
2024-25 సంవత్సరానికి గానూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను (34 మంది) విడుదల చేసింది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
BCCI announces annual player retainership 2024-25 - Team India (Senior Men)#TeamIndia
Details 🔽https://t.co/lMjl2Ici3P pic.twitter.com/CsJHaLSeho— BCCI (@BCCI) April 21, 2025
సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడింది. ఇందులో ఏ ప్లస్ కింద విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.
గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.
గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.
గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.

ఈ ఏడాది కొత్తగా కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్
ఈ ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్
ఈ ఏడాది పదోన్నతి పొందిన ఆటగాడు: రిషబ్ పంత్ (బి కేటగిరి నుండి ఏ కేటగిరికి)
రిటైర్డ్ అయిన ఆటగాడు: రవిచంద్రన్ అశ్విన్ (కేటగిర ఏ నుంచి ఔట్)