జియోపై ఊక్లా కౌంటర్ అటాక్
జియోపై ఊక్లా కౌంటర్ అటాక్
Published Thu, Mar 23 2017 10:12 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM
న్యూఢిల్లీ : దేశంలో ఫాస్టెస్ట్ నెట్ వర్క్ ట్యాగ్ పై చెలరేగిన వివాదంపై గ్లోబల్ బ్రాడ్బ్యాండ్ టెస్టింగ్ లీడర్ ఊక్లా, రిలయన్స్ జియో ఆరోపణలను కొట్టిపారేసింది. జియో ఆరోపణలను ఖండించిన ఊక్లా, తాము ఎంతో పారదర్శకతను, విశ్వసనీయతను పాటించి ఎయిర్ టెల్కు ఈ ట్యాగ్ ఇచ్చామని బుధవారం స్పష్టంచేసింది. ఎలాంటి స్పీడ్ టెస్ట్ ఇంటర్నెట్ టెస్ట్ చేసేందుకైనా సేకరించే సమాచారం చాలా పక్కాగా ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో అత్యంత ఫాస్టెస్ట్ నెట్ వర్క్ ఎయిర్ టెలేనంటూ ఊక్లా సర్టిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే అదంతా అబద్ధమని జియో ఆరోపించింది.
ఈ విషయాన్ని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గరకు తీసుకెళ్లింది. ఊక్లా రేటింగ్స్ పై విమర్శలు సంధించింది.అయితే ఆ విమర్శలను ఊక్లా కొట్టిపారేసింది. 2016 మూడో, నాలుగో క్వార్టర్ డేటా తీసుకొని ఈ టెస్ట్ నిర్వహించామని.. ఈ డేటా ఫలితాలతోనే ఎయిర్ టెల్ కు ఈ ట్యాగ్ ఇచ్చినట్టు స్పష్టీకరించింది. ఇండియా లాంటి మార్కెట్లలో స్పీడు టెస్ట్ నిర్వహించేటప్పుడు, చాలా అంశాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని కంపెనీ తెలిపింది. డ్యూయల్ సిమ్ డివైజ్లు, నెట్ వర్క్ టెక్నాలజీ, డివైజ్ టైప్స్ వంటి అన్నీ అంశాలను పరిశీలిస్తామని ఊక్లా సీఓఓ జామీ స్టీవెన్ చెప్పారు.
Advertisement