![India jumps 10 spots to 69th ranking in median mobile speeds globally - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/4/DATA-SPEED.jpg.webp?itok=5ouRqjXn)
న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వేగం 115 శాతం మేర పెరిగింది. దీంతో స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో (ఎస్‌జీఐ) అత్యంత స్వల్ప సమయంలోనే భారత్ 49 ర్యాంకులు ఎగబాకి 69వ స్థానానికి చేరింది. తద్వారా రష్యా, అర్జెంటీనా వంటి కొన్ని జీ20 దేశాలను కూడా అధిగమించింది.
5జీ సేవల ఆవిష్కరణ తర్వాత భారత్‌లో డేటా స్పీడ్‌కి సంబంధించి నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ విశ్లేషణ సంస్థ ఊక్లా బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం భారత్‌లో సగటున డౌన్‌లోడ్ స్పీడ్ 13.87 ఎంబీపీఎస్ నుంచి (2022 సెప్టెంబర్) 115 శాతం వృద్ధి చెంది 29.85 ఎంబీపీఎస్‌కు (2023 జనవరి) పెరిగింది. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఎస్‌జీఐలో 118వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది జనవరిలో 69వ స్థానానికి చేరింది. త్వరలోనే బ్రెజిల్ (35.85 ఎంబీపీఎస్, 57వ ర్యాంకు)ను కూడా అధిగమించనుంది.
జియో టాప్..
జనవరిలో జియో 5జీ స్పీడ్ హిమాచల్ ప్రదేశ్‌లో సగటున 246.49 ఎంబీపీఎస్ నుంచి కోల్‌కతాలో 506.25 ఎంబీపీఎస్‌గా నమోదైంది. అలాగే ఎయిర్‌టెల్ 5జీ యూజర్లకు కోల్‌కతాలో సగటున 78.13 ఎంబీపీఎస్, ఢిల్లీలో 268.89 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా లభించింది. ఇక గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మద్య కాలంలో వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 5జీ లాంచ్ తర్వాత ఇది మరింత వేగవంతమయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment