జియో జోరుకు బ్రేకులు!
• నెమ్మదించిన సబ్‌స్క్రైబర్ల వృద్ధి
• సగానికి తగ్గిన డేటా స్పీడ్
• మోతీలాల్ ఓస్వాల్ నివేదిక
ముంబై: టెలికం రంగంలో జియో ఓ సంచలనం. ఇది నిన్నటి మాట. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తోంది. జియో సేవలు ఆశించినంత స్థారుులో లేవని యూజర్లు పెదవి విరచడం ఇప్పుడు కంపెనీని ఆందోళనలో పడేసింది. కంపెనీకి 2018 డిసెంబర్ నాటికి 10 కోట్ల మంది కస్టమర్లను చేరుకోవాలనే లక్ష్యం కూడా దూరమయ్యేలా కనిపిస్తోంది. తాజా గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తన నివేదిక పేర్కొంది.
తగ్గిన నెట్‌వర్క్ నాణ్యత
సేవలు ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నా కూడా జియో.. 2-35 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటాను కస్టమర్లకు అందించలేకపోతోందని మోతీలాల్ ఓస్వాల్ విమర్శించింది. ఎక్కువ మంది కస్టమర్లు, వారి అధిక వినియోగం అనే రెండు అంశాలు కంపెనీ డేటా స్పీడ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొంది. అలాగే దీని వల్ల నెట్‌వర్క్ నాణ్యత కూడా తగ్గిపోరుుందని వివరించింది.
అసలు సత్తా తెలిసేది అప్పుడే!
తన సర్వీసులకు చార్జీలను వసూలు చేయడం ప్రారంభించిన దగ్గరి నుంచే రిలయన్‌స జియో అసలు సత్తా తెలుస్తుందని మోతీలాల్ పేర్కొంది. వెల్‌కమ్ ఆఫర్ ముగిసిన తర్వాత చాలా మంది సబ్‌స్క్రైబర్లు జియోను రెండవ సిమ్‌గా వినియోగిస్తారని అంచనా వేసింది. ఇక జియో భాగస్వాములకు యూజర్ల నుంచి అధిక ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడింది. చాలా మంది సబ్‌స్క్రిప్షన్‌సను కొనసాగించకపోవచ్చని పేర్కొంది.
జియోకి ఎరుుర్‌టెల్లే ప్రధాన పోటీదారు
రిలయన్‌స జియోకి భారతీ ఎరుుర్‌టెల్లే ప్రధాన పోటీదారని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం అటు నెట్‌వర్క్‌లో గానీ, ఇటు డేటా సేవల్లో గానీ జియోకి కేవలం ఎరుుర్‌టెల్ మాత్రమే గట్టిపోటినిస్తుందని అభిప్రాయపడింది. ఇతర టెలికం కంపెనీలకు వాటి బలాన్ని చూపడానికి 12-18 నెలల సమయం పడుతుందని పేర్కొంది. కాగా, ఎరుుర్‌టెల్ టెలికం మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మరిన్ని పెట్టుబడులు...
యూజర్ల నుంచి వ్యక్తమౌతోన్న సమస్యల పరిష్కారానికి జియో వచ్చే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెడుతుందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం టెలికం ఇన్వెస్ట్‌మెంట్లు రూ.2.25-రూ.2.30 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడం, డిజిటల్ సేవల విస్తరణ వంటి వాటికి ఈ నిధులను ఉపయోగించుకుంటుందని తెలిపింది. కాగా కంపెనీ లాభాలను గడించాలంటే కనీసం 8-10 ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంది.
వెల్‌కమ్ ఆఫర్‌ను పొడిగిస్తుందా?
రిలయన్‌స జియో తన వెల్‌కమ్ ఆఫర్‌ను పొడిగించే అవకాశముందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. సంస్థ తన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను కూడా రిలయన్‌స డిజిటల్స్ నుంచి మరిన్ని ఇతర ఔట్‌లెట్స్‌కి, స్టోర్లకి విస్తరించొచ్చని తెలిపింది. అలాగే రూ.200-రూ.300 ధర శ్రేణిలో కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తేవొచ్చని అభిప్రాయపడింది.