ఇండియాలోనే ఉత్తమ నెట్‌వర్క్‌..ఊక్లా అవార్డులు అన్నీ సంస్థకే.. | Jio Is The Best Network In India: Ookla - Sakshi
Sakshi News home page

ఇండియాలోనే ఉత్తమ నెట్‌వర్క్‌..ఊక్లా అవార్డులు అన్నీ సంస్థకే..

Published Wed, Oct 25 2023 10:39 AM | Last Updated on Wed, Oct 25 2023 11:12 AM

Jio Is The Best Network In India Ookla - Sakshi

దేశంలో అగ్రగామి నెట్‌వర్క్‌గా రిలయన్స్‌ జియో నిలిచింది. ఊక్లా సంస్థ ప్రకటించే స్పీడ్‌టెస్ట్‌లకు సంబంధించిన అవార్డులను అన్నింటినీ రిలయన్స్‌జియో గెలుచుకుంది. 5జీ నెట్‌వర్క్‌, మొబైల్‌ నెట్‌వర్క్ విభాగంలో మొత్తం అవార్డులను జియో గెలుపొందినట్లు ఊక్లా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తమ, వేగవంత, టాప్‌ రేటెడ్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌, ఉత్తమ మొబైల్‌ కవరేజీ, ఉత్తమ మొబైల్‌ వీడియో, గేమింగ్‌ అనుభూతి, 5జీ మొబైల్‌ నెట్‌వర్క్‌, 5జీ మొబైల్‌ వీడియో అనుభూతి, 5జీ మొబైల్‌ గేమింగ్‌ అనుభూతి అవార్డులను జియో దక్కించుకుందని తెలిపింది. 

ఊక్లా స్పీడ్‌టెస్ట్‌ అందించే సూచనల ద్వారా తమ సంస్థతోపాటు ఇతర సంస్థల వినియోయోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేలా ప్రయత్నిస్తున్నట్లు సంస్థ సీఈఓ, ప్రెసిడెంట్‌ స్టీఫెన్‌ తెలిపారు. ఈ అవార్డులు, గుర్తింపుతో భారత్‌లో అత్యుత్తమ నెట్‌వర్క్‌గా జియో మారిందన్నారు. టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడంతోపాటు డిజిటల్‌ సమాజాన్ని సృష్టించాలన్నది జియో లక్ష్యమని రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement