భారత క్రికెట్ అభిమానులకు రిలయెన్స్ వారి జియో సినిమా శుభవార్త చెప్పింది. ఈ నెల 22, 24, 27 తేదీల్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జియో సినిమా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మ్యాచ్‌లను ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది.
ఈ సిరీస్ కోసం జియో సినిమా ప్రత్యేక కామెంటేటర్స్ ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇందులో సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ఆకాశ్ చోప్రా, అమిత్ మిశ్రా, హనుమ విహారి, కిరణ్ మోరె, అనిరుద్ శ్రీకాంత్, శరణ్‌దీప్ సింగ్ తదితర మాజీ భారత క్రికెటర్లు ఉన్నారు. సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సెప్టెంబర్ 22న మొహాలీలో, రెండో వన్డే సెప్టెంబర్ 24న ఇండోర్‌లో, మూడో వన్డేలో రాజ్‌కోట్‌లో జరుగనుంది.
భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ ముగియగానే భారత్‌లోనే వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. అక్టోబర్ 5న జరిగే ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది.
కాగా, రిలయెన్స్ అనుబంధ సంస్థ అయిన వయాకామ్18 బీసీసీఐ మీడియా హక్కులను 5963 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే నుంచే బీసీసీఐతో వయాకామ్ ప్రయాణం మొదలుకానుంది. వాయకామ్ సంస్థ రానున్న ఐదేళ్లలో (2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి) టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ ప్రసార హక్కులను కూడా సొంతం చేసుకుంది.
భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు స్పోర్ట్స్ 18 ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. ఇవే మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమా ఇదివరకే ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను (ఐపీఎల్ డిజిటల్ రైట్స్) కూడా దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment