data speed
-
డేటా స్పీడ్‌లో భారత్ జోరు..
న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వేగం 115 శాతం మేర పెరిగింది. దీంతో స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో (ఎస్జీఐ) అత్యంత స్వల్ప సమయంలోనే భారత్ 49 ర్యాంకులు ఎగబాకి 69వ స్థానానికి చేరింది. తద్వారా రష్యా, అర్జెంటీనా వంటి కొన్ని జీ20 దేశాలను కూడా అధిగమించింది. 5జీ సేవల ఆవిష్కరణ తర్వాత భారత్‌లో డేటా స్పీడ్‌కి సంబంధించి నెట్వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ విశ్లేషణ సంస్థ ఊక్లా బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం భారత్‌లో సగటున డౌన్లోడ్ స్పీడ్ 13.87 ఎంబీపీఎస్ నుంచి (2022 సెప్టెంబర్) 115 శాతం వృద్ధి చెంది 29.85 ఎంబీపీఎస్‌కు (2023 జనవరి) పెరిగింది. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఎస్‌జీఐలో 118వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది జనవరిలో 69వ స్థానానికి చేరింది. త్వరలోనే బ్రెజిల్ (35.85 ఎంబీపీఎస్, 57వ ర్యాంకు)ను కూడా అధిగమించనుంది. జియో టాప్.. జనవరిలో జియో 5జీ స్పీడ్ హిమాచల్ ప్రదేశ్‌లో సగటున 246.49 ఎంబీపీఎస్ నుంచి కోల్‌కతాలో 506.25 ఎంబీపీఎస్‌గా నమోదైంది. అలాగే ఎయిర్టెల్ 5జీ యూజర్లకు కోల్‌కతాలో సగటున 78.13 ఎంబీపీఎస్, ఢిల్లీలో 268.89 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా లభించింది. ఇక గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మద్య కాలంలో వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 5జీ లాంచ్ తర్వాత ఇది మరింత వేగవంతమయ్యింది. -
ఒక్క సెకన్లో వెయ్యి హెచ్డీ సినిమాలు డౌన్లోడ్?!
మెల్బోర్న్: అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్ యుగంలో అనేకానేక అద్భుత ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఓ నిత్యావసరంగా మారిన నేటి కాలంలో, క్షణాల్లోనే సమాచారం అరచేత వాలుతున్నా మరింత వేగంగా దానిని ఒడిసిపట్టుకునే పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని మోనాశ్, స్విన్‌బర్న్, ఆర్ఎమ్ఐటీ యూనివర్సిటీలు అద్భుతం చేశాయి. ఒకే ఒక ఆప్టికల్ చిప్ సాయంతో 44.2 టీబీపీఎస్ (టెరాబిట్స్ పర్ సెకండ్) డేటా స్పీడ్‌ను అందుకునే సాంకేతికతను అభివృద్ధి చేశాయి. ఈ డేటా స్పీడ్‌తో సెకన్ కంటే తక్కువ సమయంలో దాదాపు 1000 హెచ్డీ సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. (డిజిటల్ లక్ష్యంతో శాంసంగ్, ఫేస్బుక్ జట్టు..) కాగా డాక్టర్ బిల్ కోర్కోరన్ (మోనాశ్), ప్రొఫెసర్ డేవిడ్ మోస్ (స్విన్‌బర్న్), ఆర్ఎమ్ఐటీ ప్రొఫెసర్ ఆర్నన్ మిచెల్ నేతృత్వంలోని పరిశోధన బృందం ఈ అద్భుతమైన ఫీట్ సాధించింది. తద్వారా డేటా ఆప్టిక్స్, టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరతీసింది. మెల్బోర్న్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన డార్క్ ఆప్టికల్స్ నెట్వర్క్ (76.6 కి.మీ.) లోడ్ టెస్టు నిర్వహించింది. ఈ మేరకు తమ ఆవిష్కణకు సంబంధించిన వివరాలను ప్రఖ్యాత నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో పొందుపరిచింది. (రీచార్జ్ చేయకుంటే కనెక్షన్ కట్: నెట్‌ఫ్లిక్స్) ఇక తమ టెక్నాలజీ ఆస్ట్రేలియన్ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ట్రాక్ చేయడానికి మాత్రమే పరిమితం కాదని... బిలియన్ల సంఖ్యలో ఇంటర్నెట్ కనెక్షన్లు యాక్టివ్‌గా ఉన్న సమయంలోనూ ఇదే స్థాయి స్పీడ్‌ను అందుకునేందుకు వీలుగా తమ పరిశోధన ఉపయోగపడుతుందని బృందం వెల్లడించింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ఎలా ఉండబోతుందో తమ పరిశోధన చూచాయగా ప్రతిబింబించిందని పేర్కొంది. ఈ పరిశోధనలో తమకు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక అత్యంత వేగంతో డేటాను డౌన్లోడ్ చేయడానికి వీలుగా తాము రూపొందించిన కొత్త పరికరంలో 80 లేజర్లతో పాటు మైక్రో- కోంబ్‌ను ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు. కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెలికమ్యూనికేషన్ హార్డ్వేర్లలో ఈ మైక్రో కోంబ్ అత్యంత సూక్ష్మమైన, తేలికైన పరికరం. -
జియో జోరుకు బ్రేకులు!
• నెమ్మదించిన సబ్స్క్రైబర్ల వృద్ధి • సగానికి తగ్గిన డేటా స్పీడ్ • మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ముంబై: టెలికం రంగంలో జియో ఓ సంచలనం. ఇది నిన్నటి మాట. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తోంది. జియో సేవలు ఆశించినంత స్థారుులో లేవని యూజర్లు పెదవి విరచడం ఇప్పుడు కంపెనీని ఆందోళనలో పడేసింది. కంపెనీకి 2018 డిసెంబర్ నాటికి 10 కోట్ల మంది కస్టమర్లను చేరుకోవాలనే లక్ష్యం కూడా దూరమయ్యేలా కనిపిస్తోంది. తాజా గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తన నివేదిక పేర్కొంది. తగ్గిన నెట్వర్క్ నాణ్యత సేవలు ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నా కూడా జియో.. 2-35 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటాను కస్టమర్లకు అందించలేకపోతోందని మోతీలాల్ ఓస్వాల్ విమర్శించింది. ఎక్కువ మంది కస్టమర్లు, వారి అధిక వినియోగం అనే రెండు అంశాలు కంపెనీ డేటా స్పీడ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొంది. అలాగే దీని వల్ల నెట్వర్క్ నాణ్యత కూడా తగ్గిపోరుుందని వివరించింది. అసలు సత్తా తెలిసేది అప్పుడే! తన సర్వీసులకు చార్జీలను వసూలు చేయడం ప్రారంభించిన దగ్గరి నుంచే రిలయన్స జియో అసలు సత్తా తెలుస్తుందని మోతీలాల్ పేర్కొంది. వెల్కమ్ ఆఫర్ ముగిసిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్లు జియోను రెండవ సిమ్గా వినియోగిస్తారని అంచనా వేసింది. ఇక జియో భాగస్వాములకు యూజర్ల నుంచి అధిక ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడింది. చాలా మంది సబ్స్క్రిప్షన్సను కొనసాగించకపోవచ్చని పేర్కొంది. జియోకి ఎరుుర్టెల్లే ప్రధాన పోటీదారు రిలయన్స జియోకి భారతీ ఎరుుర్టెల్లే ప్రధాన పోటీదారని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం అటు నెట్‌వర్క్‌లో గానీ, ఇటు డేటా సేవల్లో గానీ జియోకి కేవలం ఎరుుర్‌టెల్ మాత్రమే గట్టిపోటినిస్తుందని అభిప్రాయపడింది. ఇతర టెలికం కంపెనీలకు వాటి బలాన్ని చూపడానికి 12-18 నెలల సమయం పడుతుందని పేర్కొంది. కాగా, ఎరుుర్‌టెల్ టెలికం మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరిన్ని పెట్టుబడులు... యూజర్ల నుంచి వ్యక్తమౌతోన్న సమస్యల పరిష్కారానికి జియో వచ్చే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెడుతుందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం టెలికం ఇన్వెస్ట్మెంట్లు రూ.2.25-రూ.2.30 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడం, డిజిటల్ సేవల విస్తరణ వంటి వాటికి ఈ నిధులను ఉపయోగించుకుంటుందని తెలిపింది. కాగా కంపెనీ లాభాలను గడించాలంటే కనీసం 8-10 ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంది. వెల్కమ్ ఆఫర్‌ను పొడిగిస్తుందా? రిలయన్స జియో తన వెల్కమ్ ఆఫర్‌ను పొడిగించే అవకాశముందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. సంస్థ తన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను కూడా రిలయన్స డిజిటల్స్ నుంచి మరిన్ని ఇతర ఔట్‌లెట్స్‌కి, స్టోర్లకి విస్తరించొచ్చని తెలిపింది. అలాగే రూ.200-రూ.300 ధర శ్రేణిలో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తేవొచ్చని అభిప్రాయపడింది. -
టెలికాం కంపెనీల మధ్య డేటా యుద్ధం
-
జియో డేటా స్పీడు దారుణం!
• టాప్-5 సంస్థల్లో అతి తక్కువ వేగం దీనిదే • ట్రాయ్ పరీక్షల్లో వెల్లడైన వాస్తవం • సేవల వేగంలో ఎయిర్టెల్ టాప్ న్యూఢిల్లీ: ‘4జీ టెక్నాలజీతో దేశంలో డేటా విప్లవాన్ని సృష్టిస్తాం. వేగవంతమైన డేటా సేవలు అందిస్తాం’ అంటూ టెలికం రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన రిలయన్స్ జియో ప్రకటనలు... ఆచరణలో అంతంతమాత్రమేనని తేలుతోంది. 4జీ టెక్నాలజీ అంటేనే వేగంతో కూడుకున్నది కనుక జియో ప్రకటనలను కస్టమర్లు పూర్తిగా విశ్వసించారు. ‘90 రోజుల పాటు జియో సేవల అనుభవాన్ని ఉచితంగా, అపరిమితంగా ఆస్వాదించండంటూ’ చేసిన ప్రకటన చూసి త్రీజీ ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకునో, పక్కన పడేసో 4జీ ఫోన్లకు మారిపోయిన వారు ఎందరో!!. కానీ ఆచరణలోకి వచ్చే సరికి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రిలయన్స్ జియో డేటా స్పీడు వేగంగా లేదు. సరికదా దారుణంగా ఉంది. స్పీడు సంగతి పక్కనబెడితే చాలా ప్రాంతాల్లో అసలు కనెక్టివిటీనే లేదు. 5 ప్రధాన టెల్కోల 4జీ డేటా వేగాన్ని పరీక్షించగా ఆఖరి స్థానంలో ఉన్నది జియోనేనని సాక్షాత్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’... డేటా పరీక్షలు నిర్వహించి మరీ తేల్చింది. దీని ప్రకారం... ⇔ ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, ఆర్‌కామ్, రిలయన్స్ జియోకు చెందిన 4జీ డేటా సేవల వేగాన్ని ట్రాయ్ పరీక్షించి చూసింది. వీటిలో జియో డేటా సేవల వేగం మిగిలిన సంస్థల సేవల కంటే మెల్లగా ఉంది. 4జీ సేవల వేగంలో అన్నింటికంటే ముందు ఎయిర్టెల్ నిలిచింది. ⇔ ఎయిర్టెల్ 4జీ వేగం సెకనుకు 11.4 మెగాబైట్స్ (ఎంబీపీఎస్) ఉంది. అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్ 4జీ సేవల వేగం 7.9 ఎంబీపీఎస్‌గా ఉంది. ఐడియా 7.6 ఎంబీపీఎస్, వొడాఫోన్ సేవలు 7.3 ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు ట్రాయ్ గుర్తించింది. ఇక జియో 4జీ డేటా సేవల వేగం సెకనుకు 6.2 ఎంబీపీఎస్‌గా ఉందని వెల్లడైంది. విభేదించిన జియో: ట్రాయ్ గణాంకాలతో జియో విభేదించింది. ట్రాయ్ అనలిటిక్స్ వెబ్సైట్లో పేర్కొన్న గణాంకాల తర్వాత తాము సైతం అంతర్గతంగా పరీక్షించి చూశామని... జియో వేగాన్ని ఇతర ఆపరేటర్లతో ఏకపక్షంగా పోల్చి చూసినట్టు తాము భావిస్తున్నామని జియో ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుడి రోజువారీ పారదర్శక వినియోగం (ఎఫ్‌యూపీ) పరిమితి 4జీబీ పూర్తయిన తర్వాత వేగాన్ని పరీక్షించి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసింది. ఈ పరిమితి తర్వాత వేగం 256 కేబీపీఎస్‌కు పడిపోతుందని తెలియజేసింది. -
వైర్లెస్ డేటా స్పీడ్ 2జీబీ పర్ సెకన్!
జెడ్డా: వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ల డేటా స్పీడ్ విషయంలో పెనుమార్పులు రాబోతున్నాయి. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఇటీవల అభివృద్ది చేసిన ఓ కొత్త పదార్థం ఇంటర్నెట్ డేటా స్పీడ్‌ను సెకన్‌కు రెండు గిగాబైట్ల(జీబీ) వరకు పెంచుతుందని గుర్తించారు. వీరు తయారు చేసిన నానో క్రిస్టలిన్ మెటిరియల్.. బ్లూలైట్‌ను వేగంగా వైట్లైట్గా మార్చుతుందని, దీంతో డేటా స్పీడ్ అసాధారణంగా పెరుగుతుందని వెల్లడించారు. బ్లూటూత్, వైఫై లాంటి టెక్నాలజీల వినియోగంలో విద్యుదయస్కాంత తరంగాల తరంగదైర్ఘ్యాన్ని తగ్గించడం ద్వారా సమాచార బదిలీలో వేగాన్ని పెంచొచ్చని పరిశోధకులు వెల్లడించారు. నానో క్రిస్టలిన్ మెటిరియల్ సహాయంతో డేటా వేగాన్ని పెంచే ప్రక్రియ అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని ప్రొఫెసర్ బూన్ ఊయ్ తెలిపారు.