకరికి వచ్చే అవకాశం.. ► అవగాహన పెంచడం అవసరమంటున్న వైద్యులు.. ఎంబీసీ.. మేల్ బ్రెస్ట్ కేన్సర్.. దేశంలో ప్రస్తుతమీ కేసులు పెరుగుతున్నాయి. మహిళల్లో వచ్చే బ్రెస్ట్ కేన్సర్‌పై మీడియాలోనూ విస్తృతంగా రావడంతో దీనిపై అవగాహన బాగా పెరిగింది. ఎంబీసీ విషయంలో అలాంటిది ఉండటం లేదు. పైగా.. పురుషులకు రొమ్ము కేన్సర్ వస్తుందన్న అంశంపై చాలా మందిలో అవగాహన లేకపోవడంతో ఇది చాప కింద నీరులా విస్తరిస్తోంది. ముకేశ్ తొలి దశలోనే వైద్యుల వద్దకు రావడంతో సరైన చికిత్స తీసుకుని.. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ.. చాలా మంది పురుషుల విషయంలో పరిస్థితిలా ఉండటం లేదు. ‘బ్రె స్ట్ కేన్సర్ మగాళ్లకు వస్తుందన్న విషయాన్ని వారు నమ్మరు. లక్షణాలను బట్టి.. ఒకవేళ అనుమానం వచ్చినా.. ఎవరేమంటారన్న భయంతో మిన్నకుండిపోతారు. దీంతో చివరకు మా వద్దకు వచ్చేసరికే పరిస్థితి చేయి దాటిపోతుంది. దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరముంది’ అని ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ అంకాలజిస్ట్ డాక్టర్ వికాస్ గోస్వామి అన్నారు. లక్షణాలివీ.. రొమ్ము కణజాలం గట్టిపడటంతోపాటు గడ్డలా మారడం.. కొంత కాలానికి అది పెరిగి.. నొప్పి రావడం.. రొమ్ము ప్రాంతంలోని చర్మం నారింజ రంగులోకి మారడం.. ముడతలు పడటం.. చనుమొనలు పెద్దవి కావడం.. వాటి నుంచి ద్రవం కారడం.. ఎందుకు వస్తుంది? కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. కుటుంబంలో ఎవరికైనా గతంలో రొమ్ము కేన్సర్ వచ్చి ఉండటం, అతిగా తాగడం, కాలేయ సంబంధిత వ్యాధులు, ఊబకాయం, రేడియేషన్, ప్రమాదకర రసాయనాల ప్రభావానికి గురికావడం, జన్యువుల్లో లోపం వంటి వాటి వల్ల ఇది రావొచ్చని చెబుతున్నారు. ఎంత మందికి? కొన్ని అధ్యయనాల ప్రకా రం దేశంలో ప్రతి 30 మంది మహిళల్లో ఒకరికి తమ జీవిత కాలంలో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశముండగా.. పురుషుల్లో ప్రతి 400 మందిలో ఒకరికి వచ్చే అవకాశముంది. వీరి విషయంలో బతికే అవకాశాలు 73 శాతం మాత్రమే! ఎందుకంటే.. అసలు ఇలాంటిది ఒకటి తమకు వస్తుందన్న విషయం తెలియకపోవడం వల్ల మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో ఇది ముదిరిపోయిన తర్వాతే గుర్తించడం జరుగుతుంది. దీని వల్ల చికిత్స కూడా ఆలస్యంగా ప్రారంభమవుతుంది. దీనికితోడు స్త్రీలతో పోలిస్తే.. పురుషుల్లో రొమ్ము కణజాలం తక్కువగా ఉంటుంది. ఇది గట్టిపడినా.. వెంటనే గుర్తించడం కొంచెం కష్టమే. -
మెట్రో ఫర్ సేల్?
-
పెరుగుతున్న సాగర్ నీటి మట్టం
కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో దిగువ జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పాదన అనంతరం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు 74,140 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 519.00 అడుగుల వద్ద ఉంది. ఇది 147.4580 టీఎంసీలకు సమానం. గత ఏడాది ఇదే రోజు సాగర్ నీటిమట్టం 511.00 అడుగుల వద్ద ఉంది. – విజయపురి సౌత్ -
వైర్లెస్ డేటా స్పీడ్ 2జీబీ పర్ సెకన్!
జెడ్డా: వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ల డేటా స్పీడ్ విషయంలో పెనుమార్పులు రాబోతున్నాయి. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఇటీవల అభివృద్ది చేసిన ఓ కొత్త పదార్థం ఇంటర్నెట్ డేటా స్పీడ్‌ను సెకన్‌కు రెండు గిగాబైట్ల(జీబీ) వరకు పెంచుతుందని గుర్తించారు. వీరు తయారు చేసిన నానో క్రిస్టలిన్ మెటిరియల్.. బ్లూలైట్‌ను వేగంగా వైట్లైట్గా మార్చుతుందని, దీంతో డేటా స్పీడ్ అసాధారణంగా పెరుగుతుందని వెల్లడించారు. బ్లూటూత్, వైఫై లాంటి టెక్నాలజీల వినియోగంలో విద్యుదయస్కాంత తరంగాల తరంగదైర్ఘ్యాన్ని తగ్గించడం ద్వారా సమాచార బదిలీలో వేగాన్ని పెంచొచ్చని పరిశోధకులు వెల్లడించారు. నానో క్రిస్టలిన్ మెటిరియల్ సహాయంతో డేటా వేగాన్ని పెంచే ప్రక్రియ అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని ప్రొఫెసర్ బూన్ ఊయ్ తెలిపారు. -
కానిస్టేబుల్ అభ్యర్థుల వయో పరిమితి పెంచాలి
ఉప ముఖ్యమంత్రికి విన్నవించిన వైఎస్సార్‌ఎస్‌యూ అనంతపురం ఎడ్యుకేషన్ : కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని కలిసి శనివారం వినతిపత్రం అందించారు. నాయకులు మాట్లాడుతూ వయో పరిమితి 22 ఏళ్లకు కుదించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోతారన్నారు. తెలంగాణలో 25 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి,అధికారంలోకి వచ్చి 26 నెలలు గడిచినా ఏ ఒక్కరికీ ఉద్యోగ అవకాశం కల్పించలేదన్నారు. అన్ని శాఖల్లోనూ దాదాపు లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. సలాంబాబు, ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, ప్రధానకార్యదర్శులు బాబాసలాం, రాఘవేంద్రరెడ్డి, సుధీర్‌రెడ్డి, చంద్రశేఖర్, ఎస్కేయూ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, క్రాంతికిరణ్, శ్రీనివాసరెడ్డి, మోహన్, గోకుల్ తదితరులు ఉన్నారు. -
భారీ అమ్మకాల్లో మోదీ పుస్తకం!
ప్రధానమంత్రి నరేంద్రమోదీని వ్యంగ్యాస్థాలతో కించిపరుస్తూ ఇటీవల మార్కెట్లో విడుదలైన పుస్తకం అమ్మకాలు భారీగా పెరిగిపోయాయట. 'ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ' పేరుతో కాంగ్రెస్ నాయకుడు జయేష్ షా రచించిన పుస్తకానికి అభిమానులు ఎక్కువైపోయారు. గుజరాత్ రాష్ట్రంలోనే కాక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో కూడ పుస్తకం అమ్మకాలు జోరుగా సాగిపోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకుడు జయేష్ షా మోదీపై వ్యంగ్యోక్తులు విసురుతూ రాసిన పుస్తకం మార్కెట్లో ప్రాచుర్యం పొందిందట. పలు రాష్ట్రాల్లో ఆ పుస్తకానికి భారీ అమ్మకాలు పెరిగినట్లు వార్తలొస్తున్నాయి. 'ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ' అంటూ ఎన్నికల సమయంలో మోదీ చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంపై జయేష్ షా ఈ పుస్తకాన్ని రాశారు. అయితే పుస్తకంలోని రచనలు ప్రధానమంత్రిని కించపరిచేలా ఉన్నాయని, దీన్ని వెంటనే నిషేధించాలని కోరుతూ బీజేపీ అభిమాని, సామాజిక కార్యకర్త నర్సింహు సోలంకి అనేవ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దాన్ని అహ్మదాబాద్ సివిల్ కోర్టు కొట్టేయడం తెలిసిందే. తమ భావాలను తెలిపే హక్కు ప్రతివారికీ ఉంటుందని, పుస్తకంపై నిషేధం విధించడం సరికాదని, అలా చేస్తే వాక్ స్వాతంత్రంపై దాడి చేసినట్లే అవుతుందని న్యాయమూర్తి వివరణ కూడ ఇచ్చారు. అయితే మోదీపై వ్యంగ్యాస్థాలు సంధిస్తూ రాసిన ఆ పుస్తకం గురించి ముందు ఎవరికైనా తెలుసో లేదో గాని, కోర్టు సైతం అభ్యంతరాలను తోసి పుచ్చడంతో ఇప్పుడు ఆ పుస్తకానికి మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగిపోయిందట. నిజంగా ఆ పుస్తకంలో ఇంకా ఏం రాశారో చదవాలన్న ఉత్కంఠత జనాల్లో పెరిగిపోయిందికాబోలు. -
పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం
టైప్ వన్ డయాబెటిస్ ఇండియాలోని పిల్లల్లో భారీగా పెరుగుతోందంటూ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ళ కాలంలో ఒక శాతం ఉండే గణాంకాలు ఐదు శాతానికి పెరిగిపోయాయని, ఇరవై ఏళ్ళ క్రితం 600 మంది పిల్లలు మధుమేహ రోగులుగా ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 3 వేలకు చేరిపోయినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఇతర కారణాలతోపాటు ఊబకాయం పెరగడం వల్లే, ఈ సమస్య జఠిలం అవుతోందని డయాబెటాలజిస్ట్ లు అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లల్లో గత రెండేళ్ళ క్రితం 1 శాతంగా ఉన్న మధుమేహ వ్యాధి, ఇప్పుడు 5 శాతానికి పెరిగిపోయిందని డయాబెటాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శరీరంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే బేటా సెల్స్ తగ్గిపోవడమే మధుమేహ రోగులు పెరిగిపోవడానికి కారణమంటున్నారు. ఆహార పద్ధతుల్లో తీవ్ర మార్పులు రావడం, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి శరీరంలో కొవ్వును వృద్ధి చేస్తాయని, ఇది ముఖ్యంగా పిల్లల్లో ఒబేసిటి పెరిగిపోవడానికి కారణమౌతోందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాక కూరగాయలు, ఆకు కూరలు ఆహారంగా తీసుకోపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం మధుమేహం వృద్ధి అయ్యేందుకు సహకరిస్తాయని ఢిల్లీకి చెందిన కొందరు డయాబెటాలజిస్టులు చెప్తున్నారు. ఇండియాలోని 40 శాతం పిల్లల్లో ఊబకాయం సమస్య కూడ ఉన్నట్లు తెలిపారు. తీవ్రంగా దాహం వేయడం, ఎక్కువగా మూత్రం రావడం, తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తూ, క్రమంగా బరువు తగ్గిపోవడం, నిద్ర మత్తుగా ఉన్నట్లు అనిపించడం, కోమాలోకి వెళ్ళిపోవడం వంటివి మధుమేహ వ్యాధి లక్షణాలుగా చెప్పొచ్చని, ఈ రకమైన గుర్తులు కనిపించడాన్ని డయాబెటిక్ కెటో యాసిడోసిస్ అంటారని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో 70,000 మంది చిన్నారులు, యువకులు మధుమేహంతో బాధపడుతున్నట్లు ఎయిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అష్రాఫ్ ఘని తెలిపారు. చిన్నారుల్లో మధుమేహం రావడం ప్రమాదకరమని, అయినప్పటికీ టైప్ 1 డయాబెటిస్ క్రమంగా పెరుగుతూనే ఉందని ఘని అన్నారు. -
'ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. గత తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఇదే విధంగా ఛార్జీలు పెంచారని ఎమ్మెల్యేలు గుర్తుకు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక్క రూపాయి విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు గుదిబండగా మారుతున్నాయన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సహకాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పేలనున్న విద్యుత్ బాంబు!
► మధ్యతరగతి, పరిశ్రమలు, వాణిజ్యానికి షాక్ ► రూ.1,958 కోట్ల మేర చార్జీల పెంపునకు డిస్కంల ప్రతిపాదన ► గృహ వినియోగం 100 యూనిట్లు దాటితే గుండె గు‘బిల్లు’! ► ఒక్కో యూనిట్‌పై 65 పైసల నుంచి రూపాయి వరకు పెంపు ► పరిశ్రమలపై 6-7.5 శాతం, వాణిజ్య కేటగిరీపై 10 శాతం వరకు మోత ► టౌన్‌షిప్‌లు, విమానాశ్రయాలు, నీటి పథకాలు, వీధి దీపాలపై సైతం బాదుడు ► పరిశ్రమలకు ‘టీవోడీ’ పెనాల్టీ సమయం 4 నుంచి 8 గంటలకు పెంపు ► హెయిర్ సెలూన్లకు రాయితీ కోసం ప్రత్యేక కేటగిరీగా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వినియోగదారులపై విద్యుత్ బాంబు పేలింది. మధ్య తరగతి నుంచి పరిశ్రమల దాకా చార్జీల మోత మోగిపోనుంది. 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే పేదలపై మాత్రమే ప్రభుత్వం కాస్త కరుణ చూపింది. మిగతా వర్గాలపై మాత్రం భారీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. ఈ చార్జీల పెంపుతో ఏకంగా రూ.1,958 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గృహ వినియోగం 100 యూనిట్లు దాటితే... ప్రతి యూనిట్‌పై అదనంగా 65 పైసల నుంచి రూపాయి వరకు చార్జీల మోత మోగనుంది. ఎల్టీ కేటగిరీలోని పరిశ్రమలపై 6 శాతం... వాణిజ్య, వీధి దీపాలు, సాధారణ వినియోగంపై 10 శాతం... హెచ్‌టీ కేటగిరీలోని పరిశ్రమలపై 7.5 శాతం... వాణిజ్య, తాగునీటి పథకాలు, టౌన్‌షిప్‌లు, విమానాశ్రయాలపై 10 శాతం దాకా అదనంగా విద్యుత్ చార్జీల భారం పడనుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు.. ఆ తర్వాత గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపునకు సిద్ధమైంది. 100 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగంపై చార్జీలు యథాతథంగా ఉండనున్నాయి. 100 యూనిట్లు దాటితే మాత్రం గుండె గు‘బిల్లు’మనడం ఖాయం కానుంది. వ్యవసాయం మినహాయిస్తే గృహ, పరిశ్రమలు, వాణిజ్య తదితర కేటగిరీలు కలిపి రూ.1,958 కోట్ల చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించాయి. ఈ మేరకు కొత్త టారిఫ్ ప్రతిపాదనలతో ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంలు 2016-17కు సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లను మంగళవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి సమర్పించాయి. ఈఆర్సీ కార్యదర్శి కె.శ్రీనివాస్‌రెడ్డితో కలసి డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, కె.వెంకటనారాయణ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి ప్రతిపాదిత చార్జీల ప్రభావంపై క్లుప్తంగా వివరించారు. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ అనంతరం ఈఆర్సీ నూతన టారిఫ్‌ను ఖరారు చేయనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. లోటు పూడ్చుకునేందుకు.. విద్యుత్ సరఫరా కోసం ప్రస్తుతం సగటున యూనిట్‌కు రూ.6.44 ఖర్చవుతుండగా... ప్రస్తుత చార్జీలతో సగటున యూనిట్‌కు రూ.4.56 మాత్రమే ఆదాయం వస్తోంది. ఒక్కో యూనిట్‌పై రూ.1.88 ఆదాయ లోటును డిస్కంలు ఎదుర్కొంటున్నాయి. ఈ లెక్కన 2016-17లో డిస్కంల ఆదాయ అవసరాలు రూ.30,207 కోట్లు ఉండనుండగా... ప్రస్తుత టారిఫ్ ప్రకారం రూ.21,418 కోట్ల ఆదాయం మాత్రమే రానుంది. అంటే రూ.8,789 కోట్ల లోటు ఉంటుందని అంచనా. ఇందులో చార్జీల పెంపు ద్వారా రూ.1,958 కోట్లు సమకూర్చుకుంటామని డిస్కంలు ప్రతిపాదించాయి. మిగతా రూ.6,831 కోట్ల లోటు పూడ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సబ్సిడీ లే దిక్కుకానున్నాయి. 2015-16లో రూ.4,700 కోట్లు సబ్సిడీగా ప్రకటించిన ప్రభుత్వం... ఈసారి సబ్సిడీ నిధులను భారీగా పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న డిమాండ్ నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు వ్యవసాయానికి విద్యుత్‌ను 6 గంటల నుంచి 9 గంటలకు పెంచనుండడం, ఎత్తిపోతల పథకాలు, హైదరాబాద్ మెట్రో రైలు, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ 11.42 శాతం పెరగనుంది. దీంతో మొత్తంగా వార్షిక విద్యుత్ డిమాండ్ 54,884 మిలియన్ యూనిట్లకు చేరనుంది. ఇవి కూడా చార్జీల పెంపునకు దోహదపడనున్నాయి. వీరిపై భారం తప్పింది.. - రాష్ట్రంలో 119.6 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా 80.9 లక్షల (68 శాతం) కనెక్షన్లపై చార్జీల పెంపు భారం ఉండడం లేదు. 86 లక్షల గృహ వినియోగదారుల్లో 60.1 లక్షల మంది (70 శాతం)పై భారం ఉండదు. 20.7 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, 8,681 కుటీర పరిశ్రమలకు ఎలాంటి పెంపు లేదు. - ఎల్టీ కేటగిరీలోని అన్నిరకాల వినియోగదారులపై స్థిరచార్జీలు యథాతథంగా ఉండనున్నాయి. - హెచ్‌టీ కేటగిరీలోని ఫెర్రో అల్లాయ్స్ వినియోగదారులకు మినహాయింపు ఇచ్చారు. పరిశ్రమలకు డబుల్ పెనాల్టీ పరిశ్రమలపై ‘టైమ్ ఆఫ్ డే(టీవోడీ)’ జరిమానాలను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం సాయంత్రం 6-10 గంటల వరకు విద్యుత్ వినియోగంపై ఈ జరిమానా విధిస్తుండగా... ఇకపై ఉదయం 6-10 గంటల వరకు వినియోగంపైన కూడా యూనిట్‌కు రూపాయి చొప్పున పెనాల్టీ విధిస్తారు. దీనితో పరిశ్రమలపై అదనంగా మరో 3 శాతం వరకు చార్జీల భారం పడనుంది. ప్రధానంగా నిరంతరంగా విద్యుత్ వినియోగించుకునే స్టీలు, సిమెంట్, ప్లాస్టిక్, ఫోర్జ్ తదితర పరిశ్రమలపై ప్రభావం పడుతుంది. సగటున పరిశ్రమలపై 10-13 శాతం పెంపు ఉండనుంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుండడంతో అనేక పరిశ్రమలు డిస్కంల నుంచి కాకుండా ఓపెన్ యాక్సెస్ విధానంలో నేరుగా కొనుగోలు చేసుకుంటున్నాయి. టీవోడీ వేళల మార్పుతో మరిన్ని పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ బాట పట్టే అవకాశముంది. అయితే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పరిశ్రమలు విద్యుత్ వినియోగిస్తే ప్రతి యూనిట్ విద్యుత్‌పై 55 పైసల రాయితీని డిస్కంలు ప్రకటించాయి. - హెయిర్ కటింగ్ సెలున్లకు ప్రభుత్వం విద్యుత్ రాయితీని ప్రకటించిన నేపథ్యంలో ఆ వినియోగదారుల కోసం డిస్కంలు కొత్త కేటగిరీని సృష్టించాయి. వినియోగం (యూనిట్లలో) చార్జీలు (రూ.లలో) 0-50 5.26 51-100 6.48 101-200 7.46 ఆరు గంటలకు రూ.4,700 కోట్ల రాయితీ.. తొమ్మిది గంటలకు ఎంత? నాలుగు శ్లాబులకు గృహ కేటగిరీ కుదింపు ప్రస్తుతం గృహ వినియోగ కేటగిరీలో 14 శ్లాబులు ఉండగా కేవలం 4 శ్లాబులకు కుదించారు. ప్రస్తుత, కుదించిన శ్లాబుల్లో ప్రతిపాదిత టారిఫ్, ప్రస్తుత టారిఫ్ (వినియోగం యూనిట్లలో, చార్జీలు రూ.లలో) శ్లాబ్ వినియోగం ప్రస్తుత చార్జీలు ప్రతిపాదిత చార్జీలు 1 0-50 1.45 1.45 2 51-100 0-50 1.45 1.45 50-100 2.60 2.60 3 101-200 0-100 2.60 3.25 101-200 3.60 4.25 4 200కు పైన 0-200 4.10 4.80 201-400 7.43 8.15 400కు పైన 8.50 9.50 -
పెరగనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: కొద్ది రోజుల విరామం తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఫిబ్రవరి మూడో వారంలోనే సాధారణంకంటే ఐదారు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి ఆరంభంలో అవి కాస్త తగ్గుముఖం పట్టాయి. దాదాపు వారం రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతూ వచ్చాయి. తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా తెలంగాణలోని నిజామాబాద్, రాయలసీమలోని అనంతపురంలోనూ 39 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇవి సాధారణంకంటే రెండు డిగ్రీలు అధికం. కోస్తాంధ్రలోని తుని, నందిగామల్లో 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత (2 డిగ్రీలు అధికం) నమోదైంది. ఇకపై క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఎండల తీవ్రత అధికమై సాయంత్రం వేళ తెలుగు రాష్ట్రాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. -
బియ్యానికి రెక్కలు!
వచ్చే ఏడాదికల్లా రెట్టింపు కానున్న ధరలు? సాక్షి, హైదరాబాద్: బియ్యం బంగారం కానుందా..? వచ్చే ఏడాదికల్లా బియ్యం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయా..? ప్రస్తుతం రూ.42 నుంచి రూ.50 మధ్య ఉన్న సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యం సెంచరీ కొట్టనుందా..? తాజా పరిస్థితులు అందుకు అవుననే సమాధానమిస్తున్నాయి! ఏటేటా బియ్యం దిగుబడి ఊహించని విధంగా పడిపోతుండడంతో రేట్లు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఏటా మూడో వంతుకుపైగా బియ్యం దిగుబడి తగ్గిపోతోంది. రెండేళ్ల కిందటితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో 36.02 లక్షల టన్నుల బియ్యం దిగుబడి తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్తులోనే బియ్యానికి తీవ్ర కొరత ఏర్పడనుంది. మార్కెట్లో ఖరీదైన నిత్యావసర సరుకుగా మారి జనాన్ని హడలెత్తించనుంది. రాష్ట్ర అర్థ గణాంక శాఖ సోమవారం విడుదల చేసిన ‘తెలంగాణ వ్యవసాయ గణాంకాల దర్శిని 2014-15’ ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. ఈ గణాంకాల ప్రకారం వరుసగా మూడేళ్ల పంట ఉత్పత్తులను పరిశీలిస్తే.. బియ్యం దిగుబడి తగ్గిన తీరు కళ్లకు కడుతోంది. 2013-14లో రాష్ట్రంలో 65.81 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయింది. 2014-15లో ఇది ఒక్కసారిగా 45.45 లక్షల టన్నులకు పడిపోయింది. ఒకే ఏడాదిలో 20.36 లక్షల టన్నుల బియ్యం దిగుబడి తగ్గిపోవటం గమనార్హం. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ వేసిన లెక్కల ప్రకారం ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వర్షాభావం, కరువుతో వరి సాగు నిరుటి కంటే గణనీయంగా తగ్గింది. 2015-16లో బియ్యం ఉత్పత్తి 29.79 లక్షల టన్నులకే పరిమితమవుతుందని అధికారులు ఇటీవల అంచనా వేశారు. అంటే నిరుటితో పోలిస్తే మరో 15.66 లక్షల టన్నులు తగ్గిపోనుందన్నమాట! బెంబేలెత్తిస్తున్న ధరలు ఇప్పటికే మార్కెట్లో బియ్యం ధరలు సామాన్యులకు అందకుండా పోయాయి. మధ్య తరగతి కుటుంబీకులు, సంపన్నులకు సైతం దడ పుట్టిస్తున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం సూపర్ ఫైన్ బెస్ట్ క్వాలిటీ బియ్యం కిలో రూ.42 నుంచి రూ.50 మధ్య ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ధర 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వమే నిర్ధారించింది. సూపర్ ఫైన్ సాధారణ రకం బియ్యం కిలో రూ.38 నుంచి రూ.42 మధ్య లభ్యమవుతోంది. గతేడాదితో పోలిస్తే ఇది 8 శాతం పెరిగింది. సాధారణ రకం బియ్యం రూ.24 నుంచి రూ.25 ధరలో విక్రయిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ధరలో పెద్ద తేడా లేదు. కానీ తగ్గుతున్న బియ్యం ఉత్పత్తితో వచ్చే ఏడాది బియ్యం ధరలు ఏకంగా 90 శాతం వరకు ఎగబాకే ప్రమాదముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కరువే కారణం.. తీవ్ర వర్షాభావంతో రాష్ట్రంలోని రైతులు వరి సాగుకు దూరమవుతున్నారు. అందుకే ఏటా వరి సాగు విస్తీర్ణం తగ్గిపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వేసిన వరి పంటను సైతం ప్రకృతి వైపరీత్యాలు వెంటాడాయి. ఆహార ధాన్యాలన్నీ ప్రియమే బియ్యంతో పాటు కరువు దెబ్బకు మిగతా పంట ఉత్పత్తుల దిగుబడి కూడా పడిపోయింది. రెండేళ్ల కిందటితో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి సగానిపైగా తగ్గింది. 2013-14లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 106.86 లక్షల టన్నులుగా నమోదవగా.. ఈ ఏడాది 49.35 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నారు. గతేడాది 72.18 లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. మక్కల (మొక్కజొన్న) దిగుబడి సైతం అదే స్థాయిలో తగ్గుముఖం పట్టింది. రెండేళ్ల కిందట 35.12 లక్షల టన్నులు, కిందటేడాది 23.08 లక్షల టన్నులుండగా.. ఈసారి కేవలం 16.19 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే రావొచ్చని అంచనా వేశారు. చిరుధాన్యాల దిగుబడి కూడా.. గడిచిన అయిదేళ్ల సగటు కంటే తగ్గిపోయింది. 2013-14లో 102.21 లక్షల టన్నులున్న చిరుధాన్యాల ఉత్పత్తి కిందటేడాది 69.55 లక్షల టన్నులకు పడిపోయింది. ఈసారి అంతకంటే ఘోరంగా 46.85 లక్షల టన్నులకు పరిమితమైంది. -
బస్ చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ నిరసనలు
-
బస్ చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ నిరసనలు
గుంటూరు: ఆర్టీసీ బస్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా: మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది. సోమవారం ఉదయం మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు కార్యకర్తలు, నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ మేరకు బస్టాండ్‌లో డీఎం వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. పొన్నూరులో రావి వెంకట రమణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయనగరం: బస్సు చార్జీల పెంపుపై విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. చార్జీల పెంపుతో బస్సు ప్రయాణం ఎంత భారమవుతోందో ప్రయాణికులకు వివరించారు. అనంతరం డీఎం బీవీఎస్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రౌతు రామమూర్తి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో ధర్నా, రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. చీపురుపల్లిలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు గల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. శ్రీకాకుళం: పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట రెడ్డిశాంతి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. టెక్కలిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జగన్నాయకులు ఆధ్వర్యంలో పలాసలో నిర్వహించిన ధర్నాలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా: ఉయ్యూరు ఆర్టీసీ డిపో ఎదుట జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు దేవభక్తుని సుబ్బారావు, రావులపాటి రామచంద్రరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగవీటి శ్రీనివాసప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు డీఎంకు వినతి పత్రం అందజేశారు. అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అలాగే, నందిగామ, తిరువూరులోని బస్టాండ్ల వద్ద ధర్నా జరిగింది. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా: మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. దర్శి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా: మదనపల్లిలోని బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డీఎంకు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ జిల్లా: కేంద్రం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎమ్మెల్యే అంజాద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు రాస్తారోకో చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా: మండపేటలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. -
కొనసాగుతున్న కల్తీకల్లు మరణాలు
-
కల్తీకల్లు కాటుకు ఇద్దరు బలి
-
తెలంగాణను కాటేస్తున్న కల్తీ కల్లు
-
పెరిగే గుడ్డు - తరిగే గుడ్డు
ఆరోగ్యవంతమైన జీవనం కోసం రోజూ ఓ గుడ్డు తినమని చెబుతారు వైద్యులు. పోషక విలువలు మెండుగా కలిగిన ఆహారంగా దీనికి పేరు. శరీరానికి ఇది చేసే మేలును పక్కనబెడితే.. గుడ్డుతో ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు. అందులో కొన్ని వంటకు సంబంధించినవి, మరికొన్ని వైజ్ఞానిక విషయాలకు చెందినవి. ఈ రోజు మనం గుడ్డుతో చేయదగిన సరికొత్త వైజ్ఞానిక ప్రయోగాన్ని గురించి తెలుసుకుందాం..! ప్రయోగం: గుడ్డు పరిమాణం మార్పు కావాల్సినవి: రెండు గుడ్లు కారో కార్న్ సిరప్ మంచినీళ్లు రెండు గాజు గ్లాసులు వినెగర్ పెద్దల పర్యవేక్షణ ఏం చేయాలి? తొలుత రెండు గాజు గ్లాసులను తీసుకుని, రెండిట్లోనూ వినెగర్ను నింపండి. ఇప్పుడు రెండు గుడ్లను తీసుకుని వాటిని గ్లాసుల్లోకి జారవిడవండి. 24 గంటలపాటు వాటిని వినెగర్‌లో మునగనివ్వండి. ఇలా చేయడం ద్వారా గుడ్డుపై ఉన్న పెంకులు కరిగిపోయి, మెత్తటి గుడ్డు మాత్రమే మిగులుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఓ గ్లాసులో సిరప్‌ని, మరో గ్లాసులో మంచినీటిని నింపండి. ఈ రెండింటిలోకీ వినెగర్‌లో తడిసిన గుడ్లను నెమ్మదిగా జారవిడవండి. మరో 24 గంటలపాటు వాటి జోలికి వెళ్లకండి. ఇప్పుడు రెండు గుడ్లనూ గ్లాసుల నుంచి వెలుపలికి తీసి పరీక్షించండి. ఏం జరుగుతుంది? మొదట సమాన పరిమాణంలో ఉన్న గుడ్లు ఇప్పుడు వేర్వేరు పరిమాణాల్లో దర్శనమిస్తాయి. నీటిని నింపిన గ్లాసులో ఉన్న గుడ్డు, సిరప్‌లో మునిగిన గుడ్డు కంటే పెద్దదిగా కనిపిస్తుంది. అదే సమయంలో సిరప్‌లో ఉంచిన గుడ్డు కుంచించుకుపోయినట్టుగా ఉంటుంది. ఏంటీ కారణం? ప్రయోగం ప్రారంభంలో గుడ్లను వినెగర్‌లో ముంచినపుడు రసాయనిక చర్యలు జరుగుతాయి. వినెగర్‌లోని ఎసిటిక్ ఆమ్లం, గుడ్డు పెంకులోని కాల్షియం కార్బొనేట్‌తో చర్య జరుపుతుంది. ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్, నీరు, కాల్షియం ఏర్పడతాయి. నీరు, కాల్షియం వంటివి మన కంటికి కనిపించవు. అయితే, గ్లాసులోంచి పైకి వెళ్లే బుడగల రూపంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను మాత్రం గమనించవచ్చు. ఈ ప్రక్రియ కారణంగా పెంకులు లేని గుడ్లను పొందవచ్చు. కుంచించుకుపోవడం... తర్వాతి దశలో సిరప్ ఉన్న గ్లాసును పరీక్షిస్తే.. అందులో కరిగి ఉన్న చక్కెర గాఢత దృష్ట్యా సిరప్ అధిక సాంద్రత కలిగి ఉంటుంది. ఈ చక్కెర అణువులు గుడ్డు పైపొరలోకి చొచ్చుకుపోలేవు. అయితే, గుడ్డులోని నీటి అణువులు మాత్రం పైపొరను దాటుకుని బయటకు రాగలవు. గ్లాసులోని చక్కెర గాఢతతో నీటి గాఢత సరితూగే వరకూ గుడ్డులోని నీటి అణువులు బయటకు వస్తూనే ఉంటాయి. ఇలా గుడ్డు నుంచి సిరప్‌లోకి నీరు బదిలీ కావడంతో గుడ్డు కుంచించుకుపోతుంది. పెరగటం... మరోవైపు, మంచినీటి గ్లాసును పరిశీలిస్తే.. అందులోని గుడ్డు సాధారణం కంటే పెద్దదిగా కనిపిస్తుంది. దీనికి కారణం గుడ్డులో ఉన్న నీటి అణువుల గాఢత కంటే గ్లాసులోని నీటి గాఢత ఎక్కువ కావడమే. దీంతో గుడ్డు నుంచి నీరు బయటకు పోవడానికి బదులుగా బయటి నీరు గుడ్డులోకి వచ్చి చేరుతుంది. ఇంకేముంది! గుడ్డు తన పరిమాణం కంటే పెద్దదిగా మారుతుంది. -
ఆస్తి పన్ను పెంపుకు రంగం సిద్ధం
-
తుంగభద్ర డ్యామ్‌లో పెరుగుతున్న నీటిమట్టం
- 26 టీఎంసీలకు పైగా చేరిన నీరు - ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకం సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జీవనాడి అయిన తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతోంది. తుంగభద్ర డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్ధ్యం 101 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 26 టీఎంసీలకు పైగా నీరు నిల్వ చేరడంతో బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలతో పాటు అనంతపురం, కర్నూలు, కడప, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన రైతుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం డ్యాంలోకి 26 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో చేరుతోంది. ఇదే ఇన్‌ఫ్లో మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. తుంగభద్ర డ్యాంలో గత ఏడాది ఇదే సమయానికి 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం 26 టీఎంసీల నీరు నిల్వ చేరడంతో రెండింతల నీరు వచ్చినట్లయింది. దీంతో ఖరీఫ్ సాగుకు ఎలాంటి ఢోకా ఉండబోదని చెప్పవచ్చు. సకాలంలో ఆయకట్టు కాల్వలకు నీరు వదిలితే పంటలు సాగు చేసుకునేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతంలో మరోసారి భారీ వర్షాలు కురిస్తే జూలై నెలాఖరు కల్లా తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం టీబీ డ్యాం నీటిమట్టం 1604.04 అడుగులు కాగా ఇన్‌ఫ్లో 26606 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 180 క్యూసెక్కులు, నీటి నిల్వ 25.131 టీఎంసీలు ఉందని, గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో నీటిమట్టం 1594.16 అడుగులు ఉండగా, ఇన్‌ఫ్లో 1703 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 205 క్యూసెక్కులు, నీటి నిల్వ సామర్ధ్యం 13.331 టీఎంసీలుగా ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. -
కళ్లు తెరవకనే..
మా అమ్మ ఒడిలో వెచ్చగా నిదురించే సమయంలో నాన్న పొలం నుంచి వచ్చాడు. అమ్మ చేతుల్లోంచి నాన్న నన్ను ఎత్తుకోగానే నన్ను తన భుజాలపై వేసుకొని ఆడిస్తాడని సంబర పడ్డాను. కానీ నాన్న అలా చేయలేదు. పొలంలో చల్లాల్సిన పురుగుల మందును కాస్తా నాకు పట్టించేశాడు. ఎందుకో తెలుసా నేను ఆడపిల్లననే కారణంతో. వద్దు నాన్నా నన్ను చంపాలని చూడకు, నాకు కూడా అందరిలా ఈ లోకాన్ని చూడాలని ఉంది, నీ వేలు పట్టుకొని నడవాలని ఉంది, అని చెబుదామనుకున్నాను, కానీ నాకేమో మాటలు రావు, నా గుండె ఘోష నాన్నకు అర్ధం కాదు బెంగళూరులోని వాణివిలాస్ ఆస్పత్రిలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారి మనసులోని వ్యధ ఇది. అవును కేవలం నెల రోజుల వయసు కలిగిన చిన్నారిని ఆడపిల్లనే కారణంతో వద్దనుకున్నాడు ఓ కర్కశ తండ్రి. ఆడపిల్లంటే అంతా మైనస్సే అన్న భావనతో చెన్నపట్నకు చెందిన శివకుమార్ నెలరోజుల వయస్సున్న తన కూతురికి మే 1న రాత్రి సమయంలో పురుగుల మందు పట్టించాడు. దీంతో పాప ఆరోగ్యం విషమించడంతో పాప తల్లి వీణా చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని వాణి విలాస్ ఆస్పత్రికి పాపను తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఐసీయూలో మృత్యువుతో పోరాడుతోంది. సాక్షి, బెంగళూరు: ఎంతో మంది ఆడపిల్లలు భూమి మీద పడకుండానే తల్లి గర్భంలో ఉండగానే ప్రాణాలు వదులుతుంటే మరికొందరేమో కర్కశ మనస్తత్వం కలిగిన తండ్రుల చేతుల్లో కళ్లు కూడా తెరవకుండానే కడతేరుతున్నారు. ఆడపిల్లా అయితే అవసరం లేదు అనుకుంటున్న వారి కారణంగా ఇలా భ్రూణ హత్యల్లో కన్నుమూస్తూ, చెత్తకుప్పల్లోకి చేరి కుక్కలకు, పందులకు ఆహారంగా మారుతున్న చిట్టి తల్లులు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రం లో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో సగటున ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు 943 మంది మాత్రమే ఆడపిల్లలు (సెక్స్ రేషియో) ఉన్నారు. కాగా కొన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రాష్ట్రంలోని దాదాపు 15 జిల్లాల్లో ఈ సెక్స్ రేషియో రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉండటం అందోళన కలిగించే అశం. రాష్ట్రానికి తీవ్ర నష్టం భారత దేశంలో ప్రతి రోజూ సగటున ఏడు వేల మంది బా లికలు గర్భంలోనే లేదా పుట్టిన ఐదేళ్లలోపు తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యునెసెఫ్) తాజా నివేదికలో వెల్లడించింది. వంశాన్ని ఉద్దరించే మగపిల్లలుంటే చాలు ఆడపిల్లలు అవసరం లేదన్న మూఢ నమ్మకంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని యునెసెఫ్ తన నివేదికలో పేర్కొంది. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ విషయంలో పోటీపడుతూ ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఇందుకు కర్ణాటక కూడా మినహాయింపు కాదని తన నివేదికలో ఘాటుగా విమర్శించింది. చట్టాలు ఉన్నా అమలేది ఆడశిశువుల హత్యలతో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఉత్తరభారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెళ్లిళ్లు చేసుకునేందుకు అబ్బాయిలకు అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో వారు వరకట్నానికి బదులుగా కన్యాశుల్కం ఇస్తామన్నా కూడా పెళ్లిల్లు జరగడం లేదు. దీంతో అక్కడి అబ్బాయిలు అవివాహితులుగానే ఉండి పోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయడానికి, ఆడ శిశువులను సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం భ్రూణ హత్యల నిరోధక చట్టాన్ని 1996లో దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి కర్ణాటకలో కూడా ఈ చట్టం అమల్లో ఉన్నా ఇప్పటి వరకూ ఈ చట్టం కింద శిక్షలు పడిన దాఖలాలు ఒక్కటి కూడా లేదు. దీంతో ఈ చట్టం రాష్ట్రంలో ఏపాటిగా అమలవుతోంది అర్థమవుతోంది. ఇక రాష్ట్రంలోని లింగనిర్థారణ పరీక్షలు జరిపే సంస్థల పై ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ (ప్రొహిబిటెడ్) యాక్ట్ ప్రకారం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని.... నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సంస్థల లెసైన్సులు రద్దుపరిచి బాధ్యులకు తప్పక శిక్ష పడేలా చేసినప్పుడు మాత్రమే భ్రూణ హత్యలు తగ్గుతాయని న్యాయనిపుణులు భావిస్తున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న దొంగతనాలు
-
‘నెట్టి’ంట్లో నేరాలు
ఒంగోలు క్రైం : సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో... అంతే వేగంతో సైబర్ నేరాలు జిల్లాలో పెరిగిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రాకుండానే కేవలం కంప్యూటర్ పరిజ్ఞానం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్న అక్రమార్కులు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా లక్షలు, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. జిల్లాలోని గ్రానైట్ వ్యాపారులు, పొగాకు వ్యాపారులు దీనికి బాధితులుగా మారుతున్నారు. విదేశాలతో లావాదేవీలు జరిపే సమయంలో పూర్తిగా ఆన్లైన్ బ్యాంకింగ్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న హ్యాకర్లు కోట్ల రూపాయలను కాజేస్తున్నారు.. విదేశాల్లో ఉండి ఇలాంటి మోసాలకు పాల్పడటంతో పోలీసులకు తలకుమించిన భారంగా మారుతోంది. హ్యాకింగ్ ఎలా చేస్తారు... అపరిచిత చిరునామాలనుంచి మెయిల్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కొద్దిగా పేరు మార్పుతో (ఒక అక్షరం అటూ ఇటుగా ) మనం లావాదేవీలు నడిపే సంస్థ పేరుతో మెయిల్స్ వస్తుంటాయి. వీటిని పొరపాటున చూసుకోకుండా ఓపెన్ చేస్తే, మీ పాస్వర్డ్ ఒకసారి సరి చూసుకోమంటూ మెసేజ్ వస్తుంది. దీంతో మనం మన పాస్‌వర్డ్‌ను టైప్ చేస్తే ఆ పాస్‌వర్డ్‌ను వారు సొంతం చేసుకుని దాని ద్వారా మెయిల్‌ను హ్యాక్ చేస్తారు. ఒక్కోసారి మీ మెయిల్‌ను బయటివారు తెరవడానికి ప్రయత్నించారంటూ మెసేజ్ వస్తుంది. దీన్ని తెరిచే ప్రయత్నం చేసినా మీ మెయిల్ హ్యాక్ అవడం ఖాయం. ప్రత్యేకించి ఈ మెయిల్ ద్వారా ఆన్లైన్ షాపింగ్, బిజినెస్ చేసేవారు కొత్త మెయిల్స్ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు చేస్తారు... ఈ మెయిల్స్ ఎక్కువగా నైజీరియా నుంచి, యునెటైడ్ కింగ్డమ్ (బ్రిటన్) నుంచి వస్తున్నాయి. నైజీరియన్స్ ఎక్కువగా ఈ విధంగా ఈజీమనీకి అలవాటుపడి ఆయా ఖాతాలను హ్యాక్ చేసే పనిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుకోవడం కష్టమే... మెయిల్‌ను ఎవరు హ్యాక్ చేసింది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. జిల్లాల్లో జరిగినపుడు వారికి ఉన్న సాంకేతిక పద్దతులతో కేసులను డీల్ చేయడం సులభమే. ఇతర దేశస్తులు ఈ తరహా నేరాలకు పాల్పడితే పట్టుకోవడం పెద్ద ఇబ్బందే. సీఐడీ ద్వారా సీబీఐ ...అక్కడి నుంచి ఇంటర్‌పోల్ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇంత జరిగినా వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల ముందు జాగ్రత్త పడటం చాలా అవసరం జిల్లాలో నేరాలు ఇలా... ప్రకాశం జిల్లాలో ఇటువంటి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొగాకు, గ్రానైట్ వ్యాపారులను సైబర్ క్రైం ద్వారా మోసం చేసిన ఘటనలు నాలుగైదు జరిగాయి. ఏడాదిన్నర క్రితం ఇండియన్ టుబాకో అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ పొగాకు వ్యాపారి బెల్లం కోటయ్య మోసపోయారు. ఇదేవిధంగా ఇతర దేశాల నుంచి ఇతనికి రావాల్సిన టుబాకో అమ్మకం మొత్తంలో రూ. 3 కోట్లు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా నగదు గల్లంతయింది. ఈ కేసును పోలీసులు ఛేదించగలిగారు. రూ.3 కోట్లలో కేవలం రూ.70 లక్షలు మాత్రమే వసూలు చేసుకోగలిగారు. మూడు రోజుల క్రితం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, వ్యాపారవేత్తలను సెల్‌ఫోన్ ఫ్యాన్సీ నెంబర్ల పేరిట మద్దెల దీపుబాబు వేసిన గాలానికి చిక్కి గిలగిల్లాడిపోయారు. తాజాగా ప్రముఖ గ్రానైట్ వ్యాపారి ఒంగోలులోని గోపాలనగర్ 4వ లైనులో నివాసం ఉంటున్న చల్లా శ్రీనివాసరావు సైబర్ నేరస్తుడి బారినపడి 1.25 లక్షల డాలర్లు మోసపోయారు. అంటే మన రూపాయిల్లో రూ.78.75 లక్షల విలువ. అయితే సరుకు పంపించకపోవడంతో చైనా దేశ కస్టమర్ నష్టపోవల్సి వచ్చింది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్లతో అప్రమత్తం : ఎస్పీ శ్రీకాంత్ నగదు లావాదేవీలు ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్లతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ ఆన్లైన్ లావాదేవీలు నడిపే వారిని హెచ్చరించారు. ఒంగోలు కరూర్ వైశ్యాబ్యాంకుకు రావాల్సిన ఆన్లైన్ ట్రాన్స్ఫర్ యునెటైడ్ కింగ్‌డమ్‌లోని బార్ ఫ్లక్స్ బ్యాంకుకు బదిలీ కావటాన్ని గుర్తించినట్లు ఎస్పీ వివరించారు. ఆన్లైన్ లావాదేవీలు నడిపేటప్పుడు అనుమానాస్పద ఈ-మెయిల్స్ వస్తే ఎలా పడితే అలా ఓపెన్ చేయకూడదని సూచించారు. ఈ-మెయిల్స్‌లో మీ అకౌంట్‌ను మరోసారి సరిచూసుకోవాలని, పదే పదే మెయిల్ పంపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు పాస్‌వర్డ్‌ను ఉపయోగించి అకౌంట్ సరిచూసుకుంటే ఆన్లైన్ బ్యాంకు అకౌంట్లు హాంకింగ్ చేసే నేరగాళ్లు సులభంగా మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. -
అమెరికాలో 28% పెరిగిన భారత విద్యార్థులు
వాషింగ్టన్: అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నెల 7వ తేదీ నాటికి అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య 1,34,292కు చేరిందని తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్యలో 28 శాతం పెరుగుదల ఉందని పేర్కొంది. హోమ్‌లాండ్ సెక్యూరిటీకి చెందిన ‘ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్’ విభాగం విదేశీ విద్యార్థులపై ఈ నివేదిక విడుదల చేసింది. విదేశీ విద్యార్థుల్లో అధికశాతం మంది కాలిఫోర్నియా(18,212), టెక్సాస్(17,033), న్యూయార్క్(14690), ఇల్లినాయీ(8427), మసాచుసెట్స్(6,763)లలో చదువుతున్నారు. -
తెలంగాణలో పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు
-
ఇన్స్‌రెన్స్ కంపెనీల గోల్మాల్
-
పెరుగుతున్న మార్కెట్ షేర్
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: స్టాక్ మార్కెట్ ఇటీవలి కాలంలో అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. సెన్సెక్స్ తదితర మార్కెట్ సూచీలు ఒకరోజు తారాజువ్వలా దూసుకుపోతే.. మరో రోజు పాతాళానికి దిగజారిపోతున్నాయి. ఇటువంటి ఒడుదొడుకుల పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించడం చిన్న విషయం కాదు. కానీ ఆర్థికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఇలా పెట్టుబడులు పెరుగుతున్నాయంటే విశేషమే. గత కొన్నేళ్లుగా ఏటా సగటున రూ.200 కోట్ల లావాదేవీలు జిల్లాలో జరుగుతున్నాయి. రోజూ వేల కోట్ల టర్నోవర్ సాధించే స్టాక్ మార్కెట్లో ఇది చాలా చిన్న మొత్తమే కావచ్చు కానీ.. శ్రీకాకుళం లాంటి జిల్లా నుంచి ఈ మాత్రం లావాదేవీలు జరగడం కచ్చితంగా చిన్న విషయం మాత్రం కాదు. అంతేకాకుండా గతంలో ఇంజినీరు, డాక్టర్లు వంటి వృత్తి నిపుణులకే పరిమితమైన షేర్ వ్యాపారంలో ఇప్పుడు దాదాపు అన్ని రంగాల వారు.. చివరికి గృహిణులు సైతం పెట్టుబడులు పెడుతున్నట్లు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులు జిల్లాలో షేర్ మార్కెట్ విస్తరణపై జరిపిన సర్వేలో వెల్లడైంది. మరికొన్ని విశేషాలు చూస్తే.. గత మూడేళ్లుగా స్టాక్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో పెట్టుబడు లు పెట్టడానికి మదుపరులు ముందుకురారు. కానీ ఈ కాలంలోనే జిల్లా నుంచి పెట్టుబడులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలో ఏటా సుమారు రూ.200 కోట్ల వరకు షేర్ మార్కెట్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం వాటా రూ.60 కోట్లు. షేర్ వ్యాపారం చేస్తున్న వారిని రంగాలవారీగా పరిశీలిస్తే.. ఉపాధ్యాయులు మొదటి స్థానంలో నిలుస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో వరుసగా బ్యాంకు ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు, గృహిణులు, ఇతరులు ఉన్నారు. ఇంతకుముందు వరకు వృత్తి నిపుణులకే పరిమితమైన ఈ వ్యాపారంలో వారిని బాగా వెనక్కి నెట్టి ఉపాధ్యాయులు ముందు స్థానంలోకి రాగా.. గృహిణులు కూడా ఈ రంగంలోకి పెద్ద సంఖ్యలో ప్రవేశించడం ఆసక్తికరమైన విషయం. జిల్లాలో 12 స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. జేఆర్జీ సెక్యూరిటీస్, రెలిగేర్, స్టీల్ సిటీ, కార్వీ, బొనంజా పోర్టుఫోలియోస్, ఏంజెల్ బ్రోకింగ్, నార్త్ ఈస్ట్ బ్రోకరేజ్ సర్వీసెస్ తదితర సంస్థలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈల అనుమతితో సేవలందిస్తున్నాయి. లావాదేవీలు చట్టబద్దంగా జరగడం, అధిక శాతం ఆన్లైన్ వ్యాపారం కావడం, పెట్టుబడులకు సెబీ(సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ ఆఫ్ ఇండియా) వంటి ప్రభుత్వ సంస్థల భద్రత ఉండటం, అవగాహన పెరగడం, ఎక్కడి నుంచైనా నెట్ సౌకర్యంతో ఈ లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యం ఉండటం వంటి కారణాలు షేర్ మార్కెట్ విస్తరించడానికి దోహదం చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అప్రమత్తత అవసరం ఎంత చట్టబద్దత ఉన్నప్పటికీ ఏమరుపాటు వహిస్తే మోసపోయే ప్రమాదం కూడా ఉందని నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ వ్యాపారంలో ఎటువంటి అవగాహన లేకుండా స్టాక్ బ్రోకింగ్ సంస్థల మీద ఆధారపడి పెట్టుబడులు పెడితే మునిగిపోయే ప్రమాదం ఉంది. కంపెనీల పనితీరును పట్టించుకోకుండా పెట్టుబడులు పెడితే నష్టపోవడం తప్ప ఫలితం ఉండదు. పైగా లావాదేవీలన్నింటికీ పనుల రూపంలో అదనపు భారం పడుతుంది. అత్యంత రిస్క్‌తో కూడిన ఇంట్రాడే ట్రేడింగ్ జోలికి వెళ్లకుండా కంపెనీల ఆర్థిక ఫలితాలు, పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలే ఆర్జించే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. నిరంతరం స్టాక్ మార్కెట్ కదలికలను అధ్యయనం చేయడం, చెక్కుల రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం ద్వారా మోసాలు, నష్టాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని సూచించారు. అలాగే మార్కెట్ తరచూ హెచ్చుతగ్గులకు గురవుతుంటుంది. పతన దశలో ఉన్నప్పుడు కంగారు పడి షేర్లను అమ్మేసుకోకుండా ధైర్యం, సహనంతో ఎదురు చూసి, మళ్లీ మర్కెట్ పుంజుకున్నప్పుడు విక్రయిస్తే లాభాలు వస్తాయని సూచించారు. అవగాహన తప్పనిసరి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి ఈ రం గంపై అవగాహన తప్పనిసరి. రోజూ వార్తా పత్రికల్లో వస్తున్న బిజినెస్ వార్తలు పరిశీలించాలి. వర్తమాన రాజకీయ, ఆర్థిక పరిస్థితులపైనే సెన్సెక్స్ గమనంఆధారపడి ఉంటుంది.అందువల్ల ఆయా రంగాలను నిత్యం పరిశీలనలోకి తీసుకోవాలి. -ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, ఎకనమిక్స్ విభాగాధిపతి పెట్టుబడి పెట్టవచ్చు ఇది జూదం కాదు. అందువల్ల స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రస్తుతం జిల్లాలో గృహిణులు సైతం ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. వందల నుంచి లక్షల్లో ఆర్థిక స్తోమత బట్టి బెట్టుబడులు పెట్టవచ్చు. -డాక్టర్ ఎన్.సంతోష్ రంగనాథ్, బోధకులు మోసాలు తగ్గాయి స్టాక్ బ్రోకింగ్ సంస్థల మోసాలు ఇటీవలి కాలంలో బాగా తగ్గాయి. ఏదైనా సంస్థ మోసానికి పాల్పడితే.. ఆ విషయం సెబీకి పిర్యాదధు చేయవచ్చు. అటువంటి సంస్థల లెసైన్సును సెబీ రద్దు చేస్తుంది. ప్రస్తుతం ఇది చట్టబద్ధ వ్యాపారం. ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. స్టాక్ మార్కెట్ నిలకడగా లేకున్నా జిల్లాలో పెట్టుబడులు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి. -ప్రొఫెసర్ గుంట తులసీరావు, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హెడ్ -
నిండుకుండను తలపిస్తున్న మానేరు డ్యామ్
-
ధరల బాంబు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఉల్లి, ఆలు ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఉల్లి ధర అమాంతం పెరిగి ఇటీవలనే కొంత తగ్గుముఖం పట్టగా తాజాగా రెండు రోజుల క్రితం మళ్లీ ధర పెరిగింది. ఉల్లితో ఆలు కూడా పోటీ పడుతోంది. రెండు రోజుల క్రితం ఉల్లి, ఆలు ధరలు కిలోకు రూ.5 చొప్పున పెరిగాయి. పెరుగుతున్న ధరలు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో నిత్యావసర సరుకుల ధరలు సెన్సెక్స్‌తో పోటీ పడుతున్నాయి. కిలో ఉల్లి రూ.50, ఆలు రూ.24.. ఉల్లి తరిగితేనే కాదు దాని ధర చూస్తే కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో రెండు రోజుల క్రితం వరకు కిలో ఉల్లి రూ.45 విక్రయించిన వ్యాపారులు ప్రస్తుతం రూ.50 కిలో చొప్పున అమ్ముతున్నారు. అదే మాదిరి కిలో ఆలు రూ.19 అమ్మగా ఆ ధర ప్రస్తుతం రూ.24 పెరిగింది. రెండు రోజుల్లోనే ఒక్కసారిగా కిలోకు రూ.5 చొప్పున ధర పెరిగింది. పక్షం రోజుల క్రితం కిలో ఆలు రూ.15 ఉండగా, ఆ తర్వాత రూ.4 ధర పెరిగింది. రెండు రోజుల క్రితం వరకు రూ.19 కిలో అమ్మిన వ్యాపారులు ఇప్పుడు రూ.24 విక్రయిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తుండటంతో.. జిల్లాలో రోజుకు ఉల్లి, ఆలు సుమారు వెయ్యి క్వింటాళ్ల వరకు రవాణా అవుతుంటాయి. వీటిని ప్రస్తుతం హైదరాబాద్ మార్కె ట్ నుంచి హోల్‌సేల్ వ్యాపారులు తీసుస్తుంటారు. వీటి అమ్మకాలు అధికంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, భైంసా, ఉ ట్నూర్ తదితర ప్రాంతాల్లో జరుగుతాయి. పక్షం రోజుల నుంచి ఉల్లిగడ్డలను హైదరాబాద్ ప్రధాన మార్కెట్ నుంచి కోల్కత్తా మీదుగా బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఉల్లిగడ్డల కొరత ఏర్పడి ధరల పెరుగుదలకు కారణమవుతోంది. వర్షాల ప్రభావంతో.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. విస్తారంగా కురిసిన వర్షాలతో సీమాంధ్రలో సాగు చేస్తున్న ఉల్లి, ఆలుగడ్డల పంటలపై తీవ్ర ప్రభావం పడింది. చిత్తూర్ జిల్లా మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్‌కు రోజువారీగా వచ్చే ఆయా రకాల సరుకులు తగ్గుముఖం ప ట్టాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో ఉల్లి, ఆలు ధరలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఏటా సీ జన్‌లో సోలాపూర్, నాగ్‌పూర్, దులియా(మహారాష్ట్ర), బెల్గాం (కర్నాటక), రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల నుంచి ఉల్లి, ఆలు భారీ మొత్తంలో రాష్ట్రానికి సరఫరా అవుతాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో పంటలు ఇంకా చేతికి రాలేదు. మరో నెల రోజులు గడిస్తే కాని ఆ వైపు నుంచి రాష్ట్రానికి ఉల్లి, ఆలు దిగుమతి అయ్యే పరిస్థితులు లేవు.