Ind Vs WI Series: India Tour Of West Indies Will Be Free Streamed On Jio Cinema, Details Inside - Sakshi
Sakshi News home page

క్రికెట్‌ ప్రేమికులకు శుభవార్త.. జియో సినిమాలో ఫ్రీగా భారత్‌-విండీస్‌ సిరీస్‌

Published Wed, Jun 7 2023 3:09 PM | Last Updated on Wed, Jun 7 2023 4:18 PM

India Tour Of West Indies Will Be Free Streamed On Jio Cinema - Sakshi

క్రికెట్‌ ప్రేమికులకు జియో సినిమా (రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌) శుభవార్త చెప్పింది. ఐపీఎల్‌ 2023 సీజన్‌ తరహాలోనే త్వరలో ప్రారంభంకానున్న భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌ను జియో సినిమాలో ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది. జులై 12-ఆగస్ట్‌ 13 వరకు జరిగే ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఇది వర్తిస్తుందని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ అధినేత ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు. 

కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ కోసం భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌ తొలుత టెస్ట్‌లు, ఆతర్వాత వన్డేలు, టీ20లు ఆడుతుంది.

విండీస్‌ పర్యటన  వివరాలు..

తొలి టెస్ట్‌- జులై 12-16, డొమినికా
రెండో టెస్ట్‌- జులై  20-24, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌

జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్‌
జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్‌
ఆగస్ట్‌ 1- మూడో వన్డే, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌

ఆగస్ట్‌ 4- తొలి టీ20, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
ఆగస్ట్‌ 6- రెండో టీ20, గయానా
ఆగస్ట్‌ 8- మూడో టీ20, గయానా
ఆగస్ట్‌ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా
ఆగస్ట్‌ 13- ఐదో టీ20, ఫ్లోరిడా

చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. చివరి రెండు రోజుల్లో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement