దేశీ టెలికం మార్కెట్లో సంచలనం సృష్టించిన దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో.. కార్యకలాపాలు ప్రారంభమై అయిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కంపెనీకి పలు దిగ్గజాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 2016 సెప్టెంబర్ 5న దేశీ టెలికం మార్కెట్లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత డేటా వినియోగం 1,300 శాతం ఎగిసింది. బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది.
జియో చౌకగా డేటాను అందించడంతో వినియోగదారులకు టెక్ సంస్థలు మరింత చేరువయ్యేందుకు వీలయ్యింది. ఈ నేపథ్యంలోనే అవి కంపెనీని అభినందనలతో ముంచెత్తాయి. ‘తలెత్తుకుని జీవించడం మీ నుంచి నేర్చుకోవాలి‘ అని హెచ్‌డీఎఫ్‌సీ, ‘స్కోరెంత? అని అడగాల్సిన అవసరం లేకుండా లైవ్‌లోనే చూసే సదుపాయం అందుబాటులోకి తెచి్చంది.. జియోకి చీర్స్‘ అంటూ హాట్‌స్టార్ వ్యాఖ్యానించాయి. ‘బర్త్‌డే కేక్ పంపిస్తున్నాం. దారిలో ఉంది‘ అంటూ ఆన్‌లైన్ ఫుడ్ సేవల సంస్థ జొమాటో ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment