subsidiary company
-
టెక్ మహీంద్రా కంపెనీ ‘కామ్వివా’కి కొత్త సీఈవో
టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ అయిన డిజిటల్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కామ్‌వివాకి కొత్త సీఈవో నియమితులయ్యారు. రాజేష్ చంద్రమణిని సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.2024 మేలో పదవీ విరమణ చేసిన మనోరంజన్ 'మావో' మహాపాత్ర నుంచి రాజేష్ చంద్రమణి పగ్గాలు చేపట్టారు. కాగా కామ్వివా బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మహాపాత్ర కొనసాగుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.రాజేష్ చంద్రమణి గతంలో టెక్ మహీంద్రాలో సీనియర్ నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఆయన అక్కడ కమ్యూనికేషన్స్, మీడియా & ఎంటర్టైన్మెంట్ విభాగంలో యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, జపాన్, భారత్‌లో వ్యూహాత్మక మార్కెట్లకు బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేశారు. -
వేదాంతా ఐరన్, స్టీల్ బిజినెస్ షురూ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్‌ల విడదీత ప్రణాళికల్లో భాగంగా వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ పేరుతో పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 1 ముఖ విలువగల లక్ష ఈక్విటీ షేర్ల అధీకృత మూలధనంతో సంస్థకు తెరతీసింది. గత నెల 29న ప్రకటించిన బిజినెస్‌ల విడదీత ప్రణాళికలకు అనుగుణంగా ఐరన్, స్టీల్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసినట్లు వేదాంతా వెల్లడించింది. విభిన్న విభాగాలైన అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్ తదితరాలను 5 కంపెనీలుగా విడదీసేందుకు గత నెలలో వేదాంతా నిర్ణయించిన విషయం విదితమే. తద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇనుము, స్టీల్ బిజినెస్ నిర్వహణకు తాజాగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే బుధవారం వేదాంతా బేస్ మెటల్స్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థకు తెరతీసిన సంగతి తెలిసిందే. -
రెలిగేర్‌లో 11 అనుబంధ సంస్థల విలీనం
న్యూఢిల్లీ: రెలిగేర్ ఎంటర్ప్రైజెస్.. తన 11 పూర్తి స్థాయి అనుబంధ కంపెనీలను విలీనం చేసుకోనున్నది. ఈ మేరకు మంగళవారం కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయం తీసుకుంది. కంపెనీ కార్పొరేట్ వ్యవస్థీకరణను సరళీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. విలీనం కానున్న ఆ 11 కంపెనీలు... రెలిగేర్ సెక్యూరిటీస్(బ్రోకింగ్ బిజి నెస్ మినహాయింపు), రెలిగేర్ కమోడిటీ బ్రోకింగ్, ఆర్జీఏఎమ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రెలిగేర్ వెంచర్ క్యాపిటల్, రెలిగేర్ ఆర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, రెలిగేర్ క్యాపిటల్ ఫైనాన్స్, ఆర్జీఏఎమ్ క్యాపిటల్ ఇండియా, రెలిగేర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రెలిగేర్ సపోర్ట్ సర్వీసెస్, రెలిగేర్ ఆర్ట్స్ ఇనీషియేటివ్, రెలిగేర్ క్యాపిటల్ మార్కెట్స్(ఇండియా) .. ఈ విలీన వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ షేర్ 4.3 శాతం వృద్ధితో రూ.249 వద్ద ముగిసింది.