
భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో.. తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించేవారికోసం రూ. 1049 ప్లాన్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ జియో రూ.1,049 ప్లాన్ ద్వారా.. 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. అంతే కాకుండా రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అదనంగా ఈ ప్లాన్‌లో 50జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్, 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జీ5, సోనీలివ్ వంటి వాటికి కూడా యాక్సెస్ లభిస్తుంది.
ఇదీ చదవండి: అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్‌ఆర్
460 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లతో రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా నిలిచింది. ఈ కంపెనీ అపరిమిత కాలింగ్, ఎస్ఎమ్ఎస్, డేటా వంటి వాటికోసం విభిన్న శ్రేణి రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. ప్రస్తుతం సంస్థ 5జీ, 4జీ, 4జీ ప్లస్ అనే సర్వీసులను అందిస్తోంది.