వయాకామ్‌18 చేతికి బీసీసీఐ మీడియా హక్కులు | Viacom 18 Bags BCCI Rights For Both Digital And TV | Sakshi
Sakshi News home page

వయాకామ్‌18 చేతికి బీసీసీఐ మీడియా హక్కులు

Published Thu, Aug 31 2023 4:36 PM | Last Updated on Thu, Aug 31 2023 5:23 PM

Viacom 18 Bags BCCI Rights For Both Digital And TV - Sakshi

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మీడియా హక్కులను వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీకి చెందిన వయాకామ్‌18 సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ రానున్న ఐదేళ్లలో (2023 సెప్టెంబర్‌ నుంచి 2028 మార్చి) టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్‌ ప్రసార హక్కులను కూడా సొంతం చేసుకుంది.

భారత క్రికెట్‌ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు స్పోర్ట్స్‌ 18 ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. ఇవే మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్‌ స్ట్రీమింగ్‌ కానున్నాయి. జియో సినిమా ఇదివరకే ఐపీఎల్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ హక్కులను (ఐపీఎల్‌ డిజిటల్‌ రైట్స్‌) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్‌ 22న స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే నుంచి బీసీసీఐ కొత్త మీడియా పార్ట్‌నర్‌ ప్రయాణం మొదలుకానుంది.

కాగా, ప్రస్తుతం బీసీసీఐ మీడియా (టీవీ) పార్ట్‌నర్‌గా స్టార్‌ స్పోర్ట్స్‌ ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థ 2012 నుంచి స్వదేశంలో జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాలీ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ వస్తుంది. ప్రస్తుతం బీసీసీఐ డిజిటల్‌ మీడియా పార్ట్‌నర్‌గా డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ వ్యవహరిస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement