speed test result
-
విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే..
శబ్దవేగంతో దూసుకెళ్లే విమానాల గురించి మనం వినే ఉంటాం. మరి అంతవేగంగా వెళ్లగలిగే ఫ్లైట్‌ని రూపొందించిన శాస్త్రవేత్తలు..అలాంటి ఓ బస్సునో రైలునో ఎందుకు సృష్టించలేకపోతున్నారో ఎప్పుడైనా అనుమానం కలిగిందా? మన చుట్టూ ఉన్న గాలే అందుకు కారణం. వేగంగా వెళ్లే ఏ వస్తువునైనా అది అడ్డుకుంటుంది. ఆ ఘర్షణలో అగ్గిరాజుకుంటుంది. అందుకే విమానాలు కూడా భూవాతావరణంలో తక్కువ వేగంతో వెళతాయి. ఆకాశంలోకి అంటే శూన్యంలోకి వెళ్లాకే వేగం పుంజుకుంటాయి. ‘మరి అదే శూన్యాన్ని నేలపైనా సృష్టించగలిగితే..? అందుకోసం ఓ పెద్ద ట్యూబుని ఏర్పాటుచేస్తే... అందులో ప్రయాణం సాగితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కి! ఈ కొత్త ఆలోచనకి అతను పేటెంట్ తీసుకోలేదు. దీనిపైన ఎవరైనా ప్రయోగాలు చేయొచ్చంటూ ప్రకటించాడు. దాంతో వర్జిన్ హైపర్‌లూప్, జెలెరస్ వంటి పదికిపైగా సంస్థలు దీని తయారీలో తలమునకలయ్యాయి. ఇందుకోసం వేలకోట్లు ఖర్చుపెడుతున్నాయి. తాజాగా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్న హైపర్‌లూప్ స్టార్టప్‌ల్లో ప్రధాన స్టార్టప్‌గా ఉన్న వర్జిన్ హైపర్‌లూప్ దాని కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 31లోపు రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గ్రూప్‌నకు చెందిన ఈ ప్రాజెక్ట్‌ను నిలిస్తేస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఎలాన్‌మస్క్‌కు 2013లో హైపర్‌లూప్ అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి 2014లో ‘హైపర్‌లూప్ వన్’ స్టార్టప్‌ను స్థాపించి వందల కోట్లును ఖర్చు చేశారు. టెక్నికల్ డెమోలు, టెస్ట్ ట్రాక్‌లు మినహా ప్రాజెక్ట్‌లో ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. అయితే తాజాగా సంస్థ తన ఆపరేషన్స్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో టెక్నాలజీ రంగంలో కొంత ఆందోళన మొదలైనట్లు సమాచారం. హైపర్‌లూప్ వన్ 2014లో ప్రారంభించిన తర్వాత బ్రాన్సన్ 2017లో అందులో పెట్టుబడి పెట్టారు. దాంతో అప్పటి నుంచి వర్జిన్ హైపర్‌లూప్ వన్ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. కానీ 2018లో జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత బ్రాన్సన్ సౌదీ అరేబియాను తీవ్రంగా విమర్శించారు. దాంతో సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌పై ప్రభావం పడంది. ఫలితంగా బ్రాన్సన్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇదీ చదవండి: ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ.. అనంతరం దుబాయ్ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ హైపర్‌లూప్ వన్ స్టార్టప్‌లో మెజారిటీ వాటా కలిగి ఉండడంతో కంపెనీకు సంబంధించి పూర్తి నియంత్రణ దాని చేతిలోకి వెళ్లిపోయింది. 2022 ప్రారంభంలో ఆ సంస్థ హైపర్‌లూప్ వన్‌లోని సగానికిపైగా సిబ్బందిని తొలగించింది. దాంతోపాటు డీపీ వరల్డ్ కార్గోసేవలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా హైపర్‌లూప్ వన్ మేధో సంపత్తి ముగిసిపోతోందని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్టార్టప్‌కు చెందిన కొన్ని ఆస్తులను సైతం డీపీ వరల్డ్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
నెట్ స్పీడ్‌లో ఎవరెక్కడ? ఎగబాకిన భారత్ ర్యాంక్
ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఎంటర్టైన్మెంట్ నుంచి ఆన్లైన్ చదువుల దాకా.. ఆర్థిక లావాదేవీల నుంచి నిత్యావసరాల బుకింగ్ దాకా.. స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్.. ఏదైనా ఇంటర్నెట్ అత్యవసరంగా మారిపోయింది. ఈ ఇంటర్నెట్ ఎంత వేగంగా ఉంటే.. మన పని అంత వేగంగా పూర్తవుతుంది. ఈ క్రమంలో ఊక్లా సంస్థకు చెందిన స్పీడ్‌టెస్ట్ వెబ్సైట్.. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో సగటు ఇంటర్నెట్ వేగం ఎంత అన్నదానిపై ర్యాంకింగ్స్ ఇచ్చింది. ♦ మొబైల్ ఇంటర్నెట్ విభాగంలో 36.35 ఎంబీపీఎస్ స్పీడ్‌తో భారత్ 60వ స్థానంలో నిలిచింది. మార్చిలో భారత్ ర్యాంకు 64కాగా.. నెలలో నాలుగు స్థానాలు ఎగబాకింది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 51.12 ఎంబీపీఎస్‌తో 83వ స్థానంలో నిలిచింది. మార్చితో పోలిస్తే ఒక ర్యాంకు ఎగబాకింది. ♦ మొబైల్ ఇంటర్నెట్కు సంబంధించి 138 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. యెమెన్ (3.38 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (4.46), క్యూబా (4.48), వెనెజువెలా (6.90), హైతీ (8.03) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ♦ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి 180 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. క్యూబా (1.97 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (2.31), సిరియా (3.93), తుర్క్మెనిస్తాన్ (4.03), యెమెన్ (4.29) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా సగటున మొబైల్ ఇంటర్నెట్ వేగం 42.07 ఎంబీపీఎస్కాగా.. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ వేగం 80.12 ఎంబీపీఎస్ కావడం గమనార్హం. ♦ ప్రపంచంలో సగటున 100 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ నెట్ స్పీడ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. మొబైల్ ఇంటర్నెట్లో కేవలం పది దేశాలు, ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కేవలం 33 దేశాలు మాత్రమే ఈ వేగాన్ని అందుకున్నాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
డేటా స్పీడ్‌లో భారత్ జోరు..
న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వేగం 115 శాతం మేర పెరిగింది. దీంతో స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో (ఎస్జీఐ) అత్యంత స్వల్ప సమయంలోనే భారత్ 49 ర్యాంకులు ఎగబాకి 69వ స్థానానికి చేరింది. తద్వారా రష్యా, అర్జెంటీనా వంటి కొన్ని జీ20 దేశాలను కూడా అధిగమించింది. 5జీ సేవల ఆవిష్కరణ తర్వాత భారత్‌లో డేటా స్పీడ్‌కి సంబంధించి నెట్వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ విశ్లేషణ సంస్థ ఊక్లా బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం భారత్‌లో సగటున డౌన్లోడ్ స్పీడ్ 13.87 ఎంబీపీఎస్ నుంచి (2022 సెప్టెంబర్) 115 శాతం వృద్ధి చెంది 29.85 ఎంబీపీఎస్‌కు (2023 జనవరి) పెరిగింది. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఎస్‌జీఐలో 118వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది జనవరిలో 69వ స్థానానికి చేరింది. త్వరలోనే బ్రెజిల్ (35.85 ఎంబీపీఎస్, 57వ ర్యాంకు)ను కూడా అధిగమించనుంది. జియో టాప్.. జనవరిలో జియో 5జీ స్పీడ్ హిమాచల్ ప్రదేశ్‌లో సగటున 246.49 ఎంబీపీఎస్ నుంచి కోల్‌కతాలో 506.25 ఎంబీపీఎస్‌గా నమోదైంది. అలాగే ఎయిర్టెల్ 5జీ యూజర్లకు కోల్‌కతాలో సగటున 78.13 ఎంబీపీఎస్, ఢిల్లీలో 268.89 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా లభించింది. ఇక గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మద్య కాలంలో వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 5జీ లాంచ్ తర్వాత ఇది మరింత వేగవంతమయ్యింది. -
జియోను వెనక్కినెట్టిన వోడాఫోన్ ఐడియా...!
Vi Leads Ookla Speed Test In First Quarter Of 2021: ప్రముఖ టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా రికార్డును సృష్టించింది. మొబైల్ నెట్వర్క్ స్పీడ్ విషయంలో జియోను, ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టింది. 2021 తొలి త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా స్పీడ్ స్కోర్ 16.10 ఎమ్బీపీఎస్ను సాధించింది. తొలి త్రైమాసికంగాను వోడాఫోన్ ఐడియా ఊక్లా అందించే స్పీడ్‌టెస్ట్ అవార్డులను గెలుచుకుంది. కాగా జియో 13.98 ఎమ్‌బీపీఎస్, ఎయిర్టెల్ 13.86 ఎమ్‌బీపీఎస్ స్పీడ్ స్కోర్‌ను సాధించినట్లు ఊక్లా ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే స్పీడ్, రేంజ్ దేశవ్యాప్తంగా సుమారు 19,718,623 స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడే ప్రధాన మొబైల్ నెట్‌వర్క్‌ల ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్‌లను ఊక్లా పరీక్షించింది. రోజువారీ ప్రాతిపదికన చాలా మంది నెట్వర్క్ ప్రొవైడర్ల నుంచి కస్టమర్స్ పొందుతున్న మొబైల్ నెట్వర్క్ డౌన్లోడ్ వేగం, మధ్యస్థ వేగంపై ఊక్లా దృష్టి సారించింది. ఈ స్పీడ్ టెస్ట్‌లను ముంబై, అహ్మాదాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో ఊక్లా నిర్వహించింది. 2021 తొలి త్రైమాసికంలో ఐఫోన్ 11, రెడ్మీ నోట్ 5 ప్రొ, రెడ్బీ నోట్ 8 ప్రొ, రెడ్ మీ నోట్7 ప్రొ, ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్ఫోన్ల నుంచి ఇంటర్నెట్ స్పీడ్ డేటాను రికార్డ్ చేసినట్లు ఊక్లా పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా మధ్యస్థ డౌన్లోడ్ వేగం 9.6 ఎమ్‌బీపీఎస్‌గా ఉన్నట్లు ఊక్లా వెల్లడించింది. అయితే..ఆయా మొబైల్ నెట్వర్క్ కంపెనీల వారిగా వోడాఫోన్ ఐడియా 11.34 ఎమ్‌బీపీఎస్, ఎయిర్టెల్ 10.10 ఎమ్‌బీపీఎస్, జియో 8.23 ఎమ్‌బీపీఎస్ మేర సగటు మధ్యస్థ డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా అప్లోడింగ్ వేగంలో తొలి త్రైమాసికంలో 3.19ఎమ్‌బీపీఎస్ స్పీడ్ నమోదైంది. కాగా వోడాఫోన్ ఐడియా 4.91 ఎమ్‌బీపీఎస్, ఎయిర్టెల్ 3.16 ఎమ్‌బీపీఎస్, జియో 2.54 ఎమ్‌బీపీఎస్ సగటు అప్లోడ్ వేగాన్ని సాధించాయి. చదవండి: అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్..! భారత్ నుంచి.... -
ఎయిర్టెల్, జియో.. ఏది స్పీడ్?
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత వేగమైన మొబైల్ నెట్వర్క్ సేవలందిస్తున్న కంపెనీగా ‘భారతీ ఎయిర్టెల్’ నిలిచిందని స్పీడ్‌టెస్ట్ డేటా సేవలందించే సంస్థ ‘ఊక్లా’ ప్రకటించింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు సేకరించిన సమాచారం ప్రకారం ఎయిర్టెల్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు వివరించింది. ఢిల్లీ పరిధిలో అత్యంత వేగమైన 4జీ మొబైల్ నెట్‌వర్క్‌గా వొడాఫోన్ నిలిచింది. వొడాఫోన్, ఐడియా కలిసిపోవడంతో డేటా వేగం పెరిగినట్టు వెల్లడించింది. గతనెల్లో రిలయన్స్ జియో నెట్వర్క్ చాలా నెమ్మదిగా ఉందని పేర్కొంది. అయితే, ఊక్లా నివేదిక ట్రాయ్ తాజాగా ప్రకటించిన సమాచారానికి విరుద్ధంగా ఉండడం విశేషం. బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో ప్రథమ స్థానంలో ఉండగా.. వేగం విషయంలో పోటీ కంపెనీలకు రెట్టింపు వేగంతో ఉందని ట్రాయ్ విశ్లేషణ కావడం గమనార్హం. అయితే ఈ ఏడాది మే నెల నేంచి ఎయిర్టెల్, జియో డౌన్లోడ్ స్పీడ్ తగ్గిందని ‘ఊక్లా’ తెలిపింది. వొడాఫోన్, ఐడియా కలిసిపోయిన తర్వాత ఈ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల డౌన్లోడ్ స్పీడ్ పుంజుకుందని గణాంకాలతో వివరించింది. (చదవండి: ఇండియా, రిలయన్స్ రైజింగ్.. ఎవ్వరూ ఆపలేరు!) -
దొంగలూ.. 60 దాటొద్దు ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలి పరిధిలో ఓ స్నాచింగ్‌కు పాల్పడిన చోరుడు పారిపోయేందుకు సిటీ బయటకు దారి తీసే రోడ్డు ఎక్కాడు. ‘డయల్–100’ ద్వారా దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేవలం మూడు నిమిషాల్లోనే అతడిని గుర్తించి వెంటపడ్డారు. పారిపోవడమే పరమావధిగా పెట్టుకున్న ఆ దొంగకు రూల్స్, స్పీడ్ లిమిట్ ఉండవు కదా..! అయితే మన పోలీసు వాహనం మాత్రం అధికారులు విధించిన ‘పరిమితి’ నేపథ్యంలో గంటకు 60 కిమీ వేగాన్ని దాటలేదు. ఫలితంగా అతను చూస్తుండగానే కనుమరుగయ్యాడు. ♦ సైబరాబాద్ ఉన్నతాధికారులు ఇటీవల తీసుకున్న నిర్ణయం కారణంగా భవిష్యత్తులో తరచూ ఇలాంటి సీన్లు ఎదురుకావచ్చు. ‘రోగమొక చోట.. మందొక చోట’ అన్న చందంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు ఇటీవల చోటు చేసుకున్న పోలీసు వాహనాల ప్రమాదాల నేపథ్యంలో ‘కీలక నిర్ణయం’ తీసుకున్నారు. ఏసీపీ స్థాయి అధికారులు వినియోగించే వాటి సహా ఏ వాహనమూ గంటకు 60 కిమీ మించకుండా లాక్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంపై అధికారులు, సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. డ్రైవర్లు, డ్రైవింగ్‌లో లోపాలను సరి చేయకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని వారు వాపోతున్నారు. ప్రమాదం పై యాక్షన్... గత నెల మూడో వారంలో రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున విధుల్లో ఉన్న వాహనానికి కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో అదుపుతప్పి ఫల్టీకొట్టింది. ఫలితంగా వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనకు ముందూ ఇలాంటివి సైబరాబాద్‌లో చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో మాత్రం డ్రైవర్‌తో పాటు ముగ్గురిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపిన హోంగార్డు డ్రైవర్, పక్కనే ఉన్నందుకు కానిస్టేబుల్, వెనుక కూర్చున్న సబ్–ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకున్నారు. చోటు చేసుకున్నది ప్రమాదం అయినప్పుడు అసలు డ్రైవర్ పైనే చర్యలు తీసుకోకూడదు. అలాంటిది అతడితో పాటు పక్కన, వెనుక కూర్చున్న వారి పైనా వేయడం విమర్శలకు తావిస్తోంది. కొత్తవి ఇచ్చినా ప్రయోజనం శూన్యం... కమిషనరేట్ పరిధిలో తరచూ పోలీసు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు భావించారు. దీంతో గస్తీ వాహనాలు, ఇన్స్పెక్టర్లు వినియోగించే వాటితో పాటు ఏసీపీలు వాడే వాహనాలకు స్పీడ్ లాకింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణం దానిని అమలులోకి తీసుకువస్తూ ఆయా వాహనాలు గరిష్టంగా గంటకు 60 కిమీ వేగం మించి ప్రయాణించకుండా ఏర్పాట్లు చేశారు. అత్యంత రద్దీ ప్రాంతాలు ఎక్కువగా ఉండే నగరంలో ఇలాంటి నిర్ణయం సమంజసమే అయినా.. దూరంగా విసిరేసినట్లు ఉండే కాలనీలు, సువిశాలమైన రోడ్డు, ఎటు చూసినా హైవేలతో కనెక్టివిటీ కలిగి ఉండే సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇలాంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని సీనియర్ అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. పోలీసు అధికారులకు కొత్తగా హైఎండ్ వాహనాలు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశమే వారి కదలికల్లో వేగం పెంచాలని, మరింత సమర్థంగా పెట్రోలింగ్ జరగాలని. అలాంటప్పుడు ఈ లాకింగ్ చేస్తే ఫలితం ఏముంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లోపాలు యథాతథం.. ప్రమాదాలు తదితర ఉదంతాలు చోటు చేసుకోవడానికి కారణమవుతున్నా వ్యవస్థాగత లోపాలకు విడిచిపెట్టి పైపై చర్యలతో ఫలితాలు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. గడిచిన కొన్నేళ్లుగా పోలీసు విభాగంలో వాహనాల సంఖ్య పెరిగినంత వేగంగా, ఆ స్థాయిలో డ్రైవర్ పోస్టుల సంఖ్య పెరగట్లేదు. ఫలితంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రైవింగ్ తెలిసిన హోంగార్డు, ఆరŠడ్మ్ రిజర్వ్ విభాగానికి చెందిన వారే డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి పూర్తి స్థాయిలో శిక్షణ, నైపుణ్యం ఉండట్లేదు. దీనికి తోడు గస్తీ వాహనాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు సమయాలను బట్టి ఒక్కోసారి నిర్విరామంగా 12 గంటలు విధుల్లో ఉండాల్సి వస్తుంది. అధికారుల వాహనాలకు డ్రైవర్లుగా ఉండే వారికి కాస్తా విశ్రాంతి దొరికే అవకాశం ఉన్నా గస్తీ వాహనాలను డ్రైవ్ చేసే వారికి ఆ అవకాశమూ ఉండదు. దీనికి తోడు ప్రధానంగా వేళగాని వేళల్లో డ్రైవింగ్ చేస్తున్న వారికి ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటోంది. డ్రైవర్లు సం ఖ్య పెంచడం, డ్రైవింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడం తదితర అసలు లోపాలను సరిచేయడం మానేసి వాహనాలు స్పీడు తగ్గిస్తే మొదటికే మోసం వస్తుందనే వాదన వినిపిస్తోంది. -
జియోను బీట్ చేసిన ఎయిర్టెల్, దేనిలో?
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ 4జీ డౌన్లోడ్ స్పీడ్ టెస్ట్‌లో దూసుకుపోయింది. జియోను దాటేసి, ఎయిర్టెల్ మెరుగైన పాయింట్లను స్కోర్ చేసిందని తాజా డేటాలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ట్రాయ్ చేపట్టిన 4జీ డౌన్లోడ్ స్పీడు టెస్ట్‌లో.. జియో, వొడాఫోన్, ఐడియాల కంటే ఎయిర్టెల్ మెరుగైన స్కోర్‌ను పొంది, 4జీ డౌన్లోడ్ స్పీడ్ ప్రొవైడర్‌గా నిలిచింది. ఆల్ట్రా న్యూస్ రిపోర్టు ప్రకారం ఎయిర్టెల్ సగటు డౌన్లోడ్ స్పీడు 9.64 ఎంబీపీఎస్ కాగ, జియో 4జీ డౌన్లోడ్ స్పీడు 6.57 ఎంబీపీఎస్‌గా, ఐడియా సెల్యులార్ డౌన్లోడ్ స్పీడు 7.41ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఈ రిపోర్టు ప్రకారం ఎయిర్టెల్ సగటు డౌన్లోడ్ స్పీడు జియో కంటే 44 శాతం వేగవంతంగా ఉన్నట్టు వెల్లడైంది. టెస్ట్ జరిపిన 10 నగరాల్లో హర్యానాలోని భివాని, రాజస్తాన్‌లోని కొటా, కేరళలోని కాలికట్ ఉన్నాయి. అయితే మైస్పీడు యాప్‌లో జియో సగటు డౌన్లోడ్ స్పీడు 20.3 ఎంబీపీఎస్‌గా ఉంది. ఎయిర్టెల్ 8.9గా, ఐడియా 8.2ఎంబీపీఎస్‌గా రికార్డైంది. అక్టోబర్‌లో నిర్వహించిన ప్రత్యేక ట్రాయ్ టెస్ట్‌లో మాత్రం జియో 21.9ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడుతో తొలి స్థానంలో ఉంది. ఈ సారి మాత్రం జియోను అధిగమించి, ఎయిర్టెల్ ముందుకు వచ్చేసింది. తన ప్రత్యర్థులకు పోటీగా ఎయిర్టెల్ పలు రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతూ వచ్చింది. కంపెనీ ఇటీవలే రూ.499 పోస్టుపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, 40జీబీ డేటా, 30రోజుల బిల్లింగ్ సైకిల్ ద్వారా ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేస్తోంది. -
జియోపై ఊక్లా కౌంటర్ అటాక్
న్యూఢిల్లీ : దేశంలో ఫాస్టెస్ట్ నెట్ వర్క్ ట్యాగ్ పై చెలరేగిన వివాదంపై గ్లోబల్ బ్రాడ్‌బ్యాండ్ టెస్టింగ్ లీడర్ ఊక్లా, రిలయన్స్ జియో ఆరోపణలను కొట్టిపారేసింది. జియో ఆరోపణలను ఖండించిన ఊక్లా, తాము ఎంతో పారదర్శకతను, విశ్వసనీయతను పాటించి ఎయిర్ టెల్కు ఈ ట్యాగ్ ఇచ్చామని బుధవారం స్పష్టంచేసింది. ఎలాంటి స్పీడ్ టెస్ట్ ఇంటర్నెట్ టెస్ట్ చేసేందుకైనా సేకరించే సమాచారం చాలా పక్కాగా ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో అత్యంత ఫాస్టెస్ట్ నెట్ వర్క్ ఎయిర్ టెలేనంటూ ఊక్లా సర్టిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే అదంతా అబద్ధమని జియో ఆరోపించింది. ఈ విషయాన్ని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గరకు తీసుకెళ్లింది. ఊక్లా రేటింగ్స్ పై విమర్శలు సంధించింది.అయితే ఆ విమర్శలను ఊక్లా కొట్టిపారేసింది. 2016 మూడో, నాలుగో క్వార్టర్ డేటా తీసుకొని ఈ టెస్ట్ నిర్వహించామని.. ఈ డేటా ఫలితాలతోనే ఎయిర్ టెల్ కు ఈ ట్యాగ్ ఇచ్చినట్టు స్పష్టీకరించింది. ఇండియా లాంటి మార్కెట్లలో స్పీడు టెస్ట్ నిర్వహించేటప్పుడు, చాలా అంశాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని కంపెనీ తెలిపింది. డ్యూయల్ సిమ్ డివైజ్‌లు, నెట్ వర్క్ టెక్నాలజీ, డివైజ్ టైప్స్ వంటి అన్నీ అంశాలను పరిశీలిస్తామని ఊక్లా సీఓఓ జామీ స్టీవెన్ చెప్పారు.