వైర్‌లెస్ డేటా స్పీడ్ 2జీబీ పర్ సెకన్! | New material may lead to internet data speed of 2GB per second | Sakshi
Sakshi News home page

వైర్‌లెస్ డేటా స్పీడ్ 2జీబీ పర్ సెకన్!

Published Mon, Aug 15 2016 4:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

వైర్‌లెస్ డేటా స్పీడ్ 2జీబీ పర్ సెకన్!

వైర్‌లెస్ డేటా స్పీడ్ 2జీబీ పర్ సెకన్!

జెడ్డా: వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్‌ల డేటా స్పీడ్ విషయంలో పెనుమార్పులు రాబోతున్నాయి. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఇటీవల అభివృద్ది చేసిన ఓ కొత్త పదార్థం ఇంటర్నెట్ డేటా స్పీడ్‌ను సెకన్‌కు రెండు గిగాబైట్ల(జీబీ) వరకు పెంచుతుందని గుర్తించారు. వీరు తయారు చేసిన నానో క్రిస్టలిన్ మెటిరియల్.. బ్లూలైట్‌ను వేగంగా వైట్‌లైట్‌గా మార్చుతుందని, దీంతో డేటా స్పీడ్‌ అసాధారణంగా పెరుగుతుందని వెల్లడించారు.

బ్లూటూత్, వైఫై లాంటి టెక్నాలజీల వినియోగంలో విద్యుదయస్కాంత తరంగాల తరంగదైర్ఘ్యాన్ని తగ్గించడం ద్వారా సమాచార బదిలీలో వేగాన్ని పెంచొచ్చని పరిశోధకులు వెల్లడించారు. నానో క్రిస్టలిన్ మెటిరియల్ సహాయంతో డేటా వేగాన్ని పెంచే ప్రక్రియ అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని ప్రొఫెసర్ బూన్ ఊయ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement