భారత క్రికెట్ అభిమానులు ఊహించిందే నిజమైంది. రంజీల్లో ఆడమని ఎంత చెప్పినా వినకుండా విర్రవీగిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. తాజాగా ప్రకటించిన బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరి పేర్లు గల్లంతయ్యాయి.
ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన ఆటగాళ్లలో రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా ఏ ప్లస్ స్థానాలను నిలుపుకోగా.. బి కేటగిరి నుంచి శ్రేయస్, సి కేటగిరి నుంచి ఇషాన్ తొలగించబడ్డారు. గతకొంతకాలంగా జట్టులో లేనప్పటికీ హార్దిక్ పాండ్యా ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌ను నిలుపుకోగా.. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు ప్రమోషన్ (బి నుంచి ఏ కేటగిరి) దక్కింది.
యశస్వికి జాక్‌పాట్..
గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది.
కాంట్రాక్ట్ కోల్పోయిన వారు వీరే..
బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో చాలా మంది పేర్లు కనపడలేదు. యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు.
అక్షర్, పంత్‌లకు డిమోషన్ (ఏ నుంచి బి)
కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకున్న తిలక్ వర్మ, రింకూ సింగ్
కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కనున్న మొత్తం..
ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.
2023-24 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు..
- ఏ ప్లస్ కేటగిరి: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
- ఏ కేటగిరి: అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా
- బి కేటగిరి: సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్
- సి కేటగిరి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పాటిదార్
చదవండి: రంజీల్లో ఆడాల్సిందే.... ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment