టీమిండియా యంగ్ గన్ తిలక్ వర్మ.. తన ఆరాధ్య క్రికెటర్ సురేశ్ రైనా అడుగు జాడల్లో నడుస్తున్నాడు. బ్యాటింగ్ స్టయిల్, షాట్లు ఆడే విధానం, అటాకింగ్ శైలి.. ఇలా ప్రతి విషయంలో తిలక్, రైనాను ఫాలో అవుతున్నాడు.
రైనా కెరీర్ ఆరంభం ఎలా సాగిందో, తిలక్ కెరీర్ కూడా అచ్చుగుద్దినట్లు అలాగే సాగుతుంది. ఈ ఇద్దరి గణాంకాలు మక్కీ టు మక్కీ అన్నట్లుగా ఉన్నాయి. ఈ గణాంకాలను చూస్తే ఔరా అనక తప్పదు. ఈ గణాంకాలు చూసిన వారు రైనా జిరాక్స్ కాపీగా తిలక్ వచ్చాడని అంటున్నారు.
రైనా, తిలక్‌ల మధ్య పోలికలపై ఓ లుక్కేద్దాం..
- ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు మిడిలార్డర్‌లో అటాకింగ్ గేమ్ ఆడటానికి ఇష్టపడతారు, ఓ రకంగా చెప్పాలంటే అలా చేసి సక్సెస్ కూడా అయ్యారు.
- రైనా, తిలక్ ఇద్దరూ 20 ఏళ్ల వయసులోనే భారత్ తరఫున టీ20 అరంగేట్రం చేశారు.
- ఈ ఇద్దరూ టీ20 డెబ్యూ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకున్నారు.
- ఈ ఇద్దరూ తమతమ కెరీర్‌లలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 49 పరుగులతో అజేయంగా నిలిచారు.
- ఈ ఇద్దరి టీ20 కెరీర్‌లలో తొలి ఫిఫ్టి సాధించిన మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమిపాలైంది.
- రైనా, తిలక్ ఇద్దరూ తమ తొలి రెండు ఐపీఎల్ సీజన్లలో 350 ప్లస్ పరుగులు చేశారు.
- ఐపీఎల్ చరిత్రలో రైనా, తిలక్‌లు మాత్రమే ప్లే ఆఫ్స్‌లో 300 ప్లస్ స్ట్రయిక్‌రేట్ (40 ప్లస్ స్కోర్ చేసిన సందర్భాల్లో) కలిగి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment