Ookla
-
ఇండియాలోనే ఉత్తమ నెట్వర్క్..ఊక్లా అవార్డులు అన్నీ సంస్థకే..
దేశంలో అగ్రగామి నెట్‌వర్క్‌గా రిలయన్స్ జియో నిలిచింది. ఊక్లా సంస్థ ప్రకటించే స్పీడ్‌టెస్ట్‌లకు సంబంధించిన అవార్డులను అన్నింటినీ రిలయన్స్జియో గెలుచుకుంది. 5జీ నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్ విభాగంలో మొత్తం అవార్డులను జియో గెలుపొందినట్లు ఊక్లా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తమ, వేగవంత, టాప్ రేటెడ్ మొబైల్ నెట్వర్క్, ఉత్తమ మొబైల్ కవరేజీ, ఉత్తమ మొబైల్ వీడియో, గేమింగ్ అనుభూతి, 5జీ మొబైల్ నెట్వర్క్, 5జీ మొబైల్ వీడియో అనుభూతి, 5జీ మొబైల్ గేమింగ్ అనుభూతి అవార్డులను జియో దక్కించుకుందని తెలిపింది. ఊక్లా స్పీడ్‌టెస్ట్ అందించే సూచనల ద్వారా తమ సంస్థతోపాటు ఇతర సంస్థల వినియోయోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేలా ప్రయత్నిస్తున్నట్లు సంస్థ సీఈఓ, ప్రెసిడెంట్ స్టీఫెన్ తెలిపారు. ఈ అవార్డులు, గుర్తింపుతో భారత్‌లో అత్యుత్తమ నెట్‌వర్క్‌గా జియో మారిందన్నారు. టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడంతోపాటు డిజిటల్ సమాజాన్ని సృష్టించాలన్నది జియో లక్ష్యమని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. -
నెట్ స్పీడ్‌లో ఎవరెక్కడ? ఎగబాకిన భారత్ ర్యాంక్
ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఎంటర్టైన్మెంట్ నుంచి ఆన్లైన్ చదువుల దాకా.. ఆర్థిక లావాదేవీల నుంచి నిత్యావసరాల బుకింగ్ దాకా.. స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్.. ఏదైనా ఇంటర్నెట్ అత్యవసరంగా మారిపోయింది. ఈ ఇంటర్నెట్ ఎంత వేగంగా ఉంటే.. మన పని అంత వేగంగా పూర్తవుతుంది. ఈ క్రమంలో ఊక్లా సంస్థకు చెందిన స్పీడ్‌టెస్ట్ వెబ్సైట్.. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో సగటు ఇంటర్నెట్ వేగం ఎంత అన్నదానిపై ర్యాంకింగ్స్ ఇచ్చింది. ♦ మొబైల్ ఇంటర్నెట్ విభాగంలో 36.35 ఎంబీపీఎస్ స్పీడ్‌తో భారత్ 60వ స్థానంలో నిలిచింది. మార్చిలో భారత్ ర్యాంకు 64కాగా.. నెలలో నాలుగు స్థానాలు ఎగబాకింది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 51.12 ఎంబీపీఎస్‌తో 83వ స్థానంలో నిలిచింది. మార్చితో పోలిస్తే ఒక ర్యాంకు ఎగబాకింది. ♦ మొబైల్ ఇంటర్నెట్కు సంబంధించి 138 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. యెమెన్ (3.38 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (4.46), క్యూబా (4.48), వెనెజువెలా (6.90), హైతీ (8.03) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ♦ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి 180 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. క్యూబా (1.97 ఎంబీపీఎస్), అఫ్గానిస్తాన్ (2.31), సిరియా (3.93), తుర్క్మెనిస్తాన్ (4.03), యెమెన్ (4.29) అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా సగటున మొబైల్ ఇంటర్నెట్ వేగం 42.07 ఎంబీపీఎస్కాగా.. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ వేగం 80.12 ఎంబీపీఎస్ కావడం గమనార్హం. ♦ ప్రపంచంలో సగటున 100 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ నెట్ స్పీడ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. మొబైల్ ఇంటర్నెట్లో కేవలం పది దేశాలు, ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కేవలం 33 దేశాలు మాత్రమే ఈ వేగాన్ని అందుకున్నాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
మొబైల్ స్పీడ్‌లో మెరుగుపడ్డ భారత్.. 5జీ రాకతో దూకుడు!
దేశంలో 5జీ సేవలు విస్తృతం కావడంతో మొబైల్ స్పీడ్‌లో భారత్ మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా సగటు మొబైల్ వేగంలో మన దేశం జనవరిలో 10 స్థానాలు ఎగబాకింది. డిసెంబర్లో 79వ స్థానంలో ఉన్న భారత్ జనవరిలో 69వ స్థానానికి చేరుకున్నట్లు ఊక్లా నివేదిక పేర్కొంది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లోనూ భారత్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. డిసెంబర్లో 81వ స్థానంలో ఉండగా జనవరిలో 79వ స్థానానికి చేరుకుందని నెట్వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్సైట్స్ ప్రొవైడర్ ఊక్లా నివేదించింది. ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటు డిసెంబర్లో 49.14 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 50.02 ఎంబీపీఎస్‌కి స్వల్పంగా పెరిగింది. కాగా ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటులో భారత్ నవంబర్‌లో 105వ స్థానంలో ఉండేది. ఈ ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటు గత డిసెంబర్లో 25.29 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 29.85 ఎంబీపీఎస్‌కు మెరుగుపడింది. జనవరి స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ ఓవరాల్ సగటు మొబైల్ స్పీడ్ చార్ట్‌లో యూఏఈ అగ్రస్థానంలో ఉంది. ఇదే సమయంలో పపువా న్యూగినియా ర్యాంక్ ఏకంగా 24 స్థానాలు మెరుగుపడటం గమనార్హం. ఇక ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటులో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా సైప్రస్ 20 స్థానాలను మెరుగుపరుచుకుంది. -
జియోను వెనక్కినెట్టిన వోడాఫోన్ ఐడియా...!
Vi Leads Ookla Speed Test In First Quarter Of 2021: ప్రముఖ టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా రికార్డును సృష్టించింది. మొబైల్ నెట్వర్క్ స్పీడ్ విషయంలో జియోను, ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టింది. 2021 తొలి త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా స్పీడ్ స్కోర్ 16.10 ఎమ్బీపీఎస్ను సాధించింది. తొలి త్రైమాసికంగాను వోడాఫోన్ ఐడియా ఊక్లా అందించే స్పీడ్‌టెస్ట్ అవార్డులను గెలుచుకుంది. కాగా జియో 13.98 ఎమ్‌బీపీఎస్, ఎయిర్టెల్ 13.86 ఎమ్‌బీపీఎస్ స్పీడ్ స్కోర్‌ను సాధించినట్లు ఊక్లా ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే స్పీడ్, రేంజ్ దేశవ్యాప్తంగా సుమారు 19,718,623 స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడే ప్రధాన మొబైల్ నెట్‌వర్క్‌ల ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్‌లను ఊక్లా పరీక్షించింది. రోజువారీ ప్రాతిపదికన చాలా మంది నెట్వర్క్ ప్రొవైడర్ల నుంచి కస్టమర్స్ పొందుతున్న మొబైల్ నెట్వర్క్ డౌన్లోడ్ వేగం, మధ్యస్థ వేగంపై ఊక్లా దృష్టి సారించింది. ఈ స్పీడ్ టెస్ట్‌లను ముంబై, అహ్మాదాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో ఊక్లా నిర్వహించింది. 2021 తొలి త్రైమాసికంలో ఐఫోన్ 11, రెడ్మీ నోట్ 5 ప్రొ, రెడ్బీ నోట్ 8 ప్రొ, రెడ్ మీ నోట్7 ప్రొ, ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్ఫోన్ల నుంచి ఇంటర్నెట్ స్పీడ్ డేటాను రికార్డ్ చేసినట్లు ఊక్లా పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా మధ్యస్థ డౌన్లోడ్ వేగం 9.6 ఎమ్‌బీపీఎస్‌గా ఉన్నట్లు ఊక్లా వెల్లడించింది. అయితే..ఆయా మొబైల్ నెట్వర్క్ కంపెనీల వారిగా వోడాఫోన్ ఐడియా 11.34 ఎమ్‌బీపీఎస్, ఎయిర్టెల్ 10.10 ఎమ్‌బీపీఎస్, జియో 8.23 ఎమ్‌బీపీఎస్ మేర సగటు మధ్యస్థ డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా అప్లోడింగ్ వేగంలో తొలి త్రైమాసికంలో 3.19ఎమ్‌బీపీఎస్ స్పీడ్ నమోదైంది. కాగా వోడాఫోన్ ఐడియా 4.91 ఎమ్‌బీపీఎస్, ఎయిర్టెల్ 3.16 ఎమ్‌బీపీఎస్, జియో 2.54 ఎమ్‌బీపీఎస్ సగటు అప్లోడ్ వేగాన్ని సాధించాయి. చదవండి: అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్..! భారత్ నుంచి.... -
ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో ఇలా చెక్ చేయండి..!
మన నిత్యజీవితంలో ఇంటర్నెట్ ఒక భాగమైంది. ఇంటర్నెట్ లేకుండా మన డే స్టార్ట్ అవ్వడం కష్టమే. సాంకేతిక కారణాల వల్ల మనకు ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం స్లోగా వస్తుంది. పలు టెలికాం నెట్వర్క్స్ సంస్థలు మా నెట్వర్క్ ఇంతా స్పీడ్ వస్తోందని యాడ్స్‌ను ఇవ్వడం మనం చూసే ఉంటాం. వారు చెప్పేది ఒకటి మనకు వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ మరొకటి. మనం వాడుతున్న ఆయా టెలికాం నెట్వర్క్ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో అనే విషయాన్ని పలు యాప్స్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చును. మీకు ఆయా టెలికాం నెట్వర్క్ అందిస్తోన్న స్పీడ్‌ను టెలికాం నెట్వర్క్ ఆపరేటర్‌కు తెలియజేస్తే మీరు ఉండే పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్‌ను బూస్ట్ చేసేందుకు చర్యలను తీసుకుంటారు. చదవండి: Google Pay: గూగుల్ పేలో ఆ సేవలు కష్టమే..! ఊక్లా ఇంటర్నెట్ స్పీడ్‌టెస్ట్: ఊక్లా , ఇంటర్నెట్ యాక్సెస్ పనితీరు కొలమానాలను అందించే వెబ్ సర్వీస్ సంస్థ. ప్రముఖ టెలికాం కంపెనీలు ఊక్లా టెస్ట్‌ను ఆధారం చేసుకొనే నెట్వర్క్ స్పీడ్‌ను ప్రకటిస్తాయి. యాపిల్ స్టోర్‌లో అప్లికేషన్ అందుబాటులో ఉంది. ఇది అత్యంత విశ్వసనీయమైన ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. యాప్‌లో యూజర్ లొకేషన్‌తో పాటు ఇతర అనుమతులను ఊక్లా అడుగుతోంది. స్పీడ్‌టెస్ట్ మాస్టర్: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్‌ను పరీక్షించడానికి స్పీడ్‌టెస్ట్ మాస్టర్ సులభమైన అప్లికేషన్. ఇది 4జీ, డీఎస్ఎల్, 5జీ, ఏడీఎస్ఎల్ వంటి వివిధ నెట్‌వర్క్‌ల వేగాన్ని పరీక్షించే అవకాశం ఉంది. మోటియోర్ : ఈ యాప్‌ను ఉపయోగించి అతి తక్కువ స్థాయిలో ఇంటర్నెట్ స్పీడ్‌ను కొలవవచ్చును. గూగుల్ స్పీడ్ టెస్ట్ : మీరు ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేయకూడదనుకుంటే మీకు గూగుల్ స్పీడ్ టెస్ట్ ప్రయోజనకరంగా ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి గూగుల్ స్పీడ్ టెస్ట్‌ని సెర్చ్ చేశాక ...గూగుల్ స్పీడ్ టెస్ట్‌పై క్లిక్ చేశాక మీ నెట్వర్క్ డౌన్లోడ్ వేగం, ఆప్‌లోడ్ వేగాలను గుర్తించవచ్చును. చదవండి: సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతోందా..! ఇలా చేయండి..! -
రికార్డు సృష్టించిన స్టార్‌లింక్ ఇంటర్నెట్..! స్పీడ్ ఎంతంటే..
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌సేవలను అందించడం కోసం ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ ప్రోగ్రాంను ముందుకుతెచ్చిన విషయం తెలిసిందే. స్టార్‌లింక్ ప్రోగ్రాంలో భాగంగా శాటిలైట్లనుపయోగించి ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఇప్పటికే అమెరికాతో సహా 11 దేశాల్లో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ సేవలను ప్రారంభించవచ్చునని స్పేస్ ఎక్స్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ షాట్వెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పోలిస్తే స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ గరిష్ట వేగంతో ఇంటర్నెట్ను అందిస్తుంది. తాజాగా ఊక్లా నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ రికార్డు సృష్టించింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ నివేదిక ప్రకారం 2021 రెండో త్రైమాసికంలో అమెరికాలోని ఇతర బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోన్న హ్యూస్ నెట్, వియాసట్ బ్రాడ్‌బ్యాండ్‌తో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను పోల్చింది.యునైటెడ్ స్టేట్స్లో మెరుపువేగంతో ఇంటర్నెట్ సేవలను అందిస్తోన్న బ్రాడ్‌బ్యాండ్‌గా ప్రొవైడర్‌గా స్టార్‌లింక్ మాత్రమే నిలిచింది. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సరాసరిగా 97.23 Mbps స్పీడ్‌ను అందిస్తోంది. హ్యూస్నెట్ రెండో స్థానంలో 19.73 Mbps వేగంతో, వియాసత్ మూడో స్థానంలో 18.13 Mbps వేగంతో నిలిచాయని ఊక్లా పేర్కొంది. కాగా స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ గరిష్టంగా 139.39 Mbps డౌన్లోడ్ వేగాన్ని అందించింది. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ అప్లోడింగ్ వేగంలో కూడా రికార్డులను నమోదు చేసింది. స్టార్‌లింక్ ఇంటర్నెట్, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అప్లోడింగ్ స్పీడ్ ను అధిగమించింది. అప్లోడింగ్ వేగంలో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 15.99 Mbps, రెండో త్రైమాసికంలో 17.18 Mbps నమోదు చేసింది. స్టార్‌లింక్ తరువాత వియాసత్ అప్లోడింగ్ స్పీడ్‌లో రెండో స్థానంలో నిలిచింది. వియాసత్ అప్లోడింగ్ స్పీడ్‌లో 3.38 Mbps, హ్యూస్నెట్ అప్లోడింగ్ స్పీడ్‌లో 2.43 Mbps వద్ద నిలిచింది. స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్లోని ఉపగ్రహాలు ‘లో ఎర్త్ ఆర్బిట్’లో కలిగి ఉండడం ద్వారా ఈ స్పీడ్ సాధ్యమైందని ఊక్లా పేర్కొంది. -
ఏడాది కాలంలో 47 శాతం పెరిగిన ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్
భారతదేశంలోని మొబైల్, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగాలను జూన్ లో ఓక్లా పరీక్షించి విడుదల చేసిన స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో గతంలో కంటే మెరుగైన స్థానాన్ని సాధించుకుంది. దేశంలో మేలో సగటు మొబైల్ డౌన్లోడ్ వేగం 15.34 ఎంబీపీఎస్ నుంచి 17.84 ఎంబీపీఎస్(16.3 శాతం పెరిగి)కు చేరుకుంది. మొబైల్ ఇంటర్నెట్ తో పాటు, దేశంలో సగటు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగం 4.53 శాతం పెరిగి 55.65 ఎంబీపీఎస్ నుంచి 58.17 ఎంబీపీఎస్ కు పెరిగింది. జూన్ లో మొబైల్, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగాల పరంగా రెండూ గ్లోబల్ ఇండెక్స్ లో మంచి స్థానాన్ని పొందాయి. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ జూన్ డేటా ప్రకారం.. మొబైల్ ఫిక్సిడ్ బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగాలు వరుసగా ఆరు స్థానాలు పెరిగి 122 వ స్థానానికి, మూడు పాయింట్లు పెరిగి 70కి చేరుకుంది. గత రెండు నెలలుగా మొత్తంగా మొబైల్ డౌన్లోడ్ వేగంలో స్థిరమైన మెరుగుదలను చూపించినట్లు ఓక్లా తెలిపింది. జూన్ లో మొబైల్ ఇంటర్నెట్ వేగం ఓక్లా విడుదల చేసిన స్పీడ్ టెస్ట్ డేటా ప్రకారం.. దేశంలో గత ఏడాది జూన్ 2020లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 12.16 ఎంబీపీఎస్ ఉంటే ఈ ఏడాది 17.84 ఎంబీపీఎస్ గా ఉంది. అంటే ఏడాది కాలంలో 46.71 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. దేశంలో సగటు మొబైల్ అప్ లోడ్ వేగం కూడా గత ఏడాది ఇదే నెలలో 4.35 ఎంబీపీఎస్ ఉంటే జూన్ 2021లో 18.85 శాతం పెరిగి 5.17 ఎంబీపీఎస్ కు చేరుకుంది. మొబైల్ నెట్ వర్క్ లపై దేశంలో సగటు లేటెన్సీ రేటు మే లో 50 మిల్లీసెకన్ల నుంచి జూన్ లో 48 మిల్లీ సెకన్లకు పడిపోయింది. సగటు జిట్టర్ రేటు కూడా మేలో 48 మిల్లీ సెకన్ల నుండి జూన్ లో 43 మిల్లీ సెకన్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఓక్లా నిర్వహించిన స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) సగటు మొబైల్ డౌన్లోడ్ వేగం 193.51 ఎంబీపీఎస్ తో తన ఆధిక్యాన్ని కొనసాగించింది. తర్వాత దక్షిణ కొరియా 180.48 ఎంబీపీఎస్ వద్ద ఉంది. జూన్ లో ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ వేగం ఇక ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ విషయానికి వస్తే ఓక్లా స్పీడ్ టెస్ట్ డేటా ప్రకారం.. భారతదేశంలో సగటు డౌన్లోడ్ వేగం జూన్ 2021లో 58.17 ఎంబీపీఎస్ గా ఉంటే, జూన్ 2020లో 38.19 ఎంబీపీఎస్ గా ఉంది. అంటే ఏడాది కాలంలో 52.32 శాతం పెరుగుదలను నమోదు సూచిస్తుంది. మరోవైపు దేశంలో సగటు ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ అప్ లోడ్ వేగం 2021 జూన్ లో 54.43 ఎంబీపీఎస్ కు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే నెలలో 34.22 ఎంబీపీఎస్ నుంచి 59.06 శాతం పెరిగింది. దేశంలో ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ సగటు లేటెన్సీ రేటు జూన్ లో ఒక మిల్లీ సెకను నుంచి 17 మిల్లీసెకన్లకు పెరిగింది. జూన్ లో సగటు బ్రాడ్ బ్యాండ్ డౌన్ లోడ్ వేగం పరంగా 260.74 ఎంబీపీఎస్ తో మొనాకో అగ్రదేశంగా అవతరించింది. -
మొబైల్ ఇంటర్నెట్ ఓక్లా చెప్పిన శుభవార్త!
సాక్షి, న్యూడిల్లీ: ఇంటర్నెట్ స్పీడ్‌ను అంచనా వేసే సంస్థ ఓక్లా తాజా గణాంకాలను సోమవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా నవంబరు మాసానికి సగటు మొబైల్ ఇంటర్నెట్వేగం దాదాపు రెట్టింపు అయిందని ఇది భారతీయ వినియోగదారులకు శుభవార్త అని వ్యాఖ్యానించింది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ 109వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్‌లో 76వ స్థానంలో నిలిచింది. అలాగే సగటు బ్రాడ్ బ్యాండ్ వేగం 15శాతం పుంజుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియాలో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్, ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ వేగం భారీగా పుంజుకుంటోందని పేర్కొంది. గ్లోబల్ ఇండెక్స్ స్పీడ్ టెస్ట్ నవంబర్ నెల గణాంకాలను ఓక్లా విడుదల చేసింది. దీని ప్రకారం సగటు మొబైల్ డోన్లోడ్ స్పీడ్ 7.65 ఎంబీపీఎస్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ వేగం 76 వ స్థానంలో ఉంది. ఈ సగటు జనవరి నాటికి 12.12 పాయింట్లు ఉంటే, నవంబరులో 18.82 పాయింట్లుగా నిలిచిందని ఓక్లా తెలిపింది. మార్కెట్లో ఉన్న పోటీ, వివిధ ఆపరేటర్ల తారిఫ్ల దీనికి కారణమని ఇది సానుకూల దృక్పథమని ఓక్లా తెలిపింది. ఈ నూతన సంవత్సరానికి మార్కెట్ ఎలా వృద్ధి చెందుతుందో చూడడానికి తాము ఎదురుచూస్తున్నామని ఓక్లా సహ వ్యవస్థాపకుడు, జనరల్ మేనేజర్ డౌగ్ సూట్లేస్ వ్యాఖ్యానించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలందించడంలో నార్వే ఎప్పటిలాగానే మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో టాప్ ప్లేస్ కొట్టేసింది. -
జియో ఫిర్యాదు: ఎయిర్ టెల్కు దెబ్బపడింది
రిలయన్స్ జియో ఫిర్యాదుతో ఎయిర్ టెల్ కు దెబ్బపడింది. 'ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్' తమదేనంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రమోషనల్ క్యాంపెయిన్ ను ఆపివేయాలని దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ ను వ్యాపార ప్రకటనల వాచ్ డాగ్ ఆదేశించింది. రిలయన్స్ జియో ఫిర్యాదుతో ఎయిర్ టెల్ కు అడ్వర్ టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) ఈ ఆదేశాలు జారీచేసింది. 2017 ఏప్రిల్ 11 వరకు టీవీ కమర్షియల్ లలో, వెబ్ సైట్ అడ్వర్ టైజ్మెంట్లో దీన్ని ఉపసంహరించుకోవాలని లేదా తగిన విధంగా సవరించుకోవాలని ఎయిర్ టెల్ కు ఏఎస్సీఐ సూచించింది. బ్రాడ్ బ్యాండ్ టెస్టర్ ఊక్లా ఎయిర్ టెల్ కు దేశంలోనే 'ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ ' గా డిక్లేర్ చేసింది. కానీ ఊక్లా టెస్టింగ్ ను తప్పుబడుతూ జియో, ఏఎస్సీఐను ఆశ్రయించింది. అయితే ఏఎస్సీఐ నిర్ణయాన్ని తాము ఆమోదించేది లేదని, నిబంధనల ప్రకారమే తాము దీన్ని వాడుకుంటున్నట్టు అప్పీల్ దాఖలు చేస్తామని ఎయిర్ టెల్ చెబుతోంది. గ్లోబల్ మొబైల్ స్పీడ్ టెస్ట్ ఊక్లానే ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ గా తమల్ని గుర్తించిందని పేర్కొంది. పారదర్శకత, విశ్వసనీయమైన డేటాతోనే తాము ఎయిర్ టెల్ కు ఈ ట్యాగ్ ఇచ్చినట్టు ఊక్లా కూడా స్పష్టంచేసింది. -
జియోపై ఊక్లా కౌంటర్ అటాక్
న్యూఢిల్లీ : దేశంలో ఫాస్టెస్ట్ నెట్ వర్క్ ట్యాగ్ పై చెలరేగిన వివాదంపై గ్లోబల్ బ్రాడ్‌బ్యాండ్ టెస్టింగ్ లీడర్ ఊక్లా, రిలయన్స్ జియో ఆరోపణలను కొట్టిపారేసింది. జియో ఆరోపణలను ఖండించిన ఊక్లా, తాము ఎంతో పారదర్శకతను, విశ్వసనీయతను పాటించి ఎయిర్ టెల్కు ఈ ట్యాగ్ ఇచ్చామని బుధవారం స్పష్టంచేసింది. ఎలాంటి స్పీడ్ టెస్ట్ ఇంటర్నెట్ టెస్ట్ చేసేందుకైనా సేకరించే సమాచారం చాలా పక్కాగా ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో అత్యంత ఫాస్టెస్ట్ నెట్ వర్క్ ఎయిర్ టెలేనంటూ ఊక్లా సర్టిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే అదంతా అబద్ధమని జియో ఆరోపించింది. ఈ విషయాన్ని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గరకు తీసుకెళ్లింది. ఊక్లా రేటింగ్స్ పై విమర్శలు సంధించింది.అయితే ఆ విమర్శలను ఊక్లా కొట్టిపారేసింది. 2016 మూడో, నాలుగో క్వార్టర్ డేటా తీసుకొని ఈ టెస్ట్ నిర్వహించామని.. ఈ డేటా ఫలితాలతోనే ఎయిర్ టెల్ కు ఈ ట్యాగ్ ఇచ్చినట్టు స్పష్టీకరించింది. ఇండియా లాంటి మార్కెట్లలో స్పీడు టెస్ట్ నిర్వహించేటప్పుడు, చాలా అంశాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని కంపెనీ తెలిపింది. డ్యూయల్ సిమ్ డివైజ్‌లు, నెట్ వర్క్ టెక్నాలజీ, డివైజ్ టైప్స్ వంటి అన్నీ అంశాలను పరిశీలిస్తామని ఊక్లా సీఓఓ జామీ స్టీవెన్ చెప్పారు.