వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా సారథిగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భాగంగా గయానా వేదికగా జరిగిన మూడో టీ20 అనంతరం భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ హాఫ్ సెంచరీ (49 నాటౌట్) చేయనీవ్వకుండా హార్దిక్ మ్యాచ్ ఫినిష్ చేయడమే ఇందుకు కారణం.
తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా.. హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కెప్టెన్‌గా పనికిరాడని, స్వార్థపరుడని హార్దిక్‌ను దారుణంగా ట్రోలు చేశారు. అయితే విషయంలో హార్దిక్ తీరును కొంతమంది తప్పుబడతుంటే, మరి కొంతమంది మద్దతుగా నిలుస్తున్నారు.
ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీడీ డివిలియర్స్ వంటి వారు హార్దిక్‌కు సపోర్ట్‌గా నిలిచారు. టీ20ల్లో హాఫ్ సెంచరీ అనేది పెద్ద ల్యాండ్ మార్క్ కాదని అన్నాడు. ఈ విషయంపై ఇంత పెద్ద చర్చ అనవసరమని హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు. దీనిపై ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ. అంతిమంగా ఒకరు నోరు విప్పారు అంటూ ట్వీట్ చేశాడు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మరోసారి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
"దీనిపై హార్దిక్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. దారుణంగా ట్రోలు చేయబడ్డాడు.అయితే కొంతమంది మధ్యలో టీ20 క్రికెట్‌లో మైలురాళ్ల గురించి మాట్లాడుతున్నారు. అస్సలు అది అవసరం లేని చర్చ. రికార్డులకంటే యువ ఆటగాడిలో స్పూర్తి నింపడం మన బాధ్యత. నాకు బాగా గుర్తుంది. 2014 టీ20 ప్రపంచకప్‌లో ధోనికి ఇదో పరిస్ధితి ఎదురైంది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సూపర్ ఇన్నింగ్స్‌తో అవతలి ఎండ్‌లో ఉన్నాడు. అయితే ధోని మాత్రం విరాట్‌ను హీరోను చేయాలని భావించాడు. అందుకే అతడికి మ్యాచ్ ఫినిష్ చేసే అవకాశం వచ్చినప్పటికీ..ఫార్వర్డ్ డిఫెన్సివ్ షాట్ కోహ్లికి స్ట్రైక్ ఇచ్చాడు. కోహ్లి మ్యాచ్ ఫినిష్ చేశాడు.
ధోనినే తనకు ఆదర్శమని హార్దిక్ చాలా సందర్బాల్లో చెప్పాడు. ఇష్టమైనంత మాత్రాన హార్దిక్ .. ధోని అవ్వల్సిన అవసరం లేదు . ఎందుకు ఈ అనవసర చర్చలు అపేయండి అంటూ తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు. కాగా మూడో టీ20 అనంతరం కూడా హార్దిక్‌ను ఉద్దేశించి చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. తిలక్ వర్మకు తన హాఫ్ సెంచరీని పూర్తి చేసే అవకాశం హార్దిక్ ఇచ్చి ఉంటే బాగుండేదని చోప్రా అభిప్రాయపడ్డాడు.
చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌కు బంగ్లా జట్టు ప్రకటన.. యువ సంచలనం ఎంట్రీ! స్టార్ ఆటగాడిపై వేటు
Comments
Please login to add a commentAdd a comment