
విండీస్‌తో మూడో టీ20లో టీమిండియా యంగ్ గన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ (49 నాటౌట్) చేయకుండా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అడ్డుకున్నాడని (తిలక్ హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు) సోషల్‌మీడియాలో పెద్ద రాద్దాంతం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో హార్దిక్‌ను తప్పుబడుతూ చాలామంది అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు భారత మాజీలు సైతం ఈ విషయంలో అభిమానులతో ఏకీభవించారు.
AB de Villiers concurs with Harsha Bhogle's perspective on Tilak Varma falling short of his half-century in the third T20I. pic.twitter.com/gGNuKR2DNI
— CricTracker (@Cricketracker) August 10, 2023
తాజాగా ఇదే విషయంపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా స్పందించాడు. తిలక్ విషయంలో ఫ్యాన్స్ అభిప్రాయాన్ని అతను కొట్టిపారేశాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ అనేది పెద్ద ల్యాండ్ మార్క్ కాదని అన్నాడు. ఈ విషయంపై ఇంత పెద్ద చర్చ అనవసరమని అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో సెంచరీ మినహా ఏదీ ల్యాండ్ మార్క్ కాదని తెలిపాడు. అసలు క్రికెట్ లాంటి టీమ్ గేమ్‌లో ల్యాండ్ మార్క్‌ల వ్యామోహం ఉండకూడదని అన్నాడు.
టీ20ల్లో హాఫ్ సెంచరీలు పరిగణలోకి తీసుకోవాలని అనుకోనని తెలిపాడు. ఈ ఫార్మాట్లో ఎంత వేగంగా పరుగులు చేశామనేది ముఖ్యమని పేర్కొన్నాడు. తిలక్ హాఫ్ సెంచరీ మిస్ అయిన విషయంలో హర్షా అభిప్రాయంతో దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఏకీభవించాడు. థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ. అంతిమంగా ఒకరు నోరు విప్పారు అంటూ హర్షాను సమర్ధిస్తూ ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment