Jio Network
-
ఇండియాలోనే ఉత్తమ నెట్వర్క్..ఊక్లా అవార్డులు అన్నీ సంస్థకే..
దేశంలో అగ్రగామి నెట్‌వర్క్‌గా రిలయన్స్ జియో నిలిచింది. ఊక్లా సంస్థ ప్రకటించే స్పీడ్‌టెస్ట్‌లకు సంబంధించిన అవార్డులను అన్నింటినీ రిలయన్స్జియో గెలుచుకుంది. 5జీ నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్ విభాగంలో మొత్తం అవార్డులను జియో గెలుపొందినట్లు ఊక్లా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తమ, వేగవంత, టాప్ రేటెడ్ మొబైల్ నెట్వర్క్, ఉత్తమ మొబైల్ కవరేజీ, ఉత్తమ మొబైల్ వీడియో, గేమింగ్ అనుభూతి, 5జీ మొబైల్ నెట్వర్క్, 5జీ మొబైల్ వీడియో అనుభూతి, 5జీ మొబైల్ గేమింగ్ అనుభూతి అవార్డులను జియో దక్కించుకుందని తెలిపింది. ఊక్లా స్పీడ్‌టెస్ట్ అందించే సూచనల ద్వారా తమ సంస్థతోపాటు ఇతర సంస్థల వినియోయోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేలా ప్రయత్నిస్తున్నట్లు సంస్థ సీఈఓ, ప్రెసిడెంట్ స్టీఫెన్ తెలిపారు. ఈ అవార్డులు, గుర్తింపుతో భారత్‌లో అత్యుత్తమ నెట్‌వర్క్‌గా జియో మారిందన్నారు. టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడంతోపాటు డిజిటల్ సమాజాన్ని సృష్టించాలన్నది జియో లక్ష్యమని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. జియో సినిమాలో ఫ్రీగా భారత్-విండీస్ సిరీస్
క్రికెట్ ప్రేమికులకు జియో సినిమా (రిలయన్స్ జియో ఇన్ఫోకామ్) శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2023 సీజన్ తరహాలోనే త్వరలో ప్రారంభంకానున్న భారత్-వెస్టిండీస్ సిరీస్‌ను జియో సినిమాలో ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది. జులై 12-ఆగస్ట్ 13 వరకు జరిగే ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఇది వర్తిస్తుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అధినేత ఆకాశ్ అంబానీ వెల్లడించారు. కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్‌లు, ఆతర్వాత వన్డేలు, టీ20లు ఆడుతుంది. విండీస్ పర్యటన వివరాలు.. తొలి టెస్ట్- జులై 12-16, డొమినికా రెండో టెస్ట్- జులై 20-24, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. చివరి రెండు రోజుల్లో! -
జియో డౌన్.. గగ్గోలు పెడుతున్న యూజర్లు
Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్వర్క్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ముఖ్యంగా ముంబై టెలికాం సర్కిల్ పరిధిలో నెట్‌వర్క్‌కు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాల్స్ ఇన్కమ్, అవుట్‌గోయింగ్‌కు ఇబ్బంది పడుతున్నారు యూజర్లు. ఇదిలా ఉంటే ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని సర్కిల్స్‌లోనూ ఇదే తరహా సమస్యలు యూజర్లు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల నాలుగైదు రోజుల నుంచి నెట్వర్క్ సరిగా పని చేయడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జియో నుంచి మాత్రమే కాదు.. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియో నెంబర్లకు కాల్స్ కనెక్ట్ కావడం లేదనే ఫిర్యాదు అందుతున్నాయి. అంతరాయానికి కారణం ఏంటన్నది స్పష్టం చేయని జియో నెట్వర్క్.. యూజర్లకు వీలైనంత త్వరగా సేవలు పునరుద్ధరిస్తామని పేర్కొంది. అంతవరకు ప్రత్యామ్నాయ సిమ్ లేదంటే ఇంటర్నెట్ బేస్డ్ సేవల్ని వినియోగించుకోవాలని యూజర్లకు విజ్క్షప్తి చేస్తోంది. మరోపక్క నెట్వర్క్ పని చేయకపోవడంపై ఇతర నెట్వర్క్ యూజర్లు మీమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. Meanwhile #jio network pic.twitter.com/6dceYAo4Pc — hemaantt (@hemaantt) February 5, 2022 Jio Network down in full mumbai ( no calls, internet or mails) living life in ancient times #jio pic.twitter.com/ZDbY6riXVN — SavageNewsFurkan (@furkanaibani) February 5, 2022 #Jio network down Don't worry Mukesh Ambani is on duty: pic.twitter.com/EvA0c0bSDI — Hemant (@Sportscasmm) February 5, 2022 -
రిలయన్స్ జియో అరుదైన ఘనత
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు పడకుండా కార్యకలాపాలు నిర్వహించే సంస్థల జాబితాలో జియోకు అత్యుత్తమ ’ఎ–’ లీడర్షిప్ రేటింగ్ దక్కింది. లాభాపేక్ష రహిత సంస్థ సీడీపీ, 2021 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఈ జాబితాలో, భారత్ నుంచి లీడర్షిప్ ర్యాంకింగ్ దక్కించుకున్న ఏకైక టెలికం/డిజిటల్ సంస్థ రిలయన్స్ జియోనే. మరో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ’సి’ రేటింగ్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ గల 272 కంపెనీలను ఈ జాబితా కోసం మరింపు చేసినట్లు సీడీపీ తెలిపింది. వాతావరణ మార్పులు, అడవులు.. నీటి సంరక్షణ వంటి అంశాల్లో ఆయా కంపెనీల పనితీరు, వాటి పారదర్శకత స్థాయి ఆధారంగా రేటింగ్‌లు ఇచ్చినట్లు పేర్కొంది. గతేడాది ’బి’ రేటింగ్ నుంచి జియో ఈ ఏడాది మరో అంచె ఎదిగింది. భారతి ఎయిర్టెల్ రేటింగ్ 2020లో ’డి–’ నుంచి ఈసారి ’సి’ స్థాయికి మెరుగుపడింది. చదవండి: ట్రాయ్‌కు రిలయన్స్ జియో ఫిర్యాదు! ఎందుకంటే.. -
రిలయన్స్ జియోకు ఐదేళ్లు.. దిగ్గజాల అభినందనలు
దేశీ టెలికం మార్కెట్లో సంచలనం సృష్టించిన దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో.. కార్యకలాపాలు ప్రారంభమై అయిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కంపెనీకి పలు దిగ్గజాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 2016 సెప్టెంబర్ 5న దేశీ టెలికం మార్కెట్లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత డేటా వినియోగం 1,300 శాతం ఎగిసింది. బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. జియో చౌకగా డేటాను అందించడంతో వినియోగదారులకు టెక్ సంస్థలు మరింత చేరువయ్యేందుకు వీలయ్యింది. ఈ నేపథ్యంలోనే అవి కంపెనీని అభినందనలతో ముంచెత్తాయి. ‘తలెత్తుకుని జీవించడం మీ నుంచి నేర్చుకోవాలి‘ అని హెచ్డీఎఫ్సీ, ‘స్కోరెంత? అని అడగాల్సిన అవసరం లేకుండా లైవ్‌లోనే చూసే సదుపాయం అందుబాటులోకి తెచి్చంది.. జియోకి చీర్స్‘ అంటూ హాట్‌స్టార్ వ్యాఖ్యానించాయి. ‘బర్త్‌డే కేక్ పంపిస్తున్నాం. దారిలో ఉంది‘ అంటూ ఆన్లైన్ ఫుడ్ సేవల సంస్థ జొమాటో ట్వీట్ చేసింది. -
కార్ల కంపెనీతో జియో ఒప్పందం.. నెట్ కనెక్టివిటీలో కొత్త శకం
ముంబై: ప్రయాణం చేసేప్పుడు మారుమూల ప్రాంతాల్లో తరచుగా ఎదురవుతున్న ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్‌వర్క్‌లు చేతులు కలిపాయి. అంతరాయం లేని ఇంటర్నెట్ అందిస్తామంటూ వినియోగదారులకు హమీ ఇస్తున్నాయి, ఈ మేరకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్‌వర్క్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఎంజీ ప్లస్ జియో మోరిసన్ గ్యారెజేస్ (ఎంజీ) ఇండియా నుంచి ఇప్పటికే హెక్టార్, గ్లూస్టర్ మోడళ్లు భారతీయ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. కాగా త్వరలోనే మిడ్ రేంజ్ ఎస్‌యూవీని లాంఛ్ చేసేందుకు రెడీ ఎంజీ మోటార్స్ రెడీ అవుతోంది. అయితే ఈ ఎస్‌యూవీలో ఇన్ఫోంటైన్‌మెంట్‌కి సంబంధించి గేమ్ ఛేంజర్ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఇంటర్నెట్ కనెక్టివిటీలో సంచలనం సృష్టించిన జియో నెట్‌వర్క్‌తో జోడీ కట్టింది. నెట్ కనెక్టివిటీ త్వరలో రిలీజ్ చేయబోతున్న మిడ్ రేంజ్ ఎస్‌యూవీలో నిరంతం నెట్ కనెక్టివిటీ ఉండే ఫీచర్‌ని ఎంజీ మోటార్స్ జోడించనుంది. దీనికి సంబంధించిన సాంకేతిక సహకారం జియో నెట్వర్క్ అందిస్వనుంది. కారులో నిరంతరం నెట్ కనెక్టెవిటీ ఉండేందుకు వీలుగా ఇ-సిమ్‌తో పాటు ఇతర హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను జియో అందివ్వనుంది. దీంతో ఈ కారులో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేప్పుడు కూడా 4G ఇంటర్నెట్ను పొందవచ్చు. ఏమూలనైనా కొత్తగా వస్తున్న కార్లలో ఇన్ఫోంటైన్మెంట్ విభాగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీపీఎస్ నావిగేషన్‌తో పాటు ఆడియో, వీడియోలకు సంబంధించి లేటెస్ట్ ఫీచర్లు యాడ్ చేస్తున్నారు. అయితే ఇంటర్నెట్ లేకపోతే ఇందులో సగానికి పైగా ఫీచర్లు నిరుపయోగమే,. దీంతో కారులో ప్రయాణించే వారు పల్లె పట్నం తేడా లేకుండా ఏ మూలకు వెళ్లినా నెట్ కనెక్టివిటీ లభిస్తుంది. టెక్నాలజీలో నంబర్ 1 జియోతో చేసుకున్న తాజా ఒప్పందం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టెక్నాలజీకి సంబంధించి తమ బ్రాండ్ నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఎంజీ మోటార్స్ ప్రెసిడెంట్స్, ఎండీ రాజీవ్ చాబా అన్నారు. కనెక్టివీటీ, ఇన్ఫోంటైన్మెంట్, స్ట్రీమింగ్, టెలిమాటిక్స్ విషయంలో ఇప్పటి వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న అవరోధాలు తీరిపోతాయని జియో ప్రెసిడెంట్ కిరణ్ థామస్ అన్నారు. -
క్రికెట్ ప్రేమికులకు జియో శుభవార్త
హైదరాబాద్ : ఐపీఎల్ మజాను ఆస్వాధించే ప్రేక్షకులకు జియో నెట్వర్క్ ఒక శుభవార్త చెప్పింది. జియో యూజర్లతో పాటు నాన్ జియో యూజర్లు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' యాప్ ద్వారా విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు గేమ్‌లో పాల్గొనేవారు తమ నైపుణ్యతను మెరుగుపరుచుకునేలా ప్రశ్నలను రూపొందించడంతో పాటు ఎంటర్టైన్మెంట్ను అందించనుంది. దీనికి అదనంగా ప్రీ-మ్యాచ్ ప్రశ్నలు, పోల్స్, క్విజ్‌లతో పాటు మీ ఫేవరెట్ టీమ్‌కు స్టికర్ చాట్ ఏర్పాటు, స్కోర్లు, మ్యాచ్ షెడ్యూల్లు, ఫలితాలను యాక్సస్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ‘డైలీ రివార్డ్స్’ ద్వారా పాల్గొనేవారు ప్రతిరోజూ బహుమతులు గెలుచుకోవచ్చు.. అంతేగాక ‘డైలీ ఛాలెంజెస్’ పూర్తి చేసిన తర్వాత బంపర్ బహుమతులు కూడా అందుకోవచ్చు. గేమ్ ప్రారంభమయ్యే ముందు రోజువారీ టాస్క్‌ల్లో భాగంగా గెలిచినవారికి అందించే బంపర్ ప్రైజ్ ఎంటనేది ముందే ప్రదర్శించడం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో క్రికెట్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తూ 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్'తో గెలుద్దాం! ఈ 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' గేమ్‌ను మై జియో యాప్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై జియో యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రికెట్ సీజన్లో జియో యూజర్లతో పాటు జియోయేతర యూజర్లు గేమ్‌ను ఆడి మంచి బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. -
జియోలో కొత్త ఐఫోన్లు
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇటీవల తన కొత్త ఫోన్లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌లను ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐఫోన్లు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా? అంటూ ఆపిల్ అభిమానులు వేచి చూస్తున్నారు. నిన్నటి నుంచి ఈ ఐఫోన్ల ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్లను తమ నెట్‌వర్క్‌లో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. లేటెస్ట్ ఐఫోన్లను కస్టమర్లు www.jio.com, రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్లు, మైజియో యాప్‌లలో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 28 నుంచి ఈ రెండు డివైజ్‌లు స్టోర్లలో అందుబాటులోకి వస్తున్నాయి. రెండు ఫోన్లలో కూడా జియో తన ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ కస్టమర్ల కోసం అడ్వాన్స్డ్ ఈసిమ్ ఫీచర్‌ను అందిస్తుంది. ప్రీపెయిడ్ యూజర్లకు దేశంలో ఈసిమ్ యాక్టివేషన్‌ను అందిస్తున్న ఏకైక ప్రొవైడర్ జియో మాత్రమే. జియో డిజిటల్ లైఫ్‌ను అనుభూతి చెందడానికి ఈ ఐఫోన్ యూజర్లకు డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను అందిస్తుంది. దీనిలో ఒకటి నానో-సిమ్ కాగా, మరొకటి డిజిటల్ ఈసిమ్. ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్లలో ఇవే అధునాతనమైనవి. స్మార్ట్‌ఫోన్‌ను కొత్త శిఖరానికి తీసుకెళ్లడానికి ఇవి ఎంతో సహకరించనున్నాయి. ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల సూపర్ రెటినా డిస్ప్లేలను కలిగి ఉన్నాయి. వేగవంతమైన, మెరుగైన డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను ఇవి కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో తొలిసారిగా 7-నానోమీటర్ చిప్‌ను ఏర్పాటు చేశారు. వేగవంతమైన ఫేస్ ఐడీ, వైడర్ స్టిరియో సౌండ్, లాంగర్ బ్యాటరీ లైఫ్, వాటర్ రెసిస్టెన్స్, బ్యూటిఫుల్ గోల్డ్ ఫిన్నిష్, డౌన్లోడ్ స్పీడును పెంచే గిగాబిట్-క్లాస్ ఎల్‌టీఈను ఈ ఫోన్లు ప్రవేశపెట్టాయి. -
జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది!
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో 4జీ.. చాలా స్లో గురూ అంటూ వచ్చిన కామెంట్లను ఛాలెంజ్‌గా తీసుకున్న కంపెనీ డిసెంబర్ లో ఇంటర్నెట్ స్పీడులో దూసుకుపోయింది. 2016 డిసెంబర్లో జియో నెట్వర్క్ స్పీడు భారీగా పెరిగినట్టు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ వెల్లడించింది. సెకనుకు జియో నెట్వర్క్ సగటు డౌన్ లోడ్ స్పీడు 18.16 ఎంబీపీఎస్‌ను తాకిందట. సెప్టెంబర్‌లో వాణిజ్య 4జీ సర్వీసులతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇదే అత్యధికమైన స్పీడని ట్రాయ్ డేటా పేర్కొంది. నెలవారీ సగటు మొబైల్ డేటా స్పీడును ట్రాయ్ వెల్లడిస్తోంది. ట్రాయ్ డేటా ప్రకారం డిసెంబర్ నెలలో జియో డౌన్ లోడ్ స్పీడు 18.16 ఎంబీపీఎస్‌ను తాకింది. కాగ, నవంబర్‌లో జియో నెట్ వర్క్ డౌన్లోడు స్పీడు దారుణంగా ఉందని ట్రాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. స్పీడు ఇంటర్నెట్ ను ఇస్తామన్న కంపెనీ అప్పుడు కేవలం 5.85 ఎంబీపీఎస్ స్పీడునే అందించింది. లాంచింగ్ సమయంలో జియో స్పీడు 7.26 ఎంబీపీఎస్ ఉండేది. దీంతో ఇతర టెలికాం నెట్‌వర్క్‌లతో పోలిస్తే జియో స్పీడు దారుణంగా ఉందంటూ ట్రాయ్ పేర్కొంది. ఆ కామెంట్లను ఛాలెంజ్‌గా తీసుకున్న కంపెనీ డిసెంబర్ నెలలో తన స్పీడును వేగంగా పెంచుకుని 18.16 ఎంబీపీఎస్ ను తాకింది. ఇతర నెట్‌వర్క్‌లు వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడు 6.7 ఎంబీపీఎస్, ఐడియా స్పీడు 5.03 ఎంబీపీఎస్, భారతీ ఎయిర్టెల్ స్పీడు 4.68 ఎంబీపీఎస్, బీఎస్ఎన్ఎల్ స్పీడు 3.42ఎంబీపీఎస్, ఎయిర్‌సెల్ స్పీడు 3ఎంబీపీఎస్, రిలయన్స్ కమ్యూనికేషన్ స్పీడు 2.6 ఎంబీపీఎస్ ఉన్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. -
రిలయెన్స్ ‘డేటాగిరీ’ నడుస్తుందా?
న్యూఢిల్లీ: బిలియనీర్ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబాని గురువారం నాడు ‘రిలయెన్స్ జియో’ అనే కొత్త మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రక టించడం ద్వారా భారత టెలికామ్ రంగంలో విప్లవాన్నే సృష్టించారు. ధరల యుద్ధానికి తెరలేపారు. ఫలితంగా ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీలు కూడా తమ డేటా చార్జీలను తగ్గించుకోక తప్పలేదు. సెప్టెంబర్ ఐదవ తేదీన అమల్లోకి వస్తున్న ‘రిలయెన్స్ జియో’ మార్కెట్లో ఎంత వరకు విజయం సాధిస్తుంది? ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటుందా? దేశంలోని టెలికామ్ వినియోగదారులంతా జియో నెట్వర్క్ వైపు మళ్లుతారా? అన్న అంశాలను అన్ని కోణాల నుంచి నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 50 రూపాయలకే గిగాబైట్ డేటాను ఇస్తామని చెప్పడం, రాత్రిపూట మూడు గంటల పాటు అన్ లిమిటెడ్ డేటా డౌన్‌లోడ్‌కు అవకాశం ఇవ్వడంతోపాటు అన్ని వాయిస్ కాల్స్‌ను ఉచితంగా ఇస్తామనడం అన్నింటికన్నా ఆకర్షణీయమైన అంశం. భారతీయ సంచార నిగమ్ లిమిటెడ్ మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే 48 రూపాయల ప్యాకేజీపైనా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను ఇస్తోంది. ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలు వెయ్యి రూపాయల ప్యాకేజీలపై అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను ఇస్తోంది. అంటే ఉచితంగా వాయిస్ కాల్స్ ఇవ్వడం దేశంలో రిలయెన్స్తోనే ప్రారంభం కాలేదు. కాకపోతే అన్ని ప్యాకేజీల వారికి ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని కల్పించడం రిలయెన్స్ కంపెనీతోనే మొదలైందని చెప్పవచ్చు. రిలయెన్స్ ధాటికి తట్టుకోలేక డేటా చార్టీలను ఇప్పటికే తగ్గించిన ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా టెలికమ్ కంపెనీలు వాయిస్ కాల్స్ చార్జీలను మాత్రం తగ్గించలేదు. ఆ కంపెనీలకు 70 శాతం రెవెన్యూ ఈ వాయిస్ కాల్స్‌పైనే వస్తున్నాయి. పైగా ప్రపంచంలోకెల్లా వాయిస్ కాల్స్ ఛార్జీలు భారత్‌లోనే తక్కువగా ఉన్నాయి. భారత్‌లో ప్రధాన టెలికమ్ కంపెనీలు నిమిషం వాయిస్ కాల్‌కు సరాసరి సగటున 65 పైసలు వసూలు చేస్తుండగా, ప్రపంచంలో వివిధ దేశాల్లో 1.3 రూపాయల (హాంకాంగ్‌లో) నుంచి 45 రూపాయల (జపాన్) వరకు వసూలు చేస్తున్నాయి. ముకేశ్ అంబానీ అన్ని ప్యాకేజీలపై వాయిస్ కాల్స్, ఎస్ఎమ్మెస్లు ఉచితమని ప్రకటించారుగానీ టారిఫ్‌లకు సంబంధించిన బ్రోచర్లను మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు. బ్రోచర్లలో కొన్ని మార్పులు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి. రిలయెన్స్ జియోలో ఉచిత వాయిస్ కాల్స్ ఎంతో ఆకర్షణీయమైనప్పటికీ ప్యాకేజీల ప్రకారం చూస్తే యాభై రూపాయలకు గిగాబైట్ మరీ అంత ఆకర్షణీయం కాకపోవచ్చని, యాభై రూపాయలు చీప్ అనుకొని నెలకు ఒక జీబీకన్నా ఎక్కువ వాడితే 149 రూపాయల ప్యాకేజీ వర్తించదు కనుక 499 రూపాయలకు 4జీబీ ప్యాకేజీలో పడే ప్రమాదం ఉంది. ఇక 999 రూపాయలకు 10 జీబీ ప్యాకేజీని రిలయెన్స్ జీయో ఇస్తోంది. కానీ బీఎస్ఎన్ఎల్ అంతే రేటుకు అంటే వెయ్యి రూపాయలకు అన్లిమిటెడ్ డేటా సౌకర్యాన్ని కల్పిస్తోంది. అప్పుడు బీఎస్ఎన్ఎల్యే బెటర్ గదా! రాత్రి పూట, అంటే తెల్లవారి జామున రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అన్లిమిటెడ్ డేటాకు అవకాశం ఇచ్చారని, ఆ సమయంలో డేటా డౌన్లోడ్ చేసుకునేవారి వినియోగదారుల సంఖ్య పరిమితంగానే ఉంటుందని భావిస్తున్నారు. ఏ ర కంగా చూసుకున్నా ఉచిత వాయిస్ కాల్స్‌ను కోరుకునే వారికి రిలయెన్స్ జియో ఉత్తమ ఆప్షన్‌గా కనిపిస్తోంది. వంద రూపాయల ప్యాకేజీలో కోటి మంది చేరినా నెలకు వంద కోట్ల రూపాయల టర్నోవర్ కంపెనీకి వస్తుంది. డేటా డౌన్లోడ్ విషయంలో స్పీడ్, సిగ్నల్ వ్యవస్థ పనితీరు లాంటి అంశాలు కూడా ముఖ్యమే. నెట్వర్క్ అమల్లోకి వస్తేగాని వాటిని అంచనావేయలేం.