మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వయాకామ్18 (Viacom18) మీడియా అనుబంధ కంపెనీగా అవతరించినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) తాజాగా పేర్కొంది. తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే 24.61 కోట్ల ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను అదే సంఖ్యలో ఈక్విటీ షేర్లుగా మార్పు చేసినట్లు వెల్లడించింది.
దీంతో ప్రత్యక్ష సబ్సిడియరీగా మారినట్లు తెలియజేసింది. ఇప్పటివరకూ రిలయన్స్ అనుబంధ కంపెనీ నెట్‌వర్క్18 మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు వయాకామ్18 మీడియా మెటీరియల్ సబ్సిడియరీగా వ్యవహరించేది. కాగా.. తాజా మార్పు కారణంగా వయకామ్18లో రిలయన్స్ వాటా 70.49 శాతం నుంచి 83.88 శాతానికి ఎగసింది.
అంతకుముందు 2024 మార్చిలో పారామౌంట్ గ్లోబల్ నుంచి వయాకామ్18లో 13.01 శాతం వాటాను రిలయన్స్ చేజిక్కించుకుంది. ఇందుకు రూ. 4,286 కోట్లు వెచ్చించింది. ఈ ఏడాది నవంబర్ 14న వాల్ట్ డిస్నీ దేశీ మీడియా బిజినెస్‌తో రిలయన్స్ మీడియా విభాగాలను విలీనం చేయడంతో రూ. 70,000 కోట్ల విలువైన దేశీ మీడియా దిగ్గజం ఆవిర్భవించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment