Viacom18
-
రిలయన్స్ అనుబంధ సంస్థగా కొత్త కంపెనీ
మీడియా, ఎంటర్టైన్మెంట్ సంస్థ వయాకామ్18 (Viacom18) మీడియా అనుబంధ కంపెనీగా అవతరించినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) తాజాగా పేర్కొంది. తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే 24.61 కోట్ల ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను అదే సంఖ్యలో ఈక్విటీ షేర్లుగా మార్పు చేసినట్లు వెల్లడించింది.దీంతో ప్రత్యక్ష సబ్సిడియరీగా మారినట్లు తెలియజేసింది. ఇప్పటివరకూ రిలయన్స్ అనుబంధ కంపెనీ నెట్వర్క్18 మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్కు వయాకామ్18 మీడియా మెటీరియల్ సబ్సిడియరీగా వ్యవహరించేది. కాగా.. తాజా మార్పు కారణంగా వయకామ్18లో రిలయన్స్ వాటా 70.49 శాతం నుంచి 83.88 శాతానికి ఎగసింది.అంతకుముందు 2024 మార్చిలో పారామౌంట్ గ్లోబల్ నుంచి వయాకామ్18లో 13.01 శాతం వాటాను రిలయన్స్ చేజిక్కించుకుంది. ఇందుకు రూ. 4,286 కోట్లు వెచ్చించింది. ఈ ఏడాది నవంబర్ 14న వాల్ట్ డిస్నీ దేశీ మీడియా బిజినెస్‌తో రిలయన్స్ మీడియా విభాగాలను విలీనం చేయడంతో రూ. 70,000 కోట్ల విలువైన దేశీ మీడియా దిగ్గజం ఆవిర్భవించిన విషయం విదితమే. -
వయాకామ్18 బోర్డులో అంబానీలు
న్యూఢిల్లీ: గ్లోబల్ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ దేశీ బిజినెస్‌తో విలీనం నేపథ్యంలో తాజాగా ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు వయాకామ్18 బోర్డులో చేరారు. ముకేశ్ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్శన్ నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ బోర్డు సభ్యులుగా చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లకు హోల్డింగ్ కంపెనీగా వయాకామ్18 వ్యవహరిస్తోంది. స్టార్ ఇండియా విలీనానికి సీసీఐ, ఎన్సీఎల్టీ అనుమతులు లభించడంతో వాల్ట్ డిస్నీ, వయాకామ్18 బోర్డులో సర్దుబాట్లకు తెరలేచినట్లు తెలుస్తోంది. బోధి ట్రీ సిస్టమ్స్ సహవ్యవస్థాపకుడు జేమ్స్ మర్డోక్, కీలక ఇన్వెస్టర్ మహమ్మద్ అహ్మద్ అల్‌హర్డన్, ఆర్ఐఎల్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే, అనాగ్రామ్ పార్ట్నర్స్ పార్ట్నర్ శువ మండల్ సైతం బోర్డులో చేరనున్నారు. స్టార్ ఇండియాతో వయాకామ్18 మీడియా, డిజిటల్ 18 మీడియా విలీనానికి గత నెల(ఆగస్ట్) 30న ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనంపై ..సీసీఐకి రిలయన్స్ అభ్యర్ధన
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీనం ప్రక్రియను ముమ్మరం చేశారు. రూ.70వేల కోట్ల విలువైన ఎంటర్ టైన్మెంట్ విభాగానికి చెందిన ఆ రెండు సంస్థల్ని విలీనం చేసేందుకు గాను అనుమతి కావాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుండి క్లియరెన్స్‌ను అభ్యర్థించింది.పీటీఐ నివేదిక ప్రకారం..ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఖేష్ అంబానీ చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటుకు నిర్ణయించాయి. సంయుక్త సంస్థలో రిలయన్స్ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్ గురించి ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ ఫిబ్రవరిలో అధికారిక ప్రకటన విడుదల చేశాయి.ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్‌కు 16.34 శాతం, వయాకామ్ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు దఖలు పడనున్నాయి. -
Disney India: రిలయన్స్ చేతికే డిస్నీ..
భారత వ్యాపార ప్రపంచంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయోకామ్ మీడియా- వాల్ట్ డిస్నీల మధ్య విలీన ఒప్పందం జరిగింది. తర్వలోనే రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ వెంచర్లో రిలయన్స్ మీడియా యూనిట్ దాని అనుబంధ సంస్థలు విలీన సంస్థలో కనీసం 61 శాతం వాటాను కలిగి ఉండగా... మిగిలిన వాటా డిస్నీదేనని తెలుస్తోంది. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా, వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నాయి. ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి లేదంటే 2025 ప్రారంభం నాటికి విలీన ప్రక్రియ ముగియనుంది. విలీనానంతర స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్‌స్టార్, జియోసినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉండనున్నాయి. -
IND VS AUS: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త
భారత క్రికెట్ అభిమానులకు రిలయెన్స్ వారి జియో సినిమా శుభవార్త చెప్పింది. ఈ నెల 22, 24, 27 తేదీల్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జియో సినిమా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మ్యాచ్‌లను ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ సిరీస్ కోసం జియో సినిమా ప్రత్యేక కామెంటేటర్స్ ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇందులో సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ఆకాశ్ చోప్రా, అమిత్ మిశ్రా, హనుమ విహారి, కిరణ్ మోరె, అనిరుద్ శ్రీకాంత్, శరణ్‌దీప్ సింగ్ తదితర మాజీ భారత క్రికెటర్లు ఉన్నారు. సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సెప్టెంబర్ 22న మొహాలీలో, రెండో వన్డే సెప్టెంబర్ 24న ఇండోర్‌లో, మూడో వన్డేలో రాజ్‌కోట్‌లో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ ముగియగానే భారత్‌లోనే వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. అక్టోబర్ 5న జరిగే ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. కాగా, రిలయెన్స్ అనుబంధ సంస్థ అయిన వయాకామ్18 బీసీసీఐ మీడియా హక్కులను 5963 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే నుంచే బీసీసీఐతో వయాకామ్ ప్రయాణం మొదలుకానుంది. వాయకామ్ సంస్థ రానున్న ఐదేళ్లలో (2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి) టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ ప్రసార హక్కులను కూడా సొంతం చేసుకుంది. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు స్పోర్ట్స్ 18 ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. ఇవే మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమా ఇదివరకే ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను (ఐపీఎల్ డిజిటల్ రైట్స్) కూడా దక్కించుకుంది. -
‘వయాకామ్ 18’ చేతికి భారత క్రికెట్
మనం ఇంట్లో కూర్చున్నా... షాపుల్లో టీవీ ఆన్ చేసినా... టీమిండియా క్రికెట్ మ్యాచ్‌లు చూడాలంటే టీవీ రిమోట్‌తో ట్యూన్ చేసుకునేది స్టార్ స్పోర్ట్స్ చానెళ్లనే! అంతగా భారత్‌లో స్టార్ నెట్వర్క్ క్రికెట్ ప్రియుల మదిలో 11 ఏళ్లుగా (2012 నుంచి) తిష్ట వేసుకుంది. అయితే ఇప్పుడీ ట్రెండ్ మారనుంది. రిమోట్ తీసుకొని వయాకామ్ 18 నెట్వర్క్ చానెల్ ‘స్పోర్ట్స్ 18’కు మారాల్సిందే! న్యూఢిల్లీ: భారతీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థ రిలయన్స్ గ్రూప్ క్రికెట్ హక్కుల్ని కైవసం చేసుకొంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం నిర్వహించిన ఇ–వేలం (ఆన్లైన్)లో స్వదేశంలో జరిగే అంతర్జాతీయ, జాతీయ మ్యాచ్‌ల్ని ప్రత్యక్ష ప్రసారం చేసుకొనే మీడియా హక్కుల్ని ‘వయాకామ్ 18’ దక్కించుకుంది. 2023–28 ఈ ఐదేళ్ల కాలానికి గాను సుమారు రూ. 6,000 కోట్లు చెల్లించేందుకు బిడ్ గెలిచింది. డిస్నీప్లస్ స్టార్, సోనీ నెట్‌వర్క్‌లతో ముక్కోణపు పోటీలో పాల్గొన్న వయాకామ్ 18... టీవీ, డిజిటల్ రైట్స్ కోసం అత్యధికంగా రూ.5,963 కోట్లు (720.60 మిలియన్ డాలర్లు)తో బిడ్ దాఖలు చేసింది. దీంతో పోటీ ప్రసార సంస్థలకు రిలయన్స్ చేతిలో చుక్కెదురైంది. ♦ మీడియా రైట్స్‌లో టెలివిజన్, డిజిటల్ (ఓటీటీ యాప్స్) హక్కులున్నాయి. ఈ రెండింటి కోసం వేర్వేరు బిడ్లను స్వీకరించారు. టీవీ హక్కులకు రూ.2,862 కోట్లు (345.90 మిలియన్ డాలర్లు), డిజిటల్ హక్కులకు రూ.3,101 కోట్లు (374.70 మిలియన్ డాలర్లు) చెల్లించేందుకు వయాకామ్ 18 బిడ్లు వేసింది. ♦ గత 2018–23 కాలానికి ‘స్టార్ నెట్వర్క్’ రూ. 6,138 కోట్లు చెల్లించింది. అయితే గత ఐదేళ్లలో సొంతగడ్డపై భారత్ 102 మ్యాచ్‌లు ఆడింది. కానీ వచ్చే ఐదేళ్లలో 88 మ్యాచ్‌లే ఆడబోతోంది. ♦ గత మీడియా హక్కులతో పోలిస్తే ఇది 12.92 శాతం ఎక్కువ. అప్పుడు మ్యాచ్‌కు రూ. 60 కోట్లు చెల్లించారు. ఇకపై మ్యాచ్‌కు రూ.67.75 కోట్లు చెల్లించాలి. ♦ క్రితంసారి మూడు విభాగాల్లో బిడ్లను స్వీకరించారు. భారత ఉపఖండపు టీవీ రైట్స్–రెస్టాఫ్ వరల్డ్ డిజిటల్ రైట్స్, భారత ఉపఖండపు డిజిటల్ రైట్స్, గ్లోబల్ కన్సాలిడేటెడ్ రైట్స్‌గా వర్గీకరించారు. కానీ ఇప్పుడు అవుట్ రైట్‌గా టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ అని రెండు రకాల గ్లోబల్ రైట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు! ♦ ఈ నెల 22 నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే సిరీస్‌తో 2023–28 సైకిల్ మొదలవుతుంది. ♦ ఈ ఐదేళ్ల సైకిల్లో టీమిండియా 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టి20లు కలిపి మొత్తంగా 88 మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో 21 మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌తో 18 మ్యాచ్‌లు, కివీస్‌తో 11 మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికాతో 10 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. ♦ ‘వయాకామ్ 18’కు స్పోర్ట్స్ హక్కులు కొత్తేం కాదు. ఇంతకుముందే ఐపీఎల్ డిజిటల్ హక్కుల్ని పొందింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), పారిస్ ఒలింపిక్స్, దక్షిణాఫ్రికా మ్యాచ్ లు, దక్షిణాఫ్రికా లీగ్, టి10 లీగ్ (అమెరికా), రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్, ఎన్బీఏ, డైమండ్ లీగ్ తదితర ప్రపంచవ్యాప్త క్రీడల హక్కుల్ని కైవసం చేసుకుంది. ♦ ‘వయాకామ్ 18’ మీడియాలోని స్పోర్ట్స్ 18 టీవీ చానెల్లో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి జియో సినిమా యాప్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి. ‘స్టార్ స్పోర్ట్స్’కు శుభం కార్డు! రిలయన్స్ గ్రూప్ మీడియా హక్కులు దక్కించుకోవడంతో ‘స్టార్ స్పోర్ట్స్’కు శుభం కార్డు పడినట్లయింది. 2012 నుంచి ఇప్పటివరకు అంటే 11 ఏళ్లుగా భారత్‌లో జరిగిన అంతర్జాతీయ, జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు డిస్నీ ప్లస్ స్టార్ నెట్‌వర్క్‌లోనే ప్రసారమయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులు మాత్రం ‘స్టార్ స్పోర్ట్స్’ వద్దే ఉన్నాయి. -
వయాకామ్18 చేతికి బీసీసీఐ మీడియా హక్కులు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మీడియా హక్కులను వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన వయాకామ్18 సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ రానున్న ఐదేళ్లలో (2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి) టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ ప్రసార హక్కులను కూడా సొంతం చేసుకుంది. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు స్పోర్ట్స్ 18 ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. ఇవే మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమా ఇదివరకే ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను (ఐపీఎల్ డిజిటల్ రైట్స్) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 22న స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే నుంచి బీసీసీఐ కొత్త మీడియా పార్ట్నర్ ప్రయాణం మొదలుకానుంది. Congratulations @viacom18 🤝 for winning the @BCCI Media Rights for both linear and digital for the next 5 years. India Cricket will continue to grow in both spaces as after @IPL, and @wplt20, we extend the partnership @BCCI Media Rights as well. Together we will continue to… — Jay Shah (@JayShah) August 31, 2023 కాగా, ప్రస్తుతం బీసీసీఐ మీడియా (టీవీ) పార్ట్నర్గా స్టార్ స్పోర్ట్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థ 2012 నుంచి స్వదేశంలో జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాలీ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ వస్తుంది. ప్రస్తుతం బీసీసీఐ డిజిటల్ మీడియా పార్ట్నర్గా డిస్నీప్లస్ హాట్‌స్టార్ వ్యవహరిస్తుంది. Also a big thank you to @starindia @DisneyPlusHS for your support over the years. You played a key role in making India Cricket reach its fans across the globe. 2/2— Jay Shah (@JayShah) August 31, 2023 -
IPL 2023: తొలిరోజే అట్టర్‌ప్లాఫ్.. ఏకిపారేసిన అభిమానులు
ఐపీఎల్ 16వ సీజన్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఐపీఎల్‌ను ప్రసారం చేసే హక్కులను రెండు సంస్థలు తీసుకున్నాయి. టీవీ రైట్స్‌ను డిస్నీ స్టార్ దక్కించుకోవగా.. డిజిటిల్ సహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ రైట్స్‌ను రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18 కొనుగోలు చేసింది. డిస్నీ స్టార్ మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తే.. వయాకామ్ 18 మ్యాచ్‌లను జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం ఇవ్వడం మంచిదే అయినప్పటికి అభిమానులకు తొలిరోజే జియో సినిమాలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. తొలి రోజు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో ఇరజట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఇరుజట్ల ఆటగాళ్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. అయితే జియో సినిమాలో మ్యాచ్ చూసినవారికి మాత్రం కష్టాలు ఎదురయ్యాయి. ప్రతి పది నిమిషాలకోసారి సైట్ క్రాష్ అవడం లేదా బఫర్ అవడం జరిగింది. అభిమానులకు ఇది తలనొప్పిగా మారి మ్యాచ్‌ను కూడా సరిగ్గా వీక్షించలేకపోయారు. దీంతో జియో సినిమాపై అభిమానులు ట్విటర్ వేదికగా ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు. తొలిరోజే జియో సినిమా యాప్ అట్టర్‌ప్లాఫ్ అయింది.. పదేపదే అంతరాయం కలిగిస్తూ మ్యాచ్ చూడకుండా చేసింది.. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ జియో సినిమా.. ఐపీఎల్ 16వ సీజన్లో ఇదో కొత్త రూల్ అనుకుంటా.. ప్రతి 15 సెకన్లకు రీప్రెష్ చేయాల్సి వచ్చింది.. బఫరింగ్.. బఫరింగ్.. బఫరింగ్ ఇది తప్ప ఇంకేమి కనిపించలేదు అంటూ విరుచుకుపడ్డారు. Haven’t been able to connect at all @JioCinema - it hangs every time I try to watch live streaming of #CSKvsGT. I am on Airtel — Vikrant Gupta (@vikrantgupta73) March 31, 2023 Is this also a new IPL rule that you have to click refresh on #JioCinema after every 15 seconds? #IPL2023 pic.twitter.com/I6c1qZQKdb — ansHU MOR (@anshuMor) March 31, 2023 Buffering buffering buffering @JioCinema Very Bad experience with your app #IPLonJioCinema #JioCrash #IPL2023 pic.twitter.com/GkYOxGx68w — Mahendra Bhadru (@Itsmk33402293) March 31, 2023 Subpar commentary, poor watching experience :/#IPLonJioCinema could be a classic oversell case study. #JioCrash pic.twitter.com/oRXBdWUaUz — Harsh Joshi (@josharsh1) March 31, 2023 చదవండి: '#Ee sala Cup Nahi'.. జట్టు కెప్టెన్ అయ్యుండి ఆ మాట అనొచ్చా! -
వుమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్‌కు ఊహించని భారీ ధర
Women's IPL Media Rights: 2023-27 మహిళల ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన మీడియా హక్కులను వయాకామ్18 సంస్థ రికార్డు ధర (రూ.951 కోట్లు) కోట్ చేసి దక్కించుకుంది. బిడ్డింగ్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ నెట్వర్క్, అమెజాన్ ప్రైమ్ వంటి బడా కంపెనీలు పోటీ పడినప్పటికీ వయాకామ్18 ఎంతమాత్రం తగ్గకుండా టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్ ద్వారా వెల్లడించాడు. వయాకామ్18 సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి వుమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్‌ను సొంతం చేసుకోవడం శుభపరిణామమని, ఇది మహిళా క్రికెట్ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని షా ట్వీట్ చేశాడు. Congratulations @viacom18 for winning the Women’s @IPL media rights. Thank you for your faith in @BCCI and @BCCIWomen. Viacom has committed INR 951 crores which means per match value of INR 7.09 crores for next 5 years (2023-27). This is massive for Women’s Cricket 🙏🇮🇳 — Jay Shah (@JayShah) January 16, 2023 కాగా, మహిళల ఐపీఎల్‌ను బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది (2023) నుంచే ప్రవేశపెట్టాలని డిసైడైన విషయం తెలిసిందే. అరంగేట్రం సీజన్లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు బరిలోకి దిగబోతున్నాయి. ఈ ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు తెగ ఆసక్తి చూపుతున్నాయి. క్రికెటర్ల వేలం ప్రక్రియకు సంబంధించిన తేదీలు త్వరలోనే వెలువడనున్నాయి. క్రికెటర్లు వేలంలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు జనవరి 26 ఆఖరి తేదీగా ఉంది. మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్ వేలం ద్వారా బీసీసీఐకి ఒక్కో మ్యాచ్‌కు రూ.7.09 కోట్ల ఆదాయం సమకూరనుంది. -
ICC auction: అసంబద్ధ వేలంలో పాల్గొనలేం
ముంబై: భారత్‌లో ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలక్ట్రానిక్ వేలం (ఇ–వేలం) నిర్వహించేందుకు ప్రముఖ ప్రసారకర్తల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇ–వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో అస్పష్టమైన వివరాలే ఉన్నాయని, ఇలాంటి అసంబద్ధ టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని భారతీయ బ్రాడ్కాస్టర్లు డిస్నీ–స్టార్, వయాకామ్–18, సోనీ, జీ నెట్వర్క్ సంస్థలు ఐసీసీకి లేఖ రాశాయి. టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని లేఖలో కోరింది. ఇంచుమించు నాలుగు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు కూడా ఒకే రకంగా స్పందించాయి. ‘నాలుగు ప్రసారకర్తలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఐసీసీకి లేఖ రాశా యి. అమెజాన్ సంస్థ ఇందులో ఎలా ముందుకెళుతుందో అర్థం కావట్లేదు. స్పష్టతలేని అంశాలతో ఆ సంస్థ సంతృప్తిగా ఉందా లేదో తెలియదు. అలాంటపుడు ఆ సంస్థ ఎందుకంత ఉత్సాహంగా ముందకెళుతుందో మరి! మేం అయితే ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నాం. బిడ్లు దాఖలు చేయలేం’ అని ఓ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అధికారి తెలిపారు. ఐసీసీ కమిటీ మీటింగ్‌లలో పాల్గొనే భారత క్రికెట్ నియంత్రన మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా బ్రాడ్కాస్టర్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ మీడియా హ క్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన ఇ–వేలం ప్రక్రియను అనుసరించేందుకు ఐసీసీ ఆసక్తిచూపడం లేదు. -
మా లక్ష్యం అదే, ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌పై నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు!
2023 -2027 ఐదేళ్ల కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డిజిటల్ రైట్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ‘వయాకామ్–18’ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా క్రికెట్ లవర్స్‌ను ఉద్దేశిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ నీతా అంబానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో ప్రతీ క్రికెట్ అభిమానికి రిలయన్స్ సంస్థ వరల్డ్ క్లాస్ ఐపీఎల్ కవరేజ్‌ను అందించేందుకు కృషి చేస్తుందని అనున్నారు. ఇందు కోసం పూర్తి శక్తి సామర్ధ్యాల మేరకు పనిచేస్తామని అన్నారు. అంతేకాదు భారత్‌కు మరింత పేరును తెచ్చే ఈ ఐపీఎల్ లీగ్‌తో మా అనుబంధాన్ని పెంచుకోవడం మరింత గర్వకారణంగా ఉందని నీతా అంబానీ పేర్కొన్నారు. కాగా, క్రికెట్ అభిమానులకు అమిత వినోదాన్ని అందిస్తూ వస్తోన్న ఐపీఎల్ డిజిటల్ రైట్స్ కోసం జరిగిన వేలంలో ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ చెందిన ‘వయాకామ్–18’, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు 23,773 కోట్లకు సొంతం చేసుకోగా.. టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ మరోసారి చేజిక్కించున్న విషయం తెలిసిందే. THREE BIG WINS FOR VIACOM18: --TRIUMPHS WITH DIGITAL STREAMING RIGHTS FOR INDIAN SUBCONTINENT --ACQUIRES INDIA STREAMING RIGHTS FOR SPECIAL PACKAGE OF MATCHES --BAGS GLOBAL TV AND DIGITAL RIGHTS FOR MAJOR CRICKETING NATIONS #Viacom18 #NitaAmbani @flameoftruth @RelianceUpdates pic.twitter.com/7S2EsZBHZ1 — Pankaj Upadhyay (@pankaju17) June 16, 2022 -
IPL 2023: కోట్లు ఇచ్చారు... కోట్లు తెచ్చుకునేదెలా?
పెట్టుబడిగా పెట్టిన ప్రతీ రూపాయిపై కనీస లాభం సంపాదించడమే వ్యాపారం... ముంబైలో అంబానీ అయినా ఊర్లో కిరాణా కొట్టు నడిపే వ్యక్తి అయినా ఈ విషయంలో ఒకేలా ఆలోచిస్తారు. మరి ఐపీఎల్లో ప్రసారహక్కుల కోసం వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టిన సంస్థలు ఈ విషయంలో ఎలాంటి వ్యూహాలతో ఉంటాయి? ఐదేళ్ల కాలానికిగాను వారు చెల్లించబోయే మొత్తానికి ‘గిట్టుబాటు’ అవుతుందా! ప్రసార హక్కుల కోసమే మూడు వేర్వేరు సంస్థలు కలిపి బీసీసీఐకి రూ. 48,390.32 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐపీఎల్ ఎలా ఉండబోతోంది? కేవలం వ్యాపార ప్రకటనలతోనే తమ పెట్టుబడితో పాటు లాభాలను తీసుకోవడం ఈ సంస్థలకు సాధ్యమేనా! ఇంకా చెప్పాలంటే ఈ భారీ మొత్తం వల్ల ఐపీఎల్లో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఆసక్తికరం! రూ. 118.02 కోట్లు... టీవీ, డిజిటల్ విభాగాలు కలిపి చూస్తే ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు ప్రసారకర్తలు చెల్లించబోయే మొత్తం ఇది. ఇంకా వివరంగా చెప్పాలంటే 410 మ్యాచ్‌లలో మ్యాచ్‌కు 40 ఓవర్ల చొప్పున (ఎక్స్ట్రా బంతులు కాకుండా) 98,400 బంతులు... అంటే ఒక్కో బంతి విలువ అక్షరాలా 50 లక్షలు! టీవీలో అయితే ‘స్టార్’ సంస్థ ప్రతీ మ్యాచ్‌కు కనీసం రూ. 57.5 కోట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ‘వయాకామ్–18’ కంపెనీ ప్రతీ మ్యాచ్‌కు రూ. 50 కోట్ల కేవలం ప్రసార హక్కులకు మాత్రమే బీసీసీఐకి చెల్లించబోతోంది. దీనికి అదనంగా ఆయా సంస్థలకు బోలెడు ఖర్చులు! మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కోసం కెమెరాలు, ఇతర సాంకేతిక సౌకర్యాలు ఏర్పాటు, కామెంటేటర్లు, ఉద్యోగులకు చెల్లింపులు, ఇతర సాధారణ ఖర్చులకు సొంత డబ్బు వాడాల్సిందే. ఇలాంటి స్థితిలో ఒక్కో మ్యాచ్‌కు వారు ఆశించే మొత్తం తిరిగి రావడం సాధ్యమేనా! ప్రసారకర్తల కోసం ఐపీఎల్ వీక్షణంలో కూడా పలు మార్పులకు బీసీసీఐ అంగీకరించవచ్చు. ప్రకటనలే ప్రధానం... ఇన్నింగ్స్‌కు 2 చొప్పున ‘స్ట్రాటజిక్ బ్రేక్’లతో పాటు ఓవర్ల మధ్యలో విరామ సమయం తదితరాలు కలిపి ప్రస్తుతం ప్రకటనల కోసం గరిష్టంగా ఒక టి20 మ్యాచ్‌లో 2,400 సెకన్లు (40 నిమిషాలు) అందుబాటులో ఉన్నాయి. 2022 ఐపీఎల్ మ్యాచ్‌లకు 10 సెకన్ల ప్రకటనకు సుమారు రూ.15 లక్షల వరకు ‘స్టార్’ వసూలు చేసింది. దీంతో పాటు ‘కో ప్రజెంటర్’ పేరుతో గరిష్టంగా ఒక్కో వ్యాపార సంస్థ నుంచి రూ. 180 కోట్ల వరకు... అసోసియేట్ స్పాన్సర్ ద్వారా గరిష్టంగా రూ. 105 కోట్ల వరకు తీసుకుంది. ఇతర అనుబంధ అంశాలు (ఫోర్లు, సిక్స్‌లు, ఫాస్టెస్ట్ బాల్) తదితరాల ద్వారా మరో రూ. 300 కోట్లు, హైలైట్స్ ప్యాకేజీల ద్వారా రూ. 200 కోట్ల వరకు అదనంగా ‘స్టార్’ ఖాతాలో చేరాయి. ఇది ఐపీఎల్ ప్రకటనలకు సంబంధించి తాజా పరిస్థితి. సాధారణంగా ప్రతీ ఏటా ఐపీఎల్ ప్రకటనల రేటు సుమారు 10–15 శాతం పెరుగుతోంది. అయితే ఇప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం చూస్తే ఇది సరిపోదు. కనీసం 80 శాతం వరకు రేటు పెంచాల్సి ఉంటుంది. ఇది అంత సులు వేమీ కాదు. లీగ్‌పై ఎంత క్రేజ్ ఉన్నా... ప్రకటన దారులు అంత సులువుగా ముందుకొస్తారా అనేది ప్రశ్న. ఈ ఏడాదితో పోలిస్తే మున్ముందు మ్యాచ్‌ల సంఖ్య పెరగడం సానుకూలాంశం కాగా... అభిమానులు రెండున్నర నెలలు సుదీర్ఘంగా సాగే లీగ్‌పై ఒకే స్థాయిలో ఆసక్తి చూపిస్తారా అనేది సందేహమే. 2022లోనే వ్యూయర్షిప్ 30 శాతం తగ్గినా... దాని ప్రభావం తాజా వేలంపై పడలేదు కాబట్టి సమస్య గా అనిపించలేదు. కానీ మున్ముందు చెప్పలేం. అయితే అన్ని లెక్కలు చూసుకున్నాకే పెద్ద సంస్థలు హక్కుల కోసం బరిలోకి దిగి ఉంటాయి. కాబట్టి బయటకు కనిపించని లెక్కలూ ఉండవచ్చు! ఇలా కూడా జరగొచ్చు... ఇంత భారీ మొత్తానికి హక్కులు అమ్మిన తర్వాత రాబోయే సీజన్లలో ప్రసారకర్తల భిన్న డిమాండ్లను బోర్డు సహజంగానే గౌరవించాల్సి రావచ్చు. ‘స్ట్రాటజిక్ టైమౌట్’లను 5 ఓవర్లకు ఒక్కోసారి చొప్పున మ్యాచ్‌కు ఆరు వరకు పెరిగే అవకాశం ఉంది. మ్యాచ్‌లో ఎక్కడ వీలైతే అక్కడ ప్రకటనలు పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సహజంగానే మ్యాచ్ వ్యవధి కూడా పెరగడం ఖాయం. కాస్త వ్యంగ్యంగా చెప్పాలంటే ప్రకటనల మధ్యలో ఐపీఎల్ మ్యాచ్ చూడాల్సి రావచ్చు! డిజిటల్ కోసం భారీ మొత్తం చెల్లించిన ‘రిలయన్స్’ ఐపీఎల్ కోసం ఎక్కువ మొత్తంతో ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేసే అవకాశమూ ఉంది. ఈ భారీ ఒప్పంద ప్రభావం పడే కీలక అంశాన్ని చూస్తే ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక టి20 సిరీస్‌లకు మంగళం పలికినట్లే! ఐపీఎల్ ప్రభావం, దానితో ముడిపడి ఉన్న డబ్బు, ఐసీసీని శాసించగలిగే బీసీసీఐని చూస్తే ప్రపంచకప్‌లో మినహా ఇతర అంతర్జాతీయ టి20లు కనిపించకపోవచ్చు. అన్నింటికి మించి ఫాంటసీ లీగ్‌లు, క్రికెట్ బెట్టింగ్ మరింతగా విజృంభించడం ఖాయం! సాక్షి క్రీడా విభాగం -
ముగిసిన ఐపీఎల్ వేలం.. 'స్టార్' చేతికి టీవీ ప్రసార హక్కులు
గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మంగళవారంతో ముగిసింది. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ నెట్‌వర్క్‌తో రసవత్తరంగా సాగిన పోటీలో స్టార్ నెట్వర్క్ పైచేయి సాధించింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకు టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ రూ.23,575 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ చెందిన ‘వయాకామ్–18’, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు 23,773 కోట్లకు సొంతం చేసుకోగా.. టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ మరోసారి చేజిక్కించుకుంది. 2018-22 సీజన్లో స్టార్ నెట్వర్క్ తొలిసారి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను దక్కించుకుంది. మొత్తంగా ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి 48,390.52 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జరిగిన బిడ్డింగ్‌లో వయాకామ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమెజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడగా స్టార్ నెట్వర్క్ భారీ మొత్తం చెల్లించి మీడియా హక్కులను సొంతం చేసుకుంది. చదవండి: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డు బద్దలు కొట్టిన ఐపీఎల్ -
కాసుల వర్షం కురిపిస్తున్న బిగ్‌బాస్ షో...!
ముంబై: బిగ్‌బాస్ ఒక రియల్టీ గేమ్ షో. దేశ వ్యాప్తంగా బిగ్‌బాస్ టెలివిజన్ రంగంలో కొత్త రికార్డులను నమోదు చేసింది. బిగ్ బాస్ షోను తొలిసారిగా హిందీ భాషలో స్ట్రీమ్ అవ్వగా...హిందీలో బిగ్‌బాస్ విజయవంతంకావడంతో నిర్వాహకులు ఇతర భాషలో కూడా వచ్చేవిధంగా పలు చర్యలను తీసుకున్నారు. బిగ్‌బాస్ దేశవ్యాప్తంగా హిందీతో పాటుగా మిగతా ఆరు భాషలో ఈ షో విజయవంతంగా నడుస్తోంది. బిగ్‌బాస్‌ను హిందీ, కన్నడ, బంగ్లా, తెలుగు, మరాఠీ, మలయాళం, తమిళ భాషల్లో ఎండెమోల్ షైన్ ఇండియా నిర్మిస్తుంది. చదవండి: Bigg Boss: బాస్‌లకే బాస్ అసలైన బిగ్‌బాస్ ఇతనే తాజాగా బిగ్‌బాస్ ఓటీటీ షోను ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్ 18 వూట్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమ్ చేస్తుంది. గత ఏడాది కలర్స్ ఛానల్లో బిగ్‌బాస్ -14 స్ట్రీమ్ అయినప్పుడు సుమారు 3.9 బిలియన్ల నిమిషాలపాటు ఆడియన్స్ చూశారు. ప్రస్తుతం వూట్‌లో వస్తున్న ఈ షోకు ఆడియన్స్ మంచి ఆదరణ వస్తోంది. ప్రతి వారం 1.5-2 మిలియన్ల యూజర్లు బిగ్‌బాస్ ఓటీటీ షోను చూడడానికి వస్తోన్నట్లు తెలుస్తోంది. యూజర్లలో ఎక్కువగా 15-30 వయసు ఉన్న వారు ఉన్నారు. వయాకామ్ 18 మీడియా చేసిన ఓటీటీ ప్రయోగం విజయవంతమైనట్లు కంపెనీ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ రక్షిత్ పేర్కొన్నారు. వూట్ ను వాడే యూజర్లు ఏకంగా రెట్టింపుఐన్నట్లు వెల్లడించారు. ప్రముఖ ఓటీటీలకు పోటీగా... బిగ్‌బాస్ ఓటీటీ రాకతో వూట్ దశ మారింది. భారత్‌లో ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువగా ప్రజాదరణను పొందాయి. బిగ్‌బాస్ ఓటీటీ ను వూట్‌లో ప్రసారం చేయడంతో ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంకు వ్యూయర్షిప్ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఓటీటీ షోను వూట్ యాడ్స్‌ను అందిస్తూ ఉచితంగా చూసే వీలు కల్పించింది. బిగ్‌బాస్ ఓటీటీ షో లో స్విగ్గి, కాయిన్‌డీసీఎక్స్ వంటి కంపెనీలు యాడ్స్‌ను షోలో ప్రదర్శించడానికి ముందుకువచ్చాయి. బిగ్‌బాస్ ఓటీటీ షో వూట్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. అడ్వటైజింగ్ నిపుణుల ప్రకారం బిగ్‌బాస్ ఓటీటీ ప్రకటనల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఓటీటీ గత నెల ఆగస్టు 8న ప్రారంభమవ్వగా...షోకు వ్యాఖ్యాతగా నిర్మాత కరణ్ జోహర్ వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్-15 షోకు కర్టన్‌రైజర్‌గా బిగ్‌బాస్ ఓటీటీ షో ఆరు వారాలపాటు వూట్‌లో స్ట్రీమ్ కానుంది. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
స్టార్స్ సీక్రెట్స్ బయటపెడతాను
‘‘నేను చేసిన ఏ షో అయినా నేను కాకుండా వేరే ఎవరూ చేయలేరు. నేను చేసిన షోలకు వచ్చిన సెలబ్రిటీలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో వారికి తెలుసు కాబట్టి నేను మాత్రమే చేయగలను అని గట్టిగా చెబుతున్నాను’’ అంటున్నారు ప్రముఖ నటి, నిర్మాత, హోస్ట్ లక్ష్మీ మంచు. ‘ఊట్’ అనే యాప్ ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్లో ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్ తెలుగు’ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారామె. ఈ నెల 23వ తేదీ నుండి ‘కలర్స్ తెలుగు’ అనే బ్రాండ్ పేరుతో ఈ షో విడుదల అవుతుంది. ‘‘బాలీవుడ్‌కి చెందిన ప్రసిద్ద ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కంపెనీ వయాకామ్ 18తో అసోసియేట్ అయి, ఇంత మంచి షో నిర్వహించటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు లక్ష్మీ. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పలు విషయాలు చెప్పారామె. ► బాలీవుడ్లో ఇలాంటి షోలు చేయటం చాలా ఈజీ. ఎందుకంటే అక్కడి స్టార్స్ వారి స్టార్డమ్తో పాటు పర్సనల్ లైఫ్‌ను షేర్ చేసుకోవటానికి ఇష్టపడతారు. కానీ, ఇక్కడి పరిస్థితి వేరు. రీల్ లైఫ్‌లో హీరో అంటే రియల్ లైఫ్‌లో కూడా హీరోలా ఉండాలని కోరుకుంటారు. వృత్తిపరంగా వాళ్లు హీరోలు, హీరోయిన్లే. వ్యక్తిగతంగా చాలా మంచి హ్యూమన్ బీయింగ్స్. ఆ కోణాన్ని బయటకు తీసే ప్రయత్నమే నా షో. మొదటిసారి ఇలాంటి ఒక షోను నేను తెలుగులో ప్రముఖ తారలతో చేస్తున్నాను. అది నా క్రెడిట్. ► ఒక బెడ్ మీద సెలబ్రిటీస్‌తో ఇంటర్వూ అంటే ఎలా ఉంటుందో అని మొదట నేనే కొంచెం జంకాను. కానీ షోకి వచ్చిన స్టార్స్ అంతా కంఫర్టబుల్‌గా ఫీలయ్యారు. ఈ షూటింగ్ బెడ్ సెట్ మా ఇంట్లోనే వేశాం. కారణం భారతదేశంలోని ప్రముఖ నటీనటులంతా ఎన్నోసార్లు ఈ ఇంట్లో భోజనం చేశారు. వాళ్లంతా తిరిగిన ఈ ఇల్లు నాకు దేవాలయంతో సమానం. అంతేకాకుండా ఫ్రీ కూడా. సమంత ఈ షోకు వచ్చినప్పుడు, ‘‘పాపా.. నీ పని బాగుంది. పై నుంచి క్రిందకు దిగితే లొకేషన్. మేం రోజూ నిద్ర లేవగానే షూటింగ్ లొకేషన్ అంటూ ఎక్కడెక్కడికో వెళ్లాలి’ అంది. ► నేను చేసే ప్రతి షో ద్వారా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. లక్ష్మీ టాక్ షోలో అడిగిన ప్రశ్నలను ఈ షోలో అడగను. సెలబ్రిటీస్ కొన్ని వందల ఇంటర్యూలు ఇచ్చి ఉంటారు. ఆ ఇంటర్వూల్లో చెప్పినవి నా షోలో ఉండవు. అంతకుమించి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. కానీ, నా షోకి వాళ్లను నైట్ డ్రెస్‌లో రమ్మన్నాను. అది వాళ్లకి, నాకు మధ్యలో ఉన్న సాన్నిహిత్యం అని చెప్పొచ్చు. ► ఏ సెలబ్రెటీ లైఫ్ అయినా ప్రతి ఆరు నెలలకోసారి మారుతుంది అనుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి సమంతానే తీసుకుందాం. చైతూతో పెళ్లికి ముందు ఓలాగా, పెళ్లి తర్వాత లైఫ్ ఓలాగా ఉంటుంది. ప్రభాస్‌ని తీసుకుంటే ‘బాహుబలి’ ముందు, తర్వాత అని చెప్పాలి. అవే నా షోలో అందంగా అడుగుతాను. ఈ ఇంటర్వూ వల్ల ఎవరి ఇమేజ్ మారదు. ఇట్స్ ఏ సింపుల్, ఫన్, హార్ట్ వార్మింగ్ షో మాత్రమే. ► ఇదే షోను పొలిటికల్ వాళ్లతో చేయలేం. వాళ్లంటే నాకు భయం. బెడ్ మీద కూర్చుని ఇంటర్వూ అంటే చాలా కష్టం. కానీ వాళ్లతో కావాలంటే కార్ డ్రైవ్ చేస్తూ ఇంటర్వూ చేస్తాను. నేను గతంలో వెబ్ సిరీస్ చేశాను. అది చాలా కష్టం. నాలుగు సినిమాలు చేసినంత కష్టంగా ఉంటుంది. ► ఇప్పటివరకు చేసిన అందరిలో వరుణ్ తేజ్ ఎపిసోడ్ చాలా బోల్డ్‌గా వచ్చింది. నానీతో త్వరలో షూట్ చేస్తాను. నాకున్న బలం ఏంటంటే.. చాలామంది ఆడవాళ్లు నా దగ్గరకొచ్చి ‘థ్యాంక్స్ లక్ష్మీ.. నీ వల్ల నేను నాకు ఇష్టం వచ్చినట్లు హ్యాపీగా ఉంటున్నాను’ అంటారు. అప్పుడు నేను గెలిచాను అనిపిస్తుంది. ► ప్రస్తుతం ప్రపంచం చిన్నగా అయిపోయింది. ఒకప్పుడు మా నాన్న ఊటీలో షూటింగ్లో ఉంటే మేము ఫోన్ పక్కన కూర్చుని ఎదురు చూసేవాళ్లం. ఇప్పుడు హాలీవుడ్ తార కిమ్ కర్దషియాన్ తన బెడ్ రూమ్‌లో ఏం చేస్తుందో నేను నా బెడ్ రూమ్‌లో కూర్చుని చూస్తున్నానంటే ప్రపంచం ఎంత చిన్నదైందో చూడండి. మన ట్రెడిషన్ వదులుకోకుండా మారుతున్న పరిస్థితులను బట్టి మనమూ మారుతుండాలి. ► నా కూతుర్ని నీవు అమ్మాయా, అబ్బాయా అని అడిగితే నేను మనిషిని అని చెబుతుంది. ఎందుకు చెబుతున్నానంటే ప్రపంచం మారుతుంది. ఫీట్ అప్ అంటేనే ఇంకొంచెం దగ్గరిగా కంఫర్ట్‌గా ఉండటం అని. నా షోలో చాలా సీక్రెట్స్ ఉంటాయి. అవి బయటకు వస్తాయి. -
సెలబ్రిటీస్ బెడ్‌స్టోరీస్‌తో వస్తున్నా: మంచు లక్ష్మి
సాక్షి, హైదరాబాద్ : సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంలో చాలా మంది ఇంట్రస్ట్ చూప్తిస్తారు. ముఖ్యంగా సినిమా తారలపై ఉన్న ఆరాధనాభావంతో వాళ్లకు గుళ్లు కట్టిన సందర్భాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ అభిమానం కేవలం సినిమాల వరకే పరిమితం కాదు..తమ అభిమాన హీరోహీరోయిన్లు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏం చేస్తుంటారా అనే విషయాల గురించి కూడా ఫ్యాన్స్ ఆలోచిస్తుంటారు. సాధారణంగా అయితే తారలకు సంబంధించిన డే టైమ్ ముచ్చట్లు అందరికీ తెలిసిపోతాయన్న సంగతి తెలిసిందే. కానీ సెలబ్రిటీస్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది.. వాళ్లు బెడ్ పైకి చేరిన తర్వాత వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది.. ఆ రోజంతా వారికి ఎలా గడిచింది.. ఇలాంటి అంశాలతో పాటు.. ఇప్పటివరకూ ఎవరికీ చెప్పని, తెలియని విషయాలను కూడా తెలసుకోవాలనుకునే ఆసక్తి సహజంగానే ఉంటుంది. అలాంటి వారికోసం బాలీవుడ్లో ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అంటూ ఓ క్రేజీ షో వస్తోంది. కాస్త ఫన్, క్రేజీ, ఇంకాస్త హాట్‌గా ఉండే ఎన్నో విషయాలను ఫిల్మ్ స్టార్లు ఈ కార్యక్రమంలో షేర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి స్పైసీ షో రాబోతోంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షో త్వరలోనే తెలుగులో ప్రసారం కాబోతోంది. సింపుల్ గా చెబితే వీటిని ‘బెడ్ టైమ్ స్టోరీస్’అనుకోవచ్చు. లేదా బెడ్ టైమ్ ఇంటర్వ్యూ అని కూడా అనుకోవచ్చు. మంచు లక్ష్మి హోస్ట్‌గా వయాకామ్ 18 ఈ క్రేజీ షోను నిర్వహించనుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘ఫీట్ అప్ విత్ స్టార్స్ తెలుగు వెర్షన్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలవుతున్నాను. ఈ షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంది. మన అభిమాన సెలబ్రిటీస్ భావాలను, రహస్యాలను తెలుసుకునేందుకు ఇది ఓ పర్ఫెక్ట్ సెట్టింగ్. అభిమాన తారలను ఫ్యాన్స్‌కు దగ్గరగా చేస్తూ వినోదాత్మకంగా సాగి పోయే విధంగా షోను నడిపించేందుకు ప్రయత్నిస్తాను. సెలబ్రిటీల్లో నాకు ఎంతో మంది స్నేహితులు కూడా ఉన్నారు.. వాళ్లందరితోనూ చేసే సంభాషణల కోసం ప్రేక్షకులతో పాటు నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నాతో పాటు.. సెలబ్రిటీలకు కూడా ఇదో సరికొత్త అనుభవంగా మారబోతోంది’’ అన్నారు. కాగా ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ షో కోసం ఇప్పటికే చాలామందికి నచ్చే తారలతో ఇంటర్వ్యూలు సిద్ధంగా ఉన్నాయని.. ఇలాంటి సెన్సేషనల్ షో కోసం అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నామని వయాకామ్ 18 ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘దేవదాస్’తో బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ..!
ముంబాయి కి చెందిన ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్ 18 మీడియా ప్రతిష్టాత్మక వైజయంతి సంస్థతో చేతులు కలిపింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో నిర్మిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ దేవదాస్ చిత్రానికి వయాకామ్ 18 భాగస్వామిగా దక్షిణాది చిత్ర సీమలో అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ, వయాకామ్ 18తో భాగస్వామి గా కావడం చాలా ఆనందంగా ఉంది. వారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. దేవదాస్ తో దక్షిణాది చిత్ర సీమ లోకి ప్రవేశిస్తున్న వారికి టాలీవుడ్ తరపున ఘన స్వాగతం పలుకుతున్నాం’ అన్నారు. వయా కామ్ 18 సీఓఓ అజిత్ అంధారే మాట్లాడుతూ, ‘అశ్వినిదత్ గారి ప్రఖ్యాత వైజయంతి మూవీస్ సంస్థ భాగస్వామ్యం లో భారీ చిత్రం దేవదాస్ తో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. మా సంస్థ తెలుగులో అనేక దశాబ్దాల అనుభవం ఉన్న దత్ గారు, వైజయంతి మూవీస్ భాగస్వామ్యం తో మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తాం. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిల కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న, అందరూ ఎంత గానో ఎదురు చూస్తున్న దేవదాస్ తో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంద’న్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మిథాలీరాజ్‌గా...
అటు బాలీవుడ్‌లోనూ ఇటు దక్షిణాదిలోనూ బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు అజహ రుద్దీన్, ధోనీ, సచిన్‌ల బయోపిక్‌లతో సినిమాలొచ్చాయి. తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ రూపొందనుందట. ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో సమంత నటించనున్నారని సమాచారం. ప్రియాంకా చోప్రాతో ‘మేరీకోమ్’ బయోపిక్‌ను నిర్మించిన వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ మిథాలీ బయోపిక్‌ను పలు భాషల్లో రూపొందించనుందట. మిథాలీ పాత్రకు సమంత న్యాయం చేయగలరని వయాకామ్ సంస్థ ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మరి.. మిథాలీ రాజ్ బయోపిక్ లో నటించేందుకు సమంత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా? వెయిట్ అండ్ సీ. -
మణిపూర్ లో 'మేరి కోమ్' ఎందుకు విడుదల కాలేదు?
బాక్సింగ్ చాంఫియన్ మేరి కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం స్వంత రాష్ట్రం మణిపూర్ లో విడుదలకు నోచుకోకపోవడంపై ఆ ప్రాంతవాసులు నిరాశకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై అందర్ని ఆకట్టుకుంటున్న మేరి కోమ్ చిత్రాన్ని మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో విడుదల చేయించేందుకు అన్లర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా విడుదలైన ఈ చిత్రాన్ని మణిపూర్ లో విడుదల చేయించేందుకు చిత్ర సహనిర్మాతలు వాయాకామ్18 మోషన్ పిక్చర్స్ ను మేరి కోమ్ భర్త ఆన్లర్ సంప్రదించారు. ఈ చిత్ర విడుదల కోసం మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఐబోబీ సింగ్ కార్యాలయ అధికారులతో కలిసి చర్చలు జరుపుతున్నారు. 'మేరి కోమ్ చిత్ర విడుదలకు సాధ్యమయ్యేంత వరకు కృషి చేస్తున్నాం. ఏమవుతుందో చూద్దాం' అని వాయాకామ్18 ప్రతినిధి అన్నారు. గత కొద్దికాలంగా మణిపూర్ లోని ఉగ్రవాద సంస్థలు హిందీ చిత్రాల పదర్శనపై నిషేధం విధించారు. ప్రపంచమంతటా ఈ చిత్రాన్ని చూస్తున్నారు. మణిపూర్ లో ప్రదర్శనకు నోచుకోకపోవడంపై బాధగా ఉందని మేరి కోమ్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకైనా మంచిది ప్రదర్శించకపోవడమే మంచిదనుకుంటున్నాను. ఈ చిత్ర విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నానని మేరి కోమ్ అన్నారు. ఇటీవల ముంబైలో ప్రదర్శించిన ప్రీమియర్ షోను మేరి కోమ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, బాక్సింగ్ విద్యార్ధులు చూశారు. బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా నటించిన 'మేరి కోమ్' చిత్రం శుక్రవారం విడుదలై.. విమర్శకుల ప్రశంసలందుకుంటోంది.